Washington
-
వైట్‌హౌస్‌పై మెలానియా విముఖత
వాషింగ్టన్: ప్రథమ మహిళగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న మెలానియా ట్రంప్.. శ్వేతసౌధంపై మాత్రం విముఖత చూపుతున్నారు. ఈ దఫా ఆమె పూర్తిస్థాయిలో వాషింగ్టన్కు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వైట్‌హౌస్ సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికే ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె తన సమయాన్ని ఎక్కడ? ఎలా? గడుపుతారనే చర్చ నడుస్తోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ఆతిథ్యం ఇచ్చే సంప్రదాయం వైట్‌హౌస్‌లో ఉంది. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్‌ను జో బైడెన్ సైతం ఆహ్వానించారు. ఆ మేరకు ట్రంప్ హాజరయ్యారు. అయితే ప్రథమ మహిళ.. కాబోయే మహిళకు ఇచ్చే విందుకు మాత్రం మెలానియా ట్రంప్ వెళ్లలేదు. జిల్ బైడన్ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు. ఆమె వెళ్ళడం అవసరమని ట్రంప్ బృందంలోని పలువురు సూచించినా మెలానియా నిరాకరించారు. మొదటి పర్యాయంలో పూర్తిస్థాయి వైట్‌హౌస్‌లోనే ఉన్న ఆమె.. ఈసారి మాత్రం స్వతంత్రంగా ఉండటానికే ఆసక్తి చూపుతున్నారనడానికి ఇదో ఉదాహరణ. 2016లో వైట్‌హౌస్ మెలానియాకు కొత్త... కానీ ‘ఈసారి నాకు ఆందోళన అవసరం లేదు. అనుభవం, పరిజ్ఞానం ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందనేది స్పష్టత ఉంది’అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం ఆమె చెప్పారు. కొడుకుకు దగ్గరగా... మెలానియా ట్రంప్.. వచ్చే నాలుగేళ్లలో ఆమె న్యూయార్క్ సిటీ, ఫ్లోరిడాలోని పామ్బీచ్లలో గడపనున్నారని సమాచారం. అయినప్పటికీ ఆమె ప్రధాన కార్యక్రమాలకు హాజరవుతారని, ప్రథమ మహిళగా తనకంటూ సొంత వేదిక, ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు. 2020 తరువాత మెలానియా ట్రంప్ ఫ్లోరిడాలో ఎక్కువ సమయం గడిపారు. అక్కడే జీవితాన్ని, స్నేహితులను పెంచుకున్నారు. అందుకే ఆమె ఎక్కువ సమయం అక్కడే గడిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2016లో కూడా ఆమె వాషింగ్టన్కు వెంటనే వెళ్లలేదు. ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని నెలల తరువాత వైట్‌హౌస్‌కు మారారు. మరోవైపు తన కొడుకు 18 ఏళ్ల బారన్ ట్రంప్ న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుతున్నారు. తన ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలన్నది బారన్ కోరిక. టీనేజ్ కొడుకుకు దగ్గరగా ఉండేందుకు ప్రథమ మహిళ ఆసక్తి చూపుతున్నారని, న్యూయార్క్‌లోనూ ఎక్కువ సమయం గడుపుతారని సన్నిహితులు చెబుతున్నారు. ఒక ప్రథమ మహిళ శ్వేతసౌధంలో ఉండటానికి నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కానీ.. మెలానియా ట్రంప్‌ను చాలాకాలంగా గమనిస్తున్నవారికి ఇది ఆశ్చర్యం కలిగిచడం లేదు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ ఆమె చురుకుగా లేరు. ట్రంప్ తిరిగి పోటీ చేస్తానన్న ప్రకటనకు హాజరయ్యారు. అక్టోబర్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీలోనూ పొడిపొడిగానే మాట్లాడారు. ఎన్నికల రాత్రి పారీ్టలోనూ ఆమె పాల్గొనలేదు. ప్రైవసీకే ప్రాధాన్యత.. పదవి నుంచి వైదొలిగిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ పలు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో పామ్ బీచ్, న్యూయార్క్‌ల మధ్య తన సమయాన్ని గడిపారు. కుటుంబంలోని ఇతర సభ్యులు తరచూ కోర్టులో, ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌తో కలిసి ఉన్నప్పటికీ, మెలానియా ట్రంప్ ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. లారా బుష్, మిషెల్ ఒబామా వంటి ప్రథమ మహిళలు నాలుగేళ్లలో తమకో ప్లాట్‌ఫామ్ నిర్మించుకున్నట్టుగా మెలానియా ట్రంప్ చేయలేదు. ప్రైవసీని కోరుకున్నారు. రిపబ్లికన్ల రాజకీయ నిధుల సేకరణలో ఒక్కసారి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. జూలైలో డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి ఓ లేఖ రాశారు. ‘హింసను ప్రేరేపించే ద్వేషం, విద్వేషాలకు అతీతంగా ఉండండి. కుటుంబమే ప్రథమం. ప్రేమమయమైన ప్రపంచాన్ని మనమందరం కోరుకుందాం’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక అబార్షన్ హక్కుల విషయంలో భర్త ట్రంప్‌తో విభేదించారు. గత అక్టోబర్‌లో.. ‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నేను పరిరక్షించే ప్రాథమిక సూత్రం. నిస్సందేహంగా, మహిళలందరికీ పుట్టుకతోనే ఉన్న ఈ ముఖ్యమైన హక్కు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’అని ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై తన వైఖరి భర్త డోనాల్డ్ ట్రంప్‌కు తెలుసని, ఆయన ఏమాత్రం ఆశ్చర్యపోలేదని ఆ తరువాత మీడియాతో చెప్పారు. మెలానియా ట్రంప్ తన భర్తతో రాజకీయంగా చాలా సన్నిహితంగా ఉంటున్నారని, సంప్రదాయ దృక్పథంతో సమస్యలపై మాట్లాడుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నా.. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. -
నింగిలోకి దూసుకెళ్లిన కలప ఉపగ్రహం
వాషింగ్టన్: అత్యంత కఠినమైన లోహాలతో రూపొందిన కృత్రిమ ఉపగ్రహాలు కాలంచెల్లాక కక్ష్యల్లో స్పేస్‌జంక్‌గా పోగుబడుతున్న నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా కలపను భవిష్యత్తులో వాడే ఉద్దేశ్యంతో జపాన్ శాస్త్రవేత్తలు కలపతో ఉపగ్రహాన్ని తయారుచేశారు. ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారైన ‘లిగ్నోశాట్’ఉపగ్రహం అమెరికాలోని నాసా వారి కెన్నడీ అంతరిక్షప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ఎక్స్ రాకెట్ లో నింగిలోకి దూసుకుపోయి ందని క్యోటో వర్సిటీ హ్యూమన్ స్పేసాలజీ సెంటర్ మంగళవారం ప్రకటించింది. కేవలం అరచేయి సైజులో 10 సెంటీమీటర్ల వృత్తాకార పరిమాణంలో ఈ బుల్లిశాటిలైట్ను తయారుచేశారు. ఒక కంటైనర్‌లో అమర్చి పంపారు. త్వరలో ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకోంది. కొద్దిరోజుల విరామం తర్వాత దీనిని ఐఎస్ఎస్ బయట ప్రవేశపెట్టనున్నారు. ఆరునెలలపాటు ఇది తన కక్ష్యలో తిరగనుంది. శూన్యంలో రోదసీ వాతావరణంలో కలప ఏ మేరకు మన్నికగా ఉంటుందనే విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ప్రతి 45 నిమిషాలకు ఇది రోదసీలో చీకటి మొదలు తీక్షణమైన సూర్యరశ్ని దాకా అంటే మైనస్ 100 డిగ్రీ సెల్సియస్ నుంచి 100 డిగ్రీ సెల్సియస్దాకా భిన్న ఉష్ణోగ్రతలను తట్టుకోవాల్సి ఉంటుంది. కలపను దహించే ఆక్సిజన్ వంటి వాయువులు శూన్యంలో ఉండవుకాబట్టి అక్కడ కలప ధృఢంగా ఉండగలదని జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయ అటవీశాస్త్ర ప్రొఫెసర్ కోజీ మురాటా వాదిస్తున్నారు. ఖడ్గం పిడి, ఒరగా వాడే మంగోలియా జాతి హొనోకీ చెట్టు కలపను ఈ శాటిలైట్ తయారీలో వాడారు. జపాన్ సంప్రదాయక కళతో ఎలాంటి నట్లు, బోల్ట్‌లు, జిగురు వాడకుండానే లిగ్నోశాట్‌ను సిద్ధంచేశారు. కాలం చెల్లిన శాటిలైట్ తిరిగి భూవాతావరణంలోకి వచ్చేటపుడు ప్రమాదకర అల్యూమినియం ఆక్సైడ్ అణువులను వెలువరుస్తుంది. అదే కలప శాటిలైట్‌తో పర్యావరణానికి, కమ్యూనికేషన్ కక్ష్యలకు ఎలాంటి సమస్యలు ఉండవని క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట కలపశాటిలైట్ మన్నిక బాగుందని తేలితే భవిష్యత్తులో చంద్రుడు, మార్స్‌పై వ్యోమగాముల ఆవాసాలకు కలపను విరివిగా వాడే అవకాశముంది. ఐఎస్ఎస్ నుంచి సరకుల రాకపోకల్లోనూ కంటైనర్లకు కలపను వాడే వీలుంది. -
అబార్షన్ మా హక్కు
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అబార్షన్ హక్కుల కోసం డిమాండ్ పెరుగుతోంది. వేలాది మంది మహిళలు రాజధాని వాషింగ్టన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో శనివారం ర్యాలీలతో హోరెత్తించారు. వాషింగ్టన్ వీధుల్లో నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. పురుషులు కూడా నిరసనల్లో పాలుపంచుకున్నారు. అధ్యక్షుడి ఎన్నిక కోసమే కాకుండా అబార్షన్ హక్కుల సవరణల బ్యాలెట్‌పైనా ఓటేయాలని ప్రజలను కోరారు. వాషింగ్టన్లో జరిగిన విమెన్స్ మార్చ్‌లో స్త్రీవాద ఉద్యమకారిణి ఫన్నీ గోమెజ్ లూగో అబార్షన్ బ్యాలెట్ ఉన్న 10 రాష్ట్రాల జాబితాను చదివి వినిపించారు. మిస్సోరీలోని కాన్సాస్ సిటీలో జరిగిన ర్యాలీలో అబార్షన్ హక్కుల చట్టం కోసం ప్రజలు సంతకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. డెమొక్రటిక్ అభ్యరి్థగా హారిస్ బరిలోకి దిగినప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో 30 ఏళ్ల లోపు మహిళల అబార్షన్ హక్కులు ప్రధానాంశంగా మారాయి. అబార్షన్ హక్కును రద్దు చేసి, దానిపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకు వదిలేస్తూ 2022లో అమెరికా సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుకు నిరసనగా కార్యక్రమాలు పెరిగాయి. -
ఘనంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
Sai Priyanka pagadala: అమ్మలాంటి అన్నదాత కోసం...
తల్లి తన ఆకలి గురించి పట్టించుకోదు. పిల్లల కడుపు నిండిందా లేదా అనేదే ఆమెకు ముఖ్యం. రైతులు కూడా అమ్మలాంటి వారే. అందుకే వారిపై దృష్టి పెట్టింది సాయిప్రియాంక. తాను పండించే పంటల ద్వారా ఎంతోమందికి పోషకాహార శక్తిని అందిస్తున్న రైతు ఆ శక్తికి ఎంత దగ్గరలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు... అనే ఆసక్తితో పరిశోధన బాట పట్టింది. తన పరిశోధన అంశాలను కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో వివరించడానికి సిద్ధం అవుతోంది.సాయిప్రియాంక చదువుకున్నది పట్టణాల్లో అయినా ఆమెకు పల్లెలు అంటేనే ఇష్టం. పల్లెల్లో పచ్చటి పొలాలను చూడడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తికి కారణం అయింది. ఆ ఆసక్తే తనను ‘అగ్రికల్చరల్ సైంటిస్ట్’ను చేసింది.ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) అనేది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. పోషకాహార లోపానికి సంబంధించి పరిశోధన ఆధారిత పరిష్కారాలను అందించే సంస్థ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో కలిసి ఈ సంస్థ ‘డెలివరింగ్ ఫర్ న్యూట్రిషన్ ఇన్ సౌత్ ఏషియా: కనెక్టింగ్ ది డాట్స్ ఎక్రాస్ సిస్టమ్స్’ అనే అంశంపై కొలంబోలో డిసెంబర్ 3,4,5 తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విధానకర్తలు, పరిశోధకులను ఏకతాటిపై తీసుకు వస్తోంది.మన దేశం నుంచి ఆరుగురు ప్రతినిధులు ఈ ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో పాల్గొనబోతున్నారు. వారిలో సాయి ప్రియాంక ఒకరు. తన పరిశోధనకు సంబంధించిన అంశాలను ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రియాంక వివరించనుంది. ప్రత్యేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్, అర్జున్ నాయక్ తాండా, బిడకన్నె గ్రామాలకు వ్యవసాయ పరంగా ప్రత్యేకత ఉంది. వీటిని ‘ప్రత్యేక గ్రామాలు’ అనుకోవచ్చు. కొర్రలు, సామలు, ఊదలులాంటి సిరిధాన్యాలతో పాటు సుమారు 20 రకాల ఆకుకూరలు సాగు చేస్తుంటారు అక్కడి రైతులు. రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పంటలను పండిస్తున్నారు. దక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)లాంటి సంస్థల ప్రోత్సాహంతో ఈ గ్రామాల్లోని రైతులు పౌష్టికాహారాన్ని ఇచ్చే ప్రత్యేక పంటలు సాగు చేస్తున్నారు.పత్తి, సోయా, చెరుకు లాంటి వాణిజ్య పంటలు సాగు చేసే గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతోందనే అంశంపై ఎంతోమంది రైతులతో మాట్లాడింది సాయిప్రియ.‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజెస్’ పేరుతో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. రైస్, పప్పులులాంటి ఒకేరకమైన ఆహారంతో పాటు ఆకు కూరలు, సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆ మూడు గ్రామాల ప్రజలు మెరుగైన పౌష్టికాహారం పొందగలుగుతున్నారని ఆమె పరిశోధనల్లో తేలింది. ఈ గ్రామాలతో పాటు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామాల్లో కూడా పరిశోధనలు చేస్తోంది.ఐఏఆర్ఐలో పీహెచ్డీఖమ్మం పట్టణానికి చెందిన పగడాల సాయి ప్రియాంక పదో తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్ విజయవాడలో చదువుకుంది. తల్లిదండ్రులు రాజరాజేశ్వరి, నర్సింహరావులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ‘డాక్టర్ కావాల్సిందే’ ‘ఇంజనీర్ కావాల్సిందే’లాంటి సగటు తల్లిదండ్రుల ఆలోచనకు దూరంగా కూతురుకి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు.వ్యవసాయ పరిశోధనపై ఎంతో ఆసక్తి ఉన్న సాయి ప్రియాంక అశ్వారావుపేటలో బీఎస్సీ అగ్రికల్చర్, మేఘాలయలోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డీ చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది.‘ఇవి మాత్రమే మనం చేరుకోవాల్సిన గమ్యాలు’ అని యువతరం ఒకే వైపు దృష్టి సారించినప్పుడు ఎన్నో రంగాలు మూగబోతాయి. ఆ రంగాలలో పరిశోధనలు ఉండవు. ప్రగతి ఉండదు. విభిన్న ఆలోచనలు ఉన్న సాయిప్రియాంక లాంటి అమ్మాయిలు తాము కొత్త దారిలో ప్రయాణించడమే కాదు ‘మనం ప్రయాణించడానికి, అన్వేషణ కొనసాగించడానికి ఒకే దారి లేదు. ఎన్నో దారులు ఉన్నాయి’ అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఈ కోణంలో సాయిప్రియాంక ‘కృషి’ యువతరంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.సంతోషంగా ఉంది‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజ్’ అనే ్రపాజెక్ట్పై మూడు ప్రత్యేక గ్రామాల్లో నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లాంటి వాటి ఆధారంగా ఈ గ్రామాల్లో ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్‌ను తయారు చేస్తున్నాము. ఇతర గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లో కాస్త మెరుగైన పౌష్టికాహారం అందుతోంది. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.– సాయి ప్రియాంక, వ్యవసాయ శాస్త్రవేత్త పాత బాల ప్రసాద్, సాక్షి, సంగారెడ్డి -
హారిస్‌కే డెమొక్రాట్ల ఓటు
వాషింగ్టన్: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైంది. అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1,976 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఆమెకు మద్దతు తెలిపారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు అనధికారికంగా ఖరారు కావడంతో ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఆమె ఎవరిని ఎన్నుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. డెలావెర్‌లోని ప్రచార ప్రధాన కార్యాలయాన్ని హారిస్ సోమవారం సందర్శించారు.అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం హారిస్ మొదటిసారి రోజంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బైడెన్ ప్రచారం బృందంతో ఆమె సమావేశమయ్యారు. అదే బృందంతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 106 రోజులే ఉన్నాయని, గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. తన రిపబ్లికన్ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై హారిస్ విరుచుకుపడ్డారు.ఆయన కుంభకోణాలను గుర్తు చేశారు. నేరాలను ఎత్తి చూపారు. మహిళలను వేధించిన మృగం, మోసగాడు, తన స్వార్థ ప్రయోజనాలకోసం నియమా లను ఉల్లంఘించిన వ్యక్తని విమర్శించారు. ‘ట్రంప్ ఏ రకమో నాకు తెలుసు’ అంటూ ఎద్దేవా హారిస్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి పనిచేయడం తనకు దక్కిన ఒక గొప్ప గౌరవమన్నారు.ఆయన అమెరికా ప్రజలకోసం నిరంతరం శ్రమించారని కొనియాడారు. ఇక కరోనా బారినపడి ఐసోలేషన్‌లో ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లైన్లో సమావేశంలో పాల్గొన్నారు. కమలా హారిస్‌ను గెలిపించడానికి పనిచేయాలని డెమొక్రాట్లకు విజ్ఞప్తి చేశారు. తాను కోలుకోగానే ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. ట్రంప్‌పై విరుచుకుపడిన హారిస్.. ఇక హారిస్‌కు 40 మందికి పైగా డెమొక్రటిక్ సెనేటర్లు, దాదాపు 100 మంది హౌస్ సభ్యుల మద్దతు ఉంది. అత్యంత కీలకమైన మలుపు మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సైతం హారిస్‌కు మద్దతు పలకడం. అంతేకాదు కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్, కాంగ్రెషనల్ హిస్పానిక్ కాకస్, కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్తోపాటు సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్, అమెరికన్ ఫెడరేష ఆఫ్ టీచర్స్ అనే రెండు కీలక కార్మిక సంఘాలు సైతం ఆమెకు మద్దతు తెలుపుతున్నాయి.ఉపాధ్యక్ష రేసులో కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్, యుఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ పీట్ బుట్టిగీగ్, నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్, అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, ఇల్లినాయిస్ గవర్నర్ జె.బి. ప్రిట్జ్కర్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఉండొచ్చని భావిస్తున్నారు. -
హెడ్, స్మిత్ మెరుపులు.. సూపర్ కింగ్స్ చిత్తు
మేజర్ లీగ్ క్రికెట్-2024 టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. డల్లాస్ వేదికగా టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో వాషింగ్టన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వాషింగ్టన్ బ్యాటర్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.హెడ్ కేవలం 22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేయగా.. స్మిత్ 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 రన్స్ చేశాడు. వీరిద్దరితో పాటు మాక్స్వెల్(34), పియెనార్(33) పరుగులతో రాణించారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు, బ్రావో రెండు వికెట్లు పడగొట్టాడు. తిప్పేసిన స్పిన్నర్లు..అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 164 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో సత్తాచాటగా.. జస్దీప్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్ తలా మూడు వికెట్లు పడగొట్టి సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించారు. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్ 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
మేజర్ లీగ్ క్రికెట్-2024లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫ్రాంచైజీకి హెడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లీగ్‌లో భాగంగా శనివారం ఉదయం టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో హెడ్ విధ్వంసం సృష్టించాడు.సూపర్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. తొలి ఓవర్ నుంచే సూపర్ కింగ్స్ బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో హెడ్ కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వాషింగ్టన్ బ్యాటర్లలో హెడ్‌తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్(57), ఓబుస్ పియెనార్(33) పరుగులతో రాణించారు.అసలేంటి ఈ మేజర్ లీగ్ క్రికెట్?తమ దేశంలో క్రికెట్‌ను అభివృద్ది చేసేందుకు అమెరికా క్రికెట్ ఆసోయేషిన్ ఈ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీని ప్రారంభించింది. తొట్ట తొలి సీజన్ గతేడాది జూలై 13 నుంచి 30 వరకు జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ రెండో సీజన్. మొత్తం ఈ క్రికెట్ లీగ్‌లో ఆరు జట్లు పాల్గోంటున్నాయి.ఇందులో సీటెల్ ఓర్కాస్, ఎంఐ న్యూయర్క్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇందులో ఎంఐ న్యూయర్క్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్ ఫ్రాంజైలు ఐపీఎల్ యాజమాన్యంకు సంబంధించినవే గమనార్హం. -
అమెరికాలో మరో రెండు వీసా దరఖాస్తు కేంద్రాలు
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం సియాటెల్‌లో కొత్తగా రెండు వీసా, పాస్‌పోర్టు కేంద్రాలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. పసిఫిక్ తీరంలోని 9 వాయవ్య రాష్ట్రాల్లో ఉండే సుమారు 5 లక్షల మంది భారత సంతతి ప్రజల అవసరాలను ఇవి తీరుస్తాయని సియాటెల్‌లోని భారత కాన్సుల్ జనరల్ ప్రకాశ్ గుప్తా చెప్పారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్, బెల్వ్యూల్లో శుక్రవారం వీసా, పాస్‌పోర్టు కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇటీవలే సియాటెల్‌లో భారత కాన్సులేట్ ఏర్పాటైంది. అలాస్కా, ఇడహో, మొంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, ఒరెగాన్, సౌత్ డకోటా, వాషింగ్టన్, వ్యోమింగ్ రాష్ట్రాలు ఈ కాన్సులేట్ పరిధిలోకి వస్తాయి. న్యూయార్క్, అట్లాంటా, షికాగో, హూస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో ఐదు చోట్ల ఇప్పటికే భారత కాన్సులేట్లు నడుస్తున్నాయి. భారత ప్రభుత్వం తరఫున వీటిని వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ నిర్వహిస్తోంది. -
భారత్–రష్యా సాన్నిహిత్యం
దౌత్య ప్రపంచంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. పర్యటనలైనా, ప్రసంగాలైనా, సమావేశాలైనా, ఒప్పందాలైనా– దేశాల ప్రయోజనాలతో ముడిపడివుంటాయి. సమయం, సందర్భం తప్పనిసరిగా ఉంటాయి. తమ ఆలోచనలేమిటో నిక్కచ్చిగా చెప్పడం కూడా వీటి ఉద్దేశం కావొచ్చు. ప్రధాని మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాక తన తొలి విదేశీ పర్యటన కోసం ఇరుగు పొరుగు దేశాలను సందర్శించే ఆనవాయితీని పక్కనబెట్టి రష్యాను ఎంచుకున్నారు. రెండు రోజుల ఆ పర్యటన మంగళ వారం ముగియబోతుండగా అమెరికా ప్రాపకంతో 75 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన సైనిక కూటమి నాటో వజ్రోత్సవాలు వాషింగ్టన్లో మొదలయ్యాయి. ఇవి మూడురోజులపాటు సాగుతాయి. రష్యా పూర్వరూపమైన సోవియెట్ యూనియన్‌కు వ్యతిరేకంగా నాటో ప్రారంభమైంది. కనుక మోదీ రష్యా పర్యటన సహజంగానే అమెరికాకు కంటగింపుగా ఉండొచ్చు. ఈ పర్యటన ‘శాంతి ప్రయత్నాలకు’ తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. పైగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత అత్యంత క్రూరుడైన నేరగాణ్ణి హత్తుకోవటం ఏమిటని విమర్శించారు. జెలెన్స్కీ చెబుతున్న శాంతి ప్రయత్నాలేమిటో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా రష్యాను ఎదుర్కొనటానికి యుద్ధం మొదలైననాటి నుంచీ ఉక్రెయిన్‌కు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఎడాపెడా ఆయుధాలు, డబ్బు సరఫరా చేయటం. అందువల్లే ఆ ఘర్షణ ఎడతెగకుండా సాగుతోంది. ఇందులో శాంతి ప్రసక్తి ఎక్కుడుందో అర్థంకాదు. రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ఖండించాల్సిందే. కానీ ఇందులో ఉక్రెయిన్ బాధ్యత కూడా ఉంది. దాని సంగతలావుంచితే భారత–రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధానంగా మోదీ రష్యా వెళ్లారు. ఈ సందర్భంగా వివిధ ఒప్పందాలు కూడా కుదిరాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా అందజేశారు. అయితే మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కియూవ్‌లో ఒక ఆసుపత్రిపై జరిగిన క్షిపణి దాడిలో 37 మంది చనిపోయిన ఉదంతాన్ని ఖండించటానికి మోదీ వెనకాడలేదు. రష్యాతో మనకున్న మైత్రి ఈనాటిది కాదు. ఆ మైత్రికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. మోదీ అన్నట్టు రష్యా అన్ని కాలాల్లోనూ దృఢంగా మన వెనక నిలబడింది. స్నేహ హస్తం అందించింది. 1971లో పాకిస్తాన్‌తో మనకు యుద్ధం వచ్చినప్పుడు అన్నివిధాలా ఆదుకుంది. ఆ యుద్ధంలో మనం సాధించిన విజయంలో సోవియెట్ పాత్ర కీలకమైనది. మన అమ్ములపొదిలో ఉన్న రక్షణ పరికరాల్లో అత్యధిక భాగం ఆ దేశం నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇది కేవలం కొనుగోలుదారు– అమ్మకందారు సంబంధం కాదు. పరిశోధన, అభివృద్ధితో మొదలెట్టి ఉమ్మడి ఉత్పత్తుల వరకూ ఇరు దేశాలూ సహకరించుకుంటున్నాయి. మనకున్న రెండు విమానవాహక నౌకల్లో ఒకటి రష్యానుంచి వచ్చినదే. ఇంకా ఎస్–400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ, మిగ్–29, ఎస్‌యూ–30 ఎంకెఐ యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లు, ఏకే–203 రైఫిళ్లు, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు తదితరాలున్నాయి. ఇవిగాక తన టీ–90 శతఘ్నుల ఉత్పత్తికి మనకు అనుమతులిచ్చింది. విడి భాగాల దగ్గర్నుంచి నూతన పరిశోధనల వరకూ మన రక్షణ వ్యవస్థ పూర్తిగా రష్యాతో ముడిపడివుంది. అణు విద్యుత్ కర్మాగారాల స్థాపన, నిర్వహణలో తోడ్పడుతోంది. ఇరవై అయిదేళ్ల క్రితం మనకు అమెరికాతో కూడా సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి కూడా మనం రక్షణ పరికరాలు కొనుగోలు చేస్తున్నాం. మనను రష్యాకు దూరం చేయాలని ఆది నుంచీ అమెరికా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాకైతే ఇది మరింతగా పెరిగింది. ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి వంటి అంతర్జాతీయ సంస్థల్ని బేఖాతరుచేసి ఘర్షణలు నివారించే పేరుమీద అమెరికా ఒక పక్షాన్ని సమర్థించటం, అవతలిపక్షంతో ఎవరూ సాన్నిహిత్యం నెరపకూడదని ఫర్మానా జారీచేయటం ఆశ్చర్యకరం. వాస్తవా ధీన రేఖ వద్ద చైనాతో మనకు అయిదేళ్లుగా లడాయి నడుస్తోంది. ఆ దేశంతో ఘర్షణలు వస్తే మనకు రష్యా నుంచి రక్షణ పరికరాలు, విడిభాగాలు అత్యవసరమవుతాయి. అంతేకాదు... రక్షణ సాంకేతి కతలు చైనాకు పోకుండా చూడటం మనకు ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రయోజనాలూ వదులుకుని తాను చెప్పినట్టల్లా నడుచుకోవాలని అమెరికా భావించటం ఎంతమాత్రం సరికాదు. పాకిస్తాన్‌తో మనకున్న సమస్యల విషయంలో ఏనాడూ అమెరికా సానుభూతిగా లేదు. కంటితుడుపు చర్యలు తీసుకోవటం, ఏదో వంకన ఆ దేశానికి సైనిక, ఆర్థిక సాయం అందించటం అమెరికాకు రివాజుగా మారింది. మనం మాత్రం తన ఫర్మానాలు పాటించాలని ఆ దేశం ఆశిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యా నుంచి ముడి చమురు దిగుమతి వద్దన్న అమెరికా ఒత్తిడిని కాదని, రోజుకు 21 లక్షల బ్యారెళ్ల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాం. చౌకగా లభించే ఆ ముడి చమురు వల్ల మనం లాభపడటం మాట అటుంచి ప్రపంచ చమురు మార్కెట్ స్థిరత్వం సాధించింది. వర్తమాన సంక్లిష్ట పరిస్థితుల్లో రష్యాతో సాన్నిహిత్యం ఇబ్బందికరమే అయినా, దేశ ప్రయోజనాల రీత్యా దాన్ని కొనసాగించాలనుకున్న మన దేశ వైఖరి మెచ్చదగినది. ఏదేమైనా రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలను మూడో దేశం ప్రభావితం చేయాలనుకోవటం, వాటిని తెంచుకోవాలని ఒత్తిడి తీసుకురావటం మంచి సంప్రదాయం కాదు. తన పర్యటన ద్వారా అమెరికాకు ఈ సంగతిని స్పష్టం చేసిన ప్రధాని మోదీ చర్య ప్రశంసించదగ్గది. -
అమెరికాలో దంచికొడుతున్న వర్షాలు.. నీటి మునిగిన కౌంటీలు
వాషింగ్టన్: అమెరికాలోని అయోవా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా చాలా కౌంటీలు నీటముగిగాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో బయటకు తీసుకువచ్చేందకు ప్రయత్నాలు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. అయోవా రాష్ట్రంలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, కౌంటీల్లో వరద నీరు చేరుతుండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, దాదాపు 4,200 మంది జీవించే రాక్‌వ్యాలీ ప్రాంతంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సమీపంలోని రాక్ నది పొంగిపొర్లుతోంది. దీంతో సైరన్లు మోగించి, ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీరు కారణంగా ప్రజలకు తాగునీరు కూడా అందుబాటులో లేకుండాపోయింది. Floods in Iowa prompted evacuations due to heavy rain, with Rock Valley facing severe infrastructure strain. Governor Kim Reynolds declared a disaster in 21 counties, including Sioux County. South Dakota declared an emergency as Canton received significant rainfall.… pic.twitter.com/F4WNXcD3iQ— Breaking News (@TheNewsTrending) June 23, 2024 మరోవైపు.. వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రప్పించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అయితే బాధితుల వద్దకు బోట్లు చేరుకోగలగడంతో హెలికాప్టర్లు వెనుదిరిగాయి. ఇక్కడ ఉన్న 21 కౌంటీల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. సియూక్స్ కౌంటీ మొత్తం జలమయమైంది. ఎక్కడా వీధులు కనిపించడంలేదు. ఇళ్ల పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక సౌత్ డకోటా రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోవైపు.. రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో సోమ, మంగళవారాల్లో ఇక్కడి నదులకు భారీగా వరద రావచ్చని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. 1936 తర్వాత ఆ స్థాయిలో వేడిని చవిచూస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో 37.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రిచ్మాండ్, వర్జీనియా, ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ, కొలంబస్, ఒహాయో, డెట్రాయిట్లో వేడి 32 డిగ్రీలు దాటింది. దీంతో, ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
‘మోదీ పాక్‌తో వాణిజ్య సంబంధాలు ప్రారంభిస్తారని ఆశిస్తున్నా’
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా శక్తిమంతమైన నాయకుడని ప్రముఖ పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ ప్రసంశలు కురిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ.. భారత్‌ను చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన మూడోసారి కూడా ప్రధాని అవుతారు. ప్రధాని మోదీ భారత్‌కే కాకుండా ప్రపంచానికి కూడా మంచి చేస్తున్నారు. అందుకే మోదీ వంటి నాయకుడు పాకిస్తాన్‌కు కావాలి. పాక్‌తో మోదీ వాణిజ్య సంబంధాలు ప్రారంభిస్తారని ఆశిస్తున్నా.ప్రశాంతంగా ఉండే పాకిస్తాన్ భారత్‌కు కూడా మంచిదే. ఎక్కడ చూసిన మోదీ మళ్లీ ప్రధాని అవుతారని వినిపిస్తోంది. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మోదీ ప్రజాదరణ చాలా అద్భుతం. భవిష్యత్తులో భారత్ ప్రజాస్వామ్యం నుంచి చాలా నేర్చుకుంటారు.పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇక.. పీఓకేలో విద్యుత్ చార్జీల పెరగుదల కారణంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే మార్గాలను పాక్ వెతకటం లేదు. ఎగుమతులను పెంచటం. ఉగ్రవాదాన్ని నియంత్రణ చేయటం. శాంతి భద్రతలను మెరుగుపరటంలో చొరవ చూపటం లేదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి సరైన నాయకత్వం కావాలని కోరుకుంటున్నా’అని సాజిద్ తరార్ తెలిపారు. -
మాక్స్వెల్ కీలక నిర్ణయం.. ఆ టోర్నీలో ఆడేందుకు ఒప్పందం
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కానున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజన్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ తరపున మాక్స్వెల్ ఆడనున్నాడు. ఈ మెరకు వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టులో తన సహచర ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్లు సైతం చేరారు. తాజాగా మాక్సీ కూడా జతకట్టడంతో వాషింగ్టన్ ఫ్రాంచైజీ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కాగా ఐపీఎల్-2024 సీజన్ మధ్య నుంచి మాక్స్వెల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. మానసికంగా, శారీరకంగా బాగా ఆలిసిపోయానంటూ మాక్స్వెల్ తాత్కాలిక విరామం తీసుకున్నాడు. ఈ లీగ్‌లో ఆర్సీబీ జట్టుకు తన అవసరం ఎప్పుడొచ్చినా బలంగా తిరిగొస్తానని మాక్స్వెల్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో మాక్సీ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ, ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడిన మాక్స్వెల్ కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. మూడు సార్లు డకౌట్లు అయ్యాడు. ఇక యూనైటడ్ స్టేట్స్ నిర్వహిస్తున్న ఈ మేజర్ లీగ్ క్రికెట్ రెండో సీజన్ జూలై 4నుంచి ప్రారంభం కానుంది. -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద నిప్పంటించుకొని ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి మృతి
వాషింగ్టన్: గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు నిరసన తెలుపుతూ నిప్పంటించుకున్న అమెరికా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి మరణించాడు. సోమవారం ఈ విషయాన్ని పెంటాగన్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ఎంబసీ ముందు మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఇజ్రాయెల్ ఎంబసీ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తి తనకు తాను నిప్పు పెట్టుకోవటం వల్ల మంటల్లో చిక్కుకున్నాడు. మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది... అతనికి తీవ్రమైన గాయాలు కావటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్స అందిస్తున్న సమయంలో అతను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. Hazmat crews arrive at Israeli Embassy for a suspicious vehicle after a man lit himself on fire pic.twitter.com/YDIrc9o5gp — Andrew Leyden (@PenguinSix) February 25, 2024 ‘పాలస్తీనాను విడిచిపెట్టండి’.. ‘మారణహోమంలో పాలుపంచుకోవద్దు’.. అంటూ నినాదాలు చేస్తూ సదరు వ్యక్తి తనకు తాను నిప్పంటించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియా వైరల్‌గా మారింది. దీంతో అమెరికా ఎయిర్ ఫోర్స్ స్పందించి.. నిరసన తెలుపుతూ నిప్పుపెట్టుకొని మృతి చెందన వ్యక్తి తమ డిపార్టుమెంట్‌కు చెందిన ఆరోన్ బుష్నెల్ అని గుర్తించారు. అయితే అతను ఎయిర్ ఫోర్స్‌లో ఏ స్థాయికి చెందని ఉద్యోగి, ర్యాంక్ ఏంటి? వంటి వివరాలు తెలియజేడానికి నిరాకరించింది. మరోవైపు.. ఇజ్రాయెల్ ఎంబసీకి సంబంధించిన సిబ్బందికి ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎంబసీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అతను గుర్తు తెలియని వ్యక్తి అని తెలిపారు. -
వాషింగ్టన్ ఇజ్రాయెల్ ఎంబసీ.. యూఎస్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
వాషింగ్టన్: అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఒకరు వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు తాను మంటలంటించుకున్నాడు. మంటల్లో కాలుతూ ఫ్రీ పాలస్తీనా అని నినాదాలు చేశాడు. మంటలంటించుకునే మందు అతడు మాట్లాడుతూ ‘గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంలో ఇక ఏ మాత్రం నేను భాగం కాను. ఇందుకే నిరసనగా ఆత్మహత్య చేసుకుంటున్నాను’అని చెప్పాడు. ఈ వీడియో ట్విట్చ్ ప్లాట్ఫామ్లో ప్రత్యక్ష ప్రసారమైంది. వెంటనే అధికారులు వీడియోను డిలీట్ చేయించారు. ఘటన అనంతరం మంటలార్పి ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. యూనిఫాం వేసుకుని తనను తాను కాల్చుకున్న వ్యక్తి అమెరికాలోని టెక్సాక్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అని అధికారులు నిర్ధారించారు. Hazmat crews arrive at Israeli Embassy for a suspicious vehicle after a man lit himself on fire pic.twitter.com/YDIrc9o5gp — Andrew Leyden (@PenguinSix) February 25, 2024 ఇదీ చదవండి.. దుస్తులపై వివాదం.. మహిళపై మూకదాడికి యత్నం -
అమెరికా వైట్‌హౌజ్ గేటుపైకి దూసుకెళ్లిన కారు
వాషింగ్టన్: అమెరికా వైట్‌హౌజ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. శ్వేత సౌధం కాంప్లెక్స్ బాహ్య ద్వారంపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో వైట్‌హౌజ్ కాంప్లెక్స్ వద్ద కారు ప్రమాదం జరిగినట్లు యూఎస్ సిక్రెట్ సర్వీస్ పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి.. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని సిక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. #WATCH | Washington, DC: A vehicle crashed into a gate of the White House complex on January 8. A driver was taken into custody as 'the cause and manner' of the incident is being investigated, reports Reuters citing the US Secret Service. (Source: Reuters) pic.twitter.com/WHt5ilnbWc — ANI (@ANI) January 9, 2024 ఇక.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కాన్వాయ్‌ను గుర్తుతెలియని వ్యక్తి కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో జోబైడెన్, జిల్ బైడెన్ క్షేమంగా బయటపడ్డారని యూఎస్ సిక్రెట్ సర్వీస్ పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: India-Maldives Row:మాల్దీవుల వివాదం: ద్వేషాన్ని భారత్ అస్సలు సహించదు -
టెట్రిస్ గేమ్‌ను జయించిన బాలుడు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా వీడియోగేమ్ ప్రియులకు చిరపరిచితమైన టెట్రిస్ గేమ్‌ను 13 ఏళ్ల అమెరికన్ టీనేజర్ ఎట్టకేలకు మొత్తం పూర్తిచేశాడు. ఈ గేమ్ విడుదలైన దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. చివరి 157వ లెవల్ దాకా ఆడి చరిత్ర సృష్టించాడు. ఓక్లహామాకు చెందిన ఈ బుల్లోడి పేరు విల్లీస్ గిబ్సన్. తాను సాధించిన రికార్డు చూసి తెగ సంబరపడిపోతున్నాడు. ‘మొదటిసారి ఆట మొదలెట్టినపుడు దీన్ని పూర్తి/క్రాష్ చేయగలనని అస్సలు అనుకోలేదు. గెలుపుతో నా చేతి వేళ్ల స్పర్శనూ నేను నమ్మలేకపోతున్నా’ అంటూ గేమ్ చిట్టచివరి 38 నిమిషాల వీడియోను మంగళవారం యూట్యూబ్‌లో గిబ్సన్ పోస్ట్చేశాడు. టెట్రిస్ గేమ్ ఇప్పటిదాకా కనీసం 70 విధానాల్లో 200కుపైగా అధికారిక వేరియంట్లలో విడుదలైంది. కిందకు పడిపోతున్న భిన్న ఆకృతుల ‘బ్లాక్’లను వరసగా కిందివైపు పేర్చడమే ఈ ఆట. ఇవి చదవండి: ఏఐ చెప్పిన చిలక జోస్యం...రోబో మనుషులు వస్తున్నారు! -
నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ..
వాషింగ్టన్: మానవునిలో పెద్ద పేగు దాకా ఏదైనా ఆహారం వెళ్లి దంటే అప్పటికే అది జీర్ణమైందని అర్ధం. అయితే అమెరికాలో ఓ పెద్దాయన పెద్దపేగులో ఒక ఈగ చిధ్రమవకుండా చక్కగా ఉంది. జీర్ణావస్థలోకాకుండా పేగు గోడలకు అతుక్కుని ఉన్న ఈగను చూసి అక్కడి వైద్యులు అవాక్క య్యారు. జీర్ణాశయం, చిన్నపేగును దాటి కూడా ఈ కీటకం ఎలా జీర్ణమవకుండా ఉందబ్బా? అని వైద్యులు పలు విశ్లేషణలు మొదలుపెట్టారు. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఈ వింత ఘటన జరిగింది. ‘ది అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటెరాలజీ’లో సంబంధిత వివరాలతో కథనం వెలువడింది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా 63 ఏళ్ల పెద్దాయన ఆస్పత్రికి రాగా ఆయనకు వైద్యులు కొలొనోస్కోపీ చేశారు. అందులో ఈ విషయం వెల్లడైంది. ‘‘ కొలొనోస్కోపీకి ముందు ఘన పదార్థాలు ఏవీ నేను తీసుకోలేదు. రెండు రోజుల క్రితం మాత్రం పిజ్జా, తోటకూర తిన్నాను. అసలది ఎలా లోపలికెళ్లిందో నాకైతే తెలీదు’’ అని ఆ పెద్దాయన తాపీగా చెప్పారు. ‘‘తిన్న వాటిని జీర్ణరసాలు, పొట్టలోని ఆమ్లాలు జీర్ణం చేస్తాయి. అయినాసరే ఈగ అలాగే ఉందంటే ఆశ్చర్యమే. అయితే ఇది ఇంటెస్టినల్ మయాసిస్ అయి ఉండొచ్చు. ఈగ గుడ్లు లేదా లార్వా ఉన్న ఆహారం తిని ఉండొచ్చు. అవి లోపలికెళ్లి జీర్ణమయ్యాక కూడా జీర్ణవ్యవస్థలోని అసాధారణ వాతావరణాన్ని తట్టుకుని ఒకే ఒక్క లార్వా ఇలా ఈగగా రూపాంతరం చెంది ఉంటుంది’’ అని మిస్సోరీ విశ్వవిద్యాలయంలో గ్యాస్ట్రోఎంటెరాలజీ విభాగ సారథ మ్యాథ్యూ బెక్టోల్డ్ విశ్లేషించారు. ‘ఇలాంటి సందర్భాల్లోనూ వ్యక్తికి విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి ఉంటాయి. అయినా సరే ఈయనకు అవేం లేవంటే నిజంగా ఇది వింతే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన ఆ ఈగను కొలొనోస్కోపీ ద్వారా ఎట్టకేలకు బయటకు తీశారు. ఇంత జరిగినా పెద్దాయన ఆరోగ్యంగా ఉండటం విశేషం. చదవండి: మంచు‘మాయం’ -
ఖండాంతరాలు దాటిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు (ఫొటోలు)
-
జాహ్నవికి న్యాయం జరగాల్సిందే
వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతాన్ని అక్కడి భారతీయ చట్ట సభ్యులు సీరియస్‌గా తీసుకున్నారు. వాషింగ్టన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన 23 ఏళ్ల జాహ్నవి గత జనవరిలో సియాటిల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీ కొని మరణించడం తెలిసిందే. 25 మైళ్ల స్పీడ్ లిమిట్ ఉన్న చోట సదరు వాహనం ఏకంగా 74 మైళ్ల వేగంతో దూసుకురావడమే ప్రమాదానికి కారణమని తేలింది. కానీ డేనియల్ ఆడరర్ అనే సియాటెల్ పోలీసు అధికారి ఈ ఉదంతంపై చేసిన అత్యంత అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అయితే ఏమయిందిప్పుడు?! ఆమెకు ఆల్రెడీ 26 ఏళ్లు. అంత విలువైనదేమీ కాదు. ఏ 11 వేల డాలర్లకో ఓ చెక్కు రాసి పారేయండి‘ అంటూ అతనన్న మాటలు బాడీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అతనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పోలీసుల్లో జాత్యహంకారం ఎంతగా జీరి్ణంచుకుపోయిందో చెప్పేందుకు ఈ ఉదంతం మరో నిదర్శనమని వారన్నారు. డేనియల్‌పై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. ‘జాహ్నవి దుర్మరణానికి కారకులైన పోలీసులే ఆమె జీవితం విలువే లేనిదంటూ అంత నీచంగా మాట్లాడటం వింటే చెప్పరానంత జుగుప్స కలుగుతోంది. జాతి విద్వేషం, జాత్యహంకారం అమెరికాలో ఆమోదనీయత పొందుతున్నాయనేందుకు ఇది సంకేతం. ఈ చెడు ధోరణికి తక్షణం అడ్డుకట్ట పడాలి‘ అని కృష్ణమూర్తి అన్నారు. ఈ ఉదంతం మీద పూర్తి అధికారాలతో కూడిన పౌర సంఘ సభ్యుల కమిటీ వేసి స్వతంత్రంగా విచారణ జరిపించాలని సావంత్ కోరారు. డేనియల్ మీద 2014 నుంచి కనీసం 18 విచారణలు జరిగితే అతన్ని ఒక్క దాంట్లోనూ శిక్షించకపోవడం దారుణమన్నారు. పోలీసులే ఇంతటి నోటి దురుసుతో జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డ ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో కూడా విచారణను ఆర్నెల్లు సాగదీయడం, రివ్యూ పేరిట ఏడాది దాకా లాగడం క్షమించరానిదని సౌత్ సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యుడు టామీ జె.మోరల్స్ ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ అసోసియేషన్స్ కూడా ఒక ప్రకటనలో కోరింది. వందలాది మంది గురువారం సియాటిల్‌లో నిరసన ప్రదర్శన కూడా చేశారు. దోషులైన పోలీసులకు శిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ అమెరికాలో పోలీసు వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రకటించింది. మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వెల్లడించింది. జాహ్నవి మృతి పట్ల నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ చాన్సలర్ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. -
మలుపుతిప్పిన చంద్రయాన్-3.. ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం
వాషింగ్టన్: చంద్రయాన్-3 విజయం తర్వాత ప్రపంచ దేశాల చూపు భారత దేశం వైపు మళ్లింది. ప్రపంచ దేశాలు భారత్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన నాసా-ఇస్రో SAR (NISAR) ఉపగ్రహాన్ని ప్రయోగించే బాధ్యతలను ఇస్రో చేతులకు అప్పజెప్పింది నాసా. భూమి యొక్క కక్ష్యను పరిశీలించే నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి ముందు ఇస్రో దీనికి తుది మెరుగులు దిద్దుతోంది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం, NISAR 12 రోజుల్లో మొత్తం భూగోళాన్ని మ్యాప్ చేయగలదు. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు సహా భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, సహజ ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి తాత్కాలికమైనా కూడా స్థిరమైన సమాచారాన్ని అందిస్తుంది. NISAR L, S డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ ఆపర్చ్యుర్ రాడార్ (SAR)ని కలిగి ఉంటుంది. ఇందులో L బ్యాండ్ SARను కాలిఫోర్నియా జెట్ ప్రపల్షన్ లేబొరేటరీ డెవలప్ చేయగా S బ్యాండ్ SARను మాత్రం ISRO అభివృద్ధి చేసింది. ఇది స్వీప్ SAR టెక్నిక్‌తో పనిచేస్తూ హై రిజొల్యూషన్ డేటాను అందిస్తుంది. SAR పేలోడ్లు ఇంటిగ్రేటెడ్ రాడార్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రక్చర్ (ఐరిస్)పై అమర్చబడ్డాయి. SUV-పరిమాణంలో ఉండే పేలోడ్‌ను ప్రత్యేక కార్గో కంటైనర్‌లో బెంగళూరుకు తరలించినట్లు యూఎస్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. బెంగళూరులోని యూ.ఆర్.రావు శాటిలైట్ సెంటర్లో ఉపగ్రహం తుదిమెరుగులు దిద్దుకుని 2024లో ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ప్రణాళిక రూపొందించింది నాసా. Touchdown in Bengaluru! @ISRO receives NISAR (@NASA-ISRO Synthetic Aperture Radar) on a @USAirforce C-17 from @NASAJPL in California, setting the stage for final integration of the Earth observation satellite, a true symbol of #USIndia civil space collaboration. #USIndiaTogether pic.twitter.com/l0a5pa1uxV — U.S. Consulate General Chennai (@USAndChennai) March 8, 2023 ఇది కూడా చదవండి:ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు! -
యూఎస్ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా
అమరావతి: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుండి వెనక్కు పంపించిన ఘటన సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగువారు కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదంతంపై అరా తీశారు. విద్యార్థుల పూర్తి వివరాలతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని చెబుతూనే అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఎన్నోఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా చేరుకున్న తాము అన్ని డాక్యుమెంట్లను సమర్పించామన్నారు విద్యార్థులు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ చేసి, కొద్దిసేపు విచారించాక కారణం చెప్పకుండానే వారిని వెనక్కి పంపించేశారు. వారిలో అత్యధికులు అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు. చదవండి: అక్రమాల పుట్ట మార్గదర్శి.. ఆందోళనలో చందాదారులు.. రామోజీ పాపం ఫలితమే ఇదంతా! -
సాక్స్ కిల్లర్..జంటలే టార్గెట్‌గా హత్యలు! అతడెవరనేది ఇప్పటకీ..
అది 1985 డిసెంబర్ 12, మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. వాషింగ్టన్ లోని మినరల్ సమీపంలోని స్పానవేలో కె–మార్ట్ స్టోర్ కస్టమర్స్‌తో రద్దీగా ఉంది. ఆ బయట రెండేళ్ల పాప ఒక్కర్తే అయోమయంగా, అటు ఇటు తచ్చాడటాన్ని కొందరు స్టోర్ ఉద్యోగులు గమనించారు. వారు పాపను చేరదీసి, పోలీసులకు సమాచారమిచ్చారు. కాసేపటికి ఆ మార్ట్‌కు చేరుకున్న అధికారులు పాప పరిస్థితి చూసి, స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. పాప శారీరకంగా బాగానే ఉన్నా, ఏదో చూసి భయపడిందని గుర్తించి, తాత్కాలికంగా దగ్గర్లోని సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిన్న పాప కావడంతో అందరినీ చూసి బెదిరిపోయింది. తను ఎవరు? తన వాళ్లు ఎవరు? తనొక్కర్తే అక్కడెందుకు ఉంది?’ లాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నలయ్యాయి. పాప వివరాల సేకరణలో భాగంగా పత్రికలకు కూడా పాప ఫొటో ఇచ్చి ‘ఎవరీ పాప?’ అనే శీర్షికతో వార్తలు రాయించారు అధికారులు. సరిగ్గా రెండు రోజులకు పాప వార్త ఉన్న న్యూస్ పేపర్, కొన్ని రియల్ ఫొటోలు పట్టుకుని.. లూయిస్ కాన్రాడ్ అనే మహిళ పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ‘మార్ట్ ముందు దొరికిన పాప నా మనవరాలే, తన పేరు క్రిస్టల్’ అంటూ ఇంట్లోని పాప ఫొటోలను ఆధారంగా చూపించింది. పాప దొరికిన రోజు (డిసెంబర్ 12) ఉదయాన్నే తన కూతురు డయానా రాబర్ట్సన్(21), అల్లుడు మైక్ రీమర్(36), క్రిస్టల్‌తో కలసి టకోమా సమీపంలోని పర్వతాలలో వన్ డే వెకేషన్ కోసం వెళ్లారని చెప్పింది లూయిస్. పాప ఒక్కర్తే ఒంటరిగా దొరికిందంటే.. మైక్, డయానాలకేమైందోనని కూలబడి ఏడ్చేసింది. లూయిస్ సమాచారంతో ఆ పర్వాతాల సమీపంలో మొత్తం గాలింపు చర్యలు మొదలుపెట్టారు అధికారులు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. ఇక మనవరాలు క్రిస్టల్‌ని ప్రేమగా ఒడిలో కూర్చోబెట్టుకుని ‘మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు?’ అని ఆరా తీసింది లూయిస్. ఆ ప్రశ్నకు ‘మమ్మీ చెట్లలో ఉంది’ అని జవాబు ఇచ్చింది క్రిస్టల్. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం చెప్పింది. క్రిస్టల్ చిన్నది కావడంతో తనని విచారించి ప్రయోజనం లేదని అర్థమైంది. రెండు నెలలు గడిచిపోయాయి. 1986 ఫిబ్రవరి 18 ఉదయాన్నే వాషింగ్టన్‌లోని మినరల్‌కు ఉత్తరంగా ఉన్న రోడ్డుపై వాకింగ్‌కి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది. రోడ్డు నుంచి కాస్త లోపలికి గుబురు చెట్ల మధ్య.. కరుగుతున్న మంచుపెళ్లల్లో రెడ్‌కలర్ ప్లిమత్ పికప్ ట్రక్ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే, దాని పక్కనే ఓ మహిళ కుళ్లిన నగ్న మృతదేహం భయపెట్టింది. ఆమె మెడకు సాక్స్‌తో ముడివేసి బిగించినట్లుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎన్ఏ పరీక్షలో అది డయానా శవమని తెలియడంతో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారింది. క్రిస్టల్ చెప్పినట్లే తన మమ్మీ చెట్ల మధ్య ఉండటం అధికారులను ఆశ్చర్యపరచింది. అంటే తన తల్లి చావుని క్రిస్టల్ చూసే ఉంటుందని అంతా అంచనాకు వచ్చారు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడా మైక్ జాడ కనిపించలేదు. ఆ పికప్ ట్రక్ మైక్దే కావడంతో దానిలో అంతా క్షుణంగా పరిశీలించారు. డ్రైవర్ పక్క సీట్లో రక్తం మరకలున్నాయి. వాటి శాంపిల్స్ ల్యాబ్‌కి పంపిస్తే, ఆ రక్తం మనిషిదే కాని ఎవరిదో తేలలేదు. ట్రక్‌లో దొరికిన ఒక ఎన్వలప్ కవర్ మీద ‘ఐ లవ్యూ డయానా’ అని రాసి ఉంది. అది మైక్ హ్యాండ్ రైటింగ్ అని లూయిస్ గుర్తించింది. డయానా కడుపులో పదిహేడు కత్తిపోట్లు ఉన్నాయని, మెడ చుట్టూ బిగించిన సాక్స్ ఆమెని కదలకుండా నియంత్రించడానికి మాత్రమే వాడిన సాధనమని తేలింది. ఓ పక్క దట్టమైన మంచు దర్యాప్తుకు ఆటకం కలిగిస్తున్నా, మైక్ కోసం తీవ్రంగా గాలించారు అధికారులు. ఎక్కడా మైక్ ఆనవాళ్లు లేవు. అయితే గతంలో మైక్.. డయానా విషయంలో చాలా అనుచితంగా ప్రవర్తించేవాడని పోలీసుల దృష్టికి రావడంతో డయానాని అతడే చంపేసి పారిపోయాడని నమ్మారు. మైక్.. డయానాని చాలాసార్లు కొట్టేవాడని, చంపేస్తానని బెదిరించేవాడని, అతడి వేధింపులు భరించలేక విడిపోయి తనకు మైక్ దూరంగా ఉండాలంటూ డయానా కోర్టు ఉత్తర్వును కూడా పొందిందని, కొన్నాళ్లకు వాళ్లు మళ్లీ కలసి జీవించడం మొదలుపెట్టారని చెప్పింది. దాంతో మైక్ అనుమానితుడుగా మారాడు. అయితే కొందరు మైక్ కూడా బాధితుడు కావచ్చని, గడ్డకట్టే చలిలో మైక్ తన చలికోటును ట్రక్‌లో వదిలి పారిపోయే అవకాశం లేదని నమ్మారు. ఈ క్రమంలోనే డయానా మెడకు చుట్టిన సాక్స్ కీలక ఆధారమైంది. మైక్, డయానా మిస్సింగ్‌కి ముందు.. అంటే 1985 ఆగస్ట్ 10న స్టీఫెన్ హార్కిన్, రూత్ కూపర్ అనే జంట మర్డర్ కేసు తిరగేశారు అధికారులు. ఈ జంట వాషింగ్టన్లో తులే సరస్సు పక్కన క్యాంపింగ్‌కి వెళ్లి తిరిగి రాలేదు. నాలుగు రోజులకు స్టీఫెన్ తన కారు డ్రైవింగ్ సీట్లో శవమై కనిపించాడు. నుదుటి మీద బుల్లెట్ గాయం ఉంది. అతడు నిద్రిస్తున్న సమయంలోనే దాడి జరిగినట్లు తేలింది. వెంట తీసుకెళ్లిన వారి పెంపుడు కుక్క సమీపంలో బుల్లెట్ గాయాలతో చనిపోయి ఉంది. రూత్ బూట్లు తప్ప మరో ఆధారం కనిపించలేదు. సరిగ్గా రెండు నెలలకు (అంటే డయానా మర్డర్‌కి సరిగ్గా నెల క్రితం) స్టీఫెన్ దొరికిన మైలున్నర దూరంలో రూత్ తల, మొండెం వేరువేరుగా దొరికాయి. రూత్ మెడకు కూడా డయానా మెడకు కట్టినట్లే సాక్స్‌తో బిగించి ఉంది. ఆమె కడుపులో చాలాసార్లు తుపాకీతో కాల్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కాల్పుల కారణంగానే మరణించింది తప్ప సాక్స్ కారణంగా కాదని తేలింది. రూత్ మెడలోని సాక్స్, డయానా మెడలోని సాక్స్ రెండూ ఒకేలా ఉన్నాయని సాంకేతిక నిపుణులు కొందరు భావించారు. ఇది కచ్చితంగా సీరియల్ కిల్లర్ పనేనని వారి నమ్మారు. అయితే మైక్ జంతువుల కోసం వలపన్నే ప్రాంతం.. రూత్, స్టిఫెన్లు మృతదేహాలు దొరికిన ప్రాంతం రెండూ ఒకటే కావడంతో అనుమానాలన్నీ మైక్ మీదకు తిరిగాయి. నిజానికి మైక్.. తన భార్యను, కూతుర్ని తీసుకుని బయలుదేరేముందే ఆ వలపన్నిన ప్రాంతాన్ని ఒకసారి సందర్శించి వస్తామని ఇంట్లో చెప్పాడట. ఇన్ని ఆధారాలతో పాటు మైక్ కనిపించకపోవడంతో అతడే సీరియల్ కిల్లర్ అని కొందరు అధికారులు నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఈ తరహా కేసే మరొకటి పోలీసులు దృష్టికి వచ్చింది. 1985 మార్చి 9న వాషింగ్టన్ గ్రాంట్ కౌంటీలో ఎడ్వర్డ్ స్మిత్, కింబర్లీ లావైన్ అనే ప్రేమజంట మరణం వెనుక కూడా ఇదే సీరియల్ కిల్లర్ ఉండి ఉంటాడని నమ్మారు అధికారులు. అయితే ఎడ్వర్డ్ కారులో దొరికిన వేలిముద్రల ఆధారంగా 1989లో బిల్లీ రే బల్లార్డ్ అనే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు ఎడ్వర్డ్, కింబర్లీ హత్యల నేరాన్ని అంగీకరించాడు కాని రూత్ జంట, డయానా జంటల హత్యలు తనకు సంబంధం లేదన్నాడు. 1986 ఆగస్ట్ 22న మిస్ అయిన రాబర్ట్, డాగ్మార్ మిస్సింగ్ కేసును కూడా కలిపి విచారించారు. తర్వాత రాబర్ట్ క్రెడిట్ కార్డ్ వినియోగించిన ఓ సీరియల్ కిల్లర్ చార్లెస్ సింక్లైర్ని అరెస్ట్ చేశారు. అయితే విచారణ సమయంలోనే అతడు మరణించాడు. కాలక్రమేణా మినరల్ పరిసరప్రాంతాల్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడని పుకార్లు స్థానికుల్ని పర్యటకులను తీవ్రంగా భయపెట్టాయి. మరోవైపు మైక్ కనిపించకపోవడంతో అతడే సీరియల్ కిల్లర్ అనే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. 2011 మార్చి 26న డయానా మృతదేహం దొరికిన మైలు దూరంలో హైకర్స్కి మనిషి పుర్రె కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దంత పరీక్షలతో ఆ పుర్రె మైక్దని తేలింది. దాంతో మైక్ కూడా ఆ సీరియల్ కిల్లర్ బాధితుడేనని, అసలు హంతకుడు వేరే ఉన్నాడని స్పష్టమైంది. మొత్తానికీ వాషింగ్టన్ మినరల్ సమీపంలోని ప్రేమ జంటలు, దంపతుల హత్యకేసులు.. రూత్, డయానా జంటల హత్యలతో కలిసి విచారించినా, ఎంతోమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా అసలు సాక్స్ కిల్లర్ ఎవరో బయటపడలేదు. క్రిస్టల్(పాప) దొరికిన రోజు.. మైక్ రెడ్ కలర్ ట్రక్‌ని కె–మార్ట్ స్టోర్ ముందు చూశామని కొందరు సాక్షులు చెప్పారు. అంటే పాపను ఆ కిల్లరే ఆ స్టోర్ దగ్గర వదిలివెళ్లాడా? ఆ స్టోర్ దగ్గరకు వచ్చాడా? అనేది ఎప్పటికీ తేలలేదు. వాళ్లని చంపింది ఎవరు? ఆ కిల్లర్ ఇంకా ఎంత మంది మాయం చేశాడు? ఇలా వేటికీ సమాధానాలు లేవు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన (చదవండి: ఇప్పటకీ అంతుతేలని కేర్‌టేకర్ అదృశ్యం కేసు! ఆరోజు ఏం జరిగింది..?) -
రెండో అంతస్తులోకి దూసుకెళ్లిన కారు.. అలా ఎలా రాజా?
వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వానియాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక కారు డ్రైవర్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆశ్చర్యకరంగా పక్కన ఉన్న బిల్డింగ్ రెండో అంతస్తులోకి దూసుకెళ్లాడు. కారు పరిమాణంలో బిల్డింగ్ పైభాగంలో పెద్ద రంధ్రం కూడా పడింది. వెంటనే ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగి కారును, కారు డ్రైవరును జాగ్రత్తగా కిందకు దించారు. బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన కారు దృశ్యాలు, శిధిలమైన బిల్డింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. పెన్సిల్వానియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారును 20 ఏళ్ల యువకుడు డ్రైవింగ్ చేస్తున్నాడని ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం అతడు అక్కడికి సమీపంలోనే ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని అన్నారు. అతడు కోలుకుంటేగానీ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందో తెలియదన్నారు. మాకైతేలండి యాక్సిడెంట్ కాదేమో అనిపిస్తున్ది అన్నారు. ఇదిలా ఉండగా స్థానికులు మాత్రం దగ్గర్లోని కల్వర్టు వద్ద ఓవర్ స్పీడింగ్ వలన రైలింగును ఢీకొని ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆ కారణంతోనే కారు గాల్లోకి లేచి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలను చూసినవారంతా కారును స్పైడర్ మ్యానో, సూపర్ మ్యానో డ్రైవింగ్ చేసి ఉంటారని కొందరు, గాల్లో వెళ్లడమంటే ఇదేనేమో అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని మరి కొందరు మానవతా దృక్పధంతో కూడా కామెంట్లు చేస్తున్నారు. A driver has been taken to hospital after crashing a car into the second story of a house in Pennsylvania. State Police say investigators believe it wasn’t an accident. pic.twitter.com/D2U5P0fQMn — Pop Crave (@PopCrave) August 8, 2023 ఇది కూడా చదవండి: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు? -
భారత్‌లో జరిగే జీ-20 సదస్సులో అదే హాట్ టాపిక్
వాషింగ్టన్: సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ-20 సదస్సులో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించిన చర్చే ప్రధానం కానుందని చెబుతున్నాయి వైట్ హౌస్ వర్గాలు. ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక ప్రకటన చేశారు. ఈ దఫా జీ-20 సదస్సు భారత్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ ప్రథమార్ధంలో న్యూఢిల్లీ వేదికగా అజరిగే ఈ సదస్సుకు అతిరధ మహారధులంతా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాల్గొనబోయే ఈ సమావేశంలో మిగతా అంశాలతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన చర్చ కూడా జరగనుందని సమావేశానికి హాజరుకానున్న అన్ని దేశాలు ఇదే అంశానికి పెద్ద పీట వేసినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్. నాటో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ ప్రయత్నం చేయడంతో యుద్ధానికి బీజం పడింది. 2022, ఫిబ్రవరి 24న రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మొదలైన యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వంపై ఇటీవల జరిగిన సమావేశాల్లో భాగస్వామి దేశాలు సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. రష్యాతో జరుగుతున్న యుద్ధం సమసిపోతే గానీ ఉక్రెయిన్ సభ్యత్వం గురించి ఎటూ తేల్చలేమని తేల్చేశాయి. ఇటీవల సౌదీ రాజు అధ్యక్షతన ఆ దేశంలో జరిగిన సమావేశంలోనూ ప్రధానంగా ఉక్రెయిన్ గురించిన చర్చ జరిగింది. వచ్చే నెల జీ-20 సదస్సులో కూడా అదే హాట్ టాపిక్ కానుంది. ఎక్కడ సమావేశాలు జరిగినా రష్యా ఉక్రేయి యుద్ధం ప్రస్తావన వస్తూనే ఉంది. సుదీర్ఘన్గా కొనసాగుతున్న యుద్ధం తదనంతర పరిణామాల దృష్ట్యా ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఎలాగైనా యుద్ధాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండడం మంచి పరిణామమే. ఇది కూడా చదవండి: 24 ఏళ్లయ్యింది.. ఇకనైనా తొలగించండి ప్లీజ్.. మళ్లీ