నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్‌వేర్‌ జీతం కాదు! | Bengaluru based bike driver who claimed that an income will take many of us by surprise | Sakshi
Sakshi News home page

నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్‌వేర్‌ జీతం కాదు!

Published Mon, Dec 9 2024 1:00 PM | Last Updated on Mon, Dec 9 2024 1:00 PM

Bengaluru based bike driver who claimed that an income will take many of us by surprise

నెలకు రూ.85,000 వరకు వేతనం.. ఇదేదో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం అనుకుంటే పొరపడినట్లే.. ఇది ఓ బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌ సంపాదన! అవునండి.. దాదాపు రోజుకు 13 గంటలపాటు విభిన్న ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఓ బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌ సంపాదిస్తున్న మొత్తం అది. తన సంపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

బైక్ ట్యాక్సీలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజాదరణ పొందాయి. చాలామంది డ్రైవర్లకు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఉబర్‌, రాపిడో, ఓలా.. వంటి కంపెనీలు ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉంచాయి. బెంగళూరుకు చెందిన ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఉబర్‌, రాపిడోలో వచ్చిన రైడ్‌లను పూర్తి చేస్తూ, రోజుకు 13 గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.80,000-రూ.85,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ మేరకు అప్‌లోడ్‌ చేసిన వీడియో చూసినవారు బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటూ అంతమొత్తంలో ఆర్జించడంపట్ల ఆశ్చర్య పోతున్నారు.

ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్‌ సేవలు..!

ఇటీవల @karnatakaportf పోస్ట్ చేసిన ఈ వీడియోకు మూడు వేలకు పైగా లైకులు, ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై వీక్షకులు విభిన్నంగా కామెంట్‌ చేస్తున్నారు. కొందరు డ్రైవర్ అంకితభావం, కృషిని ప్రశంసిస్తున్నారు. ‘మేము కూడా అంత సంపాదించడం లేదు భయ్యా!’ అని మరొకరు కామెంట్‌ చేశారు. 13 గంటల పాటు రోడ్డుపై డ్రైవింగ్‌ చేయడం చాలా కష్టమని మరోవ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement