Train ticket booking
-
నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!
భారత రైల్వే టికెటింగ్ సేవలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కో ఆపరేషన్ (ఐఆర్సీటీసీ)కి చెందిన ఈ-టికెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అధికారిక వెబ్సైట్, యాప్ సేవలను దాదాపు గంటసేపు నిలిపేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది.‘వెబ్సైట్ నిర్వహణ పనుల వల్ల అధికారిక వెబ్సైట్, యాప్‌లు నిలిచిపోయాయి. ఈ-టికెట్ సేవలకు మరో గంటపాటు అంతరాయం కలుగుతుంది. టికెట్లకు సంబంధించి ఏదైనా పరిష్కారాల కోసం తర్వాత ప్రయత్నించండి. మరేదైనా సమస్యల కోసం etickets@irctc.co.inకు మెయిల్ చేయండి. ఫైల్ టీడీఆర్ కోసం కస్టమర్ కేర్ నెంబర్ 14646, 0755-6610661, 0755-4090600కు సంప్రదించండి’ అని ఐఆర్సీటీసీ తెలిపింది.ఇదీ చదవండి: స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలు The Most Pathetic Service from @IRCTCofficial , When Can we expect an Improvement? are we so incompetent that cant handle the traffic on the #irctc app and website. when talking about the development but the foundation is very weak which is your server which is down all d time. pic.twitter.com/VpxRw8GemC— Chintan Raval (@ChintanRaval1) December 9, 2024స్టేటస్ ట్రాకింగ్ సాధనం డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. ఐఆర్సీటీసీ వినియోగదారులు వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దాదాపు 50 శాతం వెబ్సైట్ వినియోగదారులు సైట్, యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. దాంతో చాలామంది వినియోగదారులు విభిన్న సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని పంచుకుంటున్నారు. -
టికెట్ బుక్ అవ్వకుండానే రూ.100 కట్! ఐఆర్సీటీసీ రిప్లై ఇదే..
పండగ సీజన్లో రైళ్లు కిక్కిరిసిపోవడం గమనిస్తాం. దాంతో చాలామంది ప్రయాణికులు ముందుగానే రైలు టికెట్ బుక్ చేసుకుంటూంటారు. అయితే చివరి నిమిషం వరకు టికెట్ బుక్ అవ్వకపోతే కొన్ని ఛార్జీల రూపంలో రైల్వే విభాగం కొంత డబ్బులు కట్ చేసుకుని మిగతా నగదును సంబంధిత ప్రయాణికుడి ఖాతాలో జమ చేస్తోంది. దీనిపై ప్రశ్నిస్తూ ఇటీవల ఎక్స్ వేదికగా వెలిసిన పోస్ట్ వైరల్‌గా మారింది.అన్సారీ అనే ప్రయాణికుడు చేసిన పోస్ట్ ప్రకారం..‘నేను ఢిల్లీ నుంచి ప్రయారాజ్ వెళ్లాలనుకున్నాను. అందుకోసం రైల్వే టికెట్ బుక్ చేయాలని నిర్ణయించుకున్నాను. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్‌ను బుక్ చేశాను. కానీ నా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఫైనల్ చార్ట్ కూడా ప్రిపేర్ అయింది. అయితే నేను ముందుగా చెల్లించిన టికెట్ ధరలో రూ.100 కట్ అయి మిగతా నా ఖాతాలో జమైంది. నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా రూ.100 ఎందుకు కట్ చేశారో చెప్పగలరా?’ అంటూ ఇండియన్ రైల్వే మినిస్ట్రీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ను తన ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేశారు.Dear @RailMinIndia @AshwiniVaishnaw I booked a waitlisted ticket from Delhi to Prayagraj, but it didn’t get confirmed after the chart was prepared. Could you explain why 100 rupees were deducted from the refund instead of receiving the full amount#IRCTC #railway pic.twitter.com/L3UzYoq67P— SameerKhan (@SameerK95044261) October 29, 2024ప్రతి ప్యాసింజర్‌కు ఇదే నియమంఐఆర్సీటీసీ విభాగం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ పోస్ట్‌పై స్పందించింది. ‘భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ టికెట్‌కు సంబంధించి క్లర్కేజ్ ఛార్జీల కింద ప్రతి ప్యాసింజర్‌కు రూ.60 చొప్పున కట్ అవుతుంది. దీనిపై అదనంగా జీఎస్టీ ఉంటుంది’ అని తెలియజేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కాకుండా చాలామంది థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా టికెట్లు బుక్ చేస్తున్నారు. దాంతో టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే యాప్ కూడా అదనంగా ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.As per Indian Railway rules in case of waitlisted/RAC ticket clerkage charges Rs. 60/- along with GST per passenger shall be levied Please follow the given link: https://t.co/0Mek9yKVW3— IRCTC (@IRCTCofficial) October 29, 2024ఇదీ చదవండి: 60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇలా..> టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ప్రయాణం వాయిదా వేయాలనుకుని టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మాత్రం వివిధ తరగతులకు విభిన్నంగా ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ప్రయాణానికి 48 గంటల మందే క్యాన్సిల్ చేస్తే కింది ఛార్జీలు విధిస్తారు.ఏసీ ఫస్ట్/ ఎగ్జిక్యూటివ్: రూ.240 + GSTఫస్ట్ క్లాస్/ ఏసీ 2 టైర్: రూ.200 + GSTఏసీ చైర్ కార్/ ఏసీ 3 టైర్/ఏసీ 3 ఎకానమీ: రూ.180 + GSTస్లీపర్: రూ.120సెకండ్ క్లాస్: రూ.60> ట్రెయిన్ బయలుదేరే 48 నుంచి 12 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేయాలంటే ఛార్జీలో 25 శాతం, జీఎస్టీ భరించాల్సిందే.> ప్రయాణానికి 12 నుంచి 4 గంటలలోపు అయితే ఛార్జీలో 50 శాతం, జీఎస్టీ విధిస్తారు. -
ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పు
రైల్వే ప్రయాణం చేయాలంటే చాలామంది ముందుగా టికెట్స్ బుక్ చేస్తారు. ఇప్పటి వరకు 120 రోజులు ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఇండియన్ రైల్వే కల్పించింది. అయితే ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ 120 రోజులను 60 రోజులకు కుదించింది. అంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు రెండు నెలల ముందు మాత్రమే బుక్ చేసుకోగలరు.ఐఆర్సీటీసీ కొత్త నిబంధనలు 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అంతే కాకుండా అక్టోబర్ 31 వరకు బుక్ చేసుకునే వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. నవంబర్ 1 నుంచి అడ్వాన్స్ బుక్ చేసుకోవాలనుకునేవారికి మాత్రమే ఈ కొత్త నియమం వర్తిస్తుంది.ఇదీ చదవండి: లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లుతాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి ట్రైన్ అడ్వాన్స్ బుకింగ్‌లలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇందులో అడ్వాన్డ్ బుకింగ్ వ్యవధి తక్కువగానే ఉంది. విదేశీ పర్యాటకులకు 365 రోజుల పరిమితి విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండదని ఐఆర్సీటీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
రైలు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష, 10వేలు జరిమానా..!
దూర ప్రాంతాలకు వెళ్లాలంటే వెంటనే రైలు గుర్తొస్తుంది కదా. మనం వెళ్లాలనుకునే ప్రదేశానికి రైలు రూటు ఉంటే వెంటనే ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తాం. చాలాసార్లు మన వ్యక్తిగత ఐఆర్‌సీటీఐ ఐడీ నుంచి మన మిత్రులు, బంధువులు, తెలిసిన వారికి సైతం టికెట్ బుక్ చేస్తుంటాం. అయితే ఇకపై అలా చేస్తే జైలుశిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సిందే. ‘అదేంటి కేవలం రైలు టికెట్ బుక్ చేస్తేనే అలా చేస్తారా..?’ అనే అనుమానం వస్తుందా.. అయితే, రైల్వేశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనల గుర్తించి మీకు తెలియాల్సిందే..స్నేహితులు, బంధువులు, టెక్నాలజీపై అంతలా అవగాహన లేని వారికి, మనకు తెలిసిన వారికి టికెట్ బుక్ చేసి ఇవ్వాలనే ఉద్దేశం మంచిదే. అయినప్పటికీ, ఈ విధానాన్ని రైల్వేశాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వ్యక్తిగత ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అలాచేస్తే ఏకంగా జైలుశిక్షతో పాటు భారీ జరిమానా తప్పదని స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వేశాఖ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో దుర్వినియోగాన్ని కట్టడి చేయడంతోపాటు పారదర్శకత కోసమే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ప్రకటించింది.రైల్వే చట్టం, 1989-సెక్షన్ 143 ప్రకారం.. పరిమితులకు మించి టికెట్లు బుక్ చేయాలంటే రైల్వేశాఖ గుర్తింపు కలిగిన ఏజెంట్లై ఉండాలి. దీన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఒకవేళ అనుకోని కారణాల వల్ల కొత్త నిబంధనలు మీరితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.10వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్.. ఇవి గమనిస్తే మేలునిబంధనలు ఏం చెబుతున్నాయంటే..రైల్వేశాఖ నిబంధనల ప్రకారం..ఐఆర్సీటీసీ వ్యక్తిగత ఐడీతో కేవలం రక్త సంబంధీకులు లేదా ఒకే ఇంటిపేరు ఉన్న వ్యక్తులకు మాత్రమే టికెట్ బుక్ చేయాలి. ఆధార్‌తో లింకు చేసుకున్న యూజర్ నెలకు 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకోనివారు 12 టికెట్ల వరకు తీసుకోవచ్చు. ఇది కూడా యూజర్‌తో పాటు తన కుటుంబీకులకే వర్తిస్తుంది. అలా కాకుండా మిత్రులు, ఇతర బంధువులకు టికెట్ బుక్ చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. -
జర్నీకి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?
