మన పార్కులన్నీ నాశనమవుతున్నాయి: ఒబామా
నేషనల్ పార్క్: ప్రపంచ వాతావరణంపై అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దీని బారిన అమెరికా పడిందని, దాని ఫలితాన్ని అనుభవిస్తోందని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ భవిష్యత్లో ఎదురవనున్న సమస్య అని ఇక అనుకోవాల్సిన అవసరం లేదని, అది ఇప్పటికే ప్రవేశించిన సమస్య అందరు కలిసి ఎదుర్కోవాల్సిన అతిపెద్ద విళయం అని ఒబామా అన్నారు. గ్లోబల్ వార్మింగ్పై ఆయన అమెరికాలోని నేషనల్ పార్క్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
'ఇక ఎలాంటి తప్పు చేయవద్దు. వాతావరణ మార్పు అనేది ఎంతో దూరంలో లేదు. అది ఒక ఎదుర్కోవాల్సిన ప్రమాదం. ఇప్పటికే అమెరికాలోని జాతీయ పార్కులన్నీ దీని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఊహించని విధంగా మంచు కరిగిపోతోంది. ఇది ఇప్పటికే ప్రవేశించిన ప్రమాదం. తప్పక ఎదుర్కోవాలి' అని ఒబామా అన్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా పార్క్ వద్ద తన కుటుంబంతో గడుపుతున్న ఒబామా ఈ ఆందోళన వ్యక్తం చేశారు.