Avuku Mandalam
-
అగ్నిగుండంలో పడి వ్యక్తి సజీవదహనం
అవుకు: కర్నూలు జిల్లా అవుకు మండలంలో మొహర్రం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సుంకేసులలో గురువారం రాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో అగ్నిగుండంలోపడి సజీవ దహనమయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దస్తగిరిస్వామి పీర్ల చావిడి వద్ద మొహర్రం వేడుకల సందర్భంగా అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు. పెద్దసరిగెత్తు సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు వేశారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీగా వచ్చారు. పక్క గ్రామమైన కాశీపురానికి చెందిన చమురు వెంకటసుబ్బయ్య (48) దస్తగిరిస్వామి చావిడిలోని పీర్లను దర్శించుకున్నారు. అనంతరం మద్యం తాగి మత్తులో పక్కనే ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడిపోయాడు. గమనించిన ప్రజలు రక్షించేలోపే పూర్తిగా కాలిపోయి మృతిచెందాడు. దీంతో సుంకేసుల, కాశీపురం గ్రామాల్లో విషాదం నెలకొంది. -
పచ్చకార్యకర్తల పైశాచికం
-
‘టీడీపీ ఆఫీసులోనే అత్యాచారం దారుణం’
సాక్షి, కర్నూలు : జిల్లాలోని అవుకు మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తలు బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంపై వైఎసార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిపై అమానవీయ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ కార్యాలయంలోనే ఇలాంటి ఘటన జరడగం దారుణమని మండిపడ్డారు. బాలుడిని డిన్నర్ పేరుతో పిలిచి నలుగురు యువకులు సామూహిక అత్యాచారం జరపడం వారి క్రూరత్వానికి నిదర్శనమన్నారు. నిందితుల తల్లిదండ్రులు కూడా వారు చేసిన పనిని క్షమించరని చెప్పారు. బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. బాలుడిపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. గతంలో కూడా నిందితులు పలువురిపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అప్పట్లో నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. టీడీపీ నేతలు వెనకేసుకొచ్చారని చెప్పారు. తప్పుచేసిన వారిపై కేసులు పెట్టకుండా పోలీసులను అడ్డుకున్నారని విమర్శించారు. కాగా, అవుకులోని టీడీపీ కార్యాలయంలో నలుగురు టీడీపీ కార్యకర్తలు 14 ఏళ్ల బాలుడిపై సాముహిక అతఅత్యాచారం చేశారు. అయితే బాలుడికి రక్తస్రావమై అస్వస్థతకు గురికావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని చిత్రహింసలు పెట్టిన టీడీపీ కార్యకర్తలు బుల్లెట్ రాజు, ప్రేమ్ కుమార్, రాజుతో పాటు మరొకరని గుర్తించారు. వీరిపై సెక్షన్ 377 కింద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి : దారుణం.. బాలుడిపై సామూహిక అత్యాచారం -
బాలుడిపై సామూహిక అత్యాచారం
-
బాలుడిపై సామూహిక అత్యాచారం
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా అవుకు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. బాలుడిని డిన్నర్ పేరుతో పిలిచి నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. అవుకు పట్టణానికి చెందిన ఒక బాలుడు (14) వారం క్రితం ఒంటరిగా ఆడుకుంటుండగా డిన్నర్ పేరుతో నలుగురు యువకులు టీడీపీ కార్యాలయంలోకి బలవంతంగా తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుడికి రక్తస్రావమై అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు అతన్ని బుధవారం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తమ అబ్బాయి లైంగిక దాడికి గురయ్యాడన్న విషయం తెలుసుకున్న బాలుని తల్లిదండ్రులు అవుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా బాలుడిని చిత్రహింసలకు గురి చేసిన వారిలో బుల్లెట్ రాజు, ప్రేమ్ కుమార్, రాజుతో పాటు మరొకరు ఉన్నట్లు, వీరంతా టీడీపీ కార్యకర్తలుగా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. వీరిపై సెక్షన్ 377 కింద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వీరిపై గతంలోనే పలు రౌడీషీట్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏమిటీ వింత..! భూమి పొరల్లోంచి మంట
-
ఏమిటీ వింత..! భూమి పొరల్లోంచి మంట
సాక్షి, కర్నూలు : జిల్లాలోని అవుకు మండలం మర్రికుంట తండా సమీపంలో వింత ఘటన చోటు చేసుకుంది. తండాకు దగ్గర్లోని కొండ ప్రాంతంలో 50మీటర్ల పొడవు, ఒక అడుగు వెడల్పుతో భూమి చీలిపోయింది. అందులో నుంచి మంటలు చెలరేగడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎలాంటి ఉత్పాతం సంభవిస్తుందోనని తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. కాగా, ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో ప్రజలు తండోపతండాలుగా అక్కడకు చేరుకుంటున్నారు. భూమి పొరల నుంచి వెలువడుతున్న మంటల ప్రభావంతో సమీపంలోని విద్యుత్ స్తంభం కూలిపోయింది. మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అంతుబట్టడం లేదు. స్థానికులు విషయాన్ని తహసీల్దారు సంజీవయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న సంజీవయ్య జియాలాజికల్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలలో టిడిపి రిగ్గింగ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఓటమి భయంతో దేనికైనా తెగిస్తున్నారు. కులం, నగదు, మద్యం.. వంటి ప్రలోభాలు అయిపోయాయి. ఈరోజు పోలింగ్ సరళితో ఆ పార్టీకి భయం పట్టుకుంది. సీమాంధ్ర అంతటా వారు నిబంధనలు అతిక్రమించి దౌర్జన్యానికి, దాడులకు, బెదిరింపులకు దిగారు. అదీ అయిపోయింది. ఇక రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలలో టిడిపి నేతలు, కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఎం.రాజపురం గ్రామంలో, పాలకొండ నియోజకవర్గంలో బహిరంగంగా రిగ్గింగ్ చేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో వైఎస్ఆర్ సిపి పోలింగ్ ఏజంట్లు లేకపోవడంతో వారి రిగ్గింగ్‌కు హద్దుఆపులేకుండాపోయింది. ఒక పోలింగ్ కేంద్రంలో ఒక మహిళ మూడు సార్లు వెళ్లి ఓటు వేసింది. ఆ దృశ్యాలను సాక్షిటీవీలో ప్రసారం చేశారు. ఈ విషయమై వైఎస్ఆర్ సిపి నేతలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా అవుకు మండలం జున్నూతల, ఉప్పలపాడు, అవుకు గ్రామాలలో టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. టీడీపీ వర్గీయులు దొంగఓట్లు వేస్తున్నారని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఆందోళన చేస్తుండటంతో కర్నూలు ఎన్ఆర్ పేట 43వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. వారి చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై కూడా టీడీపీ నేతలు దాడి చేశారు. గుంటూరు జిల్లా నగర మండలం కారింగవారిపాలెంలో టిడిపి నేతలు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి రిగ్గింగుకు పాల్పడ్డారు. విశాఖ జిల్లా మిందిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. దానిని అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ నేత నాగేంద్రపై దాడి చేశారు.