గజరాజులను చూసి తోకముడిచిన పులి: వీడియో వైరల్‌ | Tiger Making Way For Herd Of Elephants Goes Viral | Sakshi
Sakshi News home page

గజరాజులను చూసి తోకముడిచిన పులి: వీడియో వైరల్‌

Published Mon, May 1 2023 11:44 AM | Last Updated on Mon, May 1 2023 11:54 AM

Tiger Making Way For Herd Of Elephants Goes Viral - Sakshi

సాధారణం పులి ఠీవిగా నడుచుకుంటూ వెళ్లిపోతుందే తప్ప సాధారణంగా తలవంచదు. దాని దారికి అడ్డంగా వస్తే హడలెత్తించి మరీ పరిగెట్టిస్తుంది. అలాంటిది పులి గజరాజులకు దారివ్వడమే గాక దూరంగా నక్కి ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో పులి అడవిలో అలు ఇటు తిరుగుతుంటుంది. ఇంతలో ఓ ఏనుగుల గుంపు అటుగా వచ్చాయి. దీంతో పులి దూరంగా వాటికి కనబడకుండా కిందకి కూర్చొంటుంది.

ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఏనుగులు వెళ్లిపోతుంటాయి. ఇంతలో పులి నెమ్మదిగా లేచి ఆ ఏనుగుల వెళ్తున్న దారివైపు వరకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి తన దారిని వెళ్లేందుకు యత్నిస్తుంది. సరిగ్గా ఇంకో ఏనుగు దానికి ఎదురు పడుతుంది. అంతే ఒక్కసారిగా పులిరాజు భయంతో తత్తరపడి దానికి దారి ఇచ్చి మరీ వేగంగా వెళ్లిపోతుంది.

అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సుశాంత్‌ నంద 'అడవికి రాజు ఏనుగులకు దారి ఇచ్చింది' అనే క్యాప్షన్‌ జోడించి మరీ పోస్ట్‌ చేశారు. బహుశా ఆ జంతువులు ఈ విధంగా తమ సామరస్యాన్ని చాటుకుంటాయి కాబోలు అని అన్నారు. వాస్తవానికి ఈ వీడియోని వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ విజేత సింహ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అదీగాక పులులు ఏనుగులను వేటాడే సందర్భాలు చాలా అరుదు. 

(చదవండి: ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement