
భారత పర్యటనలో ‘కశ్మీర్’ను ప్రస్తావించండి
ఒబామాకు పాక్ ప్రధాని షరీఫ్ వినతి
ఇస్లామాబాద్: జనవరిలో భారత్‌లో పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా కశ్మీర్ అంశాన్ని భారత నాయకత్వంముందు ప్రస్తావించాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కోరారు. కశ్మీర్ సమస్యను సత్వరం పరిష్కరించినపుడే, ఆసియాలో దీర్ఘకాలం శాంతి, సుస్థిరత సాధ్యపడతాయని షరీఫ్ అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు తాను జనవరిలో భారత పర్యటనకు వెళ్లనున్నట్టు ఒబామా శుక్రవారం రాత్రి టెలిఫోన్ ద్వారా షరీఫ్‌కు తెలియజేస్తూ, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిస్థితి గురించి షరీఫ్‌తో చర్చించారు. భారత నాయకత్వంతో కశ్మీర్ సమస్యను ప్రస్తావించాలని షరీఫ్ కోరారు.