అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుటుంబం వేసవి విడిదిలో భాగంగా మార్థాలోని విన్‌యార్డ్‌లో విహరిస్తున్నది. అమెరికా అధ్యక్షుడిగా ఒబామాకు ఇది చివరి వేసవి విహారం కానుంది. రెండువారాలపాటు ఒబామా కుటుంబం ఇక్కడ విహరించనుంది.
నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో రానున్న కొద్దిరోజుల్లో ఒబామా బిజీగా మారిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో భార్య మిషెల్లి, కూతుళ్లతో కలిసి ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ రెండువారాలు గోల్ఫో ఆడుతూ.. సముద్ర తీరంలో విహరిస్తూ.. బైక్ రైడింగ్ చేస్తూ.. కుటుంబసభ్యులు, కొందరు ఆప్తమిత్రులతో ఒబామా గడుపనున్నారు. రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా సేవలు అందించిన ఒబామా దేశాధినేత పదవిలో ఇప్పటివరకు ఏడుసార్లు వేసవి విహారానికి వెళ్లారు.