wearable devices
-
బట్టతలకు విరుగుడు మంత్రం.. ఈ స్మార్ట్ డివైజ్!
బట్టతల మీద జుట్టు మొలిపించుకోవడం కోసం జనాలు నానా తంటాలు పడుతుంటారు. జుట్టు రాలడాన్ని అరి కట్టడానికి రకరకాల నూనెలను ఉపయోగిస్తుంటారు. మందు మాకులు వాడుతుంటారు. బట్టతలను దాచుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కొందరు విగ్గులు వాడుతుంటారు. బట్టతలపై జుట్టు కోసం ఇకపై ఇన్ని తంటాలు అక్కర్లేదు. హెల్మెట్‌లా కనిపించే ఈ పరికరాన్ని తలకు తొడుక్కుంటే చాలు. ఆరు నెలల్లోనే ఇది ఫలితాలను చూపించడం మొదలుపెడుతుంది. ఆస్ట్రియాకు చెందిన ‘నియోస్టెమ్’ కంపెనీ ఇటీవల ఈ పరికరాన్ని ‘హెయిర్‌లాస్ ప్రివెన్షన్ వెయిరబుల్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. రోజూ అరగంట సేపు దీన్ని తలకు తొడుక్కుంటే, ఇది తలపైనున్న మూలకణాలను ఉత్తేజితం చేసి, జుట్టు రాలిపోయిన చోట తిరిగి జట్టు మొలిపిస్తుందని దీని తయారీదారులు చెబుతున్నారు. దీనిని వాడటం వల్ల దుష్ఫలితాలేవీ ఉండబోవని కూడా వారు చెబుతున్నారు. దీని ధర 899 డాలర్లు (రూ.74,734). -
మైగ్రేన్ తలనొప్పి నివారణ పరికరం..
-
వావ్.. పవర్ బ్యాంక్ వాచీలు వచ్చేశాయ్.. అవి ఎలా పనిచేస్తాయంటే?
ఇవి కొత్తరకం వాచీల్లా కనిపిస్తున్నాయి కదూ! ఇవి వాచీలు మాత్రమే కాదు, పవర్‌బ్యాంకులు కూడా! రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్‌వాచీలు అవసరమైనప్పుడు స్మార్ట్ఫోన్లు, లాప్టాప్లను చార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. దక్షిణ కొరియాకు చెందిన మార్క్ అండ్ డ్రా కంపెనీ స్మార్ట్‌వాచీలకు అనుబంధంగా ఉండేలా 450 ఎంఏహెచ్ పవర్‌బ్యాంక్‌ను రూపొందించింది. ఈ పవర్‌బ్యాంక్ ఆపిల్ స్మార్ట్‌వాచీలకు బాగా ఉపయోగపడతాయి. ప్రయాణాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులకు చార్జింగ్ చేసుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఈ పవర్‌బ్యాంకును ఒకసారి చార్జ్ చేసుకుంటే, సాధారణ పవర్‌బ్యాంకుల కంటే మూడురెట్లు ఎక్కువ సమయం పనిచేస్తుంది. ఈ పవర్‌బ్యాంక్ వాచీ ధర 349.97 డాలర్లు (రూ.29,126) మాత్రమే! -
అదిరిపోయే ఫీచర్లతో.. 'బోట్' స్మార్ట్ వాచ్ విడుదల, ధర ఇంత తక్కువా!
తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో ప్రముఖ వేరబుల్ తయారీ సంస్థ 'బోట్ ఎక్స్టెండ్ టాక్' అనే స్మార్ట్ వాచ్‌ను విడుదల చేయనుంది. స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, అలెక్సా సపోర్ట్, ఐపీ 68తో పాటు ఫీచర్లు ఉన్నాయి. 2.5 డీ కర్వ్డ్ స్క్రీన్‌తో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.3వేల లోపు ఉండనుంది. ఫీచర్లు 300ఎంఏహెచ్ బ్యాటరీ, హెచ్డీ రెజెల్యూషన్‌తో 1.69 డిస్ప్లేతో డిజైన్ చేసింది. బోట్ స్మార్ట్ వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్లు, పల్స్ రేట్ ఎలా ఉందో చెక్ చేసే ఆక్సో మీటర్ తరహాలో (ఎస్పీ ఓ2 మానిటర్), ఉదాహరణకు ట్రెడ్ మిల్ మీద మీరు నడిచే సమయంలో ఎంత గాలి పీలుస్తున్నారు. ఎంత గాలి వదులుతున్నారో గుర్తించండం (వీఓ2 మ్యాక్స్), ఎన్ని మెట్లు ఎక్కారో ట్రాక్ చేయడం, మీ శరీరంలో ఎన్ని కేలరీలు ఉన్నాయి. స్పోర్ట్స్ మోడ్స్ విభాగంలో రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, యోగా, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ బ్యాడ్మింటన్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఎంత సేపు చేశారో ఆటో మెటిగ్గా గుర్తిస్తుంది. బ్యాటరీ లైఫ్ టైం ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ లైఫ్ టైం 10రోజులు ఉంటుందని బోట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కొన్ని సమయాల్లో మాత్రం బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్‌తో 2 రోజుల బ్యాటరీ లైఫ్ టైంను వినియోగించుకోవచ్చని తెలిపారు. ధర ఐపీ68 రేటింగ్‌తో వస్తున్న ఈ ఎక్సెటెండ్ టాక్ స్మార్ట్ వాచ్‌లో 150 వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. అంటే వాచ్ డిస్ప్లే ను మీరు 150 రకాల డిస్ప్లే స్టైల్స్‌ను మార్చుకోవచ్చు. ఇక ఈ వాచ్ ప్రారంభ ధర రూ.2,999గా ఉంది. అమెజాన్‌లో లభ్యమయ్యే ఈ స్మార్ట్ వాచ్ పిచ్ బ్లాక్, చెర్రీ బ్లూసోమ్, టీమ్ గ్రీన్ వేరియంట్లలో లభ్యం అవుతుంది. -
షావోమీ మరో సంచలనం, మాట్లాడేందుకు కళ్ల జోడు తెస్తోంది
టెక్ యుగంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. మానవుడి జీవన విధాన్ని మరింత స్మార్ట్‌గా మార్చేస్తూ అనేక రకాల గాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతలా అంటే ఫోన్‌తో చేసే పనులు కళ్ల జోళ్ల(స్మార్ట్ గ్లాసెస్)తో చేయడం అన్నమాట. ఇప్పటికే ఆ దిశగా ఫేస్బుక్ ‘రే బాన్ స్టోరీస్’ పేరుతో స్మార్ట్ గ్లాసెస్ అమ్మకాలు ప్రారంభించింది. ఇప్పుడు ఫేస్‌బుక్‌కు పోటీగా ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ తొలిసారి 'వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్' పేరుతో స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. షావోమీ స్మార్ట్ గ్లాసెస్ ఫీచర్స్ 'స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రం హోం' సినిమాలో స్పైడర్ మ్యాన్ పాత్రదారి పీటర్ పార్కర్ ధరించిన స్మార్ట్ గ్లాస్‌లా ఉండే ఈ కళ్ల జోడులో రకరకాల ఫీచర్స్ ఉన్నాయి.ఈ ఫీచర్లతో నోటిఫికేషన్లు సెండ్ చేయడం, ఫోన్ కాల్స్ మాట్లాడడం, నావిగేషన్, ఇమేజ్‌లను క్యాప్చర్ చేయడం, టెక్ట్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. వీటితో పాటు బ్యాక్ లైటింగ్ కోసం 2.4ఎంఎంx2.02 ఎంఎం పరిమాణంలో మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే, మల్టీపుల్ కలర్స్ డిస్ట్రబ్ చేయకుండా ఒక్క కలర్ మాత్రమే కనపించేలా మోనోక్రోమ్ ప్యానెల్ ను డిజైన్ చేసింది. అందం కనువిందుగా 180 డిగ్రీల ట్రాన్స్ మిట్ లైట్(కాంతి)వల్ల కళ్లకు ఎలాంటి సమస్య లేకుండా అందం కనువిందుగా కనిపించేందుకు మైక్రోలెడ్ డిస్ప్లే,ఫేస్బుక్ స్మార్ట్ గ్లాసెస్లాగే.. షావోమీ వాయిస్ అసిస్టెంట్ షావోఏఐ ని వినియోగించుకోవచ్చు. ఫోటోలు తీసేందుకు 5 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ మైక్స్, స్పీకర్లు, బ్లూటూత్, వైఫై, టచ్‌ప్యాడ్, ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం క్వాడ్ కోర్ అడ్వాన్స్డ్ రిస్క్ మెషిన్(ఏఆర్ఎం) ప్రాసెసర్‌ను అందిస్తున్నట్లు షావోమీ తెలిపింది. కాగా,వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్ వస్తున్న ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను షావోమీ ఎప్పుడు విడుదల చేస్తుంది. ఇంకా ఎలాంటి టెక్నాలజీని జోడించనుందనే విషయాల గురించి షావోమీ ' స్పష్టత ఇవ్వాల్సి ఉంది. చదవండి: ఫేస్బుక్ కళ్లద్దాలు.. ఇక ఫొటో, వీడియోలు తీయొచ్చు -
టెక్ దిగ్గజం ఆపిల్‌ను దాటేసిన షియోమీ
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ వేరబుల్ స్మార్ట్ బ్రాండ్ అమ్మకాల విషయంలో టెక్ దిగ్గజం ఆపిల్‌ను దాటేసింది. 2021 రెండవ త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్ వాచ్ షిప్ మెంట్ల పరంగా ప్రపంచంలో టాప్ వేరబుల్ సంస్థగా షియోమీ నిలిచింది. దీనికి సంబంధించిన నివేదికను కానాలిస్ సంస్థ విడుదల చేసింది. ఎంఐ తన స్మార్ట్ బ్యాండ్ 6 లాంచ్ చేసిన తర్వాత రెండవ త్రైమాసికంలో షియోమీ అమ్మకాలు ఊపందుకున్నాయి. చైనాలో విక్రయాల విషయానికి వస్తే క్యూ2లో 8.0 మిలియన్ యూనిట్లను రవాణా చేసి 2.6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.(చదవండి: గూగుల్ డ్రైవ్ వాడుతున్నారా? ఇది మీకోసమే..) చైనాలో షియోమీ మార్కెట్ వాటా 19.6 శాతం ఆపిల్ వాటా 19.3 శాతం కంటే స్వల్పంగా ఎక్కువగా ఉంది. ఆపిల్ సంస్థ 7.9 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. చైనాలో అమ్మకాల పరంగా హువావే మూడవ స్థానంలో ఉంది. ఇది మార్కెట్లో 9.2 శాతం వాటాతో 3.7 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఆ తర్వాత రెండు స్థానాలలో ఫిట్ బీట్ 7.3 శాతం వాటాతో 3.0 మిలియన్, శామ్ సంగ్ 6.1 శాతం మార్కెట్ వాటాతో 2.5 మిలియన్ యూనిట్లను సరఫరా చేసింది. కానాలిస్ రీసెర్చ్ ఎనలిస్ట్ సింథియా చెన్ మాట్లాడుతూ ఇలా అన్నారు. "షియోమీ తన ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6ను త్వరగా విడుదల చేయడం ఒక తెలివైన చర్య. ఇది దాని మునుపటి కంటే పరికరం కంటే ఉత్తమమైనది" అని అన్నారు. -
శామ్సంగ్... గూగుల్.. ఓ స్మార్ట్ వాచ్
శామ్సంగ్, గూగుల్ కలయికలో అధునాత ఫీచర్లతో స్మార్ట్ వాచ్ రాబోతుంది. టెకీలు, ఫిట్నెస్ లవర్లు, స్పోర్ట్స్ పర్సన్ అవసరాలను తీర్చే విధంగా సరికొత్త ఫీచర్లు ఈ వేరబుల్ గాడ్జెట్‌లో పొందు పరిచారు. దీనికి సంబంధించిన వివరాలను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో శామ్సంగ్ వెల్లడించింది. గూగుల్ ప్లస్ శామ్సంగ్ ఇప్పటి వరకు శామ్సంగ్ విడుదల చేసిన స్మార్ట్ఫోన్లు అన్నీ టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేశాయి. ఈసారి టైజన్ స్థానంలో గూగుల్ రూపొందించిన యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌ని శామ్సంగ్ ఉపయోగిస్తోంది. దీని వల్ల ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై పని చేసే ఫోన్లకు, ఈ స్మార్ట్ వాచ్‌కి మధ్య కనెక్టివి మరింత మెరుగ్గా ఉంటుందని శామ్సంగ్ చెబుతోంది. ఆధునిక ఫీచర్లు మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే యాప్స్ ఆటోమేటిక్‌గా స్మార్ట్ వాచ్‌లో డౌన్లోడ్ అయిపోతాయి. స్మార్ట్‌వాచ్‌లో వివిధ దేశాల టైమ్ జోన్, కాల్ బ్లాక్ తదితర ఆప్షన్లను అందివ్వబోతుంది శామ్సంగ్. దీంతో పాటు స్మార్ట్‌వాచ్ బ్యాటరీ సామర్థ్యం కూడా పెరగనుంది. ముఖ్యంగా టెకీలు, బిజినెస్ పర్సన్స్ ఏదైనా సమావేశంలో ఉన్నప్పుడు కాల్ బ్లాక్, అన్ బ్లాక్ చేయడానికి స్మార్ట్‌వాచ్‌లో కొత్తగా వచ్చిన అప్లికేషన్ ఎంతగానో ఉపయోగకరమని శామ్సంగ్ చెబుతోంది,. ఆగస్టులో ఈ స్మార్ట్‌వాచ్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. చదవండి : లీకైన వన్ ప్లస్ నార్డ్ 2 కెమెరా, డిస్ప్లే ఫీచర్లు -
వైర్ నుంచి వైర్లెస్కు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేతికి స్మార్ట్‌వాచ్, చెవిలో వైర్లెస్ డివైస్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే ట్రెండ్. స్మార్ట్‌ఫోన్స్‌తోపాటు వేరబుల్స్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. భారత్ విషయానికి వస్తే వేరబుల్స్ మార్కెట్ 2019తో పోలిస్తే 2020లో 144.3 శాతం వృద్ధి సాధించిందని పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్–20 మార్కెట్లలో మూడంకెల వృద్ధి నమోదు చేసి భారత్ కొత్త రికార్డును సొంతం చేసుకుంది. గతేడాది దేశవ్యాప్తంగా 3.64 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయి. అంతర్జాతీయంగా అమ్మకాల పరంగా మూడవ స్థానాన్ని కొనసాగిస్తూ కంపెనీలను భారత్ ఊరిస్తోంది. అమ్మకాలు ఎందుకంటే... ఇయర్‌వేర్ డివైస్ వినియోగం పెరగడం, రిస్ట్ బ్యాండ్స్ నుంచి స్మార్ట్‌వాచ్‌ల వైపు కస్టమర్లు మళ్లడం ఈ స్థాయి విక్రయాలకు కారణం. ఈ రెండు విభాగాలు దేశంలో తొలిసారిగా 2020లో రికార్డు స్థాయి అమ్మకాలను సాధించాయి. అక్టోబరు–డిసెంబరు త్రైమాసికంలో ఇప్పటి వరకు అత్యధికంగా 1.52 కోట్ల యూనిట్ల వేరబుల్స్ సేల్స్ జరిగాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 198.2 శాతం అధికం. ఇక 2020లో స్పష్టమైన మార్పు ఏమంటే ఆడియో విభాగంలో వైర్డ్ నుంచి వైర్లెస్ వైపు మార్కెట్ దూసుకెళ్లడమే. 2021లో ఈ విభాగంలో మెరుగైన అనుభూతినిచ్చే అధునాతన పరికరాలు కస్టమర్ల ముందుకు రానున్నాయి. వేరబుల్స్ రంగంలో ఇయర్‌వేర్ వాటా అత్యధికంగా 83.6 శాతం ఉంది. రిస్ట్ బ్యాండ్స్ నుంచి.. గతేడాది దేశంలో 26 లక్షల యూనిట్ల స్మార్ట్‌వాచ్‌లు అమ్ముడయ్యాయి. 2019తో పోలిస్తే ఇది 139.3 శాతం అధికం. సగం విక్రయాలు అక్టోబరు–డిసెంబరు పీరియడ్‌లో నమోదు కావడం విశేషం. ఒక త్రైమాసికంలో 10 లక్షల యూనిట్లు దాటడం ఇదే తొలిసారి. తక్కువ ధరలోనూ స్మార్ట్‌వాచ్‌లు లభ్యం కావడంతో రిస్ట్ బ్యాండ్స్‌కు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. 2019లో రిస్ట్ బ్యాండ్స్ 33 లక్షల యూనిట్లు అమ్ముడైతే, గతేడాది 34.3 శాతం తగ్గాయి. తొలినాళ్లలో స్మార్ట్‌వాచ్‌ల ధర రూ.20,000 ఉండేది. ఇప్పుడు రూ.5 వేల లోపు ధరలోనే లభిస్తున్నాయని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. కొత్త ఫీచర్లు తోడవడం కూడా వీటికి ఆదరణ పెంచుతోందని చెప్పారు. తగ్గుతున్న ధరలు.. ఇయర్‌వేర్ అమ్మకాలు మూడింతలు పెరిగి గతేడాది 3.04 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. డిసెంబరు త్రైమాసికంలో 300 శాతం వృద్ధి చెంది 1.29 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. అందుబాటు ధరలో లభించడం, ఎంటర్టైన్మెంట్తోపాటు వర్చువల్ మీటింగ్స్, ఆన్లైన్ తరగతులు వెరశి ఈ విభాగం దూసుకెళ్తోందని బి–న్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. ట్రూలీ వైర్లెస్ స్టీరియో డివైసెస్ ఏకంగా పదింతలై 1.13 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. పోటీ తీవ్రం కావడంతో చాలా కంపెనీలు అందుబాటు ధరలో ప్రవేశపెడుతున్నాయి. వీటి సగటు ధర 2019లో రూ.8,000 ఉంటే, గతేడాది ఇది రూ.3,200లకు వచ్చి చేరింది. -
హాట్‌కేకుల్లా వేరబుల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేరబుల్ డివైజెస్ స్మార్ట్ఫోన్లతో పోటీపడుతున్నట్టుగా ఉంది. భారత్‌లో వీటి విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో ఆల్ టైం హైకి చేరుకున్నాయి. ఏప్రిల్–జూన్ కాలంలో ఏకంగా 30 లక్షల యూనిట్లకుపైగా అమ్మకాలు నమోదయ్యాయంటే వీటికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. వృద్ధి క్రితం త్రైమాసికంతో పోలిస్తే 30.9 శాతం నమోదైంది. అంతర్జాతీయంగా మొత్తం విక్రయాల పరంగా చూస్తే భారత్ మూడో స్థానాన్ని పదిలపరుచుకుంది. వేరబుల్ డివైజెస్ వినియోగంలో తొలి రెండు స్థానాల్లో చైనా, యూఎస్ మార్కెట్లు నిలిచాయి. ఫిట్నెస్ బ్యాండ్స్, స్మార్ట్‌వాచ్‌లు, హియరేబుల్స్ వంటి వేరబుల్ డివైజెస్‌ను విభిన్న ఫీచర్లు, ధరల శ్రేణితో కంపెనీలు పోటీపడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సైతం వేరబుల్ డివైజెస్‌ను తయారు చేస్తున్నాయి. హియరేబుల్స్కు ఆదరణ.. ఐడీసీ గణాంకాల ప్రకారం 2019 జనవరి–మార్చిలో భారత్‌లో 23.1 లక్షల యూనిట్ల వేరబుల్ డివైజెస్ కస్టమర్ల చేతుల్లోకి చేరాయి. అదే 2018 ఏప్రిల్–జూన్ కాలంతో పోలిస్తే క్రితం త్రైమాసికం వృద్ధి ఏకంగా 123.6 శాతం నమోదైంది. ఈ అంకెలనుబట్టి చూస్తుంటే వేరబుల్ డివైజెస్‌కు పెరుగుతున్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. మరో విశేషమేమంటే ఏప్రిల్–జూన్‌లో రిస్ట్ బ్యాండ్స్‌ను మించి హియరేబుల్స్ సేల్స్ నమోదయ్యాయి. ఈ విభాగం అంత క్రితం తైమాసికంతో పోలిస్తే 122.7 శాతం, క్రితం ఏడాది ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే 374.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. హెల్త్, ఫిట్నెస్ను ట్రాక్ చేసే వైర్లెస్ ఇయర్ వేర్ మోడళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇయర్ వేర్ విభాగం 55.9 శాతం, రిస్ట్ బ్యాండ్స్ 35.2, స్మార్ట్ వాచెస్ 6.9 శాతం వాటాను కైవసం చేసుకున్నాయి. -
వేరబుల్ విభాగంలోకి ఫాజిల్ గ్రూప్
♦ ఫాజిల్, మిస్ఫిట్ సహా ఆరు బ్రాండ్లతో మార్కెట్లోకి ♦ వచ్చే ఏడాదికల్లా వందకు పైగా కొత్త ఉత్పత్తులు న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అమెరికన్ లగ్జరీ వాచ్‌లు, ఫ్యాషన్ యాక్ససరీస్ల కంపెనీ ఫాజిల్... వేరబుల్ డివెజైస్ విభాగంలోకి పెద్ద ఎత్తున వస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ మిస్ ఫిట్ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. మిస్ఫిట్ తాలూకు వేరబుల్ డివెజైస్ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి కూడా. దీంతో పాటు మైకేల్ కోర్, స్కాగెన్, ఎంపోరియో అర్మానీ, చాప్స్ బ్రాండ్లు కూడా ఫాజిల్ చేతిలోనే ఉన్నాయి. ఈ బ్రాండ్లు అన్నిటినుంచీ త్వరలో వేరబుల్ డివెజైస్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఫాజిల్ గ్రూప్ ఏసియా పసిఫిక్ విభాగ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాక్ క్విన్లాన్ ప్రకటించారు. బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ వేరబుల్ డివెజైస్ అన్నిటినీ ప్రదర్శించారు కూడా. ఏసియా పసిఫిక్ ప్రాంతంలో తాము ఏటా 40 శాతం కాంపౌండింగ్ వృద్ధిని సాధిస్తున్నట్లు క్విన్లాన్ తెలియజేశారు. ‘‘తమ చేతికి ధరించే వస్తువు కేవలం సమయాన్ని చూపించటమే కాక మరిన్ని చేయాలని కస్టమర్లు కోరుకుంటున్నారు. పెపైచ్చు అది చాలా వైవిధ్యంగా ఉండాలనుకుంటున్నారు. ఆ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకునే మేం ఈ మార్కెట్లోకి పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్నాం’’ అని కంపెనీ కనెక్టింగ్ డివెజైస్ విభాగ సీటీఓ సొన్నీ వ్యూ చెప్పారు. ఇండియాలో ప్రస్తుతం ఫాజిల్‌కు 400 స్టోర్లున్నాయని, ఆసియాలో జపాన్ తరవాత ఇండియానే అతిపెద్ద మార్కెట్ అని ఫాజిల్ గ్రూప్ ఇండియా ఎండీ వసంత్ నంగియా చెప్పారు. 2020 నాటికి వాచ్‌ల అమ్మకాలను వేరబుల్ డివెజైస్ మించిపోతాయని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. వేరబుల్ డివెజైస్‌తో ఎన్ని కేలరీస్, దూరం, నిద్ర వంటి పలు అంశాలను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేయొచ్చని చెప్పారాయన. ప్రస్తుతం మిస్ఫిట్ బ్రాండ్ కింద లభిస్తున్న డివెజైస్ ప్రారంభ ధర రూ.7,495గా ఉంది. కంపెనీ ఫాజిల్ క్యూ బ్రాండ్ కింద వండర్, మార్షల్ అనే రెండు స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి తెచ్చింది. వీటి ప్రారంభ ధర రూ. 21,995గా ఉంది. ఇక మైకేల్ కోర్, స్కాగెన్, ఎంపోరియో అర్మానీ, చాప్స్ బ్రాండ్లలో హైబ్రిడ్ స్మార్ట్‌వాచ్‌ల ధరలు రూ.9,995-రూ.29,495 శ్రేణిలో ఉన్నాయి.