Municipal Corporation
-
తుని మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా
సాక్షి, కాకినాడ జిల్లా: నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ దౌర్జన్యాలు, అరాచకాలతో తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. తునిలో టీడీపీ గూండాల దౌర్జన్యకాండకు దిగారు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సాస్‌పీ వారే. ప్రలోభపెట్టి, భయపెట్టి 10 మంది టీడీపీ లాక్కుంది. వైఎస్సార్సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ గూండాలు దాడి చేసి.. మున్సిపల్ ఆఫీస్‌లో వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు.దీంతో ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద కర్రలతో టీడీపీ గూండాలు మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నాటీడీపీ గూండాలు పట్టించుకోలేదు. తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికను అడ్డుకున్న టీడీపీ గుండాలు.. నాలుగోసారి అడ్డుకున్నారు.తునిలో పోలీస్ బందోబస్తు లేదంటూ వైఎస్సార్సీపీ నేత దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ‘‘తునిలో టీడీపీ గూండాలే కనిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు’’ అని దాడిశెట్టి పేర్కొన్నారు. తుని వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలను పిఠాపురం టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. -
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి దౌర్జానాల మధ్య సగం చోట్ల ఎన్నికల వాయిదా. 3 కార్పోరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు జరగాల్సి ఉండగా 5 చోట్ల జరగని ఎన్నికలు
-
ఏంది బాలయ్య.. ఇదీ ఓ గెలుపేనా?
సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సభ్యులపై ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. మాట వినని వాళ్లను బెదిరించడమే కాదు.. ఎత్తుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్యాయంగా పదవులు లాక్కుని.. తమదే గెలుపంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. ఈ క్రమంలో..హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలోనే బరితెగింపు వ్యవహారం నడిచింది. 23 మంది సభ్యుల మద్దతుతో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి సొంతం చేసుకుంది టీడీపీ. అయితే.. బలం లేకున్నా అన్యాయంగా చైర్మన్ పదవి లాక్కోవడం ఇక్కడ దారుణం.ఇక్కడ మొత్తం 38 వార్డులు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో 30 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈసారి ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టాలని టీడీపీ నేతలను ఎమ్మెల్యే బాలయ్య దగ్గురుండి ప్రోత్సహించారు. మాట వినని కౌన్సిలర్లను బెదిరించారు కూడా. అలా.. 16 మందిని తనవైపునకు తిప్పుకుంది. ఈ అరాచకాలను చూసి ‘‘ఏంది బాలయ్య ఇది?’’ అంటూ హిందూపురం వాసులు విస్తుపోతున్నారు. డాకు బాలయ్యా.. ఇదీ ఓ గెలుపేనా?హిందూపురంలో టీడీపీ విజయం అనైతికమని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అంటున్నారు. ‘‘హిందూపురంలో 38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైఎస్సార్ సీపీ కి బలం ఉంది. ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చూసి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను లాక్కున్నారు. ఓ డాకూలా ఎమ్మెల్యే బాలకృష్ణ దోపిడీ చేశాడు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ గెలుపు.. అసలు గెలుపే కాదు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాగే మోసాలతో గెలిచారు. చంద్రబాబు, బాలకృష్ణలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు’’ అని అన్నారాయన. -
గుంటూరులో టీడీపీ బరితెగింపు..
-
కడప కార్పొరేషన్ లో TDP ఎమ్మెల్యే మాధవి రెడ్డి దౌర్జన్యం
-
సెల్లార్ తవ్వుతుండగా కూలిన అపార్ట్మెంట్ ప్రహరీ
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి భరత్పురి కాలనీ సెవెన్‌హిల్స్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ పక్కన ఆదివారం ఉదయం సెల్లార్ తవ్వుతుండగా ప్రహరీ కూలిపోయిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. అపార్ట్మెంట్ పక్కనే సెల్లార్ కోవసం తవ్వుతున్నారని మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందించినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. మున్సిపల్ అనుమతి లేకుండానే సెల్లార్లు జరుగుతున్నా అధికారులు మొద్దు నిద్ర పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందించినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని దుయ్యబట్టారు. వెంటనే సెల్లార్ తవ్వకం పనులను నిలిపివేయించాలని అధికారులను అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేశారు. -
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్..కట్‌చేస్తే నేడు ఆమె..!
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయికి ‘ఐఏఎస్’ కలలు ఉంటాయా? ‘సాధ్యం కాదు’ అనుకున్నదాన్ని ‘సాధ్యం’ చేయవచ్చా? ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పే పేరు....రుక్మిణి రియర్. ఆరో తరగతి ఫెయిలైన రుక్మిణి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో రెండో ర్యాంకు సాధించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్ మున్సిపల్ కమిషనర్‌గా ‘ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి’ అనుకునేలా పనిచేస్తోంది... స్కూల్ రోజుల్లో రుక్మిణి బ్రైట్ స్టూడెంట్ కాదు. రుక్మిణి ఆరో తరగతి ఫెయిల్ కావడం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అయితే ఆ ఫెయిల్యూరే తనను సక్సెస్‌కు దగ్గర చేసింది. ‘ఫెయిల్యూర్ అంటే మొదలైన భయం ఎలాగైనా సక్సెస్ కావాలనే పట్టుదలను పెంచింది’ అంటుంది రుక్మిణి. అమృత్‌సర్‌లోని ‘గురునానక్ యూనివర్శిటీ’లో సోషల్ సైన్స్‌లో డిగ్రీ చేసిన రుక్మిణి ముంబైలోని ‘టాటా ఇనిస్టిట్యూట్’లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.ఆ తరువాత ముంబై, మైసూర్‌లలో కొన్ని స్వచ్ఛందసంస్థలలో పనిచేసింది. స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న క్రమంలో అంకితభావం, వృత్తి నిబద్ధత ఉన్న ఎంతోమంది ఐఏఎస్ అధికారుల గురించి విన్నది. వారి గురించి విన్నప్పుడల్లా ‘ఐఏఎస్’ వైపు మనసు మళ్లేది. చివరికది అది తన కలగా మారింది.‘ఒక ప్రయత్నం చేసి చూద్దాం’ అని రంగంలోకి దిగింది.కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించింది. ‘ఆరోతరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్ సాధించింది’... రుక్మిణి గురించి ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి. చాలామంది విద్యార్థులు ఆమెను కలుసుకొని మాట్లాడి సలహాలు తీసుకునేవారు.కట్ చేస్తే...ఇప్పుడు రుక్మిణి రియర్ రాజస్థాన్‌లోని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ కమిషనర్. యూపీఎస్సీలో సెకండ్ ర్యాంక్‌తో ఎలా వార్తల్లో నిలిచిందో మున్సిపల్ కమిషనర్‌గా కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం అక్రమార్కుల పాలిట ఆమె సింహస్వప్నం కావడమే. డిసెంబర్లో జరగబోయే ‘రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ను దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. విమానాశ్రయం నుంచి 22 గోదాముల వరకు ప్రధాన రోడ్లను పరిశీలిస్తూ వెళ్లింది.నగర పరిశుభ్రత, సుందరీకరణ గురించి స్థానికులతో మాట్లాడింది. సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చెయ్యాలని, పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఫ్లైవోవర్లు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి పెయింటింగ్, లైటింగ్‌ల కోసం సూచనలు ఇచ్చింది. గోడలకు పెయింటింగ్ వేయడం నుంచి పబ్లిక్ టాయిలెట్లు, చెత్త కుండీలు శుభ్రం చేయడం వరకు ప్రతి పని దగ్గర ఉండి చేయిస్తుంది. నగర సుందరీకరణతో పాటు ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.‘రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ ద్వారా జైపూర్‌ను గ్లోబల్ సిటీగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. దీని కోసం జైపూర్ అద్భుతంగా కనిపించకపోయినా... పరిశుభ్రంగా, ఆక్రమణలు లేకుండా కనిపించాలి. ఇది అనుకున్నంత సులువైన పనేమీ కాదు. ఎందుకంటే సమ్మిట్‌కు ఎన్నో నెలలు లేదు. అయినా సరే వెనక్కి తగ్గకుండా కష్టపడుతూ ప్రజల నుంచి శభాష్ అనిపించుకుంటోంది రుక్మిణి. ‘పని చెయ్యకపోయినా ఫరవాలేదు. చేస్తే మాత్రం శ్రద్ధగా, భక్తిగా చేయాలి’ అని అమ్మ అంటుండేది. ఆ మాటలే రుక్మిణి రియర్కు వేదవాక్కు.(చదవండి: దసరాలో ట్రెడిషనల్‌గా ఉండే స్టైలిష్ డిజైనర్ వేర్స్ ధరించండి ఇలా..!) -
ఏసీబీ వలలో మున్సిపల్ అధికారి.. కళ్ళు చెదిరిపోయేలా నోట్ల కట్టలు
సాక్షి, నిజామాబాద్: అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ గుబులు పుట్టిస్తోంది. తాజాగా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో గుట్టలుగా ఉన్న నోట్ల కట్టల్ని గుర్తించారు. మొత్తం రూ. 6.70 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాల్లో రూ.2కోట్ల 93లక్షల 81వేల నగదు, నరేందర్ బ్యాంకు ఖాతాల్లో రూ. కోటి 10 లక్షల నగదు, అరకిలో బంగారు ఆభరణాలు, 1కోటి 98 లక్షల విలువ చేసే ఆస్తుల్ని సీజ్ చేశారు. మొత్తం 6కోట్ల 7లక్షల విలువగల ఆస్తుల గుర్తించారు. ఆదాయం మించిన ఆస్తుల కేసులో నరేందర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మున్సిపల్ అధికారి నరేందర్ బంధువుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. నరేందర్‌ను అరెస్ట్ చేసిన అధికారులు హైదారాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తరలించారు.ACB Seizes Crores in Cash During Raid on Nizamabad Municipal SuperintendentIn a significant operation by the Anti-Corruption Bureau (ACB), a staggering amount of cash and assets were uncovered during a raid on the residence of Dasari Narendar, the Superintendent and in-charge… pic.twitter.com/oJa4hrfUv7— Sudhakar Udumula (@sudhakarudumula) August 9, 2024 -
ఈ విజయం టీడీపీకి చెంపదెబ్బ.. కర్నూల్ లో YSRCP క్లీన్ స్వీప్..
-
బ్యాంకాక్‌లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు
ఉప్పల్: ఎక్కడైనా అవిశ్వాసం పేరు వినపడితే చాలు.. రిసార్టులు, స్టార్ హోటళ్లలో క్యాంపులు, వైజాగ్, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాలకు టూర్లు వేసేవారు. ఆయా ప్రాంతాల్లో విలాసవంతంగా గడిపి వచ్చేవారు. ఈసారి మాత్రం కాస్ట్లీ టూర్ అంటూ పీర్జాదిగూడ కార్పొరేషన్ పేరు మార్మోగిపోతోంది. పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి కార్పొరేటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులను తీసుకొని ఏకంగా బ్యాంకాక్ ఎగిరిపోయారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను టార్గెట్ చేస్తూ.. శివారు కార్పొరేషన్ అయిన పీర్జాదిగూడ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే.. ఇందులో భాగంగా ఈ నెల 6న కాంగ్రెస్ నేతలు, కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్‌ను సంప్రదించగా వచ్చే నెల 5న తీర్మానం తేదీని ఖరారు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లను టార్గెట్ చేస్తూ వారిని వెంబడిస్తూ కాంగ్రెస్ నేతల తీరుతో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి ఏకంగా మీడియా, పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చేశారు. కాగా.. తమ మద్దతుదార్లయిన కార్పొరేటర్లకు విదేశీ టూర్‌ను ఆఫర్ చేశారు. అంతా ఆశ్చర్యపోయేలా కాస్ట్లీ టూర్‌కు తీసుకెళ్లడంతో ఆయా పార్టీల నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఇంత ఖరీదైన టూర్ ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఏకంగా కార్పొరేటర్లను, వారి భర్తలను విదేశీ పర్యటనకు తీసుకెళ్లి ఆనంద డోలికల్లో ముంచెత్తడం గమనార్హం. -
ఏసీబీకి చిక్కిన మునిసిపల్ ఏఈ
విజయవాడస్పోర్ట్స్: ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఏఈ తోట ఈశ్వర్‌కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈశ్వర్‌కుమార్ డివిజన్–4 వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఇన్చార్జ్ ఏఈగా పని చేస్తున్నాడు. కార్పొరేషన్ పరిధిలోని న్యూ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఏఎస్ ఎకో మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ యజమాని షేక్ సద్దాంహుస్సేన్ నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే వర్క్ ఆర్డర్ కోసం అగ్రిమెంట్ ప్రాసెస్ చేయాలని డివిజన్–4 వెహికల్ డిపో ఈఈ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రాసెస్ కోసం రూ.50 వేలను ఇవ్వాలని ఈశ్వర్‌కుమార్ పట్టుబట్టాడు. దీంతో సద్దాంహుస్సేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వల పన్ని కార్యాలయంలోనే రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ ఈశ్వర్‌కుమార్‌ను సోమవారం అదుపులోకి తీసుకుని ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. -
ఆంధ్రా అమ్మాయి... జవహర్‌నగర్ మేయర్
బాపట్ల టౌన్: బాపట్ల మండలం, ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పమిడిబోయిన శాంతి తెలంగాణ రాష్ట్రంలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎంపికయ్యారు. ఆమె బాపట్ల మండలం, ముత్తాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్య అభ్యసించారు. 2000లో తెనాలి మండలం, దావులూరిపాలెం గ్రామానికి చెందిన కోటేష్గౌడ్తో వివాహమైంది. గడిచిన 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 18వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీ కార్పొరేటర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ముత్తాయపాలెం గ్రామానికి చెందిన మహిళ శాంతి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్ఎస్కు షాక్
-
ప్రాణ ప్రతిష్టలో ఉపయోగించిన టన్నుల కొద్ది పువ్వులను ఏం చేస్తున్నారో తెలుసా!
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అందుకోసం అయోధ్య ఎంతో సుందరంగా ముస్తాబయ్యింది. ముఖ్యంగా పూలతో చేసిన అలంకరణ చూస్తే రెండు కళ్లు చాలవు అన్నంత మనోహరంగా ఉంది. భవ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం టన్నుల కొద్ది పుష్పలను వివిధ రాష్ట్రాలను తెప్పించి మరీ ఉపయోగించారు. అయితే ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పూర్తైన తర్వాత ఆ పూలు వృధాగా అయ్యే పోకూడదని అయోధ్య మున్సిపాలిటీ అధికారులు నిర్ణయించారు. అందుకోసం వారు ఏంచేస్తున్నారో తెలుసా! బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం ఉత్తరప్రదేశ్ నుంచి సుమారు పది టన్నుల పూజలు తెప్పించారు. ముఖ్యంగా బాలరాముడి గర్భలయాన్ని అలకరించేందుకే చెన్నై నుంచి ఏకంగా 20 రకాల పూలను మూడువేల కిలోలు తెప్పించారు. ఈ భవ్య రామాలయాన్ని క్రిస్తానియం, గెర్బెరా, ఆర్కడ్లు, ప్రోమేథియం, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ తదితర పూలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. అలాగే బెంగళూరు, పూణే, లక్నో, ఢిల్లీ వంటి ఇతర నగరాల నుంచి కూడా ఈ కత్రువు కోసం పలు రకాల పూలను తెప్పించారు. ఈ ప్రాణప్రతిష్ట క్రతవు ముగిసిన తదనంతరం అయోధ్య ధామ్‌లో అన్ని దేవాలయాలల్లోని సుమారు 9 మెట్రిక్ టన్నుల పుష్పల వ్యర్థాలు వచ్చాయి. అయితే వీటన్నింటిని ఈ రీసైకిల్ చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఈ పుష్పాలను రీసైకిల్ చేసి అగరుబత్తీలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతను కాపాడుకునేలా ఇలా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్. అందులో భాగంగానే అయోధ్యధామ్‌లోని అన్ని దేవాలయాల్లో వినియోగించిన పువ్వలన్నింటిని ఇలా ప్రాసెంసింగ్ చేసి ధూప్ స్టిక్‌లు ఉత్పత్తి చేసే ఓ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది అయోధ్య మున్సిపల్ కార్పోరేషన్. ఇక అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట క్రతువు కూడా ముగిసింది. ఇక ఆ తతంగంలో వినియోగించిన పువ్వలన్నింటితో కలిపి ఆ ప్రక్రియ కాస్త కంగా 2.3 మెట్రిక టన్నులకు పెరిగింది. ప్రసతుతం మున్సిపాలటీ సిబ్బంది ఆ పువ్వలన్నింటిని ప్రాసెస్ చేస్ ధూప్ కర్రలను తయారు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు. View this post on Instagram A post shared by PHOOL (@phool.co) (చదవండి: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట? ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?) -
AP: మున్సిపల్ కార్మికులతో చర్చలు
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం శనివారం చర్చలు జరిపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరింది. చదవండి: టార్గెట్ టీడీపీ.. కేశినేని నాని మరోసారి సంచలన కామెంట్స్ -
వరంగల్‌లో టెన్షన్.. మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉద్రికత్త
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాలో ప్రజా సమస్యలు, నెరవేరని ఎన్నికల హామీలపై నేడు మున్సిపల్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ నాయకులను ముందుస్తుగా అరెస్ట్‌లు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నాకు పోలీసులు అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు.. పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా ధర్నా చేసి తీరుతామని కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. దీంతో, డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్‌లతో ఆందోళనను అడ్డుకోలేరంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: TSRTC: ప్రయాణీకులకు బంపరాఫర్.. -
మున్సిపల్ నియామకాల్లో అవకతవకలు
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మున్సిపల్ కార్పోరేషన్లలో నియామకాల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రంగంలోకి దిగింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. డమ్ డమ్, హలీసహర్, బడా నగర్ మున్సిపల్ కార్పొరేషన్లుసహా మొత్తం 14 కార్పోరేషన్ల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఈ అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అయాన్ సిల్, అతని ఆఫీస్, మరో ముగ్గురికి చెందిన ప్రాంతాల్లోనూ తనిఖీలు చేశారు. సాల్ట్ లేక్ ప్రాంతంలోని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగాయి. ముడుపులు తీసుకుని కొలువులు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో సీబీఐ రంగప్రవేశం చేసింది. అయితే ఇదంతా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలో భాగమని పశ్చిమబెంగాల్ రాష్ట్ర మన్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్ వ్యాఖ్యానించారు. -
తిరుపతిలో అంగరంగా వైభవంగా గంగమ్మ జాతర
-
కోరుట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం : ఇవేం మ్యూటేషన్లు బాబోయ్
కోరుట్ల: సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ తయారీ కోసం రైటర్లను ఆశ్రయించడం సాధారణంగా మారింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో అవగాహన లేనికొంత మంది డాక్యుమెంట్ రైటర్లు.. నివాసం లేదా ఖాళీస్థలం క్రయ, విక్రయాల డాక్యుమెంట్ తయారు చేసే సమయంలో తప్పలతడకగా వివరాలు నమోదు చేయడం.. అదే నమూనాతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్ర క్రియ పూర్తిచేయడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లకు ఓ సె క్షన్, ఖాళీస్థలాల రిజిస్ట్రేషన్లకు మరో సెక్షన్ ఉంటుంది. ఖాళీ స్థలాలకు వీఎల్టీ నంబరుతో రిజి స్ట్రేషన్లు చేయాల్సి ఉండగా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇంటిస్థలాల నంబర్లతో ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడే సమస్య తలెత్తుతోంది. ఈ రెండు పద్ధతుల్లో పొరపాట్లు చోటుచేసుకోవడంతో యజమానులకు తెలియకుండానే.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వెళ్లకుండానే ఒకరి ఆస్తులు మరొకరి పేరిట నమోదు కావడం గందరగోళానికి దారితీసోంది. వెలుగులోకిరాని ఇలాంటి తప్పిదాలు అనేకం జరిగినా అధికారులు స్పందించడంలేదు. దిద్దుబాటు పరేషాన్.. ● పొరపాటుగా ఆస్తులకు చెందిన వీఎల్టీ లేదా ఇంటి నంబర్లు మారి రిజిస్ట్రేషన్లు జరగడంతో ఆ వివరాలు ఆటో మ్యుటేషన్ ప్రక్రియ ద్వారా ఆన్లైన్లో మున్సిపల్ కార్యాలయానికి చేరుతున్నాయి. ● ఆ వివరాల ప్రకారం.. మున్సిపల్ అధికారులు పేరు మార్పిడి చేసి ఆస్తి పన్ను లేదా ఖాళీ స్థలాల పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. ● మున్సిపల్ అధికారులు పన్నుల వసూలుకు వెళ్తున్న సందర్భంలో లేదా ఆస్తి హక్కుదారులు పన్ను చెల్లించే సందర్భంగా జరిగిన పొరపాట్లు వెలుగులోకి వస్తున్నాయి. ● ఈ పొరపాటును సరిదిద్దే అంశం తమ పరిధిలో లేదని మున్సిపల్ అధికారులు తేల్చి చెపుతుండగా.. మున్సిపాల్టీలో సరిదిద్దే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని..తాము సమస్యను జిల్లా రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్తే కాలాయాపన జరుగుతుందని సబ్ రిజిస్ట్రార్ అధికారులు అంటున్నారు. ● మొత్తం మీద పొరపాట్లు అధికారులు చేస్తే ఆస్తి హక్కుదారులు మాత్రం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్నారు. ● ఉన్నతాధికారులు తగిన రీతిలో స్పందించి అవసరమైన చర్యలు తీసుకుని పొరపాట్లును సరిదిద్దాలని బాధితులు కోరుతున్నారు. ఇతడి పేరు తోట గంగారాం. ఆస్తిపన్ను చెల్లించేందుకు వారంక్రితం కోరుట్ల మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు. ఇంటి నంబరు చెప్పగానే గంగారాం పేరిట ఇల్లే లేదని అధికారులు తేల్చేశారు. వేరేవాళ్ల పేరు ఎలా వచ్చిందని బిత్తరపోయిన గంగారాం.. ఇదేమిటని ప్రశ్నిస్తే.. రిష్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి అడుగు అని ఉచిత సలహా ఇచ్చారు. అక్కడికి వెళ్లి ఆరా తీస్తే.. తన ప్రమే యం లేకుండానే ఇతరులు చేసుకున్న రిజిస్ట్రేషన్‌లో తనఇంటి నంబరు నమో దు చేసి.. ఆ వివరాలను ఆన్లైన్ ద్వారా బల్దియా కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. దానిప్రకారం ఏడాది క్రితమే ఆటో మ్యుటేషన్‌తో తన ఇల్లు వేరేవారి పేరిట నమోదైనట్లు స్పష్టమైంది. కోరుట్ల మెయిన్డ్డుడ్లోని ఓ దుకాణా యజమాని.. తన ఇంటి సమీపంలోని ఖాళీస్థలాన్ని వీఎల్టీ నంబరుతో తన బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. వారంక్రితం అతడు ఆస్తిపన్ను చెల్లించడానికి బల్దియా కార్యాలయానికి వెళ్తే.. ఖాళీ స్థలమే కాకుండా తన బంధువుల పేరిట నమోదు అయిందని తెలిసి నివ్వెరపోయాడు. జిల్లా రిజిస్ట్రార్‌కు నివేదిస్తాం వీఎల్టీ, ఇంటి నంబర్ల నమోదులో పొరపాట్లు జరగడంతో తప్పులు చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నాం. వీటిని సరిదిద్దడానికి జిల్లా రిజిస్ట్రార్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పొరపాటున ఆస్తుల వివరాలు మారిన వారు మాకు దరఖాస్తు చేసుకోవాలి. కొంత కాలయాపన జరిగినా ఆటో మ్యుటేషన్లో జరిగిన పొరపాట్లు సరిచేస్తాం. – శ్రీధర్‌రాజు, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్, కోరుట్ల -
పాకిస్తాన్లో హిందూ డాక్టర్ కాల్చివేత
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని కరాచీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డెరెక్టర్, ప్రముఖ కంటి వైద్యుడు, హిందూ మతస్థుడైన డాక్టర్ బీర్బల్ జినానీని దుండుగులు గురువారం తుపాకీతో కాల్చి చంపారు. కరాచీ సమీపంలోని ల్యారీ ఎక్స్‌ప్రెస్ రహదారిపై కారులో వెళ్తుండగా దుండుగులు ఘాతుకానికి పాల్పడ్డారు. పాకిస్తాన్లో హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతున్నాయి. మార్చి నెలలో ఇది రెండో హత్య కావడం గమనార్హం. ఇటీవలే పాకిస్తాన్‌లోని హైదరాబాద్ పట్టణంలో హిందూ మతానికి చెందిన ధరమ్‌దేవ్ రాఠీ అనే వైద్యుడిని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. -
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం
-
మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు
ఇటీవల కాలంలో కుక్కలు మనుషులపై దాడి చేసిన ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. అయితే ఈ జాబితాలోకి పెంపుడు కుక్కలు కూడా చేరాయి. ఈ మధ్య పెంపుడు శనుకాలు కూడా ఉన్నట్టుండి యజమానులు, బయట వారిపై దాడి చేస్తున్నాయి. అయితే కుక్కలు గాయపరిచిన ఘటనలో బాధితులకు పరిహారం అందడం చాలా అరుదు. కానీ తాజాగా ఓ పెంపుడు కుక్క కరిచిన ఘటనలో గాయపడిన మహిళకు ఉపశమనం లభించింది. పెంపుడు కుక్క దాడిలో గాయపడ్డ బాదితురాలికి 2 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక.. గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను(ఎంసీజీ) మంగళవారం ఆదేశించింది. కావాలంటే చెల్లించిన పరిహారం మొత్తాన్నికుక్క యజమాని నుంచి తిరిగి పొందవచ్చని పేర్కొంది. కాగా ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవించే మున్ని అనే మహిళ, తన కోడలుతోపాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వినిత్ చికారా పెంచుకుంటున్న కుక్క ఆగష్టు 11 న దాడి చేసింది. ఈ ప్రమాదంలో మహిళ తల, ముఖానికి తీవ్ర గాయాలవ్వడంతో ఆమెను గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తరువాత ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ హాస్పిటల్‌కు తరలించారు. కుక్క దాడిపై సివిల్ లైన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మహిళను కరిచిన శునకం ‘డోగో అర్జెంటీనో’ జాతికి చెందినదిగా యజమాని తెలిపారు. చదవండి: అరే! ఏం మనుషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి... కుక్కను స్వాధీనం చేసుకోవాలని, దాని లైసెన్స్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని ఫోరమ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. అదే విధంగాపెంపుడు కుక్కల పాలసీని మూడు నెలల్లో రూపొందించాలని ఆదేశించింది. వీధి జంతువులను అదుపులోకి తీసుకున్న తర్వాత వాటిని పౌండ్లలో ఉంచాలని, అలాగే హనికరమైన 11 అన్యదేశ జాతులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ జాతి కుక్కులను ఎవరైనా పెంచుకుంటే వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని తెలిపింది. డోగో అర్జెంటీనో వంటి క్రూర జాతికి చెందిన శునకం పెంపుడు విషయంలో యజమాని చట్టాన్ని, నిబంధనలు ఉల్లించాడని స్పష్టంగా అర్థం అవుతోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా అమెరికన్ పిట్-బుల్ టెర్రియర్స్, డోగో అర్జెంటీనో, రోట్వీలర్ వంటి క్రూర జాతి కుక్కులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. -
దీపావళి కానుకగా ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన పర్యాటక మంత్రి
బెంగళూరు: కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు ఆనంద్ సింగ్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు రెండు గిఫ్ట్ బాక్సులను పంపారు. ఐతే మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో రూ. లక్ష రూపాయలు నగదు, 144 గ్రాముల గోల్డ్, 1 కేజీ వెండి, సిల్క్ చీర, ధోతీ, డ్రై ఫ్రూట్ బాక్స్ ఉన్నాయి. కానీ గ్రామ పంచాయతీ సభ్యులకు పంపిన గిఫ్ట్ బాక్స్‌లో తక్కువ మొత్తంలో నగదు, బంగారం తప్పించి అన్ని ఇతర వస్తువులు ఉండటం గమనార్హం. (చదవండి: ఆ తండ్రి కోరిక నెరవేరింది.. ముగ్గురు కూతుళ్లకు పోలీసు ఉద్యోగం!) -
రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్ నోటీసులు, గుమస్తాపై వేటు
చత్తీస్‌గఢ్: దసరా వేడుకల్లో చివరి రోజైన విజయదశమి నాడు రావణ దహనం నిర్వహించడం సర్వసాధారణం. అయితే, చత్తీస్‌గఢ్‌లోని ధామ్తరిలో మాత్రం రావణ దహనం కార్యక్రమం వైరల్‌గా మారింది. ఎందుకంటే రావణుడి పదితలలు కాలలేదు. కేవలం దిష్టిబొమ్మ కింద భాగం అంత బూడిదైపోయింది. దీంతో ఈ ఘటనపై ధామ్‌తరీ పౌర సంఘం సీరియస్ అయ్యి ఒక గుమస్తాని సస్పెండ్ చేసి కొంతమంది అధికారులకు షోకాజ్‌నోటీసులు కూడా జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్5న ధామ్తరిలో రామ్‌లీలా మైదాన్‌లో రాక్షసరాజు రావణుడి దహనం చేస్తున్నప్పుడూ ఈ వింత ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ వేడుకల్లో రావణ దిష్టిబొమ్మ దహనాన్ని పర్యవేక్షిస్తోంది స్థానిక పౌరసంఘం. అంతేగాదు ధామ్తరి మున్సిపల్ కార్పొరేషన్ (డీఎంసీ) గుమస్తా రాజేంద్ర యాదవ్ రావణ దిష్టిబొమ్మ రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సీరియస్ అయ్యి విధుల నుంచి బహిష్కరించింది. పైగా యాదవ్ రావణ దిష్టి బొమ్మను తయారుచేయడంలో మున్సిపల్ కార్పోరేషన్ ప్రతిష్టను కించపరిచేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడింది. అంతేగాదు ఆయన స్థానంలో సమర్థ రాణాసింగ్ అనే వ్యక్తిని నియమించినట్లు డీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ పద్మవర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజనీర్లు లోమస్ దేవాంగన్, కమలేష్ ఠాకూర్, కమతా నాగేంద్రలపై డీఎంసీ షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. దిష్టి బొమ్మను తయారు చేసే బాధ్యతలను అప్పగించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, వారి వేతనాల చెల్లింపులు కూడా నిలిపేస్తున్నామని ధామ్తరి మేయర్ విజయ దేవగన్ అన్నారు. (చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే రిపేర్) -
ఆరోపణలు మాని మీ పని మీరు చూసుకోండి!: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ ఆప్‌ల మధ్య స్కామ్ వర్సస్ స్కామ్ పోరు హోరాహోరిగా సాగుతుంది. ఈమేరకు ఢిల్లీలోని లెప్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆప్ బీజేపీ హయాంలో జరిగిన కుంభకోణాలను వెలకితీసే ఎత్తుగడకు పూనుకుంది. అందులో భాగంలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ సంస్థలు టోల్‌టాక్స్ వసూళ్లలో రూ. 6 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయని, దీనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపముఖ్యముంత్రి మనీష్ సిసోడియాకు లేఖ రాశారు. ఈ మేరకు ఆయన లేఖలో... "బీజేపీ ఆధ్వర్యంలోని ఎంసీడీలో జరిగిన సుమారు రూ. 6 వేల కోట్ల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రెండునెలల క్రితమే లేఖ రాశానని గుర్తు చేశారు. అంతేగాదు ప్రతిరోజూ ఢిల్లీలోకి ప్రవేశించే దాదాపు 10 లక్షల వాణిజ్య వాహనాల నుంచి టోల్ టాక్స్ వసూలు చేసే రెండు కంపెనీలతో ఎంసీడీ కుమ్మక్కయ్యిందని, అయితే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరదని ఆరోపించారు. ఐతే మీరు ఆ స్కామ్‌పై దృష్టి పెట్టలేకపోయారు. ఎందుకంటే అది బీజేపీ హయాంలో జరిగింది కాబట్టి వదిలేశారు. దాని బదులుగా నా ఇంటిపై సీబీఐ దాడులు జరిపించారు. లిక్కర్ స్కామ్‌లో బీజేపీ రూ. 10 వేల కోట్లు స్కామ్ జరిగిందంటే, మీరు రూ. 144 కోట్లు అన్నారు. ఆఖరికి సీబీఐ కోటీ రూపాయల స్కామ్ అంది. చివరికి మీరు జరిపించిన సీబీఐ దాడుల్లో ఏమి దొరకలేదు. కేవలం మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వంపై ప్రతిరోజు కొత్త ఆరోపణలతో సీబీఐ దాడుల జరిపించే పనిలో బిజీగా ఉన్నారు. అయినా మీరు ముందు ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేసే బదులు మీరు నిర్వహించే శాఖలపై దృష్టి సారించండి. పెరిగిపోతున్న నేరాలను కట్టడి చేయండని, ఆక్రమణకు గురవుతున్న భూములను విముక్తి చేయమని కోరుతూ వస్తున్న లేఖలపై దృష్టి సారించండి" అని ఘటూగా విమర్శిసిస్తూ లేఖ రాశారు. అయినా 17 ఏళ్లుగా ఎంసీడీని పాలుస్తన్న బీజేపీ నగరాన్ని చెత్తకుప్పగా చేసిందని దుయ్యబట్టారు. (చదవండి: చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు) -
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు
-
అవినీతిపై సర్కార్ ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: నగరపాలక, పురపాలక సంస్థల్లో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయాల్లో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం కూడా అనకాపల్లి, బొబ్బిలి, సామర్లకోట, ఏలూరు, మార్కాపురం, తిరుపతి, రాజంపేట, పుట్టపర్తి, నందిగామ మున్సిపాలిటీలు, కార్పొరేషన్, నగర పంచాయతీ కార్యాలయాల్లో పట్టణ ప్రణాళికా విభాగం రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరి తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ‘14400’ టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు ఈ దాడులు చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగంపై అధికంగా అవినీతి ఆరోపణలు వచ్చినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఆరోపణలు రుజువైతే అవినీతిపరులపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది. దీంతో అవినీతిపరుల్లో వణుకు మొదలైంది. కాగా ఏసీబీ తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగనున్నాయి. గత కొన్నేళ్లుగా ఆరోపణలు.. మున్సిపల్, పట్టణ ప్రణాళిక విభాగాల్లోని సిబ్బందిపై గత కొన్నేళ్లుగా అవినీతి ఆరోణలు వస్తున్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా.. ఆస్తి పన్ను అసెస్మెంట్ చేసేందుకు సర్వే చేయాలన్నా ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన దుస్థితి ఉంది. కొత్తగా భవన నిర్మాణం చేపట్టాలన్నా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉండి, ఇంటి ప్లాన్ కూడా నిబంధనల మేరకు ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్టు పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ)కి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతిపరుల ఆటకట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 14400 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులోకి తేవడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలపై అధిక ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ వాటిలో దాడులు ముమ్మరం చేసింది. ఏసీబీ తనిఖీలపై నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామని సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 123 నగరపాలక, పురపాలక సంస్థలు, 4,132 వార్డు సచివాలయాల్లో ప్రజలకు కనిపించేలా ‘14400’ టోల్‌ఫ్రీ నంబర్ ప్రదర్శించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రణాళిక విభాగం నిర్లక్ష్యం.. సూళ్లూరుపేటలో రూ.2,00,960, జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి మున్సిపాలిటీలో రూ.38,200, పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో రూ.35,560 అనధికార నగదును ఏసీబీ అధికారులు గత రెండు రోజుల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలుచోట్ల సర్వే, ప్లాన్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను కాలవ్యవధికి మించి పెండింగ్‌లో ఉంచినట్టు గుర్తించారు. అంతేకాకుండా అనధికార నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేల్చారు. అలాగే నిబంధనల ప్రకారం కొన్ని భవనాలకు నిర్మాణాల అనుమతి రుసుం వసూలు చేయడంలో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది విఫలమయ్యారని.. రికార్డులను సైతం సరిగా నిర్వహించడం లేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. -
నాడు-నేడు పేరుతో విద్యా వ్యవస్థలో సంస్కరణలు
-
మనోబలం: బామ్మలందరూ కలిసి బాల్యంలోకి వెళ్లొచ్చారు!
