brand ambasidor
-
ఎనర్జీ సంస్థ ప్రచారకర్తగా మహేశ్ బాబు
హైదరాబాద్: సోలార్ ఎనర్జీ సెక్టార్‌లోని సన్‌టెక్ ఎనర్జీ బ్రాండ్ ‘ట్రూజన్ సోలార్’కు సినీనటుడు మహేశ్‌బాబు ప్రచారకర్తగా నియమితులయ్యారు. రూఫ్టాఫ్ సోలార్ ఇన్స్టలేషన్లో 2025 మార్చి నాటికి భారత్‌లో అగ్రగామిగా నిలిచేందుకు కట్టుబడి ఉన్నామని సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ్యవస్థాపకులు, ఎండీ, సీ.హెచ్. భవానీసురేశ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని మహేశ్‌బాబు తెలిపారు. -
ఆకాశంలో విహరిస్తూ ఫుడ్ ఆరగించిన టాలీవుడ్ హీరో.. ఫోటోలు వైరల్!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వీడీ12 మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల కేరళలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో ఓ ఆల్బమ్ సాంగ్‌లో వీడీ కనిపించనున్నారు. సాహిబా అనే సాంగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్ జస్లిన్ రాయల్‌తో కలిసి పని చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల ముంబయిలో ప్రకటించారు. షూటింగ్‌కు కాస్తా గ్యాప్ రావడంతో విజయ్ చిల్ అవుతున్నారు. (ఇది చదవండి: కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!)అయితే తాజాగా ఆయన తన ఫెవరేట్ ఫుడ్ కేఎఫ్‌సీ చికెన్ తింటూ గాల్లో ఎంజాయ్ చేశారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణిస్తూ గాల్లోనే ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆకాశంలో విహరిస్తూ తనకు ఇష్టమైన కేఎఫ్‌సీ ఫుడ్ తింటూ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
హనీ సంస్థ ప్రచారకర్తగా అదితిరావు హైదరీ
న్యూఢిల్లీ: హమ్దర్ద్ హనీ తన ప్రచాకర్తగా సినీ నటి అదితిరావు హైదరీని నియమించుకుంది. ఈ సందర్భంగా ‘ద నో కాంప్రమైజ్ హనీ’ పేరుతో ఒక టీవీ ప్రచార వీడియో విడుదల చేసింది. నాణ్యత, స్వచ్ఛతల మేలికలయిక హమ్దర్ద్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించనుండటం సంతోషం కలిగిస్తోందని అదితిరావు అన్నారు. ఆరోగ్యకర జీవన శైలి కోరుకునే ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఈ తేనె భాగం కావాలన్నారు. అదితిరావుతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై హమ్దర్ద్ సీఈవో హమీద్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. -
ప్రముఖ బ్రాండ్‌కు ప్రచార కర్తగా కీర్తి సురేష్
పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ను నియమించుకుంది. దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కీర్తి... సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను దక్షిణ భారతదేశంలోని కొత్త కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని కంపెనీ ఆశిస్తోంది. పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా ఉత్పత్తులు ఉన్నాయి. స్కిన్ కేర్ విషయంలో శ్రేష్ఠతకు స్థిరంగా బెంచ్‌మార్క్‌ను పాండ్స్ సెట్ చేసింది.పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్ అంబాసిడర్‌గా తన కొత్త పాత్రపై కీర్తి సురేష్ మాట్లాడుతూ, “నేను చాలా కాలంగా మెచ్చుకుంటున్న పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్తో చేతులు కలపడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో సహా దేశవ్యాప్తంగా అనేకమంది హృదయాల్లో ఈ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.' అని ఆమె తెలిపింది.హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, స్కిన్‌కేర్ హెడ్ ప్రతీక్ వేద్ తమ భాగస్వామ్యం గురించి ఇలా వ్యాఖ్యానించారు. 'పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్లో, టైమ్‌లెస్ బ్యూటీ సొల్యూషన్లను రూపొందించే ఆవిష్కరణ శక్తిని మేము విశ్వసిస్తున్నాము. కీర్తిని మా కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా స్వాగతించడం మా వినియోగదారులతో బలమైన సంబంధాన్ని ఏర్పరిచే మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ. ఆమె చక్కదనానికి ప్రతిభ, అందం మా బ్రాండ్‌కు కూడా కలిసొస్తుంది.' అని ఆయన తెలిపారు. -
గ్రీన్ప్లై బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హానికారక ఉద్గారాలను తగ్గించే జీరో ఎమిషన్ ప్లైవుడ్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను నియమించుకున్నట్లు గ్రీన్ప్లై ఇండస్ట్రీస్ (జీఐఎల్) సీఈవో మనోజ్ తుల్సియాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో కొత్త వాణిజ్య ప్రచార ప్రకటనలను రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ప్లైవుడ్ పరిశ్రమ 4.5 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, అందులో సంఘటిత రంగం వాటా 30 శాతం వరకు ఉంటుందని సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం రూ. 1,800 కోట్లుగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల వరకు అంచనా వేస్తున్నట్లు మనోజ్ చెప్పారు. ప్రస్తుతం తమకు గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎండీఎఫ్, ప్లైవుడ్ తయారీ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. టర్కీకి చెందిన సంస్థతో జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేస్తున్న ప్లాంటు వచ్చే ఏడాది వ్యవధిలో అందుబాటులోకి రాగలదని మనోజ్ చెప్పారు. -
కొత్త యాడ్‌లో రచ్చ చేసిన సమంతా.. వీడియో వైరల్
హైదరాబాద్: ప్రముఖ శీతలపానీయాల కంపెనీ పెప్సీ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతా రుతు ప్రభును నియమించుకుంది. ‘రైజ్ అప్, బేబీ’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం గురించి పెప్సీ కోలా లీడ్ సౌమ్యా రాథోర్ మాట్లాడుతూ.. ‘‘పెప్సీ ఎప్పుడూ కూడా యువతరాన్ని ప్రతిబింబించేలా కృషి చేస్తుంది. మా తాజా ప్రచారంలో భారత మహిళల సాధికారతపై దృష్టి ఉంటుంది. వారి అచంచలమైన ఆత్మవిశ్వాసం, నమ్మకానికి ప్రతిబింబించే విధంగా ఉంటుంది’’అని పేర్కొన్నారు. మహిళలు సమాజం కల్పించిన మూస ధోరణిని వీడి, తమ హృదయాలనే అనుసరించాలనేది తాను పూర్తిగా నమ్ముతానని సమంతా రుతు ప్రభు పేర్కొన్నారు. మహిళల స్ఫూర్తిని చూపించే పెప్సీ ప్రచారం తనకు ప్రత్యేకమన్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
కొత్త అవతారం ఎత్తిన రానా దగ్గుబాటి
హైదరాబాద్: రైలు టికెట్ల బుకింగ్, డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ‘కన్ఫర్మ్టికెట్’ యాప్ తన బ్రాండ్ ప్రచారకర్తగా రాణా దగ్గుబాటిని నియమించుకుంది. కన్ఫర్మ్టికెట్ యాప్‌ను, రైలు ప్రయాణానికి సంబంధించి సౌకర్యవంతమైన ఫీచర్ల గురించి ప్రచారం కల్పించేందుకు నూతన కార్యక్రమాన్ని ‘ట్రైన్ టికెట్ టైగర్’ను రూపొందించినట్టు సంస్థ తెలిపింది. ఈ ప్రచార వీడియో ప్రకటనల్లో రాణా కొత్త అవతారంలో కనిపిస్తారని పేర్కొంది. బోర్డింగ్, డ్రాపింగ్ పాయింట్‌ను మార్చుకునే సదుపాయం ఇందులో ఉన్న ట్టు తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమం విషయంలో కన్ఫర్మ్టికెట్తో భాగస్వామ్యం పట్ల తాను ఉత్సాహంగా ఉన్నట్టు రాణా దగ్గుబాటి ప్రకటించారు. ప్రముఖ ట్రెయిన్ టికెట్ బుకింగ్ యాప్‌గా కన్ఫర్మ్టికెట్ను, దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగిస్తున్నట్టు చెప్పారు. -
బ్రాండ్ వాల్యూ: నాయిస్ మేకర్‌గా కింగ్ ఆఫ్ క్రికెట్ కోహ్లీ
సాక్షి,ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ దూసుకు పోతోంది. స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ నోయిస్ కింగ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా, విరాట్ కోహ్లీని కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుది. నాయిస్ కంపెనీ స్మార్ట్ వాచ్ లకు కోహ్లీ వ్యవహరించ నున్నాడు. బ్రాండ్ అంబాసిడర్‌గా నాయిస్ ఉత్పత్తులకు కోహ్లీ అన్ని రకాలుగా ప్రచారకర్తగా ఉంటారు. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లిని నోయిస్ మేకర్‌గా స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉందని నోయిస్ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ఖత్రి వ్యాఖ్యానించారు. స్మార్ట్‌వాచ్ డొమైన్లో నాయిస్ ప్రపంచవ్యాప్త అభిమానుల అభిమానంగా మారడానికి టీమిండియా దిగ్గజం విరాట్‌తో జోడీ పనిచేస్తుందన్నారు. పవర్-ప్యాక్డ్ పనితీరును అందించాల్సిన అవసరం తోపాటు, విరాట్‌తో ఇండియా తోపాటు విదేశాలలో ఉన్న యువ ప్రేక్షకులతో తమ అనుబంధాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. It’s official! I am a loud and proud Noisemaker. Stoked to be a part of India’s No. 1* Smartwatch Brand. Keep up with the Noise, kyunki #ShorRukegaNahi! #NoisemakerVirat@gonoise #ad *IDC Worldwide Quarterly Wearable Device Tracker, 3Q22 pic.twitter.com/Ab9jdySU9H — Virat Kohli (@imVkohli) December 2, 2022 ఈ ఒప్పందంపై కోహ్లీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. తానిపుడు అధికారికంగా నోయిస్ మేకర్‌గా మారాననీ, భారత్ లో నెం.1 స్మార్ట్ వాచ్ బ్రాండ్ లో తానూ ఒక భాగమేనని పేర్కొన్నారు. -
మాంసం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నయనతార
ప్రముఖ సంస్థ ఫిపోలాకు ప్రచార కర్తగా సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతారను నియమించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక సీఈఓ సుశీల్ కనుగోలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం (ఆగస్టు 7) జరిగిన సమావేశంలో సశీల్ మాట్లాడుతూ ''దక్షిణ భారతదేశంలోని అత్యత్తుమ మాంసం రిటైల్ బ్రాండ్లలో ఒకటైన ఫిపోలా ఆహార ప్రియులను ఆకర్షించడంతోపాటు మంచి ఆదరణ ఉందన్నారు. దీనిని మరింతగా విస్తరణ చేసేలా దృష్టి పెట్టాం'' అని తెలిపారు. అందులో భాగంగానే దక్షిణ భారతదేశంలో లేడీ సూపర్‌స్టార్ నయనతారను తమ బ్రాండ్ ప్రచార కర్తగా నియమించాని పేర్కొన్నారు. దీనికి నటి నయనతార ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రచార వీడియోను ఆయన ఆవిష్కరించారు. -
కినారా క్యాపిటల్ బ్రాండ్ అంబాసిడర్‌గా జడేజా
హైదరాబాద్: కినారా క్యాపిటల్ ప్రముఖ ఆల్‌రౌండర్ క్రికెటర్ రవీంద్ర జడేజాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ప్రకటించింది. ఎంఎస్ఎంఈలకు ఫిన్‌టెక్ సేవలను కినారా క్యాపిటల్ ఆఫర్ చేస్తుంటుంది. కంపెనీ 10వ వార్షికోత్సవం సందర్భంగా జడేజాను అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం గమనార్హం. కినారా క్యాపిటల్ నిర్వహణలో రూ.1,000 కోట్ల ఆస్తులు ఉండగా, 2025 నాటికి 500 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఉంది. మైకిరాణా యాప్, 400కుపైగా డిజిటల్ చెల్లింపుల ఆప్షన్లను వర్తకులకు ఆఫర్ చేస్తోంది. ఆరు రాష్ట్రాల పరిధిలోని 90 పట్టణాల్లో ప్రస్తుతానికి ఈ సంస్థ సేవలను అందిస్తోంది. చదవండి: Sachin Tendulkar : అప్పుడు స్పిన్‌తో.. ఇప్పుడు స్పిన్నీతో.. -
Sachin Tendulkar : అప్పుడు స్పిన్‌తో.. ఇప్పుడు స్పిన్నీతో..
ఆస్ట్రేలియన్ ఏస్ లెగ్ స్పిన్నర్ షేన్‌వార్న్‌కి కలలో సైతం చుక్కలు చూపించిన బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్. ఒకప్పుడు స్సిన్ బౌలింగ్‌ను సునాయసంగా ఎదుర్కొని పరుగుల వరద పారించిన ఈ బ్యాట్స్‌మన్.. ఇప్పుడు స్పిన్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. బ్రాండ్ ఎండార్సర్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మరో వ్యాపారంలో అడుగు పెట్టారు. ఇప్పటికే అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా పలు కంపెనీల్లో పార్ట్నర్గా ఆయన ఉన్నారు. తాజాగా అప్‌కమింగ్ బిజినెస్‌గా పేర్కొంటున్న యూజ్డ్ కార్ బిజినెస్‌లోకి ఇతర క్రీడాకారులకంటే ముందే అడుగు పెట్టారు. యూజ్డ్ కారు రిటైలింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా ఉన్న స్పిన్నీకి బ్రాండ్ ఎండార్సర్‌గా సచిన్ వ్యవహరిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ అనతి కాలంలోనే యూనికార్న్‌గా మారిన స్పిన్నీలో స్ట్రాటజిక్ ఇన్వెస్టర్‌గా సచిన్ పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు ఈ సంస్థకు బ్రాండ్ ఎండార్సర్‌గా ప్రచారం కూడా చేయనున్నారు. అయితే సచిన్ ఇందులో ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టారనే అంశాలను స్పిన్ని సంస్థ బహిర్గతం చేయలేదు. పీవీ సింధుతో పాటు సచిన్ స్పిన్ని సంస్థ ఈ ఏడాది ఆరంభంలో పీవీ సింధుతో జత కట్టింది. తాజాగా సచిన్‌ను తమతో చేర్చుకుని మార్కెట్లో పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. మరోవైపు టీనేజ్లోనే బూస్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపించిన సచిన్ గత పాతికేళ్లలో అనేక సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించారు. అనేక స్పోర్ట్స్లీగుల్లో పెట్టుబడులు పెట్టారు. స్పిన్ని ప్రస్థానం యూజ్డ్ కారు రిటైలింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా మార్కెట్లోకి ఎంటరైన అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసింది స్పిన్ని. ఇటీవల ఈ సిరీస్ ఈ ఫండింగ్ రౌండ్లో స్పిన్ని సంస్థలోకి 238 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటి వరకు 530 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది స్పిన్ని. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేన్ 1.80 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చదవండి: బిగ్–సి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు -
Ambrane: ‘పవర్’ ప్యాక్డ్ రవీంద్ర జడేజా
మొబైల్ యాక్ససరీస్ తయారీ సంస్థ అంబ్రాన్ రవీంద్ర జడేజా సిగ్నచర్‌తో సరికొత్త పవర్ బ్యాంక్‌ని మార్కెట్లోకి తెచ్చింది. ఎయిరోసింక్ పీబీ పేరుతో లిమిటెడ్ ఎడిషన్‌గా అంబ్రాన్ విడుదల చేసింది. ఈ సిగ్నేచర్ పవర్ బ్యాంక్ ధర రూ.3,999గా ఉంది. ఇందులో లిథియమ్ పాలిమర్ బ్యాటరీని ఉపయోగించారు. బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యం 10,000 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ పవర్‌బ్యాంక్ ఉపయోగించి వైర్లెస్ , వైర్డ్ పద్దతుల్లో మొబైల్‌ని ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం 3 గంటల పది నిమిషాల్లో పవర్ బ్యాంక్ ఫుల్ అవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ మోడ్‌లో 15 వాట్స్, వైర్డ్ మోడ్‌లో 20 వాట్స్ స్పీడ్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తోంది. అతి తక్కువ సమయంలోనే ఈ పవర్ బ్యాంకును ఉపయోగించి మొబైల్‌ని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చని అంబ్రాన్ చెబుతోంది. యూఎస్బీ, టైప్ సీ పోర్టుల ద్వారా మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పవర్‌బ్యాంక్ అందుబాటులో ఉంది. అంబ్రాన్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని క్రికెటర్ రవీంద్ర జడేజా అన్నారు. -
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా చెర్రి, డీల్ ఎంతో తెలుసా!
Disney Hotstar Brand Ambassador: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించిన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా వారసుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన చెర్రి ఆ తర్వాత నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటనలో, డ్యాన్స్‌లో తండ్రిని తగ్గ తనయుడిగా అనిపించుకుంటున్నాడు. టాలీవుడ్లో స్టార్ హీరోగా మారిన చెర్రి నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నాడు. అటూ హీరోగా ఇటూ నిర్మాతగా దూసుకుపోతున్న రామ్ చరణ్ ఇప్పుడు సరికొత్తగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలుగు వెర్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేసినట్లు తెలుస్తోంది. రెండు ప్రకటనలతో పాటు ప్రింట్ యాడ్స్‌లో చేసేందుకు రామ్ చరణ్ రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్. చదవండి: మరో కాస్ట్లీ కారు కొన్న రామ్ చరణ్, వీడియో వైరల్ ఇందుకు సదరు సంస్థ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందంపై హాట్‌స్టార్ చెర్రి గత ఏడాది నుంచి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ విడుదల ఉండటంతో తమ మార్కేట్ను పెంచుకునే దిశగా చెర్రిని తమ బ్రాండ్ అంబాసిడర్ చేసుకోవాలని హాట్‌స్టార్ ప్లాన్ చేసింది. దీంతో రామ్ చరణ్ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేయడంపై డిస్నీప్లజ్ హాట్‌స్టార్ ఆనందం వ్యకం చేస్తోందట. కాగా త్వరలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్దమవుతున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంతో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్‌ను జరపుకోనుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. చదవండి: చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్ -
ఆమ్వే ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మీరాబాయి చాను
ప్రముఖ న్యూట్రిలైట్ కంపెనీ ఆమ్వే ఇండియా తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చానును ప్రకటించింది. ఈ ఒప్పందంపై మీరాబాయి చాను సంతకం చేసింది. న్యూట్రిలైట్ డైలీ, ఒమేగా, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ వంటి ఆమ్వే ప్రచారా కార్యక్రమాలలో ఇక నుంచి మీరాబాయి చాను కనిపిస్తుంది. ముఖ్యంగా దేశంలోని మహిళలు, యువతను లక్ష్యంగా చేసుకుని ఆరోగ్యం, పోషకాహార రంగాన్ని ఏకీకృతం చేయడంపై ఆమ్వే దృష్టి సారించింది. అందుకోసమే చానుతో సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు మంగళవారం తెలిపింది. (చదవండి: పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు తగ్గించం) "మీరాబాయి చానుతో మా అనుబంధం ఒక సహజ ఎంపిక. ఆమె ఫిట్ నెస్ పట్ల కనబర్చిన నిబద్ధత సాటిలేనిది. ప్రజలు మరింత మెరుగ్గా, ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము, అందుకే ఆమెను భాగస్వామిగా ఎంచుకునట్లు" ఆమ్వే ఇండియా సీఈఓ అన్షు బుధ్రాజా తెలిపారు. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ లో 26 ఏళ్ల చాను మహిళల 49 కిలోల విభాగంలో 204 కిలోల (87 కిలోల+115 కిలోలు) విభాగంలో రజత పతకాన్ని సాధించడంతో దేశమంతా సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ తర్వాత ఆమెకు భారీ స్థాయిలో అవార్డులు, రివార్డులు క్యూ కట్టాయి. -
ఎంఎస్ ధోనితో జట్టు కట్టిన న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్
భారతదేశపు నాలుగో అతి పెద్ద రోగనిర్థారరణ సేవల సంస్థ న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని పని చేయనున్నారు. ఈ మేరకు మాజీ ఇండియన్ కెప్టెన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ ప్రకటించింది. అంబాటు ధరల్లో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించేందుకు న్యూబర్గ్ చేపట్టిన కార్యక్రమాలు తనకు నచ్చాయన్నారు మాజీ ఇండియన్ స్కిప్పర్ ధోని. కోవిడ్-19 మహమ్మారి కాలంలో అన్ని వయస్సుల వారి ఆరోగ్యం, బాగోగులపై అవగాహన కల్పించేందుకు వారు చేపట్టిన ప్రచారంలో తాను భాగస్వామి అవుతున్నట్టు వెల్లడించారు. న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ ఛైర్మన్ డాక్టర్ జీఎస్కే వేలు మాట్లాడుతూ ధోని వంటి లెజెండ్ మా ప్రచారకర్తగా, అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటాన్ని మేము గౌరవంగా భావిస్తామన్నారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే మూడు ఖండాలకు తన వ్యాపారాన్ని విస్తించింది న్యూబెర్గ్ సంస్థ. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్ల రాబడి సాధించింది. వచ్చే ఏడాది వెయ్యికోట్ల ఆదాయం లక్ష్యంగా ముందుకెళ్తోంది. న్యూబెర్గ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200లకు పైగా ల్యాబులు, 3000లకు పైగా శాంపిల్ కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి. -
స్పెషల్ ఒలింపిక్స్ గేమ్స్: సోనూ సూద్‌కు అరుదైన గౌరవం
సాక్షి,ముంబై: రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది రష్యాలో జరిగే స్పెషల్ ఒలింపిక్స్ లో భాగంగా భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. దీనిపై సోనూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజని, స్పెషల్ ఒలింపిక్స్ భారత్ బృందంతో చేరడం తనకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఎస్వో భారత్ జట్టుకు ముందస్తు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రష్యాలోని కజాన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 22 నుంచి స్పెషల్ వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ వింటర్ ఒలింపిక్స్‌కు హాజరయ్యే భారతదేశం అథ్లెట్ల బృందానికి సోనూ నాయకత్వం వహించ నున్నారు. అటు ఈ పరిణామంపై ప్రత్యేక ఒలింపిక్స్ భారత్ ఛైర్పర్సన్ డాక్టర్ మల్లికా నడ్డా సంతోషం ప్రకటించారు. ప్రత్యేక ఒలింపిక్స్ కుటుంబంలో చేరేందుకు తమ ఆహ్వానాన్ని మన్నించిన సోనూ సూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నాడని నమ్ముతున్నామన్నారు. కాగా కరోనా మహమ్మారి లాక్డౌన్ సంక్షోభంలో వలస కూలీలకు అండగా నిలిచిన సోనూ సూద్ రియల్ హీరోగా అవతరించారు. ఇక అప్పటినుంచి విద్యార్థులకు అండగా ఉంటూ వచ్చిన ఆయన తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సెకండ్ వేవ్‌లో అనేకమంది బాధితులకు అండగా నిలిచారు. Feeling proud today as I'm chosen to be the Brand Ambassador for India at the #SpecialOlympics going to be held in Russia! I'm sure our champions will make us proud and I wish them all the best! Jai Hind 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/9MxfE3UDSP — sonu sood (@SonuSood) August 2, 2021 -
ఆమె తెచ్చిన తియ్యటి విప్లవం
హిమాచల్‌ప్రదేశ్ నుంచి మణిపూర్‌కు 3000 కిలోమీటర్లు. అక్కడ మంచు. ఇక్కడ ఎండ. అక్కడ ఆపిల్. ఇక్కడ పైనాపిల్. ఏం... ఆపిల్ ఎందుకు పండించకూడదు అనుకుంది షిమ్రే అగస్టీనా. హిమాచల్‌ప్రదేశ్ నుంచి 55 యాపిల్ మొక్కలు తెచ్చి తన ఇంటి సమీపంలో నాటింది. రెండేళ్లు గడిచాయి. ఇవాళ ఆమె మణిపూర్‌లో ఆపిల్ పంటకు బ్రాండ్ అంబాసిడర్. ఆపిల్ ఎరగని మణిపూర్, మిజోరామ్ స్త్రీలు ఆమెలానే ఆ పంట వేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆ తియ్యటి విజయం గురించి... గంగను నేల మీదకు దింపాడని భగీరథుని పేరు చెప్పుకుంటూ ఉంటాం. కాని ఆ గంగా పరీవాహక ప్రాంతంలో ఆపై సకల జీవగర్రల మీద వ్యవసాయంలో స్త్రీలు ఎలా పాల్గొన్నారో ఎన్నెన్ని ఆవిష్కరణలు చేశారో ఏయే పంటలను ఏయే ప్రాంతాలకు మళ్లించారో ఎవరు నిక్షిప్తం చేశారు కనుక. గర్భంలో బిడ్డను దాచడం తెలిసిన స్త్రీలు విత్తనాలు దాచడంలో, పూతను కాపాడటంలో, విరగపండి వెన్నువంచిన పైరును సంరక్షించడంలో ఎంతో శ్రమ చేసి ఉంటారు కదా. ఆధునిక భారతంలో ముఖ్యంగా ఈ టెక్ భారతంలో కూడా స్త్రీలు నేల మీద, వ్యవసాయం మీద మమకారం చాటుకొని భూమి నుంచి ఉద్భవించే ఫలం కోసం ప్రయోగాలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని ఉష్ణజిల్లాలకు శీతల ప్రాంతానికి చెందిన స్ట్రాబెర్రీ పంటను పరిచయం చేసి, దివ్యంగా పండించి ‘స్ట్రాబెర్రీ గర్ల్’గా గుర్తింపు పొందింది గుర్లీన్ చావ్లా. ఇప్పుడు ఆపిల్ పంటకు ఏమాత్రం అనువుగాని మణిపూర్‌లో ఆపిల్‌ను వాణిజ్యస్థాయిలో విజయవంతం చేసి కొత్త దారి చూపింది షిమ్రే అగస్టీనా. ఆ ప్రాంతానికి సంబంధించి ఇదొక వ్యవసాయ విప్లవమే. ఉద్యోగం వదిలేసి షిమ్రే అగస్టీనాది మణిపూర్‌లోని మయన్మార్ సరిహద్దు జిల్లా అయిన ఉక్రుల్. అందులోని ‘పోయ్’ అనే కుగ్రామం ఆమెది. చదువుకుని ‘గోర్డెన్ మ్యాక్స్’ అనే వజ్రాల కంపెనీలో మేనేజర్ స్థాయిలో ఢిల్లీలో పని చేసేది. కాని తల్లిదండ్రులను చూసుకోవడానికి ఆమె ఆ వజ్రంలాంటి ఉద్యోగాన్ని వదిలేసి సొంత ఊరికి వచ్చేసింది. అయితే అక్కడ ఆమె చేయడానికి పని ఏమీ లేదు. ఏదైనా చేయాలన్నా కొత్తగా చేయాలని నిశ్చయించుకుంది. ఆ సమయంలోనే నేషనల్ ఉమెన్ కమిషన్ సభ్యురాలిగా పని చేస్తున్న ఆమె స్నేహితురాలు సోసో షైజానే ‘మీ ప్రాంతంలో ఆపిల్స్ పండించగలవేమో చూడు’ అని సలహా ఇచ్చింది. అంతేకాదు మణిపూర్ నుంచి అందుకు ఆసక్తి చూపుతున్న కొంతమందిని హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఒక ఆపిల్ పంట శిక్షణా కేంద్రానికి పంపి అవగాహన కల్పించింది. ఇక పంట వేయడమే తరువాయి. లో చిల్ ఆపిల్స్ ఆపిల్ పంట పండాలంటే శీతల వాతావరణం అవసరం. 10 నుంచి 12 నెలల్లో ఫలాలు చేతికొచ్చే ఈ పంటలో ఆపిల్ చెట్టుకు కనీసం 700 నుంచి 1000 గంటల శీతల వాతావరణం అవసరం. కాని మణిపూర్‌లో ఉష్ణ వాతావరణం ఉంటుంది. అందుకే షిమ్రే లో చిల్ ఆపిల్స్– అంటే 700 గంటల కన్నా తక్కువ శీతల వాతావరణం ఉన్నా బతికి బట్టకట్టే రకం ఆపిల్స్‌ను ఎంచుకుంది. అయితే ఆ పంటలో దిగాలని చూసినప్పుడు తండ్రి పెదవి విరిచాడు. కారణం అక్కడ పైనాపిల్ పండుతుంది తప్ప ఆపిల్ పండదు. తల్లి మాత్రం ‘ఆపిల్‌లో దాగిన విత్తు ఇచ్చే ఉద్యానవనాన్ని’ ఊహించగలిగింది. ‘పంట వెయ్’ అని ఉత్సాహపరిచింది. తన ఇంటికి కొన్ని గజాల దూరంలోని స్థలంలో 55 ఆపిల్ మొక్కల్ని 2019లో నాటింది షిమ్రే. మొదటి పూతను ఆమె పట్టించుకోలేదు. రెండో పూత పెరిగి పెద్దదయ్యి ఇప్పుడు దిగుబడి ఇచ్చింది. ‘మొత్తం 210 కిలోల ఆపిల్స్ వరకూ పండాయి. 150 కిలోలు కోసేశాం. ఇంకో అరవై డెబ్బై కిలోలు చెట్ల మీద ఉన్నాయి’ అని షిమ్రే చెప్పింది. 20 కిలోల ఆపిల్ బుట్ట మార్కెట్లో 2500 నుంచి 3000 వరకూ పలుకుతోంది. ఇది చాలా పెద్ద విజయం కింద లెక్క. సి.ఎం ఆహ్వానం షిమ్రే విజయం వెంటనే పత్రికలలో విస్తృతంగా ప్రచారం పొందింది. మణిపూర్ సి.ఎం బిరేన్ సింగ్ ఆమెను ఆహ్వానించి ఆపిల్ సాగుకు ఆసక్తి చూపే రైతులకు శిక్షణ ఇవ్వమని అందుకు ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుందని చెప్పాడు. ‘నేను ఆపిల్ తోట వేసినప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల స్త్రీలు, యువతులు వచ్చి ఈ పంటను ఆసక్తి చూశారు. తామూ ఈ పంట వేస్తామని చెప్పారు. మొక్కలు అడిగారు. అందరికీ సాయం చేసే వీలు నాకు లేదు. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు రావడంతో త్వరలో మంచి ఫలితాలు రావచ్చని అనుకుంటున్నాను’ అంది షిమ్రే. ఆమె సాధించిన విజయం ఒక్క మణిపూర్‌లోనే కాదు మిజోరామ్‌లో కూడా రైతులకు కొత్త దారి చూపినట్టయ్యింది. ఆపిల్ సాగు కోసం వారంతా ఆసక్తి చూపుతున్నారు. ‘వజ్రాల కంపెనీ ఉద్యోగంలో ఉన్న సంతృప్తి కంటే ఈ సంతృప్తి ఎక్కువగా ఉంది’ అని షిమ్రే చెప్పింది. మనం తినే తిండి, ఆరగించే ఫలం, వండే కాయగూర... ఇవన్నీ పురుషుడి శ్రమ దానం మాత్రమే కాదు. వాటి వెనుక స్త్రీల స్వేదం, శ్రమ, అలసట కనిపించనివ్వని చిరునవ్వు ఉన్నాయని మనం గ్రహించాలి. శభాష్ షిమ్రే. -
ఖజానా జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ రష్మిక
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల రిటైల్ సంస్థ ఖజానా జ్యువెలరీ తమ సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి శ్రీమతి రష్మిక మందన్నను ప్రకటించింది. దక్షిణాదిలోని మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమానుల సంఖ్య గల ప్రముఖ తారలలో రష్మిక ఒకరు. ఇప్పుడు బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. అక్షయ తృతీయతో ప్రారంభించి భారతదేశం అంతటా ప్రింటింగ్, బహిరంగ, టీవీలలో ప్రకటన ద్వారా ఖజానా జ్యువెలరీకి చెందిన అందమైన డిజైన్లను ఆమె ప్రమోట్ చేయనుంది. ఈ ఒప్పందంపై ఖజానా జ్యువెలరీ చైర్పర్సన్ మిస్టర్ కిషోర్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. "మా బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీమతి రష్మికను ఎంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే నెలల్లో ఆమెతో మేము అనేక రకాల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తాము. మా బ్రాండ్, మా కస్టమర్ల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించాలని" చూస్తున్నాము అని అన్నారు. ఇక రష్మిక మందన్న మాట్లాడుతూ.. “ఖజానా గొప్పతనం గురుంచి అందరికీ తెలిసిందే, నన్ను దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడం నాకు సంతోషం కలిగిస్తుంది. వారి ప్రత్యేకమైన నమూనాలు, ఉన్నతమైన విలువల గురుంచి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను వారితో భాగస్వామ్యం కావడం గురించి సంతోషిస్తున్నాను. అలగే, ఖాజానా స్టోర్లలో ఉన్న కొత్త కలెక్షన్స్ చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను” అని తెలిపింది. ఖజానా జ్యువెలరీ బిఐఎస్ హాల్మార్క్డ్ 916 బంగారు ఆభరణాలను అమ్మడం, అధిక-నాణ్యత ప్రమాణాలను పాటించడం ద్వారా భాగా ప్రాచుర్యం పొందింది. తక్కువ ధరలో మెరుగైన నాణ్యమైన ఆభరణాలను వినియోగదారులకు అందిస్తుంది. ఒక వ్యాపార సంస్థగా మాత్రమే కాకుండా, ఖజానా జ్యువెలరీ క్రమం తప్పకుండా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి కార్యక్రమాల కోసం సంస్థ తన లాభాలలో కొంత భాగాన్ని కేటాయిస్తుంది. ఖజానా జ్యువెలరీని 1993లో చెన్నైలోని కేథడ్రల్ రోడ్లో మిస్టర్ కిషోర్ కుమార్ జైన్ మొదటి షోరూమ్ ను ప్రారంభించారు. ఇన్ని సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదిగి 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ గల సంస్థగా ఎదిగింది. భారతదేశం అంతటా 50కి పైగా షోరూమ్‌లు కలిగి ఖాజానా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బంగారం, వెండి ఆభరణాల వ్యాపార సంస్థగా ఇప్పుడు నిలిచింది. చదవండి: ఆ విషయాన్ని మీరు విజయ్‌నే అడగండి : రష్మిక -
బాటా ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు
సాక్షి, ముంబై: పాదరక్షల తయారీ కంపెనీ బాటా ఇండియాకు కొత్త ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నియమితులయ్యారు. యువతలో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న నటుడిని ప్రచారకర్తగా ఎన్నుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని కంపెనీ తెలిపింది. టెలివిజన్, డిజిటల్‌తో పాటు ఇతర మాధ్యమాల ప్రకటనల ద్వారా కార్తీక్ కంపెనీ నాణ్యమైన, సరికొత్త ఉత్పత్తుల గురించి ప్రచారం చేస్తారని వివరించింది. తమ పోర్ట్‌ఫోలియోను మరింత ఆకర్షణీయంగా మార్చడం ద్వారా బ్రాండ్‌ను మారుస్తున్నామని బాటా ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్-మార్కెటింగ్ ఆనంద్ నారంగ్ చెప్పారు. కార్తీక్ ఆర్యన్ లాంటి పాజిటివ్ ఎనర్జీ, ఈజీగోయింగ్ అప్రోజ్ యూత్‌ను ఆకట్టుకుంటుందని, కార్తీక్‌తో అనుబంధం ద్వారా యువతతో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడుతుందన్నారు. ముఖ్యంగా బాటా రెడ్ లేబుల్, నార్త్ స్టార్, పవర్ హుష్ పప్పీస్ లాంటి యువబ్రాండ్లను తెరపైకి తీసుకు రావడానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు. -
చైనా మొబైల్ కంపెనీ డీల్‌కు హీరో గుడ్ బై
టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను నిషేదించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి సినీ ప్రముఖులు సహా పలువురు సెలబ్రిటీలు దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ మాత్రం మరో అడుగు ముందుకేసి చైనా మొబైల్ సంస్థలతో ఇదివరకే కుదుర్చుకున్న కొన్ని కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడట. కార్తీక్ ఇంతకుముందు చైనా మొబైల్ కంపెనీ ఒప్పోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేవాడు. అయితే భారత్ -చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనీస్ కంపెనీలతో ఇదివరకే కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా కార్తీక్ తాజా పోస్టులను బట్టి ఫ్యాన్స్ దీన్ని కన్పర్మ్ చేసేశారు. (ఆస్ట్రేలియాలో నటికి చేదు అనుభవం) తాజాగా నటుడు కార్తీక్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యాపిల్ మొబైల్ ఫోన్‌తో ఓ ఫోటోను షేర్ చేశాడు. తన ఇంట్లో కిటీకీ దగ్గర నిలబడి మేఘాలను తన మొబైల్లో ఫొటో తీస్తున్న చిత్రం అది. అయితే కార్తిక్ పట్టుకున్న ఫోన్ ..ఐ ఫోన్ అవడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ చైనా ఫోన్‌కి ప్రచారాన్ని వదిలేశాడని అతని ఫొటో ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. దీంతో మిగతా హీరోలు కూడా చైనా మొబైల్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్యార్ కా పుంచనామాతో సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తీక్..పంచనామా -2, కాంచి-ది అన్బ్రేకబుల్ , లుకా చుప్పి వంటి సినిమాల్లో నటించారు. లాక్డౌన్ కి ముందు లవ్ ఆజ్ కల్ సినిమాలో సారా అలీఖాన్‌తో సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకన్నాడు ఈ యంగ్ హీరో. (ప్రభాస్ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్) View this post on Instagram Yes. I am that Bua who needs to click the sky every time there is a cloud ⛅️ A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Jul 8, 2020 at 1:09am PDT -
కోహ్లీ తర్వాత స్థానం సింధూదే
పీవీ సింధు...భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించి..నాలుగు దశాబ్దాల కలను సాకారం చేసిన ఈ క్రీడాకారిణి ఇప్పుడు భారత్‌లో అత్యంత విలువైన మహిళా ప్లేయర్‌గా నిలుస్తోంది. బ్రాండ్లకే బ్రాండ్‌గా మారింది. అటు క్రీడలోనే కాకుండా.. ఇటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన పీవీ సింధు ‘బ్రాండ్ వాల్యూ’ ఇప్పుడు మరింత పెరిగింది. ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం ఆమె ప్రపంచంలోనే 7వ స్థానంలో నిలిచింది. సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన వారి వివరాలు, అత్యంత ఆదాయం అందుకుంటున్న వారి గురించి ప్రతి సంవత్సరం ‘ఫోర్బ్స్’ ప్రపంచ వ్యాప్తంగా ఓ లిస్ట్‌ని విడుదల చేస్తూ ఉంటుంది. లిస్ట్‌లో అత్యంత ఆదాయాన్ని సంపాదిస్తున్న వారు ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లే అధికం. ఆ క్రికెటర్ల జాబితాలో బ్యాడ్మింటన్ దిగ్గజం, మన హైదరాబాదీ పీవీ సింధు చేరడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంటూ అత్యంత ఆదాయం పొందుతూ ఉమెన్ కేటగిరిలో 7వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. జనవరిలో విడుదల చేసిన లిస్ట్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ ‘మెడిసన్ కీస్’తో పాటు ప్రపంచవ్యాప్తంగా పీవీ సింధు 13వ స్థానంలో ఉండటంగమనార్హం. కోహ్లీ తర్వాత సింధునే... ఫోర్బ్స్ లిస్ట్‌ను పరిశీలిస్తే క్రీడారంగం నుంచి క్రికెటర్లే అధికంగా కనిపిస్తారు. క్రికెట్ దిగ్గజం సచిన్‌టెండుల్కర్, ఎం.ఎస్.ధోనీలు ఒకప్పుడు అత్యధిక సంపాదన కలిగిన వారని ఫోర్బ్స్‌ని ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ తను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల నుంచి రోజు వారి ఆదాయం రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడు. దేశంలో కోహ్లీనే అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఇప్పుడు ఆయన తర్వాత స్థానంలో రోజుకు దాదాపు రూ.1.50 కోటి తీసుకుంటూ ద్వితీయ స్థానంలో నిలిచింది సింధు. సింధు బ్రాండ్లు ఇవే చైనాకు చెందిన ‘లీ నీన్గ్’(స్పోర్ట్స్ మెటీరియల్) సంస్థతో పీవీ.సిం«ధు రూ.50 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలో ఆ సంస్థకు చెందిన ప్రకటనలు అన్నింటిలో పీవీ సిం«ధునే కనిపించనుంది. ఈ కాంట్రాక్ట్‌ను ఆ సంస్థతో 2023 వరకు కుదుర్చుకోవడం జరిగింది. దీంతో పాటు ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ ‘మంత్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, జీఎస్టీ, జేబీఎల్ ఇయర్‌ఫోన్స్, బ్రిడ్జ్‌స్టోన్ టైర్స్, మూవ్ పెయిన్ రిలీఫ్ అయింట్మెంట్, స్పోర్ట్స్ ఎనర్జీ డ్రింక్ గట్రోడ్, వైజాగ్ స్టీల్స్, సెంట్రల్ రిజర్వ్ సెక్యూరిటీ ఫోర్స్, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, హర్మన్ ఇంటర్నేషనల్ ఫర్ జీబీఎల్ ఎండూరెన్స్ ఇయర్‌ఫోన్స్, పానసోనిక్ బ్యాటరీస్, ఎపిస్ హనీ, ఓజాస్విత (శ్రీశ్రీ ఆయుర్వేద), యోనెక్స్, స్ట్రేఫీ, ఫ్లిప్‌కార్ట్, బూస్ట్’ వంటి ప్రముఖ బ్రాండ్లకు సిం«ధు అంబాసిడర్‌గా ఉన్నారు. ఇటీవల ప్రపంచకప్ టైటిల్ గెలిచిన సిం«ధు పట్ల ఆయా బ్రాండ్ల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ మార్కెట్ వాల్యూస్ కూడా పెరగబోతున్నట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌కి దూరం థమ్స్అప్, కోకోకోలా, పెప్సీ, మజా వంటి కూల్ డ్రింక్స్‌కి సిం«ధు చాలా దూరం. అందుకే ఆ కంపెనీల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా పక్కన పెట్టేసింది. ఒకానొక సమయంలో కంపెనీల యాజమాన్యాలు సింధు చుట్టూ ప్రదక్షిణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. వాటివల్ల హాని ఏదైనా ఉంటుందని చెప్పకపోయినప్పటికీ సింధు మాత్రం నిజ జీవితంలో కూడా వాటిని ప్రిఫర్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. బ్రాండ్స్ ఆనందం ఇటీవల ప్రపంచ బ్యాండ్మింటన్ చాంపియన్షిప్ని సిం«ధు కైవసం చేసుకోవడంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రాండ్ల యజమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆమె విజయం అనంతరం సోషల్ మీడియా ద్వారా పీవీ సింధుపై పొగడ్తలు గుప్పించడం విశేషం. సింధు అద్భుతమైన క్రీడాకారిణి అని, ఆమె వల్ల తమ వ్యాపారం విలువ మరింత పెరుగుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆమె మరిన్ని విజయాలు సాధిస్తుందని పేర్కొన్నారు. సంతోషమే కదా మా అమ్మాయి ఇన్ని ప్రముఖ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా ఉంటోంది అంటే నిజంగా సంతోషకరమైన విషయమే. కష్టపడింది. ఓటమిని తట్టుకుని నిలబడింది. ఈ రోజు ప్రతి విజయంతో యావత్ భారతావనిని సంతోషపరుస్తుంది. రోజు రోజుకి మార్కెట్ వాల్యూ పెరుగుతోంది కాబట్టి ప్రముఖ బ్రాండ్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఫోర్బ్స్ జాబితాలో కూడా సింధు పేరు ప్రకటించడం ఆనందంగా ఉంది. – వెంకటరమణ, సింధు తండ్రి గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడుతున్న సింధు..చిత్రంలో సాయి ప్రణీత్, గోపీచంద్ -
రాహుల్ ద్రవిడ్ ఓటు వేయలేడు!
రాహుల్ ద్రవిడ్ ఓటు వేయలేడు!ఓటర్ల జాబితాలో పేరు గల్లంతయిన ప్రముఖుల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా చేరారు. బెంగళూరులో ఉంటున్న ద్రవిడ్ ఈ నెల 18న జరిగే రెండో దశ పోలింగులో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు వేయాల్సి ఉంది. అయితే, ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో ఆయనకు ఓటు వేసే అవకాశం ఉండదు. కర్ణాటకలో ఎన్నికల సంఘం ప్రచారకర్త అయిన రాహుల్ ద్రవిడ్ పేరే ఓటర్ల లిస్టులో లేకపోవడం విచిత్రం. జరిగిందేమిటని ఆరా తీస్తే, ఇందిరానగర్‌లో ఉండే ద్రవిడ్ దంపతులు ఈ మధ్య అశ్వత్నగర్కు మారారు. దాంతో ఇందిరా నగర్ పరిధిలో వారి ఓట్లు తొలగించాలని కోరుతూ ద్రవిడ్ సోదరుడు విజయ్ స్వయంగా ఎన్నికల సంఘానికి ఫారం 7 ద్వారా దరఖాస్తు చేశారు. క్షేత్ర స్థాయి పరిశీలన జరిపిన ఎన్నికల అధికారులు అక్కడ పేరు తొలగించారు. అయితే, ఆయన అశ్వత్‌నగర్‌లో పేరు నమోదు చేసుకోలేదు. ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకోవడానికి మార్చి 16 వరకు గడువు ఉంది. ఆ సమయంలో రాహుల్ విదేశాల్లో ఉండటంతో పేరు నమోదు చేసుకోవడం కుదరలేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటరు పేరు తొలగించడానికి కుటుంబ సభ్యులు ఎవరైనా ఫారం 7 ద్వారా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయవచ్చు. అయితే, పేరు నమోదుకు మాత్రం ఓటరే స్వయంగా ఫారం 6ను సమర్పించాల్సి ఉంటుంది. గడువులోగా రాహుల్ ఫారం 6 సమర్పించకపోవడంతో అశ్వత్‌నగర్‌లో ఆయన పేరు ఓటరు జాబితాలో చేరలేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటు విలువ గురించి, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ప్రచారం చేసిన రాహుల్ తాను మాత్రం ఓటు వేసే అవకాశం కోల్పోయారు. -
సింధుకు జాక్‌పాట్
న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు జాక్‌పాట్ కొట్టింది. చైనాకు చెందిన ప్రముఖ క్రీడా పరికరా ల తయారీ సంస్థ లీ నింగ్‌తో నాలుగేళ్ల కాలానికి ప్రచారకర్తగా రూ.50కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందు లో రూ.40కోట్లు స్పాన్సర్షిప్కు కాగా, మిగిలిన సొమ్ము సింధుకు అవసరమైన క్రీడాసౌకర్యాల కోసం ఇస్తారు. కాగా, గత నెలలో మరో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌తో సైతం ఇదే కంపెనీ రూ.35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సింధుకు ఇవ్వజూపిన సొమ్ము ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలోనే భారీ మొత్తంగా భారత్‌లో లీ నింగ్ సంస్థకు భాగస్వామి, సన్‌లైట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మహేంద్ర కపూర్ తెలిపాడు. ఇది ప్యూమా సంస్థతో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ (ఎనిమిదేళ్ల కాలానికి రూ.100కోట్లు) చేసుకున్న ఒప్పందానికి ఇంచుమించు సమాన మొత్తమని పేర్కొన్నాడు. లీనింగ్‌తో సింధు ఒప్పందం కుదుర్చుకోవడం ఇది రెండోసారి. -
నీతిఆయోగ్‌తో సుశాంత్ రాజ్పుట్..
సాక్షి, న్యూఢిల్లీ : మహిళా సాధికారతను ప్రోత్సహించే కార్యక్రమానికి నీతిఆయోగ్‌తో కలిసి పనిచేసేందుకు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ శుక్రవారం ఓ ఒప్పందంపై సంతకం చేశారు. నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సమక్షంలో సుశాంత్, నీతిఆయోగ్ అధికారులు సంతకాలు చేశారు. మహిళా సాధికారతకు సాధ్యమైనంత మేర కృషిచేస్తానని, నీతిఆయోగ్‌తో కలిసిపనిచేయడం సంతోషంగా ఉందని సుశాంత్ చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారిచే యూనిట్లను ఏర్పాటు చేసే క్రమంలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వేదిక (డబ్ల్యూఈపీ)ని ఈ ఏడాది ఆరంభంలో ఏర్పాటు చేశారు. సుశాంత్ ఇటీవలే ఇనసే వెంచర్స్ పేరిట స్టార్టప్ ఏర్పాటు చేశారు. తమ సంస్థ విజయం వెనుక తన తల్లి, నలుగురు సోదరీమణులే కారణమని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏడాది తాను ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సుశాంత్ వెల్లడించారు. కేదార్‌నాథ్‌తో పాటు పలు సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. -
ప్రపంచం పిలుస్తోంది
మహిళలు అంటే వంటింటికే పరిమితం కావద్దని..తమలోని శక్తిపై నమ్మకంతో ముందడుగు వేస్తే సాధించలేనిదేమీ లేదని.. ఆడపిల్లలపై తల్లిదండ్రులు వివక్ష వీడి, అబ్బాయిలతో సమానంగా పెంచాలంటున్నారు మిస్ క్వీన్ ఇండియా, పోచంపల్లి ఇఖత్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్ రశ్మీఠాకూర్. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ఆడపిల్లల చదువుపై వివక్ష చూపొద్దని కోరుతున్నారు. ఎన్టీసీపీ రామగుండం వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ ఆమెను పలకరించింది. స్త్రీశక్తిపై ఆమె మాటలు.. పెద్దపల్లి, జ్యోతినగర్: దక్షిణ భారతదేశంలో మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. సమానత్వం కోసం ఇంకా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. మగవారితో సమానంగా అవకాశాలు ఇవ్వాలి. అయితే ఇంటి నుంచే వివక్ష మొదలవుతుంది. తల్లిదండ్రులే ఆడపిల్లలపై ఆంక్షలు పెడుతున్నారు. దీంతో వారు స్వశక్తితో ముందుకు సాగలేకపోతున్నారు. అబ్బాయిలతో సమానంగా చూసినప్పుడే వారిలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రధానంగా విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉన్నత విద్యనభ్యసించి, ఆర్థికంగా ఎదిగినప్పుడే గుర్తింపు దక్కుతుంది. అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలి. ♦ బ్రాండ్ అంబాసిడర్‌గా.. పోచంపల్లి ఇఖత్కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం నా అదృష్టం. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన మూడో రోజే అక్కడకు వెళ్లినప్పుడు వారి కష్టాలను చూశాను. పలువురు తమ మగ్గాలను వదిలి పెట్రోల్‌బంక్‌లు, షాపింగ్మాల్స్ల్లో వాచ్మెన్లుగా పనిచేయడం కలచివేసింది. వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. వారు తయారు చేసిన వస్త్రాలను విక్రయించేందుకు ‘రశ్మీఠాకూర్ టెక్స్టైల్స్’ ఏర్పాటు చేయబోతున్నాను. అంతేకాకుండా వివిధ దేశాల్లో పర్యటించినప్పుడు వారు నేసిన వస్త్రాల గురించి ప్రచారం చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నాము. ♦ అందాల పోటీలపై.. పారిశ్రామికప్రాంతం రామగుండం నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. అయితే ఇండియాలో అందాల పోటీల నిర్వహణలో వెనుకబడి ఉన్నాం. అయితే తెలంగాణ టూరిజం వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ♦ శ్రీమతి తెలంగాణతో.. స్త్రీ అంటే శక్తి అని నిరూపించేందుకే ‘శ్రీమతి తెలంగాణ’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వివరిస్తూ ఈ పోటీలు చేపడుతున్నాం. ఈ పోటీల ద్వారా మహిళల ప్రాధాన్యతను వివరిస్తూ, వారిలోని టాలెంట్‌ను బయటకు తీస్తుంది. పోటీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం గర్వకారణంగా ఉంది. ఈ పోటీల ద్వారా మహిళల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మహిళల్లోని ప్రతిభను వెలుగుతీసేందుకే ఈ కార్యక్రమం. ♦ యువతకు సందేశం విద్యతోనే బంగారు భవిష్యత్ సాధ్యం. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తేనే ఏదైనా సాధించగలం. సోషల్‌మీడియాను మంచికే ఉపయోగించుకోవాలి. అలాగని గంటలకొద్దీ గడపడం కచ్చితంగా తప్పు. ఆరోగ్యం పాడుకావడంతోపాటు విలువైన సమయాన్ని నష్టపోతాం. మనకు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలి. విశ్రమించకుండా పరిశ్రమించాల్సిందే. అప్పుడే బంగారు భవిష్యత్ మన కళ్ల ముందు ఉంటుంది. మనకంటూ గుర్తింపు వస్తుంది. తల్లిదండ్రులు సైతం ఆడపిల్లలపై వివక్ష చూపొద్దు. మగవారితో సమానంగా పెంచాలి.