
తుమకూరు: చిరుత కనిపించిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆమడ దూరం పరిగెడతారు. అయితే ఓ యువకుడు ధైర్యసాహసాలు ప్రదర్శించి, ప్రాణాలకు తెగించి ఓ చిరుతను తోక పట్టుకొని బోనులోకి నెట్టేశాడు. ఈఘటన జిల్లాలోని తిపటూరు తాలూకా రంగాపురం వద్ద జరిగింది.
గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేయగా అటవీశాఖ అధికారులు సమీపంలో బోను ఏర్పాటు చేశారు. పరలేహళ్లి రోడ్డులోని కుమార్ అనే వ్యక్తికి చెందిన తోటలో చిరుత నిద్రావస్థలో ఉండగా దానిని బంధించేందుకు అటవీ అధికారులు, సిబ్బంది సకల సరంజామాతో వచ్చారు.
అయితే చిరుతను పట్టుకునేందుకు భయంతో వెనుకాడుతుండగా గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు ముందుకు వచ్చాడు. చిరుత తోకను పట్టుకుని బోనులోకి లాగి పడేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న అటవీ సిబ్బంది వల విసిరి చిరుతను బంధించడంలో సఫలమయ్యారు. కాగా యువకుడి ధైర్యసాహసాలను పలువురు ప్రశంసించారు.
The #forest department officials with the help of a local youth Anand captured a #leopard at Rangapur Village in #Tumakuru... pic.twitter.com/QFrdogAvqt
— Yasir Mushtaq (@path2shah) January 7, 2025