
నిహార్‌రెడ్డి(ఫైల్)
సాక్షి, ఇచ్చోడ (బోథ్): అమెరికాలోని వాషింగ్టన్‌లో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏలేటి ని హార్‌రెడ్డి (32) ఓ ప్రమాదంలో మృతిచెందాడు. ఆదివారం సాయం త్రం సీఆర్టీ సిటీలోని షమ్మిమిష్‌లేక్ జలపాతం లో నిహార్ కాలుజారి గల్లంతు కాగా మంగళవారం రాత్రి మృతదేహం లభించింది.
బోరిగామకు చెందిన ఏలేటి లక్ష్మారెడ్డి, శోభ దంపతులకు నిఖిల్‌రెడ్డి, నిహార్‌రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నిఖిల్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ఇదివరకే అక్కడ స్థిరపడ్డాడు. కాగా, మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన నిహార్‌రెడ్డి వాషింగ్టన్ రాష్ట్రంలోని సీఆర్టీ సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం నిహార్ స్నేహితులతో కలసి విహారయాత్రకు వెళ్లాడు. అక్కడి జలపాతంలో కాలుజారి గల్లంతయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment