మన నిత్యజీవితంలో స్మార్ట్‌ఫోన్స్ ఒక భాగమైపోయాయి. స్మార్ట్‌ఫోన్స్ లేనిదే రోజు గడువదనే ఛంధంగా తయారైంది పరిస్థితి..! ఇక ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్‌తో గడిపే వారు పవర్ బ్యాంకును కూడా తమతో క్యారీ చేస్తుంటారు. పవర్‌బ్యాంకులకు కూడా భారీ మార్కెట్ ఉంది. ఇప్పటి వరకు మార్కెట్‌లో 80 వేల నుంచి 1000 mAh పవర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అయితే చైనాకు చెందిన హ్యాండ్ గెంగ్ అనే యూట్యూబర్ ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ బ్యాంకును కనిపెట్టి అందరితో ఔరా..అనిపిస్తున్నాడు.
ఒకే సారి 5 వేల ఫోన్లకు..!
హ్యాండ్ గెంగ్ తయారుచేసిన పవర్‌బ్యాంకు 27,000,000mAh సామర్థ్యాన్ని కల్గి ఉంది. దీంతో ఏకంగా 5 వేల స్మార్ట్‌ఫోన్స్‌ను ఛార్జింగ్ చేయవచ్చునని ఈ యూట్యూబర్ తెలిపాడు. ఈ పవర్‌బ్యాంక్‌ను గెంగ్‌కున్న వెల్డింగ్ స్కిల్స్ తో ఎంఐ పవర్‌బ్యాంకు తరహలో అతి పెద్ద పవర్‌బ్యాంకును తయారు చేశాడు. దీని లోపల మిడ్ సైజ్ డ్ ఎలక్ట్రిక్ కార్ కు సరిపోయే కెపాసిటీ బ్యాటరీలను ఏర్పాటు చేశాడు. దాంతో పాటుగా 60 పవర్ సాకెట్లను అమర్చారు.
స్మార్ట్‌ఫోన్స్ ఛార్జింగ్ ఒక్కటే కాదు..!
గెంగ్ తయారుచేసిన పవర్‌బ్యాంకుతో నేరుగా మొబైల్ ఫోన్స్ మాత్రమే కాకుండా ఇతర పవర్ బ్యాంకులకు కూడా ఛార్జింగ్ ఎక్కించుకునే విధంగా తయారు చేశాడు. స్మార్ట్‌ఫోన్సే కాకుండా టీవీ, వాషింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ కుకర్‌ను కూడా నడపవచ్చునని తెలిపాడు గెంగ్.
చదవండి: వచ్చింది మూడేళ్లే..! 84 ఏళ్ల కంపెనీకి గట్టిషాకిచ్చిన రియల్‌మీ..!
Comments
Please login to add a commentAdd a comment