water tank
-
దారుణం.. వాటర్ ట్యాంక్‌లో చిన్నారి మృత దేహం
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అదృశ్యమైన ఐదేళ్ల బాలిక కేసు విషాదంగా మారింది. చిన్నారి నివసిస్తున్న ఇంటికి ఎదురుగా ఉన్న మరో ఇంటి వాటర్ ట్యాంక్‌లో శవమై తేలింది. అయితే నిందితులు చిన్నారిపై దారుణానికి ఒడిగట్టి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.మూడు రోజుల క్రితం చిన్నారి అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్లు, డ్రోన్లతో పాటు ఐదు పోలీసు స్టేషన్ల నుండి 100 మంది పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయి చిన్నారి కోసం గాలించారు. అనుమానాస్పద ప్రాంతాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం వెయ్యికి పైగా ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. 72 గంటల తర్వాత చిన్నారి నివసిస్తున్న ఇంటికి ఎదురుగా నిర్మానుష్యంగా ఉన్న మరో ఇంటి నుంచి దుర్వాసన వెదజల్లింది. దీంతో అనుమానంతో ఇంటిని తినిఖీ చేయగా.. ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్‌లో చిన్నారి మృత దేహం లభ్యమైంది. పాప ఆచూకీతో స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా చిన్నారి నివసిస్తున్న ఇల్లు..నిర్మానుష్యంగా ఉన్న మరో ఇంట్లో ఎందుకు తనిఖీలు చేయాలని మండిపడుతున్నారు. -
వాటర్ ట్యాంకుపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
జీడిమెట్ల: మద్యం మత్తులో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఇన్స్పెక్టర్ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పార్వతీపురంనకు చెందిన బావిరి రాము (53)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్‌లో ఉంటూ మేస్త్రీ పనులు చేస్తున్నాడు. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. 15 రోజుల క్రితం కూడా రాము మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సోమవారం ఉదయం మద్యం మత్తులో స్థానిక ఎల్లమ్మ పోచమ్మ గుడి వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి కిందికి దూకి మృతి చెందాడు. మృతుడి కుమారుడు జైకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. రాము వాటర్ ట్యాంక్‌పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పోలీసులకు సమాచారం అందినా స్పందించలేదా? రాము ట్యాంక్‌పైకి ఎక్కడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినా వారు పట్టించుకోలేదనే వదంతులు ఉన్నాయి. ఈ విషయమై ఇన్స్పెక్టర్ మల్లేశ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. రాము ట్యాంక్‌పైకి ఎక్కి నిమిషాల్లోనే దూకి మృతి చెందాడని, ఈ విషయమై తమకు, డయల్ 100కు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని తెలిపారు. -
వామ్మో! ఇంతపెద్ద నీటితొట్టెనా!?
ప్రపంచంలోనే అతిపెద్ద నీటితొట్టెను నిర్మించేందుకు జపాన్ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నీటితొట్టె నిర్మాణం కోసం ఏకంగా ఒక కొండను తొలచడానికి సిద్ధపడింది. ఏకంగా 26 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ఈ నీటితొట్టె నిర్మాణానికి 400 మిలియన్ పౌండ్లు (రూ.4,191 కోట్లు) ఖర్చు చేయనుంది. విశ్వం ఆవిర్భావంలో కీలకమైన సూక్షా్మతి సూక్ష్మకణాలైన న్యూట్రినోలను కనుగొనే లక్ష్యంతో జపాన్ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా ఈ భారీ నీటితొట్టె నిర్మాణాన్ని చేపడుతోంది. ‘న్యూట్రినో’లను కనుగొనడానికి ఈ తొట్టె అడుగున 40 వేల ఆటమ్ డిటెక్టర్లను అమర్చనుంది. న్యూట్రినోలు పరమాణవుల కంటే సూక్షా్మతి సూక్ష్మంగా ఉంటాయి. వీటిని గుర్తించడం చాలా కష్టం. ఇవి అంతరిక్షంలో సంచరిస్తుంటాయి. ఇతర పదార్థాలతో ప్రభావితం కాకుండా ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి సులువుగా చేరుకుంటాయి.ఇవి జీవుల శరీరాల్లోనూ కోట్ల సంఖ్యలో కదలాడుతూ ఉంటాయి. న్యూట్రినోల స్వభావాన్ని కూలంకషంగా అర్థం చేసుకోగలిగితే, విశ్వం గురించి ఇప్పటి వరకు ఉన్న ఆలోచనా ధోరణిలో మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రయోగానికి ఇరవై ఒక్క దేశాలు అండదండలు అందిస్తున్నాయి. ఈ నీటితొట్టె ఎత్తు 80 మీటర్లు, వెడల్పు 70 మీటర్లు. అంటే, దీనిలో ఏకంగా ఒక బోయింగ్–747 విమానం నిలువునా పట్టేస్తుందన్న మాట.అబుదాబిలోని ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆక్వేరియం ‘సీ వరల్డ్’తో పోల్చుకుంటే, జపాన్ నిర్మిస్తున్న ఈ నీటితొట్టె పరిమాణం నాలుగున్నర రెట్లు ఎక్కువ. న్యూట్రినోల పరిశీలన కోసం హిడా నగరానికి చేరువలో ఉన్న కొండను తొలిచి చేపడుతున్న ఈ నీటితొట్టె నిర్మాణం 2026 నాటికి పూర్తవుతుందని చెబుతున్నారు. న్యూట్రినోల పరిశీలన, ఇతర ప్రయోగాలను 2027 నుంచి ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు.ఇవి చదవండి: నిజమే..! ఇది ముక్కుసూటి రహదారే..!! సుమారు.. -
యూనివర్సిటీ వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం.. పరారీలో భర్త, అత్త? ..?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఘోరం వెలుగుచూసింది. గౌతమ్ బుద్దా యూనివర్సిటీలోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్‌లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను భర్త, అత్తే హత్య చేసి అక్కడి నుంచి పరారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ భర్త సమీపంలోని జిమ్స్ ఆసపత్రిలో పనిచేస్తున్నట్లు తేలింది. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పారు. ఆ గొడవే మహిళ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి భర్త, అత్త కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా తెలిపారు. కేసుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వాస్తవాలను బయటపెడతామని చెప్పారు. -
నీళ్ల ట్యాంక్‌లో అస్థి పంజరాలు..?
భువనేశ్వర్: జాజ్‌పూర్ జిల్లాలో ఒక గ్రామ సమీపంలోని తాగునీటి ప్రాజెక్టులో భాగంగా కొత్తగా నిర్మించిన నీళ్ల ట్యాంక్‌లో సోమవారం రెండు అనుమానాస్పద మానవ అస్థిపంజరాలు గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జాజ్‌పూర్ సదర్ మండలం నిశ్చింత గ్రామ శివారులో తాగునీటి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ట్యాంక్‌లో అస్థిపంజరాలు కనిపించినట్లు సమాచారం. అస్థిపంజరాలు మనుషులవిగా భావిస్తున్నారు. అయితే ఈ విషయం ఇంకా ధ్రువీకరించబడలేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అస్థి పంజరాలను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం జాజ్‌పూర్ పట్టణంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి (డీహెచ్‌హెచ్)కి తరలించారు. నివేదిక అందిన తర్వాతే అస్థి పంజరాలు మనుషులవా లేక కోతులవా అనేది తేలనుందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు గ్రామ శివారులో ఉన్న నీళ్ల ట్యాంక్ నిర్మాణం పూర్తయినా ఇంకా ప్రారంభించలేదు. సరదాగా సోమవారం ట్యాంక్‌పైకి ఎక్కిన ఇద్దరు చిన్నారులు ఈ అస్థి పంజరాలను గుర్తించారు. సమాచారం తెలియడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందడంతో జాజ్‌పూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వినిత్ అగర్వాల్, సబ్ డివిజనల్ పోలీసు అధికారితో పాటు పోలీసు బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించింది. అగ్నిమాపక సిబ్బంది అస్థి పంజరాలను వెలికితీసి జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించి మరిన్ని వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు. -
వన్య ప్రాణులకు జీవధార
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రెండేళ్లుగా వన్యప్రాణి సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో వేసవిలో నీటి కోసం వన్యప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన లేదా వాహనాల కింద పడి మృతి చెందేవి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పరిధిలోని పాపికొండల అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో సుమారు 60 నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. వీటితో పాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చలమలను తీసి, వన్యప్రాణులకు నీటి సౌకర్యం లభించేలా చర్యలు తీసుకున్నారు. అవి కాకుండా 25 చెక్ డ్యామ్‌ల ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నీటి తొట్టెల్లో వేసవిలో నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా బేస్‌క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తెచ్చి నింపుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.1.50 లక్షలు మంజూరు చేస్తోంది. నీటి తొట్టెల పక్కన ఉప్పు ముద్దలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు ఆ నీరు తాగి.. ఉప్పు ముద్దను నాకుతాయని.. దీనివల్ల వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలుంటాయని అటవీశాఖ అధికారులంటున్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. పాపికొండల అభయారణ్యంలో ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, చిరుతలు, ముళ్ల పందులు, జాకర్స్, దున్నలు వంటి అనేక జంతువులున్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి వేసవిలో దాహార్తి తీర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. నీటి సమస్య తలెత్తకుండా చర్యలు పాపికొండల అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటి తొట్టెలు వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. వేసవిలో నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీరు పోసి నింపుతున్నాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – దావీదు రాజునాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
భార్యను హతమార్చి.. వాటర్ ట్యాంకులో దాచి
సాక్షి, దొడ్డబళ్లాపురం: భార్యను హతమార్చి శవాన్ని ఖాళీ వాటర్ ట్యాంకులో దాచిన ఘటన హుళియాళలో చోటుచేసుకుంది. శాంతకుమారి (38) భర్త చేతిలో హతమైన మహిళ. తెరెగాంవ గ్రామానికి చెందిన తుకారాం మడివాళ నిందితుడు. తుకారాం పక్కింటి మహిళతో మాట్లాడిన విషయానికి సంబంధించి భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర ఆగ్రహంతో తుకారాం భార్య గొంతు నులిమి హత్య చేసాడు. శవాన్ని వాటర్ ట్యాంకులో దాచాడు. అనంతరం ఖానాపురకు చెందిన రిజ్వాన్‌కుంబారి అనే వ్యక్తికి చెందిన టాటాఏస్ వాహనాన్ని అద్దెకు తీసుకుని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పారవేయాలని ప్రయత్నిస్తుండగా హుళియాళ, రామనగర పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి నిందితుడిని అరెస్టు చేసారు. (చదవండి: భార్యపై చేయి చేసుకున్నానని.. ఆవేదనతో భర్త..) -
9 నెలల చిన్నారిని బలి తీసుకున్న చైన్ స్నాచర్
-
చిన్నారిని బలితీసుకున్న చైన్ స్నాచర్.. నీటి సంపులో పడేయడంతో..
సాక్షి, జనగామ జిల్లా: పాప వయస్సు ఏడాది.. అయినా బోర్లా పడరాదు..చేతులతో ముందుకు కదలలేదు.. ఆస్పత్రులకు వెళితే బాగయ్యే పరిస్థితి లేదన్నారు.. ఒకవైపు మూడేళ్ల కొడుక్కి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం, చిన్నారి పరిస్థితిలో తీవ్ర మనోవేదనకు గురైన కన్న తల్లే చిన్నబిడ్డను నీటి సంప్‌లో వేసి చంపేసింది. ‘అయ్యో దొంగోడొచ్చాడు.. నా మెడలో పుస్తెల తాడు లాక్కోబోయాడు.. అడ్డుకున్నందుకు చంటి పాపను సంపులో వేసి చంపేశాడంటూ దొంగేడుపుతో అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు జైలు పాలయింది. అప్పటివరకు తన కూతురును ఎత్తుకుని ఆడించిన తండ్రి.. హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్లిన అరగంటకే ఫోన్లో ఆమె మరణ వార్త తెలియడంతో అక్కడే కుప్పకూలి పోయాడు. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొడుక్కి ఓపెన్ హార్ట్.. కూతురు కదల్లేని స్థితి జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన నడిగోటి భాస్కర్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా పొద్దుటూరు గ్రామానికి చెందిన ప్రసన్నతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.. మూడేళ్ల నవనీత్, తేజస్వి (12 నెలలు) ఉన్నారు. హెయిర్ కటింగ్ సెలూన్ నడిపించే భాస్కర్, బతుకు దెరువు కోసం జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌కు మకాం మార్చాడు. అనారోగ్యానికి గురైన నవనీత్‌కు ఇటీవలే ఓపెన్ హార్టు సర్జరీ చేయించగా, రూ.8 లక్షల వరకు ఖర్చయింది. తేజస్వి కూడా సరైన ఎదుగుదల లేక సరిగ్గా కదలలేని స్థితిలో ఉండేది. దీంతో అనేక ఆస్పత్రులకు తిప్పారు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా, బాగయ్యే పరిస్థితి లేదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ప్రసన్న తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది. కూతురు హత్యకు ముందే ప్లాన్ సోమవారం వీరితోనే ఉంటున్న అత్త, మామ, మరిది వేరే ఊరికి వెళ్లారు. ఉదయం 10.30 గంటలకు భాస్కర్ హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్లగా, ప్రసన్న ఇంటి గేటుకు తాళం వేసుకుని లోపలే ఉండి పోయింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కూతుర్ని చంపాలని నిర్ణయించుకుంది. ఇంటి బయట నీటి సంప్‌లో పడేసింది. చనిపోయిన తర్వాత బయటకు తీసి అరుపులు, కేకలతో ఏడుపు మొదలుపెట్టింది. అటుగా బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రావడంతో అతనికి చైన్ స్నాచింగ్ కథ విని్పంచింది. అతనితో కలిసి బైక్‌పై ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ నుంచి చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌కు తరలించారు. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి ఉంచి ఆమెతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ‘గోడ మీదుగా హెల్మెట్ ధరించిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి, మెడలోని పుస్తెల తాడు బ్లేడ్‌తో తెగ్గొట్టే ప్రయత్నం చేశాడని పోలీసులకు, చుట్టుపక్కల వారికి ప్రసన్న చెప్పుకొచి్చంది. తాను అతనితో పెనులాడడానని, దుండగుడు రెండు ముక్కలైన పుస్తెల తాడు తీసుకుని, మరో వైపు పసిపాపను లాక్కుని, ఇంటి ఆవరణలో ఉన్న సంపులో వేసి, గోడ దూకి పారిపోయాడంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే అక్కడ ప్రసన్న చెబుతున్నట్టుగా సీన్ కనిపించకపోవడంతో అనుమానించిన ఏసీపీ జి.క్రిష్ణ, సీఐ ఇ.శ్రీనివాస్ భార్యాభర్తలను స్టేషన్‌కు తీసుకుని వెళ్లి ప్రసన్నను తమదైన శైలిలో విచారించారు. తానే పాపను హత్య చేసినట్లు ఆమె నోటితోనే చెప్పించారు. ఆ మేరకు భర్త ఇచి్చన ఫిర్యాదుతో హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకుని జైలుకు పంపించారు. తల్లి డ్రామా బట్టబయలైయింది : డీసీపీ ఈ కేసును పోలీసులు ఏడు గంటల్లోనే ఛేదించారు. కూతురును హత్య చేసి, చైన్‌స్నాచర్ చేతిలో హతమైనట్లుగా నమ్మించేందుకు ప్రయతి్నంచిన తల్లి నిజాన్ని ఒప్పుకుందని డీసీపీ పి.సీతారాం విలేకరులకు తెలిపారు. పాప అనారోగ్య సమస్యతో బాధపడుతుండడంతోనే హత్య చేసినట్లు ప్రసన్న అంగీకరిచిందని తెలిపారు. బతికినంత కాలం కూతురితో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పిందన్నారు. పోలీసులను తప్పుదారి పట్టించడం కోసమే చైన్ స్నాచింగ్ డ్రామా చేసిందన్నారు. -
విషాదం: నీటి ట్యాంకు శుభ్రం చేయబోయి.. పైపులో జారిపడ్డ కార్మికుడు
ఖమ్మం మయూరిసెంటర్: భారీ మంచినీటి ట్యాంకును శుభ్రం చేసే యత్నంలో ఓ కార్మికుడు నీటిపైపు లో జారి పడి ప్రాణాలు పోగొట్టుకు న్నాడు. మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. రోజువారీ కార్మికుడితో..: ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని వాటర్ ట్యాంకులను అనుభవం కలిగిన పారిశుధ్య కార్మికులతో పదిహేను రోజులకోసారి శుభ్రం చేయిస్తారు. కార్మికులు తక్కువగా ఉండటంతో మంగళవారం రోజువారీ వేతన కార్మికుడు చిర్రా సందీప్(23)కు పని అప్పగించారు. ఉదయం సందీప్ మరో ఇద్దరితో కలిసి నయాబజార్ కళాశాల పక్కన ఉన్న వాటర్‌ట్యాంక్ ఎక్కాడు. ట్యాంక్ లోపలికి దిగి శుభ్రం చేస్తున్న సందీప్ ప్రమాదవశాత్తు పైపులో జారిపడ్డాడు. మిగతా ఇద్దరు కార్మికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కేఎంసీ రెస్క్యూ టీం వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. సందీప్ జారిపడిన పైపు దిగువన తెరిచి చూడగా అతను కనిపించలేదు. కొంచెం దూరంలో జేసీబీతో మట్టిని తొలగించి పైపును పగులగొట్టడంతో సందీప్ కాళ్లు కనిపించాయి. చదవండి👉🏼 ట్యాంక్‌బండ్‌పై నో పార్కింగ్.. బండి పెట్టారో.. రూ.1000 కట్టాలి! మృతదేహాన్ని బయటికి తీసేసరికి సాయంత్రం 5.20 గంటలు దాటింది. కాగా, నైపుణ్యం లేని కార్మికులతో పనిచేయించడంతో సందీప్ చనిపోయా డంటూ కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి రూ.6 లక్షల పరిహారం, ఇంటి స్థలం, కుటుం బంలో ఒకరికి కేఎంసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని పోలీసులు, రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. చదవండి👉🏻 మాస్టారు పాడె మోసిన మంత్రి ‘ఎర్రబెల్లి’ -
లైంగిక ఆరోపణలు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య
డెహ్రాడూన్: కోడలి ఫిర్యాదుతో తీవ్ర మనస్తాపం చెందిన ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ(59) బలవన్మరణానికి పాల్పడ్డారు. బహుగుణ బుధవారం హల్ద్వాని ప్రాంతంలోని తన నివాసంలో వాటర్ ట్యాంక్ ఎక్కి తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. కాగా తన కూతురిని లైంగిక వేధిస్తున్నట్లు కోడలు మామ రాజేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోడలు ఫిర్యాదు మేరకు బహుగుణపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇది జరిగిన మూడు రోజులకే బహుగుణ ఇలా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. బహుగుణ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఇక తాను బతకలేనని, చనిపోతున్నట్లు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకునేలోపే బహుగుణ ఇంటి ముందు ఉన్న వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కాడు. అయితే లౌడ్ స్పీకర్ ఉపయోగించి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని, కిందికి దిగి రావాలని పోలీసులు మాజీ మంత్రిని వేడుకున్నారు. అయినప్పటికీ పోలీసుల మాటలు వినకుండా ‘నేను ఏం తప్ప చేయలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ పదేపదే గట్టిగా అరిచాడు. ఒకానొక సమయంలో బహుగుణ పోలీసుల విజ్ఞప్తి మేరకు కిందికి దిగివస్తడనుకున్న క్రమంలో అనుహ్యంగా వాటర్ ట్యాంక్‌పై తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు విడిచాడు. చదవండి: హరియాణా మాజీ ముఖ్యమంత్రికి షాక్! నాలుగేళ్ల జైలు శిక్ష పోలీసులు, ఇంటి పొరుగువారు చూస్తుండగానే బహుగుణ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే కోడలు చేసిన ఆరోపణలపై తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అధికారులు తెలిపారు.మరోవైపు తండ్రి ఆత్మహత్యకు ప్రేరేపించారని కొడుకు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడలు, ఆమె తండ్రి అలాగే మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడైన బహుగుణ 2004-5లో ఎన్డీ తివారీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. -
కూకట్‌పల్లిలో దారుణం.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా..
సాక్షి,హైదరాబాద్: కూకట్‌పల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శాతవాహననగర్‌లో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ గోడకూలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆ దారిలో నిర్మాణం జరుగుతున్న నీటి ట్యాంక్ గోడ శిథిలాలు కూలి చిన్నారి మీద పడ్డాయి. ఈ ఘటనలో శరోన్ దీత్య(4)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్లఎదుటే పాప మృతి చెందడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకుంటున్నారు. -
‘వాటర్ ట్యాంకులో శవం’.. కీలక విషయాలు వెలుగులోకి
సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్): రాంనగర్‌లోని రిసాలగడ్డ జలమండలి వాటర్ ఓవర్‌హెడ్ ట్యాంకులో లభ్యమైన కుళ్లిన శవం మిస్టరీ వీడింది. మృతుడు రాంనగర్ అంబేడ్కర్ నగర్ బస్తీకి చెందిన కిషోర్(26)గా పోలీసులు నిర్ధారించారు. పోస్టు మార్టం నిర్వహించి బుధవారం కుటంబసభ్యులకు శవాన్ని అప్పగించారు. పోలీసులు తెల్పిన వివరాల మేరకు అంబేడ్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న పుష్పకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలు. వీరిలో పెద్ద కుమారుడు కిషోర్ గతంలో పెయింటింగ్ పనులు చేసేవాడు. కొద్దికాలంగా ఆటో నడుపుతూ.. గంజాయి, మద్యానికి బానిసగా మారాడు. అక్టోబర్ 19న మద్యం అతిగా తాగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై అక్టోబర్ 23న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అదృశ్యమైన కిషోర్ మంగళవారం చిలకలగూడ జలమండలి వాటర్ ట్యాంకులో శవమై కన్పించాడు. ముషీరాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కిషోర్ స్నేహితుడు మధును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
సస్పెన్స్ వీడిన వాటర్ ట్యాంక్ డెడ్‌బాడీ.. కిషోర్‌గా గుర్తింపు
సాక్షి, ముషీరాబాద్: చిలకలగూడ జలమండలి సబ్ డివిజన్ పరిధిలోని ఎన్ఆర్కె నగర్‌లోని వాటర్ ఓవర్‌హెడ్ ట్యాంకులో డెడ్‌బాడీపై బుధవారం సస్పెన్స్ వీడింది. ట్యాంక్‌లో పడి కుళ్లిన శవాన్ని కిషోర్‌గా.. అతని సోదరి డెడ్‌బాడీని గుర్తించింది. సంఘటనా స్థలంలో చెప్పుల ఆధారంగా గుర్తించారు. స్థానికంగా కిషోర్ పేయింటింగ్ వర్క్స్ చేస్తూ ఉండేవాడని, మద్యానికి బానిసైనట్లు తెలిపారు. 20 రోజుల క్రీతం చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. మరోవైపు కొద్ది రోజులుగా ఈ ట్యాంకు నుంచి సరఫరా అయిన నీటిని తాగిన రిసాలగడ్డ అంబేడ్కర్‌నగర్, హరినగర్, కృష్ణనగర్, శివస్థాన్‌పూర్, బాకారం ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కృష్ణా పైప్‌లైన్ మరమ్మతుల నేపథ్యంలో ఈనెల 8, 9వ తేదీలలో నగరంలోని నీటి సరఫరా నిలిపివేస్తుందని జలమండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లిన వారికి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం 6గంటల సమయంలో డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని బయటకుతీశారు. బయటకు తీసిన మృతదేహం కుళ్లిపోయి ఉంది. వెంటనే ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించిన విషయం తెలిసిందే. -
తిరుపతిలోని శ్రీ కృష్ణా నగర్లో వింత ఘటన
-
తిరుపతిలో వింత ఘటన.. చూసేందుకు ఎగబడుతున్న జనం
సాక్షి, చిత్తూరు: తిరుపతి కార్పొరేషన్ 20వ డివిజన్ ఎం.ఆర్ పల్లి లోని శ్రీకృష్ణా నగర్లో గురువారం సాయంత్రం వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇంట్లోని 25 అడుగుల వాటర్ ట్యాంక్‌ని శుభ్రం చేస్తుండగా అది భూమిలో నుంచి ఒక్కసారిగా పైకి వచ్చింది. దీంతో ఆ వాటర్ ట్యాంక్‌లో ఉన్న మహిళ కేకలు వేయగా.. ఆమె భర్త నిచ్చెన సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చాడు. కాగా ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. 18 సిమెంట్ ఒరలతో ఆ వాటర్ ట్యాంక్‌ని భూమిలోపల నిర్మించినట్టు స్థానికులు చెప్తున్నారు. భూమిపై నుంచి పైకి వచ్చి నిటారుగా నిలిచి ఉన్న వాటర్ ట్యాంక్‌ను చూసేందుకు జనం తరలి వస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా శ్రీకృష్ణానగర్‌లోని ఘటనను ఎస్వీ యూనివర్సిటీ జియాలజి ప్రొఫెసర్స్ బృందం పరిశీలించింది. అనంతరం దీనిపై అసోసియేట్ ప్రొఫెసర్ మధు మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటన రాయలసీమ జిల్లాల్లో ఇదే తొలిసారి అని తెలిపారు. భూమి పొరలలో మార్పు, సంప్ నిర్మాణ సమయంలో నింపిన ఇసుక కాలువ గట్టున ఉన్న ప్రాంతం కావడం, వరద ముంపు.. ఇవన్నీ కలగలపిన అంశాల కారణంగానే సంపు 15అడుగులు పైకి లేచిందని తెలిపారు. అయితే దీని వల్ల భయపడాల్సిన పని లేదని, ఇది భూమిలో జరిగే సహజమైన పరిణామమేనని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: దారుణం: భర్త రాక్షసత్వానికి ఇటీవల అబార్షన్.. ఇప్పుడు చీర కొనుక్కుందని ఏకంగా.. -
బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్చల్
సాక్షి, సైదాబాద్: అపార్ట్మెంట్లో బోర్‌నీటి వినియోగ వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండే మహిళ తమకు నీరు అందకుండా ఇబ్బందులు సృష్టిస్తోందంటూ పెంట్‌హౌస్‌లో నివసించే దంపతులు అపార్ట్మెంట్ వాటర్‌ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటామని హల్చల్ చేశారు. వివరాలు..సైదాబాద్ ఎల్ఐసీ కాలనీలోని రక్షిత అపార్ట్మెంట్లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించే మహిళకు మిగిలిన పది కుటుంబాలకు కొంతకాలంగా బోర్‌వాటర్ వినియోగించుకోవడంపై వివాదం నడుస్తోంది. ఇరువర్గాలు గతంలో ఒకరిపై ఒకరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మూడురోజుల క్రితం బోర్‌మోటర్‌ను గ్రౌండ్‌ఫ్లోర్‌లోని మహిళ తొలిగించింది. దీంతో అపార్ట్మెంట్లో వారికి బోర్‌నీటి సరఫరా లేక ఇబ్బందులు తలెత్తాయి. స్థానిక నేతలను సదరు మహిళ, అపార్టుమెంట్ వాసుల మధ్య రాజీకి యతి్నంచినా ఫలితం లేదు. అపార్ట్మెంట్లో బోర్‌నీటి కోసం తరచూ గొడవలు జరగటంతో పెంట్‌హౌస్‌లో నివసించే ప్రేమ్ దంపతులు మనస్తాపానికి గురయ్యారు. గురువారం అపార్ట్మెంట్ 3వ అంతస్తులోని పెంట్‌హౌస్‌పై ఉన్న వాట ర్‌ట్యాంక్‌పైకి నిచ్చెన సహాయంతో ఎక్కారు. అక్కడి నుంచి దూకుతామని బెదిరించారు. సైదాబా ద్ పోలీ సులు వచ్చి వారికి సర్దిచెప్పి కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించే మహిళ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని ప్రేమ్ దంపతులు తెలిపారు. -
నీటి తొట్టిలో 12 రోజుల పసికందు.. వీడిన మిస్టరీ.. తల్లే హంతకురాలు
ఏలూరు టౌన్: మాతృత్వం మంటకలిసింది. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నతల్లే కసాయిలా మారింది. అభం శుభం తెలియని 12 రోజుల పసికందును కనికరం లేకుండా నీళ్ల తొట్టిలో పడేసి హతమార్చింది. ఆపై ఏమీ తెలీదని నాటకాలాడింది. పోలీసులు తమదైన శైలీలో విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. బిడ్డను తనే నీటి తొట్టిలో పడేసినట్లు ఒప్పుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లికి చెందిన కలపాల నాగేశ్వరరావు కుమారుడు హరికృష్ణకు ఆరేళ్ల క్రితం చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహమైంది. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తుంటారు. సీతామహాలక్ష్మి ఏలూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో జూలై 30న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. అయితే బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో ఈనెల 8న ఏలూరు శంకరమఠం వీధిలోని సాయి చిల్ట్రన్ హాస్పిటల్లో చేర్పించారు. చిన్నారికి గొంతులో ఇన్ఫెక్షన్ ఉండడంతో ఈఎన్టీ వైద్యునితో చికిత్స చేయించారు. పరిస్థితి మెరుగుపడటంతో బుధవారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. హాస్పిటల్లో సీతామహాలక్ష్మి, ఆమె తల్లి, భర్త హరికృష్ణ ఉన్నారు. హరికృష్ణ తండ్రి నాగేశ్వరరావు రేమల్లి నుంచి బస్సులో ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో దిగి కుమారుడికి ఫోన్ చేసి చెప్పగా బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హరికృష్ణ వెళ్లి తండ్రిని హాస్పిటల్‌కు తీసుకువచ్చాడు. అయితే అప్పటికే పసిబిడ్డ కనిపించటంలేదని సీతామహాలక్ష్మి భర్తకు చెప్పడంతో ఆందోళనకు గురైన హరికృష్ణ, అతని తండ్రి గాలించగా హాస్పిటల్ ఆవరణలోని నీటి తొట్టిలో పసికందు మృతదేహం కనిపించింది. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వటంతో డీఎస్పీ డాక్టర్ దిలీప్‌కిరణ్ పర్యవేక్షణలో టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్, ఎస్ఐ నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో హరికృష్ణ తండ్రిని తీసుకురావడానికి వెళ్లిన సమయంలో తాను బాత్రూమ్కి వెళ్లానని సీతామహాలక్ష్మి చెప్పగా, ఆమె తల్లి తాను హాస్పిటల్ పైకి వెళ్లానని చెప్పారు. అయితే, పోలీసులకు తల్లి సీతామహాలక్ష్మీపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా, బిడ్డను తనే నీటి తొట్టిలో పడేశానని తల్లి అంగీకరించింది. దీంతో ఆమె పోలీసులు అదుపులోకి తీసుకుని కన్నబిడ్డను ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. -
నీటి తొట్టిలో 12 రోజుల పసికందు మృతదేహం, అసలు ఏం జరిగింది..?
ఏలూరు టౌన్: ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో చికిత్స కోసం వచ్చి, అమ్మ ఒడిలో ఉండాల్సిన ఓ పసికందు.. అదే ఆస్పత్రి ఆవరణలో ఓ నీళ్ల తొట్టెలో అనుమానాస్పద స్థితిలో నిర్జీవంగా పడి ఉంది. ఏలూరు నగరంలోని సాయి చిల్డ్రన్ హాస్పిటల్లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లికి చెందిన కలపాల నాగేశ్వరరావు కుమారుడు హరికృష్ణకు ఆరేళ్ల క్రితం చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహమైంది. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తుంటారు. సీతామహాలక్ష్మి ఏలూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో జూలై 30న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. అయితే బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో ఈనెల 8న ఏలూరు శంకరమఠం వీధిలోని సాయి చిల్ట్రన్ హాస్పిటల్లో చేర్పించారు. చిన్నారికి గొంతులో ఇన్ఫెక్షన్ ఉండడంతో ఈఎన్టీ వైద్యునితో చికిత్స చేయించారు. పరిస్థితి మెరుగుపడటంతో బుధవారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. హాస్పిటల్లో సీతామహాలక్ష్మి, ఆమె తల్లి, భర్త హరికృష్ణ ఉన్నారు. హరికృష్ణ తండ్రి నాగేశ్వరరావు రేమల్లి నుంచి బస్సులో ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో దిగి కుమారుడికి ఫోన్ చేసి చెప్పగా బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హరికృష్ణ వెళ్లి తండ్రిని హాస్పిటల్‌కు తీసుకువచ్చాడు. అయితే అప్పటికే పసిబిడ్డ కనిపించటంలేదని సీతామహాలక్ష్మి భర్తకు చెప్పడంతో ఆందోళనకు గురైన హరికృష్ణ, అతని తండ్రి గాలించగా హాస్పిటల్ ఆవరణలోని నీటితొట్టెలో పసికందు మృతదేహం కనిపించింది. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వటంతో డీఎస్పీ డాక్టర్ దిలీప్‌కిరణ్ పర్యవేక్షణలో టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్, ఎస్ఐ నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో హరికృష్ణ తండ్రిని తీసుకురావడానికి వెళ్లిన సమయంలో తాను బాత్రూమ్కి వెళ్లానని సీతామహాలక్ష్మి చెప్పగా, ఆమె తల్లి తాను హాస్పిటల్ పైకి వెళ్లానని చెప్పినట్లు తెలిసింది. -
పెద్దల ఎదుట కౌన్సెలింగ్.. కన్న కొడుకును దగ్గరకు రానివ్వలేదని..
సాక్షి, సంగెం(వరంగల్): భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి హల్చల్ చేసిన సంఘటన సంగెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తీగరాజుపల్లికి చెందిన కర్జుగుత్త రమేష్, కవిత గతంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. హైదరాబాద్‌లో ఉంటున్న వీరి మధ్య కొంతకాలంగా గొడవలు అవుతున్నాయి. దీంతో కవిత చిన్నకుమారుడితో కలిసి వేరొక చోట ఉంటుంది. భార్య కాపురానికి రావడం లేదని రమేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం పెద్ద మనుషుల సమక్షంలో కలిసి ఉండాలని పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనికి భార్య కవిత కోర్టు నుంచి విడాకులు తీసుకుంటానని చెప్పింది. చిన్న కుమారుడిని సైతం తండ్రి రమేష్ దగ్గరకు రానివ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన రమేష్ మంగళవారం రాత్రి సంగెం వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా ప్రొబెషనరీ ఎస్సై ప్రియదర్శిని, సిబ్బందితో కలిసి రమేష్‌కు నచ్చచెప్పి కిందకు దింపారు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. -
16 రోజుల పసికందును వాటర్ ట్యాంకులోపడేసి..
నెల్లూరు (క్రైమ్): నిండా పదహారు రోజులు కూడా నిండని పసికందును పొట్టనబెట్టుకున్నారు. వాటర్ ట్యాంకులోపడేసి చిన్నారి ఉసురు తీశారు. నెల్లూరు రంగనాయకులపేట గొల్లవీధిలో శుక్రవారం జరిగిన ఈ అమానుష ఘటన స్థానికులను కలచివేసింది. పోలీసుల కథనం.. విద్యావతికి 2018లో కొడవలూరు పెయ్యళపాలేనికి చెందిన వెంకటేశ్వర్లుతో వివాహమైంది. వారికి రెండేళ్ల పాప అద్వికత ఉంది. గత నెల 24న విద్యావతి మరో పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి విద్యావతి ఇద్దరు పిల్లలతో కలిసి గొల్లవీధిలోని తల్లి వద్దే ఉంటోంది. శుక్రవారం చిన్నారికి విద్యావతి స్నానం చేయించి మొదటి అంతస్తులోని ఊయల్లో పడుకోబెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటికి మెలకువ వచ్చి ఊయల్లో చూడగా పాప లేదు. ఇల్లంతా వెదికినా కనిపించలేదు. కుటుంబ సభ్యులు, స్థానికులు చుట్టుపక్కల అంతా గాలించినా ఫలితం లేకపోయింది. విద్యావతి నివాసముంటున్న పక్క ఇంట్లోనే ఆమె చిన్నమ్మ జ్యోతి ఉంటోంది. ఆమె ఇంటి మిద్దెపై ఉన్న వాటర్ ట్యాంకులో పాప మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆ చిన్నారి మృతదేహాన్ని చూసిన ఆ తల్లి, అమ్మమ్మలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. సంతపేట ఇన్స్పెక్టర్ అన్వర్‌బాషా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జ్యోతే ఈ దురాగతానికి ఒడిగట్టి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ విద్యావతి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లలు పుట్టలేదనే అక్కసుతోనే చిన్నారి హత్య
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్:మండలంలోని అనాజ్‌పూర్ గ్రామంలో ఇంట్లోని నీటి ట్యాంకులో రెండు నెలల చిన్నారి మృతదేహం లభ్యమవడం స్థానికంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా చిన్నారి అనుమానాస్పద మృతి వెనుక ఉన్న మిస్టరీ వీడింది. ఈ ఘటనను పోలీసులు హత్యకేసుగా తేల్చారు. తమకు పిల్లలు పుట్టలేదనే అక్కసుతోనే చిన్నారి మేనమామ, అత్త ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికే వారిని అరెస్టు చేసిన పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు. విషయంలోకి వెళితే.. అనాజ్‌పూర్‌కు చెందిన మంచాల రంగయ్య కూతురు లతకు ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లి నివాసి దూసరి తిరుమలేశ్‌తో పన్నెండేళ్ల కింద పెళ్లయింది. అప్పటినుంచి దంపతులకు సంతానం కలగలేదు. రెండు నెలల కిందటే వారికి బాలుడు జన్మించగా, ఉమామహేశ్వర్ అని పేరు పెట్టుకున్నారు. బాబు పుట్టినప్పటి నుంచి అనాజ్‌పూర్‌లోని పుట్టింట్లో తమ్ముడు బాల్‌రాజ్, మరదలు శ్వేతతో కలసి లత ఉంటోంది. తిరుమలేశ్ తరచూ వచ్చి భార్య, కొడుకును చూసి వెళ్తుండే వాడు. అయితే గురువారం రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత లత తన బాబును పక్కనే పడుకోపెట్టుకుని నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమె లేచిచూడగా కుమారుడు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురై విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. చివరకు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌లో బాలుడు విగతజీవిగా తేలాడు. చదవండి: దారుణం: రాత్రి తల్లి చెంత.. తెల్లారేసరికి నీళ్ల ట్యాంకులో -
దారుణం: రాత్రి తల్లి చెంత.. తెల్లారేసరికి నీళ్ల ట్యాంకులో
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: వివాహమైన పన్నెండేళ్ల తర్వాత ఆ దంపతులకు బాబు పుట్టాడు. ఆ సంతోషం వారికి కొద్ది రోజులు కూడా నిలవలేదు. రాత్రి తల్లి చెంత నిద్రించిన రెండు నెలల బాలుడు తెల్లారేసరికి వాటర్ ట్యాంకులో విగతజీవిగా కనిపించాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అనాజ్‌పూర్‌కు చెందిన మంచాల రంగయ్య కూతురు లతకు ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లి నివాసి దూసరి తిరుమలేశ్‌తో పన్నెండేళ్ల కింద పెళ్లయింది. అప్పటినుంచి దంపతులకు సంతానం కలగలేదు. రెండు నెలల కిందటే వారికి బాలుడు జన్మించగా, ఉమామహేశ్వర్ అని పేరు పెట్టుకున్నారు. బాబు పుట్టినప్పటి నుంచి అనాజ్‌పూర్‌లోని పుట్టింట్లో తమ్ముడు బాల్‌రాజ్, మరదలు శ్వేతతో కలసి లత ఉంటోంది. తిరుమలేశ్ తరచూ వచ్చి భార్య, కొడుకును చూసి వెళ్తుండే వాడు. అయితే గురువారం రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత లత తన బాబును పక్కనే పడుకోపెట్టుకుని నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమె లేచిచూడగా కుమారుడు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురై విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. చివరకు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌లో బాలుడు విగతజీవిగా తేలాడు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ స్వామి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో వివరాలు సేకరించారు. కుటుంబీకులే చంపారా? పసికందును కుటుంబీకులే చంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి మేనమామ బాల్‌రాజ్, అతడి భార్య శ్వేతను అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి బయటి వ్యక్తులు వచ్చే అవకాశం లేదని, వారిద్దరే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
చిన్నారి అనుమానాస్పద మృతి; నీటిట్యాంకులో మృతదేహం
సాక్షి, రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నిద్రించిన రెండునెలల చిన్నారి తెల్లవారే సరికి ఇంటిపై నీటి ట్యాంకులో శవమై కనిపించాడు. రాత్రి తమ వద్దే నిద్రించిన చిన్నారి తెల్లవారుజామున 2 గంటల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి ఆచూకీ కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఇంటిని గాలించారు. చివరకు ఇంటిపైకప్పుపై ఉన్న నీటి ట్యాంకును పరిశీలించగా చిన్నారి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసిన పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదవశాత్తు జరిగిందా.? లేక హత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా చిన్నారి హత్యకేసుతో మేనమామ, అత్తకు సంబంధమున్నట్లు ఆరోపణలు రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. -
ఎరక్కపోయి ఇరుక్కుపోయిన చిరుత: నీళ్లు లేని ట్యాంక్‌లో
బనశంకరి: వేట కోసం వచ్చిన చిరుత నీళ్లులేని ట్యాంక్‌లో పడిపోయిన ఘటన ఉడుపి జిల్లా కుందాపుర తాలూకాలో శుక్రవారం చోటుచేసుకుంది. కుందాపుర కొడ్లాడిలోకి శుక్రవారం ఉదయం చొరబడిన చిరుత చంద్రశెట్టి అనే వ్యక్తి ఇంటి సమీపంలో కుక్కను వెంబడిస్తూ నీళ్లు లేని ట్యాంక్‌లో పడిపోయింది. అటవీశాఖాధికారి ప్రభాకర్ బృందం చేరుకొని చిరుతను పైకి లాగి బోనులో వేసి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. చిరుతకు 5ఏళ్ల వయస్సు ఉంటుందని అటవీ సిబ్బంది తెలిపారు. చదవండి: మామిడి తోట రక్షణ కంచెకు చిరుత బలి -
వైరల్: కొంచెం ఉంటే వారి ప్రాణాలు గాల్లో కలిసేవి..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని డాటియా జిల్లాలో పీతాంబర పట్టణంలో వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పేకమేడలా కూలి పోయింది. పెళపెళ మంటూ పెద్ద శబ్ధంతో నడిరోడ్డుపై ఆ ట్యాంక్ కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డు మీదున్న నడుస్తున్న జనాలు రెప్పపాటులో పక్కకు తప్పుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ ఈ పురాతన ట్యాంక్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నెట్టింట ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోని నెటిజన్లు తెగ చూస్తున్నారు एमपी के दतिया में पीतांबरा पीठ के सामने बनी बारादरी ट्रैक्टर की टक्कर में ज़मीन पर आ गिरी, मलबे के चपेट में आने से लोग बाल बाल बचे. ट्रैक्टर अवैध बालू ढो रहा था pic.twitter.com/o8kZfLhm2H — Ganesh Thakur (@7_ganesh) May 25, 2021 -
కోతుల కోసం విజయ్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండరు..
చెన్నై : కరోనా సెకండ్ వేవ్ కారణంగా సామాన్య ప్రజలే కాదు..జంతువులు కూడా అల్లాడిపోతున్నాయి. సరైన ఆహారం అందక విలవిల్లాడిపోతున్నాయి. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు జంతువులు, పక్షుల సంరక్షణకు జాగ్రత్తలు వహించాలని సోషల్ మీడియా వేదికగా విఙ్ఞప్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు చేసిన ఓ మంచి పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..దళపతి విజయ్ విజయ్ అభిమాన సంఘం మక్కల్ ఇయక్కం అనే పేరుతో తమిళనాడులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పుదుకోట్టై ప్రాంతంలో కోతుల కోసం ఓ వాటర్ ట్యాంక్ సహా అరటిపళ్లను ఏర్పాటు చేశారు. పుదుకోట్టై హనుమాన్ టెంపుల్‌కి సమీపంలో దాదాపు 300 కోతులు ఉన్నాయని, అయితే లాక్డౌన్ కారణంగా భక్తులు లేక కోతులకు ఆహారం అందడం లేదని సమాచారం. అంతేకాకుండా ఇదే ప్రాంతానికి దగ్గర్లో ఓ అటవీ ప్రాంతం ఉందని, అయితే వేసవి కావడంతో కోతులకు నీటి సదుపాయం లేక అల్లాడిపోతున్నాయని, అందుకే కోతుల కోసం ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. చదవండి : కరోనా విలయ తాండవం.. తళపతి విజయ్ ఔదార్యం కొంతమందిని కోల్పోయా: సోనూసూద్ భావోద్వేగం -
మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో చిక్కుకున్న పెయింటర్లు
సాక్షి, నిర్మల్: జిల్లాలోని కడెం మండలం అంబారిపేట్ గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో ఐదుగురు పెయింటర్లు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామస్తుల సాయంతో ముందుగా ఇద్దరు పెయింటర్లను ట్యాంక్ నుంచి బయటకు తీశారు. మరో ముగ్గురు కూడా ఉండటంతో తీవ్రంగా శ్రమించి వారిని కూడా సురక్షితంగా పోలీసులు బయటకు తీశారు. ట్యాంక్ నుంచి బయటకు వచ్చిన పెయిటర్లు స్పృహ కోల్పోవడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు పెయిటర్లు శనివారం గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో పెయింటింగ్ వేయడానికి అందులోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే వారు పెయింట్ వేస్తూ అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. చదవండి: అలిపిరి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం -
అప్పు తిరిగివ్వాలని వాటర్ ట్యాంక్ ఎక్కి...
సాక్షి, కరీంనగర్ : అప్పు తీసుకున్న మహిళ డబ్బులు వెనక్కివాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కారు ఏడుగురు వ్యక్తులు. ఈ సంఘటన కరీంనగర్లో సోమవారం చోటుచేసుంది. వివరాల్లోకి వెళితే.. అంబేద్కర్ నగర్లో నివాసం ఉండే ఓ మహిళ స్థానికంగా ఉండే పలువురి వద్ద అప్పు క్రింద డబ్బులు తీసుకుని ఇవ్వక పోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో అప్పు తీసుకున్న మహిళ త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించి బాధితులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో, తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించారు. అప్పుగా తీసుకున్న డబ్బులు వెంటనే ఇప్పించాలని లేకుంటే ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. స్థానిక కార్పోరేటర్తో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. డబ్బులు ఇప్పించే వరకు దిగమని బాధితులు ససేమిరా అన్నారు. చివరకు ఎస్ఐ ట్యాంక్ పైకి ఎక్కి డబ్బులు ఇప్పించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు కిందికి దిగారు. దాదాపు రెండు గంటలపాటు రాత్రిపూట బాధితులు ట్యాంక్ పై హంగామా చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. -
కలకలం: వాటర్ ట్యాంక్‌లో మృతదేహం
సాక్షి, నంద్యాల: ఓ ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఆర్టీసీ డ్రైవర్ అల్లాబకాష్ కొంత కాలం క్రితం ఇల్లు కొనుగోలు చేసి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. మూడు రోజులుగా ఇంటిపైనున్న ట్యాంకు నుంచి నీరు సరిగా రాకపోవడంతో ఉదయం ఫ్లంబర్‌ను పిలిచి విషయం చెప్పాడు. అతడు మరమ్మతుల నిమిత్తం ట్యాంకు మూత తెరిచి చూడగా మృతదేహం కనిపించింది. (స్నేహితుని భార్యపై లైంగిక దాడి..) సమాచారం పోలీసులకు చేరవేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న యువకుడు నాలుగు రోజుల క్రితం మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా, ఎవరైనా హత్య చేసి ట్యాంక్‌లో పడేశారా అనేది విచారణలో తేలనుందని సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. (గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం) -
శ్రీమతి కోరిక : టెర్రస్ ఎక్కిన స్కార్పియో
సాక్షి,ముంబై: పాత వస్తువులను పారేయడమంటే చాలా మందికి చెప్పలేని బాధ. దాన్ని ప్రేమగా మరోదాని కోసం వినియోగించడం తరచూ చూస్తూనే ఉంటాం. అందులోనూ ఫస్ట్ బైక్, మొదటి కారు అంటే మరీ పిచ్చి. ఒక్క పట్టాన వదిలిపెట్టాలనిపించదు. అలాంటివస్తువులను మరింత ఇన్నోవేటివ్‌గా వాడుతూ వాటిమీద తమకున్న ప్రేమనుచాటుకుంటారు చాలామంది. బిహార్‌కు చెందిన ఇంతసార్ ఆలం ఆ కోవకే చెందుతారు. అయితే ఆలం ఇంకొంచెం క్రియేటివ్‌గా ఆలోచించారు. తనకెంతో ఇష్టమైన స్కార్పియో కారుపై ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నారు. అందుకే మహీంద్రా గ్రూప్ అధిపతిని ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే ఆలం తన మొదటి కారు స్కార్పియో ఆకారలో తన ఇంటి టెర్రస్ మీద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. అంతేకాదు దానికి ఒక నెంబరు ప్లేట్ కూడా జతచేశారు. మరో విషయం ఏమిటంటే స్కార్పియో వాటర్ ట్యాంక్ స్థాపించడం వెనుకఉన్న ఆలోచన ఇంతసార్ భార్యదట. ఆమె ఆగ్రాలో ఇలాంటిదే చూసి, అలాంటిదే కావాలని తన భర్తకు చెప్పిందట. దీంతో తన ఫస్ట్ లవ్.. ఇటు భార్య కోరిక ఎలా కాదనగలడు. అందుకే సుమారు రూ.2.5 లక్షలు ఖర్చు చేసి స్కార్పియో వాటర్ ట్యాంక్ అలా టెర్రస్ ఎక్కించేశారన్నమాట అదీ సంగతి. ఈ స్కార్పియో వాటర్ ట్యాంకు ఇపుడు నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనిపై ట్విటర్ ద్వారా స్పందించిన ఆనంద్ మహీంద్ర తమ స్కార్పియో అంత ఎత్తుకు చేరిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. స్కార్పియో కారు పట్ల ఆలం అభిమానానికి, ప్రేమకు తన సలామ్‌లు అంటూ ప్రశంసలు కురిపించారు. -
భార్య మాట వినటం లేదని భర్త హల్చల్
నిజామాబాద్ : భార్య తన మాటలు లెక్క చేయటం లేదని భర్త తీవ్ర మనస్థాపం చెంది అదే కాలనీలోని వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశారు. ధర్పల్లి సీఐ ప్రసాద్, ఎస్సై పాండేరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్పల్లి గోసంగి కాలనీకి చెందిన చిత్తడి కాశీరాం, సాయమ్మ దంపతులు తరుచూ గొడవ పడేవారు. చిన్న గొడవ పెద్దదిగా మారి భర్త కాశీరాం మంగళవారం మద్యం సేవించి భార్య తన మాట వినటం లేదని ఇంట్లోనే చనిపోతానని గొడవ పెట్టుకున్నాడు. అదే కోపంతో కాశీరాం బయటకు వచ్చి అక్కడే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి చనిపోతానని బెదిరించాడు. ట్యాంక్ దిగిరా నీ మాట వింటాను అని భార్య చెప్పిన భర్త వినలేదు. ( మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్) ట్యాంక్‌పైనే తిరుగుతూ చనిపోతానని బెదరించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి సీఐ ప్రసాద్, ఎస్సై పాండేరావు చేరుకున్నారు. మీ భార్య నీ మాట వినేలా చూస్తామని పోలీసులు చెప్పిన అతను ట్యాంక్ దిగలేడు. ఫైర్ ఇంజిన్ తెప్పించి పోలీసులు, యువకులు ట్యాంక్ ఎక్కి కాశీరాంను కిందకు దించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు ఆత్మహత్యయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
శభాష్ హారిక
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన హారిక ఇరంకి ‘అనర్ఘ్య’ పేరుతో ఎన్జీఓను రన్ చేస్తుంది. శివరాంపల్లి స్కూల్లో తాగేందుకు మంచినీరు వెసులుబాటు లేకపోవడంతో..ఆ విషయాన్ని అక్కడి విద్యార్థులు హారిక దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన హారిక అక్కడి ప్రధానోపాధ్యాయుడిని నిలిదీసింది. స్పందన లేకపోవడంతో మండల విద్యాశాఖా అధికారిని అడగ్గా..నిధులు లేవన్నాడు. స్కూల్‌కి మంచినీళ్లు సౌకర్యాన్ని కల్పించమని సంబంధిత శాఖ అధికారులను కోరగా..వాళ్లు కొత్త కనెక్షన్ కోసం రూ.78 వేలు అడిగారు. ఏం చేయోలో తెలియక అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్‌రావును హారిక కలిసి విషయాన్ని వివరించింది. ఆ క్షణాన హారిక ఫోన్ నుంచి కాల్ చేసి..‘నేను మంత్రి హరీష్‌రావును మాట్లాడుతున్నా. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఆ స్కూల్‌కి 24 గంటల్లో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి’ అంటూ హరీష్‌రావు ఫోన్లో అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలికంగా నీటి సమస్యతో అల్లాడిన ఆ స్కూల్‌కు 24 గంటల్లో మంచినీరు అందింది. ఇది ఆనందాన్నిచ్చిందని హారిక వివరించింది. 8 మంది బాలికలకు రక్షణ సేవా కార్యక్రమాలే కాకుండా కొన్ని సాహసోపేత పనులకూ హారిక ముందుంది. ఆటోడ్రైవర్ల అకృత్యాలను ధైర్యంగా బాహ్య ప్రపంచానికి తెలియచేసి శభాష్ అన్పించుకుంది. దాని గురించి వివరిస్తూ ఆమె...‘శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో కొందరు ఆటోవాళ్లు స్కూల్ పిల్లల్ని తీసికెళ్లి, తీసుకురావడం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలికలకు వాళ్లకు మధ్య చనువు ఏర్పడింది. ఒకరోజు ఎనిమిదిమంది అమ్మాయిలు ఇంటికి రాకపోవడంతో..వాళ్ల తల్లులు రాత్రి 11.40 గంటల సమంయలో నాకు ఫోన్ చేశారు. నేను స్కూల్ టీచర్లకు ఫోన్ చేసి అడిగితే వాళ్లు ఈరోజు స్కూల్‌కి రాలేదంటూ సమాధానం ఇచ్చారు. ఆ తరువాత రోజు ఇంటికి వచ్చిన వీళ్లతో నేను నాలుగు రోజుల పాటు ఫ్రెండ్‌గా మాట్లాడి ఎక్కడకు వెళ్లారని అడగ్గా..కొందరు ఆటోడ్రైవర్లు తమను తీసికెళ్లి అత్యాచారం చేశారంటూ బదులిచ్చారు. ఈ విషయంపై అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారందర్నీ అదుపులోకి తీసుకుని విచారించి కొందరిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపడం జరిగింది. అప్పటి నుంచే నాకు వేధింపులు ఎక్కువ అయ్యాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా.’ అని చెబుతూ ముగించింది. -
తుంగభద్రపై కర్ణాటక కొత్త ఎత్తులు!
సాక్షి, హైదరాబాద్: తుంగభద్రనదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి కర్ణాటక ఎత్తులు వేస్తోంది. డ్యామ్‌లో పూడిక వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకుగాను కొత్త రిజర్వాయర్ నిర్మాణానికి సిద్ధమైంది. 31 టీఎంసీల సామర్థ్యంతో తుంగభద్రకు ఎగువన నవాలి ప్రాంతంలో నిర్మించే కొత్త రిజర్వాయర్‌పై కర్ణాటక తుంగభద్ర బోర్డు అనుమతి కోరింది. దీనిపై అభిప్రాయాలు చెప్పాలని తెలంగాణ, ఏపీలను బోర్డు కోరగా, ఆర్డీఎస్ ఎడమ కాల్వ కింద నీటి అవసరాలకు ఈ నిర్మాణం ఆటంకపరుస్తుందని తెలంగాణ స్పష్టం చేసింది. 52 టీఎంసీల కోసం కర్ణాటక ప్రతిపాదన తుంగభద్ర డ్యామ్‌లో గతంలో ఉన్న నీటినిల్వ సామర్థ్యంతో పోలిస్తే ప్రస్తుతం గణనీయంగా నిల్వ తగ్గింది. 1953లో డ్యామ్ ప్రారంభం సమయంలో 132 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 100 టీఎంసీలకు పడిపోయింది. ఈ నష్టాన్ని పూడ్చేలా దాదాపు 31 టీఎంసీల సామర్థ్యంలో నవాలి వద్ద రిజర్వాయర్ నిర్మించాలని కర్ణాటక నిర్ణయించింది. తుంగభద్ర కింద 212 టీఎంసీల నీటిని వినియోగించేకునేలా గత ట్రిబ్యునళ్లు అనుమతించినా, పూడికతో 172 టీఎంసీల నీటినే వినియోగిస్తున్నామని, కొత్త రిజర్వాయర్‌తో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుందని గత డిసెంబర్లో హైదరాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో కర్ణాటక తెలిపింది. భారీవరద ఉన్నప్పుడు తుంగభద్ర నది నుంచి వరద కాల్వ తవ్వి, రోజుకు 17,900 క్యూసెక్కుల నీటిని కొత్త రిజర్వాయర్‌కు తరలిస్తామని, దీనికి అనుబంధంగానే శివపుర, విఠలపుర చెరువుల సామర్థ్యాన్ని పెంచుతామని, ఈ 3 రిజర్వాయర్ల కింద మొత్తంగా 52 టీఎంసీల నీటిని వినియోగిస్తామని ప్రతిపాదించింది. దిగువకు నష్టమే... నిర్మాణం చేపట్టబోయే రిజర్వాయర్ డీపీఆర్‌లు సమర్పిస్తే వాటిని పరిశీలించి అభిప్రాయాలు చెబుతామని తెలుగు రాష్ట్రాలు బోర్డుకు తెలిపాయి. అయినా ఇంతవరకు కర్ణాటక డీపీఆర్‌లు ఇవ్వలేదు. శనివారం బెంగళూరులో జరిగిన సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సమర్థంగా రాష్ట్ర వాదనలను వినిపించినట్లు తెలిసింది. డీపీఆర్‌లతోపాటే ఎగువన తుంగ, భద్ర నదుల్లో కర్ణాటక చేస్తున్న నీటి వినియోగం, మరిన్ని ఎత్తిపోతల ద్వారా తీసుకుంటున్న నీటిలెక్కలను తమ ముం దుంచాలని స్పష్టం చేశారు. ఆర్డీఎస్ ఎడమ కాల్వ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల మేర కేటాయింపులున్నా, 5 టీఎంసీలకు మించి నీరు రావట్లేదని బోర్డు దృష్టికి తెచ్చినట్లు సమాచారం. దీంతోపాటే ట్రిబ్యునల్ కేటాయింపులకు విఘా తం కలుగుతుందని బోర్డు దృష్టికి తెచ్చారు. తుంగభద్రసహా కొత్త బ్యారేజీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిర్ణీత వాటాలు వచ్చేలా చూస్తామని కచ్చితమైన హామీ ఇస్తేనే బ్యారేజీ నిర్మాణానికి సమ్మతి స్తామన్నారు. డీపీఆర్‌లు ఇచ్చాకే దీనిపై అభిప్రా యం చెబుతామని ఏపీ చెప్పినట్లుతెలిసింది. -
గుడికోసం ట్యాంక్ ఎక్కి నిరసన
సాక్షి, భిక్కనూరు (కామారెడ్డి): తాతముత్తాతల కాలంనుంచి పెద్దమల్లారెడ్డి చౌరస్తాలో ఉన్న హనుమాన్ దేవాలయం తమ గ్రామానిదేనని, ఇప్పుడు కొత్తగా బస్వాపూర్‌కు చెందిన కొందరు ఆలయంపై పెత్తనం చేయాలని చూస్తున్నారని శ్రీ సిద్ధరామేశ్వరనగర్‌కు చెందిన పలువురు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. గుడి తమ గ్రామానిదేనని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గ్రామంలోని వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి నిరసన తెలిపారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఐదుగురు యువకులు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి తహసీల్దార్, ఎంపీడీవోలు ఆలయం శ్రీ సిద్దరామేశ్వరనగర్‌కే చెందుతుందని లిఖిత పూర్వకంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీవో అనంత్‌రావు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు తహసీల్దార్, ఎంపీడీవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన పుట్టకొక్కుల వెంకటేశం, బోయిని లక్ష్మవ్వలు 16 గుంటల భూమిని శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చారని, ఆ స్థలం శ్రీ సిద్ధరామేశ్వరనగర్ గ్రామానికి చెందిందే అని పేర్కొన్నారు. ఇటీవల భూ రికార్డులను బస్వాపూర్‌కు చెందిన కొందరు తారుమారు చేయించారని ఆరోపించారు. దేవాలయ భూమి, దేవాలయ ప్రాంగణం, శ్రీ సిద్ధరామేశ్వనగర్‌కు చెందిందేనని లిఖితపూర్వకంగా రాసివ్వాలని డిమాండ్ చేశారు. నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగింది. తహసీల్దార్, ఎంపీడీవోలు ఉన్నతాధికారులతో మాట్లాడి హనుమాన్ ఆలయం శ్రీ సిద్ధరామేశ్వరనగర్‌కే చెందేవిధంగా చూస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ సరిహద్దులను కూడా శ్రీ సిద్ధరామేశ్వరనగర్లో భాగంగానే చూపిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. -
నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురి మృతి
సాక్షి, బెంగళూరు : నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తర కర్ణాటకలోని జోగప్ప లేఅవుట్లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ...కూలీలు నిర్మాణపు పనుల్లో ఉండగా వాటర్ ట్యాంక్ ఫిల్లర్ హఠాత్తుగా కూలినట్లు తెలిపారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని, వారిని సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సమాచారం అందుకున్న ఎన్డీఆర్టీ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. కర్ణాటక మంత్రి కృష్ణ బైరీ గౌడ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. -
ప్రేమించినవాడితో పెళ్లి జరిపించాలని..
పెద్దపల్లి: ‘మూడేళ్లుగా ప్రేమించుకున్నాం..ఆతడిని నమ్ముకుని సర్వం అర్పించా..ఇప్పుడు పెళ్లి చేసుకోనని మొండికేస్తున్న యువకుడితోనే పెళ్లి జరిపించాలని దామ అనూష అనే యువతి గురువారం పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. అప్పన్నపేట గ్రామానికి చెందిన దామ అనూష(20) అదే గ్రామానికి చెందిన అనవేని శ్రీకాంత్(24) మూడేళ్లుగా ప్రేమించుకుటున్నారు. కొద్దిరోజులుగా వేరే అమ్మాయితో పెళ్లి జరిపించేందుకు శ్రీకాంత్ తల్లిదండ్రులు ప్రయత్నాలు ప్రారంభించడంతో విషయం తెలుసుకున్న అనూష గురువారం వాటర్ ట్యాంకు ఎక్కింది. దీంతో స్థానికులు పెద్దపల్లి సీఐ నరేందర్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న సీఐ, అనూషతో మాట్లాడి సముదాయించి కిందకు దింపారు. గ్రామస్తులు అనూష, శ్రీకాంత్‌ల పెళ్లి జరిపించాలని పట్టుబట్టారు. చట్టంప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ హామీఇచ్చారు. మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించి జంటను కలపాలని యువతికి న్యాయం చేయాలని అనూష బంధువులు సీఐని వేడుకున్నారు. -
పుత్రశోకాన్ని మిగిల్చిన ఈత సరదా..
సాక్షి, డోర్నకల్(వరంగల్ ): తల్లిదండ్రులకు తెలియకుండా ఈత నేర్చుకోవాలన్న సరదా ప్రాణాలను తీయడమే కాకుండా పుత్రశోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఫకీరాతండాకు చెందిన బానోత్ రామా, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దకుమారుడైన బానోత్ ప్రవీణ్(13) ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేశాడు. రెండు రోజులలో సెలవులు పూర్తి కానుండటంతో తిరిగి ఖమ్మం వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ప్రవీణ్ తండ్రి రామా ఖమ్మం వెళ్లాడు. దీంతో తమ్ముడు, మిత్రులతో కలిసి తండా సమీపంలోని చెరువు పక్కనే ఉన్న వ్యవసాయ బావికి ఈతకు వెళ్లాడు. ప్రవీణ్‌కు ఈత రాకున్నా ఖాళీ కూల్‌డ్రింక్, వాటర్ బాటిళ్లకు మూతలు బిగించి వాటికి తాడు కట్టి నడుం చుట్టూ కట్టుకున్నాడు. ఖాళీ బాటిళ్లను నడుంకు కట్టుకోవడంతో నీటిలోకి దిగినా గాలిలో తేలుతుండటంతో వాటి సహాయంతో ఈత కొట్టసాగాడు. నీటి మధ్యలోకి వెళ్లిన తరువాత నడుంకు ఉన్న తాడు తెగిపోవడంతో కేకలు వేస్తూ నీట మునిగాడు. ప్రవీణ్ నీట మునిగిన విషయాన్ని గమనించిన మిత్రులు తండా పెద్దలకు సమాచారం అందించారు. తండావాసులు వచ్చి బావిలోకి దిగి వెతికినా ప్రవీణ్ ఆచూకీ దొరకలేదు. 108 వాహనంతో పాటు డోర్నకల్ సీఐ జె.శ్యాంసుందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తండావాసులు పలు వ్యవసాయ పనిముట్ల సహకారంతో రెండు గంటల పాటు శ్రమించి బావి అడుగున ఉన్న ప్రవీణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రవీణ్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి గూడూరు: తల్లి ఇంట్లో పనిలో నిమగ్నమైన ఉండగా ఇంటి ముందు ఉన్న ఓ చిన్నారి నీటి తొట్టిలో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని దుబ్బగూడెంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..దుబ్బగూడెంకు చెందిన మూడు రమేష్ దంపతుల రెండో కూతురు అభినయ (1) ఇంటి ముందు ఆడుకుంటుంది. ఈ క్రమంలో తల్లి ఇంట్లో పనిలో నిమగ్నమై ఉంది. కొద్ది సేపటి తరువాత బయటికి వచ్చిన కూతురు కనిపించకపోవడంతో వెతికింది. ఆ తరువాత ఇంటి పక్కనే ఉన్న నీటి తొట్టిలో పడి ఉండడాన్ని చూసి బోరున విలపించి బయటికి తీసింది. అప్పటికే చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
జాతరకు వచ్చి తిరిగిరాని లోకాలకు..
వైఎస్ఆర్ జిల్లా,గాలివీడు : మండలంలోని కొండ్రెడ్డిగారిపల్లె సమీపంలో ఓ రైతు ఏర్పాటు చేసుకున్న నీటి తొట్టిలో మునిగి గురువారం ఉదయం భరత్ (15) అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. నూలివీడు గ్రామంలో బుధ, గురువారాల్లో శ్రీ రేణుకాయల్లమ్మ జాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లెకు చెందిన విద్యార్థి భరత్ నూలివీడు పంచాయతీ నల్లాబత్తినవాండ్లపల్లెకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీరాములు ఇంటికి వచ్చాడు. రైతు ఏర్పాటు చేసుకున్న నీటితొట్టిలో ఈత కొడుతూ ఆకస్మికంగా మునిగి మృత్యువాత పడ్డాడు. భరత్ ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 9.5 జీపీఏ సాధించాడు. బంధువుల ఇంటికి వచ్చి కొడుకును కోల్పోయామని భరత్ తల్లిదండ్రులు బోరున విలపించారు. సంఘటనను చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. -
ఉసురు తీస్తున్న నిర్లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో :గోల్కొండ పరిధిలోని కుతుబ్‌షానగర్‌కు చెందిన ఫాతిమా (2) ఇంటి ముందు ఆడుకుంటూ మూతలేని నీటి సంపులో పడి కన్నుమూసింది. ♦ డీడీ కాలనీకి చెందిన చిన్నూ (3) ఆడుకుంటూ బాత్రూమ్లోకి వెళ్లి నీళ్ల బక్కెట్లో పడి చనిపోయింది. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో ఓ ఇంటి వెనుక భాగంలో నిర్మించిన డ్రైనేజ్ గుంతలో పడి రియా (2) అశువులు బాసింది. ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన నిర్లక్ష్యం తాలూకు ఘోరాలు ఇవి. ♦ తాజాగా గురువారం మూసారంబాగ్ డివిజన్ బడా మజీద్ లైన్లో షేక్ యాకుబ్ కుమారుడు రెహమాన్›(5) ఆడుకుంటూ సంపులో పడి చనిపోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇలాంటి దుర్ఘటనల్లో కన్ను మూసిన వారంతా లోకం పోడక తెలియని పసిమొగ్గలు... తల్లిదండ్రులు, అధికారుల నిర్లక్ష్యంతో పాటు అనాలోచిత నిర్ణయాల కారణంగా నిత్యం పలువురు మృత్యువాత పడుతున్నారు. చిన్నారులకు కుతూహలమే... అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న చిన్నారులకు ప్రతి అంశం పట్ల కుతూహలం, నేర్చుకోవాలని, దగ్గరగా చూడాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయవద్దని పెద్దలు వారిస్తుంటారో... అదే చేసేందుకు వారు ఆసక్తి చూపుతారు. ఇంట్లో ఉన్న వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు నీళ్లు సైతం వీరిని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. తరచూ వాటి వద్దకు వెళ్లాలని, ఆడుకోవాలని చూస్తుంటారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో నీటితొట్టెలు, బక్కెట్లు, సంపులు వీరికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే చిన్నారుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రుల పైనే ఉంది. దిగువ మధ్య తరగతివారే ఎక్కువ... ఇటీవల నగరంలో చోటు చేసుకున్న చిన్నారులకు సంబంధించిన అపశృతులను పరిశీలిస్తే ఇలాంటి ఉదంతాలు ఎక్కువగా దిగువ మధ్య తరగతి అంతకంటే కింది స్థాయిలో ఉన్న కుటుంబాల్లోనే జరుగుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. వారిలో విద్యాప్రమాణాలు తక్కువగా ఉండటం, అవసరమైన స్థాయిలో పరిపక్వత లేకపోవడం కూడా పిల్లల పట్ల నిర్లక్ష్యానికి కారణంగా మారుతున్నట్లు చెబుతున్నారు. అలాగని మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లోని చిన్నారులు పూర్తిగా సురక్షితంగా ఉంటున్నారనీ చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. అక్కడే అడపాదడపా అపశృతులు చోటు చేసుకుంటున్నాయని వివరిస్తున్నారు. మరెన్నో కారణాలు... ‘సంపు’ బాధిత కుటుంబాల్లో అనేకం వలస వచ్చినవే ఉంటున్నాయి. వీరికి స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండకపోవడం, ప్రస్తుతం జరుగుతున్న సంపుల నిర్మాణం, వాటి వల్ల జరిగే ప్రమాదాల తీవ్రత తెలియట్లేదు. ఫలితంగానే చిన్నారుల విషయంలో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీనికితోడు ఇటీవల కాలంలో అన్నీ చిన్న కుటుంబాలే కావడంతో పాకాడే పసి పిల్లల ఆలనాపాలనా, ఇంటి పనులు రెండూ తల్లిదండ్రులే చూసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగానూ పిల్లలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. వీరి కదలికల్ని కనిపెట్టడం, కట్టడి చేయడంలోనూ విఫలం కావడం పూడ్చలేని నష్టాన్ని మిగుల్చుతూ కుటుంబాన్నే దుఃఖసాగరంలో ముంచేస్తోంది. ఇవి చాలవన్నట్లు ప్రభుత్వ యంత్రాంగాల నిర్లక్ష్యమూ చిన్నారుల ఉసురు తీస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఉండే గోతులు, సంపులు, నీటి గుంటలు, ఫౌంటేన్లు, ఇంకుడు గుంతల నిర్వహణ, వీటికి సరైన రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక ఓపెన్ నాలాలు, మ్యాన్‌హోళ్ల విషయం వేరే చెప్పాల్సిన పనే లేదు. ఇవన్నీకూడా అపశృతులకు కారణంగా మారుతున్నాయి. సంపులో పడి బాలుడు మృతి మలక్‌పేట: సంపులో పడి బాలుడు మృతిచెందిన సంఘటన గురువారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఆయూబ్, శంషాద్ బేగం దంపతులు మూసారంబాగ్ డివిజన్, బడా మజీద్ లైన్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఆయూబ్ అంబర్‌పేటలో తాళాలు రిపేర్ చేస్తు జీవనం సాగిస్తున్నాడు. వారి ఇంటికి ఎదురుగా ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన సయ్యద్ అతియా ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా భవనం గ్రౌండ్ ఫ్లోర్లో నీటి సంపు ఏర్పాటు చేశాడు. అయితే భవనం చుట్టు ఎలాంటి రక్షణ లేకపోవడంతో సంపుపై మూత బిగించలేదు. ఆయూబ్ కుమారుడు షేక్ అబ్ధుల్ రెహమాన్›(5) గురువారం ఉదయం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సంపులో పడిపోయాడు. అతడి ఆచూకీ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా రహమాన్ ఎదురుగా ఉన్న భవనం నీటి సంపులో తేలియాడుతూ కన్పించాడు. కుటుంబసభ్యులు అతడిని మూసారంబాగ్ చౌరస్తాలోని సేఫ్ చిల్డ్రన్ ఆసుపత్రికి తరలింయగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. దీనిపై సమాచారం అందడంతో ఎమ్మెల్యే అహ్మద్ బలాల, మాజీ కార్పొరేటర్ మహ్మద్ అస్లాం, ఎంఐఎం నాయకులు ఇలియాస్, ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి సోహేల్, పోలం రవీందర్‌యాదవ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మలక్పేటఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు పర్యవేక్షలో ఎస్సై శ్రీనునాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు అవసరం ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా తల్లిదండ్రులు సైతం కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చిన్నారులు ఇంట్లో, ఇంటి బయట ఆడుకునేప్పుడు వారిపై ఓ కన్నేసి ఉంచాలి. ఎవరికి వారు తమ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు, భవనాలకు సంబంధించిన సంపులు, డ్రైనేజీలు, పిల్లర్ గుంతల విషయంలో జాగ్రత్తగా ఉంటూ అవసరమైతే వాటి యజమానులు, అధికారుల్ని అప్రమత్తం చేయాలి. మూతలేని మ్యాన్‌హోళ్లు, ప్రమాదకరంగా మారిన ఓపెన్ నాలాలు కనిపిస్తేప్రతిఒక్కరూ బాధ్యతగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారమ య్యేలా చూడాలి. – నగర పోలీసు ఉన్నతాధికారి -
పైలెట్ వాటర్ స్కీమ్‌లో ఎలుకలు
సాలూరు: పట్టణంలోని బంగారమ్మపేట దళితవాడలో గల పైలెట్ వాటర్ స్కీమ్‌లో చచ్చిన ఎలుకలు పడిఉండడం స్థానికంగా కలకలం సృష్టించింది. మూడు రోజుల కిందటే మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురాగా... సోమవారం నాడు వాటర్ ట్యాంకులో చచ్చిపడివున్న ఎలుకలు కనిపించడంతో ఆ ప్రాంతవాసులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల కిందటే మున్సిపాలిటీ సిబ్బంది వాటర్ స్కీమ్‌కు మరమ్మతులు చేపట్టి నీటి అవసరాలు తీర్చారు. అయితే పైపుల నుంచి చిన్నపాటి ధారగా నీరు వస్తుండడంతో ఏదైనా అడ్డు పడి ఉంటుందని భావించిన మహిళలు స్థానికులకు తెలియజేశారు. దీంతో స్థానిక యువత ట్యాంక్ లోపలికి తొంగి చూసి అవాక్కయ్యారు. లోపల చచ్చిన ఎలుకలు కనిపించడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. మూడు రోజులుగా పైపుల నుంచి చిన్నధారే వస్తోందని... అంటే ఎలుకలు చనిపోయి మూడు రోజులై ఉంటుందని అభిప్రాయపడ్డారు. మూడు రోజులుగా కలుషిత నీరే వినియోగిస్తుండడంతో ఎటువంటి రోగాలు ప్రబలుతాయోనని గగ్గోలు పెడుతున్నారు. ఇదిలాఉంటే కొంతకాలంగా ట్యాంక్‌కు పైకప్పు లేకపోవడంతో పాటు మీద చెట్ల కొమ్మలు వేలాడడంతో వాటిపైనుంచి ఎలుకలు జారిపడి ఉండొచ్చని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని బ్లీచింగ్ వేసి ట్యాంక్‌ను శుభ్రం చేశారు. మూడు రోజుల పాటు నీటిని వినియోగించవద్దని సూచించారు. భయమేస్తోంది... కలుషిత నీటిని మూడు రోజుల పాటు వినియోగించాం. ఎటువంటి అంటురోగాలు ప్రబలుతాయోనని భయంగా ఉంది. ఎలుకలు చనిపోవడంతో నీరు బాగా పాడైపోయింది. అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు ట్యాంకులు శుభ్రం చేస్తే ఇటువంటి సమస్యలు తలెత్తవు.– వరమ్మ, బంగారమ్మపేట -
నిర్లక్ష్యానికి బాలుడు బలి!
