michelle obama
-
ట్రంప్ గెలుపు... మహిళలకు ముప్పు: మిషెల్
కలమజూ (మిషిగన్): అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే అమెరికా మహిళల జీవితాలు ప్రమాదంలో పడతాయని మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా హెచ్చరించారు. దాన్ని నివారించాలంటే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం మిషిగన్‌లో డెమొక్రాట్ల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోకపోతే మీ భార్య, మీ కూతురు, మీ తల్లి... ఇలా మహిళలుగా మేమంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని ఆమె హెచ్చరించారు. డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ తర్వాత పార్టీ ప్రచారంలో మిషెల్ పాల్గొనడం ఇదే తొలిసారి. హారిస్‌కు మద్దతుగా ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఆమె ప్రజల ప్రయోజనాలకోసమే పని చేస్తారన్నారు. ర్యాలీ అనంతరం మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్తో కలిసి హారిస్ ట్రాక్ హౌజ్ బార్ అండ్ గ్రిల్‌కు వెళ్లారు. స్థానికంగా తయారుచేసిన బీర్ తాగారు. స్థానికులతో పిచ్చాపాటీ మాట్లాడారు. యువతుల టేబుల్ వద్దకు రాగానే వారిలో ఒకరు హారిస్‌తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మిషిగన్‌లో ఇప్పటికే 20 శాతం మంది ముందస్తుగా ఓటేశారు. మహిళలకు అవకాశాలు: బైడెన్ హారిస్ గెలిస్తే అన్ని రంగాల్లోనూ మహిళలకు గతంలో కంటే ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పిట్స్‌బర్గ్‌లోని లేబర్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ నార్త్ అమెరికాలో ఆయన మాట్లాడారు. కారి్మకులను ట్రంప బలహీనపరిచారని మండిపడ్డారు. కారి్మక ప్రయోజనాల కోసం ట్రంప్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: కమలాహారిస్‌కు గాయని బియాన్స్ మద్దతు -
Michelle Obama: అత్యంత అర్హురాలు హారిసే
షికాగో: ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు నేతృత్వం వహించేందుకు అత్యంత అర్హురాలు, సమర్థురాలు కమలా హారిసేనని దేశ మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా అభిప్రాయపడ్డారు. ‘‘చాలామంది సగటు అమెరికన్ల మాదిరిగానే కమలా హారిస్‌ది కూడా మధ్యతరగతి నేపథ్యం. అక్కడినుంచి ప్రతి దశలోనూ నిరంతరం కష్టించి ఎదిగారు. తనను తాను మలచుకుంటూ ఉపాధ్యక్షురాలి స్థాయికి చేరుకున్నారు. అందుకే ఆమె కథ మీ కథ. నా కథ. మెరుగైన జీవితం కోసం కలలుగంటున్న అమెరికన్లందరి కథ!’’ అంటూ కొనియాడారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో మంగళవారం ఆమె ఆద్యంతం స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. హారిస్ రాకతో అమెరికాకు మెరుగైన భవితపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికన్లందరికీ ఎదుగుదలకు అవకాశాలు దక్కేలా కమల నిరంతరం కృషి చేశారు. దేశం పట్ల తన నిబద్ధతను అలా చాటుకున్నారు. అంతే తప్ప ట్రంప్ మాదిరిగా జాతులపై విద్వేషం చిమ్మడం ద్వారానో, వ్యక్తులపై బురదజల్లడం ద్వారానో కాదు’’ అని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యరి్థపై మిషెల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రంప్ ప్రపంచం పట్ల విశాల దృష్టి లేని కురచ వ్యక్తి. బాగా చదువుకున్న, నిరంతరం కష్టించే స్వభావమున్న నల్లజాతీయులను చూస్తే ఆయనకు భయం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘నన్ను, నా భర్త (మాజీ అధ్యక్షుడు) ఒరాక్ ఒబామాను ట్రంప్ ఎప్పుడూ ఆయన రాజకీయ మనుగడకే పెను ముప్పుగానే చూశారు. మేం అత్యంత విజయవంతమైన నల్లజాతి వ్యక్తులం కావడమే అందుకు కారణం’’ అని చెప్పుకొచ్చారు. కనుక హారిస్‌పై కూడా ట్రంప్ జాతి విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేయడం ఖాయమన్నారు. వాటన్నింటినీ అమెరికన్లు తిప్పికొడతారని, హారిస్‌ను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని చరిత్ర సృష్టిస్తారని జోస్యం చెప్పారు. అయితే, ‘‘ఈసారి అధ్యక్ష ఎన్నిక అత్యంత హోరాహోరీగా సాగడం ఖాయం. చాలా రాష్ట్రాల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారు కావచ్చు. అందుకే భారీ సంఖ్యలో తరలిరండి. పార్టీ అభిమానాలను, రాగద్వేషాలను పక్కన పెట్టి కేవలం మీ మనస్సాక్షి ప్రకారం నడచుకోండి. అమెరికన్లు ప్రాణప్రదంగా భావించే స్వేచ్ఛను, మానవత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టే హారిస్‌కే ఓటేయండి’’ అని అమెరికన్లకు పిలుపునిచ్చారు. ట్రంప్ రూపంలో మరో నాలుగేళ్ల అస్తవ్యస్త పాలనను నెత్తిన రుద్దుకునేందుకు అమెరికన్లు సిద్ధంగా లేరని, హారిస్‌ను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని కొత్త చరిత్ర సృష్టించనున్నారని బరాక్ ఒబామా అన్నారు. నల్లవాళ్లంటే ట్రంప్‌కు చులకన నల్లవాళ్లంటే ట్రంప్‌కు బాగా చిన్నచూపంటూ మిషెల్ మండిపడ్డారు. అసహ్యకరమైన స్త్రీ విద్వేష, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం ఆయన నైజమన్నారు. ‘‘అందుకే ఆయన అమెరికా అధ్యక్షునిగా ఉన్న నాలుగేళ్ల కాలంలో నల్లజాతీయులంటే అందరికీ భయం కలిగించేందుకు ఎంతగానో ప్రయతి్నంచారు. నల్లజాతీయులు చేసే ఉద్యోగాలను బ్లాక్ జాబ్స్ అంటూ చులకనగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ అర్రులుచాస్తున్న అమెరికా అధ్యక్ష పదవి కూడా బ్లాక్ జాబేనని ఆయనకు ఎవరు చెప్పాలి!’’ అంటూ ఎద్దేవా చేశారు. అమెరికా చరిత్రలో తొలి నల్లజాతి అధ్యక్షునిగా బరాక్ ఒబామా చరిత్ర సృష్టించడం తెలిసిందే.మా తల్లులు నేరి్పందదే ‘‘హారిస్ తల్లి, నా తల్లి సప్త సముద్రాలకు చెరోవైపున పుట్టి ఉండొచ్చు. కానీ వాళ్లు నిత్యం విశ్వసించిందీ, మాకు నిరంతరం నేరి్పంది ఒక్కటే. వ్యవస్థను విమర్శించే బదులు దాన్ని సరిచేసేందుకు మన వంతుగా శక్తివంచన లేకుండా కృషి చేయాలని’’ అని మిషెల్ అన్నారు. మిషెల్ ప్రసంగానికి డెమొక్రాట్ ప్రతినిధులంతా మంత్రముగ్ధులయ్యారు. ఆమె మాట్లాడటం ముగించిన చాలాసేపటిదాకా చప్పట్లతో అభినందించారు.హారిస్, నేను అలా కలిశాం: డగ్లస్ అమెరికన్లందరూ గరి్వంచేంత గొప్ప ప్రెసిడెంట్‌గా హారిస్ చరిత్రలో నిలిచిపోతారని ఆమె భర్త డగ్లస్ ఎమోఫ్ అభిప్రాయపడ్డారు. తనను తాను అమెరికా చరిత్రలో తొలి ‘సెకండ్ జంటిల్మన్ (ఉపాధ్యక్షురాలి భర్త)’గా సభకు పరిచయం చేసుకుని ఆకట్టుకున్నారు! 2013లో ఒక క్లయింట్ మీటింగ్ సందర్భంగా కమలతో తాను బ్లైండ్ డేట్‌కు వెళ్లడం, అది ప్రేమగా మారి, పెళ్లిగా పరిణమించిన వైనాన్ని ఆసక్తికరంగా వివరించారు. తొలి భార్యతో తనకు కలిగిన సంతానం కూడా కమలను ప్రేమగా మొమలా అని పిలుస్తారని డగ్లస్ వివరించారు. -
ఎట్టకేలకు కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించిన ఒబామా
అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒమాబా మద్దతు ప్రకటించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌ను వారు ఆమోదించారు. న స్నేహితురాలు హారీస్ అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నామని, ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో నా స్నేహితురాలు యూనైటెడ్ స్టేట్స్కు అధ్బుతమైన అధ్యక్షురాలిగా అవుతుంది. రెండు రోజుల క్రితం కమలా హ్యారిస్‌కు మేము ఫోన్ చేశాం. మిచెల్, నేను ఆమెతో మాట్లాడాం. తనకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు చెప్పాము. ఈ క్లిష్టమైన సమయంలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆమె గెలుపొందేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం. నీ పట్ల మాకు గర్వంగా ఉంది. నువ్వు చరిత్ర సృష్టిస్తామని తెలుసు’ అని అని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.ఇక ఈ నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు బైడెన్.. తన స్థానంలో కమలా హ్యారిస్‌ను ప్రతిపాదించారు. అయితే కమలా హ్యారిస్ విషయంలో డెమోక్రటిక్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటి వరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మద్దతును తెలపలేదు. అయితే ఇవాళ ఒబామా దంపతులు .. కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. -
అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ అవుట్?.. డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆమె!
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఆసక్తికర సమరం చోటు చేసుకోబోతోందా?. జో బైడెన్ స్థానంలో మరొకరిని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నిలపనుందా?. అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు అక్కడ ఆసక్తికర చర్చకు దారి తీశాయి.బరాక్ ఒబామా భార్య, అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలపాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు టెడ్ క్రూజ్ పేర్కొన్నారు. ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు ఆగస్టులో జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో బైడెన్‌ను మార్చే అవకాశం ఉందని తెలిపారు.కాగా నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల బరిలో నిలిచిన జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జూన్ 27న జార్జియాలోని అట్లాంటాలో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. 90 నిమిషాల పాటు సాగిన ఈ డిబెట్లో ఇరువురు పలు కీలక అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేశారు. అయితే ఈ చర్చలో బైడెన్ వెనుకంజవేశారని, ట్రంప్ పైచేయి సాధించారని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యూహకర్తలు బిడెన్‌ను భర్తీ చేసే మార్గాలపై చర్చిస్టున్నట్లు తెలుస్తోంది.బైడెన్ మాట్లాడిన తీరుపై డెమోక్రాట్లు ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఆయన మాట్లలో బొంగురు, స్పష్టంగా మాట్లాడలేకపోవడం, సమాధానలు చెప్పడంలో, ఆలోచనలను వివరించడంలో తడబాటు.. వంటి పలు కారణాలతో బైడెన్‌ను రేసు నుంచి తప్పించాలని ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిడెన్‌ను మిచెల్ ఒబామాతో డెమొక్రాటిక్ పార్టీ భర్తీ చేయాలని చూస్తుందని చెప్పారు టెడ్ క్రూజ్. అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ను తొలగించి మిషెల్లీ ఒబామాను నియమించే అవకాశాలు 80 శాతం ఉన్నట్లు తెలిపారు. -
USA: బైడెన్ వద్దు.. మిషెల్లీ ఒబామా బెటర్.. ఆసక్తికర పోల్స్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు ఫోకస్ పెట్టాయి. దీంతో, రెండు పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే, అధికార డెమోక్రటిక్ పార్టీలో ఆసక్తికర పరిమాణం చోటుచేసుంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బదులుగా.. మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా బరిలో నిలవాలని అమెరికన్లు కోరుకుంటున్నారని రాస్ముస్సెన్ రిపోర్ట్స్ పోల్ పేర్కొంది. వివరాల ప్రకారం.. 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మరో దఫా ఎన్నికల్లో నిలబడేందుకు అమెరికన్లు ఇష్టపడటం లేదు. ఆయన వయసు, మానసిక ఆరోగ్య స్థితిని ఇందుకు కారణంగా చూపుతున్నారు. అలా చెబుతున్నవారు దాదాపు 48 శాతం ఉన్నారని తేలింది. బైడెన్ బదులు.. మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామాను కోరుకుంటున్నారని రాస్ముస్సెన్ రిపోర్ట్స్ పోల్ పేర్కొంది. కాగా, 38 శాతం మంది జో బైడెన్‌ను కోరుకోవడం లేదని ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఒక వార్తను ప్రచురించింది. If Michelle Obama decides to replace President Biden ,then it's an absolute game over for Trump or Republicans . She will win presidency hands down, and for us, staunch Gandhian will be the most powerful person on the face of earth. Let the game begin @MichelleObama pic.twitter.com/pFkyFrYO67 — Prashant shah (@prashantsapp) February 28, 2024 ఇక, అదే సమయంలో బైడెన్‌ను మార్చే అవకాశాలు లేవని 45 శాతం మంది అభిప్రాయపడుతున్నారని సర్వేలో వెల్లడైంది. బైడెన్ మరోసారి ఎన్నికకు సిద్ధపడకపోతే ఆయన స్థానంలో ఎవరైతే బాగుంటందనే ప్రశ్నతో సర్వే నిర్వహించారు. ఇందులో మిషెల్లీ ఒబాబాకే ఎక్కువ సంఖ్యలో మద్దతు పలికారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తదితరులు తదుపరి స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. మిషెల్లీ ఒబామా మాత్రం తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితోలేనని ఇప్పటికే ప్రకటించారు. కాగా, జనవరిలో ఒక పాడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూలో మిషెల్లీ ఒబామా మాట్లాడుతూ 2024 అధ్యక్ష ఎన్నికల్లో వచ్చే ఫలితం గురించి తాను భయపడుతున్నానని వ్యాఖ్యానించారు. అలాగే, తనకు ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదన్నారు. -
పిలల్ల పెంపకంలో ఆ తప్పులు చెయ్యొద్దంటున్న మిచెల్ ఒబామా!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా సోషల్ మీడియా ఇంటర్యూలో పిలల్ల పెంపకం గురించి మాట్లాడరు. పిల్లలను చక్కగా పెంచడం అనేది ఓ యజ్ఞం లాంటిదని అన్నారు. ఎందుకుంటే మనం చెప్పేవి వాళ్ల మంచికేనని తెలియాలి, అదే టైంలో తల్లిదండ్రులు వాళ్లకు విలన్స్ కాదు శ్రేయోభిలాషులు అనే నమ్మకం కలిగించాలి. అంతేగాదు ఆమె పిల్లల పెంపకం అనేది చాలా కష్టమైన పని అని, అది కత్తి మీద సాములాంటిదని అన్నారు. ఏ మాత్రం మనం అజాగ్రత్తతతో లేదా నిర్లక్ష్యపూరితంగా వ్యహరిస్తే వారి భవిష్యత్తు నాశనమవ్వడం తోపాటు మనకు తీరని మనోవ్యధే మిగిలుతుంది అని చెబుతున్నారు మిచెల్. తాను ఈ విషయంలో తన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న మెళుకువలే తన ఇద్దరి పిల్లల పెంపకంలో ఉపయోగపడ్డాయిని చెబుతోంది. అందుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మిచెల్. అవేంటంటే.. పిల్లలు తమంతట తామే పెరుగుతారు. వారికి ఎదిగే క్రమంలో మన సాయం కావాల్సిన చోటల్లా భరోసా ఇస్తే చాలు. వారే చుట్టూ ఉన్న వాతావరణం, తమ స్నేహితులు, బంధువుల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. పైగా తెలివిగా అభివృద్ధి చెందుతారు. ఆ క్రమంలో పిలల్లు కొన్ని తప్పులు చేయడం సర్వసాధారణం. ఎందుకంటే ఇది తప్పు, ఇది కరెక్ట్ అనేంత మెచ్చూరిటీ లెవెల్స్ పిలల్లకు ఉండవు. మనం చేసే ఒక్కో పని సంక్రమంగా లేకపోతే ఎంత పెద్ద సమస్యను సృష్టిస్తుందనేది కూడా వాళ్లు అంచనా వేసేంత బ్రెయిన్ వాళ్లకు ఉండదు. కాబట్టి పిల్లలను తెలివిగా, సక్రమంగా పెంచాలంటే ఈ సింపుల్ మెళుకువలు పాటిస్తే ఎంతటి మొండి పిల్లలైనా తీరు మార్చుకుంటారు. కాస్త సమయ తీసుకున్నప్పటికీ మంచి పిల్లలుగా గుర్తింపు తెచ్చుకుంటారని అన్నారు. మిచెల్ చెప్పే మెళుకువలు.. పిల్లలను నేరుగా విమర్శించొద్దు.. చాలామంది తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పు ఇదే అని మిచెల్ అంటున్నారు. మీరు పిల్లలను మంచి కోరే నేరుగా వాళ్ల చేస్తుంది తప్పు అని చెప్పి ఉండొచ్చు. కానీ వాళ్లు మనం అన్నమాటలు ఎలా తీసుకుంటున్నారనేది గమనించకపోతే పేరెంట్స్‌కి, పిల్లలకు మధ్య ఉండే బాండింగ్ దెబ్బ తింటుంది. మిమ్మల్ని శత్రువులుగా చూసే ప్రమాదం ఎక్కువగా ఉంది. పిల్లలు తమ తప్పును వాళ్లే గుర్తించేలా విడమర్చి చెబుతూ మిమర్శనాత్మకంగా చెప్పండి. అంతేగాదు పేరెంట్స్ మీరు క్షమించినా, బయట ఇలా చేస్తే వాళ్లను ఎలా చూస్తారనేది అర్థమయ్యేలా వివరించాలి. ఇలా చేస్తే పిల్లలు పేరెంట్స వద్ద ఎలాంటి దాపరికలు లేకుండా ఫ్రెండ్లీగా మెలుగుతారు. బాధ్యతలను తీసుకునేలా చేయాలి.. చాల మంది తల్లిదండ్రులు ఈ విషయంలో తప్పులు చేస్తున్నారని మిచెల్ అంటున్నారు. పిల్లలు అమాయకులు, ఎంత ఎదిగినా చిన్నవాళ్లే అనే భావనల నుంచి పేరెంట్స్ ముందు బయటకు రావాలి. వారి వయసుకు తగ్గట్టు చిన్న చిన్న బాధ్యతలను అప్పగించాలి. అప్పుడే ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కారించాలనే ఆలోచన డెవలప్ అవుతుంది. ఇలాంటప్పుడే వాళ్లలోని దాగున్న ప్రతిభ, సామర్థ్యాలను బయటకు వస్తాయి. ఇక్కడ బాధ్యతలు అనగానే ప్రతీది కాదు వారు చేయగలిగేలా, ప్రయోజనం చేకూర్చేవి, తప్పక నేర్చుకోవాల్సిన బాధ్యతలు చిన్న చిన్నగా ఇవ్వండి. రాను పిల్లలకు తెలియకుండా నా కుటుంబం కోసం నేను ఇది చేయాలనే అవగాహన రావడమే గాక ఇది తన బాధ్యత అనే స్థాయికి చేరుకుంటారని అంటున్నారు మిచెల్. సమస్యలతో పోరాడనివ్వండి.. తల్లిదండ్రులుగా మనం రక్షణగా ఉన్నప్పటికీ వారు వ్యక్తిగతంగా ఏదోఒక సమయంలో వారికి వారే పోరాడాల్సి ఉంటుంది. అందువల్ల చిన్న సమస్యలను వాళ్లు ఎలా పరిష్కరించేందుకు యత్నిస్తున్నారో చూడండి. వెళ్తున్న దారి కరెక్టే అయితే ధైర్యం ఇవ్వండి. ఒకవేళ్ల తప్పుదోవలో సమస్య పరిష్కరించేందుకు చూస్తుంటే అడ్డుకుని వివరించండి. ఈ విధానం పిల్లలు ఎదుగుతున్న క్రమంలో కెరీర్ పరంగా వచ్చే సమస్యలను, ఒత్తిడులను జయించగలిగే శక్తిని ఇస్తుంది . తప్పిదాల నుంచే విజయం పొందడం ఎలా..? ఒక పని చేస్తున్నప్పుడూ పదే పదే ఫెయ్యిల్యూర్లు వస్తుంటే.. అక్కడితో నిరాశగా ఢీలా పడిపోకుండా ముందుకు నడవడం ఎలా అనేది తెలియజేయండి. ఎన్ని ఓటములు ఎదురైనా.. పాజిటివ్ ఆటిట్యూడ్‌ని వదలకూడదు, ఓడిపోయానని చేతులెత్తేయకూడదని చెప్పండి. చివరి నిమిషం వరకు విజయం కోసం వేచి చూసే స్పూర్తిని నేర్పించండి. తప్పిదాలనే విజయానికి బాటలుగా చేసుకోవడం ఎలా అనేది వివరించండి. ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తుల గూర్చి కథకథలుగా చెప్పండి. అప్పుడూ వాళ్లకు సక్సెస్ అనేది అందుకోలేని బ్రహ్మపదార్థంలా కనిపించదు. అలాగే ప్రస్తుత పరిస్తుతలను చూసి చాలామంది తల్లిదండ్రులు మనోడు మంచిగా ఉంటాడా? అని ఆందోళన చెందకూడదు. నిజానికి బయట పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా మీరు వారితో వ్యవహరించే విధానం బాగుంటే ఆందోళనకి చోటు ఉండదనే విషయం గుర్తెరగాలి. అంతేగాదు చెడు అలవాట్ల జోలికి వెళ్లడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ మనసు లాగినా పేరెంట్స్ మీదున్న గౌరవం ఆ ప్రయత్నాన్ని విరమించుకునేలా చేస్తుంది అని చెబుతున్నారు. నిజంగా మిచెల్ చెప్పిన మెళుకువలు ప్రతి తల్లిదండ్రులు అనుకరిస్తే పిల్లలు మంచిగా పెరగడమే కాకుండా దేశానికి మంచి పేరు కూడా తెస్తారు కదూ. (చదవండి: ఇన్నోవేటర్స్..తక్కువ ఖర్చుతో అద్భుత ఆవిష్కరణలు!) -
ట్రంప్ ప్రమాణస్వీకారం రోజు అరగంట ఏడ్చాను: మిచెల్ ఒబామా
వాషింగ్టన్: 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం రోజున వైట్‌హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని, ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేనని మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా వెల్లడించారు. ది లైట్ పాడ్‌కాస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయలను గుర్తుచేసుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత తాము వైట్‌హౌస్‌ను విడిచిపెట్టడం చాలా బాధగా అనిపించిందని, ఆ క్షణాల్లో ఆమె పడిన అవేదనను తలుచుకుంటూ అప్పటి విషయాలను చెప్పుకొచ్చారు. తెలియన బాధ... అరగంట ఏడ్చాను ట్రంప్ ప్రమాణస్వీకారం రోజు అనేక కారణాల వల్ల ఆ రోజు కన్నీళ్లు కూడా వచ్చినట్లు చెప్పారు. వైట్‌హౌస్‌తో తమకు ఎనిమిదేళ్ల అనుబంధం ఉందని, అది తమ పిల్లలకు తెలిసిన ఏకైక ఇల్లుగా పేర్కొన్న మిచెల్.. ఆ ఇంటిని విడిచిపెట్టే రోజు చాలా ఉద్వేగానికి లోనయ్యానని చెప్పుకొచ్చారు. మా పిల్లల స్వస్థలం చికాగో అయినప్పటికీ, వాళ్లు అక్కడికంటే ఎక్కువ సమయం వైట్‌హౌస్‌లో గడిపారన్నారు. వీటితో పాటు అక్కడ పని చేసే సిబ్బందితో కూడా బంధం ఏర్పడిందని, వారిని వదిలిపెట్టాల్సి రావడం కూడా బాధగా అనిపించిందన్నారు. ఈ విషయంపై ఆమె కొనసాగిస్తూ.. ‘ఆ రోజు ఎందుకో నాలో కన్నీళ్లు, భావోద్వేగం ఉన్నాయి. వేదికపై కూర్చున్న మాకు ఎదురుగా ఉన్న స్క్రీన్‌పై మేము కనిపిస్తున్నాం. ఆ వేదికపై ఎలాంటి వైవిధ్యం, కళ లేదు. అమెరికా విశాల భావానికి ప్రతిబింబం లేదు’ అని భావోద్వేగంతో వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ వన్ ఫ్లైట్‌లో ఎక్కిన మరుక్షణం తనలో దుఃఖం కట్టలు తెంచుకున్నట్లు తెలిపారు. ఆ బాధను తట్టుకోలేక 30 నిమిషాలు నిర్విరామంగా ఏడ్చానని మాజీ ప్రథమ మహిళ అప్పటి విషయాలును గుర్తుచేసుకున్నారు. చదవండి: షాకింగ్.. ఇంట్లో 1,000 కుక్కలు మృతి.. ఆకలితో కడుపు మాడ్చి! -
అమెరికా అధ్యక్ష బరిలో బరాక్ ఒబామా భార్య.. స్పందించిన మిచెల్
అమెరికా మాజీ ప్రథమ మిచెల్ ఒబామాకి తరుచుగా ఎదరవుతున్న ప్రశ్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారా? లేదా అని. ఈ ప్రశ్న ఆమెకి తన భర్త ఒబామా అధ్యక్షుడిగా (2009 నుంచి 2017) ఉన్న సమయంలో కూడా ఈ ప్రశ్న ఎదురైంది. తదుపరి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారా అంటూ పలువురు ఇప్పటికీ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆమె ఈ విషయమై స్పందించింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు మిచెల్. ప్రస్తుతం జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా చక్కగా పాలిస్తున్నారని, అతని పరిపాలనలో ప్రారంభించిన కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు. అలాగే బైడెన్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు కూడా ఆమె చాలా తెలివిగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘ఇది బైడెన్, అతని కుటుంబం అలోచించుకోవాల్సిన విషయం. ఇది పూర్తిగా బైడెన్ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. అలాగే బైడెన్, జిల్ బైడెన్ ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఆలోచించే మిలియన్లమంది వ్యక్తులలో ఒకరిగా తాను ఉండాలనుకోవడం లేదు’ అంటూ కౌంటరిచ్చారు. అయితే ఆమె బైడెన్ మళ్లీ అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారా అనే దానికి పూర్తి అంగీకారం ఇవ్వకుండా పరోక్షంగా చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పకనే చెప్పారు. (చదవండి: అమెరికాలో ట్రంప్ ఫెయిల్: బైడెన్) -
పంచెకట్టు, షేర్వాణీలో మెరిసిపోతున్న ఒబామా: ఫోటో వైరల్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దీపావళి వేడుక సందర్భంగా దక్షిణ భారత వస్త్రాధారణలో మెరిసిపోతున్నాడు. ఆయన భార్య మిచెల్, కూతుళ్లు కూడా భారత సంప్రదాయ దుస్తుల్లో అలరిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఒబామ్ కుటుంబం ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేగాదు ఆ ఫోటోలో కింద హ్యాపీ దీపావళి అని కూడా ఉంది. వాస్తవానికి అవి మార్ఫింగ్ ఫోటోలే అయినపట్టికీ ఆ ఫోటోలు అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యంలోకి ముంచెత్తించి.. కళ్తు తిప్పుకోనివ్వకుండా చేశాయి. ఇదిలా ఉండగా అమెరికాలోని ప్రభుత్వ స్కూల్స్‌కి 2023 నుంచి దీపావళి పండుగ సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించనుందట. ఈ విషయాన్ని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్‌లు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అంతేగాదు దీపావళిని జరుపుకునే హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందిన సుమారు 2 లక్షల మంది న్యూయార్క్ వాసులను గుర్తించాల్సిన సమయం కూడా ఆసన్నమైందని రాజకుమార్ ఈ సందర్భంగా అన్నారు. పైగా జూన్ మొదటి గురువారం జరుపుకునే వార్షికోత్సవాన్ని దీపావళిగా మార్చి మరీ సెలవు ప్రకటించనుంది. ఐతే నెటిజన్లు మాత్రం ఈ ఫోటోలను చూసి ఆయన భారత్ ఒబామా అని ఒకరు కిర్రాక్ ఒబామ అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. obama’s Diwali party outfit pic.twitter.com/Ny7c1Jl6le — bad bitch in booties 👢 (@lilcosmicowgirl) October 18, 2022 (చదవండి: భయానక స్టంట్: ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు) -
వైట్ హౌస్‌లో సందడి చేసిన బరాక్ ఒబామా దంపతులు
వాషింగ్టన్: బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా అమెరికా వైట్ హౌస్‌కి తిరిగి రావడంతో గత పరిపాలన వైభవం కళ్లముందు కదలాడింది. నాటి రోజులను స్మృతి పథంలోకి తెచ్చుకుంటూ వెనుకకు వెళ్లే అరుదైన క్షణం ఇది. వాస్తవానికి బరాక్ ఒబామా దంపతులు 2017లో వైట్ హౌస్‌ని విడిచిపెట్టిన తదనతరం మళ్లీ తమ అధికారిక పోర్ట్రెయిట్ల(చిత్రపటాల) ఆవిష్కరణ కోసం తొలిసారిగా వైట్‌హౌస్‌కి తిరిగి వచ్చారు. ఇది అమెరికా వైట్ హౌస్ సంప్రదాయ వేడుక. 2012లో చివరిగా జరుపుకున్న సంప్రదాయాన్ని మళ్లీ అందరికీ తిరిగి గుర్తు చేసేలా చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ మేరకు జో బైడెన్ ఈ పోర్ట్రెయిట్ ఆవిష్కరణ వేడుక కోసం బరాక్ ఒబామా దంపతులకు వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ వేడుకలో జో బైడెన్ భార్య జిల్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పాల్గొన్నారు. ఈ వేడుకతో అమెరికా ప్రజలకు బరాక్ ఒబామా దంపతులు మరింత చేరవయ్యారని బైడెన్ అన్నారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో సతమతమవుతుండటంతో వైట్ హౌస్‌లో ఈవెంట్లను జరపడం కోసం చాలా కాలంగా నిరీక్షించామని జిల్ బైడెన్ అన్నారు. అంతేకాదు ఈ పవిత్రస్థలంలో వారి చిత్ర పటాలను గోడలకు వేలాడదీయడంతో అధికారంలోకి రానున్న తరాల వారికి స్ఫూర్తిగానే గాకుండా గత స్మృతులు కళ్లముందు మెదిలాడి సవాళ్లును ఎదర్కొనే ధ్యైర్యాన్ని ఇస్తాయన్నారు జిల్ బైడెన్. ఈ పోర్ట్రెయిట్ ఆవిష్కరణ సంప్రదాయం 1965 నుంచి అసోసియేషన్ చేపట్టింది. తొలిసారిగా ఈ పోర్ట్రెయిట్లను చిత్రించిన కళాకారుల పేర్లును కూడా వెల్లడించారు. ఒబామా చిత్రపటాన్ని రాబర్ట్ మెక్కర్డీ, మిచెల్ ఒబామా చిత్రపటాన్ని షారన్ స్ప్రంగ్ చిత్రించారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. జో బిడెన్ అధ్యక్షుడిగా ఉండటం అమెరికా అదృష్టమని ప్రశంసించారు. ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైస్ ప్రెసిడెంట్‌గా బైడెన్ తనకు ఎన్నో సలహాలు, సూచలను అందించిన విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో విపత్కర సమయాల్లో బైడెన్ తనకు చక్కటి మార్గ నిర్దేశం చేశారని అన్నారు. అలాగే ఈ చిత్రపటాలను చిత్రించిన కళాకారులను సైతం మెచ్చుకోవడమే కాకుండా వారి పనితీరుని కూడా ఎంతగానో ప్రశంసించారు. తన దృష్టిలో ఈ పోర్ట్రెయిట్లకు మరింత ప్రాముఖ్యత ఉందని, అవి జార్ట్, మార్తా, వంటి నాటి మహోన్నత అధ్యక్షుల చిత్రాల సమక్షంలో తమ చిత్రాలు ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాని ఒబామా చెప్పారు. I want to thank Robert McCurdy for his extraordinary work on my portrait. Robert is known for his paintings of public figures, and I love how he paints people exactly the way they are. Take a look at the process behind creating the official White House portraits: pic.twitter.com/oZb6ov4uwr — Barack Obama (@BarackObama) September 7, 2022 (చదవండి: స్వీట్ బాక్స్‌లో ఏకంగా రూ.54 లక్షలు) -
మిచెల్ ఒబామాపై జో బైడెన్ కామెంట్స్.. ఖంగుతిన్న అమెరికన్లు..!