‘అదిగదిగో విమానం’ అంటూ ఆకాశాన్ని చూస్తూ పరుగులు తీశారు చిన్నప్పుడు. వృద్ధాప్యంలోకి వచ్చాక పరుగులు తీసే శక్తి లేదు. అయినా ఆ ఉత్సాహం ఎక్కడికీ పోలేదు. ‘ఒక్కసారైనా విమానం ఎక్కలేకపోయామే’ అని నిట్టూర్చేవారు. అయితే అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరకకుండానే వారి చిరకాల కల నెరవేరింది... చిన్నప్పుడు ఆకాశంలో వినిపించీ, వినిపించని శబ్దం చేస్తూ కనిపించే చిట్టి విమానాన్ని చూసి మౌనిక ఎంత ముచ్చటపడేదో! పెద్దయ్యాక ఎలాగైనా విమానం ఎక్కాలని చిన్నారి మౌనిక ఎంతో బలంగా అనుకుంది. అయితే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆమె కోరిక నెరవేరలేదు. ఆరుబయటకు వచ్చినప్పుడు ఆకాశంలో కనిపించే విమానాన్ని చూస్తూ ‘చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం’ అని తనలో తాను నవ్వుకునేది మౌనిక. నిజానికి మౌనికలాంటి ‘విమాన కల’ బామ్మలు ఎందరో ఉన్నారు. కోచి(కేరళ)లోని ‘హెల్ప్‌ఏజ్ ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థ, కోచి మున్సిపల్ కార్పోరేషన్‌తో కలిసి 27 మంది బామ్మల సుదీర్ఘకాల విమానప్రయాణ కలను నెరవేర్చింది. ఎంతసేపు ప్రయాణించాం, ఎంత దూరం వెళ్లాం అనేది ముఖ్యం కాదు... ఆ అనుభూతి ముఖ్యం! బామ్మలు కోచి నుంచి కన్నూర్‌కు విమానంలో ప్రయాణించి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ‘ఇంకో వారంలో రోజుల్లో విమానం ఎక్కబోతున్నాం’ అనే ఆనందం రోజీమేరీ, మారియాలను ఒక దగ్గర ఉండనివ్వలేదు. ఎందరికో ఎన్నోసార్లు చెప్పుకొని మురిసిపోయారు. ‘విమానం ఎక్కడం కాదు... అసలు నేను విమానాశ్రయం అనేది చూడడం ఇదే మొదటిసారి’ నవ్వుతూ అంటుంది 67 సంవత్సరాల రోజీమేరి. ‘చిన్నప్పటి కోరిక నెరవేరిందనే సంతోషంతో నా మనోబలం రెట్టింపు అయింది’ అంటుంది 61 సంవత్సరాల మారియా. ఇక విమానంలో బామ్మల సందడి చూస్తే... వారు విమానం ఎక్కినట్లుగా లేదు. టైమ్‌మిషన్‌లో బాల్యంలోకి వెళ్లినట్లుగా ఉంది. ఏ బామ్మను కదిలించినా.... వారి కళ్లలో... మాటల్లో సంతోషమే సంతోషం! వీరి విషయంలో మాత్రం ‘సంతోషం సగం బలం’ కానే కాదు. సంపూర్ణబలం! కోరిక గట్టిదైతే, ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది... అనే మాటను విన్నాను. అది నా విషయంలో నిజమైంది. వినేవాళ్లు ఉండాలేగానీ నా విమానప్రయాణం గురించి కొన్ని రోజుల వరకు చెప్పగలను. – మౌనిక (88) -
చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాథ్ ఫోటోలు...వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో మధరలోని ఒక స్థానిక మున్సిపాలిటి ఉద్యోగి చెత్తను సేకరించుకుంటూ వెళ్తున్నాడు. ఐతే ఆ చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాద్ ఫోటోలు ఉన్నాయి. దీంతో అతనికేం సంబంధం లేదు. అతను తన పనిగా చెత్తను సేకరించుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌కి చెందిన కొందరు వ్యక్తలు సదరు వ్యక్తిని ఆపి మరీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ చెత్తబండిలో అబ్దుల్ కలాం పోటో కూడా ఉంది. దీంతో సదరు వ్యక్తిని ఏంటి ఇది అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. తనకేం తెలియదని చెత్తబుట్టలో ఉన్నవాటిని సేకరించుకుంటూ వచ్చానని చెప్పాడు. ఈ ఘటనను అవమానంగా భావించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సదరు మున్సిపాలిటీ కాట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఆ చెత్తబండిలో ఉన్న ఫోటోలను గుర్తించి ప్రశ్నించిన వ్యక్తి ఆయా ఫోటోలను సదరు వ్యక్తి నుంచి తీసుకోవడమే కాకుండా గౌరవంగా నిమజ్జనం చేస్తానని చెప్పాడు. ఐతే నెటిజన్లు మాత్రం ఇందులో అతని తప్పే ఏముంది, చెత్త బుట్లలో ఉంటేనేగా అతను సేకరించి తీసుకువచ్చిందని ఒకరు, పాడైన ఫోటోలను ఏం చేయాలో చెప్పండి అంటూ మరోకరు మండిపడుతూ ట్వీట్ చేశారు. A contractual worker at UP's Mathura Nagar Nigam was terminated after he was found carrying pictures of PM Narendra Modi and CM Yogi Adityanath among other dignitaries in his hand held garbage cart. pic.twitter.com/Jg2x3LW3Mk — Piyush Rai (@Benarasiyaa) July 17, 2022 (చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా!) -
బెంగళూరులో చెత్త సంక్షోభం
బనశంకరి(బెంగళూరు): వివిధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పౌరకార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. సమ్మె ప్రభావం కారణంగా పౌరకార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో చెత్త సమస్య తలెత్తింది. బెంగళూరులో రోడ్లను స్వీపింగ్ యంత్రాలతో ఊడ్చారు. రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హమీ ఇచ్చేవరకు సమ్మె వదిలిపెట్టేది లేదని పౌర కార్మికులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో నగర రోడ్లలో చెత్త రాశులుగా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. బెంగళూరులోని క్రీడా మైదానాలు, బస్టాండ్లు, బస్షెల్టర్లు, మార్కెట్లు ప్రాంతాల్లో చెత్తతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. గత శుక్రవారం నుంచి చెత్త తొలగింపు నిలిచిపోయింది. బెంగళూరులో 70 శాతం మంది సమ్మె బెంగళూరు నగరంలో 18 వేల మంది పౌర కార్మికులు ఉండగా 70 శాతం మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. వేతనాలు పెంపు, పర్మినెంట్ తదితరాలపై ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో 54,512 మంది కాంట్రాక్టు పౌర కార్మికులు ఉండగా వీరిలో 10,755 మందిని పర్మినెంట్ చేశారు. మిగిలిన కార్మికులను కూడా పర్మినెంట్ చేయాలని సమ్మెకు దిగారు. పౌర కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టం రూపొందించాలని కోరారు. సమ్మె వల్ల రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో చెత్త సమస్య తలెత్తింది. యంత్రాలతో చేయిస్తాం సమ్మె వల్ల చెత్త సమస్య తలెత్తిందని పాలికె పొడిచెత్త నిర్వహణ విభాగం ప్రత్యేక కమిషనర్ డాక్టర్ హరీశ్‌కుమార్ తెలిపారు. సోమవారం బీబీఎంపీలో మాట్లాడుతూ రెండు స్వీపింగ్ యంత్రాలతో రోడ్లను శుభ్రం చేస్తున్నట్లు చెప్పారు. మరిన్ని యంత్రాలను సమకూర్చుకుంటామని చెప్పారు. -
గులాబీకి గుడ్‌బై.. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు!
సాక్షి, హైదరాబాద్: గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన గులాబీ నేతలు ఆ పార్టీకి షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన నేతలు.. కారు దిగడానికి దాదాపుగా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన సమీకరణలతో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. టీఆర్ఎస్ కండువా కప్పుకొన్న నేతలు తాజాగా సొంతగూటికి వెళ్లడానికి పావులు కదుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం గులాబీదళంలో చేరిన కార్పొరేటర్లు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా బడంగ్‌పేట నగర పాలక సంస్థ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు టీఆర్ఎస్కు ఝలక్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసి సంప్రదింపులు కూడా జరిపారు. ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి ఒకట్రెండు రోజుల్లో హస్తం గూటికి చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరేకాకుండా.. గతంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మరో నేత కూడా గులాబీకి గుడ్‌బై చెప్పనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరంతా హస్తినలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి గెలిచిన అనంతరం టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి చేజిక్కించుకున్న సబితా ఇంద్రారెడ్డితో పొసగని నేతలు పక్క చూపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుండటం అధికార పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. ఎల్బీనగర్లోనూ... ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కీలక నేత కూడా సొంతగూటి వైపు చూస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది, ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. దీంతో అప్పటి నుంచి ఆయన అధికార టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజా రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. హస్తం గూటికొ ప్పుడు చేరనున్నారనే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. టీకేఆర్ను బుజ్జగించిన కేటీఆర్ గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన తీగల కృష్ణారెడ్డి రెడ్డి సైతం కారు దిగేందుకు దాదాపు సిద్ధమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఇటీవల ఆయన నివాసానికి చేరుకుని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా సన్నిహితులు, వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఆయన కోడలు తీగల అనితా హరినాథ్‌రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీగల కృష్ణారెడ్డిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. రాజకీయ వారసత్వ విషయంలో ఆయనకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఆయన పార్టీని వీడే యోచన నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. మేయర్ సహా ఇద్దరు కార్పొరేటర్లపై వేటు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు సహా 23వ డివిజన్ కార్పొరేటర్ రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్‌రెడ్డిలను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శనివారం రాత్రి ప్రకటించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి, పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. (చదవండి: ‘మేం బ్యాంకుల్ని మాత్రమే.. మీరు దేశాన్నే దోచుకుంటున్నారు’) -
విషాదం: నీటి ట్యాంకు శుభ్రం చేయబోయి.. పైపులో జారిపడ్డ కార్మికుడు
ఖమ్మం మయూరిసెంటర్: భారీ మంచినీటి ట్యాంకును శుభ్రం చేసే యత్నంలో ఓ కార్మికుడు నీటిపైపు లో జారి పడి ప్రాణాలు పోగొట్టుకు న్నాడు. మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. రోజువారీ కార్మికుడితో..: ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని వాటర్ ట్యాంకులను అనుభవం కలిగిన పారిశుధ్య కార్మికులతో పదిహేను రోజులకోసారి శుభ్రం చేయిస్తారు. కార్మికులు తక్కువగా ఉండటంతో మంగళవారం రోజువారీ వేతన కార్మికుడు చిర్రా సందీప్(23)కు పని అప్పగించారు. ఉదయం సందీప్ మరో ఇద్దరితో కలిసి నయాబజార్ కళాశాల పక్కన ఉన్న వాటర్‌ట్యాంక్ ఎక్కాడు. ట్యాంక్ లోపలికి దిగి శుభ్రం చేస్తున్న సందీప్ ప్రమాదవశాత్తు పైపులో జారిపడ్డాడు. మిగతా ఇద్దరు కార్మికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కేఎంసీ రెస్క్యూ టీం వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. సందీప్ జారిపడిన పైపు దిగువన తెరిచి చూడగా అతను కనిపించలేదు. కొంచెం దూరంలో జేసీబీతో మట్టిని తొలగించి పైపును పగులగొట్టడంతో సందీప్ కాళ్లు కనిపించాయి. చదవండి👉🏼 ట్యాంక్‌బండ్‌పై నో పార్కింగ్.. బండి పెట్టారో.. రూ.1000 కట్టాలి! మృతదేహాన్ని బయటికి తీసేసరికి సాయంత్రం 5.20 గంటలు దాటింది. కాగా, నైపుణ్యం లేని కార్మికులతో పనిచేయించడంతో సందీప్ చనిపోయా డంటూ కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి రూ.6 లక్షల పరిహారం, ఇంటి స్థలం, కుటుం బంలో ఒకరికి కేఎంసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని పోలీసులు, రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. చదవండి👉🏻 మాస్టారు పాడె మోసిన మంత్రి ‘ఎర్రబెల్లి’ -
విధులకు రాం.. జీతం మింగేస్తాం
టౌన్‌ప్లానింగ్ విభాగంలో చైన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న సూర్యనారాయణ దాదాపు 8 నెలలుగా పత్తాలేడు. జీతం మాత్రం నెలనెలా దాదాపు రూ. 25 వేలకు పైగా ఠంచనుగా ఆయన ఖాతాకు చేరుతోంది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం సంపాదించుకున్న ఈయన విధులకే హాజరుకావడం లేదు. సెలవులకూ దరఖాస్తు చేసుకోలేదు. సంబంధిత విభాగం అధికారి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.ఇంజినీరింగ్ విభాగంలో ఏకైక వర్క్ ఇన్స్పెక్టర్గా ఉన్న మాధవరెడ్డి కొన్ని నెలల క్రితం దిశ యాక్టు కింద కేసు నమోదు కావడంతో అరెస్ట్ అయ్యాడు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగానికి రాకపోయినా అధికారులు పట్టించుకోలేదని, దీంతో అమ్మాయిలకు వల వేయడమే పనిగా పెట్టుకున్న ఇతని బండారం చివరికి ఓ బాధితురాలి ఫిర్యాదుతో బయటపడిందని నగరపాలక సంస్థలో చర్చించుకుంటున్నారు. అనంతపురం సెంట్రల్: నగరపాలకసంస్థలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉద్యోగులు తయారయ్యారు. సంబంధిత విభాగపు అధికారిని ప్రసన్నం చేసుకుంటే చాలు ఉద్యోగానికి వచ్చినా రాకపోయినా అడిగే నాథుడు లేరనే ధీమాతో పలువురు ఉన్నారు. పింఛన్ విభాగంలో ఓ రెగ్యులర్ అటెండర్ ఉద్యోగానికి సంవత్సరాల పాటు రాకపోవడంతో ‘సాక్షి’లో కొన్ని రోజుల క్రితం కథనం వెలువడింది. దీంతో ఆయన ఇటీవల కాలంలో చుట్టపుచూపుగానైనా వస్తున్నారు. అయితే, ఇలాంటి అధికారులు నగరపాలకసంస్థలో కోకొల్లలుగా ఉన్నారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా విభాగాలకు చెందిన అధికారులను మచ్చిక చేసుకుని విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. కార్యాలయానికి ఉదయం వచ్చే అధికారుల్లో సగం మంది మధ్యాహ్నానికల్లా కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బందిపై నిఘా లేకపోవడంతో ఇతరత్రా ప్రైవేటు కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. కొంతమంది కార్యాలయంలోనే వేరే విభాగాల్లో పనులు చేయిస్తూ దళారుల అవతారం ఎత్తుతుంటే, మరికొందరు రియల్ ఎస్టేట్, ఇతరత్రా పనులు చేసుకుంటున్నట్లు సమాచారం. చాలా నెలలుగా ఇదే పరిస్థితి. కొత్త కమిషనర్ భాగ్యలక్ష్మి దృష్టి సారిస్తే ఉద్యోగులు దారికొస్తారని పలువురు చెబుతున్నారు. సార్ తిట్టాడని రాలేదు విధులకు సక్రమంగా రాకపోవడంతో చైన్‌మ్యాన్ సూర్యనారాయణను గతంలో ఉన్న కమిషనర్ తిట్టారు. దీంతో ఆయన విధులకు రావడం లేదు. ఎలాంటి సెలవు కూడా పెట్టలేదు. దీనిపై అదనపు కమిషనర్‌కు రిపోర్టు చేశాం. సీసీఏ రూల్స్ ప్రకారం అతనిపై చర్యలు ఉంటాయి. – శాస్త్రి, ఏసీపీ, టౌన్‌ప్లానింగ్ (చదవండి: రోజూ చిల్లరకొట్టుకు వస్తూ.. నిర్వాహకుడి కూతురిని ట్రాప్ చేసి..) -
బోడుప్పల్ అంటే.. బాబోయ్ మాకొద్దంటున్న అధికారులు!
సాక్షి,బోడుప్పల్(హైదరాబాద్): బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో గత కొంత కాలంగా అధికారులు లేకుండా పాలన కొనసాగుతుంది. ఇక్కడ పని చేసే అధికారులు కొంత మంది ఇష్టం లేక వెళ్లి పోవడం, మరి కొంత మంది సెలవులపై వెళ్లడంతో కిందస్థాయి సిబ్బందిచే పాలన కొనసాగిస్తున్నారు. అధికారులపై విపరీతమైన ఒత్తిడి, పనిభారంతో పాటు వేధింపులు ఉండడంతో ఇక్కడ పని చేయడానికి ఏ అధికారి ఇష్ట పడడం లేదు. దీంతో ఇప్పటికే కమిషనర్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, మేనేజర్, హరితహారం ఇన్చార్జ్ లేకుండానే తూతూ మంత్రంగా పాలన కొనసాగిస్తున్నారు. పాలనాధ్యక్షుడైన మేయర్‌కు అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మేయర్‌కు ప్రజా పాలనపై పట్టు లేకపోవడం, ఇతర విషయాలపై చూపుతున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై చూపకపోవడంతో పాలన పూర్తిగా స్తంభించిపోతోందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటేషన్‌పై పనిచేసే అధికారులు ఇక్కడ పని చేయకపోగా, మరి కొంత మంది అధికారులు బదిలీ అయ్యారు. కమిషనర్ కూడా సెలవులపై వెళ్లడంతో నగర పాలక సంస్థలో పాలన అటకెక్కింది. సమన్వయ లోపం కారణమా? ► బోడుప్పల్ కమిషనర్, మేయర్‌కు మధ్య సమన్వయం లోపించింది. దీంతో గత కొంత కాలంగా వారు ఎడ,పెడ మొఖంగా ఉన్నారు. దీంతో పాటు పనిభారంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన సెలవులపై వెళ్లారు. ఇక్కడ పని చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ పదవీకాలం ముగిసింది. అనంతరం ఆయననే మళ్లీ అవుట్ సోర్సింగ్ శానిటరీ ఇన్స్పెక్టర్గా తీసుకున్నారు. ఆయన కొంత కాలం పని చేసిన తర్వాత ఇక్కడ చేయలేనని వెళ్లిపోయారు. ఆ తర్వాత కొత్తగా మరో శానిటరీ ఇన్స్పెక్టర్ రాలేదు. ఒకప్పుడు ఢిల్లీ స్థాయిలో గుర్తింపు పొంది స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్‌లో అవార్డులు పొందిన బోడుప్పల్ నేడు చెత్త విషయంలో మురికి కూపంగా మారింది. ఇక్కడ పని చేసిన మేనేజర్ మరో చోటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరూ రాకపోవడంతో ఆర్ఓను ఇన్చార్జ్ మేనేజర్‌గా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఇలా వస్తారు.. అలా వెళ్తారు.. ► మున్సిపాలిటీకి కీలకమైన విభాగం టౌన్‌ప్లానింగ్. ఇక్కడ గతంలో నల్గొండలో పనిచేసే ఓ ఏసీపీ అధికారి డిప్యూటేషన్‌పై మూడు రోజులు ఇక్కడ, మరో మూడు రోజులు అక్కడ పని చేశారు. ఓ మంత్రి సహకారం మేయర్, కొంత మంది కార్పొరేటర్లు భవన నిర్మాణాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఆయన తన డిప్యూటేషన్‌ను రద్దు చేయించుకుని నల్గొండలోనే ఉండి పోయారు. ఆయన తరువాత మరో టీపీఓ డిప్యూటేషన్‌పై వచ్చారు. ఆయన కూడా ఇక్కడ ఇమడ లేక వెళ్లిపోయారు. ప్రస్తుతం అధికారి లేకుండానే టౌన్ ప్లానింగ్ విభాగం కొనసాగుతోంది. కిందిస్థాయి అధికారులతోనే.. ► ప్రతి సంవత్సరం హరితహారం కోసం బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ, మొక్కల పంపిణీ, పార్కుల ఏర్పాటు, నిర్వహణ, పెరటి తోటల పంపకం, మొక్కలకు నీటి సరఫరా, నర్సరీల ఏర్పాటు, నిర్వహణ కోసం పదవీ విరమణ పొందిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్‌ను నెలకు రూ. 50 వేలు ఇచ్చి తీసుకున్నారు. ఇక్కడ పరిస్థితులు గమనించిన సదరు అధికారి సైతం పని చేయలేమని వెళ్లిపోయారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో పనిచేసే అందుకు ఎవరూ సాహసించడం లేదు. ప్రస్తుతం ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగం మినహా ఇస్తే మిగతా విభాగాలు కింద స్థాయి అధికారులు, సిబ్బందిచే నడుపుతున్నారు. దీంతో పాలన అంతా స్తంభించి పోయి అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చదవండి: కరీంనగర్లో మరో ‘పుష్ప’ భన్వర్‌సింగ్.. వైరల్ -
చక్రం తిప్పిన బీజేపీ.. రెండో స్థానంలో నిలిచినా చండీగఢ్ మేయర్ పీఠం కైవసం
చండీగఢ్: చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును అనూహ్యంగా బీజేపీ కైవసం చేసుకుంది. 35 వార్డులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా బరిలో దిగినా అత్యధికంగా 14 చోట్ల పార్టీ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 12 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా, శిరోమణి అకాలీదళ్ కేవలం ఒకే ఒక్క చోట గెలిచిన విషయం తెల్సిందే. చదవండి: సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. నలుగురు న్యాయమూర్తులకు పాజిటీవ్ కాగా, మేయర్ స్థానం కోసం శనివారం జరిగిన ఓటింగ్ రసవత్తరంగా సాగింది. ఓటింగ్ సమయంలో ఒక శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్, ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో 35 సీట్లున్న నగర కార్పొరేషన్లో మేయర్ స్థానానికి జరిగిన ఓటింగ్‌లో సాధారణ మెజారిటీ 14కు పడిపోయింది. చండీగఢ్ ఎంపీ.. మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్–అఫీషియో సభ్యుడి హోదాలో ఓటింగ్‌లో పాల్గొని బీజేపీకి మద్దతిచ్చారు. ఫలితాలు రాగానే ఒక కాంగ్రెస్ సభ్యుడు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆప్, బీజేపీ చెరో 14 మంది సభ్యులతో సమంగా నిల్చాయి. అయితే, శనివారం మేయర్ ఎన్నికలో ఒక ఆప్ సభ్యుని ఓటు చెల్లదని తేల్చడంతో మేయర్ పీఠం బీజేపీ వశమైంది. మహిళా కౌన్సిలర్ సరబ్జిత్ కౌర్ ధిల్లాన్ మేయర్‌గా గెలిచారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని ఆప్ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్లు కావాలనే గైర్హాజరై బీజేపీకి పరోక్ష మద్దతిచ్చారని ఆప్ ఆరోపించింది. -
‘మెప్మా’.. కేసు కదలదేమి చెప్మా!
సాక్షి, హైదరాబాద్: అది కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్.. నలుగురు కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఓ టీఎంసీ, మరికొందరు రిసోర్సు పర్సన్లు... బ్యాంకు అధికారులతో కుమ్మక్కై 64 నకిలీ మహిళా సంఘాలను సృష్టించారు. రూ.కోట్లలో బ్యాంకులకు టోకరా పెట్టారు. దీనిపై మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు విచారణ జరిపి రూ.3.20 కోట్ల రుణ కుంభకోణం జరిగినట్లు నిర్ధారించారు. ఒక టీఎంసీని, సీవోను సస్పెండ్ చేసి, మరో ముగ్గురు సీవోలకు షోకాజ్ నోటీసులిచ్చారు. బ్యాంకుల అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదుచేశారు. ఆ తర్వాత యథావిధిగా స్థానిక కార్పొరేటర్లు, పెద్ద నాయకులు రంగ ప్రవేశం చేయగా... ఓ సీవోను అరెస్టు చేయడం మినహా ఎలాంటి చర్యలు లేవు. ఏడాది దాటినా రికవరీ లేదు. కేసుల దర్యాప్తు కూడా ముందుకు సాగడం లేదు. ఈ బోగస్ రుణాల కుంభకోణం ఒక్క కరీంనగర్ కార్పొరేషన్తోనే ఆగలేదు. వరంగల్, ఖమ్మం, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లతోపాటు నల్లగొండ, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్ధిపేట తదితర మునిసిపాలిటీల్లోనూ సాగింది. అన్నిచోట్లా భారీస్థాయిలో రుణ కుంభకోణం సాగినట్లు తెలుస్తోంది. సంఘానికి రూ.7.50 లక్షల వరకు రుణం నకిలీ మహిళా సంఘాల పేరిట దందాలు 2015లో మొదలైనా 2018, 2019లలో అనేక నగరాలు, పట్టణాల్లో ఈ తతంగం సాగింది. కరీంనగర్లో 64 సంఘాల ద్వారా 3.20 కోట్లు రుణాలు పొందినట్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచి్చంది. దీంతో సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ రాష్ట్రవ్యాప్తంగా రుణాల మంజూరు, రికవరీలపై దృష్టి పెట్టగా.. చాలా పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తేలింది. రిసోర్స్ పర్సన్ల ద్వారా ఒక బోగస్ సంఘాన్ని ఏర్పాటు చేయించి, బ్యాంకు అధికారులతో కలిసి మహిళల ఫొటోలు, పేర్లతోపాటు ఆధార్ నుంచి బ్యాంకు అకౌంట్ వరకు నకిలీవి సృష్టించి ఒక్కో సంఘం పేరిట రూ.2 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు రుణాలు పొందినట్లు తేలింది. కరీంనగర్లో మూడు సంఘాల నుంచి మాత్రమే రికవరీ చేశారు. గ్రేటర్ వరంగల్‌లో స్థానిక ప్రజాప్రతినిధులు రంగప్రవేశం చేయడంతో బోగస్ రుణాల కేసులు దాదాపుగా క్లోజయ్యాయి. ఇక్కడ ఏకంగా సీవోలను సస్పెండ్ చేసి కొత్త వారిని నియమించారు. సస్పెండ్ అయిన వాళ్లు రికవరీ చేసే పనిలో ఉన్నారు. మరో ముగ్గురు ఆర్పీలపై చర్యలకు ఉపక్రమించినప్పటికీ ప్రజాప్రతినిధుల సిఫారసుతో యథావిధిగా కొనసాగుతున్నారు. మంచిర్యాలలో ముగ్గురు సీవోలను జిల్లాలోని వేర్వేరు మున్సిపాలిటీలకు బదిలీ చేశారు. సిరిసిల్లలో 43 సంఘాల ద్వారా రూ.80 లక్షల రుణాలను తీసుకొని పత్తాలేకుండా పోయారు. సిద్ధిపేటలో రూ.18 లక్షల అక్రమ రుణాలు మంజూరయ్యాయి. ఖమ్మంలో జిల్లా కోఆర్డినేటర్‌గా ఉన్న మహిళ ఏకంగా ఏసీబీకే చిక్కారు. ప్రతి ఆర్పీ నుంచి ఆమె నెలకు రూ.1,500 మేర లంచంగా తీసుకుంటారు. రామగుండంలో మెప్మా అధికారిగా ఉన్న మహిళ ఏడెనిమిదేళ్ల క్రితమే సస్పెండ్ అయి ఏడాదిన్నర తరువాత రాజకీయ పరపతితో తిరిగి మంచి పోస్టును దక్కించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరిపైనా చర్యల్లేవ్... రాష్ట్రంలో మెప్మా పరిధిలో 5,765 మహిళా సమాఖ్యలున్నాయి. ఒక్కో సమాఖ్య పరిధిలో 20–30 మహిళా సంఘాలు ఉంటాయి. ప్రతి సమాఖ్యకు ఒక రిసోర్స్ పర్సన్ (ఆర్పీ) బాధ్యురాలిగా ఉండి ఆయా సంఘాలకు రుణాలు ఇప్పించి, రికవరీ చేయించాలి. ప్రతి సమాఖ్యలోకి కొత్తగా సంఘాలను తీసుకునే అవకాశం ఉండటంతో దాన్ని ఆసరాగా చేసుకొని బోగస్ సంఘాలను సృష్టించి, రుణాలు పొందారు. కమ్యూనిటీ ఆర్గనైజర్లు, టీఎంసీలు, బ్యాంకు అధికారులు సూత్రధారులుగా వ్యవహరించారు. అయితే విషయం బయటకు పొక్కగానే ఎవరికి వారు నెపాన్ని ఎదుటివారిపై నెట్టేసి తమను తాము రక్షించుకుంటున్నారు. దందాలో భాగస్వాములైన బ్యాంకు అధికారుల గురించి అడిగేవారే లేరు. బోగస్ సంఘాల అంశం వెలుగు చూడటంతో ప్రస్తుతం చాలా బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడానికి ఆసక్తి కనపరచడం లేదు. -
వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం.. తేల్చి చెప్పిన అధికారులు
ముంబై: కరోనా కట్టడికి నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించాలనే లక్ష్యంతో థానే మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు జీతం ఇవ్వబోమని స్పష్టం చేసింది. సోమవారం సివిక్ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ, థానే మేయర్ నరేష్ మస్కే సహా సీనియర్ టీఎంసీ అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అర్థరాత్రి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, మొదటి డోస్ తీసుకోని పౌర ఉద్యోగులకు జీతాలు చెల్లించేది లేదంటూ స్పష్టం చేసింది. నిర్ణీత వ్యవధిలోపు రెండోసారి వ్యాక్సిన్ తీసుకోని పౌర ఉద్యోగులకు కూడా జీతాలు అందవని ఆ ప్రకటనలో పేర్కొంది. పౌర ఉద్యోగులందరూ తమ టీకా సర్టిఫికేట్లను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించడాన్ని టీఎంసీ తప్పనిసరి చేసింది. ఈ నెలాఖరులోగా నగరంలో వాక్సిన్ వంద శాతం లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమావేశం అనంతరం మస్కే విలేకరులతో అన్నారు. చదవండి: గుజరాత్: ముగ్గురు మైనర్లపై అత్యాచారం.. మూడేళ్ల చిన్నారి కేకలు వేయడంతో.. -
నిజాంపేట్ కార్పొరేషన్లో ఆహ్లాద కేంద్రాలు అస్తవ్యస్తం!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు పార్కుల అభివృద్ధి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కార్పొరేషన్‌లోని నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్‌లలో పార్కులు ఉండగా ఎక్కువగా ప్రగతినగర్‌లోనే ఉన్నాయి. అయితే ఉన్న వాటిలో కొన్ని పార్కుల నిర్వహణ, అభివృద్ధి బాగానే ఉన్నా ఎక్కువ పార్కులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పలు పార్కుల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పార్కుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్కుల అభివృద్ధికి లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా ప్రయోజనం కనపించడం లేదని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆట పరికరాలు కరువు... ► కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని పార్కుల్లో పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన ఆట వస్తువులు లేకపోవడంతో పరిసర ప్రాంతల్లో నివసించే పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (చదవండి: తెలంగాణలో నిరుద్యోగం తగ్గుముఖం..7.4 నుంచి 4.2 శాతానికి..) ► కేవలం కొన్ని పార్కుల్లోనే పిల్లల ఆట పరికరాలు ఉండటంతో అనేక మంది అట్టి పార్కులకు వెళ్తుండటంతో అక్కడ తీవ్ర రద్దీ ఏర్పడుతుంది. ఓపెన్ జిమ్‌లు కూడా... ► అదే విధంగా ఓపెన్ జీమ్‌లు కూడా అన్ని పార్కుల్లో లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ► ప్రతి కాలనీలో ఉన్న పార్కులో ఓపెన్ జీమ్‌లు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. పార్కుల నిర్వహణలో లోపం... పార్కుల నిర్వహణలో క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలు కాలనీల ప్రజలు వాపోతున్నారు. ► పార్కుల్లో చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ► పెద్దపెద్ద రాళ్లు కూడా పార్కుల్లో ఇబ్బందికరంగా ఉన్నాయి. ► అదేవిధంగా పూర్తి స్థాయిలో గ్రీనరీ కోసం నీటిని కూడా సక్రమంగా పట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ► పార్కులకు ఉన్న గేట్లు కూడా సరిగ్గా లేకపోవడంతో పశువులకు పార్కులు అవాసాలుగా మారాయని వాపోతున్నారు. ► కొన్ని పార్కుల్లో అయితే చెత్తాచెదారం పేరుకుపోయి అస్తవ్యస్తంగా మారుతున్నాయి. నిర్వహణ నిరంతరం చేయాలి పార్కుల అభివృద్ధి, నిర్వహణ నిరంతరం కొనసాగాలి. ప్రజలు ప్రతి రోజు ఆహ్లాదం కోసం పార్కులకు వస్తుంటారు. అలాంటి సమయంలో అక్కడ ఉన్న ప్రకృతి, గ్రీనరీతో అనుభూతి పొందాలి. కానీ అలాంటి పరిస్థితి అనేక పార్కుల్లో లేదు. కేవలం కొన్ని పార్కుల్లోనే ఉంది. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఉన్న పార్కుల్లో గ్రీనరీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి జీమ్‌లు, ఆట పరికారాలు లేని పార్కుల్లో వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – మురళి, స్థానికుడు అభివృద్ధి, నిర్వహణకు చర్యలు తీసుకుంటా.. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధికి నోచుకొని పార్కులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. అదే విధంగా నిర్వహణకు నోచుకొని పార్కులను వెంటనే గుర్తించి ప్రతి రోజు పార్కుల నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తా. అదే విధంగా పార్కుల్లో గ్రీనరీ పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటా. – శంకరయ్య, కమిషనర్, నిజాంపేట్ -
చెత్త దిబ్బల వద్ద షూటింగ్.. అయితే పైసలు కట్టాల్సిందే!
న్యూఢిల్లీ: సాధారణంగా చెత్త అంటే వ్యర్థపదార్థంగానూ, లేక పెద్దగా ఉపయోగపడని వస్తువుగా పరిగణిస్తారు. అయితే ఓ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం వ్యర్థాలు ద్వారా కూడా పైసలు వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలో పేరుకుపోతున్న చెత్త దిబ్బల వద్ద వీడియోలు, షూటింగ్ తీసే వారి నుంచి ఛార్జీలు వసూలు చేయాలని తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం.. వీరి పరిధిలో ఎక్కడైనా చెత్త దిబ్బల వద్ద వెబ్ సిరీస్, ఇతర షూటింగ్‌ల చేయాలనుకునే వారు ప్రతిరోజూ రూ.75,000 చెల్లించాలని మేయర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. దీంతో పాటు ల్యాండ్‌ఫిల్ సైట్ సమీపంలో షూటింగ్ కోసం రూ. 2 లక్షలు చెల్లించాలని తెలిపారు. అంతే కాకుండా ముందుగా సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.25,000 చెల్లించాలని, వాటిని 2 వారాల్లో తిరిగి ఇస్తామన్నారు. అయితే, ఈ ఛార్జీలపై ఓ వెసులుబాటును కూడా కల్పించారు. ఎవరైనా పేరుకుపోతున్న చెత్త, వాటి తొలగింపు సమస్యపై డాక్యుమెంటరీ తీసినా లేదా సామాజిక సందేశాన్ని అందించేందుకు షూటింగ్ చేసేవారి నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపారు. కాకపోతే అందుకోసం తమకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. చదవండి: కిల్లర్ చైర్.. దీని కథ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. -
చెత్త తో గ్యాస్
-
మహిళతో అసభ్యకర ప్రవర్తన, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్కు దేహశుద్ధి
సాక్షి, సంగారెడ్డి: మున్సిపల్ అధికారి వేధింపులు భరించలేని ఓ మహిళ తన భర్తతో కలిసి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జరిగింది. వివరాల ప్రకారం.. సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో పనిమీద వచ్చిన మహిళలను అక్కడి శానిటరీ ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అధికారి ప్రవర్తనకు విసిగిపోయిన బాధితురాలు తన భర్తకు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తన భార్యతో కలిసి శానిటరీ ఇన్స్పెక్టర్కు చితకబాది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
నేడు రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక
-
మీర్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ భర్తదాష్టీకం
-
15 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజ
-
ఏలూరు కార్పొరేషన్: కౌంటింగ్ కొనసాగుతోంది
-
ఏలూరు కార్పొరేషన్: కాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్
-
ఈ నెల 30న ఏలూరు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
సాక్షి, అమరావతి: ఈ నెల 30న ఏలూరు మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే రోజు రాష్ట్రంలోని 11 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ ఎంపికకి ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. పరోక్ష పద్దతిలో రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ ఎంపిక ఉంటుందని ఎస్ఈసీ పేర్కొంది. 30వ తేదీ ప్రత్యేక సమావేశాలకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, కార్పోరేషన్ అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఎంపికైన కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లకి ఈ నెల 26 లోపు సమాచారమివ్వాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ చైర్మన్లను నియమించుకునేలా ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ల ఎంపిక చేపట్టాలని ఎస్ఈసీని ప్రభుత్వం కోరడంతో ప్రత్యేక సమావేశం నిర్వహణకి నోటిఫికేషన్ జారీ చేసింది. -
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్ సిగ్నల్
-
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈనెల 25న ఉ.8 నుంచి కౌంటింగ్ ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించుకోవచ్చన్న డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఎస్ఈసీ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. కోవిడ్ నిబంధనలతో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కాగా, మార్చి 10న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, కోవిడ్ జాగ్రత్తల మధ్య జరిగిన ఎలక్షన్లో 56.86% పోలింగ్ నమోదైంది. అయితే, ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మేలో జరిగిన విచారణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. -
కరోనా పేషెంట్లకు రూ.10 లక్షలు చెల్లించండి
ముంబై: కరోనా వైరస్ పేరు చెప్పి కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు సంపాదించుకుంటున్నాయి.దీంతో ఆయా రాష్ట్రప్రభుత్వాలు కరోనావైద్యం పేరుతో డబ్బులు దండుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడాను ఝులిపిస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న 92 మంది బాధితులకు రూ.10 లక్షలు తిరిగి చెల్లించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహరాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం బాధితులకు కరోనా టెస్ట్ లు చేసి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నాగ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసి) అధికారులు ట్రీట్మెంట్ చేసినందుకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని అన్నీ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం స్పందించలేదు. ఆస్పత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్ఎంసి అదనపు కమిషనర్ జలాజ్ శర్మ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అధారంగా రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. దీంతో మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వారం రోజుల్లో రేడియన్స్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న కరోనా బాధితులు, లేదంటే వారి బంధువులకు రూ .10,32,243 తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు శర్మ ఈ సందర్భంగా తెలిపారు. బాధితులకు డబ్బు చెల్లించే విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఉపేక్షించేది లేదని అన్నారు. అంటువ్యాధి మరియు విపత్తు నిర్వహణ చట్టం కింద ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జలాజ్ శర్మ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
300 మందికి అంత్యక్రియలు చేశాడు.. చివరికి
చండీగఢ్: కరోనా వైరస్ బారినపడి ఎంతోమంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. మయదారి మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. తాజాగా కరోనాతో కన్నుమూసిన కొన్ని వందలమందికి అంత్యక్రియలు జరిపిన ఓ వ్యక్తి అదే కోవిడ్ సోకి ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాలు.. 44 ఏళ్ల ప్రవీణ్ కుమార్ హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి. కరోనా వైరస్ రోగుల మృతదేహాలను దహనం చేయడానికి మున్సిపాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన బృందానికి ప్రవీణ్ అధిపతి. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి కోవిడ్‌తో మృత్యువాతపడిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమానం, భయం లేకుండాఇలా దాదాపు 300కుపైగా జరిపాడు. ఈ క్రమంలో ఇటీవల ప్రవీణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రవీణ్ ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. దురదృష్టవశాత్తు కోవిడ్ సోకిన రెండు రోజులకే ఆయన సోమవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఎంతో మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రవీణ్ ఇలా మరణించడం స్థానికులను కలిచివేస్తోంది. ప్రవీణ్ అంత్యక్రియలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హిసర్ మేయర్ ఆధ్వర్యంలో రిషినగర్లో మంగళవారం జరిపారు. ప్రవీణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతనిది ఉమ్మడి కుటుంబం. దాదాపు అందరూ మున్సిపల్ కార్పొరేషన్లోనే ఉద్యోగం చేస్తున్నారు. చదవండి:Corona: మృతదేహంపై ఆభరణాలు తీసిచ్చినందుకు రూ.14 వేలు -
ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ అప్ డేట్
-
తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను ఒకే కార్పొరేషన్‌గా మారుస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ
-
ఒకే కార్పొరేషన్‌గా తాడేపల్లి, మంగళగిరి
సాక్షి, అమరావతి : తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను ఒకే కార్పొరేషన్‌గా మారుస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న 11 గ్రామ పంచాయతీలను..అలాగే తాడేపల్లి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న మరో 10 గ్రామ పంచాయతీలను కొత్త మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తెస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ మున్సిపల్ యాక్ట్ 1994 ప్రకారం కార్పొరేషన్ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. -
తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్ చైర్మన్
కళ్యాణదుర్గం రూరల్: తోపుడు బండిపై బొప్పాయి, మామిడి, కర్బూజ తదితర పండ్లు విక్రయించే ఓ చిరు వ్యాపారిని మునిసిపల్ చైర్మన్ పీఠం వరించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా తలారి రాజ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఇంటర్ చదివిన రాజ్‌కుమార్‌కు భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకు తోపుడుబండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీపై అభిమానంతో కార్యకర్తగా సేవలందిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో 10వ వార్డు బీసీ జనరల్‌కు రిజర్వు కాగా.. వైఎస్సార్సీపీ టికెట్ రాజ్‌కుమార్‌కు లభించింది. ఎన్నికల్లో పోటీకైతే దిగాడు కానీ కనీస ఖర్చు కూడా పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోయింది. దీంతో ఇంటింటికీ తిరుగుతూ పేదోడిని ఆదరించాలంటూ ఓటర్లను వేడుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌పై ప్రజలకున్న అభిమానం రాజ్‌కుమార్‌కు ఓట్ల వర్షం కురిపించి కార్పొరేటర్‌గా గెలిపించింది. ఇప్పుడు ఏకంగా మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. చదవండి: నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్ మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్ -
90.61 లక్షల మంది ‘పుర’ ఓటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 10న జరగనున్న పురపాలక ఎన్నికల్లో 90,61,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 2,794 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 12 నగరపాలక సంస్థల్లో 671 డివిజన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 2,123 వార్డులు ఉన్నాయి. పురపాలక ఎన్నికల ఓటర్ల జాబితాలను పురపాలకశాఖ ఖరారు చేసింది. ఓటర్లలో పురుషులు కంటే మహిళలే అధికంగా ఉన్నారు. నగరపాలక సంస్థల్లో విశాఖపట్నంలోను, పురపాలకసంఘాల్లో నంద్యాలలోను ఎక్కువమంది ఓటర్లున్నారు. ► మొత్తం ఓటర్లు 90,61,806 మంది. వీరిలో పురుషులు 44,59,064 మంది, మహిళలు 46,01269 మంది. ఇతరులు 1,473 మంది. ► 12 నగరపాలికల్లో ఓటర్ల సంఖ్య 52,52,355. వీరిలో పురుషులు 25,97,852 మంది, మహిళలు 26,53,762 మంది, ఇతరులు 741 మంది. ► 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య 38,09,451. వీరిలో పురుషులు 18,61,212 మంది, మహిళలు 19,47,507 మంది, ఇతరులు 732 మంది. ► నగరపాలక సంస్థల్లో మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) విస్తీర్ణంలోను, ఓటర్ల సంఖ్యలోను మొదటి స్థానంలో ఉంది. 98 డివిజన్లున్న జీవీఎంసీలో ఓటర్ల సంఖ్య 17,52,927. వీరిలో పురుషులు 8,80,481 మంది, మహిళలు 8,72,320 మంది, ఇతరులు 126 మంది. ► మచిలీపట్నం నగరపాలక సంస్థలో తక్కువ మంది ఓటర్లున్నారు. 50 డివిజన్లు ఉన్న ఈ నగరపాలక సంస్థలో ఓటర్ల సంఖ్య 1,31,829. వీరిలో పురుషులు 63,883 మంది, మహిళలు 67,936 మంది, ఇతరులు 10 మంది. ► ఓటర్ల సంఖ్యలో కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం మొదటి స్థానంలో ఉంది. 42 వార్డులున్న నంద్యాలలో ఓటర్ల సంఖ్య 1,86,310. వీరిలో పురుషులు 90,597 మంది, మహిళలు 95,640 మంది, ఇతరులు 73 మంది. ► గూడూరు నగర పంచాయతీ చివర్లో ఉంది. 20 వార్డులున్న ఈ నగర పంచాయతీలో ఓటర్ల సంఖ్య 15,789 మాత్రమే. -
పట్టణాల్లో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఆస్తి పన్ను, ఖాళీ జాగాలపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేటగిరీలవారీగా సవరించిన పన్ను రేట్లను ప్రతిపాదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని అనుసరించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండళ్లు ఆస్తి పన్ను, ఖాళీ జాగాలపై పన్ను రేట్లను నిర్ణయిస్తూ ప్రజల అభిప్రాయాలు సేకరించి తీర్మానాలు చేయాలి. అనంతరం ఆమోదించిన తీర్మానాలను ప్రభుత్వానికి సమర్పించాలి. దీనిపై పురపాలకశాఖ తుది నిర్ణయం తీసుకుని పన్ను రేట్లను నిర్ణయిస్తుంది. పురపాలకశాఖ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.. ఆస్తి పన్ను రేట్లు ఇలా.. ► నివాస గృహాలకు ప్రభుత్వ ధర ప్రకారం ఆస్తి విలువలో 0.10 శాతానికి తగ్గకుండా 0.50 శాతానికి మించకుండా ఆస్తి పన్నును ప్రతిపాదించారు. ► వాణిజ్య భవనాలకు ప్రభుత్వ ధర ప్రకారం ఆస్తి విలువలో 0.20 శాతానికి తగ్గకుండా 2 శాతానికి మించకుండా ఆస్తి పన్ను ప్రతిపాదించారు. ► ఒక మున్సిపాలిటీ / మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంతటా ఆస్తి పన్ను రేట్లు ఒకేలా ఉండాలి. ► 375 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాలోపు నిర్మించిన ఇళ్లలో ఇంటి యజమాని నివాసం ఉంటే ఏడాదికి నామమాత్రంగా రూ.50 ఆస్తిపన్నుగా నిర్ణయించారు. ఖాళీ జాగాలపై పన్ను రేట్లు ఇలా ► మున్సిపాలిటీలలో ప్రభుత్వ ధర ప్రకారం ఖాళీ జాగా అంచనా విలువపై 0.20 శాతం. ► మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రభుత్వ ధర ప్రకారం ఖాళీ జాగా అంచనా విలువపై 0.50 శాతం. ► ఖాళీ జాగాలలో చెత్త / ఇతర వ్యర్థాలు వేస్తే మున్సిపాలిటీలలో అదనంగా 0.10 శాతం, కార్పొరేషన్లలో అదనంగా 0.25 శాతం పెనాల్టీ విధిస్తారు. అనధికార నిర్మాణాలపై జరిమానాలు ► అనుమతులకు మించి 10 శాతం అతిక్రమణలు ఉంటే విధించిన ఆస్తిపన్నుపై 25 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. ► అనుమతులకు మించి 10 శాతాని కంటే ఎక్కువగా అతిక్రమణలు ఉంటే విధించిన ఆస్తిపన్నుపై 50 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. ► అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు (ఫ్లోర్లు) నిర్మిస్తే విధించిన ఆస్తిపన్నుపై 100 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. మొత్తం భవనమే అనధికార నిర్మాణం అయితే కూడా ఇదే జరిమానా వర్తిస్తుంది. వీటికి పన్ను మినహాయింపులు ► ప్రభుత్వం గుర్తించిన చౌల్ట్రీలు, సేవా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, లైబ్రరీ/ మైదానాలు లాంటి ప్రజోపయోగ స్థలాలు, పురాతత్వ ప్రదేశాలు, ఛారిటబుల్ ఆసుపత్రులు, రైల్వే ఆసుపత్రులు, శ్మశానాలు మొదలైన స్థలాలకు ఆస్తిపన్ను, ఖాళీ జాగా పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ► సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు నివసించే ఒక ఇంటికి లేదా ఖాళీ జాగాకు పన్ను మినహాయింపు కలి్పంచారు. -
టీడీపీ నేతల కుట్ర భగ్నం..
సాక్షి, అనంతపురం: రూ.8 కోట్లు కాజేసేందుకు టీడీపీ నేతలు పన్నిన కుట్రను కమిషనర్ పీవీఎస్ మూర్తి భగ్నం చేశారు. ఎన్టీఆర్ మార్గ్ పనుల్లో టీడీపీ నేతల అక్రమాలు వెలుగు చూశాయి. అరెకరం స్థలానికి 9.63 కోట్ల పరిహారానికి తొలుత ప్రతిపాదనలు జరగ్గా, ప్రతిపాదనల తర్వాత స్థలం వివరాలను టీడీపీ నేతలు తారుమారు చేశారు. టీడీపీ హయాంలో చదరపు అడుగు 17వేల నుంచి 30వేలకు పెంచారు. పరిహారం డబ్బు రూ.9.63 కోట్ల నుంచి రూ.17 కోట్లకు పెంచారు. టీడీపీ నేతలకు అప్పటి జాయింట్ కలెక్టర్, ఆర్డీవో సహకరించారు. లక్షల రూపాయల ముడుపులు చేతులు మారాయి. రూ.8 కోట్లు అదనంగా కాజేసే కుట్రను కమిషనర్ మూర్తి గుర్తించారు. పరిహారం రెట్టింపు చేసుకునేందుకు ప్రైం లోకేషన్ల వివరాలను టీడీపీ నేతలు జత చేయగా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పరిశీలనలో అక్రమాలు బయటపడ్డాయి. మొత్తం రూ.17 కోట్ల పరిహారం నిలుపుదల చేశారుజ సమగ్ర వివరాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు మున్సిపల్ కమిషనర్ మూర్తి సిద్ధమయ్యారు. -
అనంతపురం కార్పొరేషన్లో వసూళ్ల పర్వం
ప్రభాకర్: నమస్తే .. సార్ నా కుమారునికి ఆరేళ్లు. బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అధికారి: ఎక్కడ పుట్టినాడో అక్కడే తీసుకోవాలి. ప్రభాకర్: అక్కడ ఇప్పుడు ఇవ్వమంటున్నారు సార్.. అధికారి: అవునా.. ఏం అర్జెంట్ పని ఉందా.. ప్రభాకర్: అవును సార్.. చాలా పని ఉంది అధికారి: అయితే నీ ఫోన్ నంబర్ చెప్పు మధ్యాహ్నం తరువాత చేస్తా. ప్రభాకర్: ఎంత ఖర్చు అవుతుంది సార్. డబ్బులు సర్దుబాటు చేసుకుంటా. అధికారి: రూ. 2500 ఇస్తే.. మూడు రోజులకు సర్టిఫికెట్ ఇస్తా. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు సెక్షన్లో ఓ అధికారి నగరవాసితో జరిపిన సంభాషణ ఇది. దీన్ని బట్టి చూస్తే చాలు ప్రజల నుంచి ఏ రకంగా డబ్బులు పీడించుకొని తింటున్నారో తెలుస్తుంది. నగరంలో వేణుగోపాల్‌నగర్‌లో నివాసముంటున్న ప్రభాకర్ (పేరుమార్చాం) తన కుమారుడు సనత్ (పేరుమార్చాం)కి బర్త్ సరి్టఫికెట్ తీసుకునేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు విభాగానికి వెళ్లారు. అన్ని రికార్డులు సమర్పించి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా అధికారికి విజ్ఞప్తి చేశారు. సదరు అధికారి ప్రస్తుతం రూ. 300 ఇచ్చి రెండు రోజులు తర్వాత రావాలని చెప్పారు. సర్టిఫికెట్ తీసుకునే రోజు రూ. 1,500 ఇవాల్సి ఉంటుందని చెప్పడంతో దరఖాస్తుదారుడు కంగుతిన్నాడు. అనంతపురం సెంట్రల్: నగరపాలక సంస్థలోని జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు విభాగం అధికారులు సేవలకు రేట్లు ఫిక్స్ చేశారు. అవసరాన్ని బట్టి రేటు పెంచేస్తున్నారు. ఒక్కో ధ్రువీకరణ పత్రానికి రూ. 500 మొదలుకొని రూ. 5000 వరకూ అవసరాన్ని బట్టి దండుకుంటున్నారు. ఇటీవలి కాలంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల పెరగడంతో నగరవాసులు నగరపాలక సంస్థ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రోజూ దాదాపు వంద మంది జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం నగరపాలక సంస్థ కార్యాలయానికి వస్తున్నారు. కానీ చేయి తడపందే ఇక్కడి సిబ్బంది ధ్రువీకరణ పత్రాలివ్వడం లేదు. ఉద్యోగుల చేతివాటం నగరపాలక సంస్థలో జనన, మరణ ధ్రువీకరణపత్రాల మంజూరు విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమాత్రం లేదు. ఎక్కువగా చిన్నస్థాయి ఉద్యోగులే ఇక్కడ పనిచేస్తుండటంతో అందినకాడికి దోచేస్తున్నారు. పారిశుద్ధ్య విభాగానికి చెందిన ఓ వ్యక్తి తనకున్న పలుకుబడితో కొన్నేళ్లుగా ఈ విభాగంలో తిష్ట వేశాడు. వాస్తవానికి అతను పారిశుద్ధ్య మేస్త్రీగా పనిచేయాల్సి ఉంది. కానీ ఇతర కారణాలు చూపి ఇక్కడే పాతుకుపోయాడు. ఏ పని కోసం వెళ్లినా సరే మొహమాటం లేకుండా బేరం మొదలు పెడతాడు. మరో కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఇదే రీతిలో పనిచేస్తున్నాడు. ఈ విషయాలు ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కఠిన చర్యలు తీసుకుంటాం నగర పాలక సంస్థ ద్వారా అందే సేవలన్నీ వార్డు సచివాలయాల్లోనే అందజేస్తున్నాం. ప్రజలెవరూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు విభాగంపై గతంలో ఫిర్యాదులు రావడంతో ఓ అధికారిని తొలగించాం. తాజాగా వచ్చిన ఆరోపణలపై విచారిస్తాం. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – పీవీఎస్ మూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ -
నగరపాలక సంస్థలో బయటపడ్డ అవినీతి
సాక్షి, అనంతపురం: జిల్లాలోని నగరపాలక సంస్థలో అవినీతి బయటపడింది. బిల్డింగ్ క్రమబద్ధీకరించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. వివరాలు.. టౌన్ ప్లానింగ్ అధికారులు వినయ్, అలివేలమ్మ తన బిల్డింగ్ క్రమబద్ధీకరణకు రూ.4 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు సత్యనారాయణ ఆరోపణలు చేశాడు. అంతే కాకుండా లంచం డబ్బ కోసం ఆ అధికారులు తనని వేధిస్తున్నారని తెలిపాడు. తాజాగా టౌన్ ప్లానింగ్ అధికారులు లంచం అడిగిన ఓ వీడియోను బాధితుడు బయటపెట్టాడు. రూ.లక్ష లంచం తీసుకుంటూ మున్సిపల్ ఉద్యోగి ఆయూబ్ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను నెల రోజుల కిందట బాధితుడు తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు. ఇటీవల మున్సిపల్ ఉద్యోగి ఆయూబ్ అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. టైన్ ప్లానింగ్ అధికారులు వినయ్, అలివేలమ్మ తరఫున ఆయూబ్ లంచం తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. దీంతో పాటు అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది అవినీతిపై బాధితుడు సత్యనారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. -
మేయర్‌కు కరోనా.. ఆందోళనలో సిబ్బంది
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కరోనా కలకలం రేగింది.. సాక్షాత్తు మేయర్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె భర్త, అత్త, పీఆర్ఓకు కూడా పరీక్షలు నిర్వహించగా వారందరికీ పాజిటివ్‌గా తేలింది. వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మేయర్‌కు పాజిటివ్‌గా తేలడంతో రెండు రోజుల క్రితం జరిగిన సమీక్షలో పాల్గొన్న అధికారుల్లో ఆందోళన మొదలైంది. నగర పాలక సంస్థలోని పలువురు అధికారులు, ఉద్యోగులకు కరోనా లక్షణాలు బయటపడటంతో వారందరూ హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా.. మేయర్‌ను కాంటాక్ట్ అయిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కామారెడ్డి: జిల్లాలో కరోనా హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 35కు పైగా కుటుంబాలకు కరోనా బారినపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా చాలా కుటుంబాల్లో ఇంటిల్లిపాది మొత్తానికి కరోనా వైరస్ సోకుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. (వారికి భవిష్యత్తులో కరోనా సోకే అవకాశం) -
రూల్స్ బ్రేక్: నడిరోడ్డుపై పెళ్లికొడుక్కి...
భోపాల్: కరోనా ఆంక్షల నేపథ్యంలో మాస్క్ లేకుండా రోడ్డుపైకి వచ్చిన పెళ్లి కొడుక్కి జరిమానా విధించిన ఘటన సోమవారం రోజున మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. లాక్డౌన్ నిబంధనలు సడలింపుల అనంతరం.. ఇండోర్‌లో పెళ్లి చేసుకునేందుకు 12 మందికి అనుమతి ఉంది. అయితే పెళ్లి కొడుకు ధర్మేంద్రతో పాటు పెళ్లికి హాజరవుతున్న 12 మంది వ్యక్తులు కూడా ఒకే వాహనంలో మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన అధికారులు వారికి జరిమానా విధించారు. ఈ సంఘటనపై మన్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వివేక్ గ్యాంగ్రాడే మాట్లాడుతూ.. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బందికి మాస్కులు లేకుండా, నిబంధనలు పాటించకుండా వారు కనిపించడంతో పెళ్లికొడుకుతో పాటు మరో 12 మందికి ఫైన్ వేసినట్లు తెలిపారు. భౌతిక దూరం పాటించనందుకు రూ. 1,100.. మాస్క్‌లు ధరించనందుకు రూ. 1,000 జరిమానా విధించినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలోనే జరిమానా రుసుమును కూడా వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇండోర్‌లో ఇప్పటిదాకా 4,069 కరోనా కేసులు నమోదవ్వగా.. 174 మంది మరణించారు. చదవండి: కరోనా: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం -
కరోనా: కర్నూలు కార్పొరేషన్లో కలవరం
సాక్షి, కర్నూలు (టౌన్): కరోనా దెబ్బకు కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం మూత పడింది. ఇటీవల ఈ కార్యాలయ కీలక అధికారితో పాటు అతని వద్ద పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యాలయంలోని వారిద్దరి గదులను సీజ్ చేశారు. మూడు రోజులుగా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇలా చేస్తే వైరస్ చనిపోతుందని వైద్యులు పేర్కొనడంతో వారి గదులను ఆ విధంగా శుభ్రం చేçస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా శానిటరీ ఇన్స్పెక్టర్, మేస్త్రీ, ఇరువురు వార్డు వలంటీర్లు, వార్డు అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి, 2 వ డివిజన్ పబ్లిక్ హెల్త్ వర్కర్, 8 వ డివిజన్ హెల్త్ వర్కర్లకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. (గ్రేటర్ దిగ్బంధం) భయాందోళనలో ఉద్యోగులు కర్నూలు నగరపాలక సంస్థలో పనిచేసే కొంత మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా వారు భయాందోళనకు గురవుతున్నారు. ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రసాద్‌గౌడ్ నేతృత్వంలో కొందరు కలెక్టర్‌ను కలిసి కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు చేయించాలని విన్నవించారు. ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తే ఉద్యోగుల్లో భయాందోళనలు తగ్గుతాయని వారు పేర్కొన్నారు. మూడు విభాగాలకు మినహాయింపు కీలక అధికారితో పాటు పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో తాత్కాలికంగా నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల కార్యాలయాలను మూసేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా శానిటేషన్, వాటర్ సప్లై, స్ట్రీట్‌లైట్స్ విభాగాలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆయా విభాగాల సిబ్బంది మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉంటున్నారు. -
లాక్డౌన్ పాటించండి: బహుమతులు గెలవండి!
థానే : కరోనా లాక్‌డౌన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, నియమాలు పాటించేలా చేసేందుకు థానే మున్సిపల్ కార్పోరేషన్ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ నియమాలను పాటించే వార్డులకు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం వార్డు స్థాయిలో కాంటెస్ట్‌లు నిర్వహిస్తోంది. అంతేకాకుండా నిర్ణీతకాలం పాటు ఒక్క కరోనా కేసుకూడా నమోదు కాని వార్డులకు 25-50 లక్షల రూపాయలు అందించనుంది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి డిజిథానే యాప్‌ను తప్పక ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ( ట్రాక్టర్‌పై పెద్ద పులితో పోరాడి.. ) కాంటెస్ట్‌లో పాల్గొనే వార్డులపై టీఎమ్‌ఎసీ ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఆ వార్డులు లాక్డౌన్ నియమాలు పాటిస్తున్నాయా లేదా తెలుసుకోవటానికి సీసీటీవీ కెమెరాలు, పోలీసుల సహాయం తీసుకోనుంది. దీనిపై మేయర్ నరేష్ మస్క్ మాట్లాడుతూ.. ‘‘ దాదాపు 80 శాతం ప్రజలు లాక్డౌన్ నియమాలు పాటిస్తున్నారు. మిగిలిన 20శాతం మంది కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందుకే టీఎమ్సీ ఈ నిర్ణయం తీసుకుంద’’ని తెలిపారు. (యూపీలో అరుదైన దృశ్యాలు కనువిందు ) -
‘నగరపాలక’ కమిషనర్‌గా ప్రశాంతి బాధ్యతల స్వీకరణ
అనంతపురం సెంట్రల్: నగరపాలక సంస్థ కమిషనర్‌గా ప్రశాంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతేడాది నవంబర్‌లో ఆమె దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మున్సిపల్ ఆర్డీ హలీమ్ బాషాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన బదిలీ కావడంతో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చెన్నుడుకు, ఆతర్వాత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రకు కేటాయించారు. బుధవారం రెగ్యులర్ కమిషనర్ ప్రశాంతి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నగరంలో వివిధ ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదైన రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. -
రెడ్ జోన్లో 41.. ఆరెంజ్ జోన్లో 45
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి మూడు జోన్లుగా విభజించగా వాటిలో రెడ్‌జోన్‌లో 41 ప్రాంతాలను గుర్తించారు. మరో 45 ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా మ్యాపింగ్ చేశారు. మొత్తం రెడ్, ఆరెంజ్ జోన్లలో 86 ప్రాంతాలున్నాయి. పట్టణప్రాంతాల్లో 43, గ్రామీణ ప్రాంతాల్లో మరో 43 ప్రాంతాలుగా ఉన్నాయి. వైరస్ ప్రభావం లేని.. అంటే గ్రీన్ జోన్ ప్రాంతాలుగా 590 మండలాలను గుర్తించారు. ► కర్నూలు జిల్లాలో అత్యధికంగా 15 రూరల్ మండలాల్లో కరోనా బాధితులు నమోదయ్యారు. ► నెల్లూరు జిల్లాలోనూ 13 మండలాలు వైరస్ ప్రభావానికి లోనయ్యాయి. ► రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ.. ఈ ఐదు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలోనే 146 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ► వీరిలో 123 మంది ఢిల్లీ వెళ్లివచ్చినవారు, వారి ద్వారా వైరస్ సోకినవారే ఉన్నారు. ► అత్యధికంగా గుంటూరులో 59 కేసులు నమోదు. ► సోమవారం సాయంత్రానికి విడుదలైన బులెటిన్‌లో లెక్క చూస్తే రాష్ట్రం మొత్తమ్మీద ఈ ఐదు కార్పొరేషన్లలోనే 33.2 శాతం కేసులు నమోదైనట్టు తేలింది. -
మొబైల్ ఫోన్లో మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్
సిద్దిపేట జోన్: సిద్దిపేట పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం తన సెల్‌ఫోన్ ద్వారానే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఒక అడుగు ముందే ఉండే హరీశ్‌రావు, లాక్డౌన్ నేపథ్యంలో సిద్దిపేట పట్టణ స్థితిగతులపై సెల్‌ఫోన్ నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులతో తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా లాక్డౌన్లో ప్రజల సహకారం, కరోనా నేపథ్యంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది విధులు, పట్టణంలో పెండింగ్‌లోని పనుల వివరాలు, కరోనా నివారణకు ప్రతిరోజూ హైపోక్లోరైడ్ స్ప్రే స్థితిగతులు, ఇంటింటికీ తాగునీటి సరఫరా, చెత్త సేకరణతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, పబ్లిక్‌హెల్త్ ఈఈ ప్రతాప్, మున్సిపల్ డీఈ లక్ష్మణ్, ఓఎస్డీ బాల్‌రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ, సతీష్‌లు పాల్గొన్నారు. -
నగ్నంగా నిల్చోబెట్టి వైద్య పరీక్షలు
సూరత్: ‘పీరియడ్స్’లో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు కాలేజ్ హాస్టల్లో వారి లోదుస్తులను విప్పించిన అమానవీయ ఘటన మరవకముందే.. అదే రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్ఎంసీ)లోని ట్రైనీ మహిళా క్లర్క్‌లను అందరినీ ఒకే చోట నగ్నంగా నిల్చోబెట్టి అవమానించారు. దీనిపై శుక్రవారం సూరత్ మున్సిపల్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్క్‌లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది మహిళలు, నిబంధనల్లో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి గైనకాలజీ విభాగంలో వైద్యులు, సిబ్బంది వారిని ఒకే గదిలో వివస్త్రలుగా నిల్చోబెట్టి పరీక్షించారు. అవివాహితులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిని అభ్యంతరకర ప్రశ్నలతో అవమానించారు. ఈ ఘటన ‘సూరత్ మున్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో గురువారం జరిగింది. దీనిపై వారు సూరత్ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో, విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కమిషనర్ కమిటీని నియమించారు. ట్రైనీ క్లర్క్‌లపై జరిగిన ఈ అమానవీయ ఘటన∙విమర్శలకు కారణమైంది. శిక్షణ అనంతరం విధులను నిర్వర్తించేందుకు అవసరమైన శారీరక సామర్ధ్యం వారికి ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఎస్ఎంసీలో క్లర్క్‌లుగా ఎంపికైనవారికి తప్పని సరిగా చేస్తారు. అయితే, వైద్య పరీక్షలకు తాము వ్యతిరేకం కాదని, కానీ పరీక్షలు జరిపిన తీరే అభ్యంతరకరంగా ఉందని ఎస్ఎంసీ ఉద్యోగ సంఘం విమర్శించింది. ప్రతీ మహిళకు ప్రత్యేకంగా, ఒంటరిగా పరీక్షలు జరపడం పద్ధతి. అక్కడి డాక్లర్లు అభ్యంతరకర రీతిలో గర్భధారణపై ప్రశ్నలు అడిగారని సంఘం ప్రధాన కార్యదర్శి చెప్పారు. -
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు
-
మునిసిపల్ పగ్గాలు చేపట్టిన యంగ్‌స్టర్స్
-
వన్ ఉమన్ ఆర్మీ
మోదీ వచ్చాక దేశంలో చెత్తశుద్ధి మొదలైంది. ఇదే పనిని.. మోదీ రాకముందే ముంబయిలో.. మారియా డిసౌజా చిత్తశుద్ధితో చేశారు! ఇప్పటికీ ఆ సిటీలో ఎక్కడ స్వచ్ఛ కార్యక్రమం ప్రారంభమైనా అత్యవసర సమయాల్లో సైన్యాన్ని దింపినట్లుగా.. మారియా డిసౌజాకు స్వాగతం పలుకుతుంటారు. అవును. ఆమె సైన్యమే. వన్ ఉమన్ ఆర్మీ! ‘జనం మీరు చేపట్టిన పనిని వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా విమర్శిస్తూ దుయ్యబడుతున్నారు... అంటే దాని అర్థం మీరు సరైన దారిలో వెళ్తున్నారని’. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం కోసం ఒక సామాజిక ఉద్యమాన్ని చేపట్టినప్పుడు తనకు వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో ఈ మాట అనలేదు మారియా డిసౌజా. అదే ఉద్యమంలో ముంబయిలోని నలభైకి పైగా నివాస ప్రాంతాలను, అక్కడ నివసించే వారిని కలుపుకుని ఉద్యమాన్ని విజయవంతం చేసిన తర్వాత అన్నమాట ఇది! ఆమె ముంబయిలో రోజూ బయల్పడే పదివేల టన్నుల చెత్తను ఉపయుక్తంగా మార్చడంలో కీలక పాత్ర వహించారు. వన్ మ్యాన్ ఆర్మీ అనే నానుడిని చెరిపేసి వన్ ఉమన్ ఆర్మీ అనే కొత్త భావనకు ప్రేరణ అయ్యారు. శుభ్రత పాఠాలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబయి.. నగర పౌరుల పచ్చటి భవిష్యత్తు కోసం 1997లో ఏఎల్ఎమ్ (అడ్వాన్స్ లొకాలిటీ మేనేజ్మెంట్) ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. అందులో నగరంలో నివసిస్తున్న అందరినీ భాగస్వామ్యం చేస్తూ స్థానికంగా కమిటీలు ఏర్పాటు చేయాలనుకుంది. ఆ కమిటీలు స్థానిక కాలనీల వాళ్లందరినీ చైతన్యవంతం చేయాలి. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనేందుకు చురుకుగా ముందుకు వచ్చారు బంద్రాలోని సెయింట్ స్టానిస్టాలస్ స్కూల్ టీచర్ మారియా డిసౌజా. ఆమె పని చేసే స్కూలు బయట గేటు పక్కన చెత్తతో నిండి పొర్లిపోతున్న రెండు పెద్ద డస్ట్బిన్ల నుంచే జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా చెత్తను తొలగించకపోవడం, ఒకరోజు వర్షానికి నేలంతా చెత్త పరుచుకుని పిల్లలు కాలు పెడితే పాదం మడమలోతుకు కూరుకుపోవడంతో ఇక ఆమె ఊరుకోలేకపోయారు. పిల్లల చేతనే నగరపాలక సంస్థకు పెద్ద ఉత్తరం రాయించారు డిసౌజా. ఆ ఉత్తరం భారీ కదలికనే తెచ్చింది. అధికారి ఒకరు స్వయంగా వచ్చిచూసి వెంటనే చెత్త తీయించేశారు. దాంతో పిల్లల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. జీరో వేస్ట్‌మేనేజ్‌మెంట్ గురించి స్కూలు గోడల మీద నినాదాలు రాయడం, చెత్త పేరుకుపోయి దోమలు ఎక్కువైతే వచ్చే అనారోగ్యాలతోపాటు, చెత్త నుంచి వచ్చే దుర్వాసనను పీల్చడంతో వచ్చే శ్వాసకోశ సమస్యలను స్థానికులకు వివరించడంలో మారియా టీచర్‌తో భాగస్వాములయ్యారు. ఇదే ఇతివృత్తంతో చిన్న చిన్న నాటకాలు వేయడంలో కూడా పిల్లలకు శిక్షణనిచ్చారామె. చేదు అనుభవాలు స్థానికుల్లో చైతన్యం తెచ్చే క్రమంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. కొంతమంది ‘ఆ చెత్త గొడవేంటో మీరు చూసుకోండి, మా పిల్లలను ఇన్వాల్వ్ చేయద్దు’ అని ప్రతిఘటించారు. మరికొందరు.. దారిలో వెళ్తుంటే ఆమె మీద కుళ్లిన టొమాటోలు, ఇంట్లో వచ్చిన చెత్తను పడేశారు. దాంతో మారియా తన ప్రయత్నాన్ని చర్చిలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లు, స్కూళ్లలో అమలు చేసి చూపించారు. ఇంటింటికీ వెళ్లి వివరించారు. ‘చెత్తను ఎరువుగా మార్చుకోవడానికి సిద్ధమే కానీ, వాసన భరించలేం’ అన్న వాళ్లను మారియా ‘‘మరి ఈ చెత్తనంతటినీ తీసుకెళ్లి నగరానికి దూరంగా మరొక చోట పడేసినప్పుడు అక్కడ నివసించే వాళ్లు ఈ దుర్వాసనను ఎందుకు భరించాలి’’ అని సూటిగా ప్రశ్నించారు. ‘‘నగరంలోని చెత్తను తరలించడానికి నగరపాలక సంస్థకు అయ్యే ఖర్చు చాలా పెద్దది. మనం ఎక్కడి చెత్తను అక్కడే స్థానికంగా ఎరువుగా మార్చుకోగలిగితే, చెత్త రవాణాకు అయ్యే ఖర్చును నగరపాలక సంస్థ మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తుంది. చెత్తను తరలించే డబ్బు కూడా మనం పన్నుల రూపంలో చెల్లించిన డబ్బే. అంటే మన డబ్బే’’ అని పిల్లలకు పాఠం చెప్పినట్లు చెప్పారు మారియా. చెత్తలో ఆహారాన్ని వెతుక్కుంటూ పక్షులు వచ్చి వాలడం, పక్షుల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలగడం వంటి పరిణామాలను తెలియచేశారు మారియా. తడి చెత్త, పొడి చెత్త, ఈ వేస్ట్, హాస్పిటల్ వేస్ట్... నాలుగు రకాలుగా వర్గీకరించడం మొదలుపెట్టారామె. ఇరవై ఏళ్ల పాటు సాగిన ఆమె ఉద్యమం ఇప్పుడు గుర్తించదగిన స్థాయికి చేరింది. ముంబయి ప్రక్షాళన కార్యక్రమంలో నడివీధిలో ఆమె వేసిన అడుగులు ఇప్పుడు ఫలితాన్ని చూపిస్తున్నాయి. తన 68 ఏళ్ల ప్రస్థానంలో ఇరవై ఏళ్ల జీవితాన్ని జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ఉద్యమం కోసమే కేటాయించారు మారియా. పిల్లలను భాగస్వాములను చేయడంతో రాబోయే తరం గురించిన చింత లేదని, ఈ ఉద్యమం కొనసాగుతుందనే భరోసా కలుగుతోందని, తన విద్యార్థులకు రుణపడి ఉంటానని చెప్పారామె. – మంజీర ముంబయిలో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ఇల్లు ‘మన్నత్’, రేఖ ఇల్లు ‘బసేరా’, సల్మాన్ ఖాన్ నివసించే గ్యాలక్సీ అపార్ట్మెంట్... అన్నీ బంద్రాలోనే ఉన్నాయి. అరేబియా మహా సముద్రం తీరాన బంద్రా బండ్ స్టాండ్‌లో మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్లకు ఒక సిమెంట్ బెంచ్ మీద రాజ్‌కపూర్ కనిపిస్తాడు. అప్పటి వరకు నడిచి నడిచి సేద దీరడానికి కూర్చున్నట్లు బెంచ్ మీద వెనక్కు వాలి ఎడమ చేతిని బెంచి మీదకు చాచిన రాజ్‌కపూర్ విగ్రహం ఉంటుంది. రాజ్‌కపూర్ పక్కన కూర్చుని ఆయన తమ భుజం మీద చేతిని వేసినట్లు మురిసిపోతూ ఫొటోలు తీసుకుంటూ ఉంటారు ముంబయికి వెళ్లిన పర్యాటకులు. సినిమా వాళ్లు నివసించే ప్రదేశం, సృజనాత్మకంగా ఉండడం సహజమే.. అనుకోవడమూ మామూలే. అయితే అదే బంద్రాలో జీరో వేస్ట్‌ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్కూలు పిల్లలు వీధి నాటకాలు వేయాల్సి వచ్చింది. తెర మీద తప్ప నేల మీద పెర్ఫార్మ్ చేయడానికి వాళ్లెవరూ ఇష్టపడకపోవడంతో ఈ సామాజిక ఉద్యమానికి మారియా డిసౌజా స్కూలు పిల్లలు ముందుకు వచ్చారు. -
ఇవి చాలా కాస్ట్లీ!
సాక్షి, హైదరాబాద్: ‘నార్సింగి మున్సిపాలిటీలోని ఓ వార్డులో 1,414 ఓట్లున్నాయి. ఈ వార్డులో మాజీ ప్రజాప్రతినిధులుగా పనిచేసిన ఇరువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల నుం చి బరిలో ఉన్నారు. ఒక ఓటు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పలు కుతోంది. ఈ వార్డులో గెలవాలంటే కనీసం 500 ఓట్లు తెచ్చుకోవాలి. ఈ ఓట్ల కోసం సగటున ఓటుకు రూ.7 వేలు అనుకున్నా... 500 ఓట్లకు గాను రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే..’ కోటిన్నర అయినా తగ్గేది లేదు.. బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని 1, 5, 20, 23 వార్డులు జనరల్‌కు రిజర్వయ్యాయి. ఇక్కడ తీవ్ర పోటీ ఉండటంతో రూ.1.25 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఎంత ఖర్చయినా సరే వెనుకాడేది లేదని పదవులు ఆకాంక్షిస్తున్న వారి శిబిరాలు తేల్చి చెప్పేస్తున్నాయి. పండుగ ఖర్చు మాదే.. నగర శివార్లలోని ఓ ‘పట్టణ’సంస్థలో ఓ వార్డు ఏకగ్రీవమైంది. అక్కడ ఎన్నికైన అభ్యర్థి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆ వార్డు పరిధి లోని ఓటర్లు నారాజ్ కాకుండా ఏం చేశాడో తెలుసా.. సంక్రాంతి పండుగ పిండివంటలకు సరుకులు పంపాడు. 5 లీటర్ల నూనె, 5 కిలోల గోధుమపిండి, వీటికి అదనంగా మందు బాటిల్ పంపిణీ చేశాడు. ఇటు ఐటీ హబ్‌కు సమీపంలోని పురపాలికలోని ఓ వార్డులో మాజీ సర్పంచ్ భర్త పోటీ చేస్తున్నారు. ఈయ నే టీఆర్ఎస్ నుంచి చైర్మన్ రేసులో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ రేసులో ఉన్న నేత.. తన అన్న కుమారుడిని బరిలో దించా డు. బీజేపీ చైర్మన్ అభ్యర్థి.. తన సోదరుడిని నిలబెట్టారు. చైర్మన్ పదవి దక్కించుకోవ డంలో కీలకం కానున్న సంఖ్యాబలాన్ని దక్కించుకునేందుకు.. ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు.. ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు నేతలు వెనుకాడటం లేదు. జూనియర్ ఆర్టిస్టులుండే చిత్రపురి కాలనీలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఇద్దరు సినీ పరిశ్రమకు సంబంధించిన వారే పోటీ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజధాని శివార్లలో ఓటు కోసం రూ.2 వేల నోటు, 100 పైపర్స్ ఫుల్ బాటిల్ కావాల్సిందే అనే డిమాం డ్ అప్పుడే వినిపిస్తోంది. గత ఆదివారం నుంచే కాలనీ సంక్షేమ సంఘాలకు మంచి దావత్‌లు కూడా మొదల య్యాయి. సమయానికి సంక్రాంతి పండుగ కూడా రావడంతో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, చైర్పర్సన్లు కావాలనుకుంటున్న వారు కాసులు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కనీసం డివిజన్‌కు రూ.కోటి, కౌన్సిలర్ గిరీకి రూ.50 లక్షలు తగ్గకుండా ఖర్చు పెడతామంటూ చేస్తున్న హడావుడితో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంక్రాంతి పండుగ సందడి ఈ నెల 22 వరకు కనిపించనుంది. డబ్బు.. డబ్బు! స్థానికంగా మంచి పరువు ప్రతిష్టలు తీసుకొచ్చే ‘హాట్ సీట్ల’లో గెలుపు కోసం నగర శివార్లలో హార్డ్ క్యాష్ పోగవుతోంది. శివార్లలో ఉన్న బండ్లగూడ, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట, మీర్‌పేట, బడంగ్‌పేట, బోడుప్పల్ నగరపాలక సంస్థలతో పాటు పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల, శంకర్పల్లి, మణికొండ, శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పోచారం, ఘట్కేసర్, తూంకుంట, గుండ్ల పోచంపల్లి, దుండిగల్, కొంపల్లి, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో డబ్బు విపరీతంగా ఖర్చయ్యే అవకాశాలు, అనివార్యత కనిపిస్తున్నాయి. ఐటీ, రియల్ రంగాలకు పట్టుగొమ్మల్లాంటి ఈ పురపాలికల్లో పెత్తనం కోసం డబ్బున్న నేతలు తహతహలాడుతుండటం, ఆర్థికంగా మంచి బలమైన వారు రంగంలో ఉండటంతో కోనసీమ పందెపు కోడి బరి అప్పుడే రాజధాని శివారు మున్సిపాలిటీల్లో కనిపిస్తోంది. టికెట్లు తెచ్చుకునేందుకే లక్షలు ఖర్చు పెట్టేందుకు వెనుకాడని నేతలు, ఎన్నికల్లో గెలిచేందుకు కాసులు కురిపించడానికి, ఖరీదైన గిఫ్టులు, తాయిలాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రూ.50 లక్షలకు తగ్గకుండా రూ.4 కోట్ల వరకు ఒక్కో డివిజన్, వార్డుకు ఖర్చు పెట్టాలని, ఇక మేయర్లు, చైర్పర్సన్ పదవులు ఇస్తామంటే ఎన్ని కోట్లయినా తగ్గేదే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. దావత్‌లు షురూ.. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో జనరల్‌కు రిజర్వయిన ఓ వార్డులో ఇప్పటికే కాసు ల వర్షం కురుస్తోంది. ఎన్నికలకు 10 రోజుల సమయముండగానే దావత్‌లు మొదలయ్యా యి. ఈ వార్డులో ఒక్కో అభ్యర్థికి కనీసం రూ.2.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచ నా. ఇంజాపూర్ మున్సిపాలిటీలోని ఓ వార్డుకు ఇద్దరు బిగ్షాట్స్ పోటీ చేస్తున్నారు. ఒక అభ్యర్థి చిట్‌ఫండ్ వ్యవస్థతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బడాబాబు కాగా, మరో అభ్యర్థి పౌల్ట్రీ వ్యాపా ర దిగ్గజం. గతంలోనూ ఈ రెండు కు టుంబాల మధ్య హోరాహోరీగా స్థానిక పోరు జరగ్గా.. ఈసారీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఓటర్లపై ‘ఇక కనకవర్షమేనని ప్రచారం జోరుగా సాగుతోంది. నగదు ‘హవా...లా’ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న ఎన్నికల కోలాహలం ‘హవాలా’దారులు కూడా చూపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నగదు అవసరం కావడంతో లిక్విడ్ క్యాష్ దొరకడం గగనమైపోయింది. మనీ డిజిటలైజేషన్ కావడం, రూ.2 వేల నోట్లు మార్కెట్లో తగ్గడం, ఖర్చు బ్యాంకు అకౌంట్ ద్వారానే చేయాల్సి ఉండటంతో నగదు ఎక్కడి నుంచి తేవాలి.. ఎలా ఖర్చుపెట్టాలన్నది అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా నగర శివార్లలో అయితే అప్పుడే హవాలా మార్గాలను వెతకడం కూడా ప్రారంభించేశారు. కార్పొరేటర్ నుంచి మేయర్లు, చైర్పర్సన్లు కావాలంటే నగదు కోట్లలో కావాల్సి రావడంతో హవాలా మార్గాలను ఎంచుకునే పనిలో పడిపోయారు కొందరు అభ్యర్థులు. -
ఉత్కంఠకు తెర
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికలు జరిగిన తరువాత రెండు రోజులకు ఈ నెల 24న కరీంనగర్ కార్పొరేషన్‌లోని 60 వార్డులకు పోలింగ్ జరుగనుంది. కార్పొరేషన్ పరిధిలోని 3, 24, 25 వార్డులకు ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును గురువారం డివిజన్ బెంచ్ నిలిపివేస్తూ ఎన్నికల నిర్వహణకు వీలుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు అడ్డంకులు తొలిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి గురువారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 12వ తేదీ సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. స్క్రూటినీ, అభ్యంతరాలు, ఉపసంహరణలు తదితర ప్రక్రియలు ముగిసిన తరువాత 16వ తేదీన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 24వ తేదీన 60 డివిజన్లలో పోలింగ్ జరుగుతుంది. 25న అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహించి 27న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. (చదవండి: కరీంనగర్ ఎన్నికలకు లైన్ క్లియర్) రాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం పడకుండా పోలింగ్ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికలు ఈ నెల 22న జరుగనుండగా, 25న ఓట్ల లెక్కింపు జరిపి, అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. కరీంనగర్ పోలింగ్‌ను ఒకవేళ 25 తరువాత నిర్వహించాల్సి వస్తే ఆ ఫలితాల ప్రభావం కరీంనగర్ ఎన్నికపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో వచ్చే ఫలితాలతో సంబంధం లేకుండా 24వ తేదీనే కరీంనగర్ పోలింగ్‌కు ముహూర్తంగా నిర్ణయించింది. అన్ని మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత రిపబ్లిక్ దినోత్సవం మరుసటి రోజు 27న ఫలితాలు వెలువడనున్నాయి. ఊపిరి పీల్చుకున్న ఆశావహులు మూడు వార్డుల్లో ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగానే ఎన్నికల సంఘం కరీంనగర్ కార్పొరేషన్‌ను మినహాయించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో తెల్లవారితే నామినేషన్లు దాఖలు చేయాలని ఏర్పాట్లు చేసుకున్న నాయకులు ఒక్కసారి నిరుత్సాహానికి గురయ్యారు. బుధవారం నోటిఫికేషన్ వెలువడుతుందని భావించినప్పటికీ, హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరపలేదు. గురువారం మధ్యాహ్నం 2 గంటల తరువాత హైకోర్టు స్టే ఉత్తర్వులను నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో కరీంనగర్ ఎన్నికకు అడ్డంకులు తొలిగి నోటిఫికేషన్ వెలువడింది. దీంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. రాజకీయ భవితవ్యాన్ని నామినేషన్ల ద్వారా పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా నోటిఫికేషన్ రెండు రోజులు ఆలస్యంగా విడుదల కావడంతో అభ్యర్థుల విషయంలో ప్రధాన పార్టీల నాయకులకు మరింత స్పష్టత వచ్చినట్లయింది. టికెట్లు రావని భావించిన టీఆర్ఎస్లోని కొందరు నాయకులు, మాజీ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. ఈ రెండు రోజుల్లో మరిన్ని కప్పదాట్లు సాగే అవకాశం ఉంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 10 నుంచి 2 వరకు నామినేషన్లు 13న నామినేషన్ల పరిశీలన, అర్హత గల అభ్యర్థుల ప్రచురణ 14న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్‌కు అవకాశం 15న అప్పీల్లో అర్హత పొందిన వారి వివరాల ప్రకటన 25న రీపోలింగ్(అవసరమైతే) 27 న కౌంటింగ్, ఫలితాల ప్రకటన -
లంచాలు లేకుండా బిల్డింగ్ ప్లాన్లు
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు తీరం వెంబడి ట్రామ్ (రైలు) తరహా ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసే విషయం ఆలోచించాలి. అందుకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం కన్సల్టెన్సీని నియమించండి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : అవినీతికి ఆస్కారం లేకుండా, లంచాల ప్రసక్తే లేకుండా బిల్డింగ్ ప్లాన్లు ప్రజలకు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో ప్రాధాన్యతాక్రమంలో భూగర్భ డ్రైనేజీ, మురుగు నీటి శుద్ధి ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. మంచినీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వాడాలని, డీశాలినేషన్ (సముద్రం జలాల శుద్ధి) చేసిన నీటినే పరిశ్రమలకు వినియోగించాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. విశాఖ, కాకినాడ, తిరుపతి సహా వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి గురించి ఆరా తీస్తూ.. పలు సూచనలు చేశారు. అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో లంచాలు తీసుకోకుండా బిల్డింగ్ ప్లాన్లు మంజూరు చేసే పరిస్థితి ఉండాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు విస్పష్టంగా చెప్పారు. అవసరమైతే ఇందుకు ఏసీబీ సాయం తీసుకోవాలని సూచించారు. మెరుగైన వ్యవస్థను తయారు చేయడానికి అహ్మదాబాద్ ఐఐఎం సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. అవినీతిలేని వ్యవస్థను తీసుకు వస్తే అధికారులను సన్మానిస్తామని చెప్పారు. విశాఖ నగరానికి నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పోలవరం నుంచి భూగర్భ పైప్‌లైన్ ద్వారా తాగునీటిని నేరుగా విశాఖ నగరానికి సరఫరా చేయడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. విశాఖలో దాదాపు 1.50 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. మున్సిపాలిటీలుగా కమలాపురం, కుప్పం వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, చిత్తూరు జిల్లాలోని కుప్పం పంచాయతీలను మున్సిపాల్టీలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా, ప్రాధాన్యతా క్రమంలో భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని ఆదేశించారు. మురుగు నీటిని తప్పనిసరిగా శుద్ధి చేసిన తర్వాతే బయటకు వదలాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా> 110 మున్సిపాల్టీల్లో 19,769 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ నిర్మించడానికి రూ.23,037 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలను అధికారులు సీఎంకు వివరించారు. లక్షకు పైబడ్డ జనాభా ఉన్న 34 మున్సిపాల్టీల్లో భూగర్భ డ్రైనేజీ, మురుగు నీటి శుద్ధి కోసం రూ.11,181 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. డీశాలినేషన్ చేసిన నీటినే పరిశ్రమల అవసరాలకు వాడుతూ.. మంచి నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వాడేందుకు అవసరమైతే చట్టం చేద్దామని సీఎం అన్నారు. ఇందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. స్పెసిఫికేషన్స్ మార్చకుండా రివర్స్ టెండరింగ్ స్పెసిఫికేషన్స్ మార్చకుండా పట్టణ గృహ నిర్మాణ పథకంలో రివర్స్ టెండర్లు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఫ్లాట్ల నిర్వహణ బాగుండేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీల్లానే ఫ్లాట్ల నిర్వహణ కోసమూ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 48,608 హౌసింగ్ యూనిట్ల(ఇళ్ల)కు రివర్స్ టెండరింగ్ నిర్వహించామని అధికారులు సీఎంకు వివరించారు. రూ.2,399 కోట్ల కాంట్రాక్టు విలువ గల పనులకు నిర్వహించిన రివర్స్ టెండర్ల ద్వారా రూ.303 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. మిగిలిన యూనిట్లకూ త్వరలోనే రివర్స్ టెండరింగ్ పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి, మంగళగిరి, పులివెందులలో అభివృద్ధి చూపించాలి తాడేపల్లి, మంగళగిరి, పులివెందుల మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మున్సిపాలిటీల్లో కచ్చితంగా ఫలితాలు చూపించాలని స్పష్టం చేశారు. ఈ మున్సిపాల్టీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలతో రావాలన్నారు. ఆ మేరకు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) తయారు చేస్తున్నామని అధికారులు వివరించారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలలో 10,794 మంది ఇళ్ల పట్టాల లబ్ధిదారులను గుర్తించామని అధికారులు తెలుపగా, మోడల్ కాలనీ కట్టాలని సీఎం ఆదేశించారు. విజయవాడలో ముంపునకు గురికాకుండా కృష్ణా నది పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ పనులు వీలైనంత వేగంగా చేపట్టాలని స్పష్టం చేశారు. -
ఒకే ఇంట్లో 32 మంది ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్‌ప్లాట్లకు ఇంటి నెంబర్లు తీసుకుని వందకు పైగా ఓటర్ల నమోదు.. ఒకే ఇంట్లో 38 మంది ఓటర్లు, మరో ఇంట్లో 32 ఓట్లు.. ఇలా ఒక్క మున్సిపల్ డివిజన్‌లోనే 380 నుంచి 400 వరకు నకిలీ ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో ఓటర్ల జాబితాలు, ఓటర్ల నమోదులో చోటుచేసుకున్న కొన్ని అవకతవకలు. ఈ అంశం ఎంతవరకు వెళ్లిందంటే ఒక ఇంటి యజమాని తన చిరునామాతో 32 బోగస్ ఓట్లు ఉన్నాయంటూ సంబంధిత తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసేంత. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాలను పరిశీలించి, ఆయా ఇంటినెంబర్ల వారీగా ఎవరెవరున్నారన్న విషయాన్ని సరిచూసుకున్న సందర్భంగా విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఈ కార్పొరేషన్‌లోని 18వ డివిజన్ సాయినగర్‌లోని 8–22 ఇంటినెంబర్‌లో 38 ఓట్లు, అదేకాలనీలోని 8–21 ఇంటినెంబర్‌లో 32 ఓట్లు, 8–91 ఇంటినెంబర్‌తో 30 ఓట్లు ఉన్నట్టుగా తేలింది. అంతేకాకుండా ఇదే డివిజన్లోని బాలాజీనగర్‌లో ఓపెన్‌ప్లాట్‌కు 7–58 ఇంటినంబర్‌ను తీసుకుని అందులో ఇళ్లు లేకపోయినా వందకు పైగా ఓట్లు నమోదైనట్టు, అదేవిధంగా అయోధ్యనగర్‌లోని మరో ఓపెన్‌ప్లాట్‌కు కూడా ఇంటి నంబర్ తీసుకుని వంద దాకా ఓట్లు నమోదు చేశారని శ్రీసాయినగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎస్. అల్వాల్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ అంశంపై ఇదివరకే ఎమ్మార్వోకు, ఆర్డీవో కు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి అల్వాల్‌రెడ్డి, హరిగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్‌రెడ్డి, దీప్‌కాంత్ వినతిపత్రం సమర్పించారు. తమ విజ్ఞప్తిపై కమిషనర్ నాగిరెడ్డి సానుకూలంగా స్పందించారని అల్వాల్‌రెడ్డి తెలిపారు. ►‘ఓటర్ల జాబితాల్లో నకిలీ ఓటర్లున్నారంటూ అందిన వినతిపత్రంలోని విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. జాబితాలను పరిశీలించి అక్రమ పద్ధతుల్లో ఓటర్లుగా చేరి ఉంటే వారి నివేదికల అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటాం.’ – వి.నాగిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ -
ప్లాస్టిక్ తెచ్చి.. భోజనం చేసి వెళ్లండి
భువనేశ్వర్: ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం, వాటి కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అర కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది. ‘మీల్ ఫర్ ప్లాస్టిక్’ పేరిట చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార్ పథకంలో చేర్చారు. దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణతోపాటు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు బీఎంసీ కమిషనర్ ప్రేమ్ చంద్ర చౌదరి తెలిపారు. -
కొత్త వార్డులొచ్చేశాయి !
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించిన ఓ కీలక ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరగనున్న 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు/డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన తుది ప్రకటనను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం పురపాలికల వారీగా వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. వార్డుల విభజన కోసం ఈ నెల 3న 14 రోజుల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం వార్డులు/డివిజన్ల పునర్విభజన ముసాయిదాను ప్రకటించి, వారం రోజుల పాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించింది. వీటిని పరిష్కరించడం ద్వారా మంగళవారం వార్డులు/డివిజన్ల పునర్విభజన తుది ప్రకటనను జారీ చేసింది. కొత్త వార్డులు/డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను రెండుమూడు రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశముంది. కొత్త వార్డులు/డివిజన్ల భౌగోళిక స్వరూపం, సరిహద్దులను దృష్టిలో పెట్టుకుని వీటికి సం బంధించిన ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత వార్డులు/డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా గణనను చేపట్టనున్నారు. దీనికి దాదాపు వారం రోజులు పట్టనుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. జనాభా దామాషా ప్రకారం... మున్సిపాలిటీల్లోని ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం వార్డు, చైర్పర్సన్ స్థానాలను కేటాయిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. కార్పొరేషన్లలో సైతం ఇలానే చేస్తారు. మున్సి పల్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుండగా, ఎస్సీ, ఎస్టీల కోటా పోగా మిగిలి స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. రిజర్వేషన్లను ప్రకటించిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది. అంతా సజావుగా జరిగితే జనవరి చివరిలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఏవైనా అడ్డంకులొస్తే ఫిబ్రవరి లో జరుగుతాయి. కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సాధారణ మున్సిపల్ ఎన్నికలు కావడంతో కొత్త రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్ఓఆర్)ను అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసిన రోస్టర్‌ను ఈ ఎన్నికల్లో కొనసాగించరు. రోస్టర్‌ను ఒకటో పాయింట్ నుంచి ప్రారంభించనున్నారు. -
ఖర్చులు తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులు
వాతావరణ కాలుష్యం, సంప్రదాయ ఇంధన వనరుల వినియోగం, నిర్వహణ వ్యయం తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ (ఈ–కార్లు) కార్లు ఎంతో ఉపయోగపడుతాయి. మార్కెట్లోకి ప్రవేశించిన ఈ–కార్ల వినియోగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మొదటగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రభుత్వ శాఖల నుంచే ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నాయి. సాంకేతిక సమస్యలు, మరమ్మతులు తక్కువగా ఉంటోంది. జిల్లాలో తొలుత ఏడాది కిందటే ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఈ–కార్లను వినియోగంలోకి తీసుకోవడంతో తాజాగా నెల్లూరు నగర పాలక సంస్థ కూడా వీటిని వినియోగిస్తోంది. కార్ల వినియోగంలో వ్యయం లెక్కిస్తే కిలో మీటరుకు కేవలం ఒక్క రూపాయి లోపలే ఖర్చు అవుతున్నట్లు అంచనా. ఇప్పటికే విద్యుత్ శాఖ జిల్లా విద్యుత్ భవన్లో, జిల్లాలోని పలు సబ్ స్టేషన్లలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకుంది. నెల్లూరు నగర పాలక సంస్థ తమ కార్యాలయంలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. సాక్షి, నెల్లూరు సిటీ: కాలుష్య నివారణ.. ఇంధనం పొదుపు.. ప్రభుత్వ నిధుల అనవసర ఖర్చులు.. లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయ అధికారులకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో కార్పొరేషన్‌లోని పలు విభాగాల అధికారులకు ప్రైవేట్ కార్లను అద్దెకు వినియోగించుకునే వారు. ఇందుకు నెలకు రూ.5.40 లక్షల అద్దె చెల్లించే పరిస్థితి. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్మూర్తి అనవసర ఖర్చులు తగ్గించే దిశగా చర్యలు చేపట్టారు. అద్దె కార్ల స్థానంలో ఆయా విభాగాల అధికారులకు 15 ఎలక్ట్రిక్ కార్లను రుణసదుపాయంతో కొనుగోలు చేశారు. నెలకు ఒక కారుకు రూ.20 ఈఎంఐ చెల్లింపులతో ఆరేళ్లలో కారుకార్పొరేషన్ సొంతం అవుతుంది. కార్పొరేషన్ కార్యాలయంలో ఎలక్ట్రిక్ కార్లు రూ.105తో 80 కి.మీ. ప్రయాణం ఎలక్ట్రిక్ వాహనాలకు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎనిమిది పాయింట్లలో 7 గంటల్లో 100 శాతం చార్జింగ్ వచ్చేందుకు, రెండు పాయింట్లలో 2 గంటల్లో చార్జింగ్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. అధికారులు ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో తిరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఒకసారి చార్జింగ్ చేశాక దాదాపు ఏసీ ఆన్ చేసినా 80 కి.మీ. వరకు ప్రయాణం చేసేందుకు వీలు ఉంటుంది. ప్రతి రోజూ ఒక కారుకు రూ.105 ఖర్చుతో చార్జింగ్ చేయగా 80 కి.మీ. వరకు వస్తుంది. దీంతో కార్పొరేషన్‌కు ఖర్చులు తగ్గాయి. రూ.5.40 లక్షల ఖర్చుకు ఫుల్స్టాప్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని అధికారులకు కార్లు బాడుగకు ప్రతి నెలా రూ.5.40 లక్షలు చెల్లిస్తున్నారు. కమిషనర్, ఇంజినీరింగ్ ఎస్ఈ, అడిషనల్ కమిషనర్ కార్లకు రూ.45 వేలు చొప్పున రూ.1.35 లక్షలు, ఇంజినీరింగ్ విభాగంలోని ముగ్గురు ఈఈలు, డిప్యూటీ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారి, ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లు, సెక్రటరీ, ఎగ్జామినర్, ఎంహెచ్ఓ అధికారులకు రూ.35 వేలు చొప్పున రూ.3.45 లక్షలు చెల్లిస్తున్నారు. మేయర్ కారుకు రూ.60 వేలు చెల్లించారు. ఇలా ప్రతి నెలా రూ.5.40 లక్షలు కార్లు బాడుగలకు చెల్లించారు. అయితే వీరిలో కొందరు అధికారులు సొంత కార్లను వినియోగిస్తూ బాడుగ డబ్బులను వారే తీసుకునేవారు. ఈ పరిస్థితికి చెక్ పడింది. ఆరేళ్లలో కార్లు కార్పొరేషన్ సొంతం నగర పాలక సంస్థ కార్యాలయంలోని పలు విభాగాల అధికారులకు కార్లు బాడుగ ఖర్చు కోసం ప్రతి నెలా రూ.5.40 లక్షలు చెల్లిస్తున్నారు. దీంతో సొంత కార్లు లేకపోవడంతో కార్పొరేషన్‌పై భారం పడింది. అయితే కమిషనర్ కొత్త నిర్ణయంతో కార్పొరేషన్ అధికారులకు సమకూర్చిన మహేంద్ర ఈ వెరిటో కంపెనీకి చెందిన 15 ఎలక్ట్రిక్ కార్లకు ప్రతి నెలా ఒక్కొక్క కారుకు రూ.20 వేల వంతున నెలకు ప్రస్తుతం రూ.3 లక్షలు చెల్లిస్తే.. ఆరేళ్లకు కార్లు కార్పొరేషన్ సొంతం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రస్తుతానికి నెలకు రూ.2.40 లక్షల ఖర్చు భారం తగ్గింది. ఆ తర్వాత నుంచి కేవలం చార్జింగ్ ఖర్చు మాత్రమే అవుతుంది. ఈ-కార్లు ఎంతో మేలు నెల్లూరు (వీఆర్సీ సెంటర్): ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్లోని విద్యుత్ శాఖ గతేడాది 12 ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసింది. అయితే వీటిని నెల్లూరు కేంద్రంగా ఉండే 12 మంది డీఈ, ఏడీఈ స్థాయి అధికారులకు కేటాయించారు. ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి ముందు డీజిల్, పెట్రోల్‌తో నడిచే కార్లను ప్రైవేట్ యాజమాన్యాల నుంచి అద్దెకు తీసుకుంటుంది. వీటికి ఒక్కొక్క కారు నెలకు 2 వేల కిలో మీటర్ల పరిమితికి రూ.30 వేల అద్దె, ఆపై తిరిగితే కి.మీ.కు రూ.7 వంతున అదనంగా అద్దె చెల్లించాల్సి వచ్చేది. ఈ లెక్కన 12 కార్లకు నెలకు రూ.3.60 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అద్దె చెలిస్తుండేది. వీటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసిన సంస్థకు నిర్వహణ ఖర్చు లేకపోవడంతో డ్రైవర్లకు మాత్రం నెలకు రూ.15 వేల వేతనంగా చెల్లిస్తోంది. నిర్వహణ (మెయింటెనెన్స్) ఖర్చులకు తావుండదు. దీంతో నెలకు 12 ఎలక్ట్రికల్ కార్లపై రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదా అవుతోంది. విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన ఏసీ, డీసీ చార్జింగ్ పాయింట్లు రూ.100లతో 100 కిలోమీటర్ల ప్రయాణం ఎలక్ట్రిక్ కార్లు బ్యాటరీ బ్యాకప్ 10 యూనిట్ల సామర్థ్యం కలిగి ఉంటున్నాయి. వీటికి చార్జింగ్ కోసం కేటగిరీ–2 విద్యుత్ వినియోగిస్తున్నారు. ఈ కేటగిరీలో యూనిట్ ధర రూ.9.06 ఉంది. ఒక్కసారి చార్జింగ్ కోసం 10 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. ఈ లెక్కన 10 యూనిట్ల విద్యుత్‌కు సగటున రూ.100 అవుతుంది. ఒక్క యూనిట్‌తో 10 కి.మీ. వంతున 100 కి.మీ. ప్రయాణం చేయొచ్చు. కారులో ఏసీ వినియోగిస్తే 80 కి.మీ. నడుస్తుంది. కిలోమీటర్‌కు ఖర్చు ఒక్క రూపాయి అవుతుంది. డీసీ, ఏసీ చార్జింగ్ స్టేషన్లు, పాయింట్లు ఈ ఎలక్ట్రిక్ కార్లు విద్యుత్ చార్జింగ్ ఆధారంగానే నడుస్తాయి. కార్లకు విద్యుత్ చార్జింగ్ చేసే ప్రక్రియలు రెండు రకాలుగా ఉన్నాయి. డీసీ (డైరెక్ట్ చార్జింగ్), ఏసీ (అ్రల్టానేట్ చార్జింగ్) రూపాల్లో చార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది. డీసీ విద్యుత్ ద్వారా అయితే పూర్తిగా చార్జింగ్ చేయాలంటే ఒకటిన్నర గంట, అదే ఏసీ విద్యుత్ ద్వారా అయితే 6 గంటల సమయం పడుతుంది. విద్యుత్ సంస్థ అధికారులు వాడుకునే ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ కోసం నగరంలోని విద్యుత్ భవన్లో ఒక చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు డీసీ, నాలుగు ఏసీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. వీటితో పాటు నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, గూడూరు, కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లోని ఆయా విద్యుత్ సబ్స్టేషన్లలో 30 ఏసీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. దీంతో ఆయా ప్రాంతాల విద్యుత్ అధికారులు ఆయా సబ్స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఏసీ చార్జింగ్ పాయింట్ల ద్వారా ఎలక్ట్రిక్ కార్లకు చార్జింగ్ చేసుకునే వీలుంది. డ్రైవింగ్ సులువుగా ఉంది డీజిల్, పెట్రోల్ కార్ల కన్నా ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవింగ్ చేయడం సులువుగా ఉంది. కారు ఇంజిన్ స్టార్ట్ చేసినా ఎటువంటి శబ్దం లేకుండా ఉంది. గతంలో కంటే డీజిల్‌కు అయ్యే ఖర్చు కూడా తగ్గింది. కేవలం రూ.105లతో 80.కి.మీ. వరకు మైలేజీ వస్తుంది. – ప్రదీప్‌కుమార్, టౌన్‌ప్లానింగ్ అధికారి డ్రైవర్ విద్యుత్ కారుతో ఖర్చులు కూడా తగ్గాయి విద్యుత్ కారు వినియోగంతో పెట్రోల్, డీజిల్ ఖర్చులు కూడా తగ్గాయి. ఉదయం ఒకసారి చార్జింగ్ పెడితే దాదాపు 80 కి.మీ. మేర ప్రయాణం చేసేందుకు వీలు ఉంటుంది. రెండు గంటల్లోనే చార్జింగ్ అయ్యేలా చార్జింగ్ యూనిట్‌ను కార్పొరేషన్లో ఏర్పాటు చేశారు. – వెంకటేశ్వర్లు, ఇంజినీరింగ్ అధికారి డ్రైవర్ కాలుష్య రహిత కార్లు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడే వీలుంటుంది. దీంతో పాటు తరిగిపోతుçన్న సంప్రదాయ వనరులు అయిన డీజిల్, పెట్రోల్‌ను పొదుపు చేసి భావితరాలకు అందించేందుకు ఎంతో దోహదపడే వీలుంటుంది. అతి తక్కువ ఖర్చుతో, ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండానే ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించు కోవచ్చు. – కె.విజయ్‌కుమార్‌రెడ్డి ఎస్ఈ, ఏపీ ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ -
ఒడిదుడుకులు తట్టుకుంటేనే విజయం సాధిస్తాం
షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) మేయర్‌గా ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన తెలుగు మహిళ యెన్నం కాంచన ఎన్నికై రికార్డు సృష్టించారు. షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం జరిగిన రెండవ టర్మ్ మేయర్ ఎన్నికల్లో యెన్నం కాంచన ఘన విజయం సాధించారు. అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్‌గా గుర్తింపు పొందిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో రెండేళ్ల క్రితం కృష్ణవేణి రెడ్డి కార్పొరేటర్‌గా విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో తెలుగు మహిళ కాంచన యెన్నం ఏకంగా మేయర్ పదవిని కైవసం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు. పెళ్లి తర్వాతే తన జీవితంలో మార్పు పచ్చిందని కాంచన యెన్నం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఘనపూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ఈగె అయిలప్ప, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన కాంచన షోలాపూర్‌లోనే పుట్టి పెరిగారు. స్థానిక డీఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. అనంతరం కాంచనకు ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన యెన్నం రమేష్‌తో 1992లో వివాహం జరిగింది. సాధారణ గృహిణిగానే జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఆమె భర్త రమేష్ రాజకీయాల్లో తిరుగుతుండడం చూసి ఆమెకు కూడా కూడా గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజసేవ చేయాలన్న సంకల్పం కలిగింది. దాంతో బీడీ కార్మికులు, కుట్టు పనులు చేసే మహిళలు తదితరుల కోసం పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయగలగడంతో ఆమెలో ఆత్మవిశ్వాసం ఏర్పడింది. భర్త ప్రేరణ, ప్రోత్సాహం సమాజసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సమయంలోనే కాంచనకు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ‘‘1997లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేముండే మార్కండేయనగర్ వార్డు మహిళ కోటాలోకి రావడంతో ఈ వార్డు నుంచి టికెట్ కోసం నా భర్త తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఏ పార్టీకోసం పాటు పడుతున్నారో, ఆ పార్టీనే తనను పక్కన పెట్టేసరికి ఇద్దరం పార్టీ మారాం. ఇలా సుమారు గత 22 సంవత్సరాలుగా మేము బీజేపీలో కొనసాగుతున్నాం. 2002లో బీజేపీ నాకు మార్కండేయనగర్ వార్డు (షోలాపూర్ కార్పొరేషన్) నుంచి టికెట్ ఇచ్చింది. అలా నేను నేను మొట్టమొదటిసారిగా కార్పొరేటర్‌గా విజయం సాధించి కార్పొరేషన్లో అడుగుపెట్టాను. అప్పటినుంచి ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించాను’’ అని కాంచన తెలిపారు. ఊహించని విజయం అయితే మేయర్ పీఠం దక్కుతుందని మాత్రం తను ఊహించలేదని కాంచన అన్నారు. ‘‘బీజేపీ నన్ను అభ్యర్థిగా ప్రకటించింది. నాకు పోటీగా శివసేనకు చెందిన సారిక పిసే, కాంగ్రెస్‌కు చెందిన ఫిర్దోస్ పటేల్, ఎంఐఎంకు చెందిన శహజిదా బానో శేఖ్ బరిలోకి దిగారు. అయితే ఎన్నికకు ముందు సారిక పిసే, ఫిర్దోస్ పటేల్‌లు తప్పుకోవడంతో బానో శేఖ్తో నాకు పోటీ ఏర్పడింది. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఐఎంలు జత కట్టాయి. కాని ఎన్నికకు ఒక రోజు ముందే వీడిపోయారు. దాంతో ఈ ఎన్నికలో నాకు 51 ఓట్లు పోలవ్వగా బానో శేఖ్కు కేవలం ఎనిమిది ఓట్లు పోలయ్యాయి. ఇలా ఊహించని విధంగా భారీ మెజార్టీతో విజయం సాధించగలిగాను’’ అని ఆమె చెప్పారు. ఆదర్శ కార్పొరేటర్ కుటుంబ సభ్యులతో (భర్త, కుమారుడు, అల్లుడు, కుమార్తె, మనుమడు) యెన్నం కాంచన కాంచన యెన్నం అనేక పదవులను అలంకరించారు. సుమారు 17 ఏళ్లనుంచి కార్పొరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పార్టీ పరంగా ప్రస్తుతం షోలాపూర్ బీజేపీ వర్కింగ్ కమిటి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. దీంతోపాటు ఇందిరా మహిళ సహకార బ్యాంకుకు వైస్ చైర్మన్‌గా, షోలాపూర్ మన్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసి) మహిళ సంక్షేమ కమిటీ సభ్యురాలిగా, అదేవిధంగా ఎస్‌ఎంసిలోని పలు పదవులను అలంకరించారు. 2016–17లో స్టాండింగ్ కమిటి చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆదర్శ కార్పొరేటర్ అవార్డు అందుకున్నారు. రాజకీయాల్లోనే కాదు ఏ పనిలోనైనా జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజమని కాని వాటిని తట్టుకుంటేనే విజయం లభిస్తుందని కాంచన యెన్నం అంటారు. – గుండారపు శ్రీనివాస్, మావునూరి శ్రీనివాస్ సాక్షి, ముంబై