Assistant Coach
-
IPL 2025: కేకేఆర్‌తో జతకట్టిన అభిషేక్ నాయర్
టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో జతకట్టాడు. నాయర్ టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక కాకముందు (గత సీజన్లో) కేకేఆర్ సపోర్టింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా పదవి ఊడటం ఖాయమని తెలిసాక నాయర్ మళ్లీ కేకేఆర్‌లో చేరిపోయాడు. నాయర్‌ను తిరిగి తమ సహాయక బృందంలోకి ఆహ్వానిస్తున్నామని కేకేఆర్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.నాయర్ గతేడాది జులైలో టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అతని పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. బీసీసీఐ నాయర్ కాంట్రాక్ట్ పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. దీంతో నాయర్ తన పదవీకాలం మరో మూడు నెలలు ఉండగానే టీమిండియా పదవికి గుడ్‌బై చెప్పి తన పాత జట్టు కేకేఆర్‌లో చేరిపోయాడు. నాయర్‌తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ కాంట్రాక్ట్‌లను కూడా పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.కాగా, గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో అభిషేక్ నాయర్ కీలకపాత్ర పోషించాడు. అయితే కేకేఆర్ పరిస్థితి ఈ సీజన్లో భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. నాయర్ చేరికతో కేకేఆర్ ఆటతీరులో మార్పు వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ టేబుల్ టాపర్లుగా కొనసాగుతున్నాయి. -
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఫోర్ టైమ్ వరల్డ్‌కప్ విన్నర్
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కొత్త అసిస్టెంట్ కోచ్‌ను (Assistant Coach) నియమించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన 51 ఏళ్ల మథ్యూ మాట్ (Matthew Mott) డీసీ కొత్త అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటరైన మాట్.. వివిధ జాతీయ జట్ల హెడ్ కోచ్‌గా పలు వరల్డ్‌కప్‌లు గెలిచాడు. 2022 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లండ్ పురుషుల జట్టుకు మాట్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియా మహిళల జట్టు హెడ్ కోచ్‌గా మాట్కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. మాట్ 2015-2022 మధ్యలో ఆసీస్ మహిళా టీమ్‌కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఈ మధ్యకాలంలో ఆసీస్ ఓసారి వన్డే వరల్డ్‌కప్.. రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. దీని తర్వాత మాట్ ఇంగ్లండ్ పురుషుల జట్టు వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.మాట్ ఇంగ్లండ్‌ను 2022 టీ20 వరల్డ్‌కప్ గెలిపించినప్పటికీ.. అతని హయాంలో ఇంగ్లండ్ 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్‌ను నిలబెట్టుకోలేకపోయింది. ఫలితంగా మాట్ తన పదవీకాలం మధ్యలోనే ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన అనంతరం మాట్ సిడ్నీ సిక్సర్స్ అసిస్టెంట్ కోచ్‌గా మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.తదుపరి ఐపీఎల్ సీజన్లో మాట్ ఢిల్లీ క్యాపిటల్స్ నూతన హెడ్ కోచ్ హేమంగ్ బదానీతో కలిసి పని చేస్తాడు. డీసీ యాజమాన్యం బౌలింగ్ కోచ్‌గా వరల్డ్‌కప్ విన్నర్, భారత మాజీ పేసర్ అయిన మునాఫ్ పటేల్‌ను ఇటీవలే నియమించుకున్న విషయం తెలిసిందే. భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావు డీసీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తాడు.కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్రారంభం నుంచి వేర్వేరు పేర్లతో లీగ్‌లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. తొలి రెండు సీజన్లలో సెమీస్‌కు చేరిన ఈ జట్టు.. 2020 సీజన్లో అత్యుత్తమంగా ఫైనల్స్‌కు చేరింది. ఆ సీజన్ ఫైనల్లో డీసీ ముంబై చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత మూడు సీజన్లలో ఢిల్లీ పేలవ ప్రదర్శన కనబర్చింది. మూడు సీజన్లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. తదుపరి సీజన్ కోసం ఢిల్లీ జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. పాత ఆటగాళ్లను దాదాపుగా వదిలించుకుని కొత్త ఆటగాళ్లను తీసుకుంది. మెగా వేలానికి ముందు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌ను రీటైన్ చేసుకుంది. కెప్టెన్ రిషబ్ పంత్ సహా ఆసీస్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లను వదిలేసింది. మెగా వేలంలో కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, టి నటరాజన్, డుప్లెసిస్ లాంటి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలంలో డీసీ యాజమాన్యం అత్యధికంగా 14 కోట్లు వెచ్చింది కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకుంది. తదుపరి సీజన్ కోసం డీసీ మేనేజ్మెంట్ తమ కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు.2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, హ్యారీ బ్రూక్, అషుతోశ్ శర్మ, డుప్లెసిస్, సమీర్ రిజ్వి, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనోవన్ ఫెరియెరా, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, మాధవ్ తివారి, మన్వంత్ కుమార్, త్రిపురుణ విజయ్, అజయ్ మండల్, మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్ -
IPL 2025: సీఎస్కే ప్రకటన.. అసిస్టెంట్ కోచ్‌గా మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక నియామకం చేపట్టింది. తమిళనాడు మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్(Sridharan Sriram)ను తమ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా సీఎస్కేకు పేరుంది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టుకు.. గతేడాది కొత్త కెప్టెన్ వచ్చాడు. మహారాష్ట్ర ఆటగాడు, టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ధోని వారసుడిగా పగ్గాలు చేపట్టాడు.గతేడాది ఐదో స్థానంలోఅయితే, ఐపీఎల్-2024లో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ ఏడు గెలిచిన రుతుసేన నెట్రన్ రేటు తక్కువగా ఉన్న కారణంగా ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. పదిజట్లున్న ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు జట్టును ప్రక్షాళన చేసిన సీఎస్కే యాజమాన్యం సరికొత్త వ్యూహాలతో ఈ సీజన్లో ముందుకు రానుంది.ఈ క్రమంలో తమ సహాయక సిబ్బందిలోకి శ్రీధరన్ శ్రీరామ్‌ను కూడా చేర్చుకోవడం గమనార్హం. కాగా సీఎస్కే హెడ్‌కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉండగా.. ఎరిక్ సిమ్మన్స్ బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇప్పుడు అతడికి అసిస్టెంట్‌గా శ్రీధరన్ శ్రీరామ్ కూడా సీఎస్కే కోచింగ్ స్టాఫ్‌లో చేరాడు.కాగా తమిళనాడుకు చెందిన శ్రీధరన్ ఎనిమిది వన్డేలు ఆడి 81 పరుగులు చేయడంతో పాటు.. తొమ్మిది వికెట్లు కూడా తీశాడు. ఆటగాడిగా తన ప్రయాణం ముగిసిన తర్వాత ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచింగ్ విభాగంలో పనిచేశాడు. రెండేళ్ల పాటు కంగారూ టీమ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. బంగ్లాదేశ్ జట్టుకు కూడా సేవలు అందించాడు.ఇక గతేడాది లక్నో సూపర్ జెయింట్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన శ్రీధరన్ తాజాగా సీఎస్కేలో చేరాడు. ఈ విషయం గురించి.. ‘‘మా అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్‌కు స్వాగతం. చెపాక్ స్టేడియం నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లకు కోచ్‌గా ఎదిగిన ఆయన ప్రయాణం మాకు గర్వకారణం’’ అని సీఎస్కే తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టురుతురాజ్ (రూ. 18 కోట్లు) జడేజా (రూ. 18 కోట్లు) పతిరణ (రూ. 13 కోట్లు) శివమ్ దూబే (రూ. 12 కోట్లు) ధోని (రూ. 4 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) ఆర్. అశి్వన్ (రూ. 9.75 కోట్లు) కాన్వే (రూ. 6.25 కోట్లు) ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు) రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) అన్షుల్ కంబోజ్ (రూ.3.40 కోట్లు) స్యామ్ కరన్ (రూ. 2.40 కోట్లు) గుర్జప్నీత్ సింగ్ (రూ. 2.20 కోట్లు) నాథన్ ఎలిస్ (రూ. 2 కోట్లు) దీపక్ హుడా (రూ.1.70 కోట్లు) జేమీ ఓవర్టన్ (రూ.1.50 కోట్లు) విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు) వంశ్ బేడీ (రూ. 55 లక్షలు) ముకేశ్ చౌదరీ (రూ. 30 లక్షలు) షేక్ రషీద్ (రూ. 30 లక్షలు) అండ్రి సిద్ధార్థ్ (రూ. 30 లక్షలు) కమలేశ్ నాగర్కోటి (రూ. 30 లక్షలు) రామకృష్ణ ఘోష్ (రూ. 30 లక్షలు) శ్రేయస్ గోపాల్ (రూ.30 లక్షలు).చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్ -
ఆఫ్ఘనిస్తాన్ అసిస్టెంట్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీథర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. శ్రీథర్ త్వరలో జరుగబోయే న్యూజిలాండ్, సౌతాఫ్రికా సిరీస్‌లతో ఆఫ్ఘనిస్తాన్ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుతో శ్రీథర్ ఒప్పందం దీర్ఘకాలిక ఒప్పందంగా ఉండే అవకాశం ఉంది.శ్రీథర్‌కు కోచింగ్ విభాగంలో అపార అనుభవం ఉంది. అతను 2021 టీ20 వరల్డ్‌కప్ వరకు రవిశాస్త్రి అండర్లో టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాడు. 2008-14 వరకు అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ ఫీల్డింగ్ మరియు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. అలాగే 2014 ఇండియా అండర్-19 వరల్డ్‌కప్ స్క్వాడ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. శ్రీథర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి కూడా పని చేశాడు. స్వతహాగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అయిన శ్రీథర్ ఆఫ్ఘన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. శ్రీథర్.. ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్ జోనాథన్ ట్రాట్ అండర్లో పని చేయనున్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆఫ్ఘనిస్తాన్.. న్యూజిలాండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు భారత్‌లోని నోయిడా వేదిక కానుంది. ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఆ జట్టుకు నోయిడాను హోం గ్రౌండ్‌గా ఆఫర్ చేసింది. సెప్టెంబర్ 18 నుంచి ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ షార్జా వేదికగా జరుగనుంది. -
శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత జట్టుతో చేరిన గంభీర్ ఫ్రెండ్
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు అన్ని విధాల సన్నద్దమైంది. జూలై 27న పల్లెకెలె వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి టీ20కు ముందు భారత అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోస్చేట్ జట్టుతో చేరాడు.టీ20 వరల్డ్‌కప్-2024తో కోచింగ్ స్టాప్ రాహుల్ ద్రవిడ్ అండ్ కో పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఒక్క ఫీల్డింగ్ కోచ్ టి. దిలిప్ మినహా మిగితా ఎవరూ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ పొడగించలేదు. ఈక్రమంలో భారత జట్టు హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపికయ్యాడు. అయితే సపోర్ట్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేఛ్చ ఇచ్చింది. దీంతో ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నెదర్లాండ్స్ క్రికెట్ దిగ్గజం ర్యాన్ డోస్చేట్, భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్లను అసిస్టెంట్ కోచ్‌లగా గంభీర్ సెలక్ట్ చేశాడు.కాగా ఈ త్రయం ఆధ్వర్యంలోనే ఐపీఎల్-2024 విజేతగా కేకేఆర్ నిలిచింది. ఇక ఈ టీ20 సిరీస్‌తో భారత హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్, కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ప్రస్థానం మొదలు కానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్‌గా మాజీ క్రికెటర్..
న్యూజిలాండ్ మహిళ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ క్రెయిగ్ మెక్‌మిలన్ ఎంపికయ్యాడు. నెలాఖరులో న్యూజిలాండ్ మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.ఈ టూర్‌తో న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్‌గా మెక్‌మిలన్ ప్రయాణం ప్రారంభం కానుంది. మెక్‌మిలన్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. 2014 నుంచి 2019 వరకు న్యూజిలాండ్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా పని చేశాడు. అతడు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే కివీస్ వరుసగా రెండు సార్లు వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. అదే విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా కూడా మెక్‌మిలన్ పనిచేశాడు. ఇక న్యూజిలాండ్ తరపున 1997 నుంచి 2007 వరకు మెక్‌మిలన్ 260 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.ఇంగ్లండ్ పర్యటనకు న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, లారెన్ డౌన్ (వికెట్ కీపర్), ఇజ్జీ గేజ్, మాడీ గ్రీన్, మైకేలా గ్రేగ్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్ , జెస్ కెర్, మెలీ కెర్, మోలీ పెన్ఫోల్డ్ , జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహుహు. -
జింబాబ్వే క్రికెట్లో తీవ్ర విషాదం.. దంపతుల హఠాన్మరణం
Sinikiwe Mpofu: జింబాబ్వే మహిళా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ సినికివె ఎంపోఫు హఠాన్మరణం చెందింది. 37 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. తన నివాసంలో శనివారం కుప్పకూలిన సినికివె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. జింబాబ్వే ఫీల్డింగ్ కోచ్ కూడా మృతి సినికివె భర్త, జింబాబ్వే క్రికెట్ పురుషుల జట్టు ఫీల్డింగ్ కోచ్ షెఫర్డ్ మకునురా మరణించిన రోజుల వ్యవధిలోనే ఆమె కూడా శాశ్వతంగా ఈ లోకాన్ని వీడటం విషాదకరం. షెఫర్డ్ డిసెంబరు 15న చనిపోయాడు. కాగా ఇద్దరు కీలక వ్యక్తులు ఇలా అకస్మాత్తుగా దూరం కావడంతో జింబాబ్వే క్రికెట్ శోకసంద్రంలో మునిగిపోయింది. PC: Zimbabwe Cricket కఠిన శ్రమకోర్చి కెరీర్లో మంచి స్థాయికి చేరుకున్న ఈ సినికివెను చావు తమ నుంచి దూరం చేసిందంటూ జింబాబ్వే మేనేజింగ్ డైరెక్టర్ గివ్మోర్ మకోని విచారం వ్యక్తం చేశారు. జింబాబ్వే మహిళా క్రికెట్లో ఆదర్శనీయమైన వ్యక్తిగా ఎంతో మంది ఆదరాభిమానాలు చూరగొన్న ఆమె ఇలా అర్ధంతరంగా వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని సంతాపం వ్యక్తం చేశారు. PC: Zimbabwe Cricket రోజుల వ్యవధిలో దంపతులు హఠాన్మరణం సినికివె, షెఫర్డ్ దంపతుల హఠాన్మరణం వారి కుటుంబాలతో పాటు తమకు కూడా తీరని లోటు అని భావోద్వేగానికి లోనయ్యారు. వీరి పిల్లలు, తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జాతీయ జట్టులో కీలకమైన ఇద్దరు సభ్యులను కోల్పోయామని.. ఇంతటి విషాదం మరెక్కడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సినికివె 2006లో జింబాబ్వే తరఫున క్రికెట్ ఆడిన తొలి మహిళా జట్టులో సభ్యురాలు. ప్లేయర్‌గా కెరీర్ ముగిసిన తర్వాత ఆమె కోచింగ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. మహిళా జట్టు అసిస్టెంట్ కోచ్ స్థాయికి ఎదిగింది. మౌంటనీర్స్ వుమెన్‌ను ఫిఫ్టీ50 చాలెంజ్‌లో విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది. చదవండి: Suryakumar Yadav: సూర్య కెరీర్‌పై గంభీర్ ట్వీట్! నీకు అతడు మాత్రమే కనిపిస్తున్నాడా? ఫ్యాన్స్ ఫైర్ Suryakumar Yadav: సూర్య ఇండియన్ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్లో ఉంటేనా: పాక్ మాజీ కెప్టెన్ -
ఆస్ట్రేలియా కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి, ఆసీస్ మాజీ దేశీవాళీ ఆటగాడు ఆండ్రీ బోరోవెక్లను తమ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌లుగా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. వీరిద్దరూ హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో కలిసి పనిచేయనున్నారు. కాగా గతంలో కోచ్‌గా పనిచేసిన అనుభవం వెట్టోరికి ఉంది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హెడ్ కోచ్‌గా వెట్టోరి బాధ్యతలు నిర్వహించాడు. అదే విధంగా 2019 నుంచి 2021 వరకు బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వెట్టోరి పని చేశాడు. ఇక వెట్టోరి తన అంతర్జాతీయ కెరీర్లో 705 వికెట్లు సాధించాడు. వాటిలో 365 టెస్టు, 305 వన్డే, 38 టీ20 వికెట్లు ఉన్నాయి. చదవండి: Ravichandran Ashwin: 'ప్రయోగాలు ఆపేసిన రోజు క్రికెట్‌పై ఫ్యాషన్ చచ్చిపోతుంది' 2️⃣ new assistant coaches for our men's national team! Welcome Andre & Daniel 🤝 pic.twitter.com/YLrcQj9LRE — Cricket Australia (@CricketAus) May 24, 2022 -
పాంటింగ్ సిఫార్సు.. కీలక పాత్రలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఐపీఎల్లో మరోసారి మెరవనున్నాడు. ఈసారి ఆటగాడిగా కాకుండా అసిస్టెంట్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న వాట్సన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించే అవకాశం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ స్వయంగా వాట్సన్‌ను సిఫార్సు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సదరు ఫ్రాంచైజీ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించనుంది. కాగా ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్‌గా తిరుగులేని గుర్తింపు పొందిన షేన్ వాట్సన్ ఐపీఎల్‌లోనూ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2008లో రాజస్తాన్ రాయల్స్ మొయిడెన్ ఐపీఎల్ టైటిల్‌ను గెలవడంలో వాట్సన్ కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత సీఎస్కేకు వెళ్లిన వాట్సన్ 2018లో ఐపీఎల్ ఫైనల్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మూడో ఐపీఎల్ టైటిల్ అందించాడు. వయసు మీద పడడంతో 2020 సీజన్ నుంచి వాట్సన్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. తాజాగా అసిస్టెంట్ కోచ్ పాత్రలో వాట్సన్ ఐపీఎల్లో మరోసారి కనిపించనుండడం ఆసక్తిగా మారింది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను మార్చి 26 నుంచి ప్రారంభించేందుకు బీసీసీఐ కసరత్తులు జరుపుతుంది. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంచ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఢిల్లీ ఫ్రాంచైజీ అగార్కర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. చదవండి: IPL 2022: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం! PSL 2022: మూడు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. ఫలితం సూపర్ ఓవర్ -
మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రేకు కీలక పదవి
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే ఎంపికయ్యాడు. రాబోయే రెండు ఐపీఎల్ సీజన్లకు అతను సహాయ కోచ్‌గా కొనసాగనున్నట్లు ఢిల్లీ ఫ్రాంఛైజీ బుధవారం ప్రకటించింది. 2014-2019 మధ్య ఫ్రాంఛైజీ టాలెంట్ హెడ్‌గా పనిచేసిన 52ఏండ్ల ఆమ్రే..రికీ పాంటింగ్ నేతృత్వంలోని ప్రస్తుత కోచింగ్ సిబ్బందిలో చేరనున్నాడు. టీమ్ఇండియా తరఫున ఆమ్రే 11 టెస్టులు, 37 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్లో ఆటగాడిగా గొప్ప రాణించిన ఆమ్రే కోచింగ్ అనుభవం కూడా ఉంది. ముంబై మూడు రంజీ ట్రోఫీ టైటిళ్లు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.(చదవండి: ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు) -
సహాయ కోచ్‌గా...
సిడ్నీ: దిగ్గజ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను ప్రపంచ కప్‌నకు జట్టు సహాయ కోచ్‌గా నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు ప్రపంచ కప్‌లలో ప్రాతినిధ్యం, మూడుసార్లు విజేతగా నిలిచిన జట్టు సభ్యుడిగా, అందులోనూ రెండుసార్లు సారథిగా వ్యవహరించిన విశేష అనుభవం ఉన్న పాంటింగ్... ఆసీస్ బ్యాటింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు డారెన్ లీమన్ ప్రధాన కోచ్‌గా, ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ గ్రేమ్ హిక్ బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు. -
‘లయన్స్ ’అసిస్టెంట్ కోచ్‌గా కైఫ్
రాజ్‌కోట్: ఐపీఎల్ జట్టు గుజరాత్ లయ న్స్ అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఎంపికయ్యాడు. లయన్స్ యాజమాన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. గుజరాత్ హెడ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్‌తో కలిసి కైఫ్ పని చేస్తాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 10 వేలకు పైగా పరుగులు సాధించిన 36 ఏళ్ల కైఫ్ తాజా రంజీ సీజన్ లో ఛత్తీస్‌గఢ్ జట్టు తరఫున ప్లేయర్ కం మెంటార్‌గా బరిలోకి దిగాడు. భారత్‌కు 13 టెస్టుల్లో 125 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడు ఐపీఎల్లో రాజస్థాన్, పంజాబ్, బెంగళూరు జట్ల తరఫున ఆడాడు. -
కొత్త బాధ్యతలో రికీ పాంటింగ్...
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కొత్త బాధ్యతలో కనిపించనున్నాడు. శ్రీలంకతో ఫిబ్రవరిలో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు పాంటింగ్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. జస్టిన్ లాంగర్ చీఫ్ కోచ్‌గా, జాసెన్ గిలెస్పీ మరో అసిస్టెంట్ కోచ్‌గా ఉంటారని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. గత ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు పాంటింగ్ చీఫ్ కోచ్‌గా ఉన్నాడు. -
చీఫ్ కోచ్‌గానే హావ్‌గుడ్
న్యూఢిల్లీ: గతంలో రెండేళ్ల పాటు భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా వ్యవహరించిన నీల్ హావ్‌గుడ్ ను ఈసారి అసిస్టెంట్ కోచ్‌గా తీసుకోనున్నట్టు హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన మరోసారి చీఫ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. గతేడాది నవంబర్లోనే ఆయన వ్యక్తిగత కారణాలతో ఈ పదవి నుంచి తప్పుకున్నారు. సాయ్ అధికారులతో హెచ్ఐ సుదీర్ఘంగా చర్చించిన అనంతరం హావ్గుడ్ను అసిస్టెంట్‌గా కాకుండా చీఫ్ కోచ్‌గానే నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆసీస్‌కు చెందిన హావ్‌గుడ్ హయాంలో జట్టు పురోగతి సాధించింది. 2013 జూనియర్ ప్రపంచకప్‌లో, ఇంచియాన్ ఆసియా గేమ్స్‌లో కాంస్యాలతో పాటు హాకీ వరల్డ్ లీగ్ రౌండ్ 2లో నెగ్గిం ది. కొత్త కోచ్ ఆధ్వర్యంలో మహిళల హాకీ జట్టు ఈనెల 18 నుంచి 30 వరకు అర్జెంటీనాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. కేరళ, చెన్నైయిన్ మ్యాచ్ డ్రా కొచ్చి: వరుసగా నాలుగు పరాజయాలతో డీలా పడిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ జట్టు చెన్నైయిన్ ఎఫ్‌సీతో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట చెన్నైయిన్ జట్టు తరఫున ఎలనో (34వ నిమిషంలో) పెనాల్టీ కిక్ ద్వారా గోల్ సాధించగా... 46వ నిమిషంలో దగ్నల్ గోల్‌తో కేరళ స్కోరును సమం చేసింది. అయితే కేరళకు లభించిన పెనాల్టీ విఫలం కావడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. నేడు (ఆదివారం) జరిగే మ్యాచ్‌లో ముంబై, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. -
కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా సైమన్ కటిచ్
కోల్‌కతా: ఐపీఎల్ తొమ్మిదో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ సైమన్ కటిచ్ పనిచేయనున్నారు. ఈ మేరకు కేకేఆర్ సీఈవో వెంకీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే కేకేఆర్ కోచ్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వస్ కలీస్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. అసిస్టెంట్ కోచ్‌గా కటిచ్ నియామకంపై కలీస్ మాట్లాడుతూ ' జట్టు మేనేజ్‌మెంట్‌లోకి కటిచ్ చేరుతుండడం ఆనందంగా ఉంది. అతనితో ఎన్నో మ్యాచ్‌లలో ప్రత్యర్థిగా ఆడాను, అతనికి ఆటపై గల అవగాహన అమోఘం. కటిచ్ అసిస్టెంట్ కోచ్‌గా ఉండడం 2016 ఐపీఎల్ టైటిల్‌ను కోల్‌కతా గెలుచుకోవడానికి సహాయపడుతుందని' అన్నారు. సైమన్ కటిచ్‌కు ఆస్ట్రేలియా ఓపెనర్‌గా మంచి పేరుంది. రిటైర్మెంట్కు ముందు బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టుకు కెప్టెన్‌గా ఆయన పనిచేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ లీగ్ క్లబ్‌కు ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న కటిచ్ త్వరలోనే కోల్‌కతా జట్టుతో చేరనున్నారు.