
హైదరాబాద్: కినారా క్యాపిటల్ ప్రముఖ ఆల్‌రౌండర్ క్రికెటర్ రవీంద్ర జడేజాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ప్రకటించింది. ఎంఎస్‌ఎంఈలకు ఫిన్‌టెక్ సేవలను కినారా క్యాపిటల్ ఆఫర్ చేస్తుంటుంది. కంపెనీ 10వ వార్షికోత్సవం సందర్భంగా జడేజాను అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం గమనార్హం.
కినారా క్యాపిటల్ నిర్వహణలో రూ.1,000 కోట్ల ఆస్తులు ఉండగా, 2025 నాటికి 500 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఉంది. మైకిరాణా యాప్, 400కుపైగా డిజిటల్ చెల్లింపుల ఆప్షన్లను వర్తకులకు ఆఫర్ చేస్తోంది. ఆరు రాష్ట్రాల పరిధిలోని 90 పట్టణాల్లో ప్రస్తుతానికి ఈ సంస్థ సేవలను అందిస్తోంది.
చదవండి: Sachin Tendulkar : అప్పుడు స్పిన్‌తో.. ఇప్పుడు స్పిన్నీతో..