ఉగ్రవాదాన్ని ఉరితీసేందుకు..!
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని ఊడ్చిపారేసే దిశగా అడుగులు ప్రారంభమవుతున్నాయి. ఉగ్రవాదులు చేసిన గాయంతో మూలుగుతున్న ఫ్రాన్స్.. వైట్ హౌస్పై దాడి చేస్తామని ఐఎస్ హెచ్చరించడంతో తీవ్ర కోపాగ్నిలో ఉన్న అమెరికా ఒక వేదికపైకి రానున్నాయి. త్వరలో వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే భేటీ అవనున్నారు. హోలాండేను వైట్ హౌస్ కు రావాలని ఒబామానే స్వయంగా ఆహ్వానించారు.
వారి భేటీలో ప్రధానంగా ఇస్లామిక్ స్టేట్ తోపాటు ఇతర ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలో అనే అంశంతోపాటు పారిస్ లో జరిగిన దాడులకు సంబంధించి ఫ్రాన్స్ జరుపుతున్న దర్యాప్తునకు అమెరికా సహాయం చేయాలనే అంశాన్ని కూడా చర్చించనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ కూడా హాజరుకానున్న ఈ కార్యక్రమం వౌట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులు రాత్రి 10 గంటల ప్రాంతంలో జరగనుంది.