Defections
-
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇవాళ (సోమవారం) సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో తెలంగాణ స్పీకర్ తరుఫున ముకుల్ రోహ్గతి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. తమకు వాదనలు వినిపించేందుకు రెండు మూడు రోజులు సమయం కావాలని కోరారు. రోహ్గతి విజ్ఞప్తిపై స్పందించిన అత్యున్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్‌కు గురి చేయొద్దు. ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయి. తగిన సమయం అంటే ఏంటి? అని ప్రశ్నించింది. పార్టీ మారి పది నెలలు అవుతుంది. ఇది రీజనబుల్ టైం కాదా? అని వ్యాఖ్యానించింది. అందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన టైం ప్రకారం.. రీజనబుల్ టైం అంటే మూడు నెలలే అంటే బీఆర్ఎస్ తరుఫు న్యాయవాది తన వాదనల్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్,అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. -
ఫిరాయింపుల వ్యవహారం.. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ!
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 10న విచారణ చేపట్టనుంది. ఈ తరుణంలో కేటీఆర్ రేపటి నుంచి నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ వినోద్, దాసోజు శ్రవణ్‌లు వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై న్యాయవాదులతో చర్చించనున్నారు.బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.మరో పిటిషన్లో.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు. అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్‌పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ అడిగి చెప్తానని లాయర్ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(ఫిబ్రవరి 10న) కౌశిక్ రెడ్డి ఎస్ఎల్పీ, కేటీఆర్ రిట్ పిటిషన్లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
‘ఛీ.. ఎన్టీఆర్ మాటకు తూట్లు పొడిచి మరీ!
1982లో తెలుగుదేశం పార్టీ స్థాపన సందర్భంగా ఎన్టీ రామారావు ఒక స్పష్టమైన షరతు పెట్టారు. టీడీపీలో చేరాలనుకుంటే ఇతర పార్టీల వారెవరైనా అక్కడి తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ షరతుతో కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఆయారాం, గయారాం పరిస్థితి టీడీపీలో ఉండదని ప్రజలూ హర్షించారు. మేధావులు కూడా ఎన్టీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. టీడీపీలోకి చేరేందుకు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమైనా.. ముగ్గురు తమ పదవులు వదులుకోవడానికి సిద్ధపడలేదు. నాదెండ్ల భాస్కరరావు మాత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేరారు. తరువాతి కాలంలోనూ ఎన్టీఆర్ ఇదే పంథాను కొనసాగించారు. 1991లో పీవీ నరసింహరావు కేంద్రంలో తన పదవిని కాపాడుకునేందుకు జేఎంఎంతోపాటు టీడీపీ ఎంపీలనూ చీల్చారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఒకప్పటి చరిత్ర.. ఇప్పుడు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ, అల్లుడు చంద్రబాబు నాయుడులు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు చూస్తే ‘‘ఛీ.. ఇది ఒకప్పటి టీడీపీనేనా?’’ అనిపిస్తుంది. చంద్రబాబు పెద్దగా విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలు పట్టించుకోరు. పూర్తి అవకాశవాది. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి అప్రతిష్టపాలయ్యారు. విశేషం ఏమిటంటే ఈయన ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని విమర్శిస్తారు. అధికారంలోకి రాగానే యథా ప్రకారం పార్టీ ఫిరాయింపులు, బేరసారాలు చేయిస్తుంటారు. ఆయన ఎన్టీఆర్ అల్లుడు, కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీని కబ్జా చేసిన నేత కనుక అంతేలే అని అనుకుంటారు. కానీ.. స్వయాన ఎన్టీఆర్ వారసుడైన నందమూరి బాలకృష్ణ సైతం టీడీపీ మూల సిద్దాంతాలను గాలికి వదలివేసి తన తండ్రి ఆశయాలను మంటగలిపారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హిందుపూర్ మున్సిపాల్టీని టీడీపీ పరం చేయడానికి అనుసరించిన దిక్కుమాలిన రాజకీయాలు ఎన్టీఆర్ ఆత్మకు క్షోభను మిగుల్చుతాయని చెప్పాలి. బాలకృష్ణకు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదును ప్రకటించింది. ఆడపిల్లలను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడి పలువురి విమర్శలకు గురైన బాలకృష్ణకు ఈ బిరుదు ఎలా ఇచ్చారో తెలియదు. అంతేకాక గతంలో ఆయన తన ఇంటిలో సినిమా రంగం వారు ఇద్దరిపై కాల్పులు జరిపిన ఘట్టం ఉండనే ఉంది. సినీ పరిశ్రమలో ఏభై ఏళ్ల చరిత్ర అని చెబుతారు కాని, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది కావడం ఒక ప్రధాన అర్హతగా తీసుకుని పద్మభూషణ్ బిరుదును కేంద్రం ప్రకటించిందన్న భావన ఏర్పడింది. ఎలాగోలా బిరుదు వచ్చింది.. దానికి తగ్గట్లు పద్దతిగా ఉంటారులే అనుకుంటే బాలకృష్ణ మళ్లీ వివాదాస్పదంగా వ్యవహరించి పరువు పోగొట్టుకున్నారు. గత ఎన్నికల్లో హిందుపూర్ మున్సిపాలిటీలోని 38 వార్డులలో 30 వార్డులు వైసీపీ గెలుచుకుంది. అనూహ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారం సాధించడంతో ఆ పార్టీల దృష్టి స్థానిక సంస్థలపై పడింది. వీలైన చోట్ల ఇప్పటికే కొందరు మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను చంద్రబాబు, లోకేష్‌లు ఎమ్మెల్యేల ద్వారా ప్రలోభపెట్టి ఆకర్షించారు. ఈ తరుణంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని టీడీపీ తలపెట్టింది. దీనికి మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగపడింది. చంద్రబాబు తీసుకు వచ్చిన రాజకీయ రాక్షస పాలన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉన్న చోట కూడా తాము గెలవడం కోసం రెడ్ బుక్ ను ప్రయోగించడం ఆరంభించారు. కార్పొరేటర్లను, కౌన్సిలర్లను భయపెట్టడం, కిడ్నాప్ లు చేయడం, పోలీసులే ఇందుకు నాయకత్వం వహించడం, దాడులు చేసి కౌన్సిలర్ల కుటుంబాలను భయభ్రాంతులకు లోను చేయడం వంటి నీచమైన చర్యల ద్వారా టీడీపీ, జనసేనలు స్థానిక ఎన్నికలలో గెలిచే యత్నం చేశాయి. హిందుపూర్లో స్వయాన బాలకృష్ణ ప్రలోభాలు, బెదిరింపులకు తెరదీసి అక్కడ మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తిరుపతిలో మరీ ఘోరం. టీడీపీకి ఒక్క కార్పొరేటరే ఉన్నప్పటికీ, ఉప మేయర్ పదవిని కైవసం చేసుకుంది. వైసీపీ పక్షాన పోటీ చేయడానికి సిద్దపడ్డ ఒక కార్పొరేటర్ ఇల్లును కూల్చడానికి టీడీపీ నేతల ఆదేశాల మేరకు అధికారులు తరలివెళ్లారు. అక్కడ మేయర్ అభ్యంతరం చెప్పినా వారు ఆమె మాట వినకపోవడం స్థానిక సంస్థల ఛైర్ పర్సన్ లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న విలువ ఏమిటో అర్థమవుతుంది. బస్‌లో వెళుతున్న వైసీపీ కార్పొరేటర్లను కిడ్పాప్ చేయడం, బస్ పై దాడి చేసి అద్దాలు పగులకొట్టడం, తిరుపతి ప్రజలను భయభ్రాంతులను చేయడం వంటి ఘట్టాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. మరుసటి రోజు అధికారులు, పోలీసుల అండతో టీడీపీ అభ్యర్ది ఉప మేయర్ ఎన్నికలో విజయం సాధించిన తీరు స్థానిక ఎన్నికల అధ్వాన్న నిర్వహణకు అద్దం పడుతుంది. టీడీపీ భయపెట్టి ఓట్లు వేయించుకున్న కొందరు కార్పొరేటర్లు, ఆ వెంటనే తిరిగి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డిని కలిసి తమను టీడీపీ ఎలా వేధించింది వివరిస్తూ రోదించిన సన్నివేశం ఒక్కటి చాలు.. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సర్కార్ సిగ్గుపడడానికి. నూజివీడులో మంత్రి పార్థసారథి వైసీపీ కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి బెదిరించి మరీ టీడీపీని గెలిపించుకున్నారట. ఇక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న పి.నారాయణ తన వంతు పాత్ర పోషించారనుకోవాలి. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీకి బలం లేకపోయినా, డిప్యూటి మేయర్ పదవిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఫిరాయింపులను ప్రోత్సహించి గెలిపించుకున్నారు. స్థానిక సంస్థలలో ఫిరాయింపులను నిరోధించవలసిన మంత్రి నారాయణే ఇలా అరాచకంగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వ నాసిరకం పాలనకు నిదర్శనంగా కనిపిస్తుంది. పిడుగురాళ్లలో సైతం ఇదే తరహా పరిస్థితి. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికే జరిగే హాలును టీడీపీ గూండాలు ఆక్రమించుకున్నారట. ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతుంటే, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఈ ఘటలను రిపోర్టు చేయకుండా పురపాలికల్లో కూటమి జెండా అని నిస్సిగ్గుగా కథనాలు ఇచ్చాయి. ఈనాడు మీడియా అయితే టీడీపీ, జనసేన గూండాలు చేసిన విధ్వంసం గురించి విస్మరించడమే కాకుండా, గతంలో ప్రలోభాలు, బెదిరింపులతో వైసీపీ గెలిచిందని రాయడం ద్వారా తాను ఎలా దిగజారింది అడుగడుగునా రుజువు చేసుకుంటోంది. గత ఎన్నికలలో నిజంగానే ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగాయా అన్నది చూస్తే అలాంటిది పెద్దగా ఏమీ లేదు. టీడీపీ గెలిచిన తాడిపత్రి, దర్శి మున్సిపాల్టీలలో ఎక్కడా వైఎస్సార్సీపీ ఇబ్బంది పెట్టలేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. ఒకవేళ నిజంగానే అప్పుడు ఏవైనా కొన్ని ఘటనలు జరిగాయని అనుకున్నా, ఇప్పుడు కూడా అలా చేయడం తప్పు కాదన్నట్లు ఎల్లో మీడియా రాస్తే వీరిది జర్నలిజం అంటామా? ఆ పేరుతో చేస్తున్న ఇంకేదో వ్యాపారం అని అంటామా అన్నది ఆలోచించుకోవాలి. కేరళ హైకోర్టు కొద్ది రోజుల క్రితం పార్టీ మారే కౌన్సిలర్ లు అనర్హులు కావాల్సిందేనని తీర్పు ఇచ్చింది. ఏపీలో ఇలా ఫిరాయించిన వీరంతా అనర్హులు అవుతారు. కాని వ్యవస్థలు అన్నీ చోట్ల ఒకేరకంగా వ్యవహరించడం లేదు. చిత్రమేమిటంటే లేస్తే మనిషిని కాదు అంటే బెదిరించే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి అక్రమాలు ఎన్ని జరుగుతున్నా, తన పార్టీ వారి పాత్ర కూడా కనిపిస్తున్నా, నోరు మెదపడం లేదు. బీజేపీ ఎంపీ సి.ఎమ్.రమేష్ జమ్మలమడుగు క్లబ్లో అదే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరుల ఆధ్వర్యంలో సాగుతున్న జూదం గురించి జిల్లా అధికారులకు లేఖ రాయడం ఏపీలో ఏ రకమైన పాలన జరుగుతోంది చెప్పకనే చెబుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలలో ఈ విచ్చలవిడిగా జూద కార్యకలాపాలు సాగుతున్నాయన్నది వాస్తవం. అయినా బాగా పాలన చేస్తున్నామని చంద్రబాబు, పవన్‌లు వారి భుజాలు వారే చరచుకుంటారు. ఈ క్లబ్ లు, లిక్కర్ దందాలపై ఉపయోగించవలసిన రెడ్ బుక్ ను లోకేష్ ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ నేతలపై ప్రయోగిస్తారు. మరో వైపు పవన్ సోదరుడు నాగబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని కుక్కలతో పోల్చుతున్నారు. అధికారం తలకు ఎక్కితే ఎలా మాట్లాడతారో చెప్పడానికి నాగబాబు వ్యాఖ్యలే నిదర్శనంగా ఉంటాయి. గతంలో తాను ప్రశ్నిస్తానంటూ పవన్ స్థాపించిన జనసేన అసలు స్వరూపం ఇది అన్నమాట. ఏది ఏమైనా ఏపీలో రోజు, రోజుకు పరిస్థితి ఎంతగా దిగజారుతోంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కూటమి పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పకుండా ఉంటారా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏంది బాలయ్య.. ఇదీ ఓ గెలుపేనా?
సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సభ్యులపై ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. మాట వినని వాళ్లను బెదిరించడమే కాదు.. ఎత్తుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్యాయంగా పదవులు లాక్కుని.. తమదే గెలుపంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. ఈ క్రమంలో..హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలోనే బరితెగింపు వ్యవహారం నడిచింది. 23 మంది సభ్యుల మద్దతుతో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి సొంతం చేసుకుంది టీడీపీ. అయితే.. బలం లేకున్నా అన్యాయంగా చైర్మన్ పదవి లాక్కోవడం ఇక్కడ దారుణం.ఇక్కడ మొత్తం 38 వార్డులు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో 30 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈసారి ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టాలని టీడీపీ నేతలను ఎమ్మెల్యే బాలయ్య దగ్గురుండి ప్రోత్సహించారు. మాట వినని కౌన్సిలర్లను బెదిరించారు కూడా. అలా.. 16 మందిని తనవైపునకు తిప్పుకుంది. ఈ అరాచకాలను చూసి ‘‘ఏంది బాలయ్య ఇది?’’ అంటూ హిందూపురం వాసులు విస్తుపోతున్నారు. డాకు బాలయ్యా.. ఇదీ ఓ గెలుపేనా?హిందూపురంలో టీడీపీ విజయం అనైతికమని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అంటున్నారు. ‘‘హిందూపురంలో 38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైఎస్సార్ సీపీ కి బలం ఉంది. ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చూసి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను లాక్కున్నారు. ఓ డాకూలా ఎమ్మెల్యే బాలకృష్ణ దోపిడీ చేశాడు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ గెలుపు.. అసలు గెలుపే కాదు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాగే మోసాలతో గెలిచారు. చంద్రబాబు, బాలకృష్ణలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు’’ అని అన్నారాయన. -
ఫిరాయిపులపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఫిరాయింపు రాజకీయాలపై కేరళ ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక పార్టీపై గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లాలనుకుంటే గనుక ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని రాజకీయ నేతలకు సూచించింది.కూథట్టుకులమ్ మున్సిపల్ కౌన్సిలర్ కళా రాజును అపహరించి, దాడి చేసిన కేసులో ఐదుగురికి ఆ రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా.. జస్టిస్ పివి కున్హికృష్ణన్ ఫిరాయింపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు వారిని ఎన్నుకున్న ప్రజల అభీష్టానికి కట్టుబడి ఉండాల్సిందేనని వ్యాఖ్యానించారాయన.‘‘ఒక ప్రతినిధి రాజకీయ విధేయతను మార్చుకోవాలనుకుంటే(పార్టీ మారాలనుకుంటే).. ఆ వ్యక్తి మొదట రాజీనామా చేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో నైతిక కోణం. అప్పుడే ఓటర్ల నమ్మకాన్ని ఏకపక్షంగా విచ్ఛిన్నం చేయకుండా ఉంటారు. అలా జరగకుంటే.. ప్రజల ప్రజల అభీష్టాన్ని అవమానించడమే అవుతుంది. అలాంటి ప్రజాప్రతినిధిని తర్వాతి ఎన్నికల్లో ఓడించం ద్వారా ప్రజలు తమ సత్తా చాటగలరు. ప్రజాస్వామ్యానికి ఉన్న అందం అదే కూడా’’ అని న్యాయమూర్తి అన్నారు.ప్రస్తుత కేసులో.. ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యను పరిష్కరించుకోకుండా ఇరు వర్గాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధిని ఓడించాలంటే అది ఎన్నికల ద్వారానే.. హింస ద్వారా కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది.తెలంగాణలో బీఆర్ఎస్ మీద నెగ్గిన ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన వ్యహారం సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు ఇంకెంత టైం కావాలంటూ తెలంగాణ స్పీకర్‌పై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఇటు.. కేరళ హైకోర్టు కూడా ఫిరాయింపులపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.కేసు ఏంటంటే..సీపీఎం కౌన్సిలర్‌గా నెగ్గిన కళా రాజు ఆ తర్వాత యూడీఎఫ్‌లో చేరారు. అయితే అవిశ్వాస తీర్మానం వేళ.. ఓటేయకుండా తనను అడ్డుకున్నారని, బలవంతంగా ఎత్తుకెళ్లి మరీ దాడికి పాల్పడ్డారని సీపీఎం నేతల మీద ఆరోపణలకు దిగారామె. ఆ ఆరోపణలను సీపీఎం ఖండించింది కూడా. అయితే ఈ ఘటనపై కళా రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 45 మందిపై కేసు నమోదు చేశారు. వాళ్లలో ఐదుగురు ముందస్తు బెయిల్ కోరగా.. షరతులతో మంజూరు చేసింది కేరళ హైకోర్టు. -
సీఎం రేవంత్.. ఇప్పటికైనా లెంపలేసుకుంటారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలే ఎమ్మెల్యే ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్యగా చెబుతున్నారని, దీనిపై రేవంత్ లెంపలేసుకుంటారా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే కాంగ్రెస్ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని సూటిగా వేలెత్తి చూపుతున్నారని తెలిపారు. తమ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారని అన్నారు.ఈ మేరకు ఎక్స్‌లో స్పందించిన కేటీఆర్.. ‘ఇప్పటికైనా మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా? క్షమాపణ చెబుతారా? మీరు గడప గడపకు వెళ్లి.. చేర్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చట్టప్రకారం వేటు వేయల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా? ఇప్పుడు రాయితో కొట్టాల్సింది ఎవరిని..? ఫిరాయించిన ఎమ్మెల్యేలనా ?ప్రోత్సహించిన మిమ్ములనా ?’ అంటూ సూటిగా ప్రశ్నించారు.రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే.. మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు.. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా ?జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే..ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అని….మీ దిగజారుడు… pic.twitter.com/D9CTnAl6Ci— KTR (@KTRBRS) October 23, 2024కాగా కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి చేరిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఫిరాయింపులు మంచిది కాదని హైకమాండ్‌కు చెప్పానని పేర్కొన్నారు. ఇక దానిపై నిర్ణయం పార్టీ ఇష్టమేనని తెలిపారు. ఫిరాయింపులపై తన నిర్ణయం మాత్రం మారదని స్పష్టం చేశారు.ఫిరాయింపుల కారణంగా బీఆర్ఎస్ ఎవరో.. కాంగ్రెస్ ఎవరో అర్థం కావడం లేదని జీవన్ రెడ్డి అన్నారు. అసలైన కాంగ్రెస్ నేతలు కూడా తాము కాంగ్రెస్సే అని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. ఎంఐఎంను మినహాయించినా కాంగ్రెస్ సుస్థిరంగానే ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలని చట్టంలోనూ ఉందని గుర్తుచేశారు. -
పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో శేరిలింగంపల్లి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఏం పాపం చేసిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లోకి వెళ్లారని కేటీఆర్ ప్రశ్నించారు.మంత్రి శ్రీధర్ బాబు అతితెలివి ప్రదర్శించొద్దని హెచ్చరించారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని మాట్లాడారు. ఎమ్మెల్యేలకు కండువా కప్పిన సన్నాసి ఎవరు? అని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే బతుకు జూబ్లీ బస్టాండే అవుతుందని సూచించారు. Live: BRS Party Cadre Meeting, Serilingampally Assembly constituency.@KTRBRS https://t.co/9PwrvDngy6— BRS Party (@BRSparty) September 24, 2024చదవండి : చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు -
ఫిరాయింపులు.. పార్టీలన్నీ దొందు దొందే!
ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉన్న రాజకీయ నేతలు తమ ఇష్టానుసారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూనే ఉన్నారు. రాజ్యాంగంలో మార్పులు తెచ్చినా.. చట్టాలను కఠినతరం చేసినా... దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. అనైతిక చర్యలకు ప్రోత్సాహమిస్తున్నాయి. ప్రజలందరికీ చట్టాలు చేసే నేతలే ఈ రకమైన చట్ట వ్యతిరేకమైన పనులకు దిగడం సమాజం సిగ్గుపడేలా చేయడమే అవుతుంది. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన నేపథ్యంలో దాఖలైన కేసుపై ఇటీవలే జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఇచ్చిన తీర్పు ఎంతైనా స్వాగతించదగింది. ఈ అడ్డగోలు ఫిరాయింపులకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయకపోతే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఉంది.తెలంగాణలో గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన దానం నాగేందర్ ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం మనకు తెలిసిన విషయమే. ఫిరాయింపు స్పష్టంగా తెలుస్తున్నా.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్... దానం నాగేందర్‌పై వేటు వేయకపోవడం వివాదాస్పదమైంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు కూడా ఫిరాయింపులకు పాల్పడ్డారని వారిపై వేటు వేయాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసినా స్పీకర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు.దీంతో బీఆర్ఎస్ శాసన సభ్యులు ఇద్దరు, బీజేపీ ఎమ్మెల్యే ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి సుప్రీంకోర్టు గత తీర్పులను ఉదహరిస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నాలుగు వారాల్లోగా అనర్హత పిటిషన్లపై తన వైఖరిని తెలియజేయాలని ఆదేశించారు. అంతే కాదు... సాంకేతిక కారణాలతో ఇలాంటి పిటిషన్లను కొట్టేయడం సహేతుకం కాదని కూడా న్యాయమూర్తి అభిప్రాయపడటం విశేషం. అసెంబ్లీ కాలావధి ముగిసేంత వరకూ స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఉంటే కోర్టులు ఊరుకోజాలవని, అలా చేయడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని కూడా ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులతోపాటు ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించిన మరో ఏడుగురిపై కూడా వేటు వేయాల్సి ఉంది.ఫిరాయింపులపై ఫిర్యాదు అందిన మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. కానీ అధికార పక్షానికి చెందిన స్పీకర్లు తమ పార్టీ వారిపై చర్యలు తీసుకోకుండా ఉంటున్నారు. అదే సమయంలో అధికార పార్టీ నుంచి ఎవరైనా వేరే పార్టీలోకి మారితే మాత్రం వెంటనే చర్యలు ఉంటున్నాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ అంశాలపై కోర్టులు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తూండటం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయాన్నే ఉదాహరణగా తీసుకుందాం. అప్పట్లో పార్టీ మారిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్లు చర్యలు తీసుకోలేదు. ఇదీ చదవండి: మళ్లీ ఉద్రిక్తత..బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హౌస్ అరెస్టుసీనియన్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ ఫిరాయింపుపై ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసినా సాంకేతిక కారణాలతో కేసు వీగిపోయింది. తాజా కేసులో కూడా ప్రభుత్వ న్యాయవాది సుదర్శన్ రెడ్డి సాంకేతిక అంశాలను ప్రస్తావించినా కొట్టివేసేందుకు న్యాయమూర్తి అంగీకరించకపోవడం గమనార్హం. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి స్పీకర్‌దే అంతిమ నిర్ణయమని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు. అయినా ఫలితం లేకపోయింది.తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు ఈ ఫిరాయింపు సమస్యను భరించింది. కేసీఆర్ ప్రభుత్వంపై ఫిరాయింపుల అంశంపై తీవ్ర విమర్శలు చేసింది. కేసిఆర్ వ్యూహత్మకంగా ఆయా శాసనసభ పక్షాలను మొదట టీఆర్ఎస్, ఆ తరువాత బీఆర్ఎస్ విలీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. నిజానికి అది కూడా అనైతికమే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరిగ్గా ఇదే వ్యూహంతో వెళ్లాలని అనుకుంది కానీ.. అవసరమైనంత మందిని తనవైపు తిప్పుకోలేక పోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం 38 మందిలో పది మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్ ఒకానొక సందర్భంలో ఇంకో పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకే అనర్హుడిని చేశారు. బీజేపీ వ్యతిరేకి కావడం వల్లనే అప్పటి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు శరద్ యాదవ్‌పై చర్య తీసుకున్నారన్న విమర్శ కూడా ఉంది.జాతీయ పార్టీలైన బీజేపీ కావచ్చు.. కాంగ్రెస్ కావచ్చు.. రెండూ ఫిరాయింపులను దేశవ్యాప్తంగా ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ రాజీనామాల వ్యూహాన్ని అమలు చేసింది. సభ్యులు ఎవరైనా పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరితే చట్ట విరుద్ధం కాదు. కానీ తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇలాంటి నిబంధనలు పట్టించుకోకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఎలాంటి జంకూ లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి చేర్చుకోవడాన్ని చూసి చూడకుండా వదిలేశారు. తరువాతి కాలంలో ఆయనే ఫిరాయింపుల చట్టాని ఉల్లంఘించి మరీ కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ప్రభుత్వ సలహదారు పదవి కూడా ఇచ్చేశారు.అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీని ఖతం చేయాలని ఇరు పక్షాలూ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ను బలహీన పరిచే లక్ష్యంతోనే ప్రస్తుత సీఎం ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారన్న విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఇందులో భాగమనే అనుకోవాలి. అయితే తనకు ఎవరూ కాంగ్రెస్ కండువా కప్పలేదని గాంధీ చెప్పడం సిగ్గు చేటైన విషయం. గాంధీ అని పేరు పెట్టుకున్నందుకైనా ఆయన కొంచెం నిజాయితీతో మాట్లాడి ఉంటే బాగుండేది.బీఆర్ఎస్ శాసనసభ పక్షం నేత కేసిఆర్ లేఖకు అనుగుణంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌ను నియమించాల్సి ఉండగా కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన గాంధీకి పదవి కట్టబెట్టారు. హరీష్ రావును పీఏసీ చైర్మన్ చేయాలని ప్రతిపాదిస్తే... కనీసం ఆయనను సభ్యుడిగా కూడా చేయలేదు. ఇది ఖచ్చితంగా స్పీకర్ వైపు నుంచి జరుగుతున్న తప్పులే. గతంలో కేసిఆర్ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చి విమర్శల పాలయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన గాంధీల మధ్య వివాదం మరో ట్విస్ట్. పోలీసులు కౌశిక్ ను హౌస్ అరెస్టు చేసి, గాంధీని చేయకపోవడం,ఆ తర్వాత ఆయన కౌశిక్ ఇంటిపైకి అనుచరులతో కలిసి దాడి చేయడం వంటివి జరిగాయి. ఇందులో పోలీసుల వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. ఏపిలో చంద్రబాబు నాయుడు సైతం 2014 -19 లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. అయినా ఆనాటి స్పీకర్ కోడెల వారిపై కాని ...పార్టీ మారిన మొత్తం 23 మంది ఎమ్మెల్యేలపై కాని చర్యలు తీసుకోలేదు. అలాగే తెలంగాణలో స్పీకర్ లుగా పనిచేసిన పోచారం ,మధుసుధనాచారిలు ఆనాటి సీఎం కేసిఆర్ ఏం చెబితే అదే చేశారు. స్వత్రంతంగా వ్యవహరించలేదు. ఒకప్పుడు అయ్యదేవర కాళేశ్వర రావు, బి.వి.సుబ్బారెడ్డి, జి.నారాయణ రావు మొదలైన వారు స్పీకర్లుగా ముఖ్యమంత్రిని సైతం వ్యతిరేకించిన ఘట్టాలు చరిత్రలో ఉన్నాయి. ప్రస్తుత తెలంగాణ శాసనసభ వ్యవహరాల మంత్రి డి. శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు స్పీకర్ ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి కొంత ప్రాధాన్యత ఇవ్వడం అప్పటి అధికార కాంగ్రెస్ కు రుచించేది కాదు. స్పీకర్ గా పనిచేసిన మరోనేత కేఆర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కొంత ఆలస్యంగానైనా అనర్హత వేటు వేయడం సంచలనంగా మారింది.ఒక్కోసారి సభ్యులు రాజీనామాలు చేసినా స్పీకర్లు వాటిని రాజకీయ కారణాలతో పెండింగులో ఉంచిన ఘట్టాలు ఉమ్మడి ఏపీలో జరిగాయి. తెలంగాణ ఉద్యమం కోసం కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి వాటిని ఆమోదించడం ఆలస్యం చేస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటన చేసినప్పుడు ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామాల డ్రామాకు కిరణ్ కుమార్ ఆధ్వర్యం వహించారు. ఇంకో స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లుగా జగన్ కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని బాగా ఆలస్యం చేశారు.అసెంబ్లీ టరమ్ ఏడాది లోపు ఉంటే ఉప ఎన్నికలు రావు. ఆ రకంగా మనోహర్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించలేదన్న విమర్శలు వచ్చాయి. ఏపీలో తమ్మినేని సీతరాం గత టరమ్ లో ఆనాటి అధికార వైసీపీకి, విపక్ష టీడీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై కొంత ఆలస్యంగానైనా అనర్హత వేటు వేశారు. లోక్ సభ, రాజ్యసభలో కూడా ఎక్కువ సందర్భాలలో ఇదే జరుగుతోంది. ఏపీకి చెందిన అప్పటి ఎమ్.పి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరినా స్పీకర్ ఓం బిర్లా ఏదో సాకు చూపుతూ కాలం గడిపేశారు. ఏది ఏమైనా ఫిరాయింపుల విషయంలో బీజేపీ కాంగ్రెస్‌తోసహ వివిధ రాజకీయ పక్షాలు అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయన్నది నిజం. స్పీకర్లు ముఖ్యమంత్రులు చెప్పినట్లు నడుచుకోక తప్పని స్థితి ఉంటోంది. అందువల్ల కనీసం న్యాయవ్యవస్థలోని వారైనా ఇలాంటి తీర్పులు ఇవ్వడమే కాకుండా స్పీకర్ చర్య తీసుకోలేని పక్షంలో వారే అనర్హత వేటు వేసేలా చోరవ చూపడం అవశ్యం అని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మరకే మంచిదంటున్న చంద్రబాబు!
కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మంత్రుల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటోందని, తాను ఇటుక,ఇటుక పేర్చి ప్రభుత్వ పరువు పెంచుతుంటే.. వీరు బుల్ డోజర్ పెట్టి కూల్చుతున్నారని కూడా పేర్కొన్నారు. నిజంగా కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల వల్లే పరువు పోతోందా? లేదా? అన్నది పక్కన బెడితే.. ప్రస్తుత పరిస్థితి గమనిస్తే టీడీపీ దండులో ఒకరిద్దరేమైనా అరాచకాలకు పాల్పడకుండా ఉంటున్నారేమో అనే భావన కలిగేలా పరిస్థితి ఏర్పడినట్లుగా ఉంది.ఏపీలో టీడీపీ, బీజేపీ,జనసేన కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన హింసాకాండ, విధ్వంసం ఇంతా అంతా కాదు. ఇసుక దోపిడీ వంటి దందాలకు అడ్డు ఆపూ లేకుండా పోయింది. కొన్నిసార్లు తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఎంతో కొంత అలాంటి వార్తలను కవర్ చేయక తప్పడం లేదు. కాకపోతే టీడీపీ మరీ డామేజ్ కాకుండా కాపాడేలా కథనాలు ఇస్తుంటారు. అది వేరే కథ.ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతోంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ మహిళా నేత మానభంగం ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం అయింది. సంబంధిత వీడియోలు కూడా వెలుగుచూడడంతో పార్టీ పరువు గంగలో కలిసినట్లయింది. ఆయన గతంలో వైఎస్సార్సీపీలో ఉన్నాడంటూ ఎదురు ఆరోపణ చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత.. చట్టపరంగా చర్యతీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం చూపలేదు. కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఉత్త ప్రకటన ఒకటి చేశారు. ఆ తర్వాత ఒత్తిడికి గురై కేసు పెట్టారు.అదే వేరే పార్టీ వ్యక్తి అయి ఉంటే ఎంత హడావుడిగా అరెస్టు చేసి ఉండేవారో. ఇంత ఘోరమైన మానభంగం ఆరోపణ వచ్చినా అరెస్టు చేయకపోవడం వల్ల కేవలం ఎమ్మెల్యేకే చెడ్డపేరు వచ్చిందా ?లేక కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వచ్చిందా అనేది కూడా ఆలోచించుకోవాలి. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న ఆదిమూలం అంతకు ముందు టీడీపీలోనే పదవులు నిర్వహించారు మరి. అలాంటి వ్యక్తిని తిరిగి టీడీపీలోకి ఎందుకు చేర్చుకున్నట్లు?. ఆ విషయాన్ని కప్పిపుచ్చి టీడీపీ నేతలు.. దిక్కుమాలిన ప్రచారం చేస్తుంటారు. ఇక్కడ ఏ పార్టీలో ఎప్పుడు ఉన్నారన్నది కాదు. తప్పు చేశాడా?లేదా? అనేది ముఖ్యం.ఎప్పుడో టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారంటూ వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేసి వచ్చిన పోలీసులు.. లైంగిక దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక.. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తన దౌర్జన్యాలను ఆపడం లేదు. కొంతకాలం క్రితం వైఎస్సార్సీపీకి చెందిన ఓ లీడర్‌కు చెందిన భవనాన్ని స్వయంగా బుల్ డోజర్ తీసుకువెళ్లి కూల్చేశారు.అది తప్పే అని టీడీపీ మీడియానే అప్పట్లో వార్తలు రాసింది. ఇప్పుడు కొందరు మహిళలను ఉద్దేశించి ఆయన బూతులు తిట్టారట. వారేదో సమస్యపై వస్తే దానిని చేయగలిగితే చేయాలి. లేదా కుదరదని చెప్పాలి. అలాకాకుండా ఫలానా గ్రామం నుంచి వచ్చారా? అని ప్రశ్నించి మరీ బూతులు తిట్టారని ఆ మహిళలు వాపోయారు. ఇది ఇక్కడితో ఆగలేదు. పోలీస్ ఎస్.ఐ.ని పిలిచి వారందరిని అరెస్టు చేయాలని ఆదేశించారట. విధేయుడైన ఆ పోలీసు అధికారి వారందరిని స్టేషన్ కు తరలించారట. ఇలా ఉంది ఏపీలో ప్రజాస్వామ్యపాలన.ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరిస్తే టీడీపీ కార్యకర్తలు ఇంకెంతగా పెట్రోగిపోతుంటారో ఊహించుకోవచ్చు. తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి.. పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ తో దురుసుగా వ్యవహరించి క్షమాపణ చెప్పించడం కలకలం రేపింది. ఆయన తండ్రి,మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి దూషణల సంగతి సరేసరి. తన బస్ లను పట్టుకున్న అధికారుల పని పడతానంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు. ఇక.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన స్వగృహానికి వస్తుంటే జెసి అనుచరులు దౌర్జన్యానికి దిగి అడ్డుకున్నారు. స్థానిక వైఎస్సార్సీపీ నేత ఇంటిని ఏకంగా దగ్దం చేశారు. అయినా వీటిపై చంద్రబాబు కిమ్మనలేదు.వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పెట్టడానికి అనుమతులు తీసుకోవాలన్న పోలీసులపై జేసీ మండిపడ్డారు. ఎవరూ పోలీసుల వద్దకు వెళ్లనక్కర్లేదని హుకుం జారీ చేశారు. ఒకపక్క హోం మంత్రి అనిత ఏమో విగ్రహాల పండాల్స్ ఏర్పాటు చేసేవారు నిర్దిష్ట రుసుము చెల్లించి అనుమతులు తీసుకోవాలని చెబుతుంటే.. తాడిపత్రి టీడీపీ నేతలు కుదరదు పొమ్మంటున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాను కూడా ఒక రెడ్ బుక్ పెట్టుకున్నానని, అందులో వందమంది పేర్లు ఉన్నాయని అధికారులను బెదిరించారు. వారిని ఇబ్బంది పెట్టి తీరుతానని చెబుతున్నారంటే.. ఏపీలో టీడీపీ అరాచకం ఎంతగా వర్ధిల్లుతోందో తెలుస్తోంది. అఖిలప్రియపై హైదరాబాద్ లో కూడా కొంతకాలం క్రితం కొన్ని సీరియస్ కేసులు నమోదు అయ్యాయి. అయినా చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. ఎదుటి పార్టీలో ఉంటే ఏమైనా అంటారు. తన పార్టీలోకి రాగానే వారు ప్రక్షాళన అయిపోయినట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తుంటారు.సంబంధిత వార్త: ఆళ్లగడ్డలో వంద మంది నా టార్గెట్చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు భార్య వెంకాయమ్మ కు పోలీసులు జన్మదినోత్సవం జరపడం వివాదాస్పదం అయింది. మంత్రి రామ్ ప్రసాదరెడ్డి సతీమణి ఒక పోలీస్ ఎస్.ఐ.పై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు విమర్శలకు దారి తీసింది. చంద్రబాబు కోడలు, మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణికి పోలీసులు వందన సమర్పించిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ నిమిత్తం రూ. 82 లక్షల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడంపై ఆక్షేపణ వచ్చింది. ఇలా ఒకటి కాదు.. అనేకం ఉన్నాయి.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పచ్చబిళ్లతో వచ్చే టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వ అధికారులంతా విధేయులుగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. వీటిని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు జరిగాయని, అప్పుడేమి చర్య తీసుకున్నారని టీడీపీ వాళ్లు ప్రశ్నిస్తుంటారు. నిజానికి ఏ ప్రభుత్వం ఉన్నా.. కొన్ని ఘటనలు జరగొచ్చు. వాటిపై ప్రభుత్వం స్పందిస్తే తప్పు పట్టనక్కర్లేదు.ఆనాటి ముఖ్యమంత్రి జగన్ పలు చర్యలు తీసుకున్నా.. చంద్రబాబు,పవన్‌లు మాత్రం అప్పట్లో ఘోరాలు జరిగిపోయినట్లు దుష్ప్రచారం చేశారు. తీరా అలా ఆరోపణలకు గురైనవారిలో కొందరిని టీడీపీలోకి చేర్చుకుని టిక్కెట్లు కూడా ఇచ్చేశారు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు.. చంద్రబాబు,లోకేష్ లు ఆయనపై చేయని ఆరోపణలు లేవు. పేకాట శిబిరాలు నిర్వహిస్తారని, భూములు కబ్జా చేస్తారని ఇలా ఎన్నో చెప్పారు. ఎన్నికల సమయానికి ఆయనను సగౌరవంగా టిక్కెట్ ఇచ్చి టీడీపీ పక్షాన నిలబెట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఎం.పీ.డీ.వో.పై దురుసుగా మాట్లాడారని ఆరోపణ రాగా,ఆయన అరెస్టుకు జగన్ ఆదేశించారు. అప్పట్లో శ్రీధర్ రెడ్డిపై టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసేది. ఆ తర్వాత కాలంలో ఆయన్ని టీడీపీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. అంటే ఆ పార్టీలో చేరగానే శ్రీధర్ రెడ్డి పవిత్రుడు అయిపోయారా? అంటే ఏమి చెబుతాం.మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన సమీప బంధువులపై ఇసుక,మట్టి తవ్వకం తదితర ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత,మాజీ మంత్రి దేవినేని ఉమా పలు ఆందోళనలు చేపట్టారు. కానీ గత ఎన్నికలలో వసంతను టీడీపీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చి, దేవినేని ఉమాకు మాత్రం మొండి చేయి చూపారు. దీనిని ఏమనాలి?. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఆ టైంలో ఈనాడు మీడియా ఎన్ని వ్యతిరేక కధనాలు ఇచ్చిందో చెప్పలేం. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. కానీ టీడీపీ ఆహ్వానించి మరీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో సంగతి కూడా చెప్పాలి.టీడీపీ నేతలు ఎవరిపైన అయినా అభియోగాలు వచ్చి పోలీసులు అరెస్టు చేస్తే.. వైఎస్సార్సీపీ టైమ్ లో చంద్రబాబు నానా యాగీ చేసేవారు. హత్య కేసులో ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు అయితే.. ఇంకేముంది బీసీ నేతను అరెస్టు చేస్తారా? అని గోల చేశారు. ఇప్పుడేమో దళిత నేత నందిగం సురేష్‌ను మాత్రం కక్ష కట్టి చంద్రబాబు అరెస్టు చేయించారు. ఇవన్నీ చంద్రబాబు డైరెక్షన్ లో జరుగుతున్న అరాచకాలా? లేదంటే ఆయన కుమారుడు లోకేష్ నేతృత్వంలో సాగుతున్న రెడ్ బుక్ అరాచకాలా?. పరిశీలిస్తే.. ఎక్కువ శాతం లోకేష్ దుందుడుకు వ్యవహారాలు ఉండవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి.సూపర్ సిక్స్ హామీలను పక్కనబెట్టి ఈ దందాలు, హింసాకాండ ద్వారా నియంతృత్వపాలన సాగించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది ఎల్లకాలం సాగుతుందా?ప్రజాస్వామ్యాన్ని హరించివేయాలని అనుకున్న చాలామంది నేతలు గతంలో కాలగర్భంలో కలిసిపోయారు. ఆ సంగతి అధికారంలో ఉన్నవారు మర్చిపోకుండా ఉంటే మంచిది.:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పార్టీ ఫిరాయింపులపై టీడీపీ ‘సుద్దపూస’ రాజకీయాలు
సాక్షి, విజయవాడ: పార్టీ ఫిరాయింపులపై టీడీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. పదవులకు రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామంటూ ఆ పార్టీ నేతలు సుద్ధపూస మాటలు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు సైతం ఇవే మాటలు వల్లిస్తున్నారు. అయితే, రాజీనామా చేయకుండానే మేయర్లను చేర్చుకున్న టీడీపీ.. నిసిగ్గు రాజకీయాలు మొదలుపెట్టింది.ఏలూరు మేయర్, కార్పొరేటర్లను నారా లోకేష్ టీడీపీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. కార్పొరేటర్, మేయర్ పదవులకు రాజీనామా చేయకుండానే చేరికలను టీడీపీ ప్రోత్సహిస్తోంది. ఒంగోలులో మేయర్‌ని ఆ పార్టీ ఎమ్మెల్యే టీడీపీలో చేర్చుకున్నారు. మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేయకుండానే చేర్చుకోవడం ద్వారా తన వక్రబుద్ధిని చాటుకున్నారు.మరోవైపు, విశాఖలో కూడా ఏడుగురు కార్పొరేటర్లను రాజీనామాలు చేయకుండానే పల్లా శ్రీనివాస్ టీడీపీలో చేర్చుకున్నారు. జనం ఓట్లేసే పదవులకు రాజీనామాలు చేయించని టీడీపీ ఎమ్మెల్యేలు.. మీడియా ముందు సుద్దపూస మాటలు చెబుతున్నారు. రాజీనామా చేస్తేనే చేర్చుకుంటామంటూ గంటా, బుచ్చయ్యచౌదరి ప్రగల్భాలు పలుకుతున్నారు. టీడీపీ నేతల మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
#CBNDirtyPolitics: ఆ వక్రబుద్ధితోనే ఫిరాయింపులపర్వం!
విజయవాడ, సాక్షి: ఎన్నో అనుమానాల మధ్యే అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు గెల్చుకుంది చంద్రబాబు టీడీపీ పార్టీ. ఆ వెంటనే ప్రతీకార రాజకీయాలు మొదలుపెట్టి.. అరాచక పాలన కొనసాగిస్తున్నారు. అయినా సంతృప్తి దక్కనట్లుంది. ఇప్పుడు సిగ్గుగుగా రాజకీయాల్లో ‘వన్ టైం సెటిల్మెంట్’ పథకాన్ని తీసుకొచ్చారాయన.ఏపీలో చంద్రబాబు నాయుడు మరోసారి ఫిరాయింపుల ప్రయత్నాలపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే చట్ట సభ్యులకు డబ్బులు.. కాంట్రాక్టు ఆశలు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో కొందరి నుంచి ఛీత్కారాలు ఎదురవుతుండగా.. మరికొందరు మాత్రం ఆ ఒప్పందాలకు లొంగిపోయినట్లేనని టీడీపీ అనుకూల మీడియా కథనాలు ఇస్తోంది.టీడీపీ పుట్టినప్పటి నుంచి రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ స్థానాల కారణంగా రాజ్యసభలో జీరో అయ్యింది సైకిల్ పార్టీ. ఆ అవమానం నుంచి ఎలాగైనా బయటపడాలనే.. ఇప్పుడు వైఎస్సార్సీపీ ఎంపీలకు ఎర వేస్తోంది. తద్వారా తన వారికి ఆ పదవుల్ని ఇచ్చుకునేందుకు వ్యూహం రచిస్తోంది. తమ తమ పదవులకు ఆ ఎంపీలతో రాజీనామా చేయించి.. కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరాలని ఒత్తిడి సైతం చేస్తున్నట్లు సమాచారం. అదే టైంలో.. శాసనమండలిలోనూ టీడీపీ సభ్యుల సంఖ్య స్వల్పంగానే ఉంది. దీంతో.. మండలిలోనూ బలం పెంచుకునేందుకు బేరసారాలు మొదలుపెట్టింది.చంద్రబాబుది నరం లేని నాలుక అని మరోసారి రుజువైంది. అధికారం చేపట్టాక.. వైఎస్సార్సీపీ నేతల్ని ఎట్టిపరిస్థితుల్లో చేర్చుకోమని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. మూడు నెలలు తిరగకముందే ఆ దిశగా కుటిలయత్నాలు ముమ్మరం చేశారు. ఏపీలోని కొన్ని నగరాల వైస్సార్సీపీ మేయర్లను ఇప్పటికే తమ పార్టీల్లోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు.. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలతో బేరసారాలు మొదలుపెట్టారు. విలువలతో సాగుతున్న జగన్..ఎన్టీఆర్ ఎపిసోడ్ , ఓటుకు నోటు ఎపిసోడ్ల రూపకర్త అయిన బాబు నుంచి ఈ తరహా రాజకీయం ఊహించిందే. కానీ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాను అధికారంలో ఉన్నన్నాళ్లు విలువలున్న రాజకీయాలనే నడిపించారు.. ఇప్పటికీ నడిపిస్తున్నారు కూడా. ఫిరాయింపులను ఆయన ఏనాడూ ప్రొత్సహించలేదు. గతంలో పొత్తు కాకుండా.. సొంతంగా 151 సీట్లు సాధించి అధికారం చేపట్టారు వైఎస్ జగన్. ఆ టైంలో మండలిలో తగిన బలం లేకపోయినా ఆయన పట్టించుకోలేదు. అదే టైంలో.. రాజ్యసభ సభ్యులను ప్రలోభపెట్టలేదు. కానీ, చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ లాగే సంపూర్ణ మద్దతు ఉన్నా.. తన నైజం బయటపెట్టుకున్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు.. హైకోర్టులో విచారణ 25కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాధికారం శాసన సభ స్పీకర్దేనని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గడువు విధించి ఆలోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయజాలవన్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, దానం నాగేందర్‌ను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎల్పీ మహేశ్వర్‌రెడ్డి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బీ.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు.ప్రభుత్వం తరఫున ఏజీ, ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘అనర్హతపై కోర్టులు స్పీకర్‌కు గడువు విధించలేవు. పిటిషనర్లు చెప్పిన ప్రకారం ఫిర్యాదు చేసిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల సమయం ఇవ్వాలి. మరి వారంపది రోజుల్లోనే హైకోర్టులో పిటిషన్లు ఎలా వేశారు. ఎందుకు వేశారు?. స్పీకర్ విధుల్లో కోర్టుల జోక్యం అత్యంత స్వల్పం. అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత విచారణ చేయవచ్చు. అయితే అందులోనూ న్యాయస్థానాల జోక్యం స్వల్పమే’అని వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు జె.రాంచందర్‌రావు, గండ్ర మోహన్‌రావు.. ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయమూర్తిని విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. స్పీకర్ రాజ్యాంగ అధికారి అని.. ఆ కుర్చీపై మాకు గౌరవం ఉందన్నారు. అయితే తన ముందు పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లు ఏ దశకు చేరుకున్నాయో తెలియజేయాలని స్పీకర్‌ను ఆదేశించకున్నా.. దీనిపై అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై స్పీకర్ ఏం చర్యలు చేపట్టారో వివరాలు అందజేయాలని కోరవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. దీనికి ఏజీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయో కూడా స్పీకర్‌ను న్యాయస్థానాలు వివరాలు అడగలేవని బదులిచ్చారు. ఇప్పడు అత్యవసర ఉత్తర్వులు కోరుతున్న న్యాయవాదులు కూడా గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి కేసుల్లో వాయిదా కోరిన వారేనని చెప్పారు. ఇప్పుడు న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావడం హాస్యాస్పదం అన్నారు. అనంతరం తదుపరి వాదనల కోసం విచారణను రేపటికి వాయిదా వేశారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో కేటీఆర్ భేటీ
సాక్షి,హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ రాజ్యాంగం పట్టుకొని ఫోజులు కొడుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పుడుతుందని ధ్వజమెత్తారు.మంగళవారం(జులై16)పార్టీ మారిన ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. ఫిర్యాదు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.మార్చి 18న దానం నాగేందర్ పై ఫిర్యాదు చేశాం.ఇతర ఎంఎల్ఏల విషయంలో కూడా అనర్హత వేటు వేయాలని కోరాము.పలువురు నేతలు బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో చేరి నాలుగు నెలలు అవుతుంది. వారిపై చర్యలు తీసుకోకపోతే అది స్పీకర్ పదవికే అవమానని తెలిపారు.మూడు నెలల్లో పార్టీ మారిన ఎంఎల్ఏలపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా మణిపూర్‌లో పార్టీ మారిన ఎంఎల్ఏపై చర్యలు తీసుకున్నారు.ఇక్కడ కూడా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు కేటీఆర్ చెప్పారు. రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాందీ ఫోజులురాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాందీ ఫోజులు కొడుతారు కానీ ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందే కాంగ్రెస్ ప్రభుత్వమని ఫైరయ్యారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన ఎంఎల్ఏ పై చర్యలు తీసుకోవాలని అక్కడ కాంగ్రెస్ కోరుతుంది. కర్ణాటక లో 50 కోట్ల చొప్పున కాంగ్రెస్ ఎంఎల్ఏ లను కొన్నారని అక్కడ ముఖ్యమంత్రి చెప్తున్నారు..పార్టీ మారబోమని గోవా కాంగ్రెస్ నాయకులతో రాహుల్ గాంధీ ప్రమాణం చేయిస్తున్నారు. కానీ తెలంగాణలో ఏదెచ్చగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. -
ఎమ్మెల్యేలను ఎంతకు కొంటున్నారు: కేటీఆర్ ఫైర్
సాక్షి,ఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సురేష్‌రెడ్డితో కలిసి మంగళవారం(జులై 9) ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ‘ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే. సీఎం రేవంత్ స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారు. రాజ్యాంగ రక్షణ చేస్తున్నామని ఒక పక్క కాంగ్రెస్ గొప్పలు చెపుతోంది. ఆయారాం, గయారాం సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు అది పోచారం దాకా వచ్చింది. ఆటోమేటిక్‌గా అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్‌కు సవరణలు చేస్తామని కాంగ్రెస్ న్యాయ పత్రలో హామీ ఇచ్చి తెలంగాణలో ఫిరాయింపుల ప్రోత్సహిస్తోంది వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామని హామీని కాంగ్రెస్ అమలు చేయలేదు. రాహుల్ గాంధీ స్వయంగా ఇచ్చిన హామీలు కూడా గాలికి వదిలేశారు. ఆరు గ్యారెంటీలు వదిలేసి, మా పార్టీకి చెందిన ఆరుగురు ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలను కాంగ్రెస్ చేర్చుకుంది. పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాం. లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తాం. సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ గాంధీ ఆస్కార్ అవార్డు స్థాయిలో నటిస్తున్నారు. ఆచరణలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో బీఆర్ఎస్ ఎంఎల్ఏను కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు’అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ ఓటమిపై కేటీఆర్ కీలక కామెంట్స్పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా ఏపీలో వైఎస్ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందిఅయినా వైఎస్ఆర్సీపీ 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదుపవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవివైఎస్జగన్ను ఓడించేందుకు షర్మిల ను పావులా ఉపయోగించారుఅంతకు మించి షర్మిల ఏమీ లేదుప్రతి రోజు జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేప్రజలతో మాకు గ్యాప్ వచ్చిందిమా వైఖరి మార్చుకోవాలిప్రజలది తప్పు అనడమంటే.. మాదే తప్పుహైదారాబాద్లో అన్ని సీట్లు గెలిచాంఅభివృద్ధిని మేము చెప్పుకోలేదుతెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదుమాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారుఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదుహరీశ్రావు చిట్‌చాట్..ఫిరాయింపుల వల్ల మాకు లాభం జరగలేదుమా పార్టీలో చేరిన వాళ్ళల్లో పది మంది ఓడిపోయారుసుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ మారిన వారిపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలితెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేప్రజలు ప్రస్తు ప్రభుత్వానికి గత మా ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారురేవంత్ రెడ్డికి పాలన పై పట్టు రాలేదు..పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారు.అధికారులు మా చేతుల్లో లేదు అన్నారంటే అది వారి చేతగానితనం అన్నట్టేగ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా లేదు..ప్రజలు డెంగ్యూ ,మలేరియాా బారిన పడుతున్నారు. -
ఫిరాయింపులకు పునాది వేసిందెవరు?: కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
న్యూఢిల్లీ, సాక్షి: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయాలనే భావదారిద్ర్యంలో కేసీఆర్ ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మధ్యాహ్నాం మీడియాతో మాట్లాడారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్‌కు సిగ్గుండాలి. అసెంబ్లీకి రమ్మంటే రాడు. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించినా రాడు. తన కుటుంబానికే అన్ని కావాలనే స్వార్థంలో ఉన్నారు. 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాది. ఆది కేసీఆర్ కుప్పకూలిపోతుందని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని అనుకోలేదా?. కాంగ్రెస్‌ను ఓడించాలనే బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించారు. సిరిసిల్ల, సిద్దిపేటలో బీజేపీకి అన్ని ఓట్లు పడ్డాయంటే అర్థమేంటి?. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదు. ఎంతో మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్లో చేర్చుకున్న విషయం ఆయనకు గుర్తులేదా? ఫిరాయింపులకు పునాది వేసింది బీఆర్ఎస్. అమరవీరుల స్తూపం దగ్గర కేసీఆర్ ముక్కును నేలకు రాయాలి. ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వని కేసీఆర్ ఇప్పుడు ఫామ్‌హౌస్ తలుపులు తెరిచారు. మొన్నటిదాకా ఎమ్మెల్యేలను కలవడానికి ఇష్టపడని కేసీఆర్.. ఇవాళ ఇంటికి పిలిచి భోజనం పెడుతున్నారు విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కోరింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి. విచారణ కమిషన్ కేసీఆర్‌కు లేఖ రాయగానే విచారణ ‘ఎందుకు?’ అని ప్రశ్నిస్తున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి సమస్యలు లేవు. ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.మంత్రి వర్గ విస్తరణపై చర్చించలేదుఅన్ని శాఖలకు సమర్థవంతులైన మంత్రులున్నారు. ఎలాంటి శాఖ ఖాళీ లేదు. మంత్రి వర్గ విస్తరణపై అధిష్టానంతో ఎలాంటి చర్చా జరపలేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పని చేసి.. మంత్రులను కొన్ని నెలలపాటు పెట్టుకోలేదు. మా కేబినెట్లో అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారు. విద్యాశాఖ నా దగ్గరే ఉంది. ఏమైనా లోపాలు ఉన్నాయా?. ఇప్పటివరకు ఎన్నో సమీక్షలు చేశాను. జీవన్‌రెడ్డి అలక ఎపిసోడ్ గురించి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ పరిణామంతో జీవన్‌రెడ్డి కాస్త మనస్తాపానికి లోనయ్యారు. పీసీసీ వైపు నుంచి కొంత సమన్వయ లోపం కనిపించింది. అందువల్లే ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. జీవన్‌రెడ్డి విషయంలో ఏమైనా జరిగితే బాగుండని గోతికాడ నక్కలు ఎదురు చూశాయి. కానీ, జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌పై ఆయనకున్న నిబద్ధతకు వాళ్లకు అర్థం కాదు. అధిష్టానం జీవన్‌రెడ్డి అనుభవం, నిబద్ధతను దృష్టిలో పెట్టుకుంది.జీవన్‌రెడ్డి గౌరవానికి భంగం కలగడని అధిష్టానం ఆహామీ ఇచ్చింది. సమయం, సందర్భం వచ్చినప్పుడు జీవన్‌రెడ్డి అనుభవాన్ని వినియోగించుకుంటాం. తెలంగాణకు త్వరలో కొత్త పీసీసీకొత్త పీసీసీపై అధిష్టానంతో చర్చ జరిగింది. పీసీసీ చీఫ్ ను నియమించమని కోరా. ప్రస్తుతం నా పీసీసీ పదవి కాలం జులై 7వ తేదీతో ముగుస్తుంది. నా హయాంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పీసీసీ ఎంపిక విషయంలో తగిన న్యాయం జరగుతుందని భావిస్తున్నా. బీఆర్ఎస్కు ఛాన్స్ ఇవ్వలేదుఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. తెలంగాణ ప్రజలకు రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయబోతున్నాం. ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తయ్యాయి. దానిపై విమర్శించడానికి బీఆర్ఎస్కు అవకాశం లేకుండా పోయింది. శాంతిభద్రతలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం.కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం త్వరలో ప్రధాని, కేంద్ర మంత్రుల్ని కలుస్తాం. పక్క రాష్ట్రంతో పునర్విభజన ప్రయోజనాల కోసం చర్చిస్తాం. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం వేస్తాం. తెలంగాణను రోల్ మోడల్ స్టేట్‌గా తీర్చి దిద్దుతాం. భేషజాలకు పోకుండా మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం అని రేవంత్ అన్నారు. -
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
నేతలు పార్టీలు మారడం, సిద్ధాంతాలు మార్చుకోవడం రాజకీయాల్లో పరిపాటే. చాలా ఏళ్లుగా ఉన్న ధోరణే. కానీ సిద్ధాంతాలు, విలువలకు పెద్దపీట వేస్తామని చెప్పుకునే బీజేపీ కొన్నాళ్లుగా ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేస్తుండటం విశేషం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బరిలో ఉన్న 435 మంది బీజేపీ అభ్యర్థులను గమనిస్తే ఆశ్చర్యకరమైన వివరాలు తెలుస్తాయి. వీరిలో ఏకంగా 106 మంది, అంటే నాలుగో వంతు అభ్యర్థులు గత పదేళ్లలో కమలం గూటికి వలస వచి్చనవాళ్లే! అందులోనూ 90 మంది గత ఐదేళ్లలో బీజేపీలోకి ఫిరాయించారు! ఈసారి ఎలాగైనా 2019 కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు సాధించాలని అధికార బీజేపీ ప్రయతి్నస్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రాంతీయ పారీ్టల్లో టికెట్లు రాని వారు, మోదీ మేనియా కలిసొస్తుందని భావించిన వాళ్లు ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా వారిలో ఏకంగా ఐదుగురు 2019 తర్వాతే పార్టీ తీర్థం తీసుకోవడం విశేషం! తెలంగాణలోనూ 17 మంది బీజేపీ అభ్యర్థుల్లో 11 మంది 2014 తర్వాత వచ్చి చేరిన వారే. వీరిలో చాలామంది మాజీ కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ నేతలే. ఇతర రాష్ట్రాల్లోనూ అంతే.. ఏపీ వంటి చోట్ల బీజేపీ బలహీనంగా ఉంది గనుక వలస నేతలకు పెద్దపీట వేసిందనుకుంటే పార్టీ అత్యంత బలోపేతంగా ఉన్న యూపీ, హరియాణా తదితర చోట్లా ఇదే బాట పట్టడం ఆశ్చర్యం కలిగించేదే! హరియాణాలోని 10 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్నవారిలో ఆరుగురు 2014 తర్వాత పారీ్టలో చేరినవారే. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ అయితే లోక్‌సభ ఎన్నికల ముందే బీజేపీ కండువా కప్పుకున్నారు. పీసీసీ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ కూడా అంతే. ఇక యూపీలో బీజేపీ సొంతంగా పోటీ చేస్తున్న 74 లోక్‌సభ స్థానాలను చూస్తే 23 చోట్ల బరిలో ఉన్నవాళ్లు బయటి నుంచి వచి్చనవారే. అంటే ఏకంగా 31 శాతం! పంజాబ్‌లోని 13 స్థానాల్లో ఏకంగా ఏడుగురు బీజేపీ అభ్యర్థులు వలస వచి్చన బాపతే. వీరిలో చాలామంది కాంగ్రెస్ మాజీలే. వీరు చాలావరకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసినప్పుడు బీజేపీలోకి వచ్చారు. జార్ఖండ్‌లో కూడా 13 మంది బీజేపీ అభ్యర్థుల్లో ఏడుగురు జేఎంఎం, కాంగ్రెస్, జార్ఖండ్ వికాస్ మోర్చాల నుంచి జంప్ చేసిన నేతలే. వీరిలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ మరదలు సీతా సోరెన్ కూడా ఉన్నారు. ఒడిశాలో 29 శాతం, తమిళనాడులో 26 శాతం మంది బీజేపీ అభ్యర్థులు ఫిరాయింపుదారులే! మహారాష్ట్రలోనూ పావు వంతు బీజేపీ అభ్యర్థులు బయటి నుంచి వచ్చిన బాపతే. ఎందుకని..? బీజేపీ బలహీనంగా ఉన్న ఏపీ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలే గాక బలంగా ఉన్నచోట కూడా ఇలా ఫిరాయింపులను భారీగా ప్రోత్సహిస్తుండటం వెనుక విజయమే పరమావధి అంటున్నారు. మరీ ముఖ్యంగా గత రెండు లోక్‌సభ ఎన్నికల నుంచి యూపీలో బీజేపీ హవా నడుస్తోంది. అయినా అక్కడ కూడా 31 శాతం మంది వలసదారులకు టికెట్లివ్వడం ఇందుకు నిదర్శనం. ప్రత్యర్థి పారీ్టలు బలమైన అభ్యర్థులను దింపిన చోట బీజేపీ ప్రధానంగా ఫిరాయింపుదారులనే నమ్ముకుంది. తనకు గెలుపు గుర్రాలు లేరనుకున్న లోక్‌సభ స్థానాల్లో ఇతర పారీ్టల నుంచి బలమైన నాయకులను ఆకర్షించేందుకు బీజేపీ ఏమాత్రం వెనుకాడటం లేదు!ప్రముఖ జంపర్లు జ్యోతిరాదిత్య సింధియా (కేంద్ర మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత–గుణ) జితిన్ ప్రసాద (కాంగ్రెస్ మాజీ నేత–పిలిభీత్) నవీన్ జిందాల్ (ప్రముఖ పారిశ్రామికవేత్త–కురుక్షేత్ర) అశోక్ తన్వర్ (హరియాణా పీసీసీ మాజీ చీఫ్–సిర్సా) ప్రణీత్ కౌర్ (అమరీందర్‌సింగ్ భార్య–పటియాలా) సీతా సోరెన్ (జేఎంఎం ఎమ్మెల్యే–దుమ్కా)– సాక్షి, నేషనల్ డెస్క్ -
జంపింగ్ జపాంగ్స్.. లాభమెంత.. నష్టమెంత?
రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదని అంటారు. అలాగే ఏ నాయకుడు ఎలా పార్టీ మారవలసి వస్తుందో కూడా చెప్పలేం. రకరకాల పరిణామాలు ఇందుకు దోహదపడుతుంటాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలను పరిశీలిస్తే, ఈసారి జరిగినన్ని ఫిరాయింపులు గత రెండు ఎన్నికలలో జరగలేదని చెప్పాలి. అందులోను కొందరు పెద్ద నాయకులు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతలు పార్టీలు మారవలసిన పరిస్థితులు ఏర్పడడం ఆసక్తికరమైన అంశమే. ఇందుకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం అతీతం కాదు. ఆ పార్టీకి చెందిన కొందరు ప్రముఖులు కూడా వేరే పార్టీలోకి వెళ్లారు. ✍️బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగానే 115 స్థానాలకు అభ్యర్దులను ప్రకటించి దాదాపు అందరికి బిఫారంలు ఇచ్చేశారు. దాంతో కొంత గడబిడ జరిగినా, సర్దుకోవడానికి టైమ్ దొరికింది. కాని కాంగ్రెస్, బీజేపీలు అలా చేయలేకపోయాయి. దాంతో ఆ పార్టీలు అసమ్మతులతో కొంత ఎక్కువ సతమతం అయ్యాయి. బుజ్జగింపులలో కాంగ్రెస్ కొంతవరకు సఫలం అయినా, బీజేపీ మాత్రం అంత సత్ఫలితం సాధించలేకపోయిందనే చెప్పాలి. తాజాగా మాజీ ఎంపీ, ప్రముఖ నటి విజయశాంతి కూడా బీజేపీకి గుడ్ బై చెప్పడం విశేషం. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ప్రముఖుల గురించి చూద్దాం. ✍️సాధారణంగా పార్టీ టిక్కెట్ ఇచ్చిన తర్వాత ఫిరాయించడం అరుదుగా జరుగుతుంటుంది. మల్కాజిగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడికి మెదక్ టిక్కెట్ కోరుతూ పార్టీలో రగడ సృష్టించారు. అందుకోసం తన మల్కాజిగిరి టిక్కెట్ కూడా వదలుకుని, రెండు సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్‌లో చేరడం సంచలనమే. టిక్కెట్లు రాని కొందరు నేతలు కూడా ఇలాగే పార్టీ మారారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లారు. సీనియర్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లవలసి వస్తుందని ఆయన అనుచరులు ఎవరూ అనుకుని ఉండరు. ✍️ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ కన్నా ముందే మంత్రి పదవి పొందిన తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా వెనుకబడ్డారు. ఆ తరుణంలో కేసీఆర్ ఆయనను ఆహ్వానించి పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారు. తదుపరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పాలేరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే ఆ సీటు కేటాయించారు. ఆ ఎన్నికలో గెలిచారు కాని, సాధారణ ఎ న్నికలో ఓటమి చెందారు. దాంతో తుమ్మల రాజకీయం తిరగబడినట్లయింది. ఆయనకు అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్ ఇచ్చి ఉంటే బీఆర్ఎస్లో కొనసాగేవారు. కాని అందుకు కేసీఆర్ సిద్దపడలేదు ✍️దానికి కారణం కాంగ్రెస్ పక్షాన గెలిచి, బీఆర్ఎస్లోకి వచ్చిన ఉపేందర్ రెడ్డికి సీటు ఇవ్వవలసి రావడమే. దాంతో అసంతృప్తి చెందిన తుమ్మల పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు ఏ పార్టీతో అయితే పోరాడారో ఆ పార్టీలోకే వెళ్లవలసి వచ్చింది. ఈ పిరాయింపుపై కేసీఆర్, తుమ్మల మధ్య మాటల విమర్శలు కూడా జరిగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పిన తుమ్మలకు ఈసారి పెద్ద పరీక్షే కావచ్చు. ✍️ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఆయన తలపడుతున్నారు. మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచినా, మారిన రాజకీయాలలో ఆయన అధికార బీఆర్ఎస్లో చేరిపోయారు. కాని 2018 ఎన్నికలలో ఆయనకు టిక్కెట్ రాలేదు. అయినా ఓపికగా ఈ ఐదేళ్లు వేచి చూశారు. కాని ఆశ్చర్యంగా ఈసారి అసెంబ్లీ టిక్కెట్ కూడా రాలేదు. ఇక లాభం లేదని కాంగ్రెస్‌తో బేరం ఆడుకుని జంప్ చేసేశారు. ఒకదశలో బీజేపీకి వెళతారని అనుకున్నా, ఖమ్మం ప్రాంతంలో ఆ పార్టీ పుంజుకోలేదని అంచనాకు వచ్చి కాంగ్రెస్ వైపు వెళ్లి పాలేరు నియోజకవర్గంలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ✍️కొల్లాపూర్‌లో ఐదుసార్లు గెలిచిన జూపల్లి కృష్ణారావు గత ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. అప్పుడు గెలిచిన హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరడంతో కృష్ణారావుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ఆయన ఆగ్రహంతో కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగాను, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగాను, అంతకుముందు కాంగ్రెస్‌లో కూడా ప్రముఖుడుగా రాణించిన జూపల్లె మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకుని బీఆర్ఎస్ సవాల్‌కు సవాల్ విసురుతున్నారు. ✍️గతసారి కాంగ్రెస్ తరపున గెలిచి ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్లోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలలో దాదాపు అందరికి కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. వారిలో సబితా ఇంద్రారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, పైలల్ రోహిత్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభృతులు ఉన్నారు. బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి రాక పోవడంతో కాంగ్రెస్‌లో చేరిన వారిలో పాయం వెంకటేశ్వర్లు, వేముల వీరేశం, వంటివారు ఉన్నారు. టిక్కెట్ రానందున అసంతృప్తి చెంది కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన ప్రముఖులలో డాక్టర్ నాగం జనార్దనరెడ్డి ఉన్నారు. ఆయన ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వీడి తెలంగాణ నగారా పేరుతో సొంత బానర్‌పై ఉప ఎన్నికలలో పోటీచేసి గెలిచిన నాగం రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా దెబ్బతిన్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పలు పోరాటాలు సాగించారు. ✍️ఆయన కొంతకాలం బీజేపీలోను, తదుపరి కాంగ్రెస్ లోను చేరారు. కాని కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రత్యర్ధి కె.దామోదరరెడ్డి కుమారుడికి నాగర్ కర్నూల్ టిక్కెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. ఈయన కూడా కేసీఆర్ సమకాలికుడే. కేసీఆర్ కన్నా ముందుగానే మంత్రి అయ్యారు. కేసీఆర్‌ను చాలాకాలం వ్యతిరేకించిన నాగం, పాత స్నేహితుడే బెటర్ అనుకుని గులాబి కండువా కప్పుకున్నారు. ✍️పీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్యయ్య కూడా జనగామ టిక్కెట్ పై కాంగ్రెస్‌తో విభేధించి పార్టీకి దూరం అయి బీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల సమయంలో పార్టీకి నాయకత్వం వహించిన పొన్నాల 2023 ఎన్నికల సమయానికి బీఆర్ఎస్లోకి వచ్చారు. అయితే నాగం, పొన్నాల లకు ఇక్కడ కూడా టిక్కెట్ ఇవ్వకపోయినా, అధికారం వచ్చాక వారికి గుర్తింపు ఇస్తామన్న హామీని మాత్రం పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక భూమిక పోషించిన చెరుకు సుధాకర్ కూడా సొంత పార్టీ పెట్టుకుని తర్వాత దానిని కాంగ్రెస్ లో కలిపినా ,టిక్కెట్ రాకపోవడంతో కోపం వచ్చి చాలాకాలంగా తాను వ్యతిరేకిస్తూ వచ్చిన బీఆర్ఎస్ లో చేరిపోయారు. ✍️గతంలో నకిరేకల్ ఎమ్మెల్యేగా పనిచేసిన వేముల వీరేశం ఈసారి బీఆర్ఎస్ను వదలి కాంగ్రెస్ టిక్కెట్ పై తలపడుతున్నారు. దానికి కారణం గతసారి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బిఆర్ఎస్లో చేరడం, తిరిగి టిక్కెట్ పొందడం.. ఫిరాయింపుల వల్ల ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అవడంతో తుమ్మల తో సహా పలువురు నేతలు తలో దిక్కు అయ్యారు. వారిలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పలువురు టీడీపీ నేతలకు కాంగ్రెస్‌లో ఆశ్రయం కల్పించారు. ములుగు నుంచి గెలిచిన సీతక్క తదితరులు ఇలాంటి వారిలో ఉన్నారు. ✍️తాజాగా మరో నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి టీడీపీని వీడి పరకాల నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీచేస్తున్నారు. సుదీర్ఘకాలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ బీజేపీ పక్షాన మరోసారి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లలో టిక్కెట్లు రాని కొందరు బీజేపీలో టిక్కెట్ తీసుకుని పోటీచేస్తున్నారు. గెలవడం, ఓడడం సంగతి ఎలా ఉన్నా, గేమ్‌లో ఉండాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తుంది. తొలుత బీజేపీకి ఊపు వస్తుందని ఆశించి ఆ పార్టీలో చేరిన మాజీ ఎంపీ వివేక్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వంటి నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం గమనించదగ్గ అంశం. ✍️రాజగోపాలరెడ్డి గత ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన గెలిచి, కొంతకాలం తర్వాత బీజేపీలోకి వెళ్లారు. ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి ఉప ఎన్నికలో తిరిగి నిలిచి ఓటమి చెందారు. బీఆర్ఎస్ను అప్పట్లో బీజేపీనే ఓడించగలదని ఆయన అనేవారు. కాని పరిస్థితి మారడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఎక్కువ మంది కేసీఆర్ అవినీతిపై చర్య తీసుకోవడంలో బీజేపీ విఫలం అయిందని ఆరోపించడం విశేషం. కాంగ్రెస్‌లో టిక్కెట్లు రాని వారు కొందరు బీఆర్ఎస్లో చేరారు. ఈ ఫిరాయింపులలో బీజేపీకి ఎక్కువ నష్టం జరిగినట్లనిపిస్తుంది. ✍️అధికార బీఆర్ఎస్ను కాదనుకుని ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు, ముగ్గురు జడ్పిచైర్ పర్సన్లు కాంగ్రెస్ లోకి వెళ్లారు. అలాగే కాంగ్రెస్ మాజీ మంత్రి పి.జనార్ధనరెడ్డి కుమార్తె విజయారెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరి ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తుంటే, ఆమె సోదరుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ విధంగా తెలంగాణలో ఫిరాయింపుల పర్వం ఈసారి జోరుగా సాగిందని చెప్పాలి. ఎన్నికలకు ముందే ఇన్ని ఫిరాయింపులు జరిగితే ఎన్నికలు అయ్యాక ఇంకెన్ని పార్టీ మార్పిడులు జరుగుతాయో చూడాలి! ::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
కాంగ్రెస్‌కి ఓటు వేస్తే... బీజేపీ ఎమ్మెల్యేని ఎన్నుకున్నట్లే..
న్యూఢిల్లీ: గోవాలోని 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఈ రోజు బీజేపీలోకి వెళ్లడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దా బీజేపీపై పెద్ద ఎత్తున విమర్శల దాడి చేశారు. ఆపరేషన్ కమలం ఢిల్లీ, పంజాబ్‌లలో విఫలమైంది కానీ గోవాలో విజయవంతమైందని ఎద్దేవా చేశారు. అంతేగాదు కాంగ్రెస్‌కి ఓటు వేస్తే మీరు కాబోయే బీజేపీ ఎమ్మెల్యేని ఎన్నకుంటారు అని తెలుసుకోండి అంటూ చద్ధా ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పని అయిపోయిందని, ముక్కులు ముక్కలుగా విడిపోయిందని చెప్పారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ పని ముగిసిందంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్, ఢిల్లీలో బీజేపీ తన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ 20 నుంచి 25 కోట్లకు కొనుగోలు చేయడానికి ట్రై చేసి విఫలమైందని ఆప్ చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి బీజేపీ చేస్తున్న పనిని ఆపరేషన కీచడ్(మడ్)గా వ్యవహరించారు. బీజేపీ అన్ని రకాల వ్యూహాలను ఉపయోగించిందని అన్నారు. గుండాలతో బెదిరింపులు, డబ్బులు ఎర వంటి అన్నింటిని వినియోగించి బీజేపీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందంటూ ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ , సీనియర్ నాయకుడు మైఖేల్ లోబో నేతృత్వంలో సుమారు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరారు. కాంగ్రెస్ ఈ దుశ్చర్యను జులైలో అడ్డుకోగలిగింది కానీ రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర(యునైట్ ఇండియా మార్చ్) లో ఉండటంతో అదును చూసి బీజేపీ ఈ వ్యూహానికి తెరలేపిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. (చదవండి: బీజేపీలో ప్లాన్ సక్కెస్..గోవాలో కాంగ్రెస్ ఖాళీ) -
ప్రధాన పార్టీలకు..వలసల దెబ్బ
గోవా రూటే సెపరేటు.. ఆ రాష్ట్రంలో ఫిరాయింపులు సర్వసాధారణం. అతి చిన్న రాష్ట్రమైన గోవాలో పార్టీ కంటే నాయకులే అత్యంత శక్తిమంతులు. పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాలు కూలదోయగలరు, వాటితోనే ప్రభుత్వాలను నిలబెట్టగలరు. ఇప్పుడు కూడా ఆయారామ్, గయారామ్ సంస్కృతి పెరిగి గందరగోళానికి దారితీస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ గోవాలో పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఎటు దూకుతారో తెలియక అన్ని పార్టీలు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీ, కాంగ్రెస్ హవా కొనసాగిన గోవాలో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో నాలుగు స్తంభాలాట (ఆమ్ ఆద్మీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇక్కడ బరిలోకి దిగింది) నెలకొంది. దీంతో నాయకుల పక్క చూపులు ఎక్కువయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువగా ఆపరేషన్ ఆకర్‡్ష నిర్వహిస్తోంది. ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో అత్యంత ప్రభావం చూపించే నాయకులపై వల విసురుతోంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న తృణమూల్ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి సై అంటోంది. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి అయిన లూయీజిన్హో ఫలేయిరో 2021 సెప్టెంబర్‌లో తృణమూల్‌లో చేరడంతో ఈ ఫిరాయింపుల పర్వం మొదలైంది. వెంటనే ఆయన్ను రాజ్యసభకు పంపిన మమతా బెనర్జీ ఎవరొచ్చినా తగిన గౌరవం ఇస్తామని సంకేతాలు పంపారు. గోవా మరో మాజీ సీఎం, ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో కూడా పార్టీని వీడి టీఎంసీలో చేరారు. వీరిద్దరి రాకతో కేథలిక్కుల్లో తృణమూల్‌కు పట్టు లభించినట్టయింది. గత ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఇద్దరే మిగిలి ఉండడం పార్టీ దుస్థితిని చాటిచెబుతోంది. 2017లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, 2019లో ఏకంగా 10 మంది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. తర్వాత గత ఏడాది మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడారు. అధికార బీజేపీలో సొంత పార్టీ మంత్రులే అవినీతి ఆరోపణలు చేయడంతో ఆ పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతోంది. బీజేపీకి క్రిస్టియన్లు దూరమవుతున్నారా? గోవాలో బీజేపీ క్రిస్టియన్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. కలంగుటే ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో బీజేపీకి రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. గోవాలో మెజార్టీ జనాభా హిందువులైనప్పటికీ 2011 లెక్కల ప్రకారం 25% క్రిస్టియన్లు ఉన్నారు. మనోహర్ పారిక్కర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్లను ఆకర్షించే కార్యక్రమాలు నిర్వహించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాలను గెలిస్తే వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలు క్రిస్టియన్లు కావడం విశేషం. గత నెలలో కార్టోలిమ్ ఎమ్మెల్యే అలీనా సల్దాన్హా బీజేపీకి రాజీనామా చేసి ఆప్‌లో చేరారు. మరో క్రిస్టియన్ ఎమ్మెల్యే వాస్కో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్లోస్ అల్మీదా కాంగ్రెస్‌లో చేరారు. ఇక వెలిమ్ ఎమ్మెల్యే, మంత్రి ఫిలిప్ నెరి, రోడ్రిగెజ్ ఎమ్మెల్యే బాబాసన్ త్వరలోనే బీజేపీని వీడతారని ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి మైఖేల్ లోబో తన భార్య దలిలాకి కూడా టికెట్ ఆశించారు. అది వచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీని వీడారన్న ఊహాగానాలు ఉన్నాయి. ఉత్తర గోవాకి చెందిన లోబోకు 5–6 నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓడిపోతామన్న భయంతోనే వీరంతా రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మదర్ థెరిసా నెలకొల్పిన మిషనరీస్ ఆప్ చారిటీకి విదేశీ విరాళాల సేకరణకు లైసెన్స్ పునురుద్ధరించకపోవడం.. ఆపై విమర్శలు రావడంతో 15 రోజుల తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓకే చెప్పడం తెలిసిందే. ఈ పరిణామాలు క్రిస్టియన్లలో బీజేపీపై ఆగ్రహం తెప్పించి ఉంటాయని ఈ నాయకులు భయపడుతున్నారు. అంతా గందరగోళం ఎమ్మెల్యేలు, నేతలు పార్టీలు మారుతుండటంతో ఎవరెక్కడ ఉన్నారోననే తీవ్రమైన గందరగోళం నెలకొంది. దీంతో ఓటర్లు ఎవరివైపు ఉంటారో చెప్పడం తలపండిన రాజకీయ విశ్లేషకులకు కూడా సాధ్యం కావడం లేదు. ‘‘బీజేపీ తీవ్ర అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కానీ టీఎంసీ ఎన్నికల బరిలోకి రావడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి దెబ్బపడింది. గత ఎన్నికల్లో 6.3 శాతం ఓటు షేర్ సాధించిన ఆప్ క్రమంగా బలం పుంజుకుంటోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమైతేనే అధికార బీజేపీని ఓడించగలరు’’ అని ఎన్నికల విశ్లేషకుడు క్లాఫాటో కౌంటిన్హో అభిప్రాయపడ్డారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
కాంగ్రెస్‌లో అసమ్మతి.. రుచి గుప్తా రాజీనామా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సినీయర్ నేతలు పార్టీ నుంచి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిలో రుచి గుప్తా కూడా చేరారు. విద్యార్థుల విభాగం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీకి ఇంచార్జీగా తన పదవికి రుచి శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రుచి గుప్తా ఓ సందేశం విడుదల చేశారు. పార్టీ సంస్థాగత మార్పులలో జాప్యం కారణంగానే తాను కాంగ్రెస్ పార్టీని విడానన్నారు. ‘ప్రియమైన అందరికి.. నేను రాజీనామ చేసినట్లు ప్రకటించడం కోసమే ఈ లేఖ రాస్తున్నాను. పార్టీలో ముఖ్యమైన సంస్థాగత మార్పులు చాలా కాలం నుంచి పెండింగ్‌లో పడుతున్న విషయం తెలిసిందే. దాదాపు 1 సంవత్సరం 3 నెలలుగా దీనిపై జాతీయ కమిటీ నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాలు నెలల తరబడి పెండింగ్‌లో పడుతూనే ఉన్నాయి. (చదవండి: అసమ్మతి నేతలతో సోనియా భేటీ) కొత్త కార్యకర్తలకు పార్టీలో స్థానం కల్పించేందుకు ఇతర రాష్ట్ర యూనిట్లు వేచి చూస్తున్న క్రమంలో జీఎస్(ఓ) నిరంతర జాప్యాలు పార్టీని దెబ్బతీస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు పదే పదే జాప్యం చేయడం కూడా సరైనది కాదు’ అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రుచి గుప్తా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌పై అసహనం వ్యక్తం చేశారు. సంస్థాగత మార్పులు తరచూ వాయిదా పడటానికి అతడే ప్రధాన కారణమని గుప్తా ఆరోపించారు. అయినప్పటికీ ఈ విషయం పార్టీ అధ్యక్షురాలు సోనియాకు ఎప్పటికి చేరలేవన్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరగాలని సోనియా గాంధీకి సినీయర్ నాయకులు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగతంపై చర్చిందుకు పార్టీ సినీయర్ నాయకులతో సోనియా ఇవాళ భేటి అయ్యారు. (చదవండి: పరువు నష్టం: సారీ చెప్పిన సీనియర్ నేత) -
ఫిరాయింపులకు పరిష్కారం చూడండి
న్యూఢిల్లీ: ఎన్నికైన చట్ట సభల సభ్యులు సొంత పార్టీ నుంచి వేరే పార్టీకి ఫిరాయించే అనైతిక చర్యలను నిరోధించేలా ఒక పరిష్కారం చూపాలని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభలో గురువారం జీరోఅవర్ సందర్భంగా వెంకయ్యనాయుడు పై సూచన చేశారు. ‘దురదృష్టవశాత్తూ వారు అంటున్నారు ఇది ఫిరాయింపు(డిఫెక్షన్) కాదు.. అభిమానం(అఫెక్షన్) అని. వారు ఆ ఫిరాయింపును ఫర్ఫెక్షన్తో చేస్తున్నారు. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సమస్య ఇది’ అని ఫిరాయింపు నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈ అనైతిక చర్యకు ముగింపు పలికేందుకు అన్ని రాజకీయ పార్టీలు సూచనలు చేయాలని కోరారు. -
ఫిరాయింపులపై జాప్యం వద్దు
డెహ్రాడూన్: చట్టసభల్ని నడిపించే స్పీకర్లు తటస్థంగా వ్యవహరించాలని, ఫిరాయింపుదార్ల ఆటకట్టించేలా నిర్ణీత కాలవ్యవధిలో నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో బిర్లా మాట్లాడారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగుల్ని సమీక్షించడానికి కొన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతో ఒక కమిటీ ఏర్పడిందని, త్వరలోనే అది తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. ఫిరాయింపులపైనే సదస్సులో చర్చ అసెంబ్లీ స్పీకర్ల సమావేశంలో చివరిరోజైన గురువారం ఫిరాయింపులపైనే ఎక్కువగా చర్చ జరిగిందని ఓం బిర్లా వెల్లడించారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లోని ఫిరాయింపు నిరోధక చట్టంపైనే విస్తృతంగా చర్చించామని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాజ్యాంగబద్ధంగా తటస్థులుగా ఉండాల్సిన స్పీకర్లు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే స్పీకర్ల సదస్సులో ఫిరాయింపుల అంశంపై విస్తృతంగా చర్చించారు. ముగింపోత్సవంలో మాట్లాడిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్టీ ఫిరాయింపులు అత్యంత ఆందోళనకరమైనవని అన్నారు. -
మేం తలుపులు తెరిస్తే మీ పార్టీలు ఖాళీ
సోలాపూర్: అసెంబ్లీ ఎన్నికల ముందు తమ పార్టీ నేతలను బీజేపీలో అక్రమంగా చేర్చుకుంటున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీలకు హోం మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చురకలంటించారు. బీజేపీ తలుపులు తెరిస్తే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ తప్ప ఎన్సీపీ, కాంగ్రెస్‌ల్లో ఎవరూ మిగలరన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిన మహాజనాదేశ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ఇటీవల పలువురు నేతలు శివసేన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ ఐరాసలో పిటిషన్ వేయడానికి వాడుకుందని, ఇందుకు ఆ పార్టీ సిగ్గు పడాలని అమిత్ షా అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో హింస పెరిగిందని రాహుల్ వ్యాఖ్యానించారని, కానీ అక్కడ ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదని, ఒక్క ప్రాణం పోలేదని అన్నారు. దేశ హితం కోసం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు గతంలో ప్రతిపక్షాలు సహకరించేవని, కాంగ్రెస్ ఆ సంప్రదాయాన్ని మంట కలిపిందని మండిపడ్డారు. దేశ సమగ్రతను, ఏకత్వాన్ని కాపాడేందుకు పార్టీలకు అతీతంగా తమకు అండగా నిలబడాలని కోరారు. (చదవండి: మోదీపై విమర్శలు.. పాక్ మంత్రికి కరెంట్ షాక్!) -
వడ్డించేవాడు మనవాడయితే...!
పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు పొరుగు రాజకీయ పార్టీవారి ఎమ్మెల్యేలు అధికారపార్టీకి అంత రుచిగా ఎందుకుంటారు? సైకిల్ గుర్తుకు జనం ఓటేస్తే కమలం పూలు చెవిలో ఎందుకు పెట్టుకుంటున్నారు? చేతికి చేయిచ్చి కారెందుకు ఎక్కుతున్నారు? ఫిరాయింపు ఇంత యింపుగా ఎందుకుంది? ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పచ్చ కండువాలు తీసేసి కాషాయం కప్పుకున్నారు నలుగురు రాజ్యసభ సభ్యులు. ఎమ్మెల్యేలు ఎటు పోవాలో అని ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలామంది వైస్సార్సీపీలో చేరడానికి కూడా సిద్ధపడ్డారని, కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తేనే తలుపు తీస్తామని కొత్త సీఎం షరతు పెట్టడంతో గేట్లు బందైపోయి వారంతా ప్రజాసేవ చేయడానికి మార్గాలు కనబడక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం గేట్లు బార్లా తెరిచి, ఎర్రతివాచీ పరిచి సిద్ధంగా ఉంది. ప్రధాన మంత్రి, పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ అధ్యక్షుడు తదితర పెద్దలతో గోడ దూకిన వారి ఫోటోలు తీయడానికి మీడియా కెమెరాలు సిద్ధం చేసి ఉంచారు. ఆ నలుగురి తరువాత ఇంకా ఎవరూ రాలేదేమిటి చెప్మా? తెలంగాణా వెనుకబడి ఉందనుకుంటున్నారా? పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జెండాలు వదిలేసి గులాబీ కండువాలు కప్పుకున్నారు. చేయికి చేయిచ్చిన ఎమ్మెల్యేల వల్ల పాపం కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. పన్నెండుమంది ప్రజాసేవ చేయాలనుకున్న మహోన్నత లక్ష్యం ముందు ఒక్క నాయకుడి ప్రతిపక్ష హోదా ఉంటేనేం పోతేనేం. ఎందుకు పార్టీలు మారతారో పిచ్చి జనానికి ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు. జనం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కోపం రాదా? వచ్చింది. తమ వాక్ స్వాతంత్య్రాన్ని వారు కూడా వాడుకున్నారు. మేం గొర్రెలమా బర్రెలమా అమ్ముడు బోవడానికి? అని కళ్లెర్రజేసారు. ఒక్కొక్కళ్లమే టీఆర్ఎస్లో చేరికతో మమ్మల్ని అనాలె. పన్నెండో వాడు వచ్చేదాకా ఆగినం కదా. మేం భారత రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా పాటిం చాం. తూట్లు పొడవలేదు తెలుసా అని రాజ్యాంగసూత్రపు అరటిపండు ఒలిచిపెట్టారు. మా పరువు తీసే వ్యాఖ్యలపైన మేం పరువు నష్టం కేసులు పెడతాం అని కూడా ప్రకటించారు. ఎమ్మెల్యేలు పరువు పోతే బతకగలరా? ఏం వారేమయినా పార్టీని పెళ్లిచేసుకుని తాళి గట్టించుకున్నారా జీవితాంతం బానిసల్లా పడి ఉండడానికి? రాజ్యాంగం, చట్టం, కోర్టులు వీరి పరువును వీరి హక్కులను, బాధ్యతలను కాపాడటానికి లేవా? 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉంటేనేం. మా పరువు కేసులు ముఖ్యం కాదా అని వారన్నా అనగలరు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమకు టిక్కెట్ ఇచ్చిన పార్టీ పట్ల కృతఘ్నులుగా ఉన్నారని అనడానికి ఏ మాత్రం వీల్లేదు. ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీకి విలువైన సలహా ఇచ్చారు. కార్పొరేట్ కన్సల్టెన్సీ వారైతే లక్షడాలర్లు ఫీజు వసూలు చేసేవారు. కానీ ఉచితంగా అదీ ఎంతో పారదర్శకంగా ఇచ్చారు. ‘అసలు కాంగ్రెస్ 2014 నుంచి ప్రతి ఎన్నికలో ఎందుకు ఓడిపోతున్నదో’ అంతరాత్మను అడగాలట. ‘మరి ఈ పన్నెండు మంది గెలవడం కాంగ్రెస్ గెలుపు కాదా’ అని మీరడగొద్దు. బుద్ధిగా నోరుమూసుకుని అధికార పార్టీ ఎంఎల్యేలు చెప్పింది వినాలె మరి. ‘గెలిస్తే ఏమిటి. వారంతా టీఆర్ఎస్లో చేరినప్పుడు కాంగ్రెస్ ఓడిపోయినట్టు కాదా?’ అంటారు. అదీ నిజమే. ఏపీలో టీడీపీని చిత్తుగా ఓడించింది వైఎస్సార్సీపీ అయితే నేతలు బీజేపీలో ఎందుకు చేరుతున్నట్టు? గెలిచిన పార్టీలో చేరాలి కదా అని ఒకాయనకు ధర్మసందేహం వచ్చింది. అందువల్ల వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుల బలం పెరిగేది. చేరిన వారికేమో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అండదండలతో బోలెడంత ప్రజాసేవ చేసుకునే వీలు కలిగేది. అయితే ఆ పెద్దల దూరదృష్టి గొప్పది. ఎంపీలంటే కేంద్రంలో ఉండాలి. రాజ్యసభ డిల్లీలో ఉంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది. మన రాష్ట్రంలో వారికి ఒక్కసీటు కూడా లేకపోతేనేం. ఇప్పుడు నాలుగు రాజ్యసభ సీట్లిద్దాం అన్న విశాల భావన, దేశభక్తి ఉదయించినప్పుడు మనం తప్పు బట్టకూడదు. ఈడీ, సీబీఐ, ఐబీ, రిజర్వ్‌బ్యాంక్, తాము ఎగ్గొట్టిన కోట్లరూపాయల అప్పులిచ్చిన ఇతర బ్యాంకుల కన్సార్టియమ్లు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటాయని తెలియదా? అదీగాకుండా మన ప్రియ తమనేతను ఓడించిన రాష్ట్ర ప్రజల సేవకన్నా దేశ ప్రజలందరికీ సేవచేయడం ఇంకా గొప్ప పనికదా. అయినా వడ్డించేవాడు మనవాడయితే, సభాపతులు, చైర్మన్లు మనవాళ్లయితే ఏ పంక్తిలో ఉంటేనేం ఏ పార్టీలో తింటేనేం? వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఫిరాయింపులపై టీడీపీ తీరు హాస్యాస్పదం
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మండి పడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను పార్టీలో చేర్చుకొని, వారిలో నలుగురిని మంత్రులను చేసి.. ఇప్పుడు ఫిరా యింపులపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంద న్నారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు కళా వెంకట్రావు తదితరులు అవగా హనారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శిం చారు. షెడ్యూల్ 10లోని పేరా 4 ప్రకారం మెజారి టీ సభ్యుల తీర్మానం ప్రకారమే టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైందన్నారు. గతంలో ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్ర బాబు ఏ ప్రాతిపదికన సీఎంఅయ్యారో మర్చిపో యారా.. అని ప్రశ్నించారు. తెలంగాణలోని 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది తమదే ప్రధాన గ్రూప్ అంటూ టీఆర్ఎస్లో విలీనమ య్యారని చెప్పారు. సుజనాచౌదరి, సీఎం రమేష్ లు బీజేపీలో చేరాక.. నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను చేర్చుకున్నారంటూ ఎద్దేవా చేస్తున్న టీడీపీకి.. గతంలో వారు టీడీపీ ఎంపీలేనన్న విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. -
ఇదేనా ప్రజాస్వామ్యం?
చట్టాలు చేసిన పెద్దలు అవే చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వర్ధిల్లుతున్న ‘ప్రజాస్వామ్య’ దేశం ప్రపంచంలో భారత్ ఒక్కటే. ఇతర ప్రజాస్వామ్య దేశా లలో అమలు చేయడానికే చట్టాలు చేస్తారు. మనలాగా ఉల్లంఘించడానికి కాదు. కొన్నేళ్ళుగా అత్యంత భ్రష్టుపట్టిన చట్టం ఫిరాయింపుల నిరోధక చట్టం. ఒకసారి ఎన్నికలు పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రజలు విశ్వసి స్తున్నారని ప్రతిపక్షాల సభ్యులు చెప్పడం, తమ నియోజకవర్గం అభివృద్ధి కోసం అధికారపార్టీలో చేరుతున్నామంటూ బొంకడం నిస్సిగ్గుగా సాగుతున్న జాతరలో భాగమైపోయింది. గోవా నుంచి ఇద్దరు కాంగ్రెస్ సభ్యులను ఢిల్లీకి విమానంలో పిలిపించుకొని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వారి మెడలో బీజేపీ కండువా వేసి స్వాగతం పలికితే, పార్టీ ఫిరాయించిన నలుగురు రాజ్యసభ సభ్యులతో ప్రధాని నరేంద్రమోదీ చిరునవ్వులు చిందిస్తూ కబుర్లు చెబుతుంటే, ప్రతిపక్ష సమావే శానికి హాజరైన కారణంగానే జేడీ (యూ) నేత శరద్యాదవ్పైన అనర్హత వేటు వేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అర్జీ ఇచ్చిన కొన్ని గంటలలోనే టీడీపీ సభ్యులను బీజేపీ సభ్యులుగా పార్లమెంటు వెబ్సైట్లో పరిగణిస్తే ఫిరాయిం పుల నిరోధక చట్టాన్ని ఎవరు రక్షించాలి? విభిన్నమైన పార్టీ (పార్టీ విత్ ఎ డిఫరెన్స్)అంటూ తరచు స్వోత్కర్షకు ఒడిగట్టే బీజేపీ అడ్డగోలు ఫిరాయింపులను అనుమతిస్తే ఏమని చెప్పాలి? పార్టీ ఫిరాయింపులపైన ఫిర్యాదు చేసే నైతిక హక్కు కానీ, ఫిరాయించేవారిని తప్పుపట్టే అధికారం కానీ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి వీసమెత్తు కూడా లేదు. అనైతిక, అవకాశవాద రాజకీయాలలో పండిపోయిన టీడీపీ అధినేతకు చట్టాల గురించీ, విలువల గురించీ మాట్లాడే స్థాయి లేదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణాధారమైన సాధారణ ప్రజలకు తమ ప్రతినిధుల అక్రమాలనూ, అవినీతినీ ప్రశ్నించే హక్కు ఉన్నది. ప్రశ్నించవలసిన అవసరం, బాధ్యత కూడా ఉన్నాయి. తమ తీర్పును తుంగలో తొక్కి తాము ఓడించిన పార్టీలో తమ శాసనసభ్యుడు లేదా లోక్‌సభ సభ్యుడు చేరిపోవడం ఆ నియోజకవర్గం ప్రజలు సహించకూడదు. ఇది గోవాలో జరిగినా, తెలంగాణలో జరిగినా, ఆంధ్రప్రదేశ్‌లో జరిగినా ప్రజావంచనే. ‘ఆయారాం, గయారాం’ ‘ఆయారాం, గయారాం’ సంస్కృతి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తు న్నదని గుర్తించిన రాజీవ్‌గాంధీ 1985లోనే ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. చట్టసభలోని ఒక పార్టీ సభ్యులలో మూడింట ఒక వంతు మంది విడిపోతే అది చీలిక అవుతుంది కానీ ఫిరాయింపు కాదని ఈ చట్టం నిర్దేశించింది. ఈ లొసుగును ఉపయోగించుకొని అవకాశవాదులు పార్టీలు ఫిరాయించినా సభ్యత్వం కాపాడుకున్నారు. 1992లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభు త్వంపైన అవిశ్వాసతీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టినప్పుడు టీడీపీ లోక్‌సభ పక్షం చీలిపోయింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు భూపతిరాజు విజయ కుమార్రాజు నాయకత్వంలో ఆరుగురు లోక్‌సభ సభ్యులు చీలిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏడుగురు టీడీపీలో మిగిలారు. ఈ లోపం పూడ్చే ప్రయత్నంలో 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం పిరాయింపుల నిరోధక చట్టం, 1985కు సవరణ చేసింది. సవరించిన చట్టం ప్రకారం లెజిస్లేచర్ పార్టీలో లేదా పార్లమెంటరీ పార్టీలో మూడింట రెండు వంతుల మంది పార్టీ మారాలని నిర్ణయించుకుంటే అది పార్టీ చీలిక అవుతుంది. అనర్హత వేటు పడదు. సవరించిన చట్టంలో కూడా మిగిలిపోయిన కీలకమైన లొసుగు ఏమిటంటే శాసనసభ్యులు పార్టీ ఫిరాయిస్తే, వారిపైన అనర్హత వేటు వేయమని సదరు పార్టీ నాయకత్వం సభాపతికి ఫిర్యాదు చేస్తే సభాపతి వెనువెంటనే నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన లేదు. ప్రధానికీ లేదా ముఖ్యమంత్రికి విధేయులైన సభాపతులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఏళ్ళ తరబడి సభాపతి నిర్ణయం తీసుకోకుండా సాచి వేత ధోరణి ప్రదర్శించినా ప్రశ్నించే వెసులుబాటు న్యాయవ్యవస్థకు లేదు. సభా పతిని కాదని వేటు వేసే అధికారం ఎన్నికల సంఘానికి సైతం లేదు. చట్టంలోని ఈ లోపాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావూ (కేసీఆర్) సంపూర్ణంగా వినియో గించుకున్నారు. 2014–19లో ఆంధ్రప్రదేశ్‌లో 23 మంది శాసనసభ్యులనూ, ముగ్గురు లోక్‌సభ సభ్యులనూ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి ఫిరాయింపజేశారు. తెలంగాణలో టీడీపీని నిర్వీర్యం చేయడానికీ, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాన్ని కేసీఆర్ ఉపయోగించుకున్నారు. ఈ రోజున దేశంలో ఫిరాయింపులకు వ్యతి రేకంగా మాట్లాడుతున్న, వ్యవహరిస్తున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒక్కరే. ఎవరు పార్టీ మారినా అనర్హత వేటు వేయవలసిందిగా సభాపతి తమ్మినేని సీతారాంను జగన్ అభ్యర్థించారు. ఫిరాయింపుల జాఢ్యాన్ని నిరోధించకపోతే ఎన్నికలు అర్థరహితం అవుతాయి. పార్టీల భావజాలాలూ, సిద్ధాంతాలూ బూటకమై ప్రజలను వంచిస్తాయి. పరాజయ ప్రభావమా? ఇక నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే, ఇందులో కనిపించేదంతా నిజమో, కాదో అనే అనుమానం కొందరు వెలి బుచ్చుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న రోజులలోనూ, అధికారం చెలాయించిన కాలంలోనూ చంద్రబాబునాయుడితో అంటకాగిన సుజనాచౌదరీ, సీఎం రమేష్‌లు నిజంగా ఆయన అనుమతి లేకుండా, మరి కొందరు పెద్దల ఆశీస్సులు లేకుండా పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళి సంచలనం సృష్టించారంటే కొందరికి నమ్మశక్యంగా లేదు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నాటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డి సమర్థంగా నిర్మిస్తున్నారనీ, ఆ కారణంగా ప్రజలలో ఆయన ప్రాబ ల్యం విశేషంగా పెరుగుతున్నదనీ గ్రహించిన చంద్రబాబునాయుడు ప్లేటు ఫిరా యించారు. అంతవరకూ ప్రశంసించిన ప్యాకేజీని పక్కన పెట్టారు. ప్రత్యేకహోదా సంజీవని కాదని అప్పటి వరకూ దబాయించి అదే నినాదం పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి నిష్క్రమించారు. అప్పుడు సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వంలో సహాయమంత్రి అయినప్పటికీ ఆయనది కేబినెట్ మంత్రి అశోక్‌గజపతి రాజు కంటే ఎక్కువ పెత్తనం. బీజేపీ నాయకులతో సంబంధాలూ, హడావిడీ అంతా ఆయనదే. 2004 నుంచి 2014 వరకూ పార్టీ కార్యకలాపాలు సుజనాచౌదరి ఇంటి నుంచే జరిగేవి. పార్టీ కోసం చంద్రబాబునాయుడు హెరిటేజ్ బ్యాంకు ఖాతా నుంచి నయాపైసా తీయలేదు. సుజనాచౌదరి వంటి సంపన్న నాయకులే ఖర్చులు భరించారు. పార్టీలో లోకేశ్ ప్రాధాన్యం పెరిగిన కొద్దీ సుజనాచౌదరి ప్రాముఖ్యం తగ్గుతూ వచ్చింది. సుజనా ఆధ్వర్యంలోని సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్యాంకులకు 5,700 కోట్ల మేరకు టోపీ పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్, ఆదాయంపన్ను శాఖల అధికారులు తమ కార్యాలయాలపైనా, నివాసాలపైనా దాడులు చేయడం ఎన్డీఏ నుంచి టీడీపీ నిష్క్రమించిన కారణంగానేనని సుజనాచౌదరి, మరో రాజకీయ వ్యాపారి సీఎం రమేష్ భావిస్తున్నారు. ‘నేను టీడీపీ ఎంపీని కనుకనే నన్ను టార్గెట్ చేశారు. మోదీనీ, బీజేపీని వ్యతిరేకించేవారిని వేధించే ప్రయత్నం ఇది. కేంద్రాన్ని ఎవరు ప్రశ్నిస్తే వారిపైన ఆదాయంపన్ను శాఖ దాడులు చేస్తున్నది’ అంటూæ రమేష్ ఘాటుగా ఆరోపించి ఎన్నో మాసాలు కాలేదు. సుజనాచౌదరికీ, రమేష్‌కీ టీడీపీ ఎన్డీఏని వీడటం బొత్తిగా ఇష్టం లేదు. తమ నాయకుడు అపర చాణక్యుడనీ, మోదీ పరాజయం ఖాయమనీ, మోదీ వ్యతిరేకులను ఒక తాటిమీదికి తెచ్చి, రాహుల్‌గాంధీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి వెనక నుంచి ఆయనే చక్రం తిప్పుతాడనే ఆశతో ఎన్నికలు పూర్తయ్యే వరకూ కించిత్ ఆశా భావంతో మౌనంగా ఉండిన సుజన, రమేష్‌లు ఓట్ల లెక్కింపులో టీడీపీ గల్లంతు కాగానే తమ దారి తాము చూసుకోవాలనీ, ఆత్మరక్షణ కోసం బీజేపీలో చేరడం వినా గత్యంతరం లేదనీ తీర్మానించుకున్నారు. రాజ్యసభ సీటు కోసం భారీ ఖర్చు చేసిన టీజీ వెంకటేశ్‌కు పార్టీ పట్ల విధేయత ఉండాలనుకోవడం అత్యాశ. తెలంగాణలో టీడీపీ ఉనికి లేదు కనుక బీజేపీలోకి వెళ్ళాల్సి వచ్చిందని గరికపాటి మోహనరావు చెప్పవచ్చు. నలుగురికీ చెప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉంది. వ్యూహంలో భాగమా? ఈ నలుగురు ఎంపీలు తామంతట తామే బీజేపీలోకి వెళ్ళారా లేక టీడీపీ అధి నేత వ్యూహంలో భాగంగానే బీజేపీ పంచన చేరారా? అనే ప్రశ్న ఒకటి వినిపి స్తున్నది. ఈ విధంగా అనుమానించడానికి చంద్రబాబునాయుడు మార్కు రాజ కీయం కారణం. ఆత్మరక్షణతో పాటు తమ అధినేతపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడకుండా మోదీ, షాలను ప్రభావితం చేయడం కోసమే సుజన, రమేష్‌లను బీజేపీలోకి పంపించారనేది కొందరి వాదన. పార్టీలో చేరినంత మాత్రాన దర్యాప్తులు ఆగవంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటిం చారు. విచారణ జరిగి తనను దోషిగా నిర్ధారిస్తే తనకు అభ్యంతరం లేదంటూ సుజనాచౌదరి ‘ఇండియా టుడే’తో అన్నారు. అటువంటిది ఏమీ జరగదనే విశ్వాసం ఆయన మాటలలో ధ్వనించింది. ‘చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా మీరు అప్రూవర్‌గా మారబోతున్నారా?’ అంటూ ఒక న్యూస్‌చానల్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ‘అటువంటిది ఏమీ లేకపోగా, టీడీపీకి ఏ మాత్రం ఉపయోగ పడినా నేను సంతోషిస్తాను,’ అని చౌదరి వ్యాఖ్యానించారు. మోదీ,షాలు ఏదీ మరచిపోరనీ, ఎవ్వరినీ క్షమించరనీ ప్రతీతి. అందుకే యూరోప్‌లో పర్యటిస్తూ కూడా చంద్రబాబునాయుడు అమరావతిలో పార్టీ నేతలతో ఫోన్లో మాట్లాడి నప్పుడు తాను మోదీకి వ్యతిరేకంగా ఏమీ చేయలేదనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడాననీ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ పూర్తయిన తర్వాత 42 రోజులకు కానీ ఓట్ల లెక్కింపు జరగలేదు. ఆ వ్యవధిలో విహార యాత్రకు వెళ్ళకుండా ఇప్పుడు ఎందుకు నారావారి కుటుంబం యూరోప్ వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్ పోలింగ్ అనంతరం ఢిల్లీ, లక్నో, కోల్‌కతా, బెంగళూరు వగైరా నగరాలను చుట్టి మోదీ వ్యతిరేకులను కూడగట్టి ప్రతిపక్షంలో ఐక్యత సాధించిన నాయకుడుగా పేరు తెచ్చుకోవాలనే తాపత్రయంతో కాలికి బలపం కట్టుకొని తిరిగారు కనుక తీరిక లేక విహారయాత్రకు వెళ్ళలేకపోయారా? నలు గురు ఎంపీలు పార్టీ నుంచి బీజేపీలోకి గెంతే సమయంలో తాను విదేశీపర్యట నలో ఉండాలన్నది ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్టా? అంటూ సందేహం వెలి బుచ్చుతున్నవారు ఉన్నారు. రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో బీజేపీ ముందరి కాళ్ళకు బంధం వేసినట్టు ఉన్నది. ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ ఇస్తున్న లెక్క ప్రకారం నలుగురు టీడీపీ సభ్యుల చేరికతో రాజ్యసభలో బీజేపీ బలం 71 నుంచి 75కి పెరిగింది. ఎన్డీఏ ఎంపీల సంఖ్య 108కి చేరింది. ఇంకా 18 మంది ఎంపీలు చేరితే కానీ 245మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో ఎన్డీఏకి సాధారణ మెజారిటీ సిద్ధించదు. రాజ్యాంగ సవరణ ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ రావాలంటే మరో ఏడాది ఆగాలి. యూపీఏకి 66 స్థానాలు ఉండగా, ఎన్డీఏకీ, యూపీఏకీ చెందని పక్షాలకు చెందిన సభ్యుల సంఖ్య 66. తొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాబోయే నవంబర్‌లో ఉత్తర ప్రదేశ్ నుంచి పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. పదికి పదీ గెలుచుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి ఉంది. 16వ లోక్‌సభ ఆమోదించిన రెండు తీర్మానాలు–సిటిజన్‌షిప్ అమెండ్ మెంట్ బిల్లు, 2018, ముస్లిం మహిళల (వివాహానికి సంబంధించిన హక్కుల పరిరక్షణ) బిల్లు, 2018 (త్రిపుల్ తలాఖ్ బిల్లు)– రాజ్యసభలో తగినంత బలం లేని కారణంగా మురిగి పోయాయి. 17వ లోక్‌సభలో మొదటి బిల్లుగా త్రిఫుల్ తలాఖ్ బిల్లును న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ప్రసాద్ తిరిగి శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు. ఈ సారైనా ఈ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందకపోతే ఎన్డీఏ సర్కార్‌కు తలవంపులు తప్పవు. అందుకోసం నేపథ్యాలతో, నైతికతతో నిమిత్తం లేకుండా రాజ్యసభ సభ్యులు ఎవరైనా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉంటే వారికి స్వాగతం చెప్పాలని అధినాయకత్వం నిర్ణయించుకున్నట్టు కనిపి స్తున్నది. కారణాలు ఏమైనా కావచ్చు, అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని చట్టుబండలు చేయడం రాజ్యాంగస్ఫూర్తిని మంట గలపడమే. -కె. రామచంద్రమూర్తి -
ఆటలో గవ్వలు సరిగ్గా పడాలి
ఎంతో లోకానుభవం ఉన్న ఒక మహాకవి ‘... అధికారాంతమునందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అంటూ పద్యం నాలుగో పాదాన్ని ముగించాడు. అదొక సామెతలా జనంలో మిగిలిపో యింది. చంద్రబాబు విమానం టేకాఫ్ కాగానే, సెల్ ఫోన్ ఎయిరోప్లేన్ పంథాలోకి వెళ్లగానే నలుగురు తెలుగు తమ్ముళ్లు పచ్చచొక్కాలు విసర్జించి కాషాయ కండువాలు ధరించారు. మోదీ మాత్రమే ఈ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించగలరనే ఏకాభిప్రాయం కలిగిందని వినమ్రంగా చెప్పారు. విమానంపైకి లేచిందో లేదో నలుగురు రాజ్యసభ సభ్యుల మెదళ్లలో జ్ఞానదీపాలు ఒక్కసారిగా వెలి గాయి. మాకు మా దేశం, అంతకంటే ముందు మా సొంత గడ్డ, దానికంటే ముందు మా ప్రజ ముఖ్య మనిపించింది. ఇన్నాళ్లూ జరిగిన అనైతిక చర్యలకు వగచి, చింతించి, బాధపడి, కంటకళ్లు పెట్టుకు న్నారు. మా పశ్చాత్తాపాన్ని పెద్దమనసుతో అర్థం చేసుకోండి. రోజుకి ఆరు లీటర్లు మినరల్ వాటర్ తాగే వాళ్లం ప్రాయశ్చిత్తంగా అరలీటరు సాదా పానీతో సరిపెట్టుకోవడానికి నలుగురం నిర్ణయించు కున్నాం. చంద్రబాబే మా తండ్రి, చంద్రబాబే నేత, చంద్ర బాబే మా గురువు. ఆయనకి ముందుగానే మా నిర్ణయం విన్నవిద్దామని మేము సిద్ధపడ్డాం. గురు కటాక్షం లేక అది సాధ్యపడలేదు. మిగిలిన అరకొర, అడుగుబొడుగు తెలుగు తమ్ముళ్లు మేమంతా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుని ఇలా సన్యసించి కాషాయం లోకి కన్వర్ట్ అయ్యారని ఒక పుకారు లేపారు. అంతా వట్టిది. బీజేపీ తీర్థం పుచ్చుకున్నందున డబ్బు కరువు తీరుతుందా?’ అని ఆ నలుగురూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఇద్దరూ కూడా చేరిపోతారని, మంచిరోజు దొరక్క ఆగారని ఒకమాట చక్కర్లు కొడుతోంది. అసలీ రాజ్యసభ సభ్యత్వాలు వాటి గడువులు పెద్ద పజిల్. సామాన్యులకు, మనలాంటి వాళ్లకి గడువులు వాటి గొడవ అంతుపట్టదు. లాటరీ అంటారు, కాలం తీరిందంటారు, అధిక మాసాలం టారు.. అంతా అయోమయంగా ఉంటుంది. మరో వైపు ఓడిపోయిన తెలుగు దిగ్గజాలు పది పదిహేను మంది, ఒకచోట గుమికూడి ఓ రోజల్లా మంతనాలు సాగించారు. కాకినాడ కేంద్రంగా సాగిన ఈ రహస్య సమాలోచనలు కూడా బాబు విమానం గాల్లోకి లేచీ లేవగానే! ‘అబ్బే! రహస్యం ఏముందిందులో. అసలు రామరాజ్యానికి దీటుగా సాగిన బాబు పాలనకి ఇట్టి దుర్గతి ఎందుకు పట్టిందో చర్చించాం. చర్చల ఫలితాలు మా నేతకి చెప్పాలని నివేదిక సిద్ధం చేస్తున్నాం’ అని చెబుతున్నారు. పాపం పుణ్యం కాకినాడ గ్రామ దేవతలకి తెలియాలి. చంద్రబాబు బ్రహ్మాండంగా ఓడిపోవడం మాట అలా ఉంచి, ఆయన వాచాలత్వం వల్ల సమీ కరణాలన్నీ అద్దాలు పగిలినట్టు పగిలాయి. మోదీ సర్కార్ భూస్థాపితం కాబోతోందని బాబు భవిష్య వాణిని వినిపించారు. అసలు ఒకటి మాట్లాడి ఒకటి పేలలేదని లేదు. మోదీ జ్ఞాపకశక్తి ఇంకా మసక బారలేదు. ఆయనపై వ్యక్తిగత విమర్శలకు కూడా వెళ్లారు. ఏంలేదు. రేపు అన్ని రాష్ట్రాలలో స్థానిక పార్టీలు విజయదుందుభులు మోగిస్తాయనీ, టీడీపీ సంగతి చెప్పనే అక్కర్లేదనీ బాబు కలలు కన్నారు. తెలుగు తమ్ముళ్లకి అనగా చినబాబుకి స్టేట్ అప్ప గించి పెదబాబు ఢిల్లీలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూ రారు. అసలు దేశ భవిష్యత్తంతా లోకల్ పార్టీలదే నని శంఖం పూరించారు. చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవం గురించి పదే పదే బెది రించేవారు. అనుభవం కంటే ప్రపంచ తంత్రం గుర్తె రిగి ప్రవర్తించడం అసలైన విజ్ఞత. ఏ మాత్రం అను భవం లేకపోయినా ఇందిరాగాంధీ దేశాన్ని తిరుగు లేకుండా ఏలింది. ప్రజారాజ్యానికి ఎమర్జెన్సీ ఏమిటో, ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించింది. ఇందిర శకంగా ముద్ర వేసుకుంది. అందాకా దేనికి ఎన్టీఆర్ పేపర్ చదవడం, రాజకీయాలు చెవిన వేసుకోవడం లాంటి దురలవాట్లకి దూరంగా ఉండేవారట. ఆయన తల్లి కడుపులో బిడ్డవలె 9 నెలల్లో పరి పూర్ణంగా తయారై గొప్ప నేతగా పేరు తెచ్చుకు న్నారు. పరమపద సోపాన పటంలో ఎన్టీఆర్ చంద్ర బాబుకి చిక్కి అరుకాసురుడనే పెద్దపాము నోట్లో పడ్డాడు. మొదటి గడికి జారాడు పాపం. ఇప్పుడు అంతకుమించిన మహాసర్పం నోట్లోపడి చంద్ర బాబు సోపాన పటం దాటి నేలకి అంటుకున్నాడు. అందుకని ఆటలో అనుభవాలు కాదు, సరైన పందాలు పడటం ముఖ్యం. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
నిట్టనిలువుగా చీలనున్న టీడీపీపీ
సాక్షి, ఢిల్లీ / అమరావతి: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ మెజార్టీ రాజ్యసభ సభ్యులు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే చంద్రబాబు, టీడీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా వారితో జట్టు కట్టనున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీడీపీ ఎంపీలు కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో టచ్‌లో ఉన్నారు. పార్టీని వీడి వీరంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో మట్టి కరిచిన టీడీపీపై చంద్రబాబు దాదాపుగా పట్టుకోల్పోయినట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీకి ఇక భవిష్యత్తు లేదనే నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ ఎంపీలు తిరుగుబాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ కేంద్రంగా ఇందుకు సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈమేరకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ త్వరలో చీలిపోనుందని తెలుస్తోంది. టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒక్కరు మినహా మిగిలిన ఐదుగురు కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో చర్చలు జరుపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వారితో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని సమాచారం. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి ఒక్క రవీంద్రకుమార్ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని మూకుమ్మడిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దారి చూపించిన ఎంపీ కేశినేని టీడీపీలో చీలికకు విజయవాడ ఎంపీ కేశినేని నాని దారి చూపించారని తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం చెందిన వెంటనే కేశినేని నాని పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అప్పటికే ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఎక్కడా తగ్గకుండా చంద్రబాబుపై విమర్శల జోరు పెంచారు. తద్వారా పార్టీలోని మెజార్టీ నేతల అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు. చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులపై ఆయన సూటిగా చేసిన విమర్శలు సరైనవేనని టీడీపీ శ్రేణులు సైతం అభిప్రాయపడ్డాయి. ఎంపీ కేశినేని నాని విమర్శలను టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. అంటే పక్కా ప్రణాళికతోనే టీడీపీ మెజార్టీ ఎంపీలు చంద్రబాబుపై తిరుగుబాటుకు సన్నద్ధమయ్యారని తెలుస్తోంది. ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులతోపాటు కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మనదారి మనం చూసుకుందాం.. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ ఎంపీలు ఇటీవల ఢిల్లీలో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యానికి చంద్రబాబు వైఖరే కారణమని పార్టీ ఎంపీలు కుండబద్ధలు కొడుతున్నారు. విచ్చలవిడి అవినీతి, ఒంటెత్తు పోకడలతో ఐదేళ్లు నిరంకుశంగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాలను చెప్పాలని తామెంత ప్రయత్నించినప్పటికీ ఆయన వినిపించుకోలేదని ఎంపీలు అంతర్గత సంభాషణల్లో దుయ్యబడుతున్నారు. కేవలం తన కుమారుడు లోకేశ్‌ను భావి నేతగా తీర్చిదిద్దాలన్న స్వార్థంతో పార్టీ పుట్టి ముంచారని ధ్వజమెత్తుతున్నారు. తిరుగులేని మాస్ లీడర్‌గా ఆవిర్భవించిన వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనే వ్యూహలే లేకుండా పోయాయని పేర్కొంటున్నారు. ఇక కోలుకోవడం అసాధ్యమే వైఎస్ జగన్ అంతటి ప్రజాదరణ ఉన్న నేత టీడీపీలో లేనందున కనీసం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుందామన్నా చంద్రబాబు వినిపించుకోలేదని ఎంపీలు విమర్శిస్తున్నారు. బీజేపీతో తెగదెంపులు, పవన్ కల్యాణ్‌తో లోపాయికారీ పొత్తు రాజకీయంగా టీడీపీని దెబ్బతీశాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇక కోలుకోవడం అసాధ్యమని ఎంపీలు నిర్ధారణకు వచ్చారు. చంద్రబాబుకు వయోభారం, లోకేశ్ అసమర్థత టీడీపీకి ప్రతికూల అంశాలని విశ్లేషిస్తున్నారు. టీడీపీలో ఇంకా కొనసాగడం రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమని మెజార్టీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు ఉన్నందున ఆ పార్టీలో చేరడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీజేపీలో చేరిక అంశంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు ఒకరిని ‘సాక్షి’ సంప్రదించగా ఆయన స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం. బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలన్న వ్యూహంతో ఉన్న బీజేపీ.. టీడీపీ ఎంపీలను చేర్చుకోడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం ఎన్డీఏకు 102 మంది సభ్యులున్నారు. వీరిలో బీజేపీ సభ్యులు 71 మంది మాత్రమే. బీజేపీ రాజ్యసభ సభ్యులు ఇటీవల ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానాలకు త్వరలో నిర్వహించే ఎన్నికలతో రాజ్యసభలో బీజేపీకి కొత్తగా మరో నలుగురు సభ్యులు చేరనున్నారు. దీంతో బీజేపీ బలం 75కు, ఎన్డీయే బలం 106కు పెరుగుతుంది. కానీ కీలక బిల్లుల ఆమోదానికి ఈ మెజార్టీ సరిపోదు. ‘ఒక దేశం... ఒకే ఎన్నికలు’ ‘ట్రిపుల్ తలాక్ రద్దు’ తదితర బిల్లులను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆమోదం పొందేలా చూడాలన్నది బీజేపీ వ్యూహం. పార్టీ మూల సిద్ధాంతాలకు సంబంధించిన 370 ఆర్టికల్ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి తదితర బిల్లులను కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్నది బీజేపీ యోచన. ఈ నేపథ్యంలో కీలక బిల్లులు ఆమోదం పొందేలా చూసేందుకు 2020 నాటికి రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలని బీజేపీ నిర్ణయించింది. అందుకోసం అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు తమతో టచ్‌లోకి రావడంతో వారితో చర్చించే బాధ్యతను రాం మాధవ్, కిషన్‌రెడ్డిలకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరితో టీడీపీ ఎంపీల చర్చలు దాదాపు సానుకూలంగా ముగిసినట్లు సమాచారం. దీనిపై బీజేపీ కీలక నేత ఒకరిని ‘సాక్షి’ సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఈ సమావేశాల్లోనే రాజ్యసభలో తమ బలం పెంచుకునేలా వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ భావిస్తుండగా, టీడీపీని వీడేందుకు ఆ పార్టీ ఎంపీలు సమాయత్తం కావడం రాజకీయాలను రక్తి కట్టిస్తోంది. -
నిజామాబాద్‌లో జంపింగ్ జపాంగ్
ఆర్మూర్: నమ్మిన సిద్ధాంతాలు.. రాజకీయ విలువలు.. ఆత్మాభిమానంతో కూడుకున్న దృక్పథాన్ని రాజకీయ నాయకులు వదిలేస్తున్నారు. స్వలాభం, అధికారం, డబ్బే పరమావధిగా పార్టీలు మార్చుతూ తమ వ్యక్తిగత విలువలను దిగజార్చుకుంటున్నారు. కప్పల తక్కెడను మరిపిస్తూ రోజుకొక పార్టీలోకి జంప్ అవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కొనసాగిన పార్టీ ఫిరాయింపులు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సైతం కొనసాగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో సుమారు ఐదు నుంచి పది వేల మంది ఆర్మూర్ డివిజన్ పరిధిలో పార్టీలు మార్చారు. సేవా దృక్పథంతో రాజకీయాల్లో ఉన్నామంటూనే అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ మార్చాలని ఏనాడు ఆలోచన చేయని నాయకులు ఎన్నికల నేపథ్యంలో వ్యక్తిగత లబ్ధికే పెద్దపీఠ వేస్తూ పార్టీలను ఫిరాయిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆ పార్టీలోకి చేరికల సంఖ్య గణనీయంగా పెరిగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు మార్చుతున్న నాయకులకు తెలంగాణ నినాదం ఒక కారణంగా మారింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిన రోజుల్లో, తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర ఏర్పాటు కాంక్షను తమ శరీరాన్ని కాల్చుకొని ఆత్మబలిదానం చేసిన సందర్భాల్లో సమైక్యవాద పార్టీలను వీడాలని, పార్టీ మార్చాలని ఆలోచన కూడా చేయని పలువురు నాయకులు ప్రస్తుతం తెలంగాణ నినాదాన్ని భుజాన వేసుకొని పార్టీలు ఫిరాయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించిన ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమంటూ కొందరు నాయకులు టీఆర్ఎస్లో చేరుతుంటే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీకి కృతజ్ఞత తెలపడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరామని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కోసం పార్టీలు మారుస్తున్నామని నాయకులు ప్రకటించినా ప్రజలు వాస్తవ పరిస్థితులను నమ్మే పరిస్థితుల్లో మాత్రం లేరు. ఇన్ని రోజులు కనిపించని తెలంగాణ సెంటిమెంట్ వీళ్లకు ఇవ్వాలనే కనిపించిందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరికొందరు నాయకులైతే పొద్దున ఒక పార్టీలో, మధ్యాహ్నం ఒక పార్టీలో, రాత్రికి ఒక పార్టీలో తిరుగుతూ హల్చల్ చేస్తున్నారు. పట్టణాల్లో గ్రామాల్లో నాయకులు చెప్పినవారికే ఓటు వేయాలనే పరిస్థితులు కనిపించవు కాని నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటే గ్రామాల్లో ఒక చర్చ ప్రారంభమవుతుందన్న ఆలోచనతో పలు పార్టీల నాయకులు ఇలా కప్పదాట్లు వేస్తున్న నాయకులకు ప్యాకేజీలు సమర్పించుకుంటున్నారు. డబ్బులు, పదవులు ఎరవేసుకుంటూ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీల్లో రోజు వందల సంఖ్యలో నాయకులు చేరుతున్నట్లు ఆయా పార్టీల నాయకులు ప్రకటించుకుంటున్నారు. ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేసి వ్యక్తిగత లబ్ధికోసమే పార్టీలు మారుస్తున్న నాయకుల తీరును ప్రజలు ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత బలమైన ఆయుధమైన ఓటుతో ఇలాంటి నాయకులకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతున్నారు. -
ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికే కళంకం
భారతదేశంలో రాజకీయ నాయకులు వ్యవహరించే తీరు చూసి అతి తక్కువ కాలంలో ఇన్ని రంగులు మార్చడం తమవల్ల కూడా కావట్లేదని ఊసరవెల్లులు సైతం చేతులెత్తేసేలా ఉన్నాయి. రాజ కీయ పదవులు,ప్రభుత్వ నిధులు పొందడానికి మాత్రమే గెలిచిన తమ స్థానాన్ని వినియోగించుకోవాలని తాపత్రయ పడుతున్నారు తప్ప, ప్రజలు ఏ పార్టీ మేనిఫెస్టో,విధి విధానాలకు వ్యతిరేకంగా తమను గెలిపించారు అనే కనీస ఆలోచన కూడా చేయడంలేదు. ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లయ్య, ఒడ్డెక్కినాక బోడి మల్లయ్య’ అన్నట్లుగా పార్టీ టికెట్ అందే వరకు ఒక లెక్క,పార్టీ టికెట్ దక్కించుకున్నాక ఒక లెక్క, ఆ పార్టీ విధి విధానాలను నమ్మి ఓటేసి గెలి పించాక మరో లెక్కలా ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి తయారవ్వ డానికి కారణం ఏంటి? లోపం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉందా? పార్టీలు ఫిరాయించే ఫిరాయింపుదారులలో ఉందా? వారిని ఎన్నుకున్న ప్రజలలో ఉందా? అని ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’లోనే ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఆ చట్టమే ఫిరాయింపుదారుల పాలిట వరంలా మారింది. ఫిరాయింపులకు పాల్పడుతున్న అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో ఉన్న లొసుగులను తెలివిగా వాడుకుంటూ దానికి ‘ఆపరేషన్ ఆకర్ష్‘ లేదా ఇంకేదైనా పేరుతోనో ప్రత్యర్థి పార్టీలో ఉన్న అభ్యర్థులను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి లాగి అసలు ప్రతిపక్షమే లేకుండా చేసి రాచరిక పాలన దిశగా అడుగులు వేయడానికి మన బల హీనమైన చట్టాలు ఎలా ఉపయోగపడుతున్నాయనేది చర్చనీ యాంశం. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయానికొస్తే ఈ తతంగం ప్రస్తుతం మాత్రమే చోటు చేసుకున్నదేమీ కాదు, తమ ఎమ్మెల్యేలను గొర్రెల వలె కొంటున్నారని ప్రతిపక్షం అందులోనూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడంలో అంతగా పస లేదు ఎందుకంటే గతంలో 1990–95 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంలో పి. చంద్రశేఖర్ ప్రధానమంత్రి కావడానికి అప్పటి బడా పార్టీ ముమ్మరంగా ఫిరాయింపుల ద్వారా ఎంపీలను చేర్చుకొని గద్దెనెక్కడమే కారణం. అలాగే 1991లో కూడా పీవీ నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1995 నాటికి మెజారిటీ సాధించడానికి పార్టీ ఫిరాయింపులనే వాడుకోవడం గమనార్హం. కాబట్టి ఏ ఒక్క రాజ కీయ పార్టీకో ఈ ఫిరాయింపుల సంస్కృతిని ఆపాదించి మిగతా పార్టీలు సత్యహశ్చంద్రుడి పార్టీలుగా బిల్డప్ ఇవ్వాల్సిన పనిలేదు. ఒక వేళ ఏ పార్టీ అభ్యర్థి అయినా మరోపార్టీలోకి మారటం అనివార్యం అయితే తాను గెలిచి పొందిన పదవికి రాజీనామా చేసి బయటకు రావడం ప్రజాస్వామ్యాన్ని శోభిల్ల చేస్తుంది. వైఎస్సార్సీపీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఈ చట్టం ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధకాన్ని అమలు చేసే నిర్ణయాధికారం స్పీకర్‌కు మాత్రమే ఉండటం, స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా ఫిరాయింపులపై చర్యలు తీసుకునే కాలాన్ని పొడిగించే సౌకర్యం కలిగి ఉండటం (ఆ కాలం కొన్ని రోజులు, కొన్ని నెలలు లేదా సంవత్సరాలు కావచ్చు) ఈ చట్టం లోని లోపాలు. ఈ లోపాలవల్లే ప్రతిపక్షంలో ఉండి గెలిచిన అభ్యర్థి తన పదవికి రాజీనామా చేయకుండానే అధికార పార్టీలో చేరి మంత్రి పదవులను సైతం నిర్వహించడం కళ్లారా చూస్తూనే ఉన్నాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక అధికారాన్ని స్పీకర్‌కు కాకుండా స్వతంత్ర సంస్థలకు లేదా ఎన్నికల సంఘానికి అప్పగించినట్లయితే ఫలితాలు ఈ విధంగా ఉండేవి కాదు. అంతే కాకుండా ఒక పార్టీకి చెందిన శాసన సభ్యులు 2/3 వంతు మంది వేరే పార్టీలో చేరితే దాన్ని సమర్థిస్తుండటం కూడా ఈ చట్టం నిర్వీర్యమవడానికి కారణమవుతోంది. కాబట్టి ఒక పార్టీ మేనిఫెస్టోపై ఎన్నికైన సభ్యుడు మరో మేనిఫెస్టో కలిగిన వేరొక పార్టీతో విలీనం కావడాన్ని కూడా రద్దు చేస్తేనే పార్టీ ఫిరాయింపుల నిరోధానికి పూర్తి స్థాయిలో కట్టుబడ్డట్టవుతుంది. ప్రజాస్వామ్యం అంటే అంకెల గారడీ కాకుండా నిజమైన ప్రజాభిప్రాయానికి ప్రతి బింబం కావాలంటే పార్టీ ఫిరాయింపులను సంపూర్ణంగా నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది,లేదంటే ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం అపహాస్యమే అవుతుంది. శ్రీనివాస్ గుండోజు ‘ ఫోన్ : 99851 88429 -
‘ఫిరాయింపులకు’ ఓటమి
సాక్షి, హైదరాబాద్: గత సార్వత్రిక ఎన్నికల అనంతరం వేర్వేరు పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన ఐదుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గతంలో 25 మంది వేర్వేరు పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరగా అందులో 20 మంది విజయం సాధించారు. ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మాత్రం భంగపాటు ఎదురైంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీఆర్ఎస్లో చేరిన పాయం వెంకటేశ్వర్లు పినపాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు చేతిలో ఓడగా, అశ్వరావుపేట నుంచి పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లు కూటమి అభ్యర్థి మచ్చా నాగేశ్వరరావు చేతిలో, వైరాలో బానోతు మదన్‌లాల్ ఇండిపెండెంట్ అభ్యర్థి రాముల్‌నాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. గతంలో ఇల్లందులో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన కోరం కనకయ్య ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియ చేతిలో ఓడారు. మహేశ్వరంలో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు గత ఎన్నికల్లో నర్సంపేట నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దొంతి మాధవరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. -
‘ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయాలి’
-
‘ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయాలి’
న్యూఢిల్లీ : గత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై నెగ్గి, ఫిరాయించిన నలుగురు ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత వి. విజయసాయిరెడ్డి కోరారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం కలిశారు. ఫిరాయింపు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై నెగ్గి, అనంతరం ముగ్గురు ఎంపీలు తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లోనై పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఓ పార్టీ టికెట్‌పై నెగ్గి మరో పార్టీలోకి ఫిరాయించిన ఈ నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని చాలాకాలం కిందటే మేము ఫిర్యాదు చేసినా అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నట్లు స్పీకర్ దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకెళ్లారు. ఫిరాయింపులపై చర్యలు తీసుకోకుంటే రాజ్యాంగ మూల సూత్రాలకు ప్రమాదం ఏర్పడుతుందని స్పీకర్‌కు ఆయన వివరించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మరింతమంది పార్టీ ఫిరాయించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన శరద్ యాదవ్, అన్వర్ అలీ పై 90 రోజులలో అనర్హత వేటు పడ్డ విషయాన్ని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదే పద్ధతిలో లోక్‌సభలో కూడా పార్టీ ఫిరాయించిన ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు సమర్పించిన వినతిపత్రంలో విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
అధికారం, ధనబలంతోనే ఫిరాయింపులు: చాడ
సాక్షి, హైదరాబాద్: అధికారం, ధన బలంతోనే 30 శాతం మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఫిరాయింపులకు కారణమని సీఎం కేసీఆర్ చెప్పడం ఆయన నైతిక పతనానికి నిదర్శనమన్నారు. రాజ్యసభ ఎన్నికల అధికార ప్రకటన ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పటికీ తాము గెలిచిన పార్టీల పేరుతోనే కొనసాగడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తెలంగాణ వాదులు నడుం బిగించాలని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం అప్రజాస్వా మికంగా వ్యవహరిస్తోందని చాడ విమర్శించారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
-
మూడు నెలల్లో తేల్చాల్సిందే
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: చట్టసభల సభ్యుల అనర్హతపై నిర్ణయం ఆలస్యమైతే ఫిరాయింపుల నిరోధక చట్టం లక్ష్యాన్ని దెబ్బతీసినట్లేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సభ్యుల అనర్హతపై అందిన ఫిర్యాదులను ఆయా సభల ప్రిసైడింగ్ అధికారులు పరిశీలించి మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జనతాదళ్(యు)కు చెందిన శరద్ యాదవ్, అలీ అన్వర్లు ఇద్దరూ తమ పార్టీలోని మెజారిటీ సభ్యుల మద్దతు కోల్పోవటంతోపాటు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నందునే వారిని రాజ్యసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించామని రాజ్యసభ చైర్మన్ కూడా అయిన వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అనర్హత ఉత్తర్వులను మంగళవారం ఆయన విడుదల చేశారు. వీరిపై ఫిర్యాదు అందిన నెలలోపే విచారించి నిర్ణయం తీసుకున్నామన్నారు. పిటిషన్లను ప్రివిలేజ్ కమిటీకి పంపితే అక్కడ విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు సమయం పడుతుందని..ఆపైన అంతిమ నిర్ణయం ప్రకటించేందుకు మరింత జాప్యం అవుతుందని తెలిపారు. ఇలాంటి కాలయాపన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టే పిటిషన్లను ప్రివిలేజ్ కమిటీకి పంపించలేదని తెలిపారు. ప్రజాస్వామ్య మనుగడకు కీలకమైన చట్టసభల సభ్యులపై అందిన ఫిర్యాదు వెంటనే పరిశీలించినట్లయితే.. వారు సభలో కూర్చునేందుకు అర్హులా కాదా అనేది తేలుతుందని.. అలా కాకుండా జాప్యం చేస్తే వారి సభ్యత్వాన్ని కాపాడినట్లవుతుందని తెలిపారు. ఇటువంటి సభ్యుల అండతో ప్రభుత్వాలు కూడా కొనసాగే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ఫిర్యాదు అందిన వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతే ఫిరాయింపుతో కలిగే పరిణామాలు తెలియకుండానే ఆ సభ్యుడు కొనసాగే అవకాశముందన్నారు. ఇటువంటి పరిణామాలు ఫిరాయింపుల చట్టం అసలు ఉద్దేశాన్ని మరుగున పరుస్తాయని తెలిపారు. ఎవరైనా సభ్యుడు తమ పార్టీ నిర్ణయంపై బహిరంగంగా విమర్శించినా, వేరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా అనర్హులేనని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్చెబుతోందన్నారు. లెజిస్లేచర్ పార్టీ నాయకత్వంపై వివాదం తలెత్తిన సందర్భాల్లో మెజారిటీ సభ్యులు తీసుకునే నిర్ణయం లేదా అభిప్రాయానికే అంగీకారం ఉంటుందని చెప్పారు. అలాగే, జేడీ(యు)కు చెందిన శరద్‌యాదవ్‌కు మెజారిటీ సభ్యుల మద్దతు లేదని, అందుకే ఆ పార్టీకి నితీష్‌కుమార్‌నే అధ్యక్షుడిగా ఎన్నికల సంఘం కూడా గుర్తించిందని వివరించారు. బిహార్‌లోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు నితీష్‌కుమార్ ప్రకటించినందున జేడీ(యు) సభ్యత్వాన్ని ఆయన స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనన్న నితీష్‌కుమార్ వాదనపై ఆయన స్పందిస్తూ... రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో రాజకీయ పార్టీల కూటములకు ఎలాంటి గుర్తింపు లేదన్నారు. కాగా, అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేస్తున్న ప్రిసైడింగ్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ప్రిసైడింగ్ అధికారులు చేస్తున్న అనవసర జాప్యంపై సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు. -
ఫిరాయింపులు.. దబాయింపులు!
రాజ్యాంగాన్ని సవ్యంగా అమలు చేయవలసిన వ్యక్తులూ, సంస్థలూ విఫలమైనప్పుడు రాజ్యాంగస్ఫూర్తికి విఘాతం అనివార్యం. రాష్ట్రపతి, గవర్నర్ ప్రత్యక్షంగా రాజ్యాంగ పరిరక్షకులు. ప్రధానీ, ముఖ్యమంత్రులూ రాజ్యాంగం ప్రకారం ఎన్నికై రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినవారు. వీరంతా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినప్పుడూ లేదా ఎవరైనా రాజ్యాంగాన్ని బుద్ధిపూర్వకంగా ఉల్లంఘిస్తుంటే తమకు సంబంధం లేనట్టు మరోవైపు చూసినప్పుడూ చట్టపాలనను అభిలషించే పౌరులు ఎవరికి ఫిర్యాదు చేయాలి? రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజ్యాంగంలోని లోపాలను వినియోగించుకొని రాజకీయక్రీడ తెలివిగా, కొంటెగా కొనసాగిస్తుంటే బాధితులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి? పార్టీ ఫిరాయించినవారిపైన ఏమి చర్య తీసుకోవాలో తాను నిర్ణయించడానికి ముందే విపక్ష సభ్యులు కోర్టుకు ఎక్కారు కనుక ఈ విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అనడంలోని గడుసుతనం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వారు సకాలంలో చర్య తీసుకుంటే కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఏమున్నది? ఫిరాయించినవారిపై చర్య తీసుకోవలసిందిగా సభాపతికి, న్యాయస్థానాలకు విన్నవించుకొని దాదాపు మూడున్నరేళ్లు గడుస్తున్నా ఫలితం రానప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకత్వం కర్తవ్యం ఏమిటి? శాసనసభ సమావేశాలను బహిష్కరించడం ద్వారా అధికార పక్షం అవలంబి స్తున్న అప్రజాస్వామిక వైఖరిని జాతీయ స్థాయి పెద్దల, సంస్థల దృష్టికి తీసుకురావడం ఒక్కటే మార్గం. ఈ విధంగా నిరసన ప్రకటించడం ద్వారా దబాయింపు రాజకీయాలకూ, రాజ్యాంగ విరుద్ధమైన పోకడలకూ సరైన సమాధానం చెప్పినట్టు అవుతుంది. వైఎస్ఆర్సీపీ చేస్తున్న పని అదే. ఇదే పని ఇంతటి బలమైన కారణం లేకుండానే చాలా స్వల్పమైన అంశాలపైన నిరసనగా ఎన్‌టి రామారావు సభకు రాకుండా ఉన్నారు. చంద్రబాబు సైతం ప్రతిపక్షంలో ఉండగా సభను బహిష్కరించారు. వారు చేస్తే ఒప్పు అయినది ఎవరు చేసినా తప్పు కాజాలదు. పార్టీ ఫిరాయింపు అనేది తెలుగు రాష్ట్రాలను మాత్రమే కాదు, దేశం మొత్తాన్ని అయిదు దశాబ్దాలుగా పీడిస్తున్న జాడ్యం. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది 1967లో. ఆ సంవత్సరం 16 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తక్కిన రాష్ట్రాలలో ప్రతిపక్షాలు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. అప్పుడు చట్టసభల సభ్యులను ప్రలోభాలకు గురి చేసి ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రక్రియ జోరందుకున్నది. 1967–71 మధ్య 142 మంది పార్లమెంటు సభ్యులూ, 1,900 మంది శాసనసభ్యులూ పార్టీలు ఫిరాయించారు. హరియాణా, తదితర రాష్ట్రాలలో ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోయేవి. ఆయారాం గయారాం హరియాణాకు చెందిన గయాలాల్ అనే శాసనసభ్యుడు వరుసగా మూడు విడతల పార్టీలు ఫిరాయించాడు. అప్పటి నుంచీ పార్టీలు మారడాన్ని ‘ఆయారాం గయారాం’ అని పిలవడం ఆనవాయితీ. పార్టీ ఫిరాయించినవారికి మంత్రి పదవులూ, కార్పొరేషన్ అధ్యక్ష పదవులూ ఇచ్చేవారు. అది ఒక లాభసాటి అవినీతి వ్యాపారంగా మారింది. ఫిరాయింపుల ఆట కట్టించడానికి తొలిప్రయత్నం 1985లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ చేశారు. 101, 102, 190, 191 అధికరణలలో మార్పులు చేస్తూ 52వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చారు. ఈ సంస్కరణల అమలు కోసం పదవ షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు. పార్టీ ఫిరాయించిన చట్టసభల సభ్యులపైన అనర్హత వేటు వేసే అధికారం సభాపతులకు మాత్రమే ఇచ్చారు. వారి నిర్ణయాలను ప్రశ్నించే అధికారం న్యాయవ్యవస్థకు ఇవ్వలేదు. మూడింట ఒక వంతు మంది చట్టసభ సభ్యులు పార్టీ నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టుకోవచ్చు లేదా ఏదైనా పార్టీలో విలీనం కావచ్చు. అంతకంటే తక్కువ మంది పార్టీని వీడితే అనర్హత వేటు తప్పదు. ప్రధాని పీవీ నరసింహారావు అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని చీల్చారు. భూపతిరాజు ఆధ్వర్యంలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది సభ్యులే చీలిపోయారు. చిన్న పార్టీలలో మూడింట ఒక వంతు మంది చేతులు కలిపి పార్టీ నుంచి నిష్క్రమించడం తేలిక. ఆ కారణంగా 52వ రాజ్యాంగ సవరణ వల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. 2003లో నాటి ప్రధాని వాజపేయి నాయకత్వంలో 91వ రాజ్యాంగ సవరణ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం మూడింట రెండు వంతుల మంది సభ్యులు కలిస్తేనే పార్టీ నుంచి విడిపోయి వేరే పార్టీలో విలీనం కావచ్చు లేదా వేరే పార్టీగా మనుగడ సాగించవచ్చు. సభ్యత్వానికి ఢోకా లేదు. ఈ చట్టం వచ్చిన తర్వాత సైతం ఫిరాయింపులు ఆగలేదు. కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు ఈ క్రీడలో సమధికోత్సాహంతో పాల్గొంటున్నాయి. నీతి, నిజాయితీలకు తిలోదకాలు ఇచ్చేసి నిస్సిగ్గుగా ఫిరాయింపులను ప్రభుత్వాధినేతలే ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం నల్లధనం వినియోగిస్తున్నారు. పార్టీలు మారిన వారికి పదవులు కట్టబెడుతున్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఫిరాయింపు రాజకీయాలు ముమ్మరంగా సాగాయి. తమిళనాడులో పళ నిస్వామి ప్రభుత్వాన్ని కాపాడేందుకు స్పీకర్ పి. ధనపాల్ మొన్న సెప్టెంబర్ 18న టీటీవీ దినకరన్‌కు చెందిన 18 మంది ఏఐఏడీఎంకె శాసనసభ్యులపైన అనర్హతవేటు వేశారు. ఇతర పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఏ మాత్రం సంకోచం లేకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. తెలుగు రాష్ట్రాల సంగతి సరేసరి. రాజ్యాంగంలోని లొసుగులను అధికార పార్టీలు ఎంత తెలివిగా ఉపయోగించుకుంటున్నాయో గమనిస్తే పాలకులకు రాజ్యాంగం పట్ల, న్యాయం పట్ల, ధర్మం పట్ల ఎంత పట్టింపు ఉన్నదో అర్థం అవుతుంది. కిహోటో హోలోహన్ వర్సెస్ జాచిల్హూ కేసు విచారణ సుప్రీంకోర్టులో 1992లో జరిగింది. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. సభాపతికి పదో షెడ్యూల్ సంపూర్ణ అధికారం ఇచ్చినప్పటికీ వారు షెడ్యూల్లోని 6(1)వ పేరాలో పేర్కొన్న విధంగా వ్యవహరించాలని చెప్పింది. సభాపతి నిర్ణయాన్ని న్యాయసమీక్ష జరిపే అధికారం హైకోర్టులకూ, సుప్రీంకోర్టుకూ ఉన్నదని కూడా స్పష్టం చేసింది. సభాపతికి నిర్ణయాధికారం ఇచ్చే పదో షెడ్యూల్లోని ఏడవ పేరా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేదని, దాని విషయంలో పునఃపరిశీలన జరపడమో, రాజ్యాంగ సవరణ చేయడమో ఉత్తమమని కూడా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరో ఆసక్తికరమైన వివాదం కూడా ఇందుకు సంబంధించి జరిగింది. మణిపూర్ స్పీకర్ బోరోబాబూసింగ్ 1992లో ఒక శాసనసభ్యుడిపైన అనర్హత వేటు వేశారు. సదరు శాసనసభ్యుడు సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు సంపాదించారు. మణిపూర్ శాసనసభ కార్యదర్శి మణిలాల్సింగ్ సుప్రీంకోర్టు ఉత్తర్వులకు తగినట్టు శాసనసభ్యుడి పునరాగమనానికి రంగం సిద్ధం చేశారు. ఇది తెలుసుకున్న బోరోబాబూసింగ్ మణిలాల్సింగ్ను సస్పెండు చేసి ముందస్తు పదవీ విరమణకు ఆదేశించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో న్యాయవాదులు మాట వరుసకు ప్రస్తావిస్తే సుప్రీం న్యాయమూర్తులు ఆగ్రహించి మణిలాల్ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా ధిక్కారనేరం కింది తమ ఎదుట హాజరు కావలసిందిగా స్పీకర్‌ని ఆదేశించారు. తెలుగు రాష్ట్రాలలో ప్రబలిన తెగులు రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, నీతి బాహ్యం, అప్రజాస్వామికం. ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయించిన 21 మంది శాసనసభ్యులపైన అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ సభాపతికి మహజర్లు సమర్పించింది. ఆయన స్పందించలేదు. హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను ఎట్లా సమర్థిస్తారో చెప్పవలసిందిగా ఫిరాయించిన శాసనసభ్యులనూ, శాసనసభ కార్యదర్శినీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, శంకర నారాయణతో కూడిన డివిజన్ బెంచ్ 2016 నవంబర్ 14న అడిగింది. మళ్ళీ ఈ కేసు విచారణకు రాలేదు. సుప్రీంకోర్టులో విడిగా వైఎస్ఆర్సీపీ బాధ్యులు పిటిషన్ వేశారు. అమరావతిలో శాసనసభా ప్రాంగణానికి ఈ యేడాది మార్చి రెండో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఫిబ్రవరి 27న ప్రతిపక్ష నాయకుడూ, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సభాపతికి బహిరంగ లేఖ రాశారు. ఫిరాయించిన శాసనసభ్యులపైన అనర్హత వేటు వేయవలసిందిగా అభ్యర్థించారు. సభాపతి ఉలకలేదు. ముఖ్యమంత్రి మాత్రం వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి సత్కరించారు. ఫిరాయింపుదారులను వైఎస్ఆర్సీపీ సభ్యులుగా అసెంబ్లీ బులెటిన్లలో చూపించడం మరింత విడ్డూరం. వీటన్నిటినీ భరిస్తూ తాము అడిగే ప్రశ్నలకు ఫిరాయించి మంత్రి పదవులు సంపాదించినవారు సమాధానాలు చెబుతుంటే, వింటూ తలలూపుతూ వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉండాలని తెలుగుదేశం నాయకత్వం కోరుకుంటోంది. ఆ పని చేస్తే ఫిరాయింపులనూ, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులతో సత్కరించడాన్నీ వైఎస్ఆర్సీపీ ఆమోదించినట్టు అవుతుంది. రాజ్యాంగ వ్యతిరేక చర్యలనూ, నీతి బాహ్యమైన వైఖరినీ ఆమోదించడం ఇష్టం లేని కారణంగానే సభను బహిష్కరించామంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఫిరాయింపుదారులపైన చర్యలు తీసుకున్న మరుక్షణం నుంచి హాజరు అవుతామని చెబుతున్నారు. తెలంగాణలో ప్రగతి తెలంగాణలో ఫిరాయింపుదారులపైన వ్యాజ్యం ఇంకాస్త ముందుకు జరిగింది. కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎస్ఎ సంపత్‌కుమార్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆర్కె అగర్వాల్, ఆర్ఎఫ్ నారిమన్‌తో కూడిన బెంచ్ పరిశీ లించి ఇది చాలా సున్నితమైన విషయం కనుక అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని నిర్ణయించింది. 2016 నవంబర్ 9న ధర్మాసనానికి నివేదించింది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయవలసిందిగా స్పీకర్‌ను ఆదేశించాలంటూ పిటిషనర్ ప్రార్థించారు. ఎన్నికలలో 67 స్థానాలు గెలుచుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి ఫిరాయింపుల ధర్మమా అని 89 స్థానాలు ఉన్నాయంటూ ధర్మాసనానికి నివేదించారు. ఇదే రకమైన ప్రార్థన హై దరాబాద్ ఉమ్మడి హైకోర్టులో వేయగా 90 రోజులలోగా ఫిరాయింపుదార్లపైన చర్య తీసుకోవలసిందిగా స్పీకర్ మధుసూదనాచారిని కోరింది. ఆయన నిమ్మకునీరెత్తినట్టు మిన్నకున్నారు. పదో షెడ్యూల్లో సభాపతులకు విశేషాధికారాలు ఇచ్చినప్పుడు వారు పార్టీలకి అతీతంగా వ్యవహరిస్తారనీ, ప్రధానమంత్రుల, ముఖ్యమంత్రుల బంట్లుగా కాకుండా వారి హోదాకు తగినట్టు, రాజ్యాంగం నిర్దేశించినట్టు స్వతంత్రంగా వ్యవహరిస్తారనీ భావించారు. ఈ భావనే ఘోర తప్పిదమని మూడు దశాబ్దాలలో సభాపతులే నిరూపించారు. కిహోటో హోలోహన్ కేసులో తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఉన్నత పదవిలో ఉన్న సభాపతిని శంకించడం ధర్మం కాదని వ్యాఖ్యానిస్తూ, ‘సభాపతి దుస్తులు ధరించిన తర్వాత ‘లోపలి మనిషి’ ఉన్నతంగా పరిణామం చెందుతారు’ అనే ఆశాభావం వెలిబుచ్చింది. రెండున్నర దశాబ్దాల అనంతరం మళ్ళీ సర్వోన్నత న్యాయస్థానం అరుణాచల్‌ప్రదేశ్ శాసనసభాపతి కేసులో తీర్పు ఇస్తూ ‘సభాపతి దుస్తుల లోపలి మనిషి’ పట్ల అవిశ్వాసం ధ్వనిస్తూ సభాపతిపైన పరిమితులు విధించాలని సూచించింది. సభాపతులు ప్రధానమంత్రులకూ, ముఖ్యమంత్రులకూ విధేయులుగానే ఉంటారని స్పష్టమైపోయింది. అందువల్ల వారికి పదో షెడ్యూల్లో దఖలు పరచిన విశేషాధికారాన్ని రద్దు చేసి ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే నిర్ణయం రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ తీసుకోవాలనీ, వారు సైతం ఎన్నికల కమిషన్ సలహాను విధిగా పాటించాలనీ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలోని రాజ్యాంగ సమీక్ష కమిషన్, అంతకు పూర్వం దినేష్ గోస్వామి కమిటీ సిఫార్సు చేశాయి. దీని అమలుకు రాజ్యాంగ సవరణ అవసరం. అందుకు ప్రధాని మోదీ సహకారం తప్పనిసరి. అవినీతిపైనా, నల్లధనంపైనా యుద్ధం చేస్తున్న ప్రధానికి నల్లధనం, అవినీతితో కూడిన ఫిరాయింపులనే వికృత క్రీడ సమ్మతం కాజాలదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కుహనా ప్రజాస్వామికశక్తుల ఆటకట్టించే శక్తి ప్రస్తుతం మోదీకి మాత్రమే ఉంది. భారత ప్రజాస్వామ్యానికి పట్టిన చీడను వదిలించేందుకు నడుం బిగిస్తే మోదీ చరితార్థులు అవుతారు. - కె. రామచంద్రమూర్తి -
అభివృద్ధి పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
-
ఎమ్మెల్యే చెప్పిన అభివృద్ది ఏదీ ? ఎక్కడా ?
-
సొంత లాభాల కోసమే ప్రజలకు వెన్నుపోటు
-
వైఎస్ఆర్సీపీ 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీలు
-
వైఎస్ఆర్ సీపీ 'సేవ్ డెమోక్రసీ'
అమరావతి: ప్రజాస్వామ్య పరిరక్షణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. సేవ్ డెమోక్రసీ పేరుతో అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం ఆందోళనలు చేపడుతోంది. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అప్రజాస్వామిక చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ ఎండగడుతోంది. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. అన్ని జిల్లాల్లో ప్రజాస్వామిక వాదులతో కలిసి ధర్నాలు, ర్యాలీలను వైఎస్ఆర్ సీపీ చేపడుతోంది. ► వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో సేవ్ డెమోక్రసీ పేరిట వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ► పోరుమామిళ్లలో బద్వేల్ ఇంఛార్జ్ వెంకట సుబ్బయ్య, మండల అధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ► రాజంపేట పాతబస్టాండ్ వద్ద వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, పట్టణ కన్వినర్ శ్రీనివాసుల రెడ్డి, కార్యదర్శి మురళీరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ► మైదుకూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ నేత దస్తగిరి బాబు, తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఆచంట కన్వీనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ పేరుతో ధర్నా చేపట్టారు. అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు, గాంధీ, వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని, జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆళ్ల నాని మాట్టాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని మండపడ్డారు. ఫిరాయింపుదారులను ప్రోత్సహించిన చంద్రబాబు ప్రభుత్వంపై కేంద్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ► భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ► కర్నూలు జిల్లాలో సేవ్ డెమోక్రసీ పేరిట జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. కర్నూలులో ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, హఫీజ్ ఖాన్, బీవై రామయ్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ► ఎమ్మిగనూరులో ఇంఛార్జ్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ► కల్లూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే గూరు సుచరిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ► ఆళ్లగడ్డలో గంగుల జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ► అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సెవ్ డెమోక్రసీ పేరిట ధర్నా చేపట్టారు. ► విజయనగరం జిల్లా సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ పేరిట రాస్తరోకో నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. ► చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నగరపాలక అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, నాయకులు మమత, రాజేంద్ర ఇమామ్ తదితరులు పాల్గొన్నారు. ► గంగాధరనెల్లూరులో ఎమ్మెల్యే నారాయణ స్మామి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ► కుప్పంలో ఇంఛార్జ్ చంద్రమౌళి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ► బి.కొత్తకోటలో ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ► పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ► గుంటూరులో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ తాడేపల్లి ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ► రేపల్లెలో మాజీ మంత్రి మోపిదేవి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. ► ప్రకాశం జిల్లా కందుకూర నియోజకవర్గంలో తుమటి మాధవరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం. ► అద్దంకిలో ఇంఛార్జ్ కృష్ణచైతన్య ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పార్టీ నేతలు ఆనందరావు, జ్యోతి హన్మంతరావుతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ► ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ కృష్ణా జిల్లా తిరువురులో ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో ధర్నా. ► కైకలూరులో వైఎస్ఆర్ సీపీ సేమ్ డెమోక్రసీ బైక్ ర్యాలీ. సమన్వయకర్త నాగేశ్వరరావు తదితర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ► తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, సునీల్ ఆధ్వర్యంలో 'సేమ్ డెమోక్రసీ' ధర్నా. భానుగుడి జంక్షన్ నుంచి సర్పవరం వరకు బైక్ ర్యాలీ. ► జగ్గంపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట కోఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా. వరసాల ప్రసాద్, గోవిందరెడ్డి, దొరబాబు, పెదబాబు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ► శ్రీకాకుళంలోని ఏడు రోడ్డుల జంక్షన్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వైఎస్ఆర్ సీపీ భారీ బైక్ ర్యాలీని నిర్వహించింది. పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ► ఆముదాలవలసలో తహశీల్దార్ కార్యాలయం వద్దకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ► నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ► వేదాయపాలెంలోని జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, తాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ ర్యాలీ. -
'బాబు దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారు'
విజయవాడ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించకుండా మంత్రి పదువలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విజయవాడలోని ధర్నా చౌక్‌లో శుక్రవారం వైఎస్సార్పీసీ ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ కార్యక్రమం చేపట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. పార్థసారధి అన్నారు. రాజ్యంగం పై గైరవం ఉంటే పార్టీ మారిన నేతలతో రాజీనామ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలకు వామపక్షాలు సైతం తమ మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నాయి. -
వైఎస్ఆర్ సీపీ 'సేవ్ డెమోక్రసీ'
-
గవర్నర్ ప్రభుత్వాలకు భజన చేస్తున్నారు
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ప్రజలపక్షాన నిలబడకుండా.. ప్రభుత్వాల భజన చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ఆయన సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనన్నారు. పార్టీ మారిన వారితో ఓ వైపు గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి.. మరో పార్టీకి మారడం వ్యభిచారం కంటే పెద్ద తప్పు అని, పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోకుండా ఇలానే చూస్తూ కూర్చుంటే.. రానున్న రోజుల్లో ఓటు హక్కుని ఎవరు కూడా వినియోగించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసీ, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరుగుతున్నా ప్రదాని మోడీ పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతరపార్టీలను కలుపుకుని కాంగ్రెస్ ఉద్యమించాలని పిలపునిచ్చారు. ఈ విషయంలో రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్ ని కలుస్తానన్నారు. -
జనానికి చెప్పడానికే నీతులు..
-
ఫిరాయింపులపై ప్రైవేటు బిల్లు
రాజ్యసభలో ప్రవేశపెట్టిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల నిరోధానికి సంబంధించి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో శుక్రవారం ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణ బిల్లుగా పేర్కొంటూ ఆర్టికల్ 361(బి) స్థానంలో కొత్త ఆర్టికల్ చేర్చాలని, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని 6వ పేరాను సవరించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఫిరాయింపుల పిటిషన్లపై నిర్దిష్ట కాలపరిమితిలో చైర్మన్ లేదా స్పీకర్ చర్యలు తీసుకొనే విధంగా సవరణ ఉండాలని విజయసాయిరెడ్డి ప్రతిపాదించారు. కేవీపీ బిల్లుకు సాంకేతిక కారణలు చూపడం సరికాదు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు ప్రవేశపెట్టిన బిల్లుకు సాంకేతిక కారణాలు చూపి అడ్డుకోవడం శోచనీయమని విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి చిత్తశుద్ధిలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. రాష్ట్రాన్ని విభజించడంతో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీ, టీడీపీలకు పడుతుందని హెచ్చరించారు. విభజన హామీల అమలులో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. -
‘ఫిరాయింపులతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం’
సాధారణ ఎన్నికల్లో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పార్టీల ఫిరాయింపులతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్లు అధికార పార్టీలకు ఏజెంట్లుగా మారి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. పార్టీలు ఫిరాయించే వారిపై తదుపరి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకుండా అనర్హత వేటు వేయాలని కోరారు. బలమైన పౌర సమాజం ద్వారా ప్రజలను జాగృతులను చేస్తేనే ఫిరాయింపులను నిరోధించవచ్చని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిని తక్షణమే అనర్హులను చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఇచ్చే విధంగా రాజ్యాంగ సవరణ చేపట్టాలని సూచించారు. -
'అమరనాథ్‌రెడ్డిని అనర్హుడిగా చేయాలి'
స్పీకర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొంది టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే ఎన్.అమరనాథ్‌రెడ్డిని అనర్హుడిగా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, దేశాయి తిప్పారెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం స్పీకర్ అందుబాటులో లేక పోవడంతో నిర్ణీత ఫార్మాట్లో గల ఫిర్యాదును అసెంబ్లీ ఇంచార్జి కార్యదర్శి కె.సత్యనారాయణకు ఎమ్మెల్యేలు అందజేశారు. సాధ్యమైనంత త్వరగా తమ పిటిషన్‌ను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి అనర్హత విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
పార్టీలు మారిన వారికి ముప్పు తప్పదు
- గోడ దూకిన వారికి ప్రజలే బుద్ధిచెబుతారు - పార్టీలు మారకుండా చట్ట సవరణ చేయాలి - జనచైతన్య వేదికలో వక్తల డిమాండ్ తిరుచానూరు ప్రజలెన్నుకున్న పార్టీకి వెన్నుపోటు పొడిచే నాయకులకు భవిష్యత్‌లో ముప్పు తప్పదని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తిరుపతిలో ‘పార్టీ ఫిరాయింపులు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. ఈ చర్చాగోష్టికి నగరంలోని విభిన్న వర్గాల మేధావులు, రాజకీయ విశ్లేషకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకుడిలా వ్యవహరించడం బాధాకరమన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 13 మందిపై అనర్హత వేటు వేయాలన్న ఫిర్యాదును సాంకేతిక కారణాలతో తోసిపుచ్చడంతో, స్పీకర్ నైతిక బలాన్ని కోల్పోయారని విమర్శించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఫిరాయింపులకు పాల్పడడం రాజకీయ వ్యభిచారమేనన్నారు. ఈ నెల 31న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాజీ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బిపి.జీవన్‌రెడ్డి అధ్యక్షతన ఇదే అంశంపై చర్చాగోష్టి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం విస్మరించి సిద్ధాంతాలు లేని రాజకీయ నాయకులు స్వప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్షం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులే గెలవాలని ప్రయత్నించడం, దీనికోసం ఏకంగా రూ.280 కోట్లు ఖర్చుపెట్టడం ధన రాజకీయానికి నిదర్శనమని తెలిపారు. అనంతరం ఈ చర్చాగోష్టిలో పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు. అంబేడ్కర్ ఆశించిన ప్రజాస్వామ్యం లేదని మాజీ వీసీ ప్రొఫెసర్ కె. వెంకటరెడ్డి అన్నారు. నాయకుల గుప్పెట్లో ప్రజాస్వామ్యం బందీ అయ్యిందని ఆర్థికవేత్త, ప్రొఫెసర్ ఎ.రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్ష నాయకులు సైతం ఫిరాయింపులకు పాల్పడడం దుర్మార్గమని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ అన్నారు. ప్రజాస్వామ్యం ధనిక స్వామ్యంగా మారిందని సీనియర్ పాత్రికేయులు రాఘవశర్మ అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుదారులు తిరిగి ఎన్నిక కాకుండా అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల సంఘాలని కల్పించాలని అకాడమీ ఆఫ్ గ్రాస్ రూట్స్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా డెరైక్టర్ డాక్టర్ డి. సుందరరామ్ అన్నారు. ఈ చర్చాగోష్టిలో పెద్దఎత్తున ప్రజలు, నాయకులు, పాత్రికేయులు, వివిధ సంఘాల నాయకులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు పాల్గొన్నారు. -
ఫిరాయింపులపై పిటిషన్ వచ్చే వారానికి వాయిదా
ఫిరాయింపులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో శాసన సభ్యుల ఫిరాయింపులపై ఫిర్యాదు ను శాసన సభాపతి పట్టించుకోవడం లేదని, వాటిని తక్షణం పరిష్కరించేలా సభాపతిని ఆదేశించాలని వైఎస్సార్సీపీ మే 13న దాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీం కోర్టులో విచారణకు స్వీకరించింది. జస్టిస్ అనిల్ ఆర్.దవే, జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం వద్దకు ఈ పిటిషన్ విచారణకు రాగా.. తమ తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేనందున వచ్చే వారానికి వాయిదావేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది పూజా ధార్ విన్నవించారు. ఈ సందర్భంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు స్పందిస్తూ ఇది రాష్ట్రానికి చెందిన అంశమైనందున హైకోర్టుకు వెళ్లొచ్చు కదా? అని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరని విచారణ వాయిదా వేయాలని మరోసారి పిటిషనర్లు కోరారు. ధర్మాసనం అందుకు సమ్మతించి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. -
పార్టీ ఫిరాయింపులపై 26న చర్చా గోష్టి
సీతంపేట: ‘పార్టీ ఫిరాయింపులు, ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఈనెల 26వ తేదీన ద్వారకానగర్‌లోని విశాఖ పౌరగ్రంథాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు చర్చాగోష్టి జరుగుతుందని జనచైతన్య వేదిక రాష్ర్ట అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈ చర్చా గోష్టిలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ, ప్రొఫెసర్లు వి. బాలమోహన్‌దాస్, కె.ఎస్.చలం, ప్రసన్నకుమార్, కె.తిమ్మారెడ్డి, జి.హరగోపాల్, బాబీవర్ధన్, సీనియర్ పాత్రికేయుడు వి.వి..రమణమూర్తి, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆశించే అభ్యదయకాముకులు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు చర్చా గోష్టిలో పాల్గొనవలసిందిగా కోరారు. -
ప్రత్యేక విచారణకు ఈసీని కోరతాం
ఇరు రాష్ట్రాల్లో ఫిరాయింపులపై సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీలో ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల పర్వంపై ప్రత్యేక విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(సీఈసీ)కోరనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. సోమవారం మఖ్దూంభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశం తలదించుకునేలా సాగుతున్న ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈసీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినపుడు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అక్కడ చే స్తున్నది ఏమిటని నిలదీశారు. తమ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ను ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్లోకి ఫిరాయిం చేలా చేయడంపైనా ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ అంశంపై స్పీకర్‌కూ నివేదిస్తామని, అయితే స్పీకర్‌కు విజ్ఞప్తి చేయడం వల్ల ప్రయోజనం ఉండడం లేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేస్తే రాజకీయం, తాము చేస్తే వ్యభిచారమా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారని, ఆయన చేసింది హోల్‌సేల్ రాజకీయ వ్యభిచారమేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ చేరికల్లో భాగంగా లోపాయికారీగా ఎంత డబ్బు ఇస్తున్నారనేది తెలియదు కాని, వివిధస్థాయిలోని ప్రజాప్రతినిధులకు ఇస్తున్న కాంట్రాక్టులు, పనుల అంశాన్ని పరిశీలించి, ఆర్టీఐను ఉపయోగించుకుని వాటిని బయటపడతామని హెచ్చరించారు. -
ఫిరాయింపులపై చట్టసవరణ అత్యవసరం
జన చైతన్యవేదిక సెమినార్లో పలువురు వక్తల సూచన సాక్షి, విజయవాడ: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయడం అత్యవసరమని జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ నిర్వహించిన సెమినార్లో మాట్లాడిన వక్తలు సూచించారు. ప్రజాప్రతినిధులు ఫిరాయించిన వెంటనే పదవిపై వేటుపడాలని వారు అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని స్పీకర్ నుంచి ఈసీకి బదిలీ చేసేలా చట్టసవరణ జరగాలని సూచించారు. ‘పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఆదివారం విజయవాడలోని ఎంబీభవన్‌లో నిర్వహించిన ఈ సెమినార్లో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చ ట్టంలో సవరణలు చేయాల్సిన అవసరముందన్నారు. ఫిరాయింపులపై 1985లో, 2003లో చేసిన రెండు సవరణల్లోనూ లోపాలుండటం వల్ల మరోసారి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇతర పార్టీలనుంచి గెలిచిన వారిని సీఎం స్వయంగా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్లు పార్టీలకతీతంగా వ్యవహరించి రాజ్యాంగస్ఫూర్తిని కాపాడాలన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణీత వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలనే నిబంధన పెట్టాలన్నారు. జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, నాగార్జున వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఎన్.రంగయ్య, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, నాగార్జున వర్సిటీ ఆచార్యుడు అంజిరెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ ఎంసీ దాస్, సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. -
పార్టీ ఫిరాయింపులపై జనచైతన్య వేదిక సదస్సు
విజయవాడ: ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మంచినీళ్లు తాగినంత సులభంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతున్నారు. ఈ నేపథ్యంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఎంబీ భవన్లో 'పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం' అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి సదస్సును ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు, ప్రొఫెసర్లు నూర్‌బాషా, రంగయ్య, రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు అంజిరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. -
నీతిలేని రాజకీయం
త్రికాలమ్ వెంకయ్యనాయుడు అపారమైన అనుభవం కలిగిన జాతీయ నాయకుడు. తాను రాజకీయాలలో ఎన్నడూ రాజీపడలేదని శుక్రవారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ఆత్మీయ సభలో సగర్వంగా ప్రకటించారు. లౌక్యం పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపుల పరంపరను నిలిపివేయాలని చంద్రబాబునాయుడికీ, కేసీఆర్‌కీ గట్టిగా హితవు చెప్పగలిగితే వెంకయ్య నాయుడి స్థాయికి తగినట్టు ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలి. వెంకయ్యనాయుడు చొరవ తీసుకోవాలి. గమ్యం, మార్గం రెండూ ముఖ్యమేనన్నాడు మహాత్మాగాంధీ. మార్గం ఏదైనా గమ్యం చేరడం ప్రధానమని భావిస్తున్నారు పదవీ రాజకీయాలలో ఆరితేరిన ఈ తరం రాజకీయ నాయకులు. సుఖేందర్‌రెడ్డి, తదితర నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేర్చుకుంటూ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఒకానొక రహస్యాన్ని వెల్లడిం చారు. 2014 ఎన్నికలలో తన పార్టీకి 119 స్థానాల అసెంబ్లీలో 63 స్థానాలతో మెజారిటీ వచ్చిన అనంతరం కూడా తనను పదవీ స్వీకారం చేయనీయకుండా అడ్డుకొని రాష్ట్రపతి పాలన విధించేలా చూసేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లు కుట్ర చేశాయనీ, తనకు ఈ విషయం ఎంఐఎం నాయకుడు అస దుద్దీన్ ఒవైసీ సకాలంలో చెప్పి ఆదుకున్నారనీ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందంటూ ఆ రోజుల్లో పీసీసీ బాధ్యుడు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించి నట్టు కూడా గుర్తు చేశారు. ఈ కుట్రను ఛేదించే క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీ శాసనసభ్యులను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నామంటూ కేసీఆర్ సమర్థించుకున్నారు. పొరుగున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సైతం యథాశక్తి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నప్పటికీ చట్ట ఉల్లంఘనను సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. పార్టీ ఫిరాయింపులు కొత్తకాదు. ఇది టీడీపీ లేదా టీఆర్ఎస్లు కనిపెట్టిన కొత్త విద్య కాదు. ‘ఆయారాం, గయారాం’ సంస్కృతి 1960-70లో కాంగ్రెస్ హయాంలోనే వేళ్ళూనుకుంది. ఈ దుష్ట సంస్కృతిని అంతం చేయడానికి 1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం, 2003లో అటల్ బిహారీ వాజపేయి సర్కార్ చేసిన రాజ్యాంగ సవరణలు సరిపోవడం లేదు. 1985 నాటి 52వ రాజ్యాంగ సవరణ చట్టంలోని లోపాలను రాజకీయవాదులు యథేచ్ఛగా వినియోగించు కొని భ్రష్ట రాజకీయాలను అందలం ఎక్కించిన తర్వాత 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. ఇందులో ఉన్న ప్రధానమైన లోపాన్ని రాజకీయవాదులు పూర్తిగా వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ సభ్యులను టీఆర్ఎస్లో చేర్చుకోవడాన్ని రాజకీయ పునరేకీకరణగా అభివర్ణిస్తూ, లోగడ 16 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులలో 10 మందిని కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ రాజశేఖరరెడ్డి చేర్చుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రతిపక్ష నేత జానారెడ్డిని కేసీఆర్ ప్రశ్నించారు. నాడు వైఎస్ చేశారు కనుక, కాంగ్రెస్, టీడీపీలు కుట్ర చేశాయి కనుక ప్రతిపక్షాల నుంచి శాసనసభ్యులను పార్టీ ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తే తప్పులేదని కేసీఆర్ అభిప్రాయం. దెబ్బకు దెబ్బ తీయడం, రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడం, ప్రతిపక్షం కుట్రను ఛేదించడం కోసం ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిం చినా పర్వాలేదనే భావన. చట్టాలలోని లొసుగులను ఉపయోగించు కోని రాజకీయ నాయకులు ఈ రోజుల్లో ఎక్కడా కనిపించరు. ఆపద్ధర్మం చట్టసభలలో మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నించకూడదు. కొన్ని పార్టీలు కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే మంచిదే. మెజారిటీ లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వం వెలుపల ఉండే రాజకీయ పక్షాల మద్దతు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకె గుజ్రాల్ ప్రధానులుగా ఒక్కొక్కరు సంవత్సరం కూడా పూర్తి చేయకపోవడానికి కారణం సొంతబలం లేకపోవడం, అరువుబలంపైన ఆధారపడటం. ఇటువంటి పరిస్థితులలో ఆపద్ధ ర్మంగా చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భం కూడా ఉంది. 1991లో రాజీవ్‌గాంధీ హత్య తర్వాత పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రతిసారీ పీవీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ళపాటూ నడిపించాలనే సంకల్పంతో పీవీ టీడీపీ పార్లమెంటరీ పార్టీని చీల్చారు. జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులనూ సుముఖులను చేసుకున్నారు. నీతిబాహ్యమైన రాజకీయం ఎందుకు చేశారని ప్రశ్నించినప్పుడు దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టాలంటే రాజకీయ సుస్థిరత అత్యవసరమంటూ పీవీ సమర్థించుకున్నారు. టీఆర్ఎస్ శాసనభ్యులను ఎందుకు కాంగ్రెస్‌లో చేర్చుకు న్నారని వైఎస్‌ను అడిగితే తెలంగాణ రాష్ట్ర సాధనే ఎజెండాగా ఉన్న టీఆర్ఎస్ను బలహీన పరచడానికి ఆ పని చేశానని చెప్పారు. అదే టీఆర్ఎస్తో అధిష్టానం ఒత్తిడి మేరకు 2004లో పొత్తు పెట్టుకున్న వైఎస్ 2009లో అధిష్టానం ఎంత గట్టిగా చెప్పినా అంగీకరించకుండా టీఆర్ఎస్తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేశారు. అది రిస్కు అని తెలిసినా సమైక్యవాదిగా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకూడదని వైఎస్ గట్టిగా భావించారు. అప్పుడు చంద్రబాబునాయుడు నాయకత్వంలోని టీడీపీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. పీవీ, వైఎస్‌ల నిర్ణయాలు సరైనవని సమర్థించడం ఉద్దేశం కాదు. వారు చేసింది రాజ్యాంగ ఉల్లంఘనే. వారు అనుసరించిన మార్గం అక్రమమైనదే. కానీ పార్టీ ఫిరాయిం పులను ప్రోత్సహించడానికి వారికి మంచో చెడో ఒక లక్ష్యం అంటూ ఉంది. అటువంటి లక్ష్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ముమ్మరమైన ఫిరాయింపుల వెనుక కనిపించదు. ఎన్నికలలో మెజారిటీ సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నవారికి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్న తాపత్రయం ఎందుకు? ప్రతిపక్షం లేకపోవడం అధికారపక్షానికీ నష్టదాయకమే. లాభదా యకం కానేకాదు. విమర్శలను స్వాగతించినప్పుడే విధానాలలోనూ, ఆచరణ లోనూ దొర్లుతున్న పొరపాట్లు తెలుస్తాయి. దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. స్వపక్షంలో భజనపరులు అధికం. మంత్రివర్గ సహచరులు డూడూ బసవన్నలే. మీడియా సంస్థలది వీరవిధేయత. ప్రతిపక్షాన్ని శత్రుపక్షంగా భావిస్తున్నారు. ఇక నిజానిజాలు తెలుసుకునే అవకాశం పాలకులకు ఎక్కడ? ఫిరాయింపుల విషయంలో నైతికత ఒక అంశమైతే రాజ్యాంగ స్ఫూర్తి మరో అంశం. చంద్రబాబునాయుడు ఫిరాయింపుల వంటి కార్యక్రమం 1995లో ఎన్టీఆర్‌ను గద్దె దించినప్పుడే ప్రారంభించారు. రాజ్యసభ ఎన్నికలలో ప్రతి పక్షాన్ని దెబ్బతీయాలనో, మరో ఉద్దేశంతోనో వందల కోట్లు ఖర్చు చేసి ఇరవై మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలకు కండువా కప్పారు. నియోజకవర్గాలలో పాత నాయకులూ, కొత్త నాయకులూ కొట్టుకుంటున్నారు. ఫిరాయింపుల వల్ల టీడీపీ సాధించింది ఏమిటో అర్థంకాదు. ప్రతిపక్ష సభ్యులను కొంతమందిని పార్టీకి దూరం చేసినంత మాత్రాన ప్రజలలో వ్యతిరేకత సమసిపోతుందా? ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రతిపక్ష ఎంఎల్ఏలను ఆకర్షించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రజలకు ఎటువంటి సంకేతాలు పంపుతుంది? 175 స్థానాల అసెంబ్లీలో వందకుపైగా సీట్లతో మెజారిటీ ఉన్నప్పుడు పరిపాలనపైన దృష్టిపెట్టకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేం దుకు కృషి చేయకుండా, నిరర్థకమైన ఫిరాయింపుల వ్యవహారం నెత్తికెత్తుకోవ డాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఫిరాయించిన ఎంఎల్ఏల చేత రాజీనామా చేయించి టీడీపీ టికెట్టుపైన గెలిపించి ఉంటే రాజ్యాంగాన్ని గౌరవిం చినట్టు అయ్యేది. ప్రజల ఆమోదం పొందినట్టయ్యేది. ఆ దమ్ము ఫిరాయించిన వారికీ లేదు. వారిని ప్రోత్సహించినవారికీ లేదు. చారిత్రక స్పృహ తెలంగాణ రాష్ట్ర సాధనకు పద్నాలుగు సంవత్సరాలు అలుపెరుగని పోరాటం అహింసాత్మకంగా సాగించిన సారథిగా, కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కి చరిత్రలో ఇప్పటికే ప్రత్యేక స్థానం ఉంది. పార్టీ ఫిరాయింపులకు తెగబడకుండా సుస్థిర పాలన అందిస్తూ, ప్రతిపక్షాలను కలుపుకొని సాగుతూ బంగారు తెలంగాణ స్వప్న సాకారానికి కృషి చేస్తే ఆయన రాజనీతిజ్ఞుడుగా ఎదిగి, ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచే అవకాశం ఉండేది. ఎంఎల్ఏల సంఖ్య పెరిగినంత మాత్రాన టీఆర్ఎస్కు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకోవడంలో ఎవ్వరూ వెనకాడరు కనుక, చట్టాలలోని లోపాలను సవరించుకోవాలి. రాజ్యాంగం పదో షెడ్యూ లులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏడవ పేరాలో పార్లమెంటు, శాసన సభ, శాసనమండలి నిర్ణయాలలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదంటూ స్పష్టంగా ఉన్నది. చట్టసభల సభ్యులు తమ అధికారాలను న్యాయస్థానాలకు అప్పగించడం ఇష్టం లేనికారణంగా పెట్టిన నిబంధన ఇది. వాస్తవానికి స్పీకర్‌ది రాజ్యాంగపరమైన పదవి (constitutional office) కాగా, ఇప్పుడు పూర్తిగా రాజకీయ పదవి (political office)గా మారింది. అధినేతల అభీష్టానికి భిన్నంగా సభాపతులు వ్యవహరించే రోజులు ఎప్పుడో పోయాయి. అందుకే స్పీకర్ పదవిలో ఉన్నవారు మంత్రి పదవికోసం అంగలార్చడం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలంటే పార్టీ ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉన్నదంటూ సుప్రీం కోర్టు రాజ్యాంగపీఠం 2007లో రాజేంద్రసింగ్ రాణా వర్సెస్ స్వామిప్రసాద్ మౌర్య కేసులో స్పష్టం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే కదా న్యాయవ్యవస్థ సమీక్షించేది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా పాలకపక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తే న్యాయస్థానాలు చేయగలిగింది ఏమీ లేదు. అందుక నే స్పీకర్లు నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రలోభాలకు ఆశపడి ఎవరు పార్టీ ఫిరాయించినా అది రాజ్యాంగ ఉల్లం ఘనే. కారణాలు ఏమైనా అది ప్రజాస్వామ్య వ్యవస్థపైన ఖడ్గప్రహారమే. ప్రమా దకరమైన ఈ ధోరణిని అరికట్టాలంటే పార్టీ మారిన ఎంపీలపైనా, ఎంఎల్ఏ లపైనా, ఎంఎల్సీలపైనా అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ నుంచి ఎన్ని కల సంఘానికి బదిలీ చేయాలి. ఎన్నికల సంఘం సైతం పారదర్శకంగా, కాలవ్యవధికి లోబడి వ్యవహరించే విధంగా విధివిధానాలు రూపొందించాలి. వెంకయ్యకో విన్నపం వెంకయ్యనాయుడు అపారమైన అనుభవం కలిగిన జాతీయ నాయకుడు. తాను రాజకీయాలలో ఎన్నడూ రాజీపడలేదని శుక్రవారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ఆత్మీయ సభలో సగర్వంగా ప్రకటించారు. లౌక్యం పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపుల పరంపరను నిలిపివేయాలని చంద్రబాబునాయుడికీ, కేసీఆర్‌కీ గట్టిగా హితవు చెప్పగలిగితే వెంకయ్యనాయుడి స్థాయికి తగినట్టు ఉండేది. పార్టీ ఫిరాయించిన క్షణంలోనే పదవి పోవాలంటూ ఆయన చెప్పిన మాటలను చట్టబ ద్ధం చేస్తూ పార్లమెంటు వ్యవహారాల మంత్రి హోదాలో మరో రాజ్యాంగ సవరణ తెచ్చేందుకు నడుం బిగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణదానం చేసిన వారవుతారు. పదవులకోసం, డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ ఫిరా యించే ధోరణి యథేచ్ఛగా కొనసాగుతున్న కారణంగా ప్రతిపక్షాల మనుగడ ప్రశ్నార్థకం అవుతోంది. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలి. వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవాలి. - కె.రామచంద్రమూర్తి -
ఎన్టీఆర్ కాలం నుంచే ఫిరాయింపులు!
భీమవరం: రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయించడం ఎన్టీఆర్ కాలం నుంచే ఉన్నాయని, దీనిపై కొత్తగా రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇతర పార్టీల నాయకులు చేరడం వల్ల టీడీపీలో అసమ్మతి రాజుకుంటోందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలోని నాయకులు, కార్యకర్తలను ఒప్పించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇతర పార్టీ నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. హోదా బాధ్యత బీజేపీదే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే విషయంలో టీడీపీ కంటే బీజేపీకే ఎక్కువ బాధ్యత ఉందని చినరాజప్ప అన్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకునపెట్టే బలం తెలుగుదేశానికి లేదని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎక్కువ నిధులిస్తున్నట్టు చెబుతున్నా.. ఇప్పటివరకు కేవలం రూ. 2 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉందనీ, దీంతో అభివృద్ధిలో ముందుకు వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. పించన్ల పంపిణీలో ఇబ్బందులున్నాయని, అయినా ప్రతినెలా 87 శాతం పంపిణీని పూర్తి చేస్తున్నామని తెలిపారు. మిగతా వారికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం సాంకేతిక విధానాన్ని సవరిస్తామని పేర్కొన్నారు. -
‘ఫిరాయింపులు కాదు..అభివృద్ధి చేయండి'
కడప: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అదే తరహాలో రాష్ట్ర అభివృద్ధిని కూడా పట్టించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. గురువారం ఆయన కడపలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పలోభాలకు గురిచేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం తగదని హితవు పలికారు.ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను సవరించాలని, ఆ దిశగా ప్రస్తుతం జరుగుతున్న చర్చను తమ పార్టీ ఆహ్వానిస్తోందని చెప్పారు. ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గుర్తింపుపై స్పీకర్ అధికారాలను తగ్గించాలని సూచించారు. అక్రమ ఫిరాయింపులపై తాము త్వరలో ఉద్యమం చేపడతామని చెప్పారు. -
వాళ్ల కంటే బిచ్చగాళ్లు నయం: రఘువీరారెడ్డి
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు బిచ్చగాళ్లకంటే హీనులని ఏపీ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలోని మడకశిరలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను సాంఘిక బహిష్కరణ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమకు ఓట్లు వేసిన ప్రజలను అవమానపర్చినట్లేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ఒక రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్సార్సీపీకి ఆ ఒక్క సీటు రాకుండా అడ్డుపడేందుకు దాదాపు రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు డబ్బులు వెదజల్లి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తాను చేసిన తప్పులు, అవినీతిని ఎవరూ ప్రశ్నించకూడదని భావించి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేలు తప్పని సరిగా పదవికి రాజీనామా చేసేవిధంగా ఫిరాయింపు చట్టంలో మార్పులు చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేలు సిద్ధాంతాలను పక్కనపెట్టి కేసులు మాఫీ చేసుకోవడానికి, పదవుల కోసం, డబ్బులకు అమ్ముడుబోతున్నారని విమర్శించారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికం
► సైద్ధాంతిక కారణాలైతే పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలి ► అసెంబ్లీ స్థానాల పెంపునకు పార్లమెంట్ ఆమోదం ఉండాల్సిందే ► ‘సాక్షి’తో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అధికారపార్టీలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికమని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. ఢిల్లీలో సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఒక పార్టీ ఎన్నికల గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు వేరే పార్టీలోకి ఫిరాయించడాన్ని ప్రస్తావిస్తూ.. సైద్ధాంతిక అంశాలపై పార్టీ మారితే అర్థం చేసుకోవచ్చని, అయితే ఫిరాయింపుదారులు తప్పనిసరిగా పార్టీకి, పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేయాల్సిందేనని పేర్కొన్నారు.అలా చేయలేదంటే స్వార్థ ప్రయోజనాల కోసమే వారు పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమవుతుందన్నారు. ఏపీ, తెలంగాణలో మాత్రమే కాదని.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టంలో లొసుగులను వాడుకొని రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని అవసరముందన్నారు. దీనిపై పార్లమెంట్లో చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26లో చిన్న సవరణ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై స్పష్టత లేదన్నారు. పార్లమెంట్ ఆమోదంతోనే అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యమన్నారు. అందుకు అవసరమైన బిల్లును పార్లమెం ట్లో ప్రవేశపెట్టిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుందని రాజా చెప్పారు. -
అది వ్యభిచారమే.. హల్చల్ చేస్తున్న వీడియో!
-హీరో: 'ఏమిటీ నీ హక్కు.. ప్రజల్ని మోసం చేయడమా? పార్టీ మారడమా?' విలన్: 'ఒక పౌరునిగా నాకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకునే హక్కు నాకుంది..' హీరో: ఒక పౌరుడిగా ఉండవచ్చు, కానీ ప్రజా ప్రతినిధిగా లేదు. నిన్ను చూసి, నీ సామర్థ్యం చూసి, నువ్ చేసిన వాగ్దానాలను నమ్మి, నిన్ను గెలిపించారనుకుంటున్నావా ఈ ప్రజలు.. మీ పార్టీ నాయకులను చూసి.. ఆ పార్టీ సిద్ధాంతాలను గౌరవించి నిన్ను గెలిపించారు. ఆ పార్టీ ప్రతినిధిగా ఉంటావని కార్యకర్తలందరూ నిద్రాహారాలు మాని.. ప్రాణాలకు తెగించి నీకా పదవిని కట్టబెడితే.. ఇప్పుడు పార్టీ మారే హక్కు నీకెవరు ఇచ్చారు. పార్టీ మార్చడమంటే అగ్ని సాక్షిగా పెళ్లాడిన ఇల్లాలిని వదిలేసి.. వ్యభిచారం చేయడంతో సమానం''.. కృష్ణ హీరోగా నటించిన 'ఈనాడు' సినిమాలోని పవర్ఫుల్ దృశ్యమిది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. పార్టీ మారిన విలన్ రావుగోపాల్ రావుని ప్రజలందరి ముందు నిగ్గదీసి అడుగుతూ సూపర్ స్టార్ కృష్ణ చేసిన డైలాగులు ఆన్లైన్లో దుమారం రేపుతున్నాయి. ఒక పార్టీ జెండాతో ప్రజల్లోకి వెళ్లి.. ఆ పార్టీ అజెండాను ప్రచారం చేసి.. ఆ పార్టీ గుర్తు మీద ఓట్లు పొంది.. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేతలు ఇప్పుడు పదవులకో, ప్రలోభాలకో తలొగ్గి నిలువునా అమ్మడుపోతున్న తీరును ఎండగడుతూ నెటిజన్లు ఈ వీడియోను ఫేస్బుక్, వాట్సాప్‌లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అడ్డగోలుగా సాగుతున్న పార్టీ ఫిరాయింపులపై తమ నిరసన గళాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము ఓటేసిన నేతలే తమల్ని నిలువునా మోసం చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి.. పట్టపగలే మారి పార్టీ మారి పచ్చ కండువా కప్పుకొంటున్న ఎమ్మెల్యేల తీరును తప్పుబడుతున్నారు. హీరో కృష్ణ నటించిన 'ఈనాడు' సినిమాలోని ఓ దృశ్యాన్ని షేర్ చేస్తున్న నెటిజన్లు.. వైఎస్ఆర్ సీపీ జెండా నీడన ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన నేతలు ఇప్పుడు నిస్సిగ్గుగా పార్టీ మారి.. పచ్చ కండువా కప్పుకోవడాన్ని తప్పుబడుతున్నారు. అధికార పార్టీ టీడీపీ ప్రలోభాలకు గురిచేసి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కదిరికి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై సోషల్ మీడియాలో జనాగ్రహం వ్యక్తమవుతున్నది. 'సేవ్ డెమొక్రసి' పేరిట వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన ఉద్యమంలో నెటిజన్లు కూడా తమ వంతుగా గళమెత్తుతున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బాబుది రాజకీయ పైశాచికం
వైఎస్సార్ సీపీ నేతలు అప్పిరెడ్డి, పార్థసారథి విజయవాడ(చిట్టినగర్) : పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ పైశాచిక ఆనందం పొందుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కె.పార్థసారథి విమర్శించారు. అధికార దాహంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల వెంట కార్యకర్తలెవరూ వెళ్లకపోవడం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరో మారు రుజువు చేసిందన్నారు. పాల ప్రాజెక్టు ఫంక్షన్ హాల్లో పశ్చిమ నియోజకవర్గ ముఖ్యనేతలతో శనివారం సమావేశమయ్యారు. పార్థసారథి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలనే బావనతో కార్యకర్తలపై పాత కేసులు తిరగతోడి కేసులు బనాయించాలని చెప్పడం, పార్టీ మారిన ఎమ్మెల్యేను విమర్శిస్తే దాడులు చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నమని హెచ్చరించారు. ప్రజా పోరాటాలకు పునాది.. పశ్చిమ నియోజకవర్గం ప్రజా పోరాటాలకు పునాది అవుతుందని పార్టీ నగర పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీలో చేరిన జలీల్‌ఖాన్, పోలీసులు కేసులు, అధికారులను పనులు చేయవద్దంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి జో గి రమేష్, రాష్ర్ట కార్యదర్శి కామా దేవరా జ్, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఎం.శివరాకృష్ణ, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ విశ్వనాథ రవి, నగర పాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ బండి పుణ్యశీల, కార్పొరేటర్లు బుళ్లా విజయ్, షేక్. ఆసీఫ్, షేక్, బీబ్జాన్బీ, సంధ్యారాణి, ఎస్టీ సెల్ రాష్ర్ట నాయకుడు బి.శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశం వాయిదా పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని ఆదివారం జరగాల్సిన వైఎస్సార్ సీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం వాయిదా వేశారు. -
ఎమ్మెల్యేకు రూ.8 కోట్ల ఆఫర్
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు ఏకంగా రూ. 8 కోట్ల ఆఫర్ మధ్యవర్తులుగా అధికార పార్టీ నేతలు టీడీపీ రాజకీయాలను ఈసడించుకుంటున్న ప్రజలు సాక్షి, కర్నూలు: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టిదన్నుగా ఉన్న కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల కొనుగోలుకు అధికార పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తాజాగా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని కూడా కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. భారీగా ప్యాకేజీని ఆఫర్ చేసి మరీ టీడీపీలోకి చేర్చుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి కోడుమూరు ఎస్సీ రిజర్వు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఒకప్పుడు కోట్ల కుటుంబానికి కంచుకోటగా ఉండేది. అలాంటి చోట గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన మణిగాంధీకి ప్రజలు జిల్లాలోనే అత్యధిక మెజారిటీని కట్టబెట్టారు. ఇది రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద మెజారిటీ కావడం విశేషం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం.. అధినేత వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో గెలిచిన కోడుమూర ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకున్నాక.. కేవలం నన్ను చూసే జనం ఓట్లేశారని చెప్పుకోవడంపై కోడుమూరు నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలతోపాటు అభిమానులు మండిపడుతున్నారు. మధ్యవర్తులుగా టీడీపీ నేతలు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను లాగేందుకు అధికార పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొద్దిమంది ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి మధ్యవర్తులు (దళారులు)గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలానా ఎమ్మెల్యేకు రూ. 9 కోట్లు ఇస్తే వస్తారంటూ... ఎమ్మెల్యేకు రూ 5-6 కోట్లు చెబుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు కోట్లు ఇచ్చేందుకు ఒప్పించిన ఓ నేత డీల్ కుదిర్చినందుకు తాను రూ. 3 కోట్లు దక్కించుకోవాలని ఎత్తుగడ వేశాడు. అయితే, ఈ కథ తెలిసి సదరు ఎమ్మెల్యే కాస్తా.. నేను పార్టీ మారను అంటూ మొండికేయడంతో కథ అడ్డం తిరిగినట్లు సమాచారం. దీంతో సదరు నేతను ఆయన సోదరుడు, మాజీ మంత్రి మందలించినట్లు తెలిసింది. ఇలాంటి చోటా కక్కుర్తి పడటం సరికాదని హెచ్చరించి.. సదరు ఎమ్మెల్యేతో మాట్లాడి రూ. 6 కోట్లకు ఒప్పందం కుదుర్చినట్లు సమాచారం. ఈ ముడుపుల వ్యవహారం అంతా గుంటూరుకు చెందిన నేతలు నడిపినట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డ నేతలు.. నిన్నమొన్నటి వరకు పార్టీ మారేది లేదు.. ప్రాణం పోయే వరకు పార్టీలోనే ఉంటామని.. ఇప్పుడు కేవలం డీల్ కోసమే పార్టీ మారడం పట్ల నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలందరూ ఈసడించుకునే పరిస్థితి ఏర్పడింది. అండగా ఉన్న వ్యక్తిని మోసగించి.. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని తన కుటుంబ సభ్యునిగా భావించి సహాయం అందించిన వ్యక్తిని, పార్టీని కాదని వెళ్లిపోవడం పట్ల నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా విమర్శల పరంపర కొనసాగుతోంది. కోడుమూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీతిమాలిన రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే మణిగాంధీ కుటుంబానికి వైఎస్ జగన్ ఎంతో సహాయం చేశారని, అలాంటి వ్యక్తిని మోసగించడం సబబు కాదని విమర్శిస్తున్నారు. రాజకీయంగా ఇక మణిగాంధీకి పుట్టగతులుండవని ప్రజలు మండిపడుతున్నారు. -
రాజకీయమంటే ఇదేనా?!
ఏపీలో వైఎస్సార్సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అయినా అధికార పార్టీ వలసలను ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎవరైనా పార్టీ మారేటప్పుడు తమ పదవులకు రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళ్తేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలుస్తుంది. నేటి రాజకీయాల్లో పార్టీ సిద్ధాంతాలు, నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ అన్న మాటలు రోజురోజుకు కనుమ రుగవుతున్నాయి. గతంలో ఉన్న ఈ విలువలు నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలకు అస్సలే తెలియదు. కొత్తగా ఎన్నికైన అనేక మంది ప్రజా ప్రతినిధులకు పార్టీ సిద్ధాంతాలంటే ఏంటో బొత్తిగా తెలియదు. జనతా పార్టీ నేతలు, గాంధేయవాదులు, కమ్యూనిస్టులు ఏ విధంగా సిద్ధాంతాల కోసం నిలబడే వారో ఒక్కసారి నేటి మన ప్రజాప్రతినిధులు తప్పక తెలుసుకోవాలి. నాటి నేతలు జీవిత చరమాంకం వరకు నమ్ముకున్న సిద్ధాంతం కోసమే పనిచేశారు, పోరాడారు, జీవించారు. ప్రాణాలు అర్పించారు. తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఏ అంశంలోనూ రాజీపడలేదు. అలాంటి వారిలో తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న, జూపూడి యజ్ఞనారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య, ప్రగడ కోటయ్య తదితర నేతలు న్నారు. అధికారం కోసం, పదవి కోసం, అవసరం కోసం నిస్సిగ్గుగా పార్టీ మారుతున్న నాయకులు అడుగడుగునా నేడు మనకు దర్శనమిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొందరు నేతలు మాత్రం ఎప్పుడూ అధికారంలోనే ఉంటున్నారని గమనించాలి. పూర్తి స్వార్థంతో పార్టీలు మారడం సర్వ సాధారణమైంది. నేటి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి వారు డజను మందికి పైగానే ఉన్నారు. ఇంకొందరు నాలు గైదు పార్టీలు సైతం మారుతున్న పరిస్థితి. సిగ్గూ, ఎగ్గూ లేకుండా పార్టీ మీద పార్టీ మారడంతోనే తామేదో పెద్ద నాయకులమైపోయామని అనుకుంటున్నారు మరికొం దరు. ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలో్లకి మారేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితి గతంలో చిన్న రాష్ట్రాలైన... ఈశాన్య రాష్ట్రాలు, పాండిచ్చేరి, గోవా, హరియాణాలో్ల అధికంగా ఉండేది. ఇప్పుడు ఆ జబ్బు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లకు, తాజాగా తెలంగాణకు సోకింది. తెలుగు రాష్ట్రాలలో ఫిరాయింపులు అతి పెద్ద జాడ్యంగా మారాయి. గెలిచిన పార్టీని కాదని, అధికార పార్టీలోకి వలస పోవడం ప్రజల కోసమేనని గొప్పలు చెప్పుకునే నేతలు నిత్యం దర్శనమిస్తున్నారు. రాజకీయ మంటేనే గెలుపు, అధికారం అన్నట్టు నేటి తరం నాయకులు సాగిస్తున్న ఈ రాజకీయ వ్యాపార క్రీడ దేశ ప్రజలను విస్తుపోయేలా చేస్తోంది. ఈ ‘నయా రాజ కీయం’ చూసి రాజకీయాలంటే ఇవేనా! రాజకీయ మంటే ఇదేనా! అని యువత అవక్కావుతోంది. తెలంగాణలో పూర్తి మెజారిటీ దక్కకపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దాదాపు 20 మందికి పైగా ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్, టీడీపీల నుంచి అధికార పార్టీలోకి వలసవెళ్లారు. తెలంగాణలో టీడీపీ అన్నదే లేకుండా పోతున్న స్థితిని చూస్తున్నాం. ఆంధ్రా పార్టీలకిక తెలంగాణలో కాలం చెల్లిందని, రాజకీయ పునరేకీకరణతో తెలంగాణను అభివృద్ధి చేస్తామని అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వలసలకు కొత్త భాష్యం చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపీలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగు దేశంలోకి అరడజను మంది ప్రజా ప్రతినిధులు వలస పోయారు. తెలంగాణలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉంటే ఏపీలో వైఎస్సార్సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అయినా ఏపీలోనూ అధికార పార్టీ వలసలను ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందేగాక, ఎన్నికలైన తర్వాత కూడా నాయకులు ఇలా వీలును బట్టి పార్టీలు మారుతుండటం ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ముప్పును సూచిస్తోంది. ప్రజాప్రతినిధులుగా తాము గెలుపొందిన పార్టీ ప్రతిపక్షంగా మిగలడంతో ఎన్నికలకు ముందటి తమ మాటలను, ప్రగల్భాలను అన్నిటినీ మరచి అధికార పార్టీలోకి వలస పోవడం రెండు తెలుగు రాష్ట్రాలో్ల నిత్యకృత్యంగా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పథకం ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే లను ఒక్కొక్కరిగా తమ పార్టీలో చేర్చుకుంది. ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకపోగా, మంత్రి పదవులు సైతం కట్టబెట్టింది. ఒక పార్టీని పూర్తిగా నాశనం చెయ్యాలని ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, చట్టాలను గౌరవించకుండా ఒక ప్రభుత్వం ఇలా వలసలను ప్రోత్సహించడం ఏ మాత్రం సమర్థనీ యం కాదు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు వారితో ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల బరిలోకి దించారు. అదే పద్ధతిని ఇప్పుడు పార్టీలు మారుతున్న నేతలూ పాటించాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ... ఎవరైనా పార్టీ మారేటప్పుడు తమ పదవులకు రాజీనామా చేసి, మరోసారి ప్రజల్లోకి వెళ్తేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలుస్తుంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని, రాజ్యాంగ పరి రక్షణ చేయాలని న్యాయస్థానాలు ఎన్నో ఆదేశా లిచ్చాయి. కోర్టులు పలుమార్లు స్పీకర్‌కు తేల్చి చెప్పాయి. రాత్రికి రాత్రే పార్టీలు మారుతున్న ప్రజా ప్రతినిధులు తమను ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు పార్టీ మారుతున్నారో, పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చిందో, పార్టీ మారడం వల్ల తమకు కలిగిన ప్రతిఫలమేమిటో, నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా సాధ్యమో వారికి వివరించాలి. వలస పక్షులు సైతం కాలానుగతంగా ఆయా రుతువు లను బట్టి మాత్రమే ఒక దేశం నుంచి మరొక దేశానికి వలసలు వెళ్తాయి. మన నాయకుల్లా ఎప్పుడుబడితే అప్పుడు వలస పోవు. స్వప్రయోజనాలే పరమావధిగా పార్టీలు మారే నాయకుల, మంత్రుల మాటలకు విలువేముంటుంది? యువత ఇలాంటి వారి నుంచి ఏం నేర్చుకుంటుంది? ఆ నేతల విజ్ఞతకే వదిలేద్దాం. రఘురామ్ ఏపీ బీజేపీ సమన్వయకర్త raghuram.bjp@gmail.com -
ఏడాదైతే వాళ్లే మా పార్టీలోకి వస్తారు: వైఎస్ జగన్
హైదరాబాద్: ఎమ్మెల్యేలను కొనడం వల్ల ప్రభుత్వాలు నిలబడవని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో గురువారం ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ 'నలుగురైదుగురు ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల ఏమీ కాదు. మొట్టమొదట పార్టీలో అమ్మ, నేను మాత్రమే ఉన్నాము. ఆ తర్వాత 18 మంది ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాము. అనంతరం మా బలం 67 కు చేరుకుంది. అధికార పార్టీ పట్టిసీమ, జెన్ కో, రాజధాని భూముల్లోని అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కోనుగోలు చేస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 నుంచి 30 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక చంద్రబాబు ప్రతిపక్షం గొంతు నొక్కే పనిలో పడ్డారు. టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియెజక వర్గాల్లో అంతకంటే మెరుగైన నాయకులు వస్తారు. ఆ నాడు ఎన్టీఆర్ గెలిపించిన ఎమ్మెల్యేలను తీసుకుని దొడ్డి దారిన చంద్రబాబు సీఎం అయ్యారు. ఆయనకు సిగ్గుంటే పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. అప్పుడు ఎన్నికలకు వెళ్దాం..ప్రజలు ఎవరి వైపు నిలబడతారో చూద్దాం. చంద్రబాబు ఈ సవాల్ ను ఛాలెంజ్ గా తీసుకోవాలి. ప్రజలకు మాకు తోడున్నామంటూ భరోసా ఇస్తున్నారు. ఇంకో ఏడాదైతే టీడీపీ ఎమ్మెల్యేలే మా పార్టీలోకి వస్తారు. అప్పడు నైతికంగా వాళ్లతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తా' మని తెలిపారు. -
వలసలపై ప్రత్యేక దృష్టి పెట్టండి..చంద్రబాబు
విజయవాడ: పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా తెలుగుదేశం అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు సహచర నేతలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసి నైతికంగా బలహీన పరిచేందుకు ప్రతిరోజూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేలా ప్రణాళికలు రూపొందించటంతో పాటు చివరి వరకూ గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 30 నుంచి 40 మందికి వివిధ కారణాలతో టిక్కెట్లు ఇవ్వలేమని, నియోజకవర్గాల పెంపు వల్ల మరో 50 సీట్లు అదనంగా వస్తాయని, ఇన్ని స్థానాలకు చివరి నిమిషంలో అభ్యర్ధులు దొరకటం కష్టం కాబట్టి ప్రతిపక్షం నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని చేర్చుకునే పనిలో నేతలు నిమగ్నం కావాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం బుధవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. సమావేశంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, పార్టీ ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, టీడీ జనార్ధనరావు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు,విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరారవు, ఎస్స్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు, 20 సూత్రాల అమలు పథకం ఛైర్మన్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ ఫిరాయింపులపైనే చర్చ జరిగింది. ఫిరాయింపులపై ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించినా ఎదురుదాడి చేయాల్సిందిగా చంద్రబాబు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఫిరాయింపులు జరిగినపుడు స్పందించని పార్టీలు ఇపుడు తప్పుపట్టడమేంటని ప్రశ్నించటం ద్వారా గట్టిగా సమాధానం చెప్పాలని సమావేశంలో వివరించారు. పార్టీ ఫిరాయించిన వారు రాజీనామా చేయాలని, వారి రాజీనామాలను ఆమోదించాలని వైఎస్సార్సీపీ ఎంత ఒత్తిడి తెచ్చినా పట్టించుకోవద్దని, ఒకవేళ వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా తీసి పక్కన పడేశాలా వ్యూహం రచించాలని నేతలకు చెప్పారు. గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినపై మనం ఫిర్యాదు చేస్తే అప్పటి స్పీకర్లు పట్టించుకోలేదని, తాజాగా తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వారిపై ఫిర్యాదు చేసినా అక్కడి స్పీకర్ పట్టించుకోకుండా పక్కన పడేశారని, కోర్టు ఫిరాయింపుల అంశాన్ని త్వరగా తేల్చాలని చెప్పినా స్పందించని విషయాన్ని సమావేశంలో చెప్పిన చంద్రబాబు అదే సూత్రాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పారు. ఫిరాయింపులకు పాల్పడిన వారి రాజీనామాలను చివరి ఆరు నెలల్లో ఆమోదించేలా పార్టీ వ్యూహం ఉండాలని వివరించారు. పార్టీ కార్యకలాపాలను విజయవాడలో పెంచాలని, నేతలందరూ సాధ్యమైనంత త్వరగా విజయవాడకు మకాం మార్చాలని సూచించారు. ఈ నెల 29న తెలుగుదేశం శాసనసభపక్ష వ్యూహ కమిటీ సమావేశం విజయవాడలో జరగనుంది. అదే రోజు పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం కానుంది. -
'సతీసావిత్రికి-చింతామణికీ ఉన్నంత తేడా'
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి .. ఎన్టీఆర్ కు సతీసావిత్రికీ.. చింతామణికి ఉన్నంత తేడా ఉందని.. ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లె లోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పట్లో కాంగ్రెస్ శాసన సభ్యులుగా గెలిచిన రత్తయ్య, నారాయణ, ఆదయ్యలు రాజీనామా చేయకుండా టీడీపీలో చేరితే.. ఎన్టీఆర్ వారిని పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వలసలను ప్రోత్సహిస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిరంతరం ఎన్టీఆర్ పేరును దొంగ జపం చేసే టీడీపీ నాయకులు పార్టీఫిరాయింపుల విషయంలో సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన వారి చేత రాజీనామా చేయించి టీడీపీలోకి చేర్చుకున్నట్లైతే బాబు రాజనీతిజ్ఞుడు అవుతాడని లేకదంటే... చరిత్ర హీనుడవుతాడని అన్నారు. పార్టీఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
'కేటీఆర్, హరీష్‌లది ఫిరాయింపుల యజ్ఞం'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా అపవిత్ర రాజకీయ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోందని టీ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావు ఫిరాయింపుల యజ్ఞం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి వచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను పోలింగ్ బూత్‌ల నుంచి ఎత్తుకుపోయి బెదిరించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో 782 మంది రైతులు చనిపోయారని, అందులో 342 మంది రైతులవి మాత్రమే ఆత్మహత్యలని ప్రభుత్వం పేర్కొనడం సరికాదన్నారు. రైతుల ఆత్మహత్యలు నిరోధించేందుకు ప్రభుత్వం వద్ద సరైన విధానం లేదని తెలిపారు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 2132 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, వీరందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉప సంహరించుకోవాలని రావుల డిమాండ్ చేశారు. -
ఎర్రబెల్లి పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: తెలుగు దేశం పార్టీ నుంచి పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయకర్‌రావు పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై అనర్హత వేటు వేయాలని ఎర్రబెల్లి పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై కోర్టు ఏవిధమైన ఆదేశాలు జారీ చేస్తుందో అని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి తలసాని, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, కృష్ణారావు, సాయన్న టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. -
'ఫిరాయింపు' ఎమ్మెల్యేలపై స్పీకర్ స్పందన
కరీంనగర్: పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో చాలాకాలం తరువాత శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో హైకోర్టు నోటీసులు తనకింకా అందలేదని, అందిన తర్వాతే స్పందిస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిందన్న సమాచారం మీడియా ద్వారా తెలిసిందని, వ్యక్తిగతంగా ఎలాంటి నోటీసులు అందుకోలేదన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రాజీనామా లేఖపై విలేకరులు అడిన ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు స్పీకర్ నిరాకరించారు. ఈ వ్యవహారంలో లేనిపోని విమర్శలు చేస్తున్న వారి అడ్రస్‌లు ఇప్పటికే గల్లంతయ్యాయని, రానున్న రోజుల్లో శాశ్వతంగా గల్లంతవుతాయని పరోక్షంగా విపక్షాలను ఉద్దేశించి అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పుష్కరాలు జరిగిన సందర్భంలో తెలంగాణపై వివక్ష ప్రదర్శించారని, ప్రస్తుతం స్వరాష్ట్రంలో జరుగుతున్న పుష్కరవేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని, ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలంగాణవైపే చూస్తున్నదన్నారు. -
పార్టీ ఫిరాయింపులు అప్రజాస్వామికం
హాలియా (నల్లగొండ): పార్టీ ఫిరాయింపు అప్రజాస్వామికమని, అనైతికమని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ పార్టీ గుర్తుపై గెలుపొంది మరో పార్టీలోకి వెళ్లడం సరైనది కాదన్నారు. పార్టీ ఫిరాయింపులు ఏ స్థాయిలో జరిగినా, ఎవరు ప్రోత్సహించినా అది సరైన విధానం కాద్దన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారికి ప్రజలే వెంటబడి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో త్రిపురారం మండలం నుంచి మూడు రోజుల క్రితం టీఆర్ఎస్లోకి వెళ్లిన వారు స్థానిక ప్రజలు, నాయకుల ఒత్తిడి మేరకు ఆత్మపరిశీలన చేసుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోనికి వెళ్లిన వారు మళ్లీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొందిన వారు పార్టీ మారాలనుకుంటే పార్టీకి, పదవికిరాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ ఇతర పార్టీలోనికి వెళ్లిన ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలుపోందాలని సూచించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద వరి, ఇతర పంటలను కాపాడాల్సిన బాధ్యత రె ండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సమావేశంలో ఆయన వెంట జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటిలింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి, కాకునూరి నారాయణ, రావుల శ్రీనివాస్ యాదవ్. యడవెల్లి సోమశేఖర్, మర్ల చంద్రారెడ్డి, పోశం శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు. -
పార్టీ ఫిరాయింపులపై దద్దరిల్లిన అసెంబ్లీ
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల అంశంపై మంగళవారం తెలంగాణ శాసనసభ దద్దరిల్లింది. దాంతో అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగింది. సభలో ప్రశ్నోత్తరాలు పూర్తి కాకుండానే సభ రెండు సార్లు పదినిమిషాల పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభప్రారంభమైన తర్వాత బడ్జెట్ పద్దులపై చర్చను చేపట్టాలని స్పీకర్ మధుసూదనాచారి ఆదేశించారు. కాంగ్రెస్ సభ్యులు మాత్రం పార్టీ ఫిరాయింపుల అంశంపై చర్చను చేపట్టాలని ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షనేత జానారెడ్డి అన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ సభ్యులు పట్టించుకోలేదు. మరోవైపు ప్రభుత్వానికి అర్హత ఉందా? లేదా? అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అయినా కాంగ్రెస్ సభ్యులు పట్టు వీడక పోవడంతో సభ రెండో సారి 10 నిమిషాలపాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం విపక్ష సభ్యులు తమ పట్టువీడకపోవటంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేయాలని హరీశ్‌రావు ప్రతిపాదించగా స్పీకర్ ఆమోదించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి మినహా 14మంది కాంగ్రెస్ సభ్యులపై ఒకరోజుపాటు సస్పెన్షన్ వేటు పడింది. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ పద్దులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
'కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు'
-
'కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు'
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం సభలో మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని జానారెడ్డి ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సభ్యుల పార్టీ ఫిరాయింపులు సరికాదని ఆయన అన్నారు. సభలో ప్రభుత్వ తీరే బాగోలేదని అన్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. సభ్యుల నిరసనలు, నినాదాలతో అసెంబ్లీ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. -
'సీఎంగా కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలి'
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ సీఎంగా కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తామన్నారు. ఈరోజు సాయంత్రం ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ ఎప్పుడూ ఫిరాయింపులను ప్రోత్సహించలేదని ఆయన అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన వారినే పార్టీలో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే కేసీఆర్‌లా ఫిర్యాయింపులకు వైఎస్ఆర్ ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అన్నారు. -
'ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్'
హైదరాబాద్: టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించి, భయపెట్టి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. టీఆర్ఎస్ లో చీలిక వస్తుందన్న ఆందోళన, అభద్రతాభావంతోనే కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలు-ఓట్లు-అధికారం తప్ప కేసీఆర్ కు ప్రజల బాధలు పట్టవన్నారు. అందుకే స్థానికత అంశంపై ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. స్థానికతపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.