న్యూజిలాండ్ పేస్ బౌలర్ డగ్లస్ బ్రేస్‌వెల్‌పై ఒక నెల నిషేధం పడింది. అతను మాదకద్రవ్యాలు తీసుకోవడంతో న్యూజిలాండ్ స్పోర్ట్ ఇంటిగ్రిటీ కమిషన్ (ఎన్‌ఎస్‌ఐసీ) వేటు వేసింది. ఈ ఏడాది అతను కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. 2011లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన బ్రేస్‌వెల్ జింబాబ్వేతో తన తొలి మ్యాచ్‌లో 6/40 బౌలింగ్ గణాంకాలతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది జనవరి 13న కివీస్ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా వెల్లింగ్టన్ జట్టుతో జరిగిన పోరులో సెంట్రల్ డిస్ట్రిక్స్ జట్టుకు ఆడిన బ్రేస్‌వెల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు.
మ్యాచ్ అనంతరం అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా పాజిటివ్ అని తేలడంతో ఎన్‌ఎస్‌ఐసీ అతన్ని ముందుగా మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తర్వాత ఒక నెలకు పరిమితం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి నెలరోజులపాటు అతనిపై నిషేధం విధించారు.
34 ఏళ్ల బ్రేస్‌వెల్ న్యూజిలాండ్ తరఫున 28 టెస్టులు ఆడి 74 వికెట్లు, 21 వన్డేలు ఆడి 26 వికెట్లు, 20 టి20 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. ‘తర్వాతి తరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాల్సిన క్రికెటర్లు ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్‌లో బాధ్యతతో ప్రవర్తించాలి. ఇలాంటి నిషేధిత ఉ్రత్పేరకాలతో న్యూజిలాండ్ బోర్డు (ఎన్‌జడ్‌సీ) ప్రతిష్టను మసకబార్చవద్దు’ అని ఎన్‌జడ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ తెలిపారు.
చదవండి: కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment