గోరంట్ల (అనంతపురం జిల్లా): నీటి గుంతలో పడి ఒక చిన్నారి మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా గోరంట్లలో బుధవారం జరిగింది. వివరాలు.. గోరంట్లలోని మోహన్‌రావునగర్‌కు చెందిన వేమనారాయణ, పుష్పలత దంపతుల కుమార్తె పల్లవి (2) ఆడుకుంటూ వెళ్లి సమీపంలోని నీటి గుంతలో పడింది. గమనించిన కుటుంబసభ్యులు బాలికను వెలికి తీసినా అప్పటికే ఆ చిన్నారి మృతిచెందింది. చిన్నారి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.