'వారు చేయలేకపోయారు.. మేం చేసి చూపించాం'
సాగర్దిగి: అతి త్వరలోనే మిగులు విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు అమ్ముతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇప్పుడిప్పుడే తమకు చాలినంత విద్యుత్ ను సృష్టించుకొని పవర్ బ్యాంకును సాధిస్తున్నామని అదనంగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. బుధవారం ఆమె ముర్షిదాబాద్ జిల్లాలోని సాగర్దిగి వద్ద మూడోదశ 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి త్వరలోనే మరో 500 మెగావాట్ల విద్యుత్ నాలుగో దశ ప్లాంటును కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇతర రాజకీయ పార్టీలను ఆమె విమర్శిస్తూ 'మేము ఏమైతే చేయగలమో ఆ హామీలనే ఇచ్చాం. ఇప్పుడు బెంగాల్ ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేశాం. ఇది నాటి వామపక్ష ప్రభుత్వం చేయలేకపోయింది.. మేం చేసి చూపించాం' అంటూ ఆమె వ్యాఖ్యానించారు.