మృతదేహం ఉన్న పైపును కట్ చేస్తున్న కార్మికులు
ఖమ్మం మయూరిసెంటర్: భారీ మంచినీటి ట్యాంకును శుభ్రం చేసే యత్నంలో ఓ కార్మికుడు నీటిపైపు లో జారి పడి ప్రాణాలు పోగొట్టుకు న్నాడు. మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. రోజువారీ కార్మికుడితో..: ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని వాటర్ ట్యాంకులను అనుభవం కలిగిన పారిశుధ్య కార్మికులతో పదిహేను రోజులకోసారి శుభ్రం చేయిస్తారు. కార్మికులు తక్కువగా ఉండటంతో మంగళవారం రోజువారీ వేతన కార్మికుడు చిర్రా సందీప్(23)కు పని అప్పగించారు.
ఉదయం సందీప్ మరో ఇద్దరితో కలిసి నయాబజార్ కళాశాల పక్కన ఉన్న వాటర్‌ట్యాంక్ ఎక్కాడు. ట్యాంక్ లోపలికి దిగి శుభ్రం చేస్తున్న సందీప్ ప్రమాదవశాత్తు పైపులో జారిపడ్డాడు. మిగతా ఇద్దరు కార్మికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కేఎంసీ రెస్క్యూ టీం వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. సందీప్ జారిపడిన పైపు దిగువన తెరిచి చూడగా అతను కనిపించలేదు. కొంచెం దూరంలో జేసీబీతో మట్టిని తొలగించి పైపును పగులగొట్టడంతో సందీప్ కాళ్లు కనిపించాయి.
చదవండి👉🏼 ట్యాంక్‌బండ్‌పై నో పార్కింగ్.. బండి పెట్టారో.. రూ.1000 కట్టాలి!
మృతదేహాన్ని బయటికి తీసేసరికి సాయంత్రం 5.20 గంటలు దాటింది. కాగా, నైపుణ్యం లేని కార్మికులతో పనిచేయించడంతో సందీప్ చనిపోయా డంటూ కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి రూ.6 లక్షల పరిహారం, ఇంటి స్థలం, కుటుం బంలో ఒకరికి కేఎంసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని పోలీసులు, రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
చదవండి👉🏻 మాస్టారు పాడె మోసిన మంత్రి ‘ఎర్రబెల్లి’
Comments
Please login to add a commentAdd a comment