‘ముందస్తు’ ఆదాయం | Telangana Government Full Income From Warangal Municipality | Sakshi
Sakshi News home page

‘ముందస్తు’ ఆదాయం

Published Mon, May 13 2019 1:14 PM | Last Updated on Mon, May 13 2019 1:14 PM

Telangana Government Full Income From Warangal Municipality - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: మునిసిపాలిటీల్లో ఇంటి యజమానులు ముందస్తుగా పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని పురపాలక శాఖ ప్రకటించింది. ఈ గడువు గత నెల 30వ తేదీతో ముగి సింది. ఈ మేరకు శాఖ విడుదల చేసిన ప్రకటనకు గృహయ జమానులు పలువురు ముందుకొచ్చా రు. ఉమ్మడి జిల్లాలోని యజమానులు రూ.15 కోట్ల మేర పన్నులు చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరినట్లు కాగా.. యజమానులకు సైతం రాయితీ కింద రూ.75లక్షల మేరకు కలిసొచ్చింది.
 
విస్తృత ప్రచారం
రాష్ట్రంలో అన్ని పురపాలికల్లో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా పన్నులు చెల్లిస్తే పురపాలక శాఖ ఐదు శాతం రాయితీని ప్రకటించింది. పురపాలికలకు ఆదాయం పెరుగుతుందని ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. ఏప్రిల్‌ నెలాఖరు వరకు అవకాశం కల్పించారు. దీనికి ప్రజలు పెద్దసంఖ్యలో ముందుకొచ్చేలా అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. మునిసిపాలిటీల 
పరిధిలో ప్లెక్సీలు కట్టించడంతో పాటు జీపులు, ఆటోల ద్వారా ప్ర త్యేకంగా ప్రచారం నిర్వహిం చారు. బిల్‌ కలెక్టర్లు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి తిరుగుతూ పన్ను ల వసూలుకు ప్రయత్నించారు. ముఖ్యంగా పెం డింగ్‌ బకాయిలు ఉన్న వారి నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేసేలా ఫోన్ల ద్వారా కూడా సమాచారం ఇచ్చారు.

అయినా అంతంతే...
రాయితీ ద్వారా అయినా పన్నులు త్వరగా చెల్లిస్తారనే ఉద్దేశంతో పథకం ప్రవేశపెట్టినా అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మాత్రం 1,12,194 గృహాలు ఉంటే 25,894 గృహాల వారు మాత్రమే స్పందించారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో 36శాతం గృహాల వారు ప్రభుత్వ రాయితీకి స్పందించి పన్నులు చెల్లించారు. మిగతా మున్సి పాలిటీల్లో అంతంత మాత్రంగానే చెల్లించారు. అత్యల్పంగా మరిపెడ మున్సిపాలిటీలో కే వలం తొమ్మిది మంది మాత్రమే స్పందించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 1,68,922 గృహాలకు గాను 32,164 గృహాల వారు రూ.15,00,95,000 చెల్లించారు. ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రాయితీ ద్వారా యజమానులకు రూ.75,04,750 మేర కలిసొచ్చింది.

నూతన మునిసిపాలిటీల్లో స్పందన కరువు
గ్రామపంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన పట్టణాల్లో ఇంటి పన్నుదారుల నుంచి స్పందన కరువైంది. వర్దన్నపేట, డోర్నకల్, మర్రిపెడ, తొర్రూరు గ్రామపంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ అయ్యాయి. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో డీసీ తండాను విలీనం చేశారు. దీనిని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా ఇంటి పన్నులు చెల్లించేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితే మిగతా చోట్ల కనిపించింది.

రాయితీపై ప్రచారం నిర్వహించాం
ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఉంటుందనే అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించాం. పన్ను చెల్లింపుదారుల్లో ప్రతీ ఇంటి తలుపుతట్టి సమాచారాన్ని అందించాం. మరో మూడు నెలలు గడిస్తే అదనంగా పన్నుపై 2 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని వివరించాం. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా ముం దస్తుగా ప్రజలు స్పందించి ఆస్తి పన్ను చెల్లించారు.  – రవి కిరణ్, గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement