
ఇద్దరు విద్యార్థుల బలవన్మరణం
దామెర/వర్ధన్నపేట: హాస్టల్‌కు వెళ్లడం ఇష్టంలేక ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్‌తండాకు చెందిన గుగులోతు నందిని (13) టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్ పర్వతగిరి గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికొచి్చంది.
సెలవులు ముగిసినా స్కూల్‌కు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన నందిని గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఆందోళన చెంది గ్రామమంతా వెతుకుతున్న సమయంలో వ్యవసాయ బావి వద్ద కనిపించిందని తెలియడంతో బావిలో ఎంత వెదికినా లభించలేదు. తిరిగి శుక్రవారం ఉదయం బావిలో మరోసారి వెతకగా నందిని మృతదే హం దొరికింది. కేసు న మోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై చందర్ తెలిపారు.
కాగా, హనుమకొండ జిల్లా దామెర మండలంలోని పసరగొండకు చెందిన గజ్జి పాల్ (16) ములుగు సమీపంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల హాస్టల్ నుంచి ఇంటికి వచి్చన బాలుడు తిరిగి వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై గురువారం సమీపంలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం బాలుడి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై కొంక అశోక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment