tatkal
-
జర్నీకి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?
చివరి నిమిషంలో ఊరు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? లేదంటే వీరే ప్రాంతంలో మీకు అత్యవసర పనిబడిందా? ఇందుకోసం మీరు ముందస్తుగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోలేదా? చింతించకండి. ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్‌లో కొత్త సదుపాయాన్ని కల్పించింది.పలు కారణాల వల్ల చివరి నిమిషంలో ప్రయాణికులు వారు బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ చేస్తుంటారు. మరి ఆ టికెట్లు వృధాగా పోతున్నాయి. అందుకే రైలు ప్రయాణానికి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.అయితే స్లీపర్, 3ఏసీ, 2ఏసీ, 1ఏసీలో సీట్లు ఖాళీగా ఉంటే.. జర్నీకి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. మరి ఈ భోగీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు ఆన్లైన్ చార్ట్ వెబ్సైట్లోకి వెళ్లి ..ట్రైన్ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత గెట్ ట్రైన్ చార్ట్ కనిపిస్తుంది. ఇందులో ట్రైన్ వివరాలు కనిపిస్తాయి. అక్కడ సీట్లు ఉన్నాయని తెలుస్తే బుక్ చేసుకోవచ్చు. -
Passport: ఇక నుంచి వేగంగా పాస్‌పోర్టుల జారీ
సాక్షి హైదరాబాద్: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ల కోసం చాలాకాలం నిరీక్షించకుండా మరిన్ని సాధారణ, తత్కాల్ అపాయింట్మెంట్లను పెంచినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బేగంపేట ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సాధారణ పాస్‌పోర్టు అపాయింట్మెంట్లు 50, తత్కాల్ 50, అమీర్‌పేట పీఎస్కేలో సాధారణ 25, తత్కాల్ 25, టోలిచౌకి పిఎస్కెలో సాధారణ 25, తత్కాల్ 25, నిజామాబాద్ తత్కాల్ 20 అపాయింట్మెంట్లను పెంచినట్లు ఆయన తెలిపారు. పెంచిన అపాయింట్మెంట్లు 16వ తేది నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. గత డిసెంబర్ మాసంలో 5 ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్టు సేవా క్రేందాల్లో వరుసగా 4 శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా అపాయింట్మెంట్ల లభ్యత పెంచినట్లు వివరించారు. దీనివలన గతంలో తత్కాల్ అపాయింట్మెంట్ల లభ్యత సమయం 30 రోజులకు, సాధారణ పాస్‌పోర్టు అపాయింట్మెంట్ల లభ్యత సమయం 40 రోజులకు తగ్గిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ఎఫ్ఐఆర్లు.. జరిమానాలు..రెడ్ నోటీసులు) -
ఒకే రోజులో ‘తత్కాల్’ పాస్‌పోర్టులు
దుబాయ్: దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త. తత్కాల్ పాస్‌పోర్టు ఇక ఒక్క రోజులోనే లభించనుంది. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయ నిర్వాసితులకు అదే రోజున తత్కాల్ కేటగిరీలో పాస్‌పోర్ట్ మంజూరు చేస్తామని దుబాయ్‌లోని భారత కాన్సులేట్ వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటలలోపు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అదే రోజున తత్కాల్ పాస్‌పోర్టు అందిస్తామని కాన్సుల్ జనరల్ విపుల్ తెలిపారు. దుబాయ్‌లోని అల్ ఖలీజ్ సెంటర్లో ఉన్న బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే 24 గంటల్లో తత్కాల్ పాస్‌పోర్టులను అందించే సర్వీసు ఉందన్నారు. ఇవి చదవండి: యూఏఈకి ఐదేళ్ల టూరిస్ట్ వీసా.. పాస్‌పోర్ట్ జాబితాలో దేశానికి 84వ స్థానం -
బుకింగ్ నిబంధనల్లో మార్పుల్లేవు: రైల్వే
న్యూఢిల్లీ: రైల్వే బుకింగ్, తత్కాల్‌లకు సంబంధించిన జులై 1 నుంచి నిబంధనలు మారుతున్నాయంటూ సోషల్ మీడియాలో, కొన్ని వెబ్సైట్లలో వస్తున్న వార్తలు సరికాదంటూ రైల్వే శాఖ ప్రకటించింది. ‘అది తప్పుడు ప్రచారం. నిర్ధారించుకోకుండానే కొన్ని పత్రికలు ఈ విషయాన్ని ప్రచురించాయి. దీని వల్ల గందరగోళం నెలకొంది. శతాబ్ది, రాజధాని రైళ్లలోనే కాదు ఏ రైళ్లలోనూ పేపర్ టికెట్లను తొలగించే ఆలోచన లేదు. అయితే, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నవారు, టికెట్ కన్ఫర్మేషన్కు సంబంధించి వారికందిన ఎస్ఎంఎస్తో పాటు, నిర్ధారిత గుర్తింపు పత్రంతో ప్రయాణం చేయవచ్చు. రద్దు చేసుకున్న ప్రయాణాలకు సంబంధించి తిరిగి చెల్లింపుల(రీఫండ్) నిబంధనల్లోనూ ఎలాంటి మార్పుల్లేవు’ అని గురువారం రైల్వే శాఖ స్పష్టం చేసింది. టిక్కెట్లపై చార్జీల్లో రాయితీలను కూడా ప్రచురించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. చార్జీపై ప్రయాణికులు ఎంత రాయితీ పొందుతున్నారో వారికి తెలియాలని, చార్జీల హేతుబద్ధీకరణకు ఇది ఉపయోగపడుతుందని రైల్వే బోర్డు మెంబర్ మహ్మద్ జంషెడ్ చెప్పారు. ప్రయాణికులను గ మ్యం చేర్చడానికి తమకయ్యే ఖర్చులో 57 శాతం మాత్రమే చార్జీల ద్వారా తిరిగి వస్తుందనీ, సబర్బన్ రైళ్లలో అయితే ఇది కేవలం 37 శాతమేనని ఆయన చెప్పారు. మొత్తం రైళ్ల ట్రాఫిక్‌లో సబర్బన్, తక్కువ దూరం ైరె ళ్ల ట్రాఫిక్ శాతం 52 అని, కానీ ఆదాయార్జనలో వీటి వాటా 6 నుంచి 7 శాతమేనని జంషెడ్ వివరించారు. -
తత్కాల్ మాయాజాలం
రాజశేఖర్ ఆదివారం సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాలి. ఐఆర్సీటీసీ ఆన్లైన్లో శనివారం తత్కాల్ కోటా కింద టికెట్ కోసం ప్రయత్నించాడు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీలో 22 బెర్తులు ఉన్నట్టు నిర్ధారణైంది. వివరాలు నమోదు చేసి టికెట్ బుక్ చేసే సమయానికి బెర్తుల సంఖ్య 4కు పడిపోయింది. వేగంగా ఆన్లైన్లో టికెట్ చార్జీలు చెల్లించాడు. అయినా అతడికి బెర్తు లభించలేదు. వెయిటింగ్ లిస్టు 17గా నమోదైంది. వారం రోజుల క్రితం బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రసాద్ అనే మరో ప్రయాణికుడు బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ఏసీలో టికెట్ కోసం డబ్బు చెల్లించగా రాజశేఖర్ మాదిరిగానే ఇతనికీ వెయింటిగ్ లిస్ట్ వచ్చింది. దిక్కుతోచని పరిస్థితుల్లో యశ్వంతాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్‌లో ప్రయత్నించగా బెర్త్ దొరికింది. తత్కాల్ కోటాలో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు టికెట్ రద్దు చేసుకునే అవకాశం లేదు. ఒకసారి టికెట్ బుకింగ్ చేసుకుంటే చార్ట్ సిద్ధమయ్యే వరకు నిరీక్షించాల్సిందే. ట్రైన్ బయలుదేరేందుకు 2 గంటల ముందు బెర్తు నిర్ధారణ అయితే పయనించాలి. లేదంటే చెల్లించిన చార్జీలపై ఆశలు వదులుకొని మరో ప్రయత్నం చేయాలి. ప్రసాద్ అలాగే థర్డ్ ఏసీ కోసం చెల్లించిన రూ.1000 పైన ఆశలు వదులుకొని మరో ట్రైన్లో స్లీపర్ క్లాసులో హైదరాబాద్ చేరుకున్నాడు. ఇది ఒక్క రాజశేఖర్,ప్రసాద్‌లకు ఎదురైన సమస్య కాదు. తత్కాల్ కోటాలో చాలా మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య. రెండు విధాలుగా నష్టం.... గతంలో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు తాము నిరీక్షించేందుకు నిరాకరించదలిస్తే వెంటనే రద్దు చేసుకునే సదుపాయం ఉండేది. దాంతో వారు మరో ప్రత్యమ్నాయం వెదుక్కొనేవాళ్లు. ఇప్పుడు అలా లేదు. తత్కాల్ కోటాలో వెయిటింగ్ లిస్టులో నమోదు చేసుకుంటే తిరిగి రద్దు చేసుకోవడం సాధ్యం కాదు. చార్ట్ సిద్ధమయ్యే వరకు ఆగాల్సిందే. అప్పటికి నిర్ధారణ అయితే వెళ్లాలి. చార్ట్ ప్రిపేరైన తరువాత కూడా వెయిటింగ్ జాబితాలోనే ఉంటే మాత్రం ప్రయాణికుడి ఖాతాలోకి టికెట్ డబ్బులు తిరిగి జమ అవుతాయి. అయితే వెయిటింగ్ జాబితాలో ఉండి రద్దు చేసుకోకుండా మరో రైల్లోనో, బస్సులోనో వెళితే మాత్రం ప్రయాణికులు రెండు విధాలుగా నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు బెర్తులు కన్ఫర్మ్లో ఉండి టికెట్ మాత్రం వెయిటింగ్లో లభించడం అంతుబట్టకుండా ఉంది. జూదంలా తత్కాల్... ట్రైన్ బయలుదేరడానికి 24 గంటల ముందు అందుబాటులోకి వచ్చే తత్కాల్ సదుపాయం ప్రయాణికుల పాలిట జూదంలా మారింది. ఒక్కో ట్రైన్లో 20 నుంచి 40 శాతం వరకు తత్కాల్ కోటా కింద బెర్తులు కేటాయిస్తారు. సాధారణ బుకింగ్‌లో టికెట్ లభించని ప్రయాణికులు, అప్పటికప్పుడు బయలుదేరాలనుకొనే లక్షలాది మంది తత్కాల్‌ను ఆశ్రయిస్తారు. ఐఆర్సీటీసీలో తత్కాల్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది క్షణాల్లోనే టికెట్లు బుక్ అయిపోతాయి. ఎంతో డిమాండ్ ఉన్న తత్కాల్ కోటా ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తోంది. సాధారణంగా టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ‘కన్ఫర్మ్’ అని లేదా ‘వెయిటింగ్’ అనే ఆప్షన్స్ ఆన్లైన్లో కనిపించాలి. కానీ ‘కన్ఫర్మ్’(నిర్ధారిత) బెర్తులుగానే ఆన్లైన్లో కనిపిస్తుంది. తీరా టికెట్ డబ్బులు చెల్లించిన తర్వాత ప్రయాణికుడికి ‘వెయిటింగ్ టికెట్’ డెలివరీ అవుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. నిర్ధారిత బెర్తులు బుక్ చేసుకుంటే వెయిటింగ్లో నమోదు కావడమేమిటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇలా ఒకసారి వెయిటింగ్లో నమోదైన తరువాత రైలు బయల్దేరడానికి 2 గంటల ముందు వరకు ఎలాంటి పరిస్థితి తెలియదు. -
తత్కాల్ ప్రయాణికులకు శుభవార్త
వరంగల్(కాజీపేట): తత్కాల్ టిక్కెట్ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త ప్రకటించింది. గతంలో తత్కాల్ టిక్కెట్లు తీసుకునే వారు టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్లోనూ, రైలు ప్రయాణంలోనూ టీసీకి గుర్తింపు కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉండేది. ఈ నిబంధనల ప్రకారం లేకుంటే వారికి టీసీలు జరిమానా విధించేవారు. అయితే సెప్టెంబర్ 1వతేదీ నుంచి రైల్వే శాఖ తత్కాల్ టిక్కెట్లు తీసుకునే వారికి తమ గుర్తింపు కార్డు ఇవ్వాల్సిగాని, చూపించాల్సిన అవసరంగానీ లేదని రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు శనివారం స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తత్కాల్ స్పెషల్ రైళ్లు!
రైలు టికెట్లు దొరకడం చాలా కష్టమైపోతోంది. తత్కాల్ టిఎట్లు తీసుకుందామంటే ఐదు నిమిషాల్లోనే అయిపోతున్నాయి. అందులోనూ మళ్లీ ప్రీమియం తత్కాల్ కూడా ఒకటి వచ్చింది. అది కూడా దొరకట్లేదని.. ఇప్పుడు మరో కొత్త మార్గాన్ని రైల్వే వర్గాలు అన్వేషించాయి. ప్రత్యేకంగా 'తత్కాల్ స్పెషల్' రైళ్లను ప్రవేశపెడుతున్నాయి. అంటే.. ఆ రైల్లో ఉండే టికెట్లన్నీ కేవలం తత్కాల్ టికెట్లు మాత్రమేనన్నమాట. ప్రయాణికుల కష్టాలను ఎలా సొమ్ముచేసుకోవాలనే విషయం బాగా తెలిసిన రైల్వేశాఖ.. ఇప్పుడీ కొత్త మంత్రం కనుగొంది. బాగా బిజీగా ఉండే మార్గాల్లో ఈ తత్కాల్ స్పెషల్ రైళ్లను ప్రవేశపెడతారు. ఈ రైళ్లకు టికెట్లు ఆన్‌లైన్‌తో పాటు కౌంటర్లలో కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే వీటికి రిజర్వేషన్ సమయాన్ని కూడా కొంత పెంచారు. మామూలు తత్కాల్ అయితే 24 గంటల ముందు మాత్రమే బుక్ చేసుకోవాలి. కానీ తత్కాల్ స్పెషల్ రైళ్లకు 60 రోజుల నుంచి 10 రోజుల ముందు వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ల బుకింగ్ సాఫ్ట్వేర్ సిద్ధం కాగానే రైళ్లను ప్రవేశపెడతామని రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగానే తత్కాల్ రైళ్లలో సెకండ్ క్లాస్‌కు 10 శాతం, మిగిలిన తరగతులకు 30 శాతం అధికంగా టికెట్ ధరలు ఉంటాయి. -
‘ప్రీమియం’.. అమ్మో ప్రియం!
సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్ ప్రీమియం తత్కాల్ పేరిట రెండు, మూడు రెట్లు ఎక్కువగా చార్జీ వసూలు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాటు అడ్డగోలుగా దోపిడీ లబోదిబోమంటున్న ప్రయాణికులు విజయవాడ : ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో రైళ్లలో అత్యంత రద్దీ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పండక్కి ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. నగరం మీదగా కోస్తా జిల్లాలకు వచ్చే రైళ్లన్నింటిలో ఇప్పటికే అన్ని క్లాసుల టికెట్లు అయిపోయాయి. ముఖ్యంగా త్రీ టైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల టికెట్లకైతే చాంతాండంత వెయిటింగ్ లిస్టులు దర్శనమిస్తున్నాయి. తప్పనిసరిగా ప్రయాణం చేయాలనుకునే వారి అవసరాన్ని గుర్తించిన రైల్వే ‘ప్రీమియం’ పేరుతో దోచుకుంటోంది. మూడు నెలల క్రితం నరేంద్ర మోది సర్కార్ ప్రీమియం రైళ్లు, ప్రీమియం తత్కాల్ టికెట్లను గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశపెట్టింది. ఈ ప్రీమియం తత్కాల్ టికెట్లు విమానాలు, బస్సులతో పోటీ పడి ఉంటున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రీమియం రైళ్లు, ప్రీమియం తత్కాల్ టికెట్లను రైల్వేశాఖ నేరుగా కాకుండా ఐఆర్సీటీసీ ద్వారా విక్రయిస్తోంది. వీటిని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో కొనుగోలు చేయడానికి వీలులేదు. కొన్ని ముఖ్యమైన రైళ్లలో ప్రీమియం తత్కాల్ చెన్నై సర్కార్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు నుంచి వచ్చే శేషాద్రి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ వెళ్లే గౌతమి, గోదావరి, హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా తదితర కొన్ని ముఖ్యమైన రైళ్లలో ఈ ప్రీమియం తత్కాల్ టికెట్లను ప్రవేశపెట్టారు. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్న రైళ్లకే ఐఆర్సీటీసీ ప్రీమియం తత్కాల్ ఏర్పాటు చేసినట్లు రైల్వే కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. చుక్కల్ని అంటుతున్న ప్రీమియం రేట్లు! విజయవాడ నుంచి తిరుపతికి శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్ టిక్కెట్ రూ.235. తాత్కాల్లో రూ.375 కాగా, ప్రీమియం టికెట్ సుమారు రూ.1,000 వరకు పలుకుతోంది. కాకినాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు స్లీపర్ క్లాస్‌లో రూ.340, తత్కాల్ 430 కాగా, ప్రీమియం తత్కాల్ పేరుతో రూ.1,500 వరకు చార్జీ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. రైల్వే ప్రీమియం రేట్లు పైపైకి వెళ్లి చుక్కల్ని తాకుతున్నాయని లబోదిబోమంటున్నారు. 20 శాతం సీట్లు ప్రీమియం తత్కాల్‌కే గతంలో ప్రతి రైలులోనూ 40 శాతం బెర్త్‌లను తత్కాల్ కోటా కింద కేటాయించేవారు. రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు ఈ టికెట్లు కేటాయిస్తారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన రైళ్లలో ఈ తత్కాల్ టికెట్లలోనే 20 శాతం టికెట్లను ప్రీమియం తత్కాల్‌గా మార్చింది. తత్కాల్ టికెట్లు 20 శాతం పూర్తవగానే ప్రీమియం టికెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని, అయితే ఈ టికెట్లు రైల్వే కౌంటర్లలో కాకుండా ఆన్లైన్లో మాత్రమే లభిస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రీమియం తత్కాల్ టికెట్ రేటు ప్రతి నిమిషానికి మారిపోతూ ఉంటుందని, డిమాండ్‌ను బట్టి అప్పటికప్పుడు కంప్యూటర్లో వచ్చే రేటు ఆధారంగా ప్రయాణికుడి నుంచి చార్జీ వసూలు చేస్తారు. ముందుగా రేటు ఏ విధంగా నిర్ణ యిస్తారో తమకు తెలియదని స్థానిక రైల్వే అధికారులు చెబుతున్నారు. ఒకసారి ప్రీమియం తత్కాల్ టికెట్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని తిరిగి రద్దు చేసుకునే అవకాశం లేదు. ప్రయాణికుల గగ్గోలు... విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయికి నేరుగా తగినన్ని రైళ్లు లేవు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలోనే కోటా తీసుకోవాల్సి వస్తోంది. ఈ సీట్లలోనూ 40 శాతం తత్కాల్‌కే కేటాయిస్తున్నారు. అందులో 20 శాతం ప్రీమియం పేరుతో వేలకు వేలు దోచుకోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని ముఖ్యమైన రైళ్లలో సాధారణ టికెట్లు రెండు నెలలు ముందుగానే అయిపోతున్నాయని, ప్రీమియం తత్కాల్, తత్కాల్ టికెట్ల పేరుతో వందల బెర్త్‌లు ఖాళీగా ఉన్నట్లు చూపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లు ఎవరూ కొనుగోలు చేయకపోతే అప్పుడు ఆ టికెట్లను సాధారణ ప్రయాణికులకు చివరి నిమిషంలో రైల్వే అధికారులు కేటాయిస్తారు. కాగా, ప్రీమియం తత్కాల్ టికెట్‌పై పూర్తి అవగాహన లేక, ఎక్కువ చార్జీలు భరించలేక ప్రయాణికులు దీనిపై ఆసక్తిచూపడం లేదని తెలిసింది. ప్రీమియం తత్కాల్లో సాధారణ రోజుల్లో 50 శాతం సీట్లు, వారాంతం, పండుగ రోజుల్లో 80 శాతంసీట్లు భర్తీ అవుతున్నాయని తెలిసింది. ప్రీమియం రైళ్లు కొన్ని ముఖ్యమైన రైళ్లకు వెయిటింగ్ లిస్టు భారీగా ఉంటోంది. దీన్ని గమనిస్తున్న ఐఆర్సీటీసీ అధికారులు ఆ రూట్లో ప్రీమియం రైలును నడుపుతున్నారు. రైలు నడుపుతున్నట్లు కేవలం 15 రోజులు ముందు ఆన్లైన్ పెడుతున్నారు.ఈ రైలు చార్జీలను కూడా రైల్వే శాఖ నిర్ణయించినట్లు కాకుండా ఐఆర్సీటీసీ అధికారులే నిర్ణయిస్తారు. టికెట్లు కూడా ఆన్లైన్లోనే విక్రయిస్తారని, వాటి వివరాలు తమకు తెలియడం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
