హైదరాబాద్: రైలు టికెట్ల బుకింగ్, డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ‘కన్‌ఫర్మ్‌టికెట్’ యాప్ తన బ్రాండ్ ప్రచారకర్తగా రాణా దగ్గుబాటిని నియమించుకుంది. కన్‌ఫర్మ్‌టికెట్ యాప్‌ను, రైలు ప్రయాణానికి సంబంధించి సౌకర్యవంతమైన ఫీచర్ల గురించి ప్రచారం కల్పించేందుకు నూతన కార్యక్రమాన్ని ‘ట్రైన్ టికెట్ టైగర్’ను రూపొందించినట్టు సంస్థ తెలిపింది.
ఈ ప్రచార వీడియో ప్రకటనల్లో రాణా కొత్త అవతారంలో కనిపిస్తారని పేర్కొంది. బోర్డింగ్, డ్రాపింగ్ పాయింట్‌ను మార్చుకునే సదుపాయం ఇందులో ఉన్న ట్టు తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమం విషయంలో కన్‌ఫర్మ్‌టికెట్‌తో భాగస్వామ్యం పట్ల తాను ఉత్సాహంగా ఉన్నట్టు రాణా దగ్గుబాటి ప్రకటించారు.
ప్రముఖ ట్రెయిన్ టికెట్ బుకింగ్ యాప్‌గా కన్‌ఫర్మ్‌టికెట్‌ను, దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment