నిలిచిన రైల్వే ఈ-టికెట్‌ సేవలు..! | IRCTC e-ticketing service is currently unavailable due to maintenance activity | Sakshi
Sakshi News home page

నిలిచిన రైల్వే ఈ-టికెట్‌ సేవలు..!

Published Mon, Dec 9 2024 12:06 PM | Last Updated on Mon, Dec 9 2024 12:10 PM

IRCTC e-ticketing service is currently unavailable due to maintenance activity

భారత రైల్వే టికెటింగ్‌ సేవలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కో ఆపరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)కి చెందిన ఈ-టికెట్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అధికారిక వెబ్‌సైట్‌, యాప్‌ సేవలను దాదాపు గంటసేపు నిలిపేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.

‘వెబ్‌సైట్‌ నిర్వహణ పనుల వల్ల అధికారిక వెబ్‌సైట్‌, యాప్‌లు నిలిచిపోయాయి. ఈ-టికెట్‌ సేవలకు మరో గంటపాటు అంతరాయం కలుగుతుంది. టికెట్లకు సంబంధించి ఏదైనా పరిష్కారాల కోసం తర్వాత ప్రయత్నించండి. మరేదైనా సమస్యల కోసం etickets@irctc.co.inకు మెయిల్‌ చేయండి. ఫైల్‌ టీడీఆర్‌ కోసం కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ 14646, 0755-6610661, 0755-4090600కు సంప్రదించండి’ అని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

ఇదీ చదవండి: స్పామ్‌ కాల్స్‌, ఆన్‌లైన్‌ మోసాల కట్టడికి సూచనలు 

స్టేటస్‌ ట్రాకింగ్ సాధనం డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. ఐఆర్‌సీటీసీ వినియోగదారులు వెబ్‌సైట్‌, మొబైల్ అప్లికేషన్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దాదాపు 50 శాతం వెబ్‌సైట్ వినియోగదారులు సైట్‌, యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. దాంతో చాలామంది వినియోగదారులు విభిన్న సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని పంచుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement