President Barack Obama
-
పెరూలో దిగిన ఒబామా.. ఇదే ఆఖరి టూర్
లిమా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెరూలో అడుగుపెట్టారు. అధ్యక్ష స్థానంలో ఉండి చివరగా చేస్తున్న విదేశీ పర్యటనలో భాగంగా బెర్లిన్ నుంచి బయలుదేరిన ఆయన ప్రయణిస్తున్న ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ పోర్చుగల్‌లో ఇంధనం నింపుకొని శుక్రవారం సాయంత్రం లిమాలో దిగింది. పెరూలో అధ్యక్షుడు పెడ్రో పబ్‌లో కుస్జిన్స్కీతో సమావేశం ద్వారా ఆయన తన షెడ్యూలును ప్రారంభిస్తారు. అనంతరం టౌన్ హాల్లో వందలమంది యువకుల మధ్య ప్రసంగించనున్నారు. ఇక్కడే ఆయన చివరగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం లిమాలో జరగనున్న ఆర్థిక సదస్సులో ఆసియా ప్రాంత నాయకులను, ఆస్ట్రేలియా నాయకుడిని ఒబామా కలవనున్నారు. అనంతరం పత్రికా సమావేశం నిర్వహించి తిరిగి సోమవారం ఉదయం శ్వేత సౌదానికి చేరుకుంటారు. దీంతో ఒబామా పర్యటనలు పూర్తి కానున్నాయి. -
చివరి సమ్మర్ వేకేషన్లో..!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుటుంబం వేసవి విడిదిలో భాగంగా మార్థాలోని విన్యార్డ్లో విహరిస్తున్నది. అమెరికా అధ్యక్షుడిగా ఒబామాకు ఇది చివరి వేసవి విహారం కానుంది. రెండువారాలపాటు ఒబామా కుటుంబం ఇక్కడ విహరించనుంది. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో రానున్న కొద్దిరోజుల్లో ఒబామా బిజీగా మారిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో భార్య మిషెల్లి, కూతుళ్లతో కలిసి ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ రెండువారాలు గోల్ఫో ఆడుతూ.. సముద్ర తీరంలో విహరిస్తూ.. బైక్ రైడింగ్ చేస్తూ.. కుటుంబసభ్యులు, కొందరు ఆప్తమిత్రులతో ఒబామా గడుపనున్నారు. రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా సేవలు అందించిన ఒబామా దేశాధినేత పదవిలో ఇప్పటివరకు ఏడుసార్లు వేసవి విహారానికి వెళ్లారు. -
మన పార్కులన్నీ నాశనమవుతున్నాయి: ఒబామా
నేషనల్ పార్క్: ప్రపంచ వాతావరణంపై అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దీని బారిన అమెరికా పడిందని, దాని ఫలితాన్ని అనుభవిస్తోందని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ భవిష్యత్‌లో ఎదురవనున్న సమస్య అని ఇక అనుకోవాల్సిన అవసరం లేదని, అది ఇప్పటికే ప్రవేశించిన సమస్య అందరు కలిసి ఎదుర్కోవాల్సిన అతిపెద్ద విళయం అని ఒబామా అన్నారు. గ్లోబల్ వార్మింగ్‌పై ఆయన అమెరికాలోని నేషనల్ పార్క్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ఇక ఎలాంటి తప్పు చేయవద్దు. వాతావరణ మార్పు అనేది ఎంతో దూరంలో లేదు. అది ఒక ఎదుర్కోవాల్సిన ప్రమాదం. ఇప్పటికే అమెరికాలోని జాతీయ పార్కులన్నీ దీని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఊహించని విధంగా మంచు కరిగిపోతోంది. ఇది ఇప్పటికే ప్రవేశించిన ప్రమాదం. తప్పక ఎదుర్కోవాలి' అని ఒబామా అన్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా పార్క్ వద్ద తన కుటుంబంతో గడుపుతున్న ఒబామా ఈ ఆందోళన వ్యక్తం చేశారు. -
అమెరికాలో క్షణం తీరిక లేకుండా..
వాషింగ్టన్: సాధారణ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి వచ్చినంత సులువుగా విదేశాలను చుట్టిరావడం ప్రధాని నరేంద్ర మోదీ వేగవంతమైన జీవితానికి సోదాహరణ. ప్రస్తుతం ఐదు దేశాల పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం అగ్రరాజ్య రాజధాని వాషింగ్టన్ కు చేరుకున్నారు. భారత ప్రధాని విమానం దిగీదిగగానే ఎయిర్ పోర్టు ప్రాంగణమంతా 'మోదీ.. మోదీ..' నినాదాలతో మారుమోగిపోయింది. మూడు రోజులపాటు అమెరికాలో ఉండనున్న మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు వ్యాపార దిగ్గజాలు, పలువురు ప్రముఖులను కలవనున్నారు. అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా పలు కార్యక్రమాలకు హాజరైన మోదీ ముందుగా భారత సంతతి వ్యోమగామి, దివంగత కల్పనా చావ్లాకు నివాళులు అర్పించారు. ఎర్లింగ్టన్ జాతీయ స్మారక స్థలిలోని కల్పన సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో చావ్లా కుటుంబసభ్యులతోపాటు మరో భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా పాల్గొన్నారు. ఎర్లింగ్టన్ నుంచి నేరుగా బ్లేయర్ హౌస్ కు చేరుకున్న నరేంద్ర మోదీ.. అమెరికా విదేశీ వ్యవహారాల నిపుణులు(థింక్ ట్యాంకర్స్)తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతి, భవిష్యత్ అవసరాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటుచేసిన భారత సాంస్కృతిక చిహ్నాల అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్నారు. దశాబద్ధాల కిందట ఇండియాలో చోరీకి గురై అమెరికాకు చేరిన 200 దేవతా మూర్తులను యూఎస్ అటార్నీ జనరల్.. మోదీకి అప్పగించారు. ఇక మంగళవారం ఉదయం వైట్ హౌస్ లో అధ్యక్షుడు ఒబామాను కలుసుకోనున్న మోదీ అక్కడే లంచ్ చేస్తారు. శాఖాహారి అయిన భారత ప్రధాని కోసం వైట్ హౌస్ చెఫ్ లు ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయనున్నారు. ఆ తరువాత అమెరికా ఉభయసభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. 1949తర్వాత అమెరికా ఉభయసభల్లో ప్రసంగించే ఆరో భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. ఒబామాతో భేటీలో రక్షణ, వ్యాపార అంశాలతోపాటు వాతావరణ మార్పులపై చర్యలు తదితర అంశాలు చర్చిస్తారు. మూడు రోజుల పర్యటన ముగించుకుని అమెరికా నుంచి నేరుగా మెక్సికోకు వెళ్లనున్న ఆయన జూన్ 9న భారత్ కు తిరిగి వస్తారు. -
ఎన్నికలంటే రియాల్టీ షో అనుకున్నావా..?
ట్రంప్‌పై మండిపడ్డ ఒబామా వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడటమంటే రియాల్టీ షోలో పాల్గొనడం అనుకుంటున్నావా? అని డోనాల్డ్ ట్రంప్‌ను అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రశ్నించారు. శనివారమిక్కడ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి చేరువలో ఉన్న ట్రంప్‌పై మండిపడ్డారు. టీవీ నేపథ్యంలో నుంచి వచ్చిన వ్యక్తిగా ట్రంప్‌ను అభివర్ణించిన ఒబామా..అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడటమంటే వినోదం కాదన్నారు. ‘ఇది రియాల్టీ షో కాదు ప్రతిష్టాత్మకమైన అమెరికా అధ్యక్ష పదవికి జరిగే పోటీ అని గుర్తుంచుకోవాలి’ అని హితవు పలికారు. అమెరికాలోని సమస్యలపై ట్రంప్ అనేక సమయాల్లో పలురకాలుగా స్పందించారన్నారు. అమెరికాలో ముస్లింలు, అక్రమ వలసదారులను అనుమతించనంటూ, మెక్సికో వలసదారులు ప్రవేశించకుండా గోడ కడతానని ట్రంప్ చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒబామా మాట్లాడుతూ విదేశాంగ విధానంలో కూడా ట్రంప్ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు. అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు అమెరికా ప్రమాణాలకు అనుగుణంగా, వాస్తవిక ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. రిపబ్లికన్ పార్టీ ఇప్పటికైనా తమ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా, అమెరికాలో రానున్న కొత్త ప్రభుత్వానికి అధికార మార్పిడి సజావుగా జరిగేందుకు వీలుగా పన్నెండు మంది సభ్యులతో కూడిన ‘వైట్‌హౌస్ ట్రాన్సిషన్ కమిటీ’ని ఒబామా ఏర్పాటు చేశారు. -
'ట్రంప్ కు చాలా విషయాలు తెలియవు'
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షపదవికి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ కు అన్ని విషయాలు తెలియవని అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. జపాన్, దక్షిణ కొరియాలతో అణు ఒప్పందాల విషయంలో అమెరికా తీరుపై ట్రంప్ కు అంతగా విషయ పరిజ్ఞానం లేదని, విదేశీ వ్యవహారాలపై మరింత అవగాహనా అతనికి అవసరమని ఒబామా అభిప్రాయపడ్డారు. విదేశీ వ్యవహారాలు, అణు ఒప్పందాలు రెండు వేరు వేరు విషయాలని.. ఒక్కో దేశంతో ఓ రకమైన విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అణు భద్రత సదస్సులో రెండో రోజైన శుక్రవారం ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్, దక్షిణ కొరియాల తీరుతో అమెరికాకు నష్టమేంలేదని ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో వాటి ప్రాబల్యం గురించి కొన్ని అంశాలను పేర్కొన్నారు. ఇలాంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన లేని వ్యక్తులు తమ కార్యాలయంలో ఉండాలని ఏ పౌరుడు భావించారని పునరుద్ఘాటించారు. అణు సంబంధ అంశాలు ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్నాయని, జపాన్, దక్షిణ కొరియా దేశాలు సొంతంగా ఈ రంగంలో అభివృద్ధి చెందుతాయని ఒబామా అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాలు అణు సంబంధ రంగంలో సక్సెస్ సాధిస్తే అది అమెరికాకు లాభం చేకూర్చడానికి దోహదం చేస్తాయని సదస్సులో వివరించారు. -
అమాయకులను కూడా చంపేశాం: ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆశ్చర్యకర నిజాలను బయటపెట్టారు. ఓ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న ఆయన ఉగ్రవాదం అంశంపై మాట్లాడారు. అమెరికా డ్రోన్లు ఎంతో మంది అమాయక జనాలను పొట్టనపెట్టుకున్నాయని అంగీకరించారు. అయితే డ్రోన్ల ద్వారా చేస్తున్న యుద్ధాన్ని మాత్రం సమర్థించుకున్నారు. ఈ పాలసీకి తాను ఎప్పుడు అనుకూలమేనని మరోసారి స్పష్టం చేశారు. అణుభద్రత సదస్సులో డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్న భద్రతపై ఇరవై దేశాల అధినేతలతో చర్చించారు. తమ దేశం చాలా తప్పులు చేసిందని.. అయితే ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే కాస్త కఠినంగా ఉండాల్సి వస్తుందన్నారు. ఐఎస్ఎస్, ఇరాన్ తో అణు ఒప్పందం అంశాలు ఈ సదస్సులో కీలక అంశాలుగా మారాయని చెప్పుకొచ్చారు. గత కొన్ని వారాలుగా ఐఎస్ఎస్ మిలిటెంట్లు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశాలున్నాయని, మహిళలు, చిన్నారులు వారి టార్గెట్ అవుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ లో అమెరికా కరెన్సీని వినియోగించడాన్ని నిషేధించాలని అమెరికా భావిస్తుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి, అరికట్టడానికి తాము చాలా కృషి చేస్తున్నామని, ఇకముందు అమెరికా దాడులు గతంలో మాదిరిగా ఉండవంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను బరాక్ ఒబామా హెచ్చరించారు. -
'మాకు హాని తలపెడితే ఎవ్వరినీ సహించం'
వాషింగ్టన్: అమెరికాకు హాని తలపెడితే ఐఎస్ఎస్, మరి ఏ ఇతర సంస్థ అయినా సహించేది లేదని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ప్రపంచదేశాల్లోని ముస్లిం నేతలు ఐఎస్ఎస్ ఉగ్రవాదంపై నోరు విప్పాలని, వారి వైఖరి ఏమిటన్నది తెలపాలని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా మరిన్ని విషయాలపై మాట్లాడారు. మతాన్ని ఆధారంగా చేసుకుని ఎవరిపై వివక్ష చూపరాదని తమ అధికారులకు ఆయన సూచించారు. కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో ముస్లిం దంపతులు కాల్పులకు పాల్పడి 14 మందిని హత్యచేసిన విషయం అందరికీ విదితమే. ఈ కాల్పుల ఉదంతాన్ని ఉగ్రవాద చర్యగా ఒబామా అభివర్ణించారు. ఇరాక్, అఫ్ఘానిస్తాన్ దేశాలపై చేసిన తరహాలోనే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఉగ్ర సంస్థలను హెచ్చరించారు. గత వారం కాల్పులకు పాల్పడిన ఆ ముస్లిం దంపతులు సయ్యద్ రిజ్వాన్ ఫరూక్, పాక్‌కు చెందిన అతడి భార్య తష్ఫీన్ మాలిక్ ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారన్న దానిపై అమెరికా వద్ద ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని వివరించారు. ఇటువంటి చర్యలు అమెరికా, పశ్చిమ దేశాలపై జరుగుతున్న ఉగ్రచర్యలుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఐఎస్ఎస్ వద్ద పైప్ బాంబులు, భారీ అణ్వాయుధాలు ఉన్నాయని వీటితో అమాయక ప్రజల ప్రాణాలు తీయడమే వారి లక్ష్యమని బరాక్ ఒబామా ఉద్వేగభరితంగా ప్రసంగించారు. -
ఉగ్రవాదాన్ని ఉరితీసేందుకు..!
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని ఊడ్చిపారేసే దిశగా అడుగులు ప్రారంభమవుతున్నాయి. ఉగ్రవాదులు చేసిన గాయంతో మూలుగుతున్న ఫ్రాన్స్.. వైట్ హౌస్‌పై దాడి చేస్తామని ఐఎస్ హెచ్చరించడంతో తీవ్ర కోపాగ్నిలో ఉన్న అమెరికా ఒక వేదికపైకి రానున్నాయి. త్వరలో వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే భేటీ అవనున్నారు. హోలాండేను వైట్ హౌస్ కు రావాలని ఒబామానే స్వయంగా ఆహ్వానించారు. వారి భేటీలో ప్రధానంగా ఇస్లామిక్ స్టేట్ తోపాటు ఇతర ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలో అనే అంశంతోపాటు పారిస్ లో జరిగిన దాడులకు సంబంధించి ఫ్రాన్స్ జరుపుతున్న దర్యాప్తునకు అమెరికా సహాయం చేయాలనే అంశాన్ని కూడా చర్చించనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ కూడా హాజరుకానున్న ఈ కార్యక్రమం వౌట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులు రాత్రి 10 గంటల ప్రాంతంలో జరగనుంది. -
ఆడపిల్లలను కాపాడాలని అర్థిస్తున్నా: మోదీ
అమ్మాయిలను చదివించండి.. మగపిల్లలతో వారూ సమానమే ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ ప్రారంభంలో మోదీ ఆడశిశువులను గర్భంలోనే చిదిమేసే విష సంస్కృతిని విడనాడాలి.. ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక యాచకుడిగా మీ వద్దకు వచ్చాడు.. ఆడపిల్లల ప్రాణాలను భిక్షమడుగుతున్నాడు.. భ్రూణ హత్యలు, సమాజంలో బాలికలపై చూపుతున్న వివక్ష వంటివన్నీ మానసిక వ్యాధులు.. అది 18 వ శతాబ్దపు ఆలోచనాధోరణి కన్నా దారుణం. పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని తెలియగానే గర్భంలోనే చంపేయడం దారుణం.. దీనికి సహకరిస్తున్న డాక్టర్లు ఆ పాపపు పని ద్వారా సమాజానికి అన్యాయం చేస్తున్నారు.. దీని ద్వారా రాబోయే తరాలు తీవ్రంగా నష్టపోతాయి.. పానిపట్: మరో ప్రజాహిత కార్యక్రమానికి ప్రధాని గురువారం శ్రీకారం చుట్టారు. బాలికాసంక్షేమం, లింగ వివక్ష అంతం లక్ష్యాలుగా ‘బేటీ బచావో.. బేటీ పఢావో’(ఆడపిల్లల్ని కాపాడండి..ఆడపిల్లల్ని చదివించడం)’ పథకాన్ని హరియాణలోని పానిపట్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆడశిశువులను గర్భంలోనే చిదిమేసే విష సంస్కృతిపై నిప్పులు చెరిగారు. ‘ఈ దేశానికి ప్రధాని ఒక యాచకుడిగా మీ వద్దకు వచ్చాడు. ఆడపిల్లల ప్రాణాల్ని భిక్షమడుగుతున్నాడు’ అంటూ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని తెలియగానే గర్భంలోనే చంపేసే దారుణాన్ని తీవ్రంగా తప్పుబడుతూ.. దానికి సహకరిస్తున్న డాక్టర్లు ఆ పాపపు పని ద్వారా సమాజానికి అన్యాయం చేస్తున్నారంటూ ఆక్షేపించారు. ‘మీరు వైద్యవిద్య చదువుకుంది ఆడపిల్లలను గర్భంలోనే చంపేందుకు కాదు. డబ్బు కోసం ఆ దారుణం చేస్తున్నారా? అది సమాజాన్ని మోసం చేయడమే. బాలికల రక్షణ, అభివృద్ధి బాధ్యత సమాజంలో భాగమైన మీకూ ఉంది’ అని డాక్టర్లకు హితవు చెప్పారు. ‘భ్రూణ హత్యలు, లింగ వివక్ష అనే నేరాలు చేస్తూ 18వ శతాబ్దపు మనుషుల కన్నా నీచస్థితిలో ఉన్నామని చెప్పొచ్చు. 18వ శతాబ్దంలో ఆడపిల్లల్ని కనీసం కొన్నాళ్లైనా బతకనిచ్చేవారు. ఇప్పుడు మన బిడ్డల్ని తల్లి గర్భంలో ఉండగానే చంపేస్తున్నాం’ అన్నారు. అయితే, ఏ తల్లి కూడా గర్భంలో ఉండగానే పిల్లల్ని చంపుకోవాలనుకోదని, కుటుంబ ఒత్తిడి, సమాజంలో పరిస్థితులు ఆమెను అందుకు ఒప్పుకునేలా చేస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. స్త్రీ, పురుష నిష్పత్తి అతితక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హర్యానా కూడా ఒకటి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా జన్మించిన గడ్డపై ఎంతోమంది కల్పనాచావ్లాలను పురిట్లోనే చంపేస్తున్నారంటూ ఆవేదన చెందారు. ‘భారతీయ సమాజంలో మగపిల్లలకు మాత్రం ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఆడపిల్లలు పెళ్లి అయిన తరువాత వేరే ఇంటి ఆస్తిగా మారిపోతారనే తప్పు భావన ఉంది. మగపిల్లలైతే వృద్ధాప్యంలో తమను చూసుకుంటారనే అపోహలో ఉంటారు. అదే నిజమైతే.. దేశంలో వృద్ధాశ్రమాలు ఇంతగా పెరిగేవి కావు’ అన్నారు. ‘కూతుళ్లను చదవుకోనివ్వరు. కానీ కోడళ్లు మాత్రం చదువుకున్నవారు కావాలని కోరుకుంటారు. ఇవీ మన సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలు’ అని ఎత్తిపొడిచారు. బాలికల పట్ల సున్నితంగా, సానుకూలంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, సమాజం, కుటుంబం, తల్లిదండ్రులు.. అందరిపై ఉందని మోదీ స్పష్టం చేశారు. ‘హర్యానాలోని మహేంద్రగఢ్, ఝజ్జర్ జిల్లాల్లో బాలబాలికల నిష్పత్తి 1000: 785గా ఉంది. అంటే రానున్న రోజుల్లో 215 మంది మగపిల్లలు అవివాహితులుగా ఉండిపోవాల్సి వస్తుంది’ అన్నారు. అనంతరం లింగవివక్షకు వ్యతిరేకంగా అక్కడున్నవారితో ప్రతిజ్ఞ చేయించారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు మనేకాగాంధీ, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, జేపీ నద్దా, హర్యానా గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ పాల్గొన్నారు. బేటీ పఢావో.. బేటీ బచావో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు చేయనున్నారు. ‘రోజుకు 2వేల భ్రూణ హత్యలు’ దేశవ్యాప్తంగా రోజుకు 2000 మంది ఆడపిల్లల్ని తల్లిగర్భంలోనే చిదిమేస్తున్నారని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ ఆవేదన వెలిబుచ్చారు. పురుష- స్త్రీ నిష్పత్తి కొన్ని రాష్ట్రాల్లో దారుణంగా ఉందని, 1000 మంది బాలురు ఉంటే 840 మంది బాలికలే ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. సుకన్య సమృద్ధి యోజన అదే వేదికపై బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ‘సుకన్య సమృద్ధి యోజన’ను మోదీ ప్రారంభించారు. ఇది పదేళ్ల లోపు బాలికలకు ఎక్కువ వడ్డీ(9.1%), ఆదాయపన్ను రాయితీ లభించే డిపాజిట్ పథకం. పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు కనీసం వెయ్యి రూపాయల డిపాజిట్‌తో బ్యాంకుల్లో కానీ, పోస్టాఫీసుల్లో కానీ అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. అందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షలను డిపాజిట్ చేయొచ్చు. ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్ల పాటు లేదా ఆ బాలిక పెళ్లయేంత వరకు ఆ అకౌంట్ క్రియాశీలంగా ఉంటుంది. బాలికకు 18 ఏళ్లు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం పాక్షికంగా డబ్బును విత్‌డ్రా చేయొచ్చు. బాల్యవివాహాలను అడ్డుకునే లక్ష్యంతో 18 ఏళ్లలోపు విత్‌డ్రాయల్‌ను అనుమతించరు. -
భారత పర్యటనలో ‘కశ్మీర్’ను ప్రస్తావించండి
ఒబామాకు పాక్ ప్రధాని షరీఫ్ వినతి ఇస్లామాబాద్: జనవరిలో భారత్‌లో పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా కశ్మీర్ అంశాన్ని భారత నాయకత్వంముందు ప్రస్తావించాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కోరారు. కశ్మీర్ సమస్యను సత్వరం పరిష్కరించినపుడే, ఆసియాలో దీర్ఘకాలం శాంతి, సుస్థిరత సాధ్యపడతాయని షరీఫ్ అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు తాను జనవరిలో భారత పర్యటనకు వెళ్లనున్నట్టు ఒబామా శుక్రవారం రాత్రి టెలిఫోన్ ద్వారా షరీఫ్‌కు తెలియజేస్తూ, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిస్థితి గురించి షరీఫ్‌తో చర్చించారు. భారత నాయకత్వంతో కశ్మీర్ సమస్యను ప్రస్తావించాలని షరీఫ్ కోరారు. -
సరికొత్త శిఖరాలకు...
-
సరికొత్త శిఖరాలకు...
భారత్, అమెరికా సంబంధాలపై మోదీ, ఒబామా సంకల్పం పౌర అణు సహకార ఒప్పందంపై ముందుకు.. వాషింగ్టన్: ఒకటి అగ్రదేశం. ప్రపంచ రాజకీయాలను, అంతర్జాతీయ సంబంధాలను కోరుకున్న రీతిలో ప్రభావితం చేయగల దేశం..అమెరికా. మరోటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అన్నింటా అంతర్జాతీయ శక్తిగా ఎదగగల సత్తా ఉందని ప్రపంచమంతా భావిస్తున్న దేశం.. భారత్! ఈ రెండు ప్రఖ్యాత ప్రజాస్వామ్య దేశాల శిఖరాగ్ర సమావేశం మంగళవారం వాషింగ్టన్లో జరిగింది. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు, అంతర్జాతీయ అంశాల్లో సహకారాత్మక సంబంధాలను దృఢపర్చుకునేందుకు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆర్థిక రంగంలో సహకారం, వాణిజ్యం, పెట్టుబడులపై అవగాహనకు వచ్చారు. పశ్చిమాసియాలో పరిసితులతో పాటు ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాదాన్ని అంతమొందించే అంశం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చల అనంతరం మోదీ, ఒబామాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విషయంలో కృతనిశ్చయంతో ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఇంధన భద్రత, రక్షణ, మౌలిక వసతులు.. తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నామని, ఆ ఒప్పందం అమలుకు అడ్డుపడుతున్న సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు ఒబామా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నం, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లను స్మార్ట్‌సిటీలుగా తీర్చిదిద్దేందుకు అమెరికా సహకారం అందించనుంది. రక్షణ రంగంలో సహకారాన్ని మరో పదేళ్లు పొడిగించాలని రెండు దేశాలు ఒప్పందానికి వచ్చాయి. సహజ భాగస్వామి యూఎస్: భారత్, యూఎస్‌లు సహజ భాగస్వాములన్న తన విశ్వాసం ఈ పర్యటన ద్వారా మరింత బలపడిందని మోదీ అన్నారు. ‘భారతదేశ లుక్ ఈస్ట్.. లింక్ వెస్ట్ విధానంలో భాగంగా అమెరికాతో సంబంధాలు మాకు చాలా కీలకం’ అన్నారు. ఒబామా కుటుంబాన్ని భారత్‌లో పర్యటించాల్సిందిగా మోదీ ఆహ్వానించారు. అమెరికా, భారత్‌ల ‘మార్స్’ గ్రహ ప్రయోగాలు విజయవంతమైన సందర్భంలో ఈ భేటీ జరగడం సం తోషంగా ఉందన్నారు. ‘అరుణ గ్రహంపై