
వాషింగ్టన్: చిన్నపిల్లల ఆటలు ఎంతో ముద్దనిపిస్తాయి. అలాగే జంతువుల్లో కొన్ని చేసే చిలిపి చేష్టలు కూడా భలే సరదాగా ఉంటాయి. అవి చేసే చిలిపి పనులకు మనుషులు ఫిదా అవుతుంటారు. తాజాగా ఓ ఏనుగు బురదలో సరదా ఆటలు ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏనుగు బురదను కాలితో తన్నుతూ.. దానిలో బొర్లుతూ.. తెగ అల్లరి చేస్తోంది.
ఈ వీడియోను ఒరెగాన్ జూ ‘స్పా డే’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. 35,000 మంది నెటిజన్లు వీక్షించారు. ఏనుగు సంబరాన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కాగా ఏనుగు అల్లరి చేష్టలు చూస్తుంటే.. చిన్నప్పుడు ఆడిన ఆటలు గుర్తుకు వస్తున్నాయంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
Spa day pic.twitter.com/Yx7T4Ti7h9
— Oregon Zoo (@OregonZoo) June 10, 2021
చదవండి: అనుమతి వస్తే.. దేశంలో చిన్నారులకు తొలి కరోనా టీకా ఇదే!