జిల్లాలోని అవుకు మండలం మర్రికుంట తండా సమీపంలో వింత ఘటన చోటు చేసుకుంది. తండాకు దగ్గర్లోని కొండ ప్రాంతంలో 50మీటర్ల పొడవు, ఒక అడుగు వెడల్పుతో భూమి చీలిపోయింది. అందులో నుంచి మంటలు చెలరేగడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎలాంటి ఉత్పాతం సంభవిస్తుందోనని తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.