కృత్తివెన్ను(పెడన): అప్పుడు వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారి చిట్టిపొట్టిమాటలు మూగబోయాయి.. వచ్చిరాని మాటలతో చిట్టిపొట్టి అడుగులతో అలరించిన ఏడాదిన్నర వయసున్న ఆకాష్‌ను అనధికారికంగా ఏర్పాటు చేసిన నీళ్ల ట్యాంకు బలితీసుకుంది. ఎక్కడో బోరుబావుల్లో పడి చిన్నారులు మరణిస్తున్న వార్తలను టీవీలు, పత్రికల్లో చూసిన స్థానికులు తమ గ్రామంలోనే నీళ్ల ట్యాంకులో పడి బాలుడు చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాలు.. మండల పరిధిలోని తాడివెన్ను అంగన్వాడీ కేంద్రం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన నీళ్లట్యాంకులో పడి ఈదా జోజిబాబు కుమారుడు ఆకాష్ మృత్యువాత పడ్డాడు. సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులతో పాటు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేసింది. స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద గల నీటికుళాయి నుంచి వచ్చే నీరు పట్టుకునేందుకు అంగన్వాడీ కార్యకర్త వరలతో ట్యాంకు ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ట్యాంకుపై రక్షణగా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అటుగా వచ్చిన బాలుడు ప్రమాదవశాత్తు ట్యాంకులో పడిపోయాడు. దీనిని ఎవరూ గమనించలేదు. కొంత సమయం తరువాత బాలుడి బంధువులు వెదకగా ట్యాంకులో బాలుడు శవమై కనిపించాడు. అంగన్వాడీ కేంద్రం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ట్యాంకు ఏర్పాటు చేయడం కారణంగానే బాలుడు మరణించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఘటనా స్థలానికి వచ్చిన ఐసీడీఎస్ సీడీపీఓ రాజ్యలక్ష్మికి దీనిపై వారు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ తులసీరామకృష్ణ, రెవెన్యూ అధికారులు ఆర్ఐ త్రీనాథ్ పరిశీలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు కాలేదని ఎస్ఐ పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన నీళ్లట్యాంకు సంగతి తమకు తెలియదని, ట్యాంకు ఏర్పాటు చేయడంపై తమకెలాంటి సమాచారం లేదని సీడీపీఓతో పాటు సూపర్వైజర్ ప్రసూన పేర్కొన్నారు. -
రాజస్తాన్‌లా తెలంగాణ కాకూడదు
సాక్షి, హైదరాబాద్: నీటికోసం అల్లాడుతున్న ప్రజల అవసరాలకోసం వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేస్తుంటే, దానిని అడ్డుకోవాలని కోరడం ఎంత మాత్రం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. రాజస్తాన్‌లో మహి ళలు బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం వెళుతుంటారని, నిత్యం అక్కడ నీళ్లకోసం కొట్లాటలు కూడా జరుగుతుంటాయని గుర్తు చేసింది. అటువంటి పరిస్థితులు తెలంగాణలో రాకూడదని తాము కోరుకుంటున్నామంది. వాటర్‌ట్యాంక్ నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోలేమంటూ అప్పీల్‌ను కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్‌లోని వినాయక్ నగర్ శ్రీసాయి ఎన్క్లేవ్ బస్వగార్డెన్స్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలంలో చేపట్టిన వాటర్‌ట్యాంక్ నిర్మాణాన్ని సవాలు చేస్తూ వి.దీవానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి విచారణ జరిపి వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా ప్రజల అవసరాల కోసమేనని, అందు లో తప్పేమీ లేదంటూ పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దీవానా ఏసీజే నేతృత్వంలోని ధర్మా సనం ముందు అప్పీల్ చేశారు. పార్క్ స్థలంలో వాటర్‌ట్యాంక్ నిర్మాణం నిబంధనలకు విరు ద్ధమన్నారు. ఈ ట్యాంక్ వల్ల పచ్చదనం లేకుం డా పోతుందన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. నీటి కోసం జనం అల్లా డుతున్న విషయం పిటిషనర్‌కు తెలిసినట్లు లేదు, ఓ మూడు వారాలపాటు నీళ్లు లేకుండా గడిపితే అప్పుడు నీటి విలువ ఏమిటో పిటిషనర్‌కు తెలిసి వస్తుందని వ్యాఖ్యానించింది. నీటి కష్టాలు ఎలా ఉంటాయో రాజస్తాన్‌లో చూడాలని వ్యాఖ్యానించింది. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు వాటర్‌ట్యాంక్‌లు నిర్మిస్తే, వాటిని అడ్డుకోవాలని చూడటం సమంజసం కాదంది. దీవానా అప్పీల్‌ను కొట్టేసింది. -
వాసన గమనించిన వాచ్మెన్.. ఊరికి తప్పిన ముప్పు
సాక్షి, కొవ్వూరు : పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామస్తులకు తృటిలో పెను ముప్పు తప్పింది. రక్షిత మంచినీటి పథకం ట్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. అయితే అక్కడ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న పోలయ్య వాసన గమనించి నీళ్లని బయటికి విడుదల చేయలేదు. ఈ ఘటనపై గ్రామ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
‘భగీరథ’ నీళ్లొచ్చేనా..!
కరీంనగర్‌కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ పథకం పనులు నత్తనడక కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ల అలసత్వం.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి. నిండు వేసవిలో కరీంనగర్ నగర ప్రజలకు నీటి తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే బోర్లు ఎండిపోయి నల్లా నీటిపైనే ఆధారపడుతున్నారు. దీనికి తోడు నీటి సరఫరాలో ఇబ్బందులతో తాగునీటి తండ్లాట మొదలైంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా 24/7 నీటి సరఫరాకు కరీంనగర్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. కరీంనగర్‌కు వరప్రదాయినిగా ఉన్న లోయర్ మానేరు డ్యాంతోనే ఇది సాధ్యమవుతుందని భావించారు. తెలంగాణలోనే ఏ నగరానికి లేని తాగునీటి వనరులు కరీంనగర్‌కు ఉన్నాయి. ఎల్ఎండీలో నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండడంతో ప్రయోగాత్మకంగా నిరంతరంగా నగరానికి తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. నగరానికి నిరంతర నీటి సరఫరాకు కార్యాచరణ జరుగుతుండగా ఆశలన్నీ అర్బన్ మిషన్ భగీరథ పథకం మీదే ఉన్నాయి. పథకం పూర్తయితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుండడంతో ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మిషన్ భగీరథ ద్వారానే నిరంతర నీటి సరఫరాకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగా ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు, పైపులైన్ కనెక్షన్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. గతేడాది నవంబర్లోనే పనులు పూర్తి చేయాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరిగింది. ప్రభుత్వం గడువు పెంచి మార్చి నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించింది. అయినా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రూ.109 కోట్లతో పనులు... నగరంలో అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద ప్రభుత్వం రూ.109.26 కోట్లు మంజూరు చేసింది. వీటితోపాటు పాటు స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు అమలులో ఉండడంతో 24 గంటల నీటి సరఫరాకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 16 ఓవర్‌హెడ్ ట్యాంకులకు తోడు మరో 3 ఓవర్‌హెడ్ ట్యాంకులు మిషన్ భగీరథ పథకంలో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 43 వేల నల్లా కనెక్షన్లకు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుండగా, మిషన్ భగీరథ పనులు పూర్తయితే నిరంతర నీటి సరఫరా జరగనుంది. అన్ని డివిజన్లలో పనులు ప్రారంభించడంతో పైపులైన్ల పనులు కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల 8 గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేశారు. గ్రామాలన్నింటికీ కార్పొరేషన్‌తో సమానంగా నీటి సరఫరా చేయాల్సి ఉంది. రెండు సార్లు గడువు పెంచినా... అర్బన్ మిషన్ భగీరథ పనులు 2017 మేలో ప్రారంభించారు. పూర్తిచేసేందుకు 18 నెలల కాల వ్యవధిని విధించారు. అంటే గతేడాది నవంబర్లోనే పూర్తిచేయాల్సి ఉన్నా పూర్తి కాలేదు. మరోమారు ఈ యేడాది మార్చి ఆఖరులోగా పనులు పూర్తిచేసి నీటిని సరఫరా చేయాలని గడువు పెంచారు. గడువు ముగిసినా పనులు మాత్రం పూర్తికాలేదు. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక పనులు పూర్తిచేసి ఇంటింటికీ నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. వంద శాతం పైపులైన్ల పనులు పూర్తికాకపోవడంతో ఎక్కడా ఇంటర్ కనెక్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. 2033 సంవత్సరం కల్లా 4.03 లక్షల జనాభాకు సరిపడేలా 68.65 ఎంఎల్డీ(మిలియన్ లీటర్ పర్ డే) సామర్థ్యంతో ఫిల్టర్‌బెడ్, 3000 కేఎల్ సామర్థ్యంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీని పనులు 40 శాతం మేర పూర్తయ్యాయి. 800 కిలో లీటర్ల సామర్థ్యం గల సంపు, పంపుహౌజ్‌ను ఫిల్టర్‌బెడ్ దగ్గర నిర్మిస్తున్నారు. దీని పనులు చివరి దశలో ఉన్నాయి. రాంనగర్లో 1300 కిలో లీటర్ల ట్యాంకు పనులు 60 శాతం మేర, హౌజింగ్‌బోర్డు కాలనీలో 2200 కిలో లీటర్ల సామర్థ్యంతో నిర్మాణం చేస్తున్న ట్యాంకు పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఎప్పటికి పూర్తవునో... ప్రతిష్టాత్మకమైన భగీరథ పనులు ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పెంచిన గడువు ప్రకారం ప్రజలకిచ్చిన వాగ్దానం ప్రకారం ఏప్రిల్ నుంచి ఇంటింటికి తాగునీరు అందించాలని గడువు విధించింది. ఆ గడువు కూడా ముగిసింది. రిజర్వాయర్లు, సంపుల నిర్మాణం, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ ఆ పనులు పూర్తికాలేదు. పైపులైన్ల అనుసంధానం పనులు సైతం ఆశించిన స్థాయిలో జరగడంలేదు. మిషన్ భగీరథ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తేనే నిరంతర నీటి సరఫరాకు అడ్డంకులు తొలగుతాయి. -
శివశివా.. ఏమిటీ శిక్ష!
తూర్పుగోదావరి,శివకోడు (రాజోలు): మహాశివరాత్రి పర్వదినం రోజున ఆ కుటుంబం అంతా శివాలయానికి వెళ్లి అభిషేకాలు చేయించుకుని వచ్చింది. అంతలోనే ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన మగబిడ్డను అల్లారు ముద్దుగా పెరుగుతున్న గంధం కేశవ శివ షణ్ముఖ్ (4) ఇంటికి వెనుక ఆడుకుంటూ అక్కడ ఉన్న సిమెంట్ మురుగు గుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. నర్సాపురానికి చెందిన బాలుడి తండ్రి బాలాజీ ఫ్లంబింగ్ పనుల కోసం శివకోడులో నారాయణ స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. పాఠశాలకు సెలవు కావడంతో భార్య, పిల్లలతో శివాలయానికి తీసుకువెళ్లి వారిని ఇంటిలోకి చేర్చి పని కోసం వెళ్లిపోయాడు. ఆ బాలుడు గుంటలో పడి కూరుకుపోయాడు. సుమారు రెండు గంటల సేపు బాలుడు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు స్థానికులను విచారించారు. గుంటల్లోంచి బుడగలు వస్తుంటే కంగారు పడ్డారు. స్థానికులు సర్వే బాదులతో గుంటలో వెతికారు. బాలుడు గుంటలో తేలడంతో హుటాహుటీన రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆమె తల్లి దేవి కన్నీరుమున్నీరుగా విలపించింది. ముక్కుపచ్చలారని బాలుడికి నూరేళ్లు నిండాయని కాలనీవాసులు విచారంలో మునిగిపోయారు. రెండు నెలల క్రితం మూత ఉన్న మురుగు గుంటను స్థల యజమాని తవ్వడంతో గుంటలోకి ఊట నీరు చేరి ఊబిగా మారిందని స్థానికులు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న ఈ గుంటను మూసివేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారులు స్పందించి ఈ గుంటను పూడ్చి వేసి స్థల యజమానిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
నీటి సంపులో పడి చిన్నారి మృతి
మల్కాజిగిరి/గౌతంనగర్: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.ఎస్ఐ రమేష్, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి హిల్‌టాప్ కాలనీకి చెందిన సతీష్ ప్రైవేట్ ఉద్యోగి. అతనికి భార్య శశికళ, కుమారుడు స్టీఫెన్(2) ఉన్నారు. బుధవారం ఉదయం మంచినీళ్లు రావడంతో శశికళ ఇంటి ఆవరణంలో నీళ్లు పడుతుండగా స్టీఫెన్ పక్కింటి వద్ద ఆడుకుంటూ కనిపించాడు. కొద్ది సేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన గాలింపు చేపట్టిది. పక్కింటి కాంపౌండ్‌లోని సంప్‌లో చిన్నారిని గురించిన ఆమె స్థానికుల సహాయంతో బయటికి తీసి గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతుని శశికళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సకాలంలో అందని వైద్యం.. గాంధీఆస్పత్రి : ప్రాణాపాయస్థితిలో ఉన్న చిన్నారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా జూడాల సమ్మె నేపథ్యంలో ఆస్పత్రి ప్రధాన గేటు మూసివేసి ఉంది. ఎమర్జెన్సీ అని చెప్పడంతో పోలీసులు గేటు తెరిచారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా రెండ్రోజుల క్రితం అత్యవసర విభాగానికి వెళ్లే దారిని మూసివేసి, ఓపీ విభాగం మీదుగా దారి మళ్లించారు. ఓపీ విభాగం వద్ద జూడాలు ధర్నా చేస్తుండటం, దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో చిన్నారిని లోపలికి తీసుకు వెళ్లేందుకు అవకాశం లేకపోయింది. 15 నిమిషాలు ఆలస్యంగా చిన్నారిని అత్యవసర విభాగానికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే బాబు మృతి చెందినట్లు నిర్దారించారు. వైద్యసేవల్లో జాప్యం కారణంగా చిన్నారి తమకు దక్కలేదని ఆరోపిస్తూ మృతుని తల్లితండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ట్యాంకెక్కి.. సజీవదహనం
చిల్పూరు: కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఓ వ్యక్తి ట్యాంక్‌పైకెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలం వెంకటాద్రిపేటలో గురువారం చోటుచేసుకుంది. వెంకటాద్రిపేటకు చెందిన రాధమ్మ–రాజయ్య దంపతుల మూడో కుమారుడు బాలరాజు(37) పలు కేసుల్లో నిందితుడు. ఇద్దరు భార్యలు మృతి చెందగా జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఉదయం బాలరాజు ఐదు లీటర్ల పెట్రోలు క్యాన్, క్రిమిసంహారక మందు డబ్బా తీసు కుని గ్రామసమీపంలోని దేవాదుల రిజర్వాయర్‌లోకి వెళ్లి వాటర్ ట్యాంకు ఎక్కాడు. అక్కడి నుంచి 100 నంబర్‌కు డయల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. వారు చిల్పూరు ఎస్సై శ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వగా.. ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తనకు అన్యాయం జరిగిందని, విలేకరులు వస్తేనే దిగుతానని అనడంతో వారంతా అక్కడికి చేరుకున్నారు. కిందికి దిగిన బాలరాజు.. తాను చేసిన తప్పు కారణంగా నా తమ్ముడిపైన కేసు పెట్టారు.. కేసు లేకుండా చేయాలని కోరాడు. ఇందుకు పోలీసులు హామీనిచ్చారు. అయితే.. వెంట తెచ్చుకున్న సామగ్రి తెచ్చుకుంటానని ట్యాంక్‌పైకెళ్లి ముందుగా క్రిమిసంహారక మందు తాగాడు. వెంటనే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్నాడు. ఎస్పై 108 సిబ్బందికి సమాచారం ఇచ్చి ట్యాంకు పైకి వెళ్లి చూసేసరికే అప్పటికే సజీవదహనం అయ్యాడు. -
ట్యాంకు ఎక్కి యువకుడి హల్చల్
సాక్షి, సంగెం: తన వల్ల పెద్దమనుషులు 5వ రోజు కర్మకాండలకు రారని ఆందోళనకు గురైన ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేసిన సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... మండల కేంద్రానికి చెందిన గుండేటి కుమారస్వామి(30) సమీప బంధువు గుండేటి ఎల్లమ్మ మృతి చెందింది. ఈ నెల 6వ తేదీన ఎల్లమ్మ మృతి చెంది 3వ రోజు కావడంతో కుమారస్వామి వంటలు చేశాడు. అక్కడ భోజనాలు జరుగుతున్న క్రమంలో మద్యం మత్తులో ఉండి పెద్ద మనుషులను దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపం చెందిన కుల పెద్ద మనుషులు నేడు నిర్వహించబోయే 5వ రోజు కర్మలకు హాజరుకామని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కుమారస్వామిని నీవల్లే కుల పెద్దలు రావటం లేదని మందలించారు. దీంతో ఆందోళన చెందిన కుమారస్వామి గ్రామపంచాయతీ వద్ద ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వద్ద ఉన్న గుండేటి కొమ్మాలు, అనిల్, మెట్టుపల్లి రమేశ్, కక్కెర్ల సంతోష్‌గౌడ్‌లు చాటుగా వాటర్ ట్యాంకు ఎక్కి కుమారస్వామికి నచ్చజెప్పి కిందకు దింపారు. విషయం తెలుసుకుని పోలీసులు వచ్చి యువకుడిని పోలీసుస్టేషన్ తరలించారు. -
హత్యా.. ఆత్మహత్యా?
చండూరు : మండలంలోని బంగారిగడ్డ గ్రామ కృష్ణా నీటి సంపులో పడి మృతి చెందిన చిలుకూరి చంద్రశేఖర్ (చందు)ది హత్యా..ఆత్మహత్యానా అనేది మిస్టరీగానే మిగిలింది. చండూరు మండల కేంద్రానికి చెందిన చిలుకూరి చంద్రశేఖర్ (26)(చందు)మిషన్ భగీరథలో వర్క్ ఇన్స్పెక్టర్ ( కాంట్రాక్టు)గా పనిచేస్తున్నాడు. ఇతను డిసెంబర్ 31 తేదీన మునుగోడు మండల కేంద్రంలో మీటింగ్‌కని వెళ్లి అక్కడి నుంచే హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాడు. తిరిగి 2 తేదీన ( బుధవారం) మునుగోడు మండల కేంద్రానికి చేరుకున్న సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. అప్పటి నుంచే కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. గురువారం ఉదయం బంగారిగడ్డ కృష్ణా నీటి సంపులో శవమై కనిపించాడు. మృతుడి స్కూటీని గుర్తించిన గ్రామస్తులు బంధువులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. ఒత్తిడికి లోనై.. మృతుడు చంద్రశేఖర్‌కు సంబంధించిన వాహనంలో సుసైడ్ నోట్ లభించింది. ఇందులో వదినలు, అన్నలు క్షమించాలని, అమ్మను బాగు చూసుకోవాలని రాసి ఉంది. అమ్మకు తన ముఖం చూయించకుండా వెళ్తున్నందుకు తనను క్షమించాలని ఉంది. ఇదంతా ఓ భాగమైతే... తను డిప్రెషన్‌కులోనై చనిపోతున్నా అని రాసి ఉంది. మృతుడికి ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆనందంగా ఉండే వాడని బంధువులు చెప్తున్నారు. అసలు డిప్రెషన్లోకి ఎందుకు వెళ్లాడు.. అసలు ఆ మూడు రోజులు హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాడు... ఫోన్ లో ఎవరితో మాట్లాడాడు...ఏం మాట్లాడాడు అనే కోణంలో ఇప్పటికే పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అసలు కారణాలు రాయకుండా డిప్రెషన్‌కు లోనై అనే ఒకే కారణం చూపించడంపై అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయంపై ఎస్ఐ సైదులు వివరణ ఇస్తూ మృతదేహం పోస్టుమార్టమ్ రిపోర్టు తర్వాత అసలు విషయం బయటకు వస్తుందన్నారు. అనేక విధాలుగా వివరాలు సేకరించే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. చంద్రశేఖర్(ఫైల్), నీటి సంపు ఇదే.. -
బాలుణ్ని మింగిన నీటిగుంత
కర్నూలు ,ఆదోని టౌన్: నీటి కుంటలో పడి రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. ఆదోని పట్టణంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన తల్లిదండ్రులకు శోక సంద్రంలో ముంచింది. వివరాల్లోకి వెళితే.. ధనలక్ష్మి, రాజు దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు శేషు. వీరు అంబేడ్కర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. బుధవారం ఇంటి ఎదుట పిల్లలతో శేషు ఆడుకుంటూ పక్కనే ఉన్న నీటిగుంతలో పడ్డాడు. ఆలస్యంగా గమనించి బయటకు తీయగా అప్పటికే ప్రాణాలు విడిచి ఉన్నాడు. వచ్చీరాని చిన్నారి మాటలను గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లి వద్దే ఉండింటే.. చిన్నారి శేషును తీసుకుని తల్లి ధనలక్ష్మి ఇటీవల రాయచూరులోని బంధవుల ఇంటికి వెళ్లింది. తండ్రి రాజు మూడు రోజుల క్రితమే కొడుకు శేషును ఆదోనిలోకి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. తల్లి వద్దే ఉండింటే మనవడు బతికేవాడని అవ్వాతాతలు లక్ష్మీ, ఈరన్న, చిన్నాన్నలు, పెద్దనాన్నలు, బంధవులు విలపించారు. బాలుడు మృతితో అంబేడ్కర్‌నగర్‌లో విషాదం నెలకొంది. -
వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్న విద్యార్థులు
సాక్షి, విజయవాడ : నిరుద్యోగుల జీవితాలతో సీఎం చంద్రబాబు నాయుడు ఆటలాడుతున్నారు. ఉద్యోగాల భర్తీని పట్టించుకోకుండా వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు నిరుద్యోగులు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన పాలిటెక్నిక్ విద్యార్థులు.. బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వెటర్నరీ పాలిటెక్నిక్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా పశువైద్యశాలల్లో వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్‌లను భర్తీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుసార్లు తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఆత్మహత్యలే దిక్కని వాపోతున్నారు. -
పొంచి ఉన్న ప్రమాదం
ఖమ్మంఅర్బన్: నగరం నడిబొడ్డున నియోజకవర్గ ప్రజాప్రతినిధి క్యాంప్ కార్యాలయం, జేసీ క్యాంప్ కార్యాలయాల సమీపంలో ఉన్న దుమ్ముగూడెం సీఈ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై ఎప్పుడో నిర్మించిన, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంక్ ఉంది. అయితే అది ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ట్యాంక్ ద్వారా నీటిని వినియోగించక పోవడంతో అనేక సంవత్సరాల కిందట నిర్మించిన ట్యాంక్ సిమెంట్ పెచ్చులుగా రాలి పడుతూ నిర్మాణానికి ఉపయోగించిన ఇనుప సువ్వలు బయటకు వచ్చి రాలి పడుతున్నాయి. దాని చుట్టూత కూడా కంపచెట్లు పెరిగి ఉన్నాయి. ఆ ట్యాంక్‌తో ఎలాంటి ఉపయోగం లేనందున నేలమట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఫోన్ పోయింది.. వెతికివ్వండి లేకపోతే...
ధర్పల్లి(నిజామాబాద్ రూరల్): తప్పతాగిన మైకంలో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. తాళ్ల సాయంతో కిందికి దించి సురక్షితం గా ఇంటికి చేర్చారు పోలీసులు. మండలంలోని దమ్మన్నపేట్ గ్రామానికి చెందిన పెయింటర్‌గా పని చేస్తున్న తులసీనారాయణస్వామి అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం తప్పతాగిన మైకంలో ధర్పల్లి గ్రామ శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం వెనుక గల వాటర్ ట్యాంక్‌ను ఎక్కి హల్చల్ చేశాడు. ట్యాంక్ సమీపంలోని హోటల్ వద్దకు ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి టీ తాగుతున్నారు. నా సెల్‌ఫోన్ పోయిందని మీరే వెతికి పెట్టాలని కానిస్టేబుళ్ల వద్ద తాగిన మైకంలో తుల్లుతూ తులసీనారాయణస్వామి అనే వ్యక్తి అడిగారు. కానిస్టేబుళ్లు వెతికి పెట్టుతాములే టీ తాగు అని అతడికి టీ ఇప్పించారు. వ్యక్తి టీ తాగి పక్కనే గల వాటర్ ట్యాంక్ ఎక్కాడు. కానిస్టేబుల్ మాన్సింగ్ చాకచక్యంగా ట్యాంక్‌పైకి ఎక్కి వ్యక్తిని పట్టుకొని ఇతర వ్యక్తుల సహాయంతో పాటు తాళ్లతో బం ధించి కిందికి దించారు. ట్యాంక్ కిందికి దించే సమయంలో స్వామి జై తెలంగాణ.. అంటూ నినాదాలు చేశాడు. పరిస్థితిని ధర్పల్లి సీఐ ప్రసాద్, ఎస్ఐ పాండేరావు పరిశీలించారు. ఇదే వాటర్ ట్యాంక్‌పై నుంచి గతంలో ఒకరు ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమై వ్యక్తిని సురక్షితంగా రక్షించారు. పెయింటర్ స్వామిని పోలీసు లు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించి దమ్మన్నపేట్ గ్రామానికి తీసుకెళ్లారు. స్వామి 25 ఏళ్ల క్రితం దమ్మన్నపేట్‌కు వచ్చి పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడికి భార్య, పిల్లలు లేనట్లు పోలీసులు తెలిపారు. -
నీటి తొట్టెలో పడి తల్లీబిడ్డలు మృతి
చిత్తూరు, శాంతిపురం: కర్ణాటక పరిధిలోని బుల్లంపల్లి వద్ద ప్రమాదవశాత్తు నీటిలో పడిన కొడుకును కాపాడే ప్రయత్నంలో బిడ్డతో సహా తల్లి మృతి చెందింది. కేజీఎఫ్‌లోని ఆండర్‌సన్‌పేట్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ హరీష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శాంతిపురానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దేవరాజులు మాదిగ బుల్లంపల్లికి చెందిన శోభ(28)ని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి 6, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. శోభ మంగళవారం పిల్లలతో పుట్టింటికి వచ్చింది. బుధవారం మద్యాహ్నం ఇంటి బయట ఆడుకొంటున్న కొడుకు రఘు(4) కనిపించక పోవడంతో వెతుకుతూ వెళ్లింది. గ్రా మ సమీపంలోని ఇంకుడు గుంతలోపడి ఉన్న కొడుకును చూసి కాపాడే ప్రయత్నంలో తానూ నీటిలోకి పడిపోయింది. దీంతో తల్లి, బిడ్డలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తల్లీబిడ్డలు ఎంతకూ రాకపోవటంతో వెతికిన కుటుంబ సభ్యులు ఇంకుడు గుంతలో మృతదేహాలను గమనించి బయటకు తీశారు. గంట క్రితం వరకూ ఆడుతూ కనిపించిన పిల్లాడు, అందరితో మంచి గా ఉండే శోభ ఒక్కసారిగా శవాలుగా మారటంతో బాధిత కుటుంబం ఆక్రందనలు చూపరులను కంటతడి పెట్టించాయి. మృతదేహాలను కేజీఎఫ్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. -
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చేదు అనుభవం!
పొన్నూరు: అధికార పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఎస్సీలకు కేటాయించిన భూమిలో వాటర్ ట్యాంక్ శంకుస్థాపనకు వచ్చిన నరేంద్రను గ్రామస్థులు అడ్డుకుని నిలదీశారు. చట్టాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఆ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని బాధితులు వాపోయారు. మండల పరిధిలోని తాళ్ళపాలెంలో ఎస్సీలకు కేటాయించిన ఇళ్ల స్థలంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంచినీటి పథక ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు. దీంతో బాధితులు తమ స్థలాల్లో ఏ విధంగా నిర్మాణాలు చేస్తారని ఎమ్మెల్యేను నిలదీశారు. దీనిపై ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ స్పందిస్తూ అప్పటి అధికారులు ఇచ్చిన పట్టాలు నకిలీవి అని తేల్చి చెప్పారు. ఈ స్థలాలను ఆర్డీవో రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన బాధితులు తమకు ప్రభుత్వం 2005లో నివేశన స్థలాలు కేటాయించి ఏవిధమైన సమాచారం ఇవ్వకుండా ఎలా రద్దు చేస్తుందని మండిపడ్డారు. ఎమ్మెల్యే శంకుస్థాపనకు వెళుతుండగా ఎస్సీలు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ముందస్తుగా ఉన్న పోలీస్ బలగాలు బాధితులను నిలువరించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కక్ష సాధిస్తున్నారు గ్రామంలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నామని మాకు కేటాయించిన స్థలాలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నాయకులు ప్రజావ్యతిరేక పనులు చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు.– అద్దేపల్లి సంఘమేశ్వరావు న్యాయపోరాటం చేస్తాం ప్రభుత్వం స్థలం ఇచ్చే సమయంలోనే అన్ని జాగ్రతలు తీసుకోని స్థలాలను కేటాయిస్తుంది. స్థలాలు మంజూరు చేసే సమయంలో రెవెన్యూ అధికారులు పదిసార్లు పరిశీలించిన తరువాత కానీ పట్టాలు మంజూరు చేయరు. కేవలం ఎస్సీలకు కేటాయించారనే స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఎస్సీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై గతంలో కోర్టును ఆశ్రయించాం. నేడు ఎస్సీల స్థలాలో నిర్మాణం చేస్తున్న, చేయిస్తున్న అందరిపై న్యాయ పోరాటం చేస్తాం.– ఎం.అన్నపూర్ణ -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
రేణిగుంట: మండలంలోని ఎల్లమండ్యంకు చెందిన సుబ్రమణ్యం కుమారుడు యుగంధర్(4) నీటితొట్టెలో పడి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. యుగంధర్ సోమవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. బాలుని కుటుంబీకులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గాజులమండ్యం పోలీసులను ఆశ్రయించారు. అయితే బుధవారం నీటితొట్టెలో నుంచి దుర్వాసన రావడంతో.. అనుమానం వచ్చి చూశారు. బాలుడు నీటితొట్టెలో శవమై కనిపించడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. ముద్దులొలికే చిన్నారి విగతజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కూలేదాకా చూస్తారేమో..!?
దోమకొండ: మండల కేంద్రంలోని పలుగుగడ్డ ప్రాంతంలో గల వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీనిని తొలగించి దాని స్థానంలో కొత్త వాటర్ ట్యాంకును నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు. లక్ష లీటర్ల సామర్ధ్యం గల ఈ వాటర్ ట్యాంక్‌ను దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీని ద్వారా గ్రామంలోని మార్కండేయ కాలనీ, ఇందిరాకాలనీ, మటన్ మార్కెట్, ఊరడమ్మ వీధి, బురుజు, హనుమాన్ కాలనీతో పాటు పాత బీబీపేట రోడ్డు వరకు కుళాయి ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. రెండు సంవత్సరాలుగా ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పెచ్చులు ఊడిపోయాయి. పగుళ్లు ఏర్పడ్డాయి. రెండేళ్ల క్రితం గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు ట్యాంక్ లోపల శుభ్రం చేస్తుండగా మెట్లు విరిగిపోయాయి. దీంతో సదరు కార్మికుడు సెల్‌ఫోన్ ద్వారా విషయం తెలియజేయగా పంచాయతీ సిబ్బంది ట్యాంక్‌పైకి ఎక్కి అతడిని తాళ్లతో పైకి తీశారు. వాటర్ ట్యాంక్ చుట్టూ పెద్ద సంఖ్యలో నివాసాలు ఉన్నాయి. దీంతో కాలనీవాసులు ఎప్పుడు కూలుతుందోనని భయపడుతున్నారు. ఈ విషయంలో కాలనీవాసులు పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులకు విషయం వివరించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వచ్చి దానిని పూర్తిగా తొలగించాలని పేర్కొన్నారు. తొలగించే ముందే దాని స్థానంలో మరో ట్యాంకును నిర్మించాలని వారు ప్రతిపాదించారు. అదే సమయంలో మిషన్ భగీరథ ద్వారా ఇక్కడ 60 వేల లీటర్ల సామర్థం రెండు వాటర్ ట్యాంకులకు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ భూమిపూజ చేశారు. దీంతో కాలనీవాసులంతా సంతోషపడ్డారు. అయితే సదరు కాంట్రాక్టర్ పనులు మాత్రం నత్తనడకన చేస్తున్నారు. వీటితో పాటు గ్రామంలో మొదలుపెట్టిన వాటర్ ట్యాంకులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ వీటి నిర్మాణ విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వీటిని ముందుగా పూర్తి చేయడం ద్వారా పాత ట్యాంకును తొలగించాలని వారు కోరుతున్నారు. వర్షాకాలం కావడంతో పాత వాటర్ ట్యాంకు ఏ క్షణమైన కూలవచ్చని, దాంతో కాలనీవాసులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకుల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. -
టెట్‌ను రద్దు చేస్తారా.. దూకేయమంటారా ?
ఒంగోలు: అక్రమాల టెట్‌ను రద్దు చేస్తారా..లేక ఓవర్‌హెడ్ ట్యాంక్‌పై నుంచి కిందకు దూకేయమంటారా..అంటూ దాదాపు 100 మంది పీఈటీ టెట్ అభ్యర్థులు ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో స్థానిక అద్దంకి బస్టాండ్‌లోని ఓవర్‌హెడ్ ట్యాంక్‌పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. విషయం తెలియడంతో ఒన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని దిగిరావాలంటూ సూచించారు. టీడీపీ నాయకురాలితో వాగ్వాదం ఓవర్‌హెడ్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేయడం సరికాదని, సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు అందరు దిగి రావాలంటూ సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంలో అభ్యర్థులు ససేమిరా అన్నారు. ఇదే సమయంలో టీడీపీ నాయకురాలు ఒకరు వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడుదాం రండి.. అంటూ సూచించారు. ఈ క్రమంలో అభ్యర్థులు అసహనానికి గురయ్యారు. తమ ఓట్ల కోసం ఇళ్లకు వస్తారు.. ఇంతమందిమి ఆందోళన చేస్తుంటే వచ్చి తమ సమస్యను వినేందుకు ఓపిక లేదా.. ఎమ్మెల్యే అయినా.. ఎమ్మెల్సీ అయినా.. మంత్రి అయినా ఇక్కడకే రావాలంటూ పట్టుబట్టారు. జిల్లాలో 1200 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల మంది అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు. నిజంగా తమ సమస్య పరిష్కారం కోరుకునే వారే అయితే తమకు సంఘీభావంగా తమతో పాటు బైఠాయించి ప్రజానాయకులను రప్పించి హామీ ఇప్పించాలని పట్టుబట్టారు. ముందస్తు జాగ్రత్తలో పోలీసులు ఒక వైపు మహిళా నాయకురాలితో అభ్యర్థులు మాట్లాడుతుండగానే పోలీసులు ఓవర్‌హెడ్ ట్యాంక్‌పైకి చేరుకున్నారు. అభ్యర్థులకు నచ్చజెప్పి కిందకు దింపేందుకు యత్నించారు. అభ్యర్థులు మెట్ల మీదనే బైఠాయించి దిగకపోవడంతో పోలీసులు కూడా చేసేది లేక దిగువవున ఉన్న వారితో చర్చలు మొదలు పెట్టారు. అభ్యర్థులు మీడియా ఎదుట తమ సమస్యను ఏకరువు పెట్టారు. ఎస్సీఈఆర్టీ ప్రకారం పీఈటీ అభ్యర్థులకు టెట్ ఉండదన్నారు. కేంద్రం స్థాయిలో సైతం కేవలం సిటెట్ మాత్రమే ఉంటుందని, ఒకసారి ఉత్తీర్ణత సాధిస్తే మరోమారు హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నూతనంగా టెట్ అనే పరీక్ష తీసుకొచ్చి దానికి వెయిటేజీ నిర్ణయించి నిరుద్యోగులను దగా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమేనని, దానికి వెయిటేజీ కేటాయించడంలోనే అక్రమాలకు మార్గం సుగమం అయిందన్నారు. వెయిటేజీ కోసం టెట్ పరీక్ష నిర్వహించిన ప్రతిసారీ నిరుద్యోగి రూ.500 పరీక్ష ఫీజు, అప్లోడింగ్ కోసం కంప్యూటర్ సెంటర్లలో వంద రూపాయలతో పాటు కోచింగ్ కోసం కోచింగ్ సెంటర్లకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి రావడం, మరో వైపు ఉపాధి కూడా కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులు చాలవన్నట్లు ఈ నెల 19న జరగాల్సిన పీఈటీ టెట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు మీడియాలో రావడం తమను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ప్రధానంగా ఒక పీఈటీ రింగ్ లీడర్‌గా వ్యవహరించి ఎవరైతే అక్రమంగా పరీక్షలో పూర్తిస్థాయి మార్కులు రావాలని భావించారో వారికి తమిళనాడులో ఒకే సెంటర్ వచ్చేలా చేశారని, తద్వారా తాము ఎంత బాగా రాసినా లీకైన పేపర్ ద్వారా వారు పూర్తి మార్కులు సాధించి డీఎస్సీలో ఉద్యోగాలన్నీ కైవసం చేసుకోవడం ఖాయమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు, బెంగళూరు, తెలంగాణలోని సెంటర్లకు దరఖాస్తు చేసుకున్న ఏపీ పీఈటీ అభ్యర్థులకు ఏపీలోని సెంటర్లనే కేటాయించాలని, గతంలో కేటాయించిన ప్రశ్నపత్రాన్ని మార్చి వేసి నూతన ప్రశ్నపత్రాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. టెట్‌కు వెయిటేజీని రద్దు చేయాలన్నారు. టెట్ నోటిఫికేషన్, టెట్ పరీక్షకు మధ్య సమయం కూడా పెంచాలంటూ నినాదాలు చేశారు. ఎట్టకేలకు ఆందోళన విరమణ సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి జరిపిన చర్చలు చివరకు ఫలించాయి. తొలుత జేసీతో మాట్లాడించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. తీరా ఆమె కూడా అందుబాటులో లేరని తెలియడంతో మరోసారి అభ్యర్థులు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు పోలీసులు కూడా గ్రీవెన్స్‌లో కలెక్టర్‌తో మాట్లాడించేందుకు అనుమతిస్తామని హామీ ఇవ్వడంతో అభ్యర్థులు ఓవర్ హెడ్ ట్యాంక్‌పై నుంచి దిగి వచ్చారు. -
అవనిగడ్డలో ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు నూతనంగా ప్రవేశపెట్టిన టెట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో పీఈటీ అభ్యర్థులు ఆదివారం వాటర్ ట్యాంకు ఎక్కారు. పరీక్షను రద్దుచేస్తామని హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి దిగేది లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అభ్యర్థులను నచ్చజెప్పి కిందకు దించే ప్రయత్నాలు చేస్తున్నారు. టెట్ పరీక్షలో చెన్నై కేంద్రంగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెన్నైలో కొన్ని ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు ప్రత్యేక పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయించుకున్నారని అభ్యర్థులు పేర్కొన్నారు. పీఈటీ అభ్యర్థుల నుంచి వేల రుపాయలు వసూలు చేసి.. పేపర్ లీకేజీ చేయించేందుకే ఈ ఏర్పాట్లు చేశారని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలని పీఈటీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు కిందకు దిగి రావాలని కోరుతున్నారు. -
మిన్నంటిన రోదనలు
సాక్షి, జనగామ: డాడీ... అన్నయ్యా.. అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తున్న చిన్నోడు... భర్తను కోల్పోయి రోదిస్తున్న భార్య, బంధువుల రోదనలతో జనగామ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కంటతడి పెట్టింది. తండ్రీకొడుకుల మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరు కన్నీళ్ల పర్యంతమయ్యారు. అయ్యో..! బిడ్డా ఎంత పని జరిగిందంటూ భోరున విలపించారు. జనగామ మండలం యశ్వంతాపూర్ గ్రామానికి చెందిన తండ్రి బొట్ల వెంకటేష్, ఐదేళ్ల కుమారుడు సాయితేజ నీటి తొట్టెలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం ఇద్దరి మృతదేహాలను శనివారం రాత్రి జనగామ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకుల మరణవార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలి రావడంతో అక్కడ విషన్న వదనాలు అలుముకున్నాయి. వెంకటేష్ బంధువు బొట్ల సుధాకర్ గుండె పోటుతో మృతి చెందగా.. అంత్యక్రియలకు కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. అంత్యక్రియలు పూర్తి చేసుకుని.. తిరిగి వచ్చే క్రమంలో నేషనల్ హైవే పనులను కోసం ఏర్పాటు చేసి సంపు వద్దకు వెళ్లగా ప్రమాదవ శాత్తు అందులో పడి ఇద్దరు మృతి చెందారు. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న వెంకటేష్, సాయితేజ విధి వక్రీకరించి... తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయి.. కుటుంబ సభ్యులకు పుట్టెడు దుఖాన్ని మిగిల్చారు. మిత్రమా.. ఇక సెలవు.. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వెంకటేష్.. ఆయన కుమారుడు సాయితేజ మరణాన్ని తోటి స్నేహితులు తట్టుకోలేక పోతున్నారు. వెంకటేష్ చివరి చూపు కోసం ఆటో డ్రైవర్లతో పాటు చిన్న నాటి స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో గ్రామానికి తరలివచ్చారు. ఇంటి ఆవరణలో మృతదేహాలను ఒకే చోట పడుకోబెట్టారు. వెంకటేష్ చిన్న కుమారుడు చరణ్ తేజ వారిని చూస్తూ.. అమ్మా ఏమైంది అంటూ.. అడుగుతుంటే.. అక్కడ ఉన్న వారి గుండెలను పిండేసింది. వెంకటేష్ తండ్రి.. సాయితేజ తాత ఇద్దరికి చివరి మజిలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్థిక సాయం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన తండ్రీకొడుకుల కుటుంబానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రూ.20వేలు ఆర్థిక సాయం చేయగా, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బాల్దె సిద్దిలింగం, వీరేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బూరెడ్డి ప్రమోద్ కుమార్ రెడ్డిలు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కాగా నేషనల్ హైవే పనుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సంపు వద్ద ఎలాంటి చర్యలు లేక పోవడంతోనే తండ్రీకొడుకులు మృతి చెందారని గ్రామస్తులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. -
జిల్లా జడ్జి చెప్పినా.. పట్టదా?
ప్రొద్దుటూరు టౌన్ : అధికార పార్టీ నాయకులు తాము అనుకున్నదే చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెప్పినా.. పట్టించుకోలేదు. పట్టణంలోని గాంధీ పార్కులో ట్యాంక్ నిర్మాణ పనులను మున్సిపల్ పాలకవర్గం ఇటీవల ప్రారంభించింది. పార్కులో ట్యాంక్ నిర్మిస్తే.. ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని ప్రజలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే.. జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ దృష్టికి గురువారం తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన జడ్జి అక్కడ ట్యాంక్ నిర్మాణ పనులు ఆపాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు తెలిపారు. అలాగే అని కమిషనర్ జడ్జికి చెప్పారు. ఒక రోజు కూడా గడవక ముం దే తిరిగి పనులు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి 11.30 గంటల నుంచి శని వారం తెల్లవారుజామున 5.30 వరకు అధికార పార్టీకి చెందిన రామాపురం వాసి హిటాచితో వందల ట్రాక్టర్ల మట్టిని తరలించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకా రం క్రీడా మైదానాలు, ఉద్యానవనాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదనే నిబంధనలు ఉన్నా.. అధికార పార్టీ నేతలు తుంగలో తొక్కి పార్కులో పెద్ద గోతులు తవ్వడం పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ట్రాక్టర్ మట్టిని రూ.1000కి పైగా విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. అయినా మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఈ విషయంపై వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి అర్ధరాత్రి ఫోన్ చేసినా కమిషనర్ తీయలేదు. శనివారం ఉదయం ఆయన కమిషనర్‌కు తెలిపినా.. కనీసం పార్కులోకి వెళ్లి పరిశీలించిన దాఖలాలు లేవు. ఏది ఏమైనా పార్కులో అర్ధరాత్రి మట్టి తరలింపు చేస్తుంటే.. అధికార పార్టీ నేతల ఆగడాలు శ్రుతిమించాయని స్పష్టమవుతోంది. అర్ధరాత్రి హిటాచిని ఏర్పాటు చేసి ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తుంటే.. అక్కడ పోలీసు వాహనంతోపాటు ఎస్ఐ, సిబ్బంది పహారా కాయడం కనిపించింది. -
ఆటలాడుతూ అనంతలోకాలకు..
శాయంపేట(భూపాలపల్లి): ఆటలాడుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న నీటితొట్టిలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన మండలకేంద్రంలోని బీసీ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన మెండు రామకృష్ణ, రాజేశ్వరిలకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్దకుమారుడు మెండు భార్గవ్(8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి పూర్తి చేసుకుని వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో భార్గవ్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రదేశాలను, వివాహాల వద్ద వెతికారు. వాట్సప్‌లో భార్గవ్ ఫొటోతో కనిపించడంలేదంటూ సమాచారాన్ని చేరవేసారు. రాత్రంతా బంధువులు, తెలిసిన చోటల్లా వెతికినప్పటికీ ఎక్కడా కూడా కనిపించలేదు. శుక్రవారం ఉదయాన్ని ఇంటి సమీపంలోని ఓ సంఘం బిల్డింగ్ సమీపంలో ఉన్న నీటితొట్టిలో పడి మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బాలుడు తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని భార్గవ్ మృతదేహాన్ని చూసి చేసిన రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. గతంలో ఇదే నీటితొట్టిలో లేగదూడ పడి మృత్యువాత పడినప్పటికీ సంబంధిత సంఘం సభ్యులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మళ్లీ అదే తొట్టిలో బాలుడు పడి మృతిచెందడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
న్యాయం చేయండి.. లేకపోతే దూకుతా
సాలూరు : ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీకంగా అనుభవించి ఇప్పుడేమో పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవాలని చూస్తున్న యువకుడితో వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ వాటర్‌ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన సాలూరు మండలం మజ్జలపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మావుడి గ్రామానికి చెందిన పెదపల్లి కృష్ణవేణి సాలూరు పట్టణంలోని మజ్జలపేట తాగునీటి రిజర్వాయర్‌పైకి గురువారం ఉదయం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడింది. విషయం తెలుసుకున్న పట్టణ, రూరల్ ఎస్సైలు ఫకృద్దీన్, గణేష్‌తో పాటు అగ్నిమాపకాధికారి నోమేశ్వరరావు కూడా సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిందకు దిగాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె తనకు చావే శరణ్యమని, తనను మోసగించిన యువకుడితో వివాహం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసింది. దీంతో పట్టణ ఎస్సై సమాచారాన్ని ఏఎస్పీ దీపికా పాటిల్‌కు ఫోన్లో సమాచారం అందించారు. ఆమె ఫోన్లో నేరుగా బాధిత మహిళతో మాట్లాడుతూ, ఆ యువకుడితో వివాహం చేయిస్తానని హామీ ఇవ్వడంతో బాధితురాలు కిందకు దిగింది. వెంటనే ఆమెను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటికే పార్వతీపురం నుంచి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఏఎస్పీ బాధిత మహిళకు కౌన్సెలింగ్ చేశారు. మోసం చేయాలని చూస్తున్నాడు వాటర్ ట్యాంకు నుంచి కిందకు దిగిన అనంతరం కృష్ణవేణి మాట్లాడుతూ, తనకు ఇదివరకే వివాహమై ఒక కుమారుడు కూడా ఉన్నాడన్నారు. అయితే వారితో వేరుపడి జీవిస్తున్నానని, ఈ నేపథ్యంలో తాను హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసుకునేందుకు వెళ్తుండగా.. విశాఖ బస్టాండ్‌లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సీతాపురం గ్రామానికి చెందిన దుంపల అప్పారావుతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శరీరకంగా దగ్గరవడమే కాకుండా అతని ఇంటికి కూడా తీసుకువెళ్లాడని చెప్పింది. అలాగే తన ఇంటికి కూడా వారి కుటుంబ సభ్యులు వచ్చి వెళ్లేవారని తెలిపింది. అయితే కొంతకాలంగా తనను దూరంపెడుతున్నారని, పెళ్లి చేసుకోవాలంటే రూ. 5 లక్షల కట్నం, 2 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని ఆరు రోజుల కిందట రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపింది. పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారే తప్ప తనకు న్యాయం చేయడం లేదని ఆరోపించింది. అందుకే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని వాటర్ ట్యాంక్ ఎక్కానని వివరించింది. -
నిర్లక్ష్యం మింగేసింది
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ) : జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఓ బాలుడి నిండు జీవితాన్ని మింగేసింది. సూయెజ్ ట్యాంక్ రెండేళ్లుగా పనిచేయకున్నా కనీస రక్షణ వలయం ఏర్పాటు చేయకపోవడంతో అందులో పడి ఏడేళ్లు బాలుడు దుర్మరణం పాలయ్యా డు. హృదయాలను కలిచివేసే ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జ్ఞానాపురం జేఎన్ఎన్యూఆర్ఎమ్ కాలనీకి వెనుక భాగంలో ఉన్న సూయెజ్ ట్యాంకు రెండేళ్లుగా పనిచేయడం లేదు. అప్పటి నుంచి దీని నిర్వహణను జీవీఎంసీ అధికారులు గాలికొదిలేశారు. ఈ ట్యాంకు భూ మట్టానికి కేవలం నాలుగు అడుగుల ఎత్తులోనే ఉన్నప్పటికీ అవసరమైన రక్షణ వలయం ఏర్పాటు చేయడంగానీ, ఇతరులు అక్కడికి వెళ్లకుండా కంచెగానీ ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇదే జేఎన్ఎన్యూఆర్ఎమ్ కాలనీలో నివాసముంటున్న కొండలరావు, రాజేశ్వరికి నవీన్(7)తోపాటు ఐదేళ్ల మరో కుమారుడు ఉన్నాడు. వీరిలో నవీన్ బుధవారం సాయంత్రం కాలనీ సమీపంలో ఆడకుంటూ సూయెజ్ ట్యాంక్ వద్దకు చేరి ప్రమాదవశాత్తూ అందులోకి జారిపోయాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది కూడా గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో రెస్క్యూ టీమ్‌కు సమాచారమిచ్చారు. వారు ట్యాంక్‌లో గాలించి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం కంచరపాలెం పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సూయెజ్ ట్యాంక్ వద్ద కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం సంభవించి బాలుడు మృతి చెందాడని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకున్నారు. ఈ ఘటనతో జేఎన్ఎన్యూఆర్ఎమ్ కాలనీలో విషాదం అలుముకుంది. ఎస్ఐ సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూలితేనే స్పందిస్తారా!
ధరూరు : అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించిన ట్యాంకులవి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా గ్రామాల ప్రజలకు తాగునీరందించిన ట్యాంకులు.. నాసిరకం పనులతో.. ఎక్కడికక్కడ సీకులు తేలిపోయాయి. ఈ ట్యాంకులతో గ్రామీణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 20 ఏళ్ల వరకు మాత్రమే... సాధారణంగా ట్యాంకు నిర్మాణం జరిగినప్పటి నుంచి 20 ఏళ్ల వరకు మాత్రమే ఆ ట్యాంకులను వాడాలి. అలాంటిది ధరూరులో ఉన్న ట్యాంకు 40 ఏళ్లు గడుస్తున్నా నేటికీ దాని ద్వారా నీటిని వదులుతూనే ఉన్నారు. ట్యాంకుల కాలం చెల్లిన విషయం అధికారులకు తెలిసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ట్యాంకుల పక్కన ఉంటున్న నివాస గృహాల వారు, పాఠశాలలు, అంగన్వాడీ కంద్రాల విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరమ్మతులు కరువు.. శిథిలావస్థలో ఉన్న ట్యాంకులకు కనీసం మరమ్మతులు చేయించడం లేదు. ట్యాంకు అడుగు భాగం, రౌండ్ పిల్లర్లకు సిమెంట్‌ను కూడా ప్లాస్టర్ చేయించలేదు. దీంతో తేలిపోయిన మేకులు వర్షానికి తడిసి చిలుము వస్తున్నాయి. ఇదీ పరిస్థితి... మండలంలో చాలా గ్రామాల్లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మేకులు తేలి ప్రమాదకరంగా మారాయి. ఈ ట్యాంకులను గతంలో ఆర్‌డబ్లూస్ ఏఈగా పనిచేసిన బషీర్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం నాలుగేళ్ల క్రితం నీటిని నింపడం ఆపివేశారు. గ్రామంలో రెండే ట్యాంకులు ఉండటం.. పెద్ద గ్రామం కావడంతో తిరిగి ఆ ట్యాంకును వినియోగంలోకి తీసుకొచ్చారు. వీటితో పాటు పారుచర్ల, మార్లబీడు తదితర గ్రామాల్లోని ట్యాంకులు శిథిలావస్థలో ఉన్నాయి. ప్రతిపసాదనలు పంపించాం.. ధరూరులోని ఎస్సీ కాలనీలోని ట్యాంకు తొలగించాల్సి ఉంది. ప్రతిపసాదనలు పంపించాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే పనులు చేపడుతాం. త్వరలో మిషన్ భగీరథ ట్యాంకులు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంలో పాత ట్యాంకును తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. – పరమేష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భయంగా ఉంది.. మేము ట్యాంకు పక్కనే నివాసముంటున్నాం. ఏ క్షణం కూలు తుం దోనని భయంగా జీవనం సాగిస్తున్నాం. అధికారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. – వెంకటన్న,ఎస్సీ కాలనీవాసి, ధరూరు -
మనస్తాపంతో వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ
వట్టిచెరుకూరు(ప్రత్తిపాడు): వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామానికి చెందిన పి.లక్ష్మి అలియాస్ అంకమ్మ అనే మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. లక్ష్మి ఒక్కసారిగా వాటర్ ట్యాంక్ ఎక్కడంతో గ్రామంలో టెన్షన్ వాతవరణం ఏర్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పుల్లడిగుంటకు చెందిన పి.లక్ష్మి పాత మద్రాస్ రోడ్డు పక్కన తోపుడు బండిపై టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. గతేడాది నవంబరులో పాత మద్రాస్ రోడ్డు వెడల్పు చేయడంతో రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న టిఫిన్ బండిని తీసి వేయాల్సివచ్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా లక్ష్మి గుంటూరు వైపు రోడ్డులో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుంది. రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావడంతో గతంలో తాను టిఫిన్ సెంటర్ పెట్టుకున్న ప్రదేశంలో తిరిగి టిఫిన్ బండి పెట్టుకుందామని వెళ్లగా, అప్పటికే వేరే వ్యక్తి అక్కడ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయటంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది దీంతో మనస్తాపంతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి లక్ష్మితో మాట్లాడి కిందికి దించారు. పోలిస్‌స్టేషన్‌కు అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. -
బిస్కెట్ అందుకోబోయి..
నల్లగొండ, మోత్కూరు (తుంగతుర్తి) : బుడి బుడి అడుగులు.. ముద్దు.. ముద్దు మాటలతో నవ్వులొలికించే ఆ చిన్నా రి కాసేపట్లోనే కానరాని లోకాలకు వెళ్లిపోయి తల్లిదండ్రికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాదకర ఘటన మోత్కూరు మండలం ధర్మాపురంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రావుల సత్తయ్య–కమలమ్మ కూతురు హేమలత డెలవరీకి మూడు మాసాల క్రితం తల్లిగారింటికి వచ్చింది. రెండు రెండు నెలల క్రితం చిన్నారికి జన్మనిచ్చింది. మొదటి కూతురు యేడాదిన్నర చిన్నారి రిశ్విత ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా అమ్మమ్మ ఇంటిలోపల పనుల్లో ఉన్నారు. రిశ్విత ఆడుకుంటున్న సమయంలో తన చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడిపోయింది. దానిని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు చిన్నారి రిశ్విత పడి అక్కడికక్కడే మృతిచెందింది. కాసేపటి తర్వాత చిన్నారి గురించి ఆరా తీయగా నీటి సంపులో విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. చిన్నారి తల్లిదండ్రులు హేమలత–మల్లేష్, అమ్మమ్మ–తాత కమలమ్మ, సత్తయ్యలు రోదనలు మిన్నంటాయి. -
మన పిల్లలను మనమే చంపుతున్నామా..?!
♦ బుడి బుడి అడుగుల బుడ్డి బుడ్డి పిల్లలు. ♦ వారు వేరెవరో కాదు.. మన కన్న బిడ్డలే. ♦ చూస్తుండగానే.. క్షణాల్లోనే చనిపోతున్నారు...! ♦ కాద్కాదు.. మనమే చంపేస్తున్నాం...!! ♦ మనమే హంతకులం.. ముమ్మాటికీ మనమే..!!! చింతకాని(మధిర): ఇది చదువుతుంటే.. నమ్మలేనట్టుగా, ఆశ్చర్యంగా, బాధగా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే.. ఈ కథనం చివరిదాకా చదవండి. రెండేళ్లకే నూరేళ్లు నిండాయి ⇒ చింతకాని మండలం నాగిలిగొండ గ్రామానికి చెందిన పంది నరేష్, సరిత దంపతులకు కుమారుడు నాగచైతన్య. వాడి వయసు రెండే ళ్లు. వాడికో బుడ్డి చెల్లి కూడా ఉంది. దాని వయసు తొమ్మిది నెలలు. ఆ బుడ్డోడు ప్రతి రోజూ చుట్టుపక్కల ఇళ్లల్లోకి బుడి బుడి అడుగులు వేసుకుంటూ వెళ్లి ఆడుకుంటాడు. అక్కడున్న వారికి బుజ్జి బుజ్జి మాటలతో కబుర్లు చెబుతాడు. అందరినీ అలరిస్తాడు. ⇒ మంగళవారం ఉదయం, వరి పొలానికి మందు చల్లేందుకని ట్రాక్టర్‌పై మందు కట్టలు వేసుకుని వెళ్లేందుకు తండ్రి నరేష్ సిద్ధమయ్యాడు. బుడ్డి నాగచైతన్య వెంటపడ్డాడు. తాను కూడా వస్తానంటూ ఏడుస్తున్నాడు. వాడిని ఇంట్లోకి తండ్రి తీసుకెళ్లాడు. తల్లి వద్ద వదిలేసి వెళ్లాడు. ⇒ ఆ బుడ్డోడిని తల్లి బుజ్జగించింది. కొద్దిసేపటి తరువాత వాడు ఏడుపు మానాడు. ఆమె ఆ పాప ఆలనాపాలనా చూసుకుంటోంది. ఆ బుడ్డోడు, రోజులాగానే తమ ఇంటికి పక్కనే ఉన్న కనగంటి ప్రవీణ్ ఇంటికి ఆడుకునేందుకు వెళ్లాడు. ⇒ ప్రవీణ్–శ్రీలత దంపతులకు కూడా ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. ఈ బుడ్డోడి(నాగచైతన్య)ని ఆమె వాళ్ల ఇంటికి పంపించింది. తన బుజ్జి బాబును చూసుకోవడంలో నిమగ్నమైంది. ⇒ ఆ గడుగ్గాయి బుడ్డోడు (నాగచైతన్య) చిన్న టవల్ తీసుకుని మళ్లీ బయటికొచ్చాడు. తిన్నగా ప్రవీణ్ ఇంట్లోకి వెళ్లాడు. వాడిని శ్రీలత ఏమాత్రం గమనించలేదు. తన పనుల్లో, బుజ్జి బాబును చూసుకోవడంలో నిమగ్నమైంది. ⇒ వాళ్ల ఇంటి వెనుకనున్న నీటి తొట్టి వద్దకు బుడ్డి నాగచైతన్య వెళ్లాడు. అందులోని నీటిలో టవల్‌ను ముంచి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. మూడు అడుగుల లోతున్న ఆ తొట్టిలో బుడ్డోడు పడిపోయాడు. ⇒ పొలం వద్దకు వెళ్లిన ప్రవీణ్, ఇంటికి వచ్చాడు. కాళ్లు కడుక్కునేందుకని నీటి తొట్టి వద్దకు వెళ్లాడు. షాక్... తొట్టిలో బుడ్డి నాగచైతన్య కనిపించాడు. బయటకు తీశాడు. కొన ఊపిరితో ఉన్నాడేమోనని శరీరంపై చేతులతో రుద్దాడు. అప్పటికే నాగచైతన్య ప్రాణాలు గాల్లో కలిశాయి. ⇒ ప్రవీణ్–శ్రీలత దంపతులు నాగచైతన్య ఇంటికి వెళ్లి, వాడి తల్లికి చెప్పారు. విగత జీవిగా మారిన కొడుకుని చూసిన ఆ తల్లి సొమ్మసిల్లింది. ⇒ అప్పటికి అరగంట కిందటే పొలం వద్దకు వెళ్లిన నరేష్, ఈ దుర్వార్తతో ఏడ్చుకుంటూ పరుగు పరుగున ఇంటికొచ్చాడు. కుమారుడి మృతదేహంపై పడి ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నాయనమ్మ ఉండి ఉంటే.. ⇒ నాగచైతన్యను రోజూ నాయనమ్మ చూసుకుంటోంది. ఆమె మంగళవారం, కిరోసిన్ తెచ్చేందుకని రేషన్ డీలర్ వద్దకు వెళ్లింది. కిరోసిన్ తీసుకుని ఇంటికి వచ్చేప్పటికే ఘోరం జరిగింది. ఆమె గుండె పగిలేలా రోదిస్తోంది. ‘‘నేను బయటకు వెళ్లకుండా ఉంటే నా మనవడు దక్కేవాడు’’ అంటే గుండెలు బాదుకుంటోంది. మన నిర్లక్ష్యమే చంపేసింది ⇒ ఇప్పుడు చెప్పండి... ఈ బుడ్డోడిని చంపింది ఎవరు? మన నిర్లక్ష్యం కాదా? పిల్లాడిని అలా బయటకు పంపిన తల్లిదండ్రుల నిర్లక్ష్యం.. నీటి తొట్టిపై మూత వేయని నిర్లక్ష్యం,.. ఈ నిర్లక్ష్యమే ఆ బుడ్డోడని చంపేసింది. గతంలోనూ అచ్చం ఇలాగే పిల్లలు చనిపోయిన ఘటనలు జరిగాయి. ⇒ ఇప్పుడు నిజాయితీగా, గుండెలపై చేయి వేసుకుని చెప్పండి.. ఈ బుడ్డోడి చావుకు మనం కారణం కాదా? మనలోని నిర్లక్ష్యం కారణం కాదా? మనం హంతకులం కాదా..? -
వాటర్ ట్యాంక్ కూలి ఇద్దరి మృతి
అహ్మదాబాద్: ఓ భవనం పై ఉన్న నీటి ట్యాంక్ కూలి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని నారన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి శాస్ర్తినగర్‌లో ఓ మూడంతస్థుల భవనం పై ఉన్న 5 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ గురువారం నేల కూలింది. ఆ సమయంలో భవనం దగ్గరున్న ఐదుగురిపై వాటర్ ట్యాంక్ పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
ఆశల దీపం ఆరిపోయింది!
నీటి తొట్టిలో పడి ఒక్కగానొక్క కుమారుడి మృతి కౌతాళం: ముగ్గురు కుమార్తెల తర్వాత జన్మించిన కుమారుడిని అల్లారు ముద్దుగా చూసుకున్నారు. ఇంటి వారసుడు పుట్టాడని కుటుంబమంతా సంతోషపడింది. ఇంతలోనే వారి ఆనందాన్ని విధి కాటేసింది. నీటి తొట్టి రూపంలో రెండేళ్ల చిన్నారిని మృత్యువు పొట్టున పెట్టుకుంది. ఈ విషాద ఘటన కౌతాళంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక ఎన్టీఆర్ నగర్లో నివసిస్తున్న కృష్ణ, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక్కగానొక్క కుమారుడు ఆంజనేయులు (2) సంతానం. శుక్రవారం లక్ష్మమ్మ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో భర్త ఆదోనికి తీసుకెళ్లాడు. బాలుడిని నానమ్మ వద్ద వదిలి వెళ్లారు. రోజు మాదిరిగానే ఇంటి ముందు ఆడుకుంటుండగా నానమ్మ ఇంటి పనిలో నిమగ్నమైంది. ప్రమాదవశాత్తు రహదారి పక్కనే ఉన్న వీధి నీటి తొట్టిలో బాలుడు పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. కొద్ది సేపటికి చిన్నారి కనిపించకపోవడంతో అనుమానంతో నీటి తొట్టిలో చూడగా విగత జీవిగా కనిపించాడు. ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
హత్య చేసి..నీళ్ల ట్యాంకులో పడేసి
- వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ - దారుణానికి పాల్పడిన ఐదుగురు నిందితులు అరెస్టు - వివరాలు వెల్లడించిన ఎస్పీ ఆకె రవికృష్ణ కర్నూలు: కర్నూలు నగరం టీచర్స్ కాలనీ బల్వరీ అపార్టుమెంటుపైన నీళ్ల ట్యాంకులో గుర్తు తెలియని మహిళ మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తలపై ఐరన్‌రాడ్డుతో బాది హత్య చేసి నీళ్ల ట్యాంకులో పడేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని మంగళవారం సాయంత్రం ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. అడిషనల్ ఎస్పీ షేక్షావలీ, కర్నూలు డీఎస్పీ రమణమూర్తితో కలిసి డీపీఓలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన లిఫ్ట్‌మెకానిక్ శ్రీనివాసరెడ్డి, కర్నూలు నగరం భగత్‌సింగ్ నగర్‌కు చెందిన మరో మెకానిక్ కాశపోగు మార్క్ అలియాస్ రాజు, గౌండ పని చేస్తూ జీవనం సాగిస్తున్న కాశపోగు కళ్యాణ్, అపార్టుమెంట్ యజమాని కుమారుడు కర్నూలు నగరం గడ్డ వీధికి చెందిన బల్వరి అబ్దుల్ హఫీజ్ ఎల్తైశ్యామ్, మెకానిక్ అసిస్టెంట్ భగత్‌సింగ్ కాలనీ వాసి మండ్ల సురేష్ తదితరులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య ఎందుకు చేశారంటే.. కర్నూలులోని కొత్తబస్టాండు వద్ద ఉన్న ఓ మహిళను తీసుకొని శ్రీనివాసరెడ్డి.. బల్వరి అపార్టుమెంట్ పెంటు హౌసుకు తీసుకెళ్లాడు. మిగిలిన నలుగురితో కలిసి శారీరకంగా అనుభవించారు. డబ్బు విషయంలో శ్రీనివాసరెడ్డితో ఆ మహిళ గొడవపడింది. దీంతో సమీపంలో ఉన్న ఐరన్‌రాడ్డుతో ఆమె తలపై బాదగా అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాసరెడ్డి, మార్కు, కళ్యాణ్ కలిసి ఆమె మృతదేహాన్ని టెంటుహౌసు పైనున్న వాడుకలోలేని నీటి ట్యాంకులో పడేసి మూతపెట్టి పరారయ్యారు. బయటపడిందిలా.. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన అపార్టుమెంట్ వాచ్మెన్ బావమరిది అయిన చాకలి రాజు ట్యాంకును శుభ్రం చేసేందుకు మూత తెరిచి చూడగా మృతదేహం బయటపడింది. ఫ్లోరుకు రెండు ప్లాట్లు ప్రకారం నాలుగు ఫ్లోర్లల్లో ఎనిమిది కుటుంబాలు ఇందులో నివాసం ఉంటున్నాయి. చివరి అంతస్తులో పెంట్‌హౌస్ ఉంది. అపార్టుమెంటులో నివాసం ఉన్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ నాగేంద్ర పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి అనుమానాస్పదం కింద కేసు నమోదు చేశారు. రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేయడంతో పోలీసుల నుంచి తప్పించుకోలేమని భావించి నిందితులు మంగళవారం ఉదయం కర్నూలు ఆర్ఐ దగ్గర లొంగిపోయారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన ఆయుధం, మృతురాలికి సంబంధించిన ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2016 డిసెంబరు 27వ తేదీన మహిళను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. కేసు మిస్టరీని ఛేదించి.. నిందితులను అరెస్టు చేసినందుకు రెండో పట్టణ సీఐ డేగల ప్రభాకర్, ఎస్ఐలు మోహన్‌కిషోర్‌రెడ్డి, సీహెచ్ ఖాజావలీ, పి.తిరుపాలు, ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కరీంబాషా, కానిస్టేబుల్ కృష్ణ, సుంకన్న, వర కుమార్, అయూబ్‌ఖాన్, అమర్నాథ్రెడ్డి తదితరులను ఎస్పీ అభినందించారు. -
వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం
- హత్యనా? ఆత్మహత్యనా? - ఆలస్యంగా వెలుగులోకి - ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కర్నూలు: కర్నూలు నగరం టీచర్స్ కాలనీలో బుధవారం.. ఓ మహిళ మృతదేహం వాటర్ ట్యాంక్‌లో కనిపించింది. మృతదేహం గుర్తు పట్టని విధంగా ఉంది. హత్య జరిగిందా..ఆత్మహత్యనా అనే విషయాలు తెలియరాలేదు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు ఇవీ.. నగరంలోని టీచర్స్ కాలనీలో (తనిష్క్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా) బల్వారి అపార్టుమెంటు ఉంది. ఫ్లోరుకు రెండు ప్లాట్ల ప్రకారం నాలుగు ఫ్లోర్లలో 8 కుటుంబాలు ఇందులో నివాసం ఉంటున్నాయి. చివరి అంతస్తులో పెంటౌస్, రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో బోరు నీళ్లకు సంబంధించిన ట్యాంకు మాత్రమే అపార్టుమెంటు వాసులు ఉపయోగిస్తున్నారు. మున్సిపల్ వాటర్ కనెక్షన్‌కు సంబంధించి మరో ట్యాంకు ఏర్పాటు చేసినప్పటికీ నాలుగు నెలలుగా నిరుపయోగంగా ఉంది. ట్యాంకును శుభ్రం చేసి కొళాయి కనెక్షన్ తీసుకునేందుకు బుధవారం ఉదయం అపార్టుమెంటు నిర్వాహకులు ట్యాంకును ఓపెన్ చేయగా అందులో మహిళ మృతదేహం బయటపడింది. సుమారు 30 సంవత్సరాల వయస్సు ఉండి, మృతదేహం కుళ్లిపోయి పురుగులు పట్టి ఉంది. గుర్తుపట్టని విధంగా ఉండటంతో, అందులో నివాసం ఉన్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్పీ ఆకె రవికృష్ణ మధ్యాహ్నం సంఘటన స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ఇన్చార్జి డీఎస్పీ మురళీధర్, రెండో పట్టణ ఇన్చార్జి సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐలు ఖాజావలీ, మోహన్ కిషోర్, చంద్రశేఖర్ తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు. హత్య చేసి నీళ్ల ట్యాంకులో పడవేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు.. స్థానిక డాక్టర్లను సంప్రదించగా, కాలాతీతమైనందున గురువారానికి వాయిదా వేశారు. మృతదేహానికి పురుగులు పట్టి ఎముకలు తేలి ఉన్నాయి. మృతదేహానికి గాయాలు ఉన్నాయా? లేదా అన్న విషయం పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది. ఎస్పీ ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. గత మూడు నెలల కాలంలో చుట్టుముట్టు కాలనీలో ఉన్న మహిళలు ఎవరైనా అదృశ్యమయ్యారా అనే కోణంలో విచారిస్తున్నారు. తప్పిపోయిన మహిళా బాధితులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాలని పోలీసులు సూచిస్తున్నారు. కర్నూలు వీఆర్ఓ మద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని హత్యనా, ఆత్మహత్యనా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని ఇన్చార్జి సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. -
వాటర్ ట్యాంక్‌లో ఐఐటీ విద్యార్థి శవం
-
వాటర్ ట్యాంకర్లో శవం!!
-
గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో డొల్ల
-
నీటి సంపులో పడి చిన్నారి
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండలో విషాద సంఘటన వెలుగు చూసింది. పండుగకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ చిన్నారి నీటి సంపులో పడి మృతిచెందాడు. చండూరుకు చెందిన యాదయ్య, యాదమ్మ దంపతులు సంక్రాంతి పండుగకు దేవరకొండ హనుమాన్‌నగర్‌లోని అత్తగారింటికి వెళ్లారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంత పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో యాదయ్య యాదమ్మ దంపతుల రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటిసంపులో పడ్డాడు. ఎవరు గుర్తించకపోవడంతో నీట మునిగి మృతిచెందాడు. దీంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
నీళ్లట్యాంకులో గుర్తు తెలియని శవం
కల్లూరు (రూరల్): కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టు సమీపంలో నీళ్లట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సోమవారం సమాచారం అందుకున్న కర్నూలు రూరల్ సీఐ నాగరాజు యాదవ్, ఉలిందకొండ ఎస్ఐ వెంకటేశ్వరరావు, దూపాడు వీఆర్ఓ బాలన్న సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి వయస్సు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలోపు ఉంటుంది. శరీరంపై బట్టలు లేవు. 8 అడుగుల నీటి ట్యాంకులో సుమారు 6 వారాల నుంచి 8 వారాలు మృతదేహం ఉండడంతో పూర్తిగా కుళ్లిపోయి గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొంది. ట్యాంకులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించారు. ఫోరెన్సిక్ డాక్టర్ శంకర్ నాయక్‌తో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి
బీబీనగర్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. జిల్లాలోని బీబీనగర్ మండలం కొండమడుగులో శనివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో తల్లిదండ్రులు గమనించకపోవడంతో.. నీటి సంపులో పడి మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
పెనుబల్లి (ఖమ్మం) : ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న వెంకటేష్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి లోకేష్(14 నెలల) అనే బాబు ఉన్నాడు. గురువారం వెంకటేష్ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో అతని భార్య ఇంటి పనులు చక్కబెడుతుండగా.. ఇంటి ముందు ఆడుకుంటున్న లోకేష్ ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడి మృతిచెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.