power bank
-
ఏఐ డస్ట్బిన్స్ని.. ఎప్పుడైనా చూశారా?
చెత్తబుట్టల వాడకం చాలాకాలంగా ఉన్నదే! పర్యావరణ స్పృహ పెరిగిన తర్వాత చాలా ప్రాంతాల్లో తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తలకు వేర్వేరు చెత్త బుట్టలను స్థానిక సంస్థలు వేర్వేరు రంగులతో ఏర్పాటు చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. అవగాహనలేని కొందరు వీటిలో ఒకదానిలో వేయాల్సిన చెత్తను వేరేదానిలో వేసేస్తూ ఉంటారు.రంగులను బట్టి గందరగోళానికి లోనవకుండా, ఎందులో వేయాల్సిన చెత్తను అందులోనే వేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే చెత్తబుట్టలను ఇటీవల అమెరికన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటిని ప్రయోగాత్మకంగా అమెరికాలోని సీటల్–టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు.చెత్తబుట్టల్లో వేయడానికి తీసుకొచ్చే చెత్తను వీటిపై ఉండే కెమెరాలు స్కాన్ చేసి, అది ఎందులో వేయాల్సినదో నిర్ధారిస్తుంది. వీటిలోని సెన్సర్లు చెత్తకు అనుగుణమైన బుట్ట మూత తెరుచుకునేలా చేస్తాయి. ఇలాంటి చెత్తబుట్టలు ప్రతిచోటా వాడుకలోకి వస్తే, రకరకాలు చెత్తలన్నీ కలగాపులగం కాకుండా, వాటి వల్ల తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.సోలార్ పవర్‌బ్యాంక్..సౌర విద్యుత్తు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, విశాలమైన స్థలంలేని చోట సోలార్ ప్యానెల్స్, పవర్‌బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. అయితే, చిన్న చిన్న అపార్ట్మెంట్లలో కూడా సులువుగా అమర్చుకునే సోలార్ పవర్‌బ్యాంక్‌ను చైనా కంపెనీ ‘యాంకర్ ఇనవేషన్స్ రూపొందించింది.‘యాంకర్ సోలార్ బ్యాంక్ 2 ఈ1600 ప్రో’ పేరుతో రూపొందించిన ఈ సోలార్ పవర్ బ్యాంకును బాల్కనీ చోటులో తేలికగా అమర్చుకోవచ్చు. ఇది సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చి, బ్యాటరీలో నిక్షిప్తం చేస్తుంది. ఇందులో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని అమర్చారు.ఈ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయినట్లయితే, సూర్యకాంతి లేకపోయినా, నిరంతరాయంగా పదిహేను గంటల సేపు ఇంటికి సరిపోయేంత విద్యుత్తును సరఫరా చేస్తుంది. దీనికి వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉండటంతో యాప్ ద్వారా కూడా దీనిని అవసరాలకు తగినట్లుగా ఉపయోగించుకోవచ్చు. దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో 850 యూరోలు (రూ.76,030) మాత్రమే!ఎలక్ట్రిక్ ట్రాక్టర్..ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విద్యుత్ వాహనాల వినియోగం బాగా పుంజుకుంటోంది. తాజాగా భారత శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థలు సంయుక్తంగా దేశంలోని తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను రూపొందించాయి. ఇది లిథియం అయాన్ ప్రిస్మాటిక్ సెల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది.బ్యాటరీ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తుతో ఈ ట్రాక్టర్ ఇంజిన్ 13 హార్స్పవర్ సామర్థ్యంతో పనిచేస్తుంది. చిన్న పొలాలు, తోటలకు అనుకూలంగా ఉండేలా దీనిని తయారు చేశారు. దీనికి రిడ్జర్స్, కల్టివేటర్స్, ఇనుప చక్రాలు, నాగలి ములుకులు వంటి వ్యవసాయ పరికరాలను అవసరం మేరకు అమర్చుకోవచ్చు. సన్నకారు, చిన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ధర రూ.9.25 లక్షలు మాత్రమే! -
వావ్.. పవర్ బ్యాంక్ వాచీలు వచ్చేశాయ్.. అవి ఎలా పనిచేస్తాయంటే?
ఇవి కొత్తరకం వాచీల్లా కనిపిస్తున్నాయి కదూ! ఇవి వాచీలు మాత్రమే కాదు, పవర్‌బ్యాంకులు కూడా! రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్‌వాచీలు అవసరమైనప్పుడు స్మార్ట్ఫోన్లు, లాప్టాప్లను చార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. దక్షిణ కొరియాకు చెందిన మార్క్ అండ్ డ్రా కంపెనీ స్మార్ట్‌వాచీలకు అనుబంధంగా ఉండేలా 450 ఎంఏహెచ్ పవర్‌బ్యాంక్‌ను రూపొందించింది. ఈ పవర్‌బ్యాంక్ ఆపిల్ స్మార్ట్‌వాచీలకు బాగా ఉపయోగపడతాయి. ప్రయాణాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులకు చార్జింగ్ చేసుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఈ పవర్‌బ్యాంకును ఒకసారి చార్జ్ చేసుకుంటే, సాధారణ పవర్‌బ్యాంకుల కంటే మూడురెట్లు ఎక్కువ సమయం పనిచేస్తుంది. ఈ పవర్‌బ్యాంక్ వాచీ ధర 349.97 డాలర్లు (రూ.29,126) మాత్రమే! -
ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ బ్యాంక్! ఒకేసారి 5 వేల ఫోన్స్ ఇట్టే ఛార్జ్..!
మన నిత్యజీవితంలో స్మార్ట్‌ఫోన్స్ ఒక భాగమైపోయాయి. స్మార్ట్‌ఫోన్స్ లేనిదే రోజు గడువదనే ఛంధంగా తయారైంది పరిస్థితి..! ఇక ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్‌తో గడిపే వారు పవర్ బ్యాంకును కూడా తమతో క్యారీ చేస్తుంటారు. పవర్బ్యాంకులకు కూడా భారీ మార్కెట్ ఉంది. ఇప్పటి వరకు మార్కెట్లో 80 వేల నుంచి 1000 mAh పవర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అయితే చైనాకు చెందిన హ్యాండ్ గెంగ్ అనే యూట్యూబర్ ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ బ్యాంకును కనిపెట్టి అందరితో ఔరా..అనిపిస్తున్నాడు. ఒకే సారి 5 వేల ఫోన్లకు..! హ్యాండ్ గెంగ్ తయారుచేసిన పవర్‌బ్యాంకు 27,000,000mAh సామర్థ్యాన్ని కల్గి ఉంది. దీంతో ఏకంగా 5 వేల స్మార్ట్‌ఫోన్స్‌ను ఛార్జింగ్ చేయవచ్చునని ఈ యూట్యూబర్ తెలిపాడు. ఈ పవర్‌బ్యాంక్‌ను గెంగ్కున్న వెల్డింగ్ స్కిల్స్ తో ఎంఐ పవర్‌బ్యాంకు తరహలో అతి పెద్ద పవర్‌బ్యాంకును తయారు చేశాడు. దీని లోపల మిడ్ సైజ్ డ్ ఎలక్ట్రిక్ కార్ కు సరిపోయే కెపాసిటీ బ్యాటరీలను ఏర్పాటు చేశాడు. దాంతో పాటుగా 60 పవర్ సాకెట్లను అమర్చారు. స్మార్ట్‌ఫోన్స్ ఛార్జింగ్ ఒక్కటే కాదు..! గెంగ్ తయారుచేసిన పవర్బ్యాంకుతో నేరుగా మొబైల్ ఫోన్స్ మాత్రమే కాకుండా ఇతర పవర్ బ్యాంకులకు కూడా ఛార్జింగ్ ఎక్కించుకునే విధంగా తయారు చేశాడు. స్మార్ట్‌ఫోన్సే కాకుండా టీవీ, వాషింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ కుకర్‌ను కూడా నడపవచ్చునని తెలిపాడు గెంగ్. చదవండి: వచ్చింది మూడేళ్లే..! 84 ఏళ్ల కంపెనీకి గట్టిషాకిచ్చిన రియల్మీ..! -
Ambrane: ‘పవర్’ ప్యాక్డ్ రవీంద్ర జడేజా
మొబైల్ యాక్ససరీస్ తయారీ సంస్థ అంబ్రాన్ రవీంద్ర జడేజా సిగ్నచర్‌తో సరికొత్త పవర్ బ్యాంక్‌ని మార్కెట్లోకి తెచ్చింది. ఎయిరోసింక్ పీబీ పేరుతో లిమిటెడ్ ఎడిషన్‌గా అంబ్రాన్ విడుదల చేసింది. ఈ సిగ్నేచర్ పవర్ బ్యాంక్ ధర రూ.3,999గా ఉంది. ఇందులో లిథియమ్ పాలిమర్ బ్యాటరీని ఉపయోగించారు. బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యం 10,000 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ పవర్‌బ్యాంక్ ఉపయోగించి వైర్లెస్ , వైర్డ్ పద్దతుల్లో మొబైల్‌ని ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం 3 గంటల పది నిమిషాల్లో పవర్ బ్యాంక్ ఫుల్ అవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ మోడ్‌లో 15 వాట్స్, వైర్డ్ మోడ్‌లో 20 వాట్స్ స్పీడ్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తోంది. అతి తక్కువ సమయంలోనే ఈ పవర్ బ్యాంకును ఉపయోగించి మొబైల్‌ని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చని అంబ్రాన్ చెబుతోంది. యూఎస్బీ, టైప్ సీ పోర్టుల ద్వారా మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పవర్‌బ్యాంక్ అందుబాటులో ఉంది. అంబ్రాన్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని క్రికెటర్ రవీంద్ర జడేజా అన్నారు. -
Zip Charge Go: ఫోన్లకే కాదు కార్ల కోసం కూడా.. పవర్ బ్యాంక్ ఫీచర్స్
ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్న వారికి గొప్ప రిలీఫ్. ఈవీ కొనాలనుకునేవారికి శుభవార్త! ఫోన్ల తరహాలోనే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోకుండా ఉంచుకునేందుకు వీలుగా పవర్ బ్యాంకు రెడీ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్ఘారాలను తగ్గించాలనే డిమాండ్ ఊపు మీద ఉంది. ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించాలంటూ అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రజలకు చెబుతున్నాయి. మన దగ్గరయితే పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్‌కి షిఫ్ట్ అయ్యేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. అయితే ఛార్జింగ్ స్టేషన్లు, వెహికల్ మైలేజీ రేంజ్ అనే అంశాలు అవరోధాలుగా ఉన్నాయి. పవర్ బ్యాంక్ ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు మొబైల్ ఫోన్లలో నిరంతరం ఛార్జింగ్ ఉండేలా బ్యాటరీ డ్రయిన్ కాకుండా చూసుకునేందుకు వీలుగా పవర్ బ్యాంకులు వెంట తీసుకెళ్తాం. ఇప్పుడు ఈవీ వెహికల్స్‌కి కూడా అత్యవసర సమయంలో వాడుకునేందుకు వీలుగా పవర్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. సీఓపీ26లో బ్రిటన్‌కి చెందిన జిప్‌ఛార్జ్ అనే స్టార్టప్ కంపెనీ గో పేరుతో పవర్ బ్యాంకును తయారు చేసింది. గ్లాస్కోలో జరుగుతున్న కాన్ఫడరేషన్ ఆఫ్ పార్టీస్ 26 (సీవోపీ 26) సదస్సులో ఈ పవర్ బ్యాంకుని ఆవిష్కరించింది. వచ్చే ఏడాది చివరి త్రైమాసికం నాటికి మార్కెట్లోకి ఈ పవర్ బ్యాంక్‌ని తెస్తామని జిప్‌ఛార్జ్ ప్రకటించింది. ఈజీగా ఫోన్ పవర్ బ్యాంక్ అయితే చేతిలో పట్టుకెళ్లొచ్చు, బ్యాగులో తీసుకెళ్లొచ్చు. కార్ పవర్ బ్యాంక్ అంటే పెద్దదిగా ఉండి ఉపయోగించడం కష్టంగా ఉంటుందనే భావన రానీయకుండా డిజైన్ చేశారు. గరిష్టంగా 20 కేజీల బరువు ఉండే ఈ పవర్ బ్యాంకు చిన్న సూట్‌కేస్ అంత ఉంటుంది. వీల్స్‌పై దీన్ని తీసుకెళ్లడం సులభం. కారు డిక్కీలో ఈజీగా పడుతుంది. గరిష్టంగా 70 కి.మీ ఈ పవర్ బ్యాంక్‌ని ఉపయోగించి కారుని ఛార్జ్ చేస్తే కనిష్టంగా 35 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని జిప్‌ఛార్జ్ చెబుతోంది. ఇంట్లో సైతం కరెంటు లేని సమయంలో పవర్ బ్యాంక్‌ను బ్యాకప్‌గా ఉపయోగించుకునే వీలుంది. స్మార్యాప్ల ద్వారా దూరంగా ఉండి కూడా ఈ పవర్ బ్యాంక్ ఛార్జింగ్‌ను పర్యవేక్షించే వీలుంది. రెండు వేరియంట్లలో జిప్‌ఛార్జ్ సంస్థ 20 కిలోవాట్స, 40 కిలోవాట్స్ వేరియంట్లలో తయారు చేసింది. అయితే వీటి ధరను ఇంకా నిర్ణయించలేదు. మార్కెట్లోకి వచ్చేప్పుడు ధరలను ఫైనల్ చేస్తామని చెబుతున్నారు. చదవండి:ఐఓసీఎల్ బాటలోనే బీపీసీఎల్.. బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు! -
20వేల ఎంఏహెచ్ పవర్ బ్యాంకు రూ.1399లకే
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న క్రమంలో పవర్‌బ్యాంకుల ఆవశ్యకత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో దేశీయంగా బడ్జెట్‌ధరల్లో ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్న ఇంటెక్స్ స్మార్ట్ యూజర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. 20వేల ఎంఏహెచ్ సామర్ధ్యం ఉన్న పవర్‌బ్యాంకును తగ్గింపుధరలో అందుబాటులోకి తెచ్చింది. ఒకేసారి పలు డివైస్‌లకు చార్జింగ్పెట్టుకునే అవకాశం ఉన్న ఇంటెక్స్ ఐటీ-పీబీఏ 20వేల లిథియం పాలిమర్ పవర్ బ్యాంకు (వైట్)ను కేవలం రూ.1399 లకే అందిస్తోంది. దీని ఎంఆర్పీ ధర. రూ. 3550 లు. పత్ర్యేకంగా అమెజాన్ ద్వారా ఒక్కరోజుకే ఈ సేల్ నిర్వహిస్తోంది. ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు (ఫిబ్రవరి 11)కే పరిమితమని, అదీ స్టాక్ ఉన్నంత వరకేనని ఇంటెక్స్ టెక్నాలజీస్ ప్రకటించింది. With massive 20,000 mAh battery, charge multiple devices on the go with Intex IT-PBA 20K Poly. Buy for ₹1399 only during 'Deal of the Day' @AmazonIN. Offer valid only for today and till stock lasts. Buy now : https://t.co/w83gcaMDxv pic.twitter.com/CxTTt8Z6PR — Intex Technologies (@IntexBrand) February 11, 2019 -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ టీవీ నటి హంగామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ హంగామా సృష్టించింది. ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 1 వద్ద మాళవికా తివారి(56) అనే మహిళకు చెందిన పవర్‌బ్యాంకు పేలుడు కలకలం రేపింది. శబ్దం చేస్తూ పేలడంతో ఎయిర్ పోర్టులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. సీనియర్ అధికారి అందించిన సమాచారం ప్రకారం మాళవిక ధర్మశాలకు వెళ్లే విమానం కోసం వేచి చూస్తుంది. ఎయిర్ పోర్టు సిబ్బంది ఆమెను చెకింగ్ కోసం పిలిచారు. తన హ్యాండ్ బ్యాగులో సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం వాడే పవర్ బ్యాంకును పెట్టుకుని సెక్యూరిటీ చెకింగ్ వద్దకు వచ్చింది. అక్కడ హ్యాండ్ బ్యాగులోని వస్తువులను చూపించానికి నిరాకరించడంతో కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నియంత్రణ కోల్పోయిన మహిళ బ్యాగులోని పవర్ బ్యాంక్ తీసి నేలకేసి కొట్టింది. దీంతో చిన్నపాటి పేలుడు సంభవించడంతో కొద్దిసేపు గందరగోళం వాతావరణం ఏర్పడింది. అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఆమెను అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఐపీసీ సెక్షన్ 336, 285 ల కింద మాళవికను అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పయిందంటూ ఆమె క్షమాపణ కోరిందనీ, అయితే విచారణ అనంతరం ఆమెను బెయిల్‌పై విడుదల చేశామని ఎయిర్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ సంజయ్ భాటియా తెలిపారు. ఆమె నేపథ్యం గురించి ఖచ్చితంగా తెలియదు కానీ ఒక టీవీ నటిగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. -
కొత్తప్రపంచం 17th June 2018
-
బస్సులో ప్రయాణిస్తుండగా పవర్ బ్యాంక్ పేలింది
-
పవర్‌బ్యాంక్ వాడుతున్నారా.. జాగ్రత్త
బీజింగ్ : చైనాలోని గువాంగ్జోకు చెందిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్నాడు. తోటి ప్రయాణికునితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతున్నాడు. ఇంతలో అతని బ్యాగు నుంచి బాంబు పేలినంత శబ్ధం.. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే బ్యాగును కింద పడేసి మంటల నుంచి తనను తాను రక్షించుకున్నాడు. ఆ పేలుడు కారణంగా బస్సు మొత్తం పొగతో నిండిపోయింది. ఎలాగైతేనేం ఆ వ్యక్తి చావు నుంచి తప్పించుకున్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కాలిపోయిన బ్యాగు తెరిచి చూస్తే.. అప్పుడర్థమైంది. చార్జింగ్ పెట్టుకోవటానికి తెచ్చుకున్న పవర్‌బ్యాంకు పేలి ప్రాణాల మీదకు వచ్చిందని. ఈ సంఘటన చైనా దేశంలోని గువాంగ్జో పట్టణంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో బాధితునితో సహా ప్రయాణికులెవ్వరూ గాయపడలేదు. గతవారం ముంబై నగరంలో స్నేహితులతో కలసి రెస్టారెంట్లో భోజనం చేస్తున్న ఓ వ్యక్తి జేబులోని ఫోన్ పేలింది. ప్రమాదంలో బాధితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆ ఘటన మరువక ముందే ఇలా పవర్‌బ్యాంకు పేలటం ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించే వారిని కొంత అభద్రతా భావానికి గురిచేస్తోంది. ఏది ఏమైనా సెల్ఫోన్లు, పవర్‌బ్యాంకులు వంటి స్మార్ట్ పరికరాలను శరీరానికి వీలైనంత దూరంగా ఉంచుకోవటం మంచిదంటున్నారు నిపుణులు. స్మార్ట్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
-
విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం
బీజింగ్: టేకాఫ్ కు సిద్దంగా ఉన్న ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సెల్‌ఫోన్ చార్జింగ్ కు వాడే పవర్ బ్యాంకు పేలడంతో చైనా సదరన్ ఎయిర్లైస్స్ కు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. సిబ్బంది, ప్రయాణికులు సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. చైనాలోని గాంగ్జూ విమానాశ్రయంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బోయింగ్ 777-300ఈఆర్ రకానికి చెందిన సీజెడ్3539 విమానం గాంగ్జూ నుంచి షాంఘై వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రయాణికులు విమానంలో ఎక్కుతుండగానే ఓవర్‌హెడ్ కంపార్ట్మెంటులో మంటలు గమనించారు. అందులోని ఓ బ్యాగులో నుంచి మంటలు చెలరేగాయి. సిబ్బంది హుటాహుటిన స్పందించి మంటలు ఆర్పివేశారు. ప్రమాదం జరిగినప్పుడు పవర్ బ్యాంకు వినియోగంలో లేకపోయినా ఎందుకు పేలిందనే దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఆ బ్యాగు తీసుకువచ్చిన వ్యక్తిని విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఆ విమానాన్ని నిలిపివేసి మరో విమానంలో ప్రయాణికులను పంపించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీకాలేదు. బోయింగ్ 777-300ఈఆర్ విమానంలో కొంత భాగం మాత్రం పాడైంది. మంటలు చెలరేగినప్పుడు ప్రయాణికుడు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
అధికారులను వణికించిన పవర్ బ్యాంక్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులను పవర్ బ్యాంక్ కాసేపు వణికించింది. లగేజీ తనిఖీ సందర్భంగా ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో హ్యాండ్ గ్రెనేడ్ తరహా వస్తువు దర్శనమిచ్చింది. దీంతో ఉలిక్కి పడ్డ భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు గో ఎయిర్ సర్వీస్ ద్వారా వెళ్లేందుకు సదరు ప్రయాణికుడు సిద్ధమయ్యాడు. ఇంతలో అతని లగేజీలో హ్యాండ్ గ్రనేడ్ షేప్‌లో ఉన్న వస్తువు ఒకదానిని గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అదొక పవర్ బ్యాంక్ అని.. కావాలంటే పరిశీలించుకోండంటూ అధికారులను ఆ ప్రయాణికుడు కోరాడు. దీంతో రంగంలోకి దిగిన సాంకేతిక నిపుణులు అదొక పవర్ బ్యాంక్ అని తేల్చటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆపై అతన్ని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించారు. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో అలర్ట్ ప్రకటించిన అధికారులు అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
షావోమి మేడిన్ ఇండియా పవర్ బ్యాంక్‌లు!!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ దేశీయంగా తయారు చేసిన (మేడిన్ ఇండియా) పవర్ బ్యాంక్‌లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందుకోసం హిపద్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మూడో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. 10,000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐ, 20,000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐల ను ఈ యూనిట్లోనే తయారు చేయనుంది. వీటి ధరలు వరుసగా రూ.799గా, రూ.1,499గా ఉండనున్నాయి. కొత్త తయారీ యూనిట్లో నిమిషానికి ఏడు పవర్ బ్యాంక్‌లను తయారు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ యూనిట్ వల్ల తొలిగా దాదాపు 500 మందికిపైగా ఉపాధి లభిస్తుందని పేర్కొంది. -
'వారు చేయలేకపోయారు.. మేం చేసి చూపించాం'
సాగర్దిగి: అతి త్వరలోనే మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు అమ్ముతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇప్పుడిప్పుడే తమకు చాలినంత విద్యుత్ ను సృష్టించుకొని పవర్ బ్యాంకును సాధిస్తున్నామని అదనంగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. బుధవారం ఆమె ముర్షిదాబాద్ జిల్లాలోని సాగర్దిగి వద్ద మూడోదశ 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి త్వరలోనే మరో 500 మెగావాట్ల విద్యుత్ నాలుగో దశ ప్లాంటును కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇతర రాజకీయ పార్టీలను ఆమె విమర్శిస్తూ 'మేము ఏమైతే చేయగలమో ఆ హామీలనే ఇచ్చాం. ఇప్పుడు బెంగాల్ ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేశాం. ఇది నాటి వామపక్ష ప్రభుత్వం చేయలేకపోయింది.. మేం చేసి చూపించాం' అంటూ ఆమె వ్యాఖ్యానించారు.