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పులో కాలేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లో నిలిచారు. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఆదివారం అమెరికా అణుసబ్మెరైన్ యూఎస్ఎస్ డెలావేర్ను అధికారికంగా విధుల్లోకి ప్రవేశపెడుతున్న సమయంలో ఇచ్చిన స్పీచ్‌లో బైడెన్ తప్పుగా వ్యాఖ్యానించారు. బైడెన్ ప్రసంగిస్తూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా గురించి ప్రస్తావించిన ఆయన.. మిషెల్‌ను మాజీ ఉపాధ్యక్షురాలు అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా మిషెల్ ఒబామా ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మొదలైన పలు కార్యక్రమాలను ప్రస్తుతం ఉన్న ప్రథమ మహిళ ముందుగా తీసుకెళుతున్నారని ప్రశంసించారు. అయితే, బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామాను ప్రథమ మహిళ అని పిలవాల్సి ఉండగా.. బైడెన్ తప్పుగా ఉపాధ్యక్షురాలు అని అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. Does Biden think Michelle Obama was Vice President? pic.twitter.com/SyzKLsu378 — Benny (@bennyjohnson) April 2, 2022 -
‘‘ఎలా మొదలైంది..ఎలా కొనసాగుతోంది’’ భావోద్వేగ పోస్ట్ వైరల్
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్లీ ఒబామా దంపతులు తమ సుదీర్ఘ వైవాహిక జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రతీ వార్షికోత్సవం, వాలెంటైన్స్ డేకి పరస్పరం అభినందిచుకోవడం ఈ దంపతులకు అలవాటు. ఈ క్రమంలో అక్టోబరు 3 ఆదివారం, 29 వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మిచెల్లీ ఒక పోస్ట్ పెట్టారు. తన హబ్బీ కోసం పెట్టిన ఒక స్వీట్ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో ఈ ఒబామా దంపతులకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఈ సందర్భంగా ఆమె రెండు ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పటికే 2.7 మిలియన్లకు పైగా లైక్స్‌ను సాధించడం విశేషం. అందమైన జంట..హ్యాపీ యానివర్సరీ కమెంట్ల జోరు కొనసాగుతోంది. తమ పెళ్లి రోజు సందర్భంగా మెచెల్లీ భర్త ఒబామాకు ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ అందించారు. ఎలా ప్రారంభమైంది.. ఎలా కొనసాగుతోంది అంటూ తమ అపురూపమైన జర్నీని గుర్తు చేసుకున్నారు. లవ్ యూ బరాక్ అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఒబామాతో కలిసి ఉన్న అప్పటి, ఇప్పటి రెండు ఫోటోలను షేర్ చేశారు. కాగా 1992, అక్టోబర్ 3 న వివాహం చేసుకున్నారు ఒబామా, మిచెల్లీ. వీరికి మలియా (23) సాషా (20) ఇద్దరు సంతానం. గత ఏడాది తమ 28వ వార్షికోత్సవ సందర్భంగా 2020 అధ్యక్షఎన్నికల్లో జోబైడెన్ విజయంకోసం ఓటువేయాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Michelle Obama (@michelleobama) -
మిషెల్ మిమ్మల్ని ఎంత గౌరవించారు.. మీరేంటిలా?!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి కాలం ముగియడానికి మరికొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. వివాదాలు, విమర్శల విషయంలో అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు ట్రంప్ రికార్డును సమం చేయలేరు. ఇక అధ్యక్ష ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ట్రంప్ మరిన్ని వివాదాస్పద చర్యలకు పూనుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన మద్దతుదారులు క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేయడం.. ఆ తర్వాత ట్రంప్‌పై అభిశంసన ప్రవేశపెట్టడం వంటివి చోటుచేసుకున్నాయి. ఇక అమెరికా చరిత్రలోనే రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే. రేపు జో బైడెన్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి తాము హాజరు కాబోవడం లేదని ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రస్తుత ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌పై కూడా నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. వైట్ హౌస్ సంప్రదాయలను పాటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘మీ కన్నా ముందు అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా దంపతులు మీ విషయంలో ఎంత గౌరవంగా.. హుందాగా ప్రవర్తించారు.. మరి మీరేంటిలా’ అని ప్రశ్నిస్తున్నారు. (చదవండి: అమెరికాలో నల్లజాతీయుల మరణానికి కారణం ఇదే!) నెటిజనులు మెలానియాను ఇంతటా ట్రోల్ చేయడానికి కారణం ఏంటంటే ఆమె భవిష్యత్ ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ను ప్రైవేట్ లివింగ్ క్వార్టర్స్‌కి ఆహ్వానించలేదు. అధికార పరివర్తనలో భాగంగా ప్రస్తుత ఫస్ట్ లేడి.. నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమం కన్నా ముందే భవిష్యత్ ఫస్ట్‌లేడీని ప్రైవేట్ లివింగ్ క్వార్టర్స్‌కి ఆహ్వానిస్తారు. బ్రెస్ ట్రూమన్ నుంచి మొదలైన ఈ సంప్రదాయం మిషెల్ ఒబామా వరకు అందరు పాటించారు. ఇక ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తన భర్త పౌరసత్వానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికి.. మిషెల్ ఒబామా వాటిని మనసులో పెట్టుకోలేదు. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించగానే అప్పటి మొదటి మహిళ మిషెల్ ఒబామా, తన భర్తతో కలిసి వెళ్లి మెలానియాను సాదరంగా ఆహ్వానించారు. కానీ ప్రస్తుతం మెలానియా ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదు. ఇప్పటివరకు ఆమె భవిష్యత్ ఫస్ట్ లేడి జిల్ బైడెన్‌ని కనీస పలకరించిన దాఖలాలు కూడా లేవు. (చదవండి: శ్యామ్‌ని చూసి.. మిషెల్ ముగ్ధులైపోయారు) Michelle Obama graciously hosted Melania Trump at the White House immediately after 2016 election to ensure a smooth transition. Melania Trump has done absolutely nothing for Dr. Jill Biden. Some people are givers, others takers: pic.twitter.com/lBYWe32wkR — Michael Beschloss (@BeschlossDC) January 18, 2021 దాంతో నెటిజనలు మెలానియాను విమర్శిస్తున్నారు. కొందరు(ఒబామా లాంటి వాళ్లు) ఇవ్వడానికి ఉంటే.. మరికొందరు(ట్రంప్ ఆయన భార్య మెలానియా) లాంటి వాళ్లు తీసుకోవడానికే ఉంటారని దుయ్యబడుతున్నారు. ఇక తన ఫేర్వెల్ మెసేజ్‌లో మెలానియా అమెరికన్లు తమ ఉత్తమమైన చొరవను అనుసరించాలని.. హింస ఎన్నడూ సమాధానం కాదని స్పష్టం చేశారు. -
శ్యామ్‌ని చూసి.. మిషెల్ ముగ్ధులైపోయారు
పెద్దయ్యాక ఏమౌతావ్? పిల్లల్ని అడుగుతాం. వాళ్లకేం తెలుసు ఏమవ్వాలో?! ఏదో ఒకటి చెబుతారు. అవడానికి ఏమేం ఉన్నాయో.. ముందు మనం చెప్పాలి వాళ్లకు. శ్యామ్ చెబుతున్నాడు. యు కెన్ బి ఎనీ థింగ్’అంటూ.. పెద్దయ్యాక ఏమేం అవొచ్చో ‘ర్యాప్’ డ్యాన్స్‌తో చూపిస్తున్నాడు. శ్యామ్‌ని చూసి.. మిషెల్ ముగ్ధులైపోయారు. శ్యామ్ వైట్కి ఆరేళ్లు. నల్లవాళ్లబ్బాయి. ర్యాప్‌తో సీన్లోకి వచ్చాడు! ‘ఆల్ఫాబెట్ ర్యాప్’ అని.. వాళ్ల డాడీ శ్యామ్ పాడి, ఆడిన ఆ వీడియోకి పేరు పెట్టాడు. ఆఫ్రికన్ స్టెయిల్లో చేతులు, తల ఆడిస్తూ ఎ ఫర్ ఆర్కిటెక్ట్, బి ఫర్ బయోకెమిస్ట్.. అని శ్యామ్ తీసిన దిద్దనక రాగాల ర్యాప్‌ను చూసి మిషల్ ఒబామా కూడా నవ్వును ఆపుకోలేకపోయారు! వాడి ఫీలింగ్స్, ఆ ఊగడం అది. ‘‘నాకు తెలుసు. ఇవి ఒత్తిళ్లతో కూడిన కాలాలు. ఈ వీడియో నా ముఖంపై స్ట్రెస్‌ను పోగొట్టి నన్ను ఆహ్లాదపరిచింది. అందుకని మీకు షేర్ చేస్తున్నాను. మనమంతా మన కిడ్స్ కోసం ఒక్కక్షణం ఆగి ఆలోచించేలా చేస్తాడు శ్యామ్. భవిష్యత్తులో వాళ్లను ఎలా చూడాలని అనుకుంటున్నామో మనకో ఆలోచన ఉంటుంది. అయితే శ్యామ్ ‘ఎబిసి ర్యాప్’ వెర్షన్ వేరేలా ఉంది. తనేం అంటాడంటే.. ‘యు కెన్ బి ఎనీ థింగ్’ అంటాడు. అవును. పిల్లల్ని తమకు ఇష్టమైన కలను కనమని శ్యామ్ చెబుతున్నాడు’’ అని మిషెల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. శ్యామ్ కెమెరాను చూస్తూ నిలబడి పాడుతుంటాడు. తండ్రి బాబీ వైట్ కొడుకు వెనుక బల్ల ముందు కూర్చొని బీట్ ఇస్తుంటాడు. అదొక లయబద్ధమైన స్ఫూర్తి గీతం. రెండున్నర నిముషాల క్లిప్. ఇలా మొదలౌతుంది. ముందు తండ్రి అతడిని అడుగుతాడు. పెద్దయ్యాక ఏమౌతావ్ అని. ఏమైనా అవ్వొచ్చు అంటాడు శ్యామ్! ‘అంటే?’ అని తండ్రి అడుగుతాడు. ఇక శ్యామ్ ప్రారంభిస్తాడు. యు కెన్ బి ఎ ‘ఎ’.. యు కెన్ బి యాన్ ఆర్కిటెక్ట్! క్యాచ్ ఎ బిల్డింగ్ టు కిస్ ద స్కై. (నువ్వు ఆర్కిటెక్ట్ అవొచ్చు. ఆకాశాన్ని కిస్ చెయ్చొచ్చు.) యు కెన్ బి ఎ ‘బి’. యు కెన్ బి ఎ బయోకెమిస్ట్. మేక్ మెడిసిన్స్.. సేవ్ లైవ్స్. (నువ్వు బయోకెమిస్ట్ కావొచ్చు. మందులు కనిపెట్టి, ప్రాణలను నిలపొచ్చు). యు కెన్ బి ఎ ‘సి’. కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలపర్. (నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు. ప్రోగ్రామ్స్ రాయొచ్చు)... ఇలా ఎ టు జడ్.. ర్యాప్ సాగుతుంది. శ్యామ్ పాటకు, స్టెప్స్‌కి చక్కగా జోడీ కుదిరింది. కొరియోగ్రఫీ కూడా శ్యామ్దే! ఎ నుంచి జడ్ వరకు ఎలా చెప్పగలిగాడు అనిపిస్తుంది. కెమెరా వైపు చూస్తూ శ్యామ్ ర్యాప్ కొట్టడానికి టెలీ ప్రాంప్టరేం లేదు. గుర్తుపెట్టుకున్నాడు! ర్యాపింగ్ నైపుణ్యాలను మధ్యమధ్య కుమారుడికి కొంత అద్దాడు తండ్రి. ‘యు కెన్ బి ఎ ‘డి’. ఎ డెంటిస్ట్. బికాజ్ ఎవ్రీబడీ లవ్స్ టు స్మైల్ అన్నప్పుడు.. నవ్వినట్లుగా పెదవులను సాగదీయమని చెబుతాడు. ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్‌లో చివరికి వచ్చేసరికి ఎవరికైనా కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. వీడియో చూస్తూ ఉన్నప్పుడు మనకూ అనిపిస్తుంది ఈ పిల్లాడు ఎక్స్, వై, జడ్లకు ఏం చెబుతాడో అని. జడ్ కి ‘జలస్లీ స్ట్రైవ్’ అంటాడు. అసూయతో రగిలిపోతూ కష్టపడి సాధించమని. ‘వై’కి యువర్ ఓన్ బాస్ అంటాడు. నువ్వే నీకు బాస్‌వి కమ్మని. ‘ఎక్స్’ ప్రత్యేకంగా చెప్పలేదు. సమ్ ‘ఎక్స్’.. ఏదైనా అవ్వు కానీ, సోమరిగా మాత్రం ఉండిపోకు అని చెబుతాడు. ర్యాప్ ముగియగానే తండ్రి ఆనందం పట్టలేక గట్టిగా పిడికిలితో బల్లను గుద్దుతాడు. ఈ తండ్రీ కొడుకులది యు.ఎస్.లోని టెన్నెనీ రాష్ట్రంలోని మెంఫిస్. శ్యామ్ తన కడుపులో ఉండగా శ్యామ్ తల్లి పుస్తకాలు బాగా చదివారట. రెండేళ్ల వయసులోనే శ్యామ్ పుస్తకాలు చదివేందుకు ప్రయత్నించేవాడని కూడా ఈ ‘యు కెన్ బి ఎనీథింగ్’ ర్యాప్కి వచ్చిన స్పందనకు చూసి ఆ తల్లి ఉప్పొంగిపోతూ చెబుతున్నారు. స్టెఫానీ ఆమె పేరు. గత సెప్టెంబరులోనే శ్యామ్‌కు ఆరో ఏడు వచ్చింది. తండ్రి రాసి ఇచ్చిన ఏబీసీ ర్యాప్‌ను లిరిక్ లైన్స్ గుర్తుపెట్టుకుని పాడటానికి శ్యామ్ యాభైసార్లకు పైగా మననం చేసుకున్నాడు. ఇప్పటికింకా వైరల్ అవుతూనే ఉన్న ఈ వీడియోకు గత ఐదు రోజుల్లో యూట్యూబ్‌లో రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఫేస్బుక్లో మూడు లక్షలసార్లు షేర్ అయింది. నువ్వు ఏమైనా అవొచ్చు అంటున్న శ్యామ్.. ఇంతకీ తను ఏమవ్వాలని అనుకుంటున్నాడు? ఆర్కెటెక్ట్ అవుతాడట. ఆకాశాన్ని చుంబించే భవంతులకు ప్లాన్లు గీయడం కోసం. View this post on Instagram Robert Samuel raps about career choices for kids. A post shared by Sam (@rsamuelw3) on Oct 26, 2020 at 12:14pm PDT -
జో బిడెన్‌ను గెలిపించండి : మిషెల్లి ఒబామా
వాషింగ్టన్ : ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి, కరోనా మహహ్మారి నుంచి రక్షించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి జో బిడెన్ కృషిచేస్తారని మాజీ అమెరికా ప్రథమ మహిళ మిషెల్లి ఒబామా అభిప్రాయపడ్డారు. నవంబరులో జరగనున్న ఎన్నికల్లో జో బిబెన్ను అద్యక్షుడిగా ఎన్నుకోవాల్సిందిగా కోరారు. డెమొక్రటిక్ కన్వెన్షన్ నైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిషెల్లి ఒబామా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..తన భర్త బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బిడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారని, ఆయన పనితనం ఏంటో తనకు తెలుసునని అన్నారు. స్మార్ట్ ప్రణాళికలు రచించి తన జట్టులోని సభ్యులను ముందుకు నడిపిస్తారని, ఎంతో మార్గదర్శకంగా పనిచేస్తారని కొనియాడారు. ఆర్థక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, కరోనా మహమ్మారి నుంచి రక్షించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏమి అవసరమో బిబెన్కు బాగా తెలుసనని మిషెల్లి అభిప్రాయపడ్డారు. (ఆమె మొదటిది కానీ చివరిది కాదు) ఇవి అత్యంత ప్రమాదకరమైన ఎన్నికలు : ట్రంప్ బిడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైతే చాలా నిజాయితీగా, జవాబుదారితనంతో పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కోవిడ్ లాంటి అంటువ్యాధిని ఎదుర్కోవడంలో ట్రంప్ విఫలమయ్యారని మిషెల్లి ఒబామా ఆరోపణలు గుప్పించారు. శాస్ర్తవేత్తలు, డాక్టర్లు ఈ మహమ్మారి గురించి ఎప్పటినుంచో అలర్ట్ చేసినా ట్రంప్ అవేవీ పట్టనట్లు ఉన్నారని, దాని మూలంగానే నేడు దేశంలో కరోనా విజృంభణ ఈ స్థాయిలో ఉందని మండిపడ్డారు. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విస్కాన్సిన్, మిన్నెసోటాలో కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఫైర్ అయ్యారు. ఇక అమెరికాలో నవంబరులో జరగునున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. డెమాక్రాట్ అభ్యర్థులుగా జో బిడెన్, కమలా హ్యారిస్‌ను ప్రకటించిన నాటి నుంచి అధ్యక్షుడు ట్రంప్ ఏదో ఒక విధంగా నోరు పారేసుకుంటునారు. ఓష్కోష్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. వారిద్దరూ గెలిస్తే పిచ్చి సోషలిస్ట్ విధానాలను అమలు చేస్తారని ఆరోపించారు. అమెరికాలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యంత ప్రమాదకరమై ఎన్నిక అని ట్రంప్ అన్నారు. వాళ్లను గెలిపిస్తే అమెరికా మరో వెనిజులాగా మారుతుంది అని ఆరోపించారు. (డెమోక్రాటిక్ అభ్యర్థులపై నోరు పారేసుకున్న ట్రంప్) -
కమలా హ్యారిస్‌పై మిషెల్ ఒబామా భావోద్వేగ పోస్ట్
వాషింగ్టన్ : భారత సంతతికి చెందని కమలా హ్యారిస్ అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవిని అలంకరించే అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత మూలాలున్న కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. ఈ విషయంపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లి ఒబామా హర్షం వ్యక్తం చేశారు. రంగుతో సంబంధం లేకుండా ఓ మహిళ తనను తాను ఎంతో గొప్పగా ఎదిగిన తీరును ప్రశంసించింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న కమలా హ్యారీస్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఓ పోస్టును షేర్ చేసింది. ఈ సందర్భంగా మిషెల్లీ మాట్లాడుతూ...''మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఈ యుద్ధంలో మీ పనితనంపై విమర్శలు చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. మీరు ఈ పదవికి అర్హురాలు కాదని నినదించే వాళ్లూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. మీ పనితనంపై మాకు నమ్మకం ఉంది. చిన్న వయసులోనే మీ లక్ష్యాన్ని చేరేందుకు శ్రమిస్తున్నారు. (కమలా హ్యారిస్‌పై నోరు పారేసుకున్న ట్రంప్) మార్పు నెమ్మదిగా రావచ్చొమో కానీ కశ్చితంగా మొదలవుతుంది. మీ పురోగతికి సంకేతాలు కనిపిస్తున్నాయి. జమైకా, భారతీయ మూలాలున్న ఓ వలసదారుల కుమార్తె నేడు ఓ ప్రధాన పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మొదటి నల్లజాతి మహిళగా, ఆసియా-అమెరికన్ మహిళగా మీరు రికార్డు నెలకొల్పారు. నవతరం అమ్మాయిలు సైతం తమలాగే కనిపించే వారు కూడా అధ్యక్షులుగా ఎదిగి దేశాన్ని ముందుకు నడిపించవచ్చు అని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. వారిలో కూడా ఆ ఆత్మవిశ్వాసాన్ని రేకిత్తించారు. ఎందుకంటే కమలా హ్యారిస్ మొదటివారు కావచ్చు కానీ చివరివారు కాదు'' అంటూ ఎంతో భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చదువుతున్నంత సేపు గూస్బంప్స్ వచ్చాయి అంటూ పలువురు ఉద్వేగానికి లోనయ్యారు. ఇక విశేష రాజకీయ అనుభవం, గొప్ప పాలనా చాతుర్యం, అద్భుతమైన వాదనాపటిమ ఉన్న కమలా హ్యారిస్‌ను తన లెఫ్ట్‌నెంట్‌గా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎంచుకున్నారు. కమలా హ్యారిస్ తండ్రి డొనాల్డ్ హ్యారిస్‌ది జమైకా. తల్లి శ్యామల గోపాలన్ ఇండియన్(చెన్నై). అలా ఆఫ్రో, ఆసియన్ మూలాలున్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. జో బైడెన్ ప్రచార వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. అమెరికా ఓటర్లలో కీలకమైన భారతీయులు సహా ఆసియన్లు, ఆఫ్రికన్ల ఓట్లను ఆమె కచ్చితంగా ప్రభావితం చేయగలరన్న అభిప్రాయం యూఎస్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. (నేనెప్పుడు దోశ వేయలేదు: కమలా హారిస్) View this post on Instagram You get used to it, even as a little girl—opening the newspaper, turning on the TV, and hardly ever seeing anyone who looks like you. You train yourself to not get your hopes up. And sometimes it’s a battle just to keep telling yourself that you might deserve more. Because no matter how much you prepare, no matter what grades you get or even how high you rise at work, it always feels like someone is waiting to tell you that you’re not qualified. That you’re not smart enough. That you’re too loud or too bossy. That there’s just something about you…you’re just not quite the right fit. Change can be slow and frustrating, but signs of progress are all around us. This week Senator @KamalaHarris, the daughter of Jamaican and Indian immigrants, became the first Black woman and first Asian-American woman on a major party’s presidential ticket. I’ve been thinking about all those girls growing up today who will be able to take it for granted that someone who looks like them can grow up to lead a nation like ours. Because @KamalaHarris may be the first, but she won’t be the last. I am here for it all. Let us embrace and celebrate this moment. Go get ‘em girl. 💪🏾 A post shared by Michelle Obama (@michelleobama) on Aug 13, 2020 at 12:07pm PDT -
ఒబామా కొత్త ప్యాలెస్ చూశారా?
న్యూఢిల్లీ: చుట్టూ ఆవహించిన సముద్ర తరంగాల మీదుగా చల్లటి గాలులు వీస్తుంటే అందమైన దీవిపై వెలిసిన సువిశాల సుందర భవనంలో శాశ్వత నివాసం ఏర్పరుచుకొని, శేష జీవితం గడపాలనుకుంటే అది అందరికి స్వప్నం అవుతుందేమోగానీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు మాత్రం సాకారమవుతుంది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని మార్తాస్ వినియార్డ్ దీవిపై 29 ఎకరాల విస్తీర్ణ ప్రాంగణంలో 6,900 చదరపు అడుగుల్లో నిర్మించిన సువిశాల సుందర భవనాన్ని ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ఏడు పడక గదులు, తొమ్మిది బాత్ రూమ్‌లు, రెండు అతిథుల చావడీలు, అధునాతన కిచెన్ కలిగిన ఈ భవనాన్ని 11.75 మిలియన్ల డాలర్ల(దాదాపు 85 కోట్ల రూపాయలు)కు ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ‘బోస్టన్ సెల్టిక్స్ (అమెరికా ఫ్రొఫెషనల్ ఫుట్‌బాల్ జట్టు)’ యజమాని విక్ గ్రౌస్‌బెక్ గత వేసవి కాలంలోనే అమ్మకానికి పెట్టగా ఒబామా వేసవి దంపతులు వేసవి విడిదిగా ఆ సుందర భవనంలో దిగారు. ఆ మైదానంలో ఒబామా తన మిత్రులతో గోల్ఫ్ కూడా ఆడుతూ వచ్చారు. చివరకు ఆ భవనాన్ని కొనుగోలు చేయాలని ఒబామ దంపతులు ధరను ఖరారు చేసుకున్నట్లు అభిజ్ఞవర్గాల ద్వారా తెల్సింది. 2001లో నిర్మించిన ఆ భవనాన్ని వాస్తవానికి 14.50 మిలియన్ డాలర్లకు యజామని గ్రౌస్‌బెక్ అమ్మకానికి పెట్టగా, ఒబామా గీచి గీచి బేరం పెట్టి యజమానిని ఒప్పించారట. ఆ భవనం ఆవరణలో ఓ స్విమ్మింగ్ పూల్‌తోపాటు అవుట్డోర్ ఫైర్ పిట్, సన్‌బాత్ కోసం అద్భుతమైన బాల్కనీ ఉన్నాయి. అన్నింటికంటే ప్రైవేట్ బీచ్, బోట్ హౌజ్ కూడా ఉన్నాయి. అమ్మకానికి ఆ భవనం ప్రాంగణానికి అనుకొని కొన్ని వందల ఎకరాల స్థలం ఉందట. క్రమంగా పక్కనున్న ఎకరాలను కూడా కొనుగోలు చేయవచ్చనే ముందు చూపుతోనే ఒబామా ప్యాలెస్ లాంటి ఆ భవనాన్ని కొనుగోలు చేశారట. మసాచుసెట్స్ నుంచి వినియార్డ్ దీవిపైకి రావాలన్నా, పోవాలన్నా గగన, జల మార్గాలే శరణ్యం. ఆ దీవిపై ప్రైవేటు ప్రాపర్టీ కొనుగోలు చేసిన మొదటి మాజీ దేశాధ్యక్షుడు ఒబామానే అనుకుంటే పొరపాటు జాకీ కెన్నడీకి అక్కడ సొంతిల్లుంది. 1994లో ఆయన చనిపోయే వరకు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన వంశానికి చెందిన వారు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. ఒబామా అదే దీవిపైనున్న తమ సమ్మర్ హోమ్‌ను గతేడాది 15 మిలియన్ డాలర్లకు విక్రయించారు. -
ఫస్ట్ లేడీ
అమెరికన్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి భార్యను ఫస్ట్ లేడీ అని సంబోధిస్తారు. హాలీవుడ్లో ప్రస్తుతం ‘ఫస్ట్ లేడీస్’ అనే టైటిల్‌తో ప్రెసిడెంట్ సతీమణులపై ఓ సిరీస్ రూపొందబోతోంది. ఈ సిరీస్ మొదటి సీజన్లో అమెరికాకు ప్రెసిడెంట్లుగా వ్యవహరించిన ఇలియానోర్ రూజ్వెల్ట్ , బెట్టీ ఫోర్డ్, ఒబామా భార్యల కథలను చర్చించనున్నారు. ఇందులో ఒబామా భార్య మిచ్చెలీ ఒబామా పాత్రలో వయోలా డేవిస్ నటించనున్నారు. ‘మిచ్చెలీ లాంటి ధైర్యవంతురాలు, ఎక్స్ట్రార్డినరీ ఉమెన్ పాత్ర చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది’ అని డేవిస్ అన్నారు. -
అధ్యక్ష ఎన్నికల బరిలో మిషెల్ ఒబామా..!?