ఇరుదేశాల శిఖరాగ్ర భేటీ అనంతరం ఇక్కడ భూమిపై ఇప్పుడు ఆ దేశాల నేతల సమావేశం జరుగుతోంది’ అని మోదీ చమత్కరించారు. దక్షిణాసియాలో ఉగ్రవాదం, పశ్చిమాసియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని మరిం త దృఢపర్చుకోవాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయన్నారు. లష్కరే తోయిబా, జెఈఎం, డీ కంపెనీ, అల్‌కాయిదా, హఖ్కానీ గ్రూప్.. తదితర ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తున్న ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేసేందుకు రెండు దేశాలు కలసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు. ఆ ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక, వ్యూహాత్మక సాయం అందకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, ఒబామా, మోదీ భేటీ అనంతరం పశ్చిమాసియాలో ఉగ్రవాదంపై పోరాడుతున్న ఏ సంకీర్ణంలోనూ భారత్ చేరబోవడం లేదని భారత అధికారులు స్పష్టం చేయడం గమనార్హం. పౌర అణు విద్యుత్‌కు సంబంధించి అమెరికా సహకారాన్ని భారత్ కోరుతోందన్నారు. డబ్ల్యూటీవోలో భారత్ వైఖరిని ఒబామాకు స్పష్టం చేశానని మోదీ తెలిపారు. భారతదేశ సేవారంగ కంపెనీలను అమెరికా ఆర్థికవ్యవస్థలో భాగం చేయాలని ఒబామాను కోరానని మోదీ చెప్పారు. భారతదేశ జాతీయ డిఫెన్స్ యూనివర్సిటీలో నాలెడ్జ్ పార్ట్నర్గా ఉండేందుకు అమెరికా అంగీకరించిందన్నారు. అఫ్ఘానిస్థాన్‌కు సహకరించే విషయంలో సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించామన్నారు. మోదీకి స్పష్టత ఉంది: ఒబామా మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధికి సంబంధించి మోదీకి స్పష్టమైన ఆలోచనలున్నాయని ప్రశంసించారు. భారత్‌నుంచి పేదరికాన్ని పారద్రోలే విషయంలో మోదీ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. మధ్య ప్రాచ్యంలోని పరిస్థితులపై తామిద్దరం చర్చించామన్నారు. అంతరిక్షం, శాస్త్రీయ పరిశోధనల విషయంలో పరస్పరం సహకరించుకోవాలని, ఎబోలా తరహా సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో మోదీ హిందీలో మాట్లాడగా.. ఆంగ్లంలోకి అనువదించారు. బ్లెయిర్ హౌస్ టు వైట్‌హౌస్: అంతకు ముందు అమెరికా రక్షణ మంత్రి చుక్ హేగెల్ బ్లెయిర్ హౌస్‌లో మోదీతో సమావేశమై రక్షణ సహకారంపై చర్చించారు. తరువాత ఒబామా తో చర్చల కోసం నేరుగా అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌజ్‌లోని వెస్ట్ వింగ్‌కు మోదీ బయలుదేరారు. నలుపురంగు ఎస్‌యూవీలో.. ఇరువైపులా భారత్, అమెరికా జాతీయ జెండా లు రెపరెపలాడుతుండగా.. మోదీ, తన వెంట వచ్చిన మంత్రులు అధికారుల బృందంతో వైట్‌హౌస్‌కి చేరుకున్నారు. -
ఐఎస్ ముప్పును తక్కువ అంచనా వేశాం: ఒబామా
వాషింగ్టన్: సిరియాలో సంక్షోభం వల్ల జిహాదిస్టు మిలిటెంట్లు తిరిగి ఏకమై బలం పుంజుకుంటారన్న విషయాన్ని తాము తక్కువగా అంచనా వేసినట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పారు. ఇరాక్ నుంచి స్థానిక ప్రభుత్వ, అమెరికా బల గాలు తరిమేసిన అల్ కాయిదా ఉగ్రవాదులు సిరి యాలో తిరిగి ఏకమై కొత్తగా ఇస్లామిక్ స్టేట్ గ్రూ పుగా ఏర్పడ్డారని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. -
సిరియాపై దాడి అవసరం