
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక నియామకం చేపట్టింది. తమిళనాడు మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్(Sridharan Sriram)ను తమ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాగా ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా సీఎస్‌కేకు పేరుంది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టుకు.. గతేడాది కొత్త కెప్టెన్ వచ్చాడు. మహారాష్ట్ర ఆటగాడు, టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ధోని వారసుడిగా పగ్గాలు చేపట్టాడు.
గతేడాది ఐదో స్థానంలో
అయితే, ఐపీఎల్-2024లో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ ఏడు గెలిచిన రుతుసేన నెట్‌రన్ రేటు తక్కువగా ఉన్న కారణంగా ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. పదిజట్లున్న ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు జట్టును ప్రక్షాళన చేసిన సీఎస్‌కే యాజమాన్యం సరికొత్త వ్యూహాలతో ఈ సీజన్‌లో ముందుకు రానుంది.
ఈ క్రమంలో తమ సహాయక సిబ్బందిలోకి శ్రీధరన్ శ్రీరామ్‌ను కూడా చేర్చుకోవడం గమనార్హం. కాగా సీఎస్‌కే హెడ్‌కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉండగా.. ఎరిక్ సిమ్మన్స్ బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇప్పుడు అతడికి అసిస్టెంట్‌గా శ్రీధరన్ శ్రీరామ్ కూడా సీఎస్‌కే కోచింగ్ స్టాఫ్‌లో చేరాడు.
కాగా తమిళనాడుకు చెందిన శ్రీధరన్ ఎనిమిది వన్డేలు ఆడి 81 పరుగులు చేయడంతో పాటు.. తొమ్మిది వికెట్లు కూడా తీశాడు. ఆటగాడిగా తన ప్రయాణం ముగిసిన తర్వాత ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచింగ్ విభాగంలో పనిచేశాడు. రెండేళ్ల పాటు కంగారూ టీమ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. బంగ్లాదేశ్ జట్టుకు కూడా సేవలు అందించాడు.
ఇక గతేడాది లక్నో సూపర్ జెయింట్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన శ్రీధరన్ తాజాగా సీఎస్‌కేలో చేరాడు. ఈ విషయం గురించి.. ‘‘మా అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్‌కు స్వాగతం. చెపాక్ స్టేడియం నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లకు కోచ్‌గా ఎదిగిన ఆయన ప్రయాణం మాకు గర్వకారణం’’ అని సీఎస్‌కే తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
రుతురాజ్ (రూ. 18 కోట్లు)
జడేజా (రూ. 18 కోట్లు)
పతిరణ (రూ. 13 కోట్లు)
శివమ్ దూబే (రూ. 12 కోట్లు)
ధోని (రూ. 4 కోట్లు)
నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు)
ఆర్. అశి్వన్ (రూ. 9.75 కోట్లు)
కాన్వే (రూ. 6.25 కోట్లు)
ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు)
రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు)
రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు)
అన్షుల్ కంబోజ్ (రూ.3.40 కోట్లు)
స్యామ్ కరన్ (రూ. 2.40 కోట్లు)
గుర్జప్‌నీత్ సింగ్ (రూ. 2.20 కోట్లు)
నాథన్ ఎలిస్ (రూ. 2 కోట్లు)
దీపక్ హుడా (రూ.1.70 కోట్లు)
జేమీ ఓవర్టన్ (రూ.1.50 కోట్లు)
విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు)
వంశ్ బేడీ (రూ. 55 లక్షలు)
ముకేశ్ చౌదరీ (రూ. 30 లక్షలు)
షేక్ రషీద్ (రూ. 30 లక్షలు)
అండ్రి సిద్ధార్థ్ (రూ. 30 లక్షలు)
కమలేశ్ నాగర్‌కోటి (రూ. 30 లక్షలు)
రామకృష్ణ ఘోష్ (రూ. 30 లక్షలు)
శ్రేయస్ గోపాల్ (రూ.30 లక్షలు).
చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
Comments
Please login to add a commentAdd a comment