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా.. దేశ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆమె బరిలో దిగబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించగల శక్తి మిషెల్‌కి మాత్రమే ఉందని.. ఆమె అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని అమెరికాకు చెందిన సినీ నిర్మాత మైఖేల్ మూర్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పలు చర్చల్లో ట్రంప్‌కు దీటుగా ఆమె ప్రసంగించగలరని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మూర్ వ్యాఖ్యలపై శుక్రవారం మిషెల్ ఒబామా స్పందించారు. తాను అమెరికా అధ్యక్ష పదవి బరిలో లేనని స్పష్టం చేశారు. ‘మెరుగైన ప్రపంచంలో అమెరికాను అభివృద్ది చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందుకే దేశంలోని పలు కుటుంబాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి.. యువ కార్యకర్తలతో కలిసి పలువురికి సాయం చేస్తున్నాను. ఈ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటేసామాజిక కార్యక్రమాల్లో భాగం కాలేను. ప్రజలు సేవ చేయాలనే తపనతో మాత్రమే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా’ అని తెలిపారు. -
ట్రంప్‌పై మిషెల్లీ ఒబామా ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా దిగువ సభలోని మైనారిటీ మహిళా సభ్యులపై ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆదేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది నా అమెరికా కాదు, నీ అమెరికా కాదు.. మన అమెరికా’ అంటూ ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆమె ట్విట్టర్ వేదికగా ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. ‘‘ఈ దేశాన్ని ప్రపంచంలో గొప్పగా నిలబెట్టేది ఇక్కడి వైవిధ్యం. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ అందాన్ని చూస్తున్నాను. మనం ఇక్కడ పుట్టిన వారమే కావచ్చు లేదంటే వలస వచ్చిన వారమే కావచ్చు.. కానీ, ప్రతి ఒక్కరికి ఈ నేలపై హక్కుంది. మనం ఒక్క విషయం తప్పక గుర్తుకు పెట్టుకోవాలి. అమెరికా నీదో, నాదో కాదు. మనందరి అమెరికా’’ అని మిషెల్లీ హితవుపలికారు. ఓ ప్రచార సభలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా దిగువ సభలోని నలుగురు నల్లజాతీ సభ్యులను ‘మీ స్వదేశానికి వెళ్లిపోండి’ అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలకు అనుగుణంగా సభకు హాజరైన ప్రజల్లో చాలా మంది ‘వారిని వెళ్లగొట్టండి’ అంటూ నినాదాలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెళ్లువెత్తుత్తున్నాయి. అధ్యక్షుడిగా జాతివ్యతిరేక వ్యాఖ్యలు చేయడంగా సరికాదని అభిప్రాయపడుతున్నారు. -
రాక్షసత్వం
రాక్షసిలా పని చెయ్యడం (లీనింగ్ ఇన్).. స్త్రీని ఇప్పుడు ఆకాశంలోకి ఎత్తేస్తున్న ‘సుగుణం’! ఇంటినీ, ఆఫీస్‌నీ బ్యాలెన్స్ చేసుకుంటోందంటే ఆమె ఇంకా పెద్ద రాక్షసి. స్త్రీలోని ఆమె స్వాభావికతల కన్నా.. ‘లీన్ ఇన్’ అవడం అనే ఈ పని రాక్షసత్వమే ఆమెకు గుర్తింపు తెచ్చిపెడుతోందిప్పుడు! అయితే ‘అంతలేదు’ అని మిషెల్ ఒబామా నవ్వేస్తున్నారు. బహుశా ఆమె ఉద్దేశం.. ‘అంత అవసరం లేదని’ కావచ్చు. భర్త ఇంట్లో ఉంటే, బయటి సొంత పనులు తెముల్చుకోడానికి భార్యకు సౌఖ్యంగా ఉంటుంది. గ్యాస్ బాయ్ వచ్చి, ఎవరూ లేరని వెనక్కి వెళ్లిపోతాడేమోనని, మంచినీళ్ల ట్యాంకరొస్తే బిందెల్లోకి నీళ్లు పట్టేవారుండరనీ మనసు పీకులాట ఉండదు. ఇంటి పనులు, ఆఫీసు పనులు కాకుండా స్త్రీలకు వేరే సొంత పనులేం ఉంటాయని అనిపించవచ్చు! మీరు భర్త గనుకైతే, మీరు మీ ఆఫీసుకి ఒకరోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండి, అదే రోజు ఆమెనూ ఆమె ఆఫీసుకు సెలవు పెట్టమని చెప్పి.. ‘నీ పనులేమైనా ఉంటే చూసుకో. ఇంట్లో పనులు ఇవాళ నేను చూసుంటాను’ అని నమ్మకం ఇవ్వండి. అప్పుడామె.. పని మీద బయటికి వెళ్లినట్లుగా ఉండదు. పండక్కి పుట్టింటికి వెళ్తున్నట్లుగా వెళ్తుంది. నిజం. చీరకు ఫాల్ కుట్టించుకునేందుకు తీరిక దొరకడం కూడా ఆమెకు పండగే. అంతగా ‘లీన్ ఇన్’ అయి ఉంటున్నారు గృహిణులు, ఉద్యోగినులూ! జాబ్ చేసే మహిళలంటే ఆఫీస్‌లోనూ పని చెయ్యాలి, ఇంటికొచ్చి బియ్యమూ కడిగి ఉడికించాలి. మరి గృహిణులకేమైంది? గృహిణులకేమైందీ కాదు.. గృహిణులకే అయింది. ఆఫీస్ పనిలోనన్నా మిగతా స్టాఫ్ నుంచి చెయ్యో, చేతులో సపోర్టుగా వస్తాయేమో కానీ.. గృహిణి చెయ్యలేకపోయిన పనిలో ఒక చెయ్యేసేవాళ్లెవరుంటారు? ఇంట్లో తనొక్కరిదే తన పని కాదు. ఇంట్లో వాళ్లందరి పనీ తనదే. పగలూ రేయీ చేస్తూ ఉండాల్సిందే. తెల్లారే సూర్యుడు కూడా ‘ఆలస్యంగా ఉదయించానా’ అని అనుమానపడి అవమానపడతాడు.. ఈ ‘రాక్షసి’ నాకంటే ముందెలా లేవగలుగుతోందని! లేదంటే.. సంశయపడతాడు.. రాత్రంతా నిద్రమానుకుని పని చూస్తూనే ఉందా ఏంటి అని. రాక్షసిలా పని చెయ్యడం, రాక్షసిలా పరుగులు తియ్యడం.. రాక్షసిలా కెరీర్లో ఎదిగే ప్రయత్నం చెయ్యడం.. స్త్రీని ఇప్పుడు ఆకాశంలోకి ఎత్తేస్తున్న ‘సుగుణం’. ఇంటినీ, ఆఫీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటోందంటే ఆమె ఇంకా పెద్ద రాక్షసి. స్త్రీలోని ఆమె స్వాభావికతల కన్నా.. ‘లీన్ ఇన్’ అవడం అనే ఈ పని రాక్షసత్వమే ఆమెలో ప్రతిచోటా గుర్తింపు పొందుతోంది ఇప్పుడు. ‘లీన్ ఇన్’ అంటే పెనుగాలికో, ఈదురుగాలికో లేక అలాంటి పరిస్థితులకో మనిషి ఒరిగిపోవడం. 2013లో ‘లీన్ ఇన్ : ఉమెన్, వర్క్, అండ్ ది విల్ టు లీడ్’ అనే పుస్తకం మార్కెట్లోకి వచ్చాక ‘లీన్ ఇన్’ కు ‘ఇంటినీ, ఆఫీస్‌నీ బ్యాలెన్స్ చేసుకునేంత రాక్షసత్వం’ అనే అర్థం బాగా వాడుకలోకి వచ్చింది. ఆ పుస్తక రచయిత్రి షిరిల్ శాండ్‌బర్గ్. ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఆ పుస్తకం శాండ్బర్గ్ని ఎంత పాపులర్ చేసిందో, అందులోని ‘లీనింగ్ ఇన్’ అనే మాట అంత పాపులర్ అయింది. దూసుకెళ్లడం, పది చేతులతో పని చెయ్యడం, పైపైకి ఎదగడం, ఫాలో అవకుండా.. లీడ్ చెయ్యడం.. వీటన్నిటినీ కలిపి ‘లీన్ ఇన్’ అన్నారు శాండ్‌బర్గ్. అనడమే కాదు.. ప్రపంచ మహిళలారా ‘లీన్ ఇన్’ అవండి అని ఒక మూవ్‌మెంట్‌ని కూడా తెచ్చారు. లీన్ ఇన్ అవడానికి దుర్గమ్మకు ఉన్నంత శక్తి ఉండాలి. లేదంటే ఒక గృహిణికి, ఒక ఉద్యోగినికి ఉన్నంత శక్తి ఉండాలి. మిషెల్ ఒబామా కూడా గృహిణే. బరాక్ ఒబామా భార్యగా ‘అమెరికా మాజీ ప్రథమ మహిళ’ అనే గుర్తింపు ఉండొచ్చు గాక.. ప్రజలకు పనికొచ్చే ఏవో ఒకట్రెండు ఉద్యమాలు మినహా ఉద్యోగాలేమీ చేయలేదు మిషెల్. గృహిణిగానే ఉండిపోయారు. పిల్లలిద్దరూ పెద్దవాళ్లయ్యాక మిషెల్‌కి ఇంటి పనుల్నుంచి కాస్త తీరిక దొరికింది. ఆ తీరిక సమయంలోనే తన ఆత్మకథను రాసుకుని దానికి ‘బికమింగ్’ అని పేరు పెట్టుకున్నారు. బికమింగ్ ఈ ఏడాది నవంబర్ పదమూడున విడుదలైంది. ఇప్పటికే ఇరవై లక్షల కాపీలకు పైగా అమ్ముడయ్యాయి! నాన్–ఫిక్షన్ కేటగిరీలో టాప్ సెల్లింగ్‌లో ఉంది. ఒబామా ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మిషెల్ తన అభిమాన పాఠకుల కోసం యు.ఎస్. అంతా పర్యటించే వీలు చిక్కింది. అలా పర్యటిస్తూ.. డిసెంబర్ రెండున న్యూయార్క్‌లో బార్క్లేస్ సెంటర్లోకి వెళ్లడానికి ముందు ఓ టీనేజ్ అమ్మాయిల గుంపు మిషెల్‌ను కలిసింది. వాళ్లేదో అడగాలని చూస్తున్నారు. ‘ఊ.. కానివ్వండి’ అన్నారు మిషెల్ నవ్వుతూ. ‘‘నెక్స్›్ట అమెరికన్ ప్రెసిడెంట్ మీరే అంటున్నారు. పోల్ నంబర్స్, అప్రూవల్ రేటింగ్స్ కూడా మీ వైపే చూపిస్తున్నాయి. మరి మీరు కంటెస్ట్ చెయ్యబోతున్నారా?’’ అని అడిగారు ఆ పిల్లలు. మిషెల్ నవ్వారు. ‘‘ప్రెసిడెంట్ అవ్వాలని నాకు లేదు. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న ఒకర్ని పెళ్లి చేసుకున్నానే కానీ, రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు’’ అని చెప్పారు. అక్కడి నుంచి బార్క్లేస్ సెంటర్ లోపలికి వెళ్లాక అక్కడా ప్రశ్నలు మొదలయ్యాయి. ‘‘ఈమధ్య ఆడవాళ్లంతా.. గ్రేటర్ క్వాలిటీస్ అని, రెస్పెక్ట్ ఇన్ వర్క్‌ప్లేస్ అనీ అంటున్నారు.. కదా’’ అని ఎవరో అన్నారు. అందుకు మిషెల్.. ‘‘ఇట్ ఈజ్ నాట్ ఎనఫ్ టు లీన్ ఇన్. బికాజ్ దట్ షిట్ డజెంట్ ఆల్వేస్ వర్క్’’ (‘లీన్ ఇన్’ అయినంత మాత్రాన సరిపోదు. ఆ దరిద్రం అన్ని సమయాల్లో పనిచేయదు) అని అన్నారు. ఒకటే చప్పట్లు, అరుపులు. మిషెల్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని పేరు. మనసులో ఉన్నది కూడా ఉన్నట్లే మాట్లాడారు.మిషెల్ అన్న ఈ మాటలు నెట్లో ఇప్పుడు విశేషంగా ప్రచారం అవుతున్నాయి. ఎరిన్ స్ట్రెకర్ అనే అమ్మాౖయెతే.. మిషెల్ మాటల్ని అన్నవి అన్నట్లు తన ఒంటిపై టాటూ వేయించుకుంది. ఇంకో అమ్మాయి.. ‘మిషెల్ ఒబామా ఈజ్ మై ప్రెసిడెంట్’ అని ట్వీట్ చేసింది. ముందు తరంతో పోలిస్తే ఈ తరం పురుషులు ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెడుతున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ స్త్రీల పనులు మాత్రం తగ్గలేదు! బ్యాలñ న్సింగ్ ఇంకో అదనపు పని. వర్క్ లైఫ్‌నీ, హోమ్ లైఫ్‌నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ‘లీన్ ఇన్’ అవడం స్త్రీల మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. సమానత్వాన్ని రుజువు చెయ్యడానికైతే మాత్రం స్త్రీకి అంత ఒత్తిడి అవసరం లేదేమోనని మిషెల్ ఒబామా భావిస్తున్నట్లు ఆమె మాటల్ని బట్టి అర్థంచేసుకోవాలి. ∙మాధవ్ శింగరాజు -
ఒబామాను వదిలేద్దామనుకున్నా: మిచెల్
వాషింగ్టన్ : ‘కొన్ని కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరిగే అవకాశం ఉండదు. అంతమాత్రాన కుంగిపోవాల్సిన పనిలేదు’ అంటూ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా తాను మ్యారేజ్ కౌన్సిలింగ్‌కు వెళ్లిన నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. పీపుల్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ... ‘మేము రోల్ మోడల్స్ కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని అనుసరించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతీ విషయంలో నిజాయితీగా ఉండాలని కోరుకుంటాం. కొన్నిసార్లు వివాహ బంధం నుంచి వైదొలగాలని అన్పిస్తుంది. ఎవరికైనా ఇది సహజం. నాకు కూడా చాలాసార్లు అలాగే అన్పించింది. అందుకే మ్యారేజ్ కౌన్సిలింగ్ కావాలని కోరానని మిచెల్ పేర్కొన్నారు. కౌన్సిలింగ్ జరిగిన నాటి నుంచి తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టామని, అందుకే చాలా విషయాల్లో తాను చేసే చిన్న చిన్న తప్పులేంటో తెలిసొచ్చాయని మిచెల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు అప్పటి నుంచే తన భర్తతో పాటుగా ఇతరులను కూడా సహాయం అడిగే చొరవ లభించిందని పేర్కొన్నారు. మ్యారేజ్ కౌన్సిలింగ్‌కు వెళ్లడం వల్ల దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోయి, ఆ బంధం మరింత బలపడుతుంది. కాబట్టి కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సి వస్తే ఏమాత్రం ఇబ్బంది పడవద్దని మిచెల్ సూచించారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా- మిచెల్ల వివాహం 1992లో జరిగింది. వీరికి మాలియా, సాషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. -
‘ఆ విషయంలో ట్రంప్‌ని ఎన్నటికి క్షమించను’
వాషింగ్టన్ : నా భర్త పౌరసత్వం గురించి అవాస్తవాలు ప్రచారం చేసి నా కుటుంబానికి భద్రత లేకుండా చేశాడు. ఈ విషయంలో ట్రంప్‌ను ఎన్నటికీ క్షమించలేను అంటూ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బర్తర్’ థియరి పేరుతో తన కుటుంబం పట్ల ట్రంప్ ప్రవర్తన గురించి మిచెల్ తన ‘బికమింగ్’ పుస్తకంలో పలు విషయాల్ని ప్రస్తావించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ 2011 సమయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘బర్తర్’ థియరిని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఒబామాను ఉద్దేశిస్తూ ‘ఎందుకు నీ బర్త్ సర్టిఫికేట్‌ను చూపించడం లేదం’టూ ట్రంప్ ప్రశ్నించారు. ఒకవేళ నిజంగా మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోతే అది అమెరికా రాజకీయాల్లోనే పెను సంచలనం అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఊరుకోక ఈ అంశానికి మతం రంగు పులిమే ప్రయత్నం కూడా చేశారు ట్రంప్. ‘ఒబామా ముస్లిం అనుకుంటాను. అందుకే తన బర్త్ సర్టిఫికేట్‌ని చూపించడం లేదం’టూ ఆరోపించారు. ఈ విషయాలన్నింటి గురించి మిచెల్ తన ‘బికమింగ్’ పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. ట్రంప్ లాంటి జాత్యహంకార వ్యక్తిని తానేప్పుడు చూడలేదన్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల వల్ల తన కుటుంబ భద్రతకు ముప్పు వాటిల్లిందని మిచెల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ట్రంప్ ప్రచారం చేసిన ‘బర్తర్’ థియరీ చూడ్డానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నా ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఎవరైనా మతి స్థిమితం సరిగా లేని వ్యక్తి ట్రంప్ మాటలను విశ్వసించి మా మీద ద్వేషం పెంచుకుని.. ఏ చాకో.. గన్నోతీసుకుని మా కుటుంబం మీద దాడి చేయడానికి వస్తే మా పరిస్థితి ఏంట’ని ప్రశ్నించారు. అందుకే ఈ విషయంలో తాను ఎప్పటికి ట్రంప్‌ని క్షమించలేనని తెలిపారు. మూడు భాగాలుగా వస్తోన్న బికమింగ్ పుస్తకాన్ని నవంబర్ 14న విడుదల చేయనున్నారు -
నిర్మాతలుగా ఒబామా దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా ‘నెట్‌ఫ్లిక్స్’తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు వారు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఫీచర్స్ నిర్మించి నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రసారం చేయనున్నారు. ఒబామా దంపతులు నిర్మించే డాక్యుమెంటరీల్లో ముందస్తు స్క్రిప్టు రాసుకున్నవి, స్క్రిప్టు అవసరంలేని డాక్యుమెంటరీలు ఉంటాయని నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం ప్రకటించింది. ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల అనుభవాలను కూడా నెట్‌ఫ్లిక్స్ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులతో పంచుకోనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో ఒబామా దంపతులకు త్వరలోనే ఓ ఒప్పందం కుదరబోతోందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక గత మార్చి నెలలోనే ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ కోసం ఒబామా దంపతులు ‘హయ్యర్ గ్రౌండ్ ప్రొడక్షన్స్’ పేరిట ఓ నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. తమ నిర్మాణ సంస్థ ద్వారా ప్రపంచంలోని వివిధ వర్గాల ప్రజలతో ముచ్చటించబోతున్నామని, వారి విలువైన అభిప్రాయలను, అభిరుచులను తెలుసుకోవడంతోపాటు వాటిని ప్రపంచ ప్రజలతో పంచుకునేలా చేయడం కోసమే తాము ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ వర్గాల ప్రజల్లో నిగూఢంగా దాగున్న నైపుణ్యాన్ని, సృజనాత్మక శక్తిని కూడా వెలికితీసి ప్రోత్సహించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. -
మెలానీయా టూర్లో మెలిక!
నాడు మిషెల్లీని విమర్శించిన ట్రంప్! నేడు ట్రంప్ సతీమణిదీ అదే దారి.. తలపై వస్త్రం లేకుండానే పర్యటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు తమ తొలి విదేశీ పర్యటనలో భాగంగా శనివారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. అయితే, ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలైన మెలానీయా ట్రంప్ ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధంగా తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు రావడం గమనార్హం. 2015 జనవరిలో అప్పటి ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు రావడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. ఇలా చేయడం సౌదీని అవమానించడమేనని, దీనివల్ల అమెరికాకు శత్రువులు మరింత పెరిగిపోతారని ట్విట్టర్లో విమర్శించారు. ఇప్పుడు అదే ట్రంప్ సతీమణితోపాటు ఆయన కూతురు, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ సైతం తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు రావడం గమనార్హం. ఇస్లామిక్ సంప్రదాయ రాజ్యమైన సౌదీలో మహిళల పట్ల, మహిళల వస్త్రధారణ పట్ల పలు ఆంక్షలు ఉంటాయి. సౌదీకి చెందిన మహిళలు బహిరంగ ప్రదేశాలకు వస్తే కచ్చితంగా వెంట్రుకలు కనిపించకుండా తలపై స్కార్ఫ్ కప్పుకోవాల్సి ఉంటుంది. విదేశీ పర్యాటకులకు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల మహిళలకు ఈ సంప్రదాయం నుంచి మినహాయింపు ఉంటుంది.