
దుబాయ్: దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త. తత్కాల్ పాస్‌పోర్టు ఇక ఒక్క రోజులోనే లభించనుంది. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయ నిర్వాసితులకు అదే రోజున తత్కాల్ కేటగిరీలో పాస్‌పోర్ట్ మంజూరు చేస్తామని దుబాయ్‌లోని భారత కాన్సులేట్ వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటలలోపు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అదే రోజున తత్కాల్ పాస్‌పోర్టు అందిస్తామని కాన్సుల్ జనరల్ విపుల్ తెలిపారు. దుబాయ్‌లోని అల్ ఖలీజ్ సెంటర్‌లో ఉన్న బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే 24 గంటల్లో తత్కాల్ పాస్‌పోర్టులను అందించే సర్వీసు ఉందన్నారు.
ఇవి చదవండి:
యూఏఈకి ఐదేళ్ల టూరిస్ట్ వీసా..
Comments
Please login to add a commentAdd a comment