
న్యూజిలాండ్ మహిళ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ క్రెయిగ్ మెక్‌మిలన్ ఎంపికయ్యాడు. నెలాఖరులో న్యూజిలాండ్ మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఈ టూర్‌తో న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్‌గా మెక్‌మిలన్ ప్రయాణం ప్రారంభం కానుంది. మెక్‌మిలన్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. 2014 నుంచి 2019 వరకు న్యూజిలాండ్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా పని చేశాడు.
అతడు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే కివీస్ వరుసగా రెండు సార్లు వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. అదే విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా కూడా మెక్‌మిలన్ పనిచేశాడు. ఇక న్యూజిలాండ్ తరపున 1997 నుంచి 2007 వరకు మెక్‌మిలన్ 260 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
ఇంగ్లండ్ పర్యటనకు న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, లారెన్ డౌన్ (వికెట్ కీపర్), ఇజ్జీ గేజ్, మాడీ గ్రీన్, మైకేలా గ్రేగ్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్ , జెస్ కెర్, మెలీ కెర్, మోలీ పెన్‌ఫోల్డ్ , జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహుహు.
Comments
Please login to add a commentAdd a comment