టేకాఫ్ కు సిద్దంగా ఉన్న ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సెల్‌ఫోన్ చార్జింగ్ కు వాడే పవర్ బ్యాంకు పేలడంతో చైనా సదరన్ ఎయిర్‌లైస్స్ కు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. సిబ్బంది, ప్రయాణికులు సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. చైనాలోని గాంగ్‌జూ విమానాశ్రయంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.