
ఖమ్మంఅర్బన్: నగరం నడిబొడ్డున నియోజకవర్గ ప్రజాప్రతినిధి క్యాంప్ కార్యాలయం, జేసీ క్యాంప్ కార్యాలయాల సమీపంలో ఉన్న దుమ్ముగూడెం సీఈ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై ఎప్పుడో నిర్మించిన, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంక్ ఉంది. అయితే అది ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ట్యాంక్ ద్వారా నీటిని వినియోగించక పోవడంతో అనేక సంవత్సరాల కిందట నిర్మించిన ట్యాంక్ సిమెంట్ పెచ్చులుగా రాలి పడుతూ నిర్మాణానికి ఉపయోగించిన ఇనుప సువ్వలు బయటకు వచ్చి రాలి పడుతున్నాయి. దాని చుట్టూత కూడా కంపచెట్లు పెరిగి ఉన్నాయి. ఆ ట్యాంక్‌తో ఎలాంటి ఉపయోగం లేనందున నేలమట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.