నీతిఆయోగ్‌తో సుశాంత్‌ రాజ్‌పుట్.. | Sushant Singh Rajput Says Delighted To Associate with NITI Aayog   | Sakshi

నీతిఆయోగ్‌తో సుశాంత్‌ రాజ్‌పుట్..

May 25 2018 6:48 PM | Updated on Oct 17 2018 6:01 PM

Sushant Singh Rajput Says Delighted To Associate with NITI Aayog   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహిళా సాధికారతను ప్రోత్సహించే కార్యక్రమానికి నీతిఆయోగ్‌తో కలిసి పనిచేసేందుకు బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ శుక్రవారం ఓ ఒప్పందంపై సంతకం చేశారు. నీతిఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ సమక్షంలో సుశాంత్‌, నీతిఆయోగ్‌ అధికారులు సంతకాలు చేశారు. మహిళా సాధికారతకు సాధ్యమైనంత మేర కృషిచేస్తానని, నీతిఆయోగ్‌తో కలిసిపనిచేయడం సంతోషంగా ఉందని సుశాంత్‌ చెప్పారు.

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారిచే యూనిట్లను ఏర్పాటు చేసే క్రమంలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వేదిక (డబ్ల్యూఈపీ)ని ఈ ఏడాది ఆరంభంలో ఏర్పాటు చేశారు. సుశాంత్‌ ఇటీవలే ఇనసే వెంచర్స్‌ పేరిట స్టార్టప్‌ ఏర్పాటు చేశారు. తమ సంస్థ విజయం వెనుక తన తల్లి, నలుగురు సోదరీమణులే కారణమని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏడాది తాను ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సుశాంత్‌ వెల్లడించారు. కేదార్‌నాథ్‌తో పాటు పలు సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement