స్టేషన్‌లో క్యూలో నిలబడి టికెట్ తీసుకుంటున్న ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆ శాఖకు చెందిన యాప్‌లను కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తున్నారు. రైల్వేశాఖ గతంలోనే తీసుకొచ్చిన యూటీఎస్ (అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్) యాప్‌లో తాజాగా మార్పులు చేసింది.
రైలు ప్రయాణం చేయాలనుకున్నపుడు జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. టికెట్‌కోసం క్యూలో నిలుచున్నా కొన్నిసార్లు ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైలు వెళ్లిపోయిన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలాఅని ట్రెయిన్ వెళుతుంటే టికెట్ లేకుండా ఎక్కలేం. ప్రధానంగా సెలవులు, పండగలప్పుడు జనరల్ టికెట్ కోసం పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రైలుశాఖ యూటీఎస్ (అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్) యాప్‌ను గతంలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు క్యూలో నిలుచోకుండా ఈ యాప్ ద్వారా జనరల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే స్టేషన్‌కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. దీంతో ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు రైల్వేశాఖ గుర్తించింది.
ఇదీ చదవండి: హార్లిక్స్ లేబుల్ తొలగింపు.. కారణం ఇదేనా..
తాజాగా రైలు ప్లాట్‌ఫామ్‌కు ఎంత దూరంలో ఉన్నా టికెట్ పొందేలా యాప్‌ను అప్‌డేట్ చేశారు. దాంతో ఇంట్లో ఉండగానే కంగారుపడకుండా జనరల్ టికెట్ బుక్ చేసుకుని రైలు వచ్చే సమయానికి స్టేషన్‌కు వస్తే సరిపోతుంది. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. సరిగ్గా రైలు ప్లాట్‌ఫామ్‌పైకి రాబోతుందనే సమయానికి అంటే ప్లాట్‌పామ్‌కు 50 మీటర్లు దూరంలో ఉన్నపుడు మాత్రం ఈ యాప్ పనిచేయదని గమనించాలి.
Comments
Please login to add a commentAdd a comment