శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలలో టిడిపి రిగ్గింగ్ | TDP rigging in Srikakulam and Karnool districts | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలలో టిడిపి రిగ్గింగ్

Published Wed, May 7 2014 2:22 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలలో టిడిపి రిగ్గింగ్ - Sakshi

శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలలో టిడిపి రిగ్గింగ్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఓటమి భయంతో దేనికైనా తెగిస్తున్నారు. కులం, నగదు, మద్యం.. వంటి ప్రలోభాలు అయిపోయాయి. ఈరోజు పోలింగ్ సరళితో ఆ పార్టీకి భయం పట్టుకుంది. సీమాంధ్ర అంతటా వారు నిబంధనలు అతిక్రమించి దౌర్జన్యానికి, దాడులకు, బెదిరింపులకు దిగారు. అదీ అయిపోయింది. ఇక రిగ్గింగ్కు పాల్పడుతున్నారు.

 శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలలో టిడిపి నేతలు, కార్యకర్తలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఎం.రాజపురం గ్రామంలో, పాలకొండ నియోజకవర్గంలో  బహిరంగంగా రిగ్గింగ్ చేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో వైఎస్ఆర్ సిపి పోలింగ్ ఏజంట్లు లేకపోవడంతో వారి రిగ్గింగ్కు హద్దుఆపులేకుండాపోయింది. ఒక పోలింగ్ కేంద్రంలో ఒక మహిళ మూడు సార్లు వెళ్లి ఓటు వేసింది. ఆ దృశ్యాలను సాక్షిటీవీలో ప్రసారం చేశారు. ఈ విషయమై వైఎస్ఆర్ సిపి నేతలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

కర్నూలు జిల్లా అవుకు మండలం జున్నూతల, ఉప్పలపాడు, అవుకు గ్రామాలలో టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్కు పాల్పడుతున్నట్లు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.  టీడీపీ వర్గీయులు దొంగఓట్లు వేస్తున్నారని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఆందోళన చేస్తుండటంతో కర్నూలు ఎన్‌ఆర్ పేట 43వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. వారి చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై కూడా   టీడీపీ నేతలు  దాడి చేశారు.

గుంటూరు జిల్లా నగర మండలం కారింగవారిపాలెంలో టిడిపి నేతలు వైఎస్‌ఆర్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి రిగ్గింగుకు పాల్పడ్డారు.

విశాఖ జిల్లా  మిందిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. దానిని అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ నేత నాగేంద్రపై  దాడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement