Ambrane: ‘పవర్‌’ ప్యాక్డ్‌ రవీంద్ర జడేజా | Ambrane Released Ravindra Jadeja Autographed Aerosync Wireless Powerbank | Sakshi
Sakshi News home page

Ambrane: ‘పవర్‌’ ప్యాక్డ్‌ రవీంద్ర జడేజా

Published Thu, Nov 11 2021 7:13 PM | Last Updated on Fri, Nov 12 2021 2:52 PM

Ambrance Released Ravindra Jadeja Autographed Aerosync Wireless Powerbank - Sakshi

మొబైల్‌ యాక్ససరీస్‌ తయారీ సంస్థ అంబ్రాన్‌ రవీంద్ర జడేజా సిగ్నచర్‌తో సరికొత్త పవర్‌ బ్యాంక్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. ఎయిరోసింక్‌ పీబీ పేరుతో లిమిటెడ్‌ ఎడిషన్‌గా అంబ్రాన్‌ విడుదల చేసింది.  ఈ సిగ్నేచర్‌ పవర్‌ బ్యాంక్‌ ధర రూ.3,999గా ఉంది. ఇందులో లిథియమ్‌ పాలిమర్‌ బ్యాటరీని ఉపయోగించారు. బ్యాటరీ బ్యాకప్‌ సామర్థ్యం 10,000 ఎంఏహెచ్‌గా ఉంది.

ఈ పవర్‌బ్యాంక్‌ ఉపయోగించి వైర్‌లెస్‌ ,  వైర్‌డ్‌ పద్దతుల్లో మొబైల్‌ని ఛార్జ్‌ చేసుకోవచ్చు. కేవలం 3 గంటల పది నిమిషాల్లో పవర్‌ బ్యాంక్‌ ఫుల్‌ అవుతుంది.  వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ మోడ్‌లో 15 వాట్స్‌, వైర్‌డ్‌ మోడ్‌లో 20 వాట్స్‌ స్పీడ్‌తో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ అందిస్తోంది.

అతి తక్కువ సమయంలోనే ఈ పవర్‌ బ్యాంకును ఉపయోగించి మొబైల్‌ని ఫుల్‌ ఛార్జ్‌ చేసుకోవచ్చని అంబ్రాన్‌ చెబుతోంది. యూఎస్‌బీ, టైప్‌ సీ పోర్టుల ద్వారా మొబైల్‌ ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పవర్‌బ్యాంక్‌ అందుబాటులో ఉంది. అంబ్రాన్‌ ఇండియాకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని క్రికెటర్‌ రవీంద్ర జడేజా అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement