Pallavi
-
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
పల్లవి శ్రీనివాస్ డెంపో. దక్షిణ గోవా నుంచి బీజేపీ టికెట్‌పై లోక్‌సభ బరిలో ఉన్నారు. గోవాలో బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన తొలి మహిళగా నిలిచారు. అఫిడవిట్లో పల్లవి ప్రకటించిన ఆస్తులు చూసి అంతా నోరెళ్లబెట్టారు. భర్తతో కలిపి ఏకంగా రూ.1,361 కోట్ల ఆస్తులు వెల్లడించారు. మూడో దశలో రేసులో మొత్తం 1352 మంది అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. గోవా ఎన్నికల చరిత్రలో అత్యంత సంపన్న వ్యక్తి పల్లవే. ఏ రాజకీయానుభవం లేని కుటుంబానికి చెందిన ఆమెను ఎంపిక చేసుకోవడానికి ఆమె దాతృత్వ నేపథ్యమే కారణం కావచ్చంటున్నారు...దాతృత్వం నుంచి రాజకీయాలకు 49 ఏళ్ల పల్లవి స్వస్థలం గోవాలోని మార్గావ్. టింబ్లో కుటుంబంలో జని్మంచారు. రసాయన శాస్త్రంలో డిగ్రీ, పుణెలోని ఎంఐటీ నుంచి ఎంబీఏలో పీజీ చేశారు. 1997లో డెంపో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీనివాస్ డెంపోను పెళ్లాడారు. వారి కుటుంబం ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. డెంపో గ్రూప్ మైనింగ్ వ్యాపారంతో మొదలుపెట్టి ఫుడ్ ప్రాసెసింగ్, షిప్ బిల్డింగ్, న్యూస్ పేపర్ పబ్లిíÙంగ్, పెట్రోలియం, కోక్, రియల్ ఎస్టేట్ తదితరాలకు విస్తరించింది. పల్లవి ప్రస్తుతం డెంపో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మీడియా, రియల్ ఎస్టేట్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. డెంపో చారిటీస్ ట్రస్టీగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ప్రత్యేకించి గోవాలో బాలికల విద్యను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త వంటకాలను ప్రయతి్నంచడం తన అభిరుచి అంటారామె. ఇప్పుడు రాజకీయాల్లోకి దిగి మరో ప్రయోగం చేయబోతున్నారు. ఎన్నికల బాండ్ల రగడ... 2022 జనవరిలో గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెల ముందు పల్లవి భర్త శ్రీనివాస్ వ్యక్తిగతంగా రూ.1.25 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడవడం కలకలం రేపింది. ఇక గోవా కార్బన్ లిమిటెడ్, దేవశ్రీ నిర్మాణ్ ఎల్ఎల్పి, నవ్‌హింద్ పేపర్స్ అండ్ పబ్లికేషన్స్‌తో సహా డెంపో, గ్రూప్ అనుబంధ సంస్థలు 2019 నుంచి 2024 మధ్య రూ.1.1 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశాయి. ఇవన్నీ బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి.బీజేపీ సిద్ధాంతాలు నమ్మి... దక్షిణ గోవా కాంగ్రెస్ కంచుకోట. 2019లో ఈ స్థానాన్ని బీజేపీ కేవలం 9 వేల పై చిలుకు ఓట్ల తేడాతో చేజార్చుకుంది. ఈ సారి ఎలాగైనా ఇక్కడ నెగ్గి తీరాలని పట్టుదలగా ఉంది. క్యాథలిక్ క్రిస్టియన్ల ఓట్లపై పల్లవి ప్రధానంగా దృష్టి పెట్టారు. కాంగ్రెస్ కూడా నాలుగు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ ఫ్రాన్సిస్కో సార్డినాను అనూహ్యంగా పక్కనబెట్టి మాజీ నేవీ అధికారి కెపె్టన్ విరియాటో ఫెర్నాండెజ్‌ను బరిలోకి దించింది. అయితే ఏకంగా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ చేయడం వంటివన్నీ ఆ పారీ్టకి కలిసొచ్చేలా ఉన్నాయి. ఆప్, గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) వంటి ఇండియా కూటమి భాగస్వాముల దన్నుతో బీజేపీని కాంగ్రెస్ ఢీకొంటోంది. స్థానిక రివల్యూషనరీ గోవన్స్ (ఆర్జీ) పార్టీ అభ్యర్థి రూబర్ట్ పెరీరియా ఆ రెండింటికీ సవాలు విసురుతున్నారు. అయినా పల్లవి మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు. ‘‘రాజకీయాలు నా మనసులో ఎప్పుడూ లేవు. మూడు దశాబ్దాలుగా కుటుంబ వ్యాపారాలు, సేవా కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాను. అయితే దేనికైనా ఒక ఆరంభమంటూ ఉంటుంది. రాజకీయాల్లో ఇది నా తొలి అడుగు. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి ముందడుగు వేస్తున్నాను’’ అంటున్న ఆమె కాంగ్రెస్‌కు కంచుకోటలో చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పల్లవి పటేల్‌తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మూడు ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల ఇండియా కూటమితోపాటు ఇప్పుడు పీడీఎం (పిచ్చా, దళిత, ముసల్మాన్) కూటమి కూడా బరిలో నిలిచింది. అప్నా దళ్ కమరావాడి (ADK) నాయకురాలు పల్లవి పటేల్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసి పీడీఎం (PDM) కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి ఉత్తరప్రదేశ్‌లో తొలి జాబితా విడుదల చేసింది. ఈ రెండు పార్టీలు కలిసి ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. పీడీఎం తొలి జాబితాలో బరేలీ నుంచి సుభాష్ పటేల్, హత్రాస్ నుంచి జైవీర్ సింగ్ ధంగర్, ఫిరోజాబాద్ నుంచి న్యాయవాది ప్రేమ్ దత్ బఘేల్, రాయ్ బరేలీ నుంచి హఫీజ్ మహ్మద్ మొబీన్, ఫతేపూర్ నుంచి రామకృష్ణ పాల్, భదోహి నుంచి ప్రేమ్ చంద్ బింద్, చందౌలీ నుంచి జవహర్ బింద్ ప్రకటించారు. ఈ సమాచారాన్ని పీడీఎం కార్యాలయ కార్యదర్శి మహ్మద్ ఆషిక్ తెలిపారు. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఇండియా కూటమి తరపున పోటీ చేస్తారనే ఊహాగానాల మధ్య పీడీఎం ఇక్కడ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఇది కాంగ్రెస్ అభ్యర్థికి సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనకు ఒక రోజు ముందుగా శుక్రవారం నాడు లక్నోలో పీడీఎం మొదటి సమావేశం జరిగింది. ఇందులో పీడీఎంకు నేతృత్వం వహిస్తున్న పల్లవి పటేల్‌తో పాటు ఏఐఎంఐఎం నేతలు కూడా పాల్గొన్నారు. నాలుగైదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను చర్చించారు. ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేస్తామని, మిగతా స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని పీడీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు అజయ్ పటేల్ తెలిపారు. -
ఆ అడుగుల్లో భాగమేనా? వెనక్కి తగ్గిన పల్లవి పటేల్ పార్టీ
వచ్చే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన అప్నా దళ్ (కెమెరవాడి) తన నిర్ణయాన్ని మార్చుకుంది. పార్టీ అభ్యర్థుల సవరించిన జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి రామ్ సనేహి పటేల్ ఒక ప్రకటనలో ప్రకటించారు. ‘ఇండియా’ కూటమికి చెందిన అప్నా దళ్ (కామెరవాడి) కౌశంబి, ఫుల్పూర్, మీర్జాపూర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే తరువాత పార్టీ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ స్థానాల నుండి తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఆ పార్టీ గతంలో 2022 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఇంతకుముందు వారి సహకారం ఉన్నప్పటికీ, 2024 ఎన్నికలకు అప్నా దళ్ (కెమెరవాడి)తో పొత్తు ఉండదని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. దీంతో అప్నా దళ్ (కెమెరవాడి) త్వరలో అభ్యర్థుల కొత్త జాబితాను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం ఆ పార్టీ ముఖ్య నాయకురాలు పల్లవి పటేల్.. తమ పార్టీ ‘ఇండియా’ కూటమిలో ఉండాలా వద్దా అనేది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో చేరే అవకాశంపై సంకేతాలు ఇచ్చారు. బీజేపీ నుంచి ఏదైనా ఆఫర్ వస్తే తమ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని పల్లవి పటేల్ చెప్పారు. పార్టీ ప్రకటించిన స్థానాల విషయంలో నిర్ణయాన్ని మార్చుకోవడం ఇందులో భాగమేనా అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
అక్కా.. వచ్చేస్తున్నా! ఎన్డీఏ వైపు పల్లవి పటేల్
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ‘ఇండియా’ కూటమికి షాకిస్తూ అప్నా దళ్ (కామెరవాడి) నాయకురాలు, సిరతు ఎమ్మెల్యే పల్లవి పటేల్ ( Pallavi Patel ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక పొత్తుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బిహార్‌లో ‘ఇండియా’ కూటమికి నితీష్ కుమార్ ఇచ్చిన షాకే ఉత్తరప్రదేశ్‌లోని అప్నా దళ్-కామెరవాడి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. "ప్రస్తుతం ఎన్డీఏతో చర్చలు లేవు. ఒకవేళ ఆఫర్ వస్తే తమ పార్టీ పరిశీలిస్తుంది" అని డాక్టర్ పల్లవి పటేల్ చెప్పారు. మరోవైపు అప్నా దళ్ (కామెరవాడి) ఉత్తరప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఒక రోజు తర్వాత సమాజ్‌వాదీ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కృష్ణ పటేల్ నేతృత్వంలోని పార్టీతో పొత్తు లేదని తెలిపింది. “అప్నాదళ్ (కె), సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు 2022 అసెంబ్లీ ఎన్నికల కోసమే కానీ, 2024 ఎన్నికల కోసం కాదు” అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. పల్లవి పటేల్ సోదరి, అప్నా దళ్ (సోనేలాల్) అధినేత్రి అనుప్రియా పటేల్ ( Anupriya Patel ) ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అప్నా దళ్ (కే) ప్రకటించిన మూడు స్థానాల్లో మీర్జాపూర్ స్థానం నుండి అనుప్రియా పటేల్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఫుల్పూర్, కౌశంబి లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. -
తండ్రైన యంగ్ హీరో నిఖిల్.. ఫోటో వైరల్
యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. నిఖిల్ భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్, డాక్టర్ పల్లవి 2020లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. (చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?) నిఖిల్ సినీ కెరీర్ విషయాకొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కార్తికేయ, స్వామిరారా సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. . చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. Our Unique Star ⭐️@actor_Nikhil and his wife #Pallavi are now blessed with a BABY BOY❤️ Warmest congratulations to the glowing couple on this delightful addition to their family 🤗✨#NikPal pic.twitter.com/ihRleHFUY8 — Team Nikhil Siddhartha Telangana ✊ (@TS_Team_Nikhil) February 21, 2024 -
తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. సీమంతం ఫోటో వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ త్వరలోనే తండ్రి కాబోతున్నారు. తాజాగా ఆయన భార్యకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సీమంతం వేడుకలో తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. కాగా.. 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. నిఖిల్ తన ట్విటర్లో రాస్తూ.. 'నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డ స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నిఖిల్ అభిమానులు తమ హీరోకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. 'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో నిఖిల్. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన 'స్వయంభూ' సినిమాలో నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్‌కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon 👶🏼👼🏽 Please send in your blessings 🙏🏽😇 pic.twitter.com/3Nn4S3wFHv — Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2024 -
చిన్న సినిమాలు సక్సెస్ కావాలి
‘‘చిన్న సినిమాలు సక్సెస్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. లక్ష్మీపతిలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు. ‘ఐక్యూ’ సినిమా సక్సెస్‌తో ఆయన మరిన్ని సినిమాలు ప్లా¯Œ చేస్తున్నారు’’ అని నిర్మాత ప్రసన్న కుమార్ అన్నారు. సాయి చరణ్, పల్లవి జంటగా జీఎల్బీ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఐక్యూ’. కేఎల్పీ మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ–‘‘ఐక్యూ’ సినిమా కథ జనాలకు బాగా కనెక్ట్ అయింది.. అందుకే రెండో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది’’ అన్నారు. రచయిత ఘటికాచలం పాల్గొన్నారు. -
‘ఐక్యూ’ జనాలకు బాగా కనెక్ట్ అయింది: నిర్మాత లక్ష్మీపతి
సాయి చరణ్, పల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్ ఆఫ్ ద స్టూడెంట్’ అన్నది ఉపశీర్షిక. జిఎల్బి శ్రీనివాస్ దర్శకత్వం కె.ఎల్.పి మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా రెండోవారం నడుస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో నిర్మాత మాట్లాడుతూ ‘సరైన థియేటర్లు దొరుకుతాయా లేదా అన్న డైలామాలో ఉన్నాం. కానీ మా సినిమాకు 99 థియేటర్లు దొరికాయి. సినిమా కథ జనాలకు బాగా కనెక్ట్ అయింది. రెండో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇదంతా బాలకృష్ణగారి వల్లే సాధ్యమైంది. నందమూరి కుటుంబంతో సినిమా చేయాలనుకున్నా. తారకరత్నగారితో సినిమా అనుకున్నా. ఆయన మరణించడంతో కుదరలేదు. త్వరలో నందమూరి ఫ్యామిలీ హీరోలతో ఓ సినిమా చేస్తా’అని అన్నారు. ‘చిన్న సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. లక్ష్మీపతిలాంటి నిర్మాతలు వస్తారు. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమా సక్సెస్‌తో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు’ అని ప్రసన్నకుమార్ అన్నారు. డిఓపి సురేందర్‌రెడ్డి, అనంతపురం జగన్, చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
యూత్‌ఫుల్ ఐక్యూ
సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ముఖ్య తారలుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్ ఆఫ్ స్టూడెంట్’ అనేది ఉపశీర్షిక. కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ‘‘మేధావి అయిన ఓ విద్యార్థిని మెదడును అమ్మడానికి వాళ్ల ప్రొఫెసర్ ఏ విధంగా ప్లాన్ చేశాడు? ఆ అమ్మాయిని హీరో ఎలా కాపాడాడు? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
భార్య తో కలిసి శ్రీ వారిని దర్శించుకున్న నిఖిల్...
-
నీ బాగోతం తెలుసు.. పరువు తీస్తా!
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొంగరకలాన్ తండాకు చెందిన అంగోతు సరిత, అంతిరాం దంపతుల రెండో కుమార్తె పల్లవి (21). ఈమె వండర్లాలో ఉద్యోగం చేస్తోంది. హైదరాబాద్ మూసాపేటకు చెందిన ఎలుక క్రాంతి, కొంగరకలాన్‌లో ఉంటున్న తన అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం పల్లవి, క్రాంతి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా.. వండర్లాలో పనిచేస్తున్న ప్రణయ్‌తో పల్లవి చనువుగా ఉంటోందని, ఫోన్లు, చాటింగ్ చేస్తోందని క్రాంతికి అనుమానం వచ్చింది. దీంతో రెండు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో క్రాంతి గురువారం పల్లవిని కలిసి బైక్‌పై సాయిబాబా గుడి వద్దకు తీసుకెళ్లాడు. ‘నీ బాగోతం అంతా నాకు తెలుసు.. అందరికీ చెప్పి పరువు తీస్తా’అని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన పల్లవి.. ‘ఐ లవ్యూ.. లాస్ట్ మెసేజ్’ అని క్రాంతికి వాట్సాప్ చేసింది. అనంతరం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలాన్ని డీసీపీ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్రావు పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం బందోబస్తు మధ్య పల్లవి అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసుల అదుపులో ఇద్దరు ఇంటికి వెళ్లకుండా పల్లవి ఫోన్ స్విచ్చాఫ్ చేయడం, ఇదే చివరి మెసేజ్ అని పెట్టడంతో క్రాంతికి అనుమానం వచ్చింది. దీంతో అతను ఆదిబట్ల పోలీసులకు తెలిపాడు. పల్లవి అత్మహత్య చేసుకునే అవకాశం ఉందని తల్లిదండ్రులకు తెలియడంతో వారు కూడా పోలీసులను ఆశ్రయించారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. శుక్రవారం పల్లవి చెట్టుకు ఉరేసుకొని కని పించింది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా, క్రాంతి, ప్రణయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
యంగ్ హీరో నిఖిల్‌పై రూమర్స్.. అవన్నీ ఫేక్..!
యంగ్ హీరో నిఖిల్‌పై ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. టాలీవుడ్ హీరో తన భార్య పల్లవితో విడిపోతున్నట్లు కొద్దికాలంగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విడిపోయేందుకు నిఖిల్ సిద్ధమయ్యాడని అసత్య ప్రచారం నడుస్తోంది. ఇటీవలే కార్తికేయ-2తో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు నిఖిల్. ప్రస్తుతం తన భార్య పల్లవితో గోవాలో వెకేషన్లో ఉన్నారు యంగ్ హీరో. గోవాలో ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 'మనిద్దరం కలిసున్న ప్రతిక్షణం అద్భుతమే' అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. కాగా 2020లో భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి పల్లవి
బుల్లితెరపై సక్సెస్ఫుల్ నటిగా రాణిస్తోంది పల్లవి రామిశెట్టి. పలు సీరియల్స్‌లో లీడ్ రోల్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని నెలల క్రితం తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన పల్లవి ఆగస్టులో సీమంతం జరుపుకోగా అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయ్యాయి. తాజాగా పల్లవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. తాను పండంటి బాబుకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. మా కుటుంబంలోకి కొత్త అతిథి వచ్చేశాడోచ్ అంటూ పసివాడి పాదాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో తల్లిదండ్రులుగా మారిన పల్లవి-దిలీప్ దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by pallavi Ramisetty official (@pallaviramisettyofficial) చదవండి: బాలాదిత్య, వాసంతి పారితోషికం ఎంతో తెలుసా? టాలీవుడ్లో విషాదం, నటుడు కన్నుమూత -
ప్రముఖ బుల్లితెర నటి సీమంతం ఫొటోలు వైరల్
పల్లవి రామిశెట్టి.. కొన్నేళ్లుగా బుల్లితెర ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ నటిగా కొనసాగుతోంది. పలు ఛానళ్లలోని సీరియల్స్‌లో తళుక్కుమని మెరిసిందీ అచ్చ తెలుగు అమ్మాయి. సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తూ అభిమానుల మనసులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుందీ నటి. 2009లో కెరియర్ ప్రారంభించిన ఆమె త్వరలో తల్లి కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె సీమంతం జరుపుకుంది. ఈ వేడుకకు ఇతర బుల్లితెర నటులు హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు త్వరలో తల్లి కాబోతున్న పల్లవి-దిలీప్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: లలిత్ మోదీతో డేటింగ్.. మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కిన సుష్మితా, వీడియో వైరల్ షూటింగ్లో ప్రమాదం.. మరోసారి హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు -
దారుణం: ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని..
గద్వాల క్రైం: వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడమే ఆమెకు శాపంగా మారింది. కోపం పెంచుకున్న భర్త ఆమె ఉసురుతీశాడు. చిన్నారులకు తల్లి ప్రేమానురాగాలను దూరం చేశా డు. ఈ ఘటన గద్వాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన అన్నపూర్ణ అలియాస్ పల్లవి(26)కి గద్వాలకు చెందిన వెంకటేశ్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది క్రితం మొదటి సంతానం పాప జన్మించింది. ఈ నెల 24న ఇద్దరు ఆడపిల్లలు(కవలలు) పుట్టారు. దీంతో భార్యపై వెంకటేశ్ ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆదివారం ఇంట్లో నిద్రిస్తున్న భార్య గొంతు నులిపేస్తుండగా కేకలు వేసింది. ఇరుగుపొరుగువారు వచ్చి నిలదీయగా ఫిట్స్ వచ్చాయని నమ్మించేందుకు ప్రయత్నించాడు. స్థానికులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. అతని మాటల్లో పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు సోమవారం పోలీసులకు సమాచారమిచ్చారు. గద్వాల సీఐ షేక్ సయ్యద్‌బాషా, తహసీల్దార్ లక్ష్మి, వైద్యుల సమక్షంలో పల్లవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమెను పథకం ప్రకారమే హత్య చేసినట్టు తేలింది. మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు అల్లుడు వెంకటేశ్, అతని తల్లి జయమ్మ, బావ జనార్దన్, చెల్లెలు లీలావతిలపై కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. నిందితుడు మల్దకల్ ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. (చదవండి: AP: ఇద్దరు యువతులను కాపాడిన ‘దిశ’) -
వారికి కూడా నా ధన్యవాదాలు : నిఖిల్
హైదరాబాద్ : హీరో నిఖిల్ తన ప్రేయసి డాక్టర్ పల్లవి వర్మను గురువారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉండటంతో హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. వివాహ వేడుకకు హాజరైన కొద్ది మంది అతిథులకు కూడా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు.. మాస్క్‌లు, శానిటైజర్ అందుబాటులో ఉంచారు. అయితే లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమలోని నిఖిల్ స్నేహితులు చాలా మంది ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. (చదవండి : ప్రేయసిని పెళ్లాడిన హీరో నిఖిల్) ఈ క్రమంలో నిఖిల్ స్నేహితులతోపాటుగా, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిఖిల్, పల్లవి జంటకు బెస్ట్ విషెస్ తెలిపారు. దీంతో నిఖిల్ వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నా ఫోన్, సోషల్ మీడియా మీ ఆశీస్సులు, ప్రేమతో నిండిపోయింది. ఈ పెళ్లి కోసం పనిచేసిన టీమ్‌కు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను. అద్భుతమైన డెకరెషన్, ఫొటోగ్రఫీ, ఔట్ఫిట్ అందించిన మీరు పెళ్లిని గుర్తుండిపోయేలా చేశారు ’ అని నిఖిల్ పేర్కొన్నారు. కాగా, అంతకుముందు ఏప్రిల్ 16న వివాహం చేసుకోవాలని భావించిన కరోనా ఎఫెక్ట్‌తో అదికాస్త మే 14కు వాయిదా వేశారు. అయితే రెండోసారి కూడా పెళ్లి వాయిదా పడినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అనుకున్న ముహుర్తానికే నిఖిల్, పల్లవిలు వివాహ బంధంతో ఒకటయ్యారు.(చదవండి : క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టిన సాయేషా) Thanks for all the wishes pouring in.. my phn nd social media has been flooded with Blessings and Love. I also wanna thank the team behind the Wedding👉🏼Decor by @ekaa_customdecor Photography by @aswin_suresh_photography nd Outfit frm @jahanpanahhyd made the Wedding Memorable 4 me pic.twitter.com/la4EhFfu7h — Nikhil Siddhartha (@actor_Nikhil) May 15, 2020 -
ఒక ఇంటివారయ్యారు
గురువారం రెండు వివాహ వేడుకలు జరిగాయి. హీరో నిఖిల్ డాక్టర్ పల్లవిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయితే, సహాయ నటుడు మహేష్ పావనిని పెళ్లాడి ఇంటివాడు అయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఒక ఫార్మ్ హౌస్ లో నిఖిల్ వివాహం జరిగింది. అతి కొద్ది మంది బంధువుల మధ్య ఈ వేడుక నిర్వహించారు. మహేష్ వివాహం తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జరిగింది. ఈ రెండు వేడుకలను లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే నిర్వహించారని తెలిసింది. -
నేడు నిఖిల్ వివాహం
‘స్వామిరారా, సూర్య వర్సెస్ సూర్య, కార్తికేయ, ఎక్కడకి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం’ వంటి విజయాలు సొంతం చేసుకున్న కథానాయకుడు నిఖిల్ నేడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డాక్టర్ పల్లవి వర్మతో ఏడడుగులు వేయనున్నాడు. ఏప్రిల్ 16న వీరి పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. నేడు షామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో నిఖిల్–పల్లవిల వివాహం ఉదయం 6:31 గంటలకు జరగనుంది. కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథులతో నిరాడంబరంగా ఈ పెళ్లి జరగనుంది. కాగా బుధవారం సాయంత్రం నిఖిల్‌ని పెళ్లి కొడుకుని, పల్లవిని పెళ్లి కూతురిని చేశారు. -
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్..
కరోనా కారణంగా మరో టాలీవుడ్ హీరో పెళ్లి వాయిదా పడింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్టు హీరో నితిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో నిఖిల్ కూడా తన పెళ్లిని వాయిదా వేసకుంటున్నట్టు వెల్లడించారు. అయితే కొద్ది రోజుల క్రితం తన పెళ్లిని ఎవరూ ఆపలేరని నిఖిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసుకోవడమే మంచిదని నిఖిల్ భావించినట్టుగా తెలుస్తోంది. ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేము పెళ్లి చేసుకోవడం సాధ్యపడేలా కనిపించడం లేదు. వేరే మార్గం లేక మేము మా పెళ్లిని వాయిదా వేసకుంటున్నాం. అయితే ఈ పరిస్థితులు ఇంకా ఎంత కాలం కొనసాగుతాయో తెలియడం లేదు. పెళ్లి వాయిదా పడినందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొద్దిగా నిరాశ చెందారు. కానీ భద్రత అనేది అనింటి కంటే ముఖ్యమైనది. మనం కష్టాల్లో ఉన్న సమయంలో వేడుకలు జరుపుకోవడం సరైనది కాదు’ అని నిఖిల్ తెలిపారు. కాగా, ఫిబ్రవరి 1 వ తేదీన డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్, పల్లవిలు పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్దమయ్యారు. ఏప్రిల్ 16న వీరి వివాహం జరగాల్సి ఉంది. చదవండి : కరోనా ఎఫెక్ట్: అభిమానులకు నితిన్ విజ్ఞప్తి డాక్టర్‌తో హీరో నిఖిల్ నిశ్చితార్థం -
కసాయి తండ్రి ఘాతుకం..
సాక్షి,కర్ణాటక, బళ్లారి: మద్యం తాగుడుకు బానిసైన కసాయి తండ్రి నిత్యం కూతురిని తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వేధించడంతో పాటు గొడవ పడుతూ కూతురినే హెచ్ఎల్సీలోకి తోసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోమవారం నగరంలోని బండిహట్టి ప్రాంతానికి చెందిన సూరి అలియాస్ ఆటో సూరి తన కూతురు పల్లవిని హెచ్ఎల్సీ కాలువలోకి తోసి పోలీసు స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాడు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కార్యాలయంలో పని చేస్తున్న పల్లవి(22)ని ఆదివారం రాత్రి తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. దీంతో ఆమె విసిగిపోయి ప్రతి రోజు తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గొడవ చేస్తే ఎలా అని, నీతో కలిసి ఇంటిలో ఉండటం కంటే చావడం నయమని బెదిరించింది. రాత్రి కూడా గొడవ కొనసాగింది. సోమవారం ఉదయం కూడా అదే మాదిరిగా తాగేందుకు డబ్బులు ఇవ్వాలని మళ్లీ అడగటంతో ఆమె బెదిరించేందుకు పక్కనే ఉన్న హెచ్ఎల్సీ కాలువలోకి దూకుతానని బెదిరిస్తూ అక్కడికి వెళ్లింది. వెంబడించిన తండ్రి కూడా కాలువ వద్దకు చేరుకున్నాడు. ఆమె బెదిరిస్తూ అలాగే నిలబడటంతో ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దు అని చెప్పాల్సిన తండ్రి తానే కూతురిని కాలువలోకి తోసివేయడంతో పక్కనే ఉన్న ఓ యువకుడు చూసి తక్షణం రక్షించేందుకు ప్రయత్నించగా, కసాయి తండ్రి ఆ యువకుడితో కూడా గొడ వకు దిగాడు. అంతలోనే ఆమె నీటిలో కొట్టుకు పోయింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది. ఈతలో నైపుణ్యం ఉన్న యువకులను రప్పించి కాలువలో పల్లవి జాడ కోసం గాలింపు ప్రారంభించారు. మూడేళ్ల క్రితం సూరి వేధింపులకు అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఇతనికి రెండో కూతురు ఉంది. కాగా ఇదే వారంలో బళ్లారి తాలూకా గోడేహాల్లో పరువు హత్య జరిగింది. ఇందులో కూతురినే తండ్రి చంపేశాడు. ప్రస్తుతం తాగుడుకు బానిసైన తండ్రి ఏకంగా తన కూతురినే హెచ్ఎల్సీలోకి తోసేయడం ఈ ప్రాంత వాసులను కలిచివేసింది. ఈ ఘటనతో బండిహట్టిలో పల్లవి ఇంటి వద్ద బంధువులు, స్నేహితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానిక బ్రూస్‌పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హీరో నిఖిల్ నిశ్చితార్థం
-
డాక్టర్‌తో హీరో నిఖిల్ నిశ్చితార్థం
ప్రముఖ హీరో నిఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ వివాహం చేసుకోనున్నారు. కొద్దికాలంగా పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో శనివారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య నిఖిల్, పల్లవిల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఏప్రిల్ 16న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కానున్నట్టుగా సమాచారం. దీంతో పలువురు సినీ ప్రముఖులు నిఖిల్‌కు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అలాగే పల్లవి వర్మకు నిఖిల్ ప్రపోజ్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతోంది. నిఖిల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను ఓ డాక్టర్‌ను ప్రేమిస్తున్నానని చెప్పిన సంగతి తెలిసందే. కాగా, టాలీవుడ్లో డిఫరెంట్ మూవీస్‌తో నిఖిల్ తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆయన నటించిన అర్జున్ సురవరం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. -
నవ వధువు బలవన్మరణం
హస్తినాపురం: ఓ నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మలక్‌పేటకు చెందిన కొటిక లక్ష్మి, చంద్రశేఖర్ దంపతుల కుమార్తె పల్లవి(28)కి గత డిసెంబర్ 8న నల్గొండ జిల్లా, మునుగోడు పట్టణానికి చెందిన సామవరపు సంతోష్‌తో వివాహం జరిగింది. నూతన దంపతులు శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లవి తన బెడ్ రూంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి వెళ్లిన ఆమె అత్తమామలు పల్లవికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పక్కింటి వారికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వారు కిటికీలోంచి చూడగా పల్లవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో వారు ఈ విషయాన్ని మృతురాలి అత్తమాలకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శభాష్.. పల్లవి
సాక్షి, దుగ్గొండి: వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి ఎంపీడీఓ గుంటి పల్లవికి సీఎంఓ నుంచి గురువారం ఫోన్ వచ్చింది. ఎంపీడీఓగా వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్న విధానాన్ని సీఎం కేసీఆర్ అభినందించినట్లు సీఎంఓ అధికారులు తెలిపారు. పర్యావరణ హితం కోసం వాడిపడేసిన కొబ్బరిబొండాల్లో మొక్కలు నాటిన విధానాన్ని సీఎం ప్రశంసించారు. ‘బొండాం భలే ఐడియా’శీర్షికన ఈనెల 4న సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ మేరకు సీఎంఓ నుంచి అభినందనలురావడం సంతోషంగా ఉందని పల్లవి చెప్పారు. చదవండి: బొండాంతో భలే ఐడియా! -
'పల్లవిం'చిన సేవా స్ఫూర్తి
చక్కని ఉద్యోగం.. ఐదంకెల జీతం.. చేతి నిండా డబ్బు.. ఎంజాయ్ చేసే వయసు.. మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ ఇవన్నీ ఉన్నా ఆ యువతి మాత్రం నలుగురికి సాయం చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంది. అదే మానవ జన్మకు సార్థకమంటోంది. తండ్రి నుంచి సేవచేయడాన్ని వారసత్వంగా తీసుకున్న ఆమె పేరు ‘పల్లవి ప్రియ’. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఈమె సిటీలో ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అంతేకాదు.. ‘కాజ్ ఫర్ సెలబ్రేషన్’ పేరుతో ఓ ఎన్జీఓను నెలకొల్పి దాని ద్వారా వందలాది మందికి అండగా నిలుస్తోంది. సాక్షి,సిటీబ్యూరో: పల్లవి ప్రియ సిటీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తునే అదే కంపెనీలోని సీఎస్ఆర్లో కోర్ మెంబర్గాను ఉంది. ఉత్తరప్రదేశ్‌లో చదువుకునే రోజుల్లో ఎన్ఎస్ఎస్ మెంబర్‌గా కాలేజీ అయ్యాక తన స్నేహితులతో కలసి సమీపంలోని బస్తీల్లో పర్యటించి అక్కడి వారి అవసరాలను గుర్తించేంది. అలా తన వద్దనున్న డబ్బులతో చేతనైన సాయం అందించేది. ఉద్యోగం వచ్చాక ఈసేవను మరింత విస్తృతం చేసింది. పల్లవిప్రియ చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలంలో రోడ్డుపై ఉండే చిరు వ్యాపారులు వర్షంలో తడుస్తునే తమ పనులు చక్కబెట్టుకోవడం చూసిన ఆమె ‘ఫుట్‌పాత్ వ్యాపారులకు పెద్ద పెద్ద గొడుగులను ఇవ్వాలనే లక్ష్యంతో నేను ఓ అడుగు వేస్తున్నా.. ఆసక్తి ఉన్నవారు నాతో చేయి కలపండి’ అంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. అది జరిగి ఆరు గంటల్లో పదుల సంఖ్యలో ఆమెను సంప్రదించి నగర వ్యాప్తంగా ఫుట్‌పాత్‌పై ఉండే చిరు వ్యాపారులకు గొడుగులు పింపిణీ చేసే నగదు సమకూర్చుకుని వారిసి సాయం అందించింది. చిన్నారులకు బహుమతులు ఇస్తున్న పల్లవి ప్రియ ఒక్క రోజులో ఏడాదికి సరిపోయే బుక్స్ గత ఏడాది సెప్టెంబర్‌లో తన పుట్టిన రోజున నగరంలోని ఓ అనాథ ఆశ్రమానికి వెళ్లిన పల్లవి ప్రియ అక్కడి పిల్లలతో సరదాగా గడిపి, వారికి కడుపునిండా భోజనం పెట్టింది. తిరిగి వచ్చే సమయంలో వారంతా ‘అక్కా..మాకు నోట్ బుక్స్ లేవు, చదువుకోవడానికి, రాయడానికి చాలా ఇబ్బంది ఉంద’నడంతో అనాథ పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ చేసేందుకు దాతలు కావాలంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. కొన్ని గంటల్లోనే 12 మంది ముందుకు వచ్చారు. అక్కడి పిల్లలకు ఏడాది పాటు కావాల్సిన నోట్‌బుక్స్, బట్టలు, షూస్, ఇతరాత్ర అవసరాల కోసం సాయం అందించారు. మరోరోజు ఇన్ఫోసిస్ కార్యాలయానికి కొందరు పిల్లలు విజిటింగ్ కోసం వచ్చారు. ఆ సమయంలో వారి కాళ్లకు చెప్పులు లేవు. వారి వద్దకు వెళ్లి వారి గురించి ఆరా తీసింది పల్లవిప్రియ. వారంతా నిరుపేదలని తెలిసి రాచకొండ పోలీస్ కమిషనర్ సాయంతో ఆ రోజు అక్కడకు వచ్చిన పిల్లలందరికీ చెప్పులతో పాటు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇచ్చి వారిలో ఆనందాన్ని నింపింది. అంతేకాదు.. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ స్కూల్స్‌లో బెంచ్‌లు, ఫ్యాన్లు పంపిణీ చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది పల్లవిప్రియ. ఈమెకు ప్రకృతి అంటే ఎంతో ప్రేమ. అందుకే పర్యావరణంపై శ్రద్ధను తీసుకుంటోంది. స్కూలు విద్యార్థులను కలిసి పర్యావరణం ప్రాముఖ్యతను వివరిస్తూ వారితో ఎస్సై రైటింగ్స్ పోటీలు నిర్వహిస్తోంది. వక్తృత్వ పోటీలు పెట్టి బహుమతులు సూతం ఇస్తోంది. ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల కలిగే అనర్థాలు వివరించి చెబుతోంది. పల్లవి ప్రియ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇన్ఫోసిస్ ఉన్నతోద్యోగలు, స్వచ్ఛంద సంస్థలు సైతం అభినందింది సత్కరించడం గమనార్హం. నాన్నే స్ఫూర్తి.. మా నాన్నకు ఇతరులకు సాయం చేయడం అంటే ఇష్టం. ఆయన మార్గంలోనే నేనూ నడుస్తున్నాను. సమాజానికి నా వల్ల ఏ విధమైన ఉపయోగం ఉంటుందనేది గుర్తించాను. అప్పటి నుంచే పేదలకు నాకు తోచిన విధంగా సాయం చేస్తున్నా. అందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకున్నా. నా సొంత డబ్బులతో పాటు నాకెంతో మంది అండగా నిలుస్తున్నారు. వారు ఇచ్చిన ప్రతి రూపాయికి బిల్లులతో సహా లెక్క కూడా చెప్తుంటాను. అందుకే సహాయం కోసం పోస్ట్ పెట్టిన ప్రతిసారీ నాకు తోడుగా ఎంతో మంది వెన్నంటి వస్తున్నారు. – పల్లవి ప్రియ, ఇన్ఫోసిస్ ఉద్యోగి