వావ్‌.. పవర్‌ బ్యాంక్‌ వాచీలు వచ్చేశాయ్‌.. అవి ఎలా పనిచేస్తాయంటే? | Wearable Watch Power Banks How Does It Work | Sakshi
Sakshi News home page

వావ్‌.. పవర్‌ బ్యాంక్‌ వాచీలు వచ్చేశాయ్‌.. అవి ఎలా పనిచేస్తాయంటే?

Published Sun, Oct 8 2023 7:40 AM | Last Updated on Sun, Oct 8 2023 7:42 AM

Wearable Watch Power Banks How Does It Work - Sakshi

ఇవి కొత్తరకం వాచీల్లా కనిపిస్తున్నాయి కదూ! ఇవి వాచీలు మాత్రమే కాదు, పవర్‌బ్యాంకులు కూడా! రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్‌వాచీలు అవసరమైనప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు, లాప్‌టాప్‌లను చార్జింగ్‌ చేసుకోవడానికి ఉపయోగపడతాయి.

దక్షిణ కొరియాకు చెందిన మార్క్‌ అండ్‌ డ్రా కంపెనీ స్మార్ట్‌వాచీలకు అనుబంధంగా ఉండేలా 450 ఎంఏహెచ్‌ పవర్‌బ్యాంక్‌ను రూపొందించింది. ఈ పవర్‌బ్యాంక్‌ ఆపిల్‌ స్మార్ట్‌వాచీలకు బాగా ఉపయోగపడతాయి.

ప్రయాణాల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులకు చార్జింగ్‌ చేసుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఈ పవర్‌బ్యాంకును ఒకసారి చార్జ్‌ చేసుకుంటే, సాధారణ పవర్‌బ్యాంకుల కంటే మూడురెట్లు ఎక్కువ సమయం పనిచేస్తుంది. ఈ పవర్‌బ్యాంక్‌ వాచీ ధర 349.97 డాలర్లు (రూ.29,126) మాత్రమే! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement