Chief Minister Mamata Banerjee
-
సీఎం మమతా బెనర్జీ విమానానికి కుదుపులు
కోల్‌కతా: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం తీవ్ర కుదుపులకు లోనుకావడంపై నివేదిక ఇవ్వాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లిన సీఎం మమత శుక్రవారం సాయంత్రం చార్టర్డ్ విమానంలో తిరిగి వస్తున్నారు. ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీయడంతో ఆ విమానం తీవ్ర కుదుపులకు లోనయింది. దీంతో పైలట్ అప్రమత్తమై సుభా‹ష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అకస్మాత్తుగా విమానం పైకి, కిందికి ఊగిసలాడటంతో మమతా బెనర్జీ వెన్నెముకకు గాయమైంది. ఈ ఘటనను బెంగాల్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని డీజీసీఏను కోరింది. ఈ మేరకు రిపోర్టు సిద్ధం చేస్తున్నట్లు డీజీసీఏ అధికారి ఒకరు వెల్లడించారు. సీఎం మమత భద్రతపై అధికార టీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె ప్రయాణిస్తున్న విమానాలు గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాయని, దర్యాప్తు చేపట్టాలంది. -
దుర్గమ్మకు ప్రేమతో దీదీ
సాక్షి, కోల్‌కతా : దుర్గా నిమజ్జనంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం వివాదం కావటం తెలిసిందే. మొహర్రం ఊరేగింపు, నిమజ్జనం ఒకే రోజున చేపడితే మత కలహాలు చెలరేగుతాయంటూ నిమజ్జనంపై గతంలో మమత కొన్ని ఆంక్షలు విధించారు. అయితే హైకోర్టు జోక్యంతో చివరకు ఆ ఆదేశాలు పక్కన పెట్టేశారనుకోండి. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఇప్పుడు మరో అవతారం ఎత్తారు. రచయితగా మారి ఓ పాట రాసేశారు. కోల్‌కతాలో దుర్గా మాతకు కమ్యూనిటీ పూజలు సాధారణంగా జరిగేవే. ఈ క్రమంలో సురుచి సంఘ పూజ కోసం మమతా పాట రాశారు. భిన్న మతాల ముత్యాలతో దేశ ఐకమత్యం.. అంటూ అద్భుతమైన సాహిత్యంతో రాయగా.. సింగర్ శ్రేయా ఘోషల్ స్వరాన్నిఅందించారు. ఇక ప్రముఖ బెంగాలీ సింగర్ జీత్ గంగూలీ సంగీతాన్ని అందించటం విశేషం. పూర్తి పాటను తన ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీల్లో మమత పోస్ట్ చేశారు. సురుచి సంఘ కోసం గతంలో కూడా దీదీ ఓసారి పాట రాయటం విశేషం. వివిధ కులాల వారు నిర్వహించే పూజల్లో ఉత్తమ పాటను ఎంపిక చేసిన వారికి అవార్డు అందించటం ఆనవాయితీగా వస్తోంది. కోల్‌కతా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే కార్యక్రమాల్లో సురుచి సంఘ్‌తోపాటు త్రిధార సమ్మిళని, కుమార్టూలి సర్బోజోనిన్ సంఘాలు ఆ పోటీల్లో ప్రధానంగా నిలుస్తుంటాయి. -
'జాగ్రత్త.. అలాంటి చెత్త పనులు సహించను'
కోల్‌కతా: గో సంరక్షకులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గో సంరక్షణ పేరుతో ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హింసకు దిగే గోసంరక్షకులపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. 'వెజిటేరియన్స్ వెజ్‌ను.. నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ ను తింటారు. ఎవరు ఏం తినాలో ఏం తినకూడదో చెప్పడానికి అసలు వీళ్లంతా ఎవరు?. ఇలాంటి చెత్తపనులు మానుకోవాలని నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి తమ మతాన్ని సంరక్షించుకునే హక్కు ఉంది. యూరప్ లో గోవులను తింటారు. గిరిజనులు కూడా వాటిని తింటారు. మతం పేరిట ఏ ఒక్కరు ఈ అంశంపై అతి చేసినా వారిని వదిలిపెట్టే సమస్యే లేదు. నేను ఇలాంటి వాటిని అస్సలు సహించలేను. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ ది ఏ మతం అని అడుగుతున్నారు. ఈలోగా బాధితుడు ప్రాణాలుకోల్పోతున్నాడు. బాధితులకు నేరస్థుల నుంచి నష్టపరిహారం చెల్లించేలా ఓ బిల్లును వచ్చే సమావేశాల్లో తీసుకొస్తాం. దీనిని గత ఐదేళ్లకు వర్తింపజేసి అమలు చేస్తాం. రాజకీయాలు అనేవి సిద్దాంతాల పరంగా ఉండాలి తప్ప మతం, ప్రజల ఆధారంగా కాదు' అని మమత అన్నారు. -
'వారు చేయలేకపోయారు.. మేం చేసి చూపించాం'
సాగర్దిగి: అతి త్వరలోనే మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు అమ్ముతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇప్పుడిప్పుడే తమకు చాలినంత విద్యుత్ ను సృష్టించుకొని పవర్ బ్యాంకును సాధిస్తున్నామని అదనంగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. బుధవారం ఆమె ముర్షిదాబాద్ జిల్లాలోని సాగర్దిగి వద్ద మూడోదశ 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి త్వరలోనే మరో 500 మెగావాట్ల విద్యుత్ నాలుగో దశ ప్లాంటును కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇతర రాజకీయ పార్టీలను ఆమె విమర్శిస్తూ 'మేము ఏమైతే చేయగలమో ఆ హామీలనే ఇచ్చాం. ఇప్పుడు బెంగాల్ ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేశాం. ఇది నాటి వామపక్ష ప్రభుత్వం చేయలేకపోయింది.. మేం చేసి చూపించాం' అంటూ ఆమె వ్యాఖ్యానించారు.