జర్నీకి ఐదు నిమిషాల ముందు ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ఎలా అంటే? | How To Book 3AC, 2AC Or 1AC Train Ticket At The Last Minute | Sakshi
Sakshi News home page

జర్నీకి ఐదు నిమిషాల ముందు ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ఎలా అంటే?

Published Sun, May 26 2024 1:52 PM | Last Updated on Sun, May 26 2024 2:48 PM

How To Book 3AC, 2AC Or 1AC Train Ticket At The Last Minute

చివరి నిమిషంలో ఊరు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? లేదంటే వీరే ప్రాంతంలో మీకు అత్యవసర పనిబడిందా? ఇందుకోసం మీరు ముందస్తుగా ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోలేదా? చింతించకండి. ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్‌లో కొత్త సదుపాయాన్ని కల్పించింది.

పలు కారణాల వల్ల చివరి నిమిషంలో ప్రయాణికులు వారు బుక్‌ చేసుకున్న ట్రైన్‌ టికెట్‌లను క్యాన్సిల్‌ చేస్తుంటారు. మరి ఆ టికెట్‌లు వృధాగా పోతున్నాయి. అందుకే రైలు ప్రయాణానికి ఐదు నిమిషాల ముందు ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

అయితే స్లీపర్, 3ఏసీ, 2ఏసీ, 1ఏసీలో సీట‍్లు ఖాళీగా ఉంటే.. జర్నీకి ఐదు నిమిషాల ముందు ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. మరి ఈ భోగీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ చార్ట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ..ట్రైన్‌ వివరాలు ఎంటర్‌ చేసిన తర్వాత గెట్‌ ట్రైన్‌ చార్ట్‌ కనిపిస్తుంది. ఇందులో ట్రైన్‌ వివరాలు కనిపిస్తాయి. అక్కడ సీట్లు ఉన్నాయని తెలుస్తే బుక్‌ చేసుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement