
పసుపు కుంకుమ, సావిత్రి సిరీయల్స్‌తో గుర్తింపు పొందిన కన్నడ బ్యూటీ 'పల్లవి గౌడ' 'పసుపు కుంకుమ' సీరియల్ హీరోయిన్‌గా తెలుగు వారికి దగ్గరైంది

చదరంగం, సూర్యకాంతం సిరీయల్స్‌తో మరింత పాపులర్ అయింది

ఒక సీరియల్ వివాదం వల్ల తనను తెలుగులో బ్యాన్ చేశారని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది

నా రెండో సీరియల్ చేస్తున్నప్పుడు సినిమా ఛాన్స్ రావడంతో పర్మిషన్ తీసుకుని షూట్‌కు వెళ్లాను

కానీ, నేను అనుకోకుండా బెంగళూరు వెల్లడంతో ఒక నెలలో 20 రోజుల పాటు నేను బ్లాక్ అయిపోయాను. తర్వాత షూటింగ్‌కు వెళ్లాను

అటు సినిమా, సిరీయల్స్ డేట్స్ సర్ధుబాటు చేయడంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. సీరియల్ షూటింగ్ పనులు ఏమో జరుగుతున్నాయి. రెండు నెలలు గడిచినా నాకు డబ్బులు ఇవ్వలేదు

రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో మరో సిరీయల్ వారికి డేట్స్ ఇచ్చేస్తానని చెప్పాను

ఒక సిరీయల్ జరుగుతుండగా మరో సిరీయల్‌కు ఎలా అగ్రిమెంట్ చేసుకుంటావని హెచ్చరించారు

ఇలా జరిగిన కొద్ది రోజుల తర్వాత తెలుగులో ఏడాది పాటు నన్ను బ్యాన్ చేస్తున్నట్లు నాకు ఒక మెసేజ్ వచ్చింది

ఆ సమయంలో నేను మలయాళం, కన్నడలో పలు సినిమాలతో కంటిన్యూ చేశాను

కొద్దిరోజుల తర్వాత తెలుగు నుంచి పిలుపు వచ్చింది

చదరంగం సిరీయల్‌లో ఛాన్స్ ఉందని రావడంతో మళ్లీ ఎంట్రీ ఇచ్చానని పల్లవి గౌడ చెప్పింది








