సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సభ్యులపై ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. మాట వినని వాళ్లను బెదిరించడమే కాదు.. ఎత్తుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్యాయంగా పదవులు లాక్కుని.. తమదే గెలుపంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. ఈ క్రమంలో..
హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలోనే బరితెగింపు వ్యవహారం నడిచింది. 23 మంది సభ్యుల మద్దతుతో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి సొంతం చేసుకుంది టీడీపీ. అయితే.. బలం లేకున్నా అన్యాయంగా చైర్మన్ పదవి లాక్కోవడం ఇక్కడ దారుణం.
ఇక్కడ మొత్తం 38 వార్డులు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో 30 వార్డులను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఈసారి ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టాలని టీడీపీ నేతలను ఎమ్మెల్యే బాలయ్య దగ్గురుండి ప్రోత్సహించారు. మాట వినని కౌన్సిలర్‌లను బెదిరించారు కూడా. అలా.. 16 మందిని తనవైపునకు తిప్పుకుంది. ఈ అరాచకాలను చూసి ‘‘ఏంది బాలయ్య ఇది?’’ అంటూ హిందూపురం వాసులు విస్తుపోతున్నారు.
డాకు బాలయ్యా.. ఇదీ ఓ గెలుపేనా?
హిందూపురంలో టీడీపీ విజయం అనైతికమని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అంటున్నారు. ‘‘హిందూపురంలో 38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైఎస్సార్ సీపీ కి బలం ఉంది. ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చూసి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను లాక్కున్నారు. ఓ డాకూలా ఎమ్మెల్యే బాలకృష్ణ దోపిడీ చేశాడు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ గెలుపు.. అసలు గెలుపే కాదు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాగే మోసాలతో గెలిచారు. చంద్రబాబు, బాలకృష్ణలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు’’ అని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment