మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పులి?.. వీడియో వైరల్​ | A video shows in which animal was seen strolling casually at the presidential palace during the swearing-in ceremony on Sunday. | Sakshi
Sakshi News home page

మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పులి?.. వీడియో వైరల్​

Published Mon, Jun 10 2024 3:43 PM | Last Updated on Mon, Jun 10 2024 3:54 PM

A video shows in which animal was seen strolling casually at the presidential palace during the swearing-in ceremony on Sunday.

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది.  దేశ, విదేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో సహా 8 వేల మంది అతిథులు హాజరయ్యారు.

అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జరిగిన ఈ వేడుకలో ఆహ్వానం లేదని ఓ అతిథి ప్రత్యక్షమైంది. ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యప్రదేశ్​ బీజేపీ ఎంపీ దుర్గా దాస్​ ఉయికే.. రాష్ట్రపతి ముర్ముకు అభివాదం చేస్తుండగా.. స్టేజీ వెనక భాగంలో ఓ జంతువు అటుగా వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే సంచరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సోషల్‌మీడియాలో దీనికి సంబంధించిన వీడియో  వైరల్​గా మారింది. తొలుత ఫేక్‌ వీడియో లేదా ఏఐ జనరేటెడ్‌ వీడియో అని కొట్టిపారేశారు. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నిన్న షేర్‌ చేసిన యూట్యూబ్‌ లైవ్‌ ఫీడ్‌ను పరిశీలించినప్పుడు.. ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది.

అది చూడటానికి పులిలా కనిపించింది. కానీ ఆ జంతువు పెంపుడు పిల్లి అని, లేదా కు అయి ఉండవచ్చిన పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక కొంతమంది ఈ దృశ్యాలను కూడా నమ్మడం లేదు, బ్యాగ్రౌండ్​లో ఎడిట్ చేసి చూపిస్తున్నారని చెబుతున్నారు. మరికొందరైతే అతి కచ్చితంగా చిరుతపులిలా కనిపిస్తుందని, అక్కడి వారు అదృష్టవంతులు దాని బారి నుంచి తప్పించుకున్నారని కామెంట్​ చేస్తున్నారు.  దీనిపై రాష్ట్రపతి భవన్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement