 
							అమెరికా హైఫ్రొఫైల్ జంటల్లో.. ఒబామా దంపతులకు ప్రస్తుతానికైతే ప్రత్యేకమైన స్థానం ఉంది
 
							అమెరికా అధ్యక్షుడిగా ఒబామా, ఫస్ట్ లేడీగా మిషెల్లీ ఎదిగిన తీరు.. ఇప్పుడు వాళ్లు ఆ స్థానాల్లో లేకపోయినా ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే ఉంటుంది
 
							1989లో ఓ లా కంపెనీలో ఈ ఇద్దరూ తొలిసారిగా కలుసుకున్నారు. మూడేళ్లకు ప్రేమను బయటపెట్టుకుని.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు
 
							అప్పటి నుంచి ఇద్దరూ జనంలోకి వచ్చినప్పుడల్లా ఎంతో హుందాగా నడుచుకునేవారు. అయితే..
 
							వ్యక్తిగతంగా ఈ ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలు. ఎప్పుడూ పోట్లాడుకునే ఉంటారట. ఒబామా మీద కోపం వచ్చినప్పుడల్లా కిటీకిల్లోంచి బయటకు తోసేసి చంపేయాలని మిషెల్లీకి అనిపిస్తుందట
 
							కానీ, మూడు దశాబ్దాల బంధంలో ఏనాడూ ఆమెను తానేమీ అనలేదని ఒబామా నవ్వుతూ చెబుతుంటారు. అందుకు ఆమె మీద ఉన్న అంతులేని ప్రేమే కారణమట
 
							ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు మలియా(23),సాషా(23)
 
							అమెరికా హైప్రొఫైల్ జంటల్లో.. వన్ ఆఫ్ ది ‘ఆదర్శ జంట’గా వీళ్లకు పేరుంది
 
							వీళ్ల వ్యక్తిగత జీవితంపై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ చర్చ నడిచింది
 
							విడాకుల వైపు అడుగులేస్తున్నారంటూ కథనాలు రావడం షాక్‌కు గురి చేసింది
 
							ఈ లోపు సందర్భం రావడంతో ఈ రూమర్స్‌కు తనదైన శైలిలో స్పందించారు ఒరాక్ ఒబామా.
 
							జనవరి 17వ తేదీన మిషెల్లీ(Michelle) పుట్టినరోజు. నా ప్రేమ జీవితానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రొమాంటిక్ సందేశంతో శుభాకాంక్షలు తెలియజేశారాయన
 
							దానికి అంతే స్పీడ్‌గా లవ్ యూ హనీ.. అంటూ మిషెల్లీ ఒబామా బదులిచ్చారు. తద్వారా విడాకుల రూమర్స్‌కు ఒకేసారి ఇద్దరూ చెక్ పెట్టారన్నమాట
 
							కచ్చితంగా హాజరు కావాల్సిన కార్యక్రమాలకు కూడా ఈ ఇద్దరూ జంటగా కనిపించకపోవడమే విడాకులు రూమర్లకు కారణమైందంతే!.
 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