పండుగల సీజన్లో ప్రయాణికులకు చార్జీల షాక్
50శాతం తత్కాల్ కోటాకు డివూండ్ ప్రాతిపదికన పెరిగిన చార్జీలు న్యూఢిల్లీ: పండుగల సీజన్లో రైల్వే ప్రయూణికులకు ఇది చేదువార్త. దేశవ్యాప్తంగా 80రైళ్లలోని తత్కాల్‌కోటా టికెట్లలో సగం టికెట్ల ధరలు గణనీయుంగా పెరిగాయి. ప్రయూణికుల డివూండ్ ప్రాతిపదికగా, తత్కాల్ టికెట్లలో సగం కోటాను ‘డైనమిక్ ఫేర్ సిస్టమ్’ పరిధిలోకి తేవాలని రైల్వేశాఖ నిర్ణరుుంచడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పండుగల సీజన్ వుధ్యలో ప్రయూణికుల రద్దీని సొవుు్మచేసుకోవడం ద్వారా రైల్వే ఆదాయూన్ని పెంచుకోవడమే లక్ష్యంగా రైల్వేశాఖ ఈ నిర్ణయుం తీసుకుంది. తత్కాల్ కోటాలోని తొలి 50శాతం టికెట్లు ప్రస్తుత చార్జీలతోనే బుకింగ్ జరిగాక, మిగిలిన 50శాతం టికెట్లకు ప్రీమియుం ధరలను వర్తింపజేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియుర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ నెలలోనే అవులులోకి వచ్చిన ‘ప్రీమియుం తత్కాల్ టికెట్’ పథకాన్ని ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంచినట్టు రైల్వే బోర్డు (ట్రాఫిక్) సభ్యుడు డీపీ పాండే చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన 80రైళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నావున్నారు. ఇందుకోసం ఒక్కో జోన్లో ఐదేసి రైళ్లను గుర్తించాలని ఆయూ రైల్వే జోన్లను ఆదేశించినట్టు చెప్పారు. బ్లాకులో టికెట్లు విక్రయూనికి పాల్పడేవారి బెడదను అరికట్టేందుకే ఈ కొత్త చార్జీల వ్యవస్థను వర్తింపజేస్తున్నట్టు రైల్వే శాఖ చెబుతోంది. హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హజరత్ నిజావుుద్దీన్ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికిందరాబాద్-హౌరా ఫలక్‌నువూ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-బెంగళూరు ఎక్ప్రెస్, సికిందరాబాద్-పాట్నా ఎక్‌ప్రెస్‌లకు కూడా ఈ పథకం వర్తింపజేస్తున్నారు. ‘డైనమిక్ ఫేర్ సిస్టమ్’ అంటే: ‘డైనమిక్ ఫేర్ సిస్టమ్’ ప్రకారం తత్కాల్ కోటాలో తొలి 50శాతం టికెట్లు ప్రస్తుత రేట్లతోనే బుక్ చేస్తారు. తదుపరి 10శాతం టికెట్లకు 20శాతం ఎక్కువగా చార్జీ వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక ‘థర్డ్‌ఏసీ’ రైల్వేబోగీలో 60సీట్లు అందుబాటులో ఉంటే, వాటిలో 30టికెట్లకు సాధారణమైన తత్కాల్ చార్జీలు వర్తిస్తారుు. మిగిలిన 30సీట్లలో పదిశాతం సీట్లకు, అంటే 3సీట్లకు, 20శాతం ఆదనపు చార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఆ తర్వాత మిగిలిన 27 సీట్లకు ఇదే పద్ధతిలో, 20శాతం అదనపు చార్జీ వర్తిస్తూపోతుంది. -
తత్కాల్లో వివాహ నమోదు సర్టిఫికెట్
న్యూఢిల్లీ: తత్కాల్ సర్వీసులో పాస్‌పోర్టు, రైలు టికెట్లు పొందినట్టుగానే వివాహ ధ్రువీకరణ పత్రం కూడా కేవలం 24 గంటల్లో నగరవాసులకు ఢిల్లీ ప్రభుత్వం అందిస్తోంది. దంపతుల అవసరం, ప్రాధాన్యతను బట్టి వివాహ నమోదును ఒకేరోజులో అధికారికంగా ధ్రువీకరించేలా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంది. కాగా, 2006 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పెళ్లి అయిన నగరవాసులు 60 రోజుల్లోపు వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని ఢిల్లీ ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఈ పత్రం పొందే విషయంలో అనేక మంది ఇబ్బందులు పడటాన్ని దృష్టిలో ఉంచుకున్న సర్కార్ కేవలం 24 గంటల్లో వారికి వివాహ ధ్రువీకరణ పత్రం అందించాలని నిర్ణయించిందని రెవెన్యూ విభాగ కార్యదర్శి ధారమ్ పాల్ ఆదివారం విలేకరులకు తెలిపారు. గత నెల 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ సేవలకు మంచి స్పందన లభిస్తుందన్నారు. అత్యవసరమున్న వారు అనేక మంది ఒక్కొక్కరు పదివేల రూపాయల ఫీజు చెల్లించి 24 గంటల్లో సర్టిఫికెట్ పొందుతున్నారని తెలిపారు. హిందూ వివాహ చట్టం కింద నమోదు కోసం దరఖాస్తు ఫీజును రూ.100, ప్రత్యేక వివాహ చట్టం కింద రూ.150లు వసూలు చేస్తున్నామన్నారు. అప్లికేషన్ కోసం అవసరమైన ఆఫిడవిట్ల కొనుగోలు కోసం సుమారు రూ.400 నుంచి 500లు దరఖాస్తుదారులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. పస్తుతం వివాహాల నమోదును అదనపు మేజిస్ట్రేట్ పర్యవేక్షిస్తోందని, సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌కు కూడా ఈ పనులు అప్పగించాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే వివాహ నమోదు ప్రక్రియలో పారదర్శకత ఉండటంతో పాటు ఉచిత నమోదు ప్రక్రియ కోసం వచ్చే నెల నుంచి ఓ పోర్టల్‌ను ప్రారంభించాలనుకుంటున్నామని తెలిపారు. ఈ పోర్టల్ నుంచి దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. సర్టిఫికెట్ పొందేందుకు దశల వారీ ప్రక్రియ వివరాలు కూడా అందులో తెలుసుకోవచ్చని చెప్పారు. వినియోగదారులు తమ దరఖాస్తు స్థితి ఏ దశలో ఉందో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పాల్ వెల్లడించారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశాలను అనుసరించి ఢిల్లీ (వివాహ నమోదు తప్పనిసరి) ఆదేశం, 2014ను కులం, మతం, వధువు, వరుడు కులాలను పరిగణనలోకి తీసుకోకుండా అందరికీ వివాహ సర్టిఫికెట్లు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఢిల్లీలో పెళ్లి చేసుకోవాలంటే వరుడి వయస్సు 21 సంవత్సరాలు, యువతి వయస్సు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలనే నిబంధనను తీసుకొచ్చారు. పెళ్లి చేసుకోబోయే వారిలో ఒకరు భారతీయ పౌరుడై ఉండి, వివాహ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలనే ఆదేశాలు ఉన్నాయని పాల్ తెలిపారు. దంపతులు తమ ప్రాంతాల్లోని వివాహ అధికారికి ఫారమ్-ఏను సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవాలి. దీంతో వయస్సు, పౌరసత్వం, వరుడి, వధువు గుర్తింపు కార్డు, వివాహం జరిగిందనే దానికి రూఢి, వారు నివాసముండే పత్రాలను కూడా సమర్పించాలని ఆయన వివరించారు.