చివరి నిమిషంలో ఊరు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? లేదంటే వీరే ప్రాంతంలో మీకు అత్యవసర పనిబడిందా? ఇందుకోసం మీరు ముందస్తుగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోలేదా? చింతించకండి. ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్‌లో కొత్త సదుపాయాన్ని కల్పించింది.పలు కారణాల వల్ల చివరి నిమిషంలో ప్రయాణికులు వారు బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ చేస్తుంటారు. మరి ఆ టికెట్లు వృధాగా పోతున్నాయి. అందుకే రైలు ప్రయాణానికి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.అయితే స్లీపర్, 3ఏసీ, 2ఏసీ, 1ఏసీలో సీట్లు ఖాళీగా ఉంటే.. జర్నీకి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. మరి ఈ భోగీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు ఆన్లైన్ చార్ట్ వెబ్సైట్లోకి వెళ్లి ..ట్రైన్ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత గెట్ ట్రైన్ చార్ట్ కనిపిస్తుంది. ఇందులో ట్రైన్ వివరాలు కనిపిస్తాయి. అక్కడ సీట్లు ఉన్నాయని తెలుస్తే బుక్ చేసుకోవచ్చు. -
రైలు ప్రయాణికులకు శుభవార్త.. క్యూలో నిలబడకుండా జనరల్ టికెట్
స్టేషన్లో క్యూలో నిలబడి టికెట్ తీసుకుంటున్న ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆ శాఖకు చెందిన యాప్‌లను కొత్త ఫీచర్లతో అప్డేట్ చేస్తున్నారు. రైల్వేశాఖ గతంలోనే తీసుకొచ్చిన యూటీఎస్ (అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్) యాప్‌లో తాజాగా మార్పులు చేసింది.రైలు ప్రయాణం చేయాలనుకున్నపుడు జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. టికెట్‌కోసం క్యూలో నిలుచున్నా కొన్నిసార్లు ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైలు వెళ్లిపోయిన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలాఅని ట్రెయిన్ వెళుతుంటే టికెట్ లేకుండా ఎక్కలేం. ప్రధానంగా సెలవులు, పండగలప్పుడు జనరల్ టికెట్ కోసం పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రైలుశాఖ యూటీఎస్ (అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్) యాప్‌ను గతంలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు క్యూలో నిలుచోకుండా ఈ యాప్ ద్వారా జనరల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే స్టేషన్‌కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. దీంతో ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు రైల్వేశాఖ గుర్తించింది.ఇదీ చదవండి: హార్లిక్స్ లేబుల్ తొలగింపు.. కారణం ఇదేనా..తాజాగా రైలు ప్లాట్‌ఫామ్‌కు ఎంత దూరంలో ఉన్నా టికెట్ పొందేలా యాప్‌ను అప్డేట్ చేశారు. దాంతో ఇంట్లో ఉండగానే కంగారుపడకుండా జనరల్ టికెట్ బుక్ చేసుకుని రైలు వచ్చే సమయానికి స్టేషన్‌కు వస్తే సరిపోతుంది. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. సరిగ్గా రైలు ప్లాట్‌ఫామ్‌పైకి రాబోతుందనే సమయానికి అంటే ప్లాట్‌పామ్‌కు 50 మీటర్లు దూరంలో ఉన్నపుడు మాత్రం ఈ యాప్ పనిచేయదని గమనించాలి. -
సీటు గ్యారంటీ! పేటీఎంలో రైలు టికెట్ బుకింగ్‌పై కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రైలు టికెట్ల బుకింగ్‌పై సీటు గ్యారంటీ సేవను ప్రారంభించింది. దీని వల్ల యూజర్లు పేటీఎంపై రైలు టికెట్ బుక్ చేసుకోవడం ద్వారా కన్ఫర్మ్డ్ టికెట్ పొందొచ్చని వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం మాతృ సంస్థ) ప్రకటించింది. కన్ఫర్మ్డ్ టికెట్ కోసం ఒకటికి మించిన రైలు ఆప్షన్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఇందుకోసం యూజర్లు పేటీఎం యాప్‌పై రైలు టికెట్ బుకింగ్ సమయంలో ఆల్టర్నేటివ్ స్టేషన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఎంపిక చేసుకున్న రైలులో టికెట్లకు వెయిట్ లిస్ట్ చూపిస్తే, అప్పుడు ఆల్టర్నేటివ్ స్టేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది సమీప స్టేషన్లకు ఏ రైలులో టికెట్లు అందుబాటులో ఉన్నది చూపిస్తుంది. దీనివల్ల సీటు లేదన్న ఆందోళన ఉండదని పేటీఎం తెలిపింది. -
తత్కాల్ టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్.. రైలు ప్రయాణికులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపులు సేవల సంస్థ పేటీఎం.. తన ప్లాట్‌ఫామ్ ‘పేటీఎం యాప్’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ను పొందొచ్చని తెలిపింది. న్యూమనీ సేవింగ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ సదుపాయం యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. తత్కాల్ సహా సహా అన్ని రకాల రైలు టికెట్ల రద్దుపై అప్పటికప్పుడే సోర్స్ అకౌంట్ (చెల్లింపులు చేసిన బ్యాంక్ ఖాతా లేదా కార్డ్)కు రిఫండ్ పొందొచ్చని ప్రకటించింది. రిఫండ్ కోసం రోజులకొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది. రైలు ప్రారంభానికి ఆరు గంటల ముందు లేదంటే చార్ట్ రూపొందించడానికి (వీటిలో ఏది ముందు అయితే అదే వర్తిస్తుంది) ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది. ‘‘మొబైల్ చెల్లింపులు, క్యూఆర్ టెక్నాలజీలో ప్రముఖ సంస్థగా ఉన్న పేటీఎం, ట్రావెల్ బుకింగ్‌లకు సంబంధించి మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఉన్న ఫళంగా రైలు టికెట్లు రద్దు చేసుకునే వారికి ఈ కొత్త సుదపాయం ఉపశమనాన్ని ఇస్తుంది’’అని పేటీఎం అధికార ప్రతినిధి తెలిపారు. రైలు టికెట్లు బుకింగ్‌కు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే గేట్‌వే ఫీజు వసూలు చేయడం లేదని పేటీఎం తెలిపింది. -
గుడ్‌న్యూస్.. రైల్వే ప్రయాణికులకు పండగే.. ఇకపై క్షణాల్లోనే
ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికుల కోసం ఈ - వ్యాలెట్ పేరుతో అధునాతనమైన సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవల్ని వినియోగించుకోవడం ద్వారా ప్రయాణికులు ఎలాంటి సందర్భాలలోనైనా సులభంగా రైల్వే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. త్వరలో స్కూల్స్, కాలేజీలకు సమ్మర్ హాలిడేస్. పండగలు.. పబ్బాలు..పెళ్లిళ్లు.. శుభకార్యాలకు ఊరెళ్లాల్సి వస్తుంది. లేదంటే ఇతర అత్యవసర సమయాల్లో ట్రైన్లలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇందుకోసం రోజులు .. నెలల ముందే నుంచే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే తలకు మించిన భారం. ఒక్కోసారి టికెట్ బుక్ చేసుకొని పేమెంట్ చేసే సమయంలో సర్వర్ డౌన్ అవుతుంది. బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. ఆ డబ్బులు తిరిగి మన అకౌంట్‌కు ఎప్పుడు డిపాజిట్ అవుతాయో? లేదో తెలియదు. ఈలోగా ఇంకో టికెట్ బుక్ చేసుకోవాలంటే.. మళ్లీ కొంత మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ఇదిగో..! ఈ తరహా సమస్యల పరిష్కార మార్గంగా ఐఆర్సీటీసీ ఈ - వ్యాలెట్ సేవల్ని ప్రయాణికులకు అందిస్తుంది. ఐఆర్సీటీసీ ఈ-వ్యాలెట్ సేవల వినియోగం ద్వారా రద్దీ సమయాల్లో ట్రైన్ టికెట్‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చు. బ్యాంకుల సర్వర్, రైల్వే సేవల్లో అంతరాయం వంటి సందర్భాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణం రద్దుతో.. టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ డబ్బులు మరుసటి రోజు ఈ వ్యాలెట్‌లో డిపాజిట్ అవుతాయి. ఇందుకోసం ప్రయాణికులు చేయాల్సిందల్లా ఈ-వ్యాలెట్‌లో లాగిన్ అవ్వడమే. ఈ లాగిన్ సేవలు మూడేళ్ల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకున్న ప్రతిసారి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. ఐఆర్సీటీసీ ఈ వ్యాలెట్‌లో (Irctc E-wallet) ఇలా లాగిన్ అవ్వాలి ♦ఐఆర్సీటీసీ వెబ్ పోర్టల్ ఓపెన్ చేయాలి. ♦అందులో ఐఆర్సీటీసీ ఈ-వ్యాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ♦రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పాన్ - ఆధార్ నెంబర్‌తో వెరిఫై చేసుకోవాలి ♦మీ ప్రొఫైల్ వెరిఫికేషన్ విజయవంతం అయితే మీరు డైరెక్ట్‌గా ఐఆర్సీటీసీ ఈ-వ్యాలెట్ రిజిస్ట్రేషన్‌లోకి వెళతారు. ♦ఐఆర్సీటీసీ వ్యాలెట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50 చెల్లించాలి ♦ఈ ప్రాసెస్ పూర్తయితే వ్యాలెట్ రిజిస్ట్రేషన్ లాగ్ అవుట్ అవుతుంది. ఐఆర్సీటీసీ ఈ-వ్యాలెట్లోకి డబ్బుల్ని ఎలా డిపాజిట్ చేయాలి ♦ఐఆర్సీటీసీ అకౌంట్లో లాగిన్ అవ్వాలి ♦లాగిన్ అనంతరం మీరు ఐఆర్సీటీసీ ఈ-వ్యాలెట్ డిపాజిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦అక్కడ రూ.100 నుంచి రూ.10 వేల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ♦మీకు కావాల్సిన మనీని రూ.100, రూ.500 ఇలా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ మోడ్ నెట్ బ్యాంకింగ్‌పై క్లిక్ చేసి మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో సదరు బ్యాంక్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ్ సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ♦ఆ మని కేవలం ఐఆర్సీటీసీ ఈ - వ్యాలెట్‌లో ఉంటాయి. విత్ డ్రా చేసుకొని వినియోగించుకునేందుకు వీలు లేదు. కేవలం ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునేందుకు మాత్రమే ఆ డబ్బుల్ని వాడుకోవాల్సి ఉంటుంది. ♦విజయవంతంగా డిపాజిట్ చేయడం పూర్తయితే ఐఆర్సీటీసీ ఈ - వాలెట్లో మీరు ఎంత డిపాజిట్ చేశారో డిపాజిట్ హిస్టరీలో కనిపిస్తుంది. ♦ఇక ఈ- వ్యాలెట్‌లో డబ్బుల్ని డిపాజిట్ చేసిన తర్వాత ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యాన్సిల్ అయితే ఆ మరుసటి రోజే మీ డబ్బులు మీ ఈ - వ్యాలెట్ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. పాన్ - ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్! -
కొత్త అవతారం ఎత్తిన రానా దగ్గుబాటి
హైదరాబాద్: రైలు టికెట్ల బుకింగ్, డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ‘కన్ఫర్మ్టికెట్’ యాప్ తన బ్రాండ్ ప్రచారకర్తగా రాణా దగ్గుబాటిని నియమించుకుంది. కన్ఫర్మ్టికెట్ యాప్‌ను, రైలు ప్రయాణానికి సంబంధించి సౌకర్యవంతమైన ఫీచర్ల గురించి ప్రచారం కల్పించేందుకు నూతన కార్యక్రమాన్ని ‘ట్రైన్ టికెట్ టైగర్’ను రూపొందించినట్టు సంస్థ తెలిపింది. ఈ ప్రచార వీడియో ప్రకటనల్లో రాణా కొత్త అవతారంలో కనిపిస్తారని పేర్కొంది. బోర్డింగ్, డ్రాపింగ్ పాయింట్‌ను మార్చుకునే సదుపాయం ఇందులో ఉన్న ట్టు తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమం విషయంలో కన్ఫర్మ్టికెట్తో భాగస్వామ్యం పట్ల తాను ఉత్సాహంగా ఉన్నట్టు రాణా దగ్గుబాటి ప్రకటించారు. ప్రముఖ ట్రెయిన్ టికెట్ బుకింగ్ యాప్‌గా కన్ఫర్మ్టికెట్ను, దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగిస్తున్నట్టు చెప్పారు. -
IRCTC: ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు!
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్ లేదంటే యాప్‌ని ఉపయోగించి రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకుల కోసం.. టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను సవరించింది. ఐఆర్సీటీసీ.. బుధవారం ఈ మేరకు ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. ఐఆర్సీటీసీ వినియోగదారులు తమ యాప్ లేదా వెబ్సైట్లో ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు వారి ఫోన్ నంబర్లు మరియు ఈ-మెయిల్ ఐడీలను ధృవీకరించడం తప్పనిసరి చేసింది. ఈ యాప్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుందన్నది తెలిసిందే. ఇక మీదట.. వెరిఫికేషన్ లేకుండా కస్టమర్లు టిక్కెట్లు బుక్ చేసుకోలేరని IRCTC స్పష్టం చేసింది. అయితే COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ చేయని వారికి కొత్త నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ , ఈ-మెయిల్ ఐడీని ఎలా ధృవీకరించవచ్చో చూద్దాం.. ►ముందుగా ఐఆర్సీటీసీ యాప్ లేదంటే వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ వెరిఫికేషన్ విండో కనిపిస్తుంది. ► అందులో మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. ► కుడి వైపు వెరిఫికేషన్.. ఎడమ వైపు ఎడిట్ బటన్ కనిపిస్తాయి. ► వివరాలను పొందుపరిచాక.. వన్ టైం పాస్వర్డ్(ఓటీపీ) మొబైల్ నెంబర్ లేదంటే మెయిల్ ఐడీకి వస్తుంది. ► ఆపై వెరిఫై ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ తర్వాత.. ఐఆర్సీటీసీ పోర్టల్ లేదా యాప్‌కు వెళ్లి లాగిన్ కావాలి. స్టేషన్, తేదీ, ఇతర వివరాలను ఎంటర్ చేయాలి. బుక్ నౌ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రయాణికుల వివరాలు.. ఇతర వివరాలు పొందుపర్చాలి. పేమెంట్ ఆప్షన్ పూర్తయ్యాక.. అప్పుడు కన్ఫర్మేషన్ వివరాలు వస్తాయి. చదవండి: గూగుల్‌లో ఈ మూడు విషయాలు సెర్చ్ చేయొద్దు.. చేస్తే జైలుకెళ్లడం ఖాయం! -
మీకు ఈ విషయం తెలుసా? డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు!
Paytm Buy Now Pay Later: అరెరె!! చేతిలో డబ్బులు లేవే. అర్జెంట్‌కు ఊరెళ్లాలి. ఇంట్లో వాళ్లు ఎదురు చూస్తున్నారే. ఇప్పుడెలా? ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుంటే. ఊరెళ్తున్నాం కదా..వచ్చిన తరువాత ఇవ్వొచ్చులే. ఇదిగో ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గంగా ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. చేతిలో డబ్బులు లేకపోయినా సరే పేటీఎం సాయంతో ఐఆర్సీటీసీలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ డబ్బుల్ని పేటీఎం నిర్దేశించిన నిర్ణీత గడువు లోపు చెల్లించవచ్చు. పేటీఎం సంస్థ ఐఆర్సీటీసీ భాగస్వామ్యంతో 'బై నౌవ్, పే లేటర్' (బీఎన్‌పీఎల్) ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో పేటీఎంలో డబ్బులు లేకుండా వన్ క్లిక్‌తో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంతేనా ట్రైన్ టికెట్ల నుంచి నిత్యవసర వస్తువుల వరకు.. నిత్యవసర వస్తువుల నుంచి షాపింగ్ వరకు డబ్బులు లేకుండానే మనకు నచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేయోచ్చు. ఇందుకోసం పేటీఎం ఎటువంటి వడ్డీ లేకుండా రూ.60వేల వరకు ఆఫర్ చేస్తుంది. ఇక ఖర్చు చేసిన మొత్తాన్ని 30రోజుల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన కస్టమర్లకు ఈఎంఐ సౌకర్యం అందిస్తామని పేటీఎం పేమెంట్ సర్వీస్ సీఈఓ ప్రవీణ్ శర్మ తెలిపారు. ట్రైన్ టికెట్లు ఎలా బుక్ చేయాలంటే? ♦ ముందుగా ఐఆర్‌సీటీసీలోకి వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో మీరు వెళ్లాల్సిన జర్నీ వివరాల్ని ఎంటర్ చేసి పేలేటర్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి ♦ పేలేటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్లో పేటీఎం పోస్ట్ పోయిడ్ ఆప్షన్ కనిపిస్తుంది ♦ ఆ పేటీఎం పోస్ట్ పెయిడ్ ఆప్షన్ పై ట్యాప్ చేస్తే డైరెక్ట్‌గా పేటీఎం యాప్ ఓపెన్ అవుతుంది ♦ అందులో మీ వ్యక్తిగత వివరాల్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. చదవండి: మాకు బజాజ్ ఫైనాన్స్ ఒక్కటే బెంచ్‌మార్క్: పేటీఎం సీఈవో విజయ్‌శేఖర్ శర్మ -
రైల్వే టికెట్ రద్దు చేస్తే ఇక క్షణాల్లో ఖాతాలో డబ్బులు జమ
మనం దూర ప్రాంత ప్రయాణాలు చేయాలని అనుకున్నప్పుడు ఎక్కువ శాతం రైల్వే టికెట్ బుక్ చేసుకొని ప్రయాణిస్తుంటాము. అయితే, ఏదైనా కారణాల వల్ల టికెట్ రద్దు చేస్తే మనం బుక్ చేసిన డబ్బులో చాలా వరకు కట్ కావడమే కాకుండా చాలా రోజులకు గాని, ఆ నగదు మన ఖాతాలో జమ కాదు. అయితే, ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఐఆర్సీటిసీ కొత్త సేవలను ప్రారంభించింది. ఇంతకు ముందు వరకు ఐఆర్సీటిసీకి స్వంతంగా పేమెంట్ గేట్ వే లేదు. అయితే, ఇప్పుడు ఐ-పే రూపంలో కొత్తగా స్వంత పేమెంట్ గేట్-వేను తీసుకొని వచ్చింది. ఒకవేల మీరు గనుక టికెట్ బుక్ చేసే సమయంలో ఐ-పే ద్వారా బుక్ చేస్తే మీకు త్వరగా టికెట్ బుక్ కావడమే కాకుండా టికెట్ రద్దు చాలా తక్కువ సమయంలో నగదు రీఫండ్ అవుతుంది.(చదవండి: టెలికాం రంగానికి కేంద్రం భారీ ఊరట) ఐపే సర్వీస్ అంటే ఏమిటి? ఐపే సర్వీస్ పేరుతో ఐఆర్సీటిసీ కొత్త సేవలను ప్రారంభించింది. దీని ద్వారా, ప్రజలు టిక్కెట్లను త్వరగా బుక్ చేయవచ్చు. అలాగే, టికెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత రీఫండ్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఐఆర్సీటిసీ తన యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ చేసే సమయంలో కొత్త పేమెంట్ గేట్ వే "ఐ-పే" సేవలను ప్రవేశపెట్టింది. ఐఆర్సీటిసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంతకు ముందు టికెట్ రద్దు చేసినప్పుడు రీఫండ్ కోసం ఎక్కువ సమయం పట్టేది, కానీ ఇప్పుడు మీ డబ్బు వెంటనే మీ ఖాతాలో జమ అవుతుంది. యూజర్ తన యుపీఐ బ్యాంక్ అకౌంట్ లేదా డెబిట్ కార్డు వివరాలు నమోదు చేస్తే చాలు ఆ తర్వాత తదుపరి లావాదేవీలు చేసటప్పుడు ఆటోమెటిక్ గా వివరాలు కనిపిస్తాయి. తత్కాల్ టికెట్ బుకింగ్ చేసే సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. (చదవండి: రైల్వే రిజర్వేషన్ టికెట్ బదిలీ చేసుకోవచ్చు ఇలా..!) ఐఆర్సీటిసీ స్వంత పేమెంట్ గేట్ వే ఐఆర్సీటిసీ ప్రకారం ఇంతకుముందు కంపెనీకి దాని స్వంత పేమెంట్ గేట్ వే లేదు, కానీ ఇప్పుడు ఐ-పే రూపంలో వచ్చింది. తరచుగా ప్రజలు గూగుల్ పే, రేజర్ పే, పేటిఎమ్ వంటి ఇతర చెల్లింపు గేట్ వేలను ఉపయోగించాల్సి వచ్చేది. దీనికి ద్వారా టికెట్ బుక్ చేసటప్పుడు ఎక్కువ సమయం పట్టేది, అలాగే నగదు రీఫండ్ కూడా చాలా ఆలస్యంగా జరిగేది. కానీ, ఇక నుంచి ఒకవేల మీరు గనుక టికెట్ బుక్ చేసే సమయంలో ఐ-పే ద్వారా బుక్ చేస్తే మీకు త్వరగా టికెట్ బుక్ కావడమే కాకుండా టికెట్ రద్దు చాలా తక్కువ సమయంలో నగదు రీఫండ్ అవుతుంది. ఐఆర్సీటిసీ ఐపేతో టిక్కెట్ ఎలా బుక్ చేయాలి? మొదట www.irctc.co.in లాగిన్ అవ్వండి. మీ ప్రయాణ వివరాలు సమర్పించి టికెట్ బుకింగ్ చేసేటప్పుడు పేమెంట్ కోసం 'ఐఆర్సీటిసీ ఐపే' ఆప్షన్ ఎంచుకోండి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యుపీఐ మొదలైన వాటి ద్వారా పేమెంట్ చేయండి. ఆ తర్వాత వెంటనే మీ టిక్కెట్ బుక్ అవుతుంది. అలాగే మీకు ఎస్ఎమ్ఎస్, ఈ-మెయిల్ కూడా టిక్కెట్ వస్తుంది. -
‘అమెజాన్’లో రైలు టికెట్లు.. 10% డిస్కౌంట్
సాక్షి, అమరావతి: రైల్వే ప్రయాణికులకు త్వరలోనే అమెజాన్ పేయాప్ ద్వారా సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఐఆర్సీటీసీ, అమెజాన్ మధ్య టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే అమెజాన్ పేయాప్ ద్వారా విమాన, బస్సు టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అమెజాన్ పే యాప్ ద్వారా మొదటిసారి టికెట్లు బుక్ చేసుకునే వారికి 10 శాతం నగదు రాయితీ లభించనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 శాతం వరకు రాయితీ ఉంటుంది. కాగా రైల్వే అధికారులు ఈ–కామర్స్ కంపెనీలతో సరుకు రవాణాకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. త్వరలోనే ఫ్లిప్ కార్ట్ కంపెనీ దక్షిణ మధ్య రైల్వేతో ఒప్పందం కుదుర్చుకోనుంది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో బంపర్ ఆఫర్ సేల్స్) అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఆఫర్ అక్టోబర్ 17న ప్రారంభం న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘‘గ్రేట్ ఇండియా ఫెస్టివల్’’ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 17న ప్రారంభమవుతుంది. సుమారు 6.5 లక్షల మంది పైగా విక్రేతలు కోట్లలో తమ ఉత్పత్తులను కస్టమర్లకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఆఫర్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సుమారు 900కి పైగా తమ ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాయి. ఈ పండుగ సీజన్లలో తమ కస్టమర్లకు కావల్సిన వస్తువులను సరైన సమయంలో, సురక్షితంగా అందించడం తమ కర్తవ్యమని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీశ్ తివారీ తెలిపారు. -
ఆన్లైన్లో రైల్వే టికెట్ పొందండిలా..
సాక్షి, హైదరాబాద్: రైలు టికెట్ సేవలను పొందడానికి ఇండియన్ రైల్వే పలు సులభ మార్గాలను ప్రవేశపెట్టింది. టికెట్ కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ సేవలు వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టిన విధానాల్లో ఈ టికెట్ విధానం ఒకటి. ఈ టికెట్‌ను పొందాలంటే ఇలా చేయాలి. రైల్వే వెబ్సైట్ http://www.irctc.co.inను ఓపెన్ చేయండి. పేరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అప్లికేషన్లో మరోసారి పేరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి పూర్తి అడ్రస్‌తో సబ్మిట్ అన్న చోట క్లిక్ చేయండి. ‘ప్లాన్ మై ట్రావెల్ అండ్ టికెట్స్’ కాలమ్‌ను పూర్తి చేయండి. ఈ కాలమ్‌లో రైళ్లు ప్రయాణించే మార్గాలు, రైలు బెర్తు, టికెట్ ధర తెలుసుకుని పూర్తి చేయాలి. టికెట్‌కు సరిపడా డబ్బులు చెల్లించడానికి మేకింగ్ పేమెంట్ వద్ద క్లిక్ చేయాలి. మీ డెబిట్ కార్డు ఉన్న బ్యాంక్ కాలమ్‌ను క్లిక్ చేసి టికెట్ బుక్ చేసుకోండి. ఈ టికెట్ బుక్ చేసే వారు రూ.20 యూజర్ ఛార్జీ చెల్లించాలి. ఈ టికెట్ బుకింగ్‌కు ఫొటో గుర్తింపు కార్డు వివరాలు తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. -
సెప్టెంబర్ కల్లా రెండు రైల్వే ఐపీఓలు!
న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన ఐఆర్సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. ఎన్నికలు పూర్తయి, కొత్త ప్రభుత్వం కొలువు దీరాక ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పిస్తామన్నారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద ఈ రెండు రైల్వే కంపెనీల ఐపీఓల ద్వారా రూ.1,500 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలనే కేంద్రం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌లో 12.2 శాతం వాటా విక్రయం ద్వారా రూ.480 కోట్లు సమీకరించింది. ఐఆర్ఎఫ్సీపై తుది నిర్ణయం.... ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) ఐపీఓను ఈ ఏడాది మొదట్లోనే తేవాలని ప్రభుత్వం భావించింది. ఐఆర్ఎఫ్సీ స్టాక్ మార్కెట్లో లిస్టైతే, వడ్డీ వ్యయాలు పెరుగుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ విషయమై కేంద్ర కేబినెట్ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. రైల్వేలకు సంబంధించి విస్తరణ ప్రణాళికలకు కావలసిన నిధులను ఐఆర్ఎఫ్సీ క్యాపిటల్ మార్కెట్ నుంచి సమీకరిస్తుంది. ఇక రైల్వేలకు చెందిన కేటరింగ్, టూరిజమ్ కార్యకలాపాలను ఐఆర్సీటీసీ నిర్వహిస్తోంది. 2017లోనే లిస్టింగ్ నిర్ణయం... ఐదు రైల్వే కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనే ప్రతిపాదనను 2017 ఏప్రిల్‌లోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైట్స్, ఆర్వీఎన్ఎల్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీ లిస్ట్ కావలసి ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా రూ.90,000 కోట్లు సమీకరించాలని ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
తెలంగాణ విద్యార్థులు క్షేమం
సాక్షి, హైదరాబాద్: కేరళ వరదల్లో చిక్కుకున్న ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మౌర్య రాఘవ్(ఖమ్మం), శరణ్ శ్రావణ్(వరంగల్) క్షేమంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ కార్యాలయ అధికారులు తెలిపారు. వారిని స్వరాష్ట్రానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం విద్యార్థినులు, కొట్టాయం కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఇప్పటికే విద్యార్థినులకు రైలు టికెట్లు బుక్ చేశామని, వారు సోమవారం తెలంగాణకు బయల్దేరుతారని వెల్లడించారు. -
రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలందించే క్రమంలో రైల్వేలు సరికొత్త వెబ్‌సైట్‌ను లాంఛ్ చేయనున్నాయి. ప్రయాణీకులు తమ ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మలుచుకునేందుకు వేగంగా,సులభంగా టికెట్లు బుక్ చేసుకునేందుకు అనువుగా ఆండ్రాయిడ్ ఆధారిత ఐఆర్సీటీసీ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త వెబ్సైట్ ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటూ ఈజీ లాగిన్, నేవిగేషన్ సౌకర్యాలను అందిస్తుంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో టైమ్డ్ అవుట్ సమస్యలకు చెక్ పెడుతుంది. ఇతర ట్రావెల్ వెబ్సైట్లు, యాప్స్ నుంచి పోటీని తట్టుకుంటూ కొత్త వెబ్సైట్, యాప్ ద్వారా పెద్ద ఎత్తున రాబడి పెంచుకోవాలని రైల్వేలు యోచిస్తున్నాయి. కన్ఫర్మ్ అయిన టికెట్ల డిస్ప్లే, డేటా ఎనలిటిక్స్ ద్వారా ప్రయాణ తేదీలను ఖరారు చేసుకోవడం వంటి కొత్త ఫీచర్లను వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. రైళ్ల రాకపోకలను రియల్‌టైమ్ ప్రాతిపదికన ప్రయాణీకులకు ఎస్ఎంఎస్ అలర్ట్‌ల ద్వారా చేరవేసేందుకూ రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రయాణ సమయంలో జాప్యం, జాప్యానికి కారణాలు, తదుపరి స్టేషన్‌కు రైలు చేరే సమయం వంటి వివరాలను ప్రయాణీకుడి మొబైల్‌కు టెక్స్ట్ అలర్ట్‌లు పంపాలని రైల్వేలు భావిస్తున్నాయి. రైలు ఎక్కడ ఉన్నదనే వివరాలను ఇస్రో సాయంతో శాటిలైట్ల ఆధారంగా ప్రయాణీకులకు చేరవేసేలా నూతన ఫీచర్లనూ అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేలు ప్రయత్నిస్తున్నాయి. -
30 నిమిషాల ముందు రైలు టికెట్ బుకింగ్
న్యూఢిల్లీ: రైలు బయలుదేరటానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ అమల్లోకి తేనుంది. నవంబర్ 12 నుంచి ఇది అమల్లోకి రానుంది. అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఇంటర్నెట్ వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం వర్తించనుంది. దీంతో..ఇప్పటి వరకు ఒకసారే చార్ట్ సిద్ధం చేసే రైల్వే ఇక రెండుసార్లు చార్ట్ సిద్ధం చేయాల్సి వస్తుంది. రైలు బయలుదేరే ముందు టీటీఈలకు ఈ చార్ట్ అందజేస్తారు. -
నిమిషానికి 7 వేల టికెట్లు
ఢిల్లీలో ఈ టికెటింగ్ వ్యవస్థను ప్రారంభించిన సదానంద గౌడ న్యూఢిలీ: ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌లో ఎదురయ్యే ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తూ రూపొందించిన అధునాతన ఈ టికెటింగ్ వ్యవస్థకు రైల్వే శాఖ బుధవారం శ్రీకారం చుట్టింది. పాత పద్ధతిలో నిమిషానికి 2,000 టికెట్లు బుక్‌చేయడానికి వీలుండగా, ఈ కొత్త వ్యవస్థద్వారా నిమిషానికి 7,200 టికెట్లు బుక్‌చేయవచ్చు. మొత్తం బుకింగ్ ప్రక్రియ వేగంగా, సులభతరంగా ఉండేలా ఈ వ్యవస్థను రూపొందించారు. కొత్త తరహా ఈ టికెటింగ్ వ్యవస్థను రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ఢిల్లీలో ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో హామీ ఇచ్చిన ప్రకారం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం (సీఆర్ఐఎస్) రూ. 180 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ వ్యవస్థను రూపొందించిందన్నారు. కొత్త పద్ధితిలో ఒకేసారి లక్షా 20వేలమంది టికెట్లు బుక్‌చేయడానికి వీలవుతుందన్నారు. ఇదివరకైతే ఒకేసారి 40వేల మంది మాత్రమే టికెట్లు బుకింగ్ చేయడానికి వీలుండేది. గో ఇండియా స్మార్ట్ కార్డ్ ఈ టికెటింగ్ వ్యవస్థతోపాటుగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ట్రెయిన్ ఎంక్వయిరీ మొబైల్ అప్లికేషన్, గో ఇండియా స్మార్ట్ కార్డ్ వ్యవస్థలను కూడా మంత్రి ప్రారంభించారు. టికెట్ బుకింగ్ కౌంటర్లలో టికెట్ జారీ వ్యవధి తగ్గించేందుకు గో ఇండియా స్మార్ట్ కార్డ్ పద్ధతిని మంత్రి ప్రారంభించారు. ప్రయాణికులు రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ తరగతులతో సహా, సబర్బన్ సర్వీసుల టికెట్లకు కూడా స్మార్ట్ కార్డు ద్వారా చెల్లింపులు జరపవచ్చు. లైఫ్‌టైమ్ వాలిడిటీ ఉండే స్మార్ట్ కార్డ్‌ను రూ. 70చెల్లింపుపై జారీచేస్తారు. దాన్ని 10వేల రూపాయల గరిష్టస్థాయి వరకూ రీచార్జ్ చేసుకోవచ